NBA
-
తండ్రి, తనయుడు కలిసి.. ఎన్బీఏలో కొత్త చరిత్ర
లాస్ ఏంజెలిస్: నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్బీఏ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన దిగ్గజ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్‌తో పాటు... అతడి కుమారుడు బ్రోనీ జేమ్స్ ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగారు. తద్వారా ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రీ కొడుకులుగా వీరు రికార్డుల్లోకెక్కారు. లీగ్‌లో భాగంగా లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మంగళవారం మినెసొటా టింబర్వోల్వస్ జట్టుతో జరిగిన పోరులో కలిసి ఆడారు. సుదీర్ఘ ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రి కుమారులు లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మాత్రమే కావడం విశేషం. 39 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ ఇప్పటి వరకు ఎన్బీఏలో 40,490 పాయింట్లు సాధించి ఈ జాబితా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 20 ఏళ్ల బ్రోనీ జేమ్స్ ఈ సీజన్లోనే ఎన్బీఏ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ రెండో క్వార్టర్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రోనీ కోర్టులోకి అడుగు పెట్టాడు. దీంతో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించగా... తండ్రి సూచనలు పాటిస్తూ బ్రోనీ రెండున్నర నిమిషాల పాటు ఆటలో కొనసాగాడు. బ్రోనీ మైదానాన్ని వీడే సమయంలో కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేశారు. గత వేసవిలో జరిగిన వేలంలోనే లేకర్స్ జట్టు బ్రోనీ జేమ్స్‌ను దక్కించుకోగా... ఇప్పుడు సీజన్ ఆరంభ పోరుతో తండ్రీ కుమారులు కలిసి ఆడే అవకాశం దక్కింది. బ్రోనీ బరిలోకి దిగడానికి ముందు లెబ్రాన్ మాట్లాడుతూ... ‘సిద్ధంగా ఉన్నావా. మ్యాచ్ తీవ్రత గమనించావు కదా... ఒత్తిడికి లోనవకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించు’ అని అన్నాడు. పొరబాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని... మైదానంలో వంద శాతం కష్ట పడటంపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. మ్యాచ్‌లో లెబ్రాన్ జేమ్స్ 16 పాయింట్లతో సత్తా చాటగా... లేకర్స్ జట్టు 110– 103 పాయింట్ తేడాతో టింబర్వోల్వస్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు లెబ్రాన్ భార్య, బ్రోనీ తల్లి సవన్నా జేమ్స్ కూడా హాజరై... భర్త, కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. బేస్‌బాల్ మేజర్ లీగ్‌లో కెన్ గ్రెఫీ సీనియర్ అతడి కుమారుడు కెన్ గ్రెఫీ జూనియర్ ఇలాంటి అరుదైన రికార్డు సాధించారు. 1990వ దశకంలో వీరిద్దరూ 51 మ్యాచ్‌ల్లో కలిసి ఆడారు. మంగళవారం ఎన్బీఏ మ్యాచ్‌కు హాజరైన కెన్ గ్రెఫీ జంట... జేమ్స్ ద్వయాన్ని అభినందించింది. నాలుగుసార్లు ఎన్బీఏ చాంపియన్‌గా నిలిచిన లెబ్రాన్ చాన్నాళ్ల క్రితమే కుమారుడితో కలిసి ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అప్పటికి బ్రోనీ విద్యార్థి దశలోనే ఉండగా... ఆ తర్వాత కఠోర శిక్షణతో రాటుదేలిన బ్రోనీ టీనేజ్లోనే తన ప్రతిభతో లేకర్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కార్డియాక్ అరెస్ట్‌కు గురైన బ్రోనీ జేమ్స్... ఓపెన్ హార్ట్ సర్జరీ నుంచి కోలుకొని తిరిగి ఆట కొనసాగిస్తున్నాడు. -
కుర్చీ మడతపెట్టి పాట NBA గేమ్ హాఫ్‌టైమ్‌లో ప్లే చేసారు
-
‘ఎన్బీఏ’ గుర్తింపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేయడంతో పాటు మొట్టమొదటిసారి సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇండస్ట్రీ కనెక్ట్ పేరుతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు బోధన సమయంలోనే లభించేలా చర్యలు తీసుకుంది. కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు మెరుగైన కొలువులు లభించేలా సంస్కరణలు తెచ్చిది. అలాగే రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లభించేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది కాలేజీల్లోని 16 ప్రోగ్రామ్‌లకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. మిగిలిన 32 కాలేజీలు కూడా ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ఎన్బీఏ గుర్తింపు పొందేందుకు సిద్ధమయ్యాయి. వీటిలోని 5 కాలేజీల్లో అన్ని రకాల తనిఖీలు పూర్తవ్వగా.. ఈనెల చివరి వారంలో మరో 5 కాలేజీల్లో ఎన్బీఏ బృందాల సందర్శనకు షెడ్యూల్ ఖరారైంది. రెండో దశలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 43 కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. వృత్తి విద్యా రంగంలో నాణ్యత, కొలువులు సాధించే సామర్థ్యాలను నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల అక్రెడిటింగ్ ఏజెన్సీగా భారతదేశంలో ఎన్బీఏ వ్యవహరిస్తోంది. విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల నిష్పత్తి, పీహెచ్డీ స్థాయి అర్హతలు, ఆర్థిక వనరుల వినియోగం, ఐపీఆర్–పేటెంట్లు, స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం, నిపుణుల తయారీ తదితర అంశాలను ఎన్బీఏ పరిశీలిస్తుంది. వీటన్నింటి ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీలకు గుర్తింపునిస్తుంది. కాగా, ప్రభుత్వం ఇటీవల కొత్తగా 3 పాలిటెక్నిక్ కాలేజీలను ప్రారంభించింది. వీటికి మూడేళ్ల తర్వాతే ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ప్రభుత్వ కృషితో పెరిగిన ప్లేస్‌మెంట్స్ మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులకు బోధన సమయంలోనే ఉపాధి లభించేలా వివిధ పరిశ్రమలతో సాంకేతిక విద్యా శాఖ 674 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీంతో క్యాంపస్ ప్లేస్మెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 7,073 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకోగా.. వారిలో 4 వేల మందికిపైగా విద్యార్థులు కొలువులు సాధించారు. గతంలో పది శాతానికే పరిమితమైన ప్లేస్‌మెంట్స్.. ఇప్పుడు 59.6 శాతానికి పెరిగాయి. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు గతంలో ఎన్బీఏ గుర్తింపు సాధించడంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు వెనుకబడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్బీఏకు అనుగుణంగా కాలేజీల్లో ప్రమాణాలు పెంచాలని సాంకేతిక విద్యా శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి, గన్నవరం, కళ్యాణదుర్గం, ఆమదాలవలస, కాకినాడ, గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు దక్కింది. ఆయా కాలేజీల్లో పరిసరాల పరిశుభ్రత మొదలు భవనాల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, ప్రయోగశాలల ఆధునికీకరణ, విద్యార్థులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్ తదితర మార్పులు తీసుకువచ్చాం. తద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నాం. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ -
అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా?
లాస్ వెగాస్: ప్రఖ్యాత పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కు లాస్ వెగాస్ లోని ఓ హోటల్లో ఘోర అవమానం జరిగింది. ప్రముఖ ఎన్బీఏ స్టార్ ఫ్రాన్స్ కు చెందిన విక్టర్ వెంబన్యామ(19)కు వీరాభిమాని అయిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో ఒక ఫోటో కోసం వెంటపడగా సెక్యూరిటీ వారు ఆమెను నెట్టివేశారు. ఈ సంఘటన వైరల్ కావడంతో ఒకప్పుడు తన పెర్ఫార్మెన్స్ లతో యువతను ఉర్రూతలూగించిన క్రేజీ పాప్ స్టార్ కు ఇంతటి అవమానమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిట్నీ స్పియర్స్ డిన్నర్ చేయడానికి వెగాస్ లోని అరియా హోటల్ కి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా ప్రముఖ స్పర్స్ ఆటగాడు విక్టర్ వెంబన్యామ కనపడటంతో అతడితో ఒక ఫోటో తీసుకోవాలని అతడి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఎన్బీఏ స్టార్ చుట్టూ అభిమానులు మూగడంతో బ్రిట్నీ అతని వీపు మీద వెనుకనుండి చరిచింది. అక్కడే ఉన్న వెంబన్యామ సెక్యూరిటీ చీఫ్ డామియెన్ స్మిత్ ఇది గమనించి ఆమెను బలంగా తోసేశాడు. దీంతో బ్రిట్నీ స్పియర్స్ కింద పడిపోయింది. ఆమె కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. తర్వాత బ్రిట్నీ లేచి తన టేబుల్ వద్దకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సెక్యూరిటీ చీఫ్ స్మిత్ ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. ఆ సమయంలో స్మిత్ ను క్షమించినట్టే కనిపించిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో కొద్దిసేపు నవ్వుతూ సంభాషించింది కూడా. కానీ డిన్నర్ పూర్తయిన తర్వాత నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో వెంబన్యామ మాట్లాడుతూ.. ఎవరో తనను వెనుక నుండి బలంగా హత్తుకున్నారని, సెక్యూరిటీ వారిని బలంగా నెట్టి వేశారని తెలుసు.. తర్వాత తెలిసింది వారు తోసింది బ్రిట్నీ స్పియర్స్ నని. కానీ ఆమె చెబుతున్నట్లుగా ఆమె మెల్లగా తట్టలేదు బలంగా హత్తుకుందని వివరణ ఇచ్చాడు. దీనికి మళ్ళీ బ్రిట్నీ స్పందిస్తూ.. తాను వెంబన్యామను బలంగా కొట్టలేదని సున్నితంగా పిలిచానని చెబుతూ విషయమంతా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కూడా చదవండి: భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు.. View this post on Instagram A post shared by Maria River Red (@britneyspears) -
LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(NBA) స్టార్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును ఈ ఏన్బీఏ ప్లేయర్ తాజాగా బద్దలుకొట్టాడు. లేకర్స్ తరపున ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ బుధవారం ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్(38,387) అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఒక్లహమా సిటీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో 36వ పాయింట్ వద్ద లెబ్రాన్ జేమ్స్ ఈ ఫీట్ అందుకున్నాడు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ ఖాతాలో 38,388 పాయింట్లు ఉన్నాయి. లెబ్రాన్ ఈ రికార్డు అందుకున్న సమయంలో స్డేడియంలో దిగ్గజం కరీమ్ అబ్దుల్ జబ్బార్ ఉండడం విశేషం. వేలాది మంది ప్రేక్షకుల కరతాళద్వనుల మధ్య అబ్దుల్ జబ్బార్.. లెబ్రాన్ జేమ్స్‌ను అభినందించడం హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్టు 5, 1984లో అప్పటి ఎన్బీఏ స్టార్ కరీమ్ అబ్దుల్ జబ్బార్ 31,419 పాయింట్ల వద్ద విల్ట్ చాంబర్లెయిన్ను అధిగమించాడు. 1989లో కరీమ్ రిటైర్ అయినప్పటికి అతని రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. లెబ్రాన్ జేమ్స్ సాధించిన రికార్డులు.. ► NBA ఛాంపియన్: 2012, 2013, 2016, 2020 ► NBA మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): 2009, 2010, 2012, 2013 ► NBA ఫైనల్స్ MVP: 2012, 2013, 2016, 2020 ► NBA ఆల్ స్టార్: 19 సార్లు (2005-2023) ► NBA రూకీ ఆఫ్ ది ఇయర్: 2004 ► ఒలింపిక్ పతకాలు: మూడు (2008, 2012లో స్వర్ణం; 2004లో కాంస్యం) 🎙️ MIC'D UP 🎙️ LeBron James becomes the NBA's all-time leading scorer.#ScoringKing pic.twitter.com/MbRSyw0SBj — NBA (@NBA) February 8, 2023 One photo, 76,777 points. All time greatness. #ScoringKing pic.twitter.com/EJdWZTQZe6 — NBA (@NBA) February 8, 2023 చదవండి: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో Lebron James: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు
లెబ్రాన్ జేమ్స్(Lebron James).. బాస్కెట్ బాల్ గేమ్ ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కర్లేని పేరు. నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్(NBA) గేమ్‌లో అతనికున్న క్రేజ్ వేరు. ముఖ్యంగా అమెరికాలో ఎన్బీఏ గేమ్ బాగా పాపులర్. తాజాగా లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. దీంతో లీగ్‌కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతని ఆట కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి అభిమానులు వెనుకాడడం లేదు. ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ లేకర్స్, ఓక్లహామా సిటీ థండర్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్లు రికార్డు ధర పలికాయి. ఒక్కో టికెట్ 92 వేల డాలర్లు (సుమారు రూ.75 లక్షలు)కు అమ్ముడుపోతున్నట్లు బ్లీచర్ రిపోర్ట్ వెల్లడించింది. నిజానికి ఈ మ్యాచ్ లో లెబ్రాన్ జేమ్స్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు . లాస్ ఏంజిల్స్ లేకర్స్ అంతకుముందు ఫిబ్రవరి 4న న్యూ ఆర్లీన్స్ పెలికాన్స్ తో, ఫిబ్రవరి 9న మిల్వౌకీ బక్స్ తో, ఫిబ్రవరి 11న గోల్డెన్ స్టేట్ వారియర్స్ తో ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్ లలో ఏదో ఒకదాంట్లో జేమ్స్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సగటున లేకర్స్, థండర్ మ్యాచ్ టికెట్ ధర 1152 డాలర్లు (రూ.94 వేలు) గా ఉంది. ఇక లేకర్స్, బక్స్ మ్యాచ్ టికెట్ సగటు ధర 1302 డాలర్లు (రూ.లక్ష)గా ఉండటం విశేషం. ఎన్బీఏ (NBA)లో ఆల్ టైమ్ రికార్డు 38,387 పాయింట్లుగా ఉంది. ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఈ రికార్డు నాలుగు దశాబ్దాలుగా అలాగే ఉంది. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ 38,325 పాయింట్లతో అతనికి చాలా దగ్గరగా ఉన్నాడు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. ఈ మధ్యే ఇండియాన పేసర్స్ తోనూ అతడు 26 పాయింట్లు స్కోరు చేశాడు. -
‘టిమ్‌కుక్’ను ట్రోల్ చేయాలనుకుంది, పాపం..అడ్డంగా దొరికిపోయిన గూగుల్?
అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థను, ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌ను కార్నర్ చేయాలని సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టి ట్రోలర్ చేతికి చిక్కింది. ఇంతకీ గూగుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటని అనుకుంటున్నారా? యాపిల్ సీఈవో టిమ్ కుక్ కొత్త యాపిల్ ప్రొడక్ట్‌లను పరిచయం చేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. #TakeNote అనే హ్యాష్ ట్యాగ్‌ను యాడ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్‌ను తరచుగా ట్విట్టర్లో NBA ఫుట్‌బాల్ టీమ్ ఉటా జాజ్ ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. యాపిల్ ప్రొడక్ట్ గురించి ట్వీట్ చేస్తూ #TakeNote,NBA టీం గురించి ఎందుకు ప్రస్తావించారనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ ట్వీట్‌కు గూగుల్ స్పందించింది. గూగుల్ తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి టిమ్‌కు రిప్లయి ఇచ్చింది. ఏమని? “హ్మ్మ్మ్ ఒకే ,నేను నిన్ను చూస్తున్నాను. #TakeNote @NBA అభిమానులు...#టిమ్ ఫిక్సెల్ మిమ్మల్ని మీకు ఇష్టమైన టీమ్‌కి చేరువ చేసేందుకు ఇక్కడ ఉంది. మీ NBA టీంను గుర్తించి అలెర్ట్ చేస్తుందంటూ సెటైర్లు వేసే ప్రయత్నం చేసింది. కానీ అక్కడే గూగుల్ ఇరుక్కుపోయింది. ఎందుకంటే గూగుల్ పై ట్వీట్ చేసి యాపిల్ ఐఫోన్‌తో. ఇది గమనించిన నెటజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి👉‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా!
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సెరెనా.. అందుకు తగ్గ ఆటతీరునే ప్రదర్శిస్తోంది. బుధవారం అర్థరాత్రి తర్వాత జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావెయిట్కు షాక్ ఇచ్చిన సెరెనా అద్భుత ప్రదర్శనతో 24వ టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. తొలి సెట్ టై బ్రేక్‌లో నెగ్గిన సెరెనా.. రెండో సెట్‌ను కోల్పోయి కూడా ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. పాత సెరెనాను తలపిస్తూ విజృంభించిన ఆమె సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే క్రీడల్లో ఆల్‌టైమ్ గ్రేట్‌ను G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తుంటారు. ఇప్పటికే G.O.A.Tగా పిలవబడుతున్న సెరెనాను ఎన్బీఏ(బాస్కెట్‌బాల్) చాంపియన్ లెబ్రన్ జేమ్స్ తనదైన శైలిలో సంబోధించడం వైరల్‌గా మారింది. సెరెనా మ్యాచ్‌ను టీవీలో వీక్షించిన లెబ్రన్ జేమ్స్.. ఆమె మ్యాచ్ గెలిచిన అనంతరం GOAT పదం ఉచ్చరించేలా.. మేక శబ్ధం అయిన ''మే.. మే..'' అని అరిచాడు. ఒక రకంగా సెరెనా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ G.O.A.T అనే పదాన్ని తనదైన స్టైల్లో పిలిచి ఆమె గౌరవాన్ని మరింత పెంచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. LeBron making goat sounds at Serena 😂🐐 (h/t @AhnFireDigital) pic.twitter.com/mpvhmLkU7s — NBACentral (@TheNBACentral) September 1, 2022 చదవండి: వరల్డ్ నెంబర్-2కు షాక్.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ -
విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి
ఎన్బీఏ(బాస్కెట్‌బాల్) మాజీ ప్లేయర్ కాలేబ్ స్వానిగన్ 25 ఏళ్ల వయసులో మృత్యు ఒడిలోకి చేరాడు. అతని మరణ విషయాన్ని 'పర్డ్యూ మెన్స్ బాస్కెట్‌బాల్' టీం తన ట్విటర్లో ప్రకటించింది. ''కాలేబ్ స్వానిగన్ అకాల మరణం పట్ల చింతిస్తున్నాం. ఆడింది కొద్దిరోజులే అయినా గొప్ప ఎన్బీఏ ప్లేయర్‌గా ఎదిగాడు. కాలేబ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అతని కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాం.'' అంటూ ట్వీట్ చేసింది. అయితే కాలెబ్ మరణ వార్తని మాత్రమే వెల్లడించిన 'పర్డ్యూ మెన్స్' మృతి వెనుక కారణాలను మాత్రం రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. అయితే అలెన్ కౌంటీ కార్నర్స్ అందించిన రిపోర్ట్స్ ప్రకారం కాలేబ్ స్వానిగన్ది సహజ మరణమే అని తెలిసింది. ఇక ఎన్బీఏ(నేషనల్ బాస్కెట్‌బాల్ అసొసియేషన్) అనేది నార్త్ అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్ లీగ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 💔 Devastated. Our thoughts and prayers to Caleb Swanigan’s family and friends. The world lost a gentle soul last night. Love you Biggie. pic.twitter.com/spU2hQtJdi — Purdue Mens Basketball (@BoilerBall) June 21, 2022 2017 నుంచి మూడేళ్ల పాటు ఎన్బీఏలో కొనసాగిన కాలేబ్ స్వానిగన్ పోర్ట్లాండ్ ట్రయల్బేజర్స్, సాక్రామెంటో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2019-20 సీజన్ నుంచి మాత్రం కాలేబ్ ఎన్బీఏలో యాక్టివ్‌గా లేడు. అంతకముందు ఫ్లొరిడాలో నిర్వహించిన కోవిడ్-19 బయోబబూల్ క్యాంప్‌కు వెళ్లేందుకు కాలేబ్ నిరాకరించడంతో అతనిపై వేటు పడింది. ఆ తర్వాత కాలేబ్ స్వానిగన్ కారులో గంజాయితో పట్టుబడి అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అప్పటినుంచి మానసికంగా బాగాలేడనే వార్తలు వచ్చాయి. తాజాగా చిన్న వయసులోనే మరణించడం వెనుక డ్రగ్స్ కారణమని.. బరువు తగ్గేందుకే కాలేబ్ మాదకద్రవ్యాలను వినియోగించడంటూ ట్విటర్లో కొందరు పేర్కొన్నారు. ఇక కాలేబ్ స్వానిగన్ స్కూల్ వయసులోనే బాస్కెట్‌బాల్‌లో సంచలనాలు నమోదు చేశాడు. 2015లో తన స్కూల్‌కు బాస్కెట్‌బాల్‌లో మెయిడెన్ స్టేట్ చాంపియన్‌షిప్‌గా నిలవడంతో కాలేబ్ది కీలకపాత్ర. ఈ ప్రదర్శనతో ఇండియానాలో ఫేమస్ అవార్డుగా చెప్పుకునే మిస్టర్ బాస్కెట్‌బాల్ గౌరవాన్ని కాలేబ్ అందుకున్నాడు. ఇక పర్డ్యూ మెన్స్ బాస్కెట్‌బాల్ టీం తరపున ఎన్బీఏలో లెక్కలేనన్ని రికార్డులు అందుకున్నాడు. చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ స్టార్ల పెట్టుబడులు
ముంబై: విశ్వవ్యాప్త ఆదరణతో టాప్ క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అమెరికన్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంలో సఫలమైంది. ఐపీఎల్ తొలి చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) దిగ్గజం లారీ ఫిట్జెరాల్డ్, స్టార్ ప్లేయర్ కెల్విన్ బీచుమ్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) స్టార్ క్రిస్ పాల్ పెట్టుబడులు పెట్టారు. ‘అమెరికా ఎలైట్ అథ్లెట్లు క్రిస్ పాల్, ఫిట్జెరాల్డ్, కెల్విన్‌లను పెట్టుబడులు పెట్టేలా మా ఫ్రాంచైజీ ఆకర్షించింది. ఈ ముగ్గురు తాజాగా మా స్టేక్ హోల్డర్ల జాబితాలో చేరారు. మైనార్టీ ఇన్వెస్టర్లుగా మా బోర్డులో భాగమయ్యారు’ అని రాజస్తాన్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మనోజ్ బదాలేకు చెందిన ‘ఎమర్జింగ్ మీడియా వెంచర్స్’ ఈ ఫ్రాంచైజీ యజమాని కాగా... అమెరికన్ దిగ్గజాలు తమ ఫ్రాంచైజీలో భాగస్వాములవడం సంతోషంగా ఉందని బదాలే అన్నారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. పెద్ద స్టార్లతో గొప్ప మేలే జరుగుతుందన్నారు. ‘రాజస్తాన్‌ను ఓ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీగా తయారు చేయాలనే ఆలోచనతో ఇందులో భాగమయ్యాను’ అని ఫిట్జెరాల్డ్ తెలిపాడు. ఐపీఎల్ ఎంతగా ఎదిగిందో తెలుసని, విలువ పరంగా ఈ లీగ్ అంతకంతకూ వృద్ధి చెందుతోందని, నిజంగా ఇలాంటి విశేష ప్రాచుర్యంగల లీగ్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉందని క్రిస్ పాల్ అన్నాడు. రాయల్స్ ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది బార్బడోస్ ట్రైడెంట్స్, సీఎంజీ కంపెనీలు రాజస్తాన్‌లో పెట్టుబడులు పెట్టాయి. -
12 వారాలు న్యూస్ ఛానెల్స్ రేటింగ్ నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ న్యూస్ ఛానెల్స్‌తో పాటు బిజినెస్ న్యూస్ ఛానెల్‌ల వ్యూయర్షిప్ రేటింగ్‌ను ఎప్పటికప్పుడు విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా న్యూస్ ఛానెల్‌ల వ్యూయరిషిప్ రేటింగ్‌ను పన్నెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో ఈ వారం విడుదల చేయాల్సిన న్యూస్ ఛానెల్‌ల వ్యక్తిగత రేటింగ్‌ను బార్క్ ప్రకటించడం లేదని తెలిపింది. బార్క్ తన ప్రకటనలో.. ‘ప్రస్తుతం టెలివిజన్, న్యూస్ ఛానెల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంకేతిక లోపాల దృష్ట్యా బార్క్ బోర్డు, సాంకెతిక మండలిని(టెక్ కమిటీని) సంప్రదించినట్లు చెప్పింది. ఈ టెక్ కామ్ రోజువారి ఛానెల్ సముచిత డేటాను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. ప్రస్తుత బ్రాడ్‌కాస్టింగ్ ప్రమాణాల నివేధికను పరీక్షిస్తుంది. రేటింగ్ గణాంకాలను మెరుగుపరచడంతో పాటు . ప్యానెల్ గృహాలలోకి చొరబడే సంభావ్యత ప్రయత్నాలను కూడా గణనీయంగా దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. అయితే టెక్కామ్ పర్యవేక్షలో జరిపే ప్రయోగానికి 8 నుంచి 12 వారాల సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో టీవీ, న్యూస్ ఛానెల్‌ల రేటింగ్‌ను 12 వారాల నిలిపివేస్తున్నట్లు బార్క్ తన ప్రకటనలో వివరించింది. (చదవండి: లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) అలాగే వార్తా ప్రాసారకులకు ప్రాతినిధ్యం వహించే న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌ర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) కూడా బార్క్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ సస్పెన్స్ ఖచ్చితమైన రేటింగ్‌కు ఇచ్చేందుకు సరైన మార్గంగా ఎన్బీఏ ప్రెసిడెంట్ రజత్ శర్మ అన్నారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఇటివల బ్రాడ్‌స్టింగ్ రేటింగ్స్‌ను ఎప్పటికప్పుడు వెల్లడించే క్రమంలో రేటింగ్ ఎజేన్సీకి, ప్రసార వార్త మాధ్యమాలకు అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. రేటింగ్ డేటాలో హెచ్చుతగ్గులు ఊహించని విధంగా చోటుచేసుకున్నాయన్నారు. అసలు భారత ప్రజలు ఏం చూస్తున్నారో దానిపై ఖచ్చితమైన రేటింగ్ ఇవ్వడంలో కూడా తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. అలాగే జర్నలిస్టులపై, జర్నలీజం ఆదర్శాలకు విరుద్ధంగా పనిచేసే సంపాదకియ కాల్స్ తీసుకోవడంలో కూడా తమ సభ్యులపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే బార్క్ ఈ నిర్ణయం తీసుకుందని, వార్తా ఛానెల్‌ల రేటింగ్లను, కంటెంటెంట్‌ను మెరుగుపరచడం కోసమే బార్క్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. (చదవండి: మహా గవర్నర్ రీకాల్‌కు సేన డిమాండ్) -
లేకర్స్ అదరహో...
ఫ్లోరిడా: విఖ్యాత ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) టైటిల్‌ను లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు దక్కించుకుంది. ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో లేకర్స్ జట్టు 4–2తో మయామి హీట్ జట్టును ఓడించింది. తద్వారా ఈ టైటిల్‌ను 17వసారి సాధించింది. బోస్టన్ సెల్టిక్స్ పేరిట ఉన్న అత్యధిక ఎన్బీఏ టైటిల్స్ (17) రికార్డును సమం చేసింది. ఆరో ఫైనల్లో లేకర్స్ 106–93 పాయింట్ల తేడాతో మయామి హీట్ జట్టును ఓడించింది. మరో ఫైనల్ మిగిలి ఉండగానే టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. లేకర్స్ స్టార్ ప్లేయర్ లేబ్రాన్ జేమ్స్ 28 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దివంగత కోబీ బ్రయాంట్ సభ్యుడిగా 2010లో చివరిసారిగా ఎన్బీఏ విజేతగా నిలిచిన లేకర్స్... పదేళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. -
ఎన్బీఏ లీగ్ మళ్లీ మొదలైంది...
ఫ్లోరిడా: కరోనా నేపథ్యంలో మార్చి 11న అర్ధాంతరంగా నిలిచిపోయిన అమెరికా విఖ్యాత ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ పునఃప్రారంభమైంది. ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో బయో సెక్యూర్ బబుల్‌లో శుక్రవారం జరిగిన ఈ పునఃప్రారంభ మ్యాచ్‌లో లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు 103–101తో క్లిప్పర్స్పై విజయం సాధించింది. మ్యాచ్ మరో 12 సెకన్లలో ముగుస్తుందనగా స్కోరు 101–101తో సమం కాగా... లేకర్స్ స్టార్ ప్లేయర్ లేబ్రాన్ జేమ్స్ చివరి క్షణాల్లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 16 పాయింట్లు సాధించిన జేమ్స్ కీలక దశలో జట్టును ఆదుకున్నాడు. ‘ప్రపంచానికి సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేసేందుకు ఇదో మంచి అవకాశం. జాతి, రంగుతో నిమిత్తం లేకుండా ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు వివక్షకు, సామాజిక అన్యాయానికి, పోలీసుల దురాగతాలకు బలవుతున్నారని పేర్కొన్నాడు. దీన్ని రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలి’ అని జేమ్స్ అన్నాడు. అమెరికా నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ మోకాలిపై కూర్చోని తమ నిరసనను తెలిపారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నినాదంతో కూడిన జెర్సీలను ధరించి బరిలోకి దిగారు. అక్టోబర్‌లో జరిగే ఫైనల్స్‌తో ఎన్బీఏ సీజన్‌కు తెరపడుతుంది. -
నల్లజాతి లేడీ జస్టిస్
టీనేజ్‌లో అతడికి శిక్ష పడింది. యాభై ఏళ్ల జైలు శిక్ష! నల్లవాడికి పడిన శిక్ష. ఇరవై మూడేళ్లు గడిచాయి. మిగతా ఇరవై ఏడేళ్లూ లోపల ఉండేవాడే! మాయా మూర్ వెళ్లి తీసుకొచ్చింది. బాస్కెట్‌బాల్ స్టార్ ప్లేయర్ తను. రెండేళ్లు ఆటను పక్కన పెట్టింది. నల్లజాతి ‘లేడీ జస్టిస్’ అయింది. వీడియో క్లిప్ ఆన్ అయింది. ఇ.ఎస్.పి.ఎన్. స్పోర్ట్స్ సైన్స్ క్లాస్ అది. స్క్రీన్‌పై క్లిప్‌ను చూపించి చెబుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ ప్రొఫెసర్. ‘‘ఈ ప్లేయర్‌ను చూడండి. తన వెర్టికల్ లీప్, కోర్టు విజన్, మజిల్ మెమరీ, స్టీలింగ్! ఫాలో అవుతున్నారా? చేతుల కదలికలు త్రాచు కన్నా వేగం..’’ వీడియో క్లిప్ చూస్తున్న వారికి ఆ ప్లేయర్ మాయా మూర్ అని తెలుసు. తమ సిలబస్‌లో ఉన్న బాస్కెట్ బాల్ ప్లేయర్. పాఠ్యాంశాల్లోకి వచ్చిందంటే రిటైర్ అయిన క్రీడాకారిణి అయి ఉండాలి. కానీ కాదు! కెరీర్ ఆరంభంలో ఉన్న స్టార్ ప్లేయర్ మాయా. వయసు ముప్పై. నిలువుగా పైకి లేవడం (వెర్టికల్ లీప్), క్షణం క్రితానికి, మరుక్షణానికి మధ్య ‘తక్షణం’లో బంతిని ఎగరేయడానికి (కోర్టు విజన్), మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్లిపోవడం (మెమరీ మజిల్).. బాగా సీనియర్లు మాత్రమే చేయగలిగినవి. మాయా చేస్తోంది! ఇంతవరకు చాలు. ఇక ఈమె గురించి మరికొంచెం కూడా చెప్పుకునే పని లేదు. ‘ది గ్రేటెస్ట్ విన్నర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ బాస్కెట్‌బాల్’ అని మూడేళ్ల క్రితమే ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ చెప్పేసింది. అమెరికాలోని జఫర్సన్ సిటీలో (మిస్సోరీ) ‘కరెక్షనల్ సెంటర్’ ఉంది. మామూలు భాషలో జైలు! బుధవారం (జూలై 1) జైలు తలుపులు తెరుచుకోగానే సన్నటి ద్వారం నుంచి బయటికి వచ్చాడు జొనాథన్ ఐరన్స్. 1997లో అరెస్ట్ అయ్యాడు అతడు. 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటికి వచ్చాడు. అతడికి పడిన శిక్షయితే 50 ఏళ్లు! ఇంకా 27 ఏళ్ల శిక్షాకాలం మిగిలే ఉంది. సాధారణంగా అమెరికాలో ఒక నల్లజాతి మనిషి.. శిక్ష పూర్తి కాకుండా బయటికి వచ్చాడంటే అందుకు అతడి సత్ప్రవర్తన మాత్రమే కారణం అయి ఉండదు. వేరే ప్రధాన కారణం ఉంటుంది. జొనాథన్ విషయంలో ఆ.. ప్రధాన కారణం.. మాయా మూర్! మన బాస్కెట్‌బాల్ హీరోయిన్. అతడిని బయటికి రప్పించేందుకు పన్నెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకోసం అమెరికన్ న్యాయవ్యవస్థతో పోరాడుతోంది. న్యాయం కోసం పోరాడటం వేరు. న్యాయవ్యవస్థతో పోరాడటం వేరు. న్యాయం కోసం పోరాడి గెలిస్తే జొనాథన్ ఒక్కడే జైలు నుంచి బయటికి వస్తాడు. న్యాయ వ్యవస్థతో పోరాడి గెలిస్తే.. జొనాథన్ లాంటి వాళ్లకు మరీ అంత అన్యాయంగా శిక్ష పడదు. తన పోరాటాన్ని జొనాథన్‌తో ప్రారంభించింది మాయ. అతడెవరో తనకు తెలీదు. అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఎందుకిలా ఉందో స్టడీ చెయ్యడానికి 2007లో ఒకసారి జఫర్సన్ కరెక్షనల్ సెంటర్లోకి వెళ్లే అవకాశాన్ని లోపల పని చేస్తున్న జైలు సిబ్బందితో తెప్పించుకుంది మాయ. అప్పుడు తన కథ చెప్పుకున్నాడు జొనాథన్. అప్పటికి అతడి వయసు 27. మాయ వయసు 17. మిస్సోరీలోని ఒకరి ఇంట్లో జరిగిన దోపిడీ, కాల్పుల కేసులో ఒక నిందితుడు జొనాథన్. ‘నేనక్కడ లేనే లేను అంటాడు’ జొనాథన్. ‘ఉన్నాడు, తుపాకీతో కాల్చాడు’ అని అవతలి వైపు లాయర్. చివరికి అంతా తెల్లవాళ్లే జడ్జిలుగా ఉన్న కోర్టులో జొనాథన్ దోషి అయ్యాడు. ఎంత దోషి అయితే మాత్రం టీనేజ్లోనే ఒక జీవితానికి సరిపడా శిక్ష వెయ్యడం న్యాయ మాయ వాదన. సిస్టమ్‌ని మార్చాలనుకుంది. ఈ పదమూడేళ్లలో జొనాథన్‌ను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చివరి రెండేళ్లు కెరీర్‌ను పక్కనపెట్టి, కెరీర్ వల్ల వచ్చే లక్షల డాలర్లను పక్కకు నెట్టి అతడిని విడిపించడం కోసమే తిరిగింది. మిన్సెసోటా లింక్స్ జట్టు ప్లేయర్ మాయా. ఆ జట్టు మేనేజర్ మాయ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. కెరీర్లో మాయ పీక్స్‌లో ఉన్న సమయం ఈ రెండేళ్లూ. డబ్లు్య.ఎన్.బి.కె. కు అయితే ఆమె బంగారమే. ఉమెన్స్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్. అందులో పన్నెండు టీములు ఉంటాయి. వాటిల్లో ఒకటి మిన్నెసోటా లింక్స్. మాయ స్కిల్స్ కారణంగానే యు.ఎస్.కి టర్కీలో గోల్డు, చెక్‌లో గోల్డు, రియో ఒలింపిక్‌లో గోల్డు, లండన్ ఒలింపిక్స్‌లో గోల్డు వచ్చింది. 2019లో, 2020లో మాత్రం ఏ ఆటలోనూ మాయా మూర్ లేదు. ఇప్పుడు జొనాథన్ ఐరన్స్ విడుదల కావడం డబ్లు్య.ఎన్.బి.కె. కూడా ఆనందించవలసిన విషయమే. మాయ మళ్లీ బ్యాక్ టు ఆట. జైలు నుంచి బయటి రాగానే జోనాథన్, బయట తనకోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను కావలించుకుని ఉద్వేగానికి లోనవడం దూరం నుంచి చూస్తూ ఉంది మాయ. తర్వాత అతడు ఆమె దగ్గరికి వచ్చాడు. ‘ఐ ఫీల్ లైక్.. ఐ కెన్ లివ్ లైఫ్ నౌ’ అన్నాడు. తన జీవితం తన చేతికొచ్చింది. ధన్యవాదాలు తెలిపాడు మాయకు. అతడిని పక్కన పెట్టి, అతడిని విడిపించిన మాయతో మాట్లాడ్డానికే అమెరికన్ మీడియా ఆసక్తి చూపింది. మాయ ‘ఎండ్ ఇట్ మూవ్మెంట్’లో కూడా ఉంది. ఆధునిక సమాజంలోని బానిసత్వాన్ని నిర్మూలించేందుకు ఆ సంస్థ పని చేస్తుంటుంది. మాయ పుట్టింది కూడా జెఫర్సన్ సిటీలోనే. అమ్మ, అక్క, చెల్లి.. ముగ్గురే ఇంట్లో. తండ్రి వారితో ఉండటం లేదు. క్రిస్టియన్ ఫ్యామిలీ. ‘‘ఈ అవార్డులు, పేరు, డబ్బు.. దేవుడిచ్చిన జీవితం కంటే విలువైనవి కావు’’ అంటుంది మాయ. మనం, మన జీవితం అంటూ ఉండిపోకుండా.. సాటి మనుషులకు సహాయం చేస్తేనే.. జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడి రుణం తీర్చుకున్నట్లు’’ అని కూడా అంటుంది. ఎలా సాధ్యం అయింది?! ఒక సాధారణ అమెరికన్ పౌరురాలు అయి ఉంటే, జొనాథన్‌ను విడిపించడానికి మాయ చేసిన ప్రయత్నాలేవీ ఫలించేవి కాకపోవచ్చు. మొదట అతడి కథను జైల్లో వినే నాటికి మాయ తన కాలేజ్ టీమ్ తరఫున ఆడుతున్న ఒక బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి మాత్రమే. ఆ తర్వాతి కాలంలో పదేళ్ల పాటు ఆమె సాధించిన అంతర్జాతీయ విజయాలు, ఆమెపై ఫోర్బ్స్ కథనాలు, పెప్సీ మాక్స్ కమర్షియల్ సిరీస్‌లోని ‘అంకుల్ డ్రూ: చాప్టర్ 3’లో బెట్టీ లియూగా ఆమె నటించడం.. అన్నీ ఆమెను స్టార్‌ను చేశాయి. ఆ యువ స్టార్.. న్యాయ సంస్కరణలకు కృషి చేస్తున్నారని తెలియగానే అన్ని రంగాలలోని ప్రముఖులు, న్యాయకోవిదులు కలిసి వచ్చారు. ఆమెకు సహకరించారు. ఆరంభ విజయంగా జొనాథన్ ఐరన్స్ బయటికి వచ్చాడు. జైలు బయట జొనాథన్‌తో మాయా మూర్ -
ఎన్‌బీఏపై కరోనా పంజా
వాషింగ్టన్: కరోనా విజృంభణతో అర్ధాంతరంగా నిలిచిపోయిన అమెరికా విఖ్యాత ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ 2019–20 సీజన్‌ను జూలై 30న పునఃప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న నిర్వాహకులకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. లీగ్‌లోని వివిధ జట్లకు ఆడుతున్న 16 మంది ప్లేయర్లకు కరోనా సోకినట్లు ఎన్బీఏ లీగ్ కమిషనర్ ఆడమ్ సిల్వర్ ప్రకటించారు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. 302 మంది ప్లేయర్ల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా... 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వీరిని స్వీయ నిర్భందంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సిల్వర్ తెలిపారు. గత బుధవారమే శాక్రమెంటో జట్టు ఆటగాళ్లు జాబ్రీ పార్కర్, అలెక్స్ లెనాలతో పాటు ఇండియానా పేసర్స్ ఆటగాడు మాల్కమ్ బ్రాగ్డాన్కు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే తాము సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకే మొగ్గు చూపుతున్నట్లు సిల్వర్ స్పష్టం చేశారు. రీ స్టార్ట్ సీజన్లో 30 జట్లకు బదులు 22 జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. వీటిని వెస్ట్రన్ కాన్ఫరెన్స్, ఈస్ట్రన్ కాన్ఫరెన్స్ గ్రూపులుగా విడగొడతారు. ప్రతి జట్టు ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడతాయి. అనంతరం ప్రతి గ్రూప్ నుంచి ఎనిమిది జట్ల చొప్పున 16 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆగస్టు 17 నుంచి ఆరంభం కానుండగా... ఫైనల్స్ సెప్టెంబర్ 30న మొదలవుతాయి. ఫైనల్స్‌ను ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ (ఏడు మ్యాచ్‌లు) పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌లన్నింటిని ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్‌లో నిర్వహిస్తారు. -
విషాదం.. మాటలు రావడం లేదు: కోబీ భార్య
లాస్ ఏంజెల్స్: తన భర్త, కూతురి దుర్మరణం తమ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసిందని బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ భావోద్వేగానికి గురయ్యారు. వాళ్లిద్దరూ లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ఈ విషాదం గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ధన్యవాదాలు తెలిపారు. ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ వద్ద జరిగిన ఈ దుర్ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచివేసింది. ఈ నేపథ్యంలో కోబీ మరణం తర్వాత తొలిసారిగా ఆయన భార్య వెనెస్సా గురువారం సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నారు. ‘‘నా ప్రియమైన భర్త కోబీ... అద్భుతమైన తండ్రి... నా అందమైన, అద్భుతమైన, చలాకీదైన చిన్నారి జియానా- నా కూతురు, నటాలియా, బియాంక, కాప్రీల సోదరి.. వాళ్లిద్దరినీ కోల్పోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కోబీ, గిగీ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం అయినా వాళ్లు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నట్లుగా భావిస్తాం.(దిగ్గజం విషాదాంతం) నేను వాళ్లిద్దరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి.. వారి తలపై ప్రేమగా ముద్దు పెట్టాలి అని ఆకాంక్షిస్తున్నాను. వాళ్లు మాతోనే ఉంటారు. ఈ ప్రమాదంలో నా భర్త, కూతురితో పాటు చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి ముంబా స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున సహాయం అందజేస్తాం’’ అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. కాగా కోబీ- వెనెస్సా(డ్యాన్సర్)లు 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు ఆడ పిల్లలు.. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు) ఉన్నారు. ఇక సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. తన కూతురు జియానాను సైతం అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళ్తుండగా ఇద్దరూ మృత్యువాత పడ్డారు.(కనుమరుగైన ‘బ్లాక్ మాంబా’) View this post on Instagram My girls and I want to thank the millions of people who’ve shown support and love during this horrific time. Thank you for all the prayers. We definitely need them. We are completely devastated by the sudden loss of my adoring husband, Kobe — the amazing father of our children; and my beautiful, sweet Gianna — a loving, thoughtful, and wonderful daughter, and amazing sister to Natalia, Bianka, and Capri. We are also devastated for the families who lost their loved ones on Sunday, and we share in their grief intimately. There aren’t enough words to describe our pain right now. I take comfort in knowing that Kobe and Gigi both knew that they were so deeply loved. We were so incredibly blessed to have them in our lives. I wish they were here with us forever. They were our beautiful blessings taken from us too soon. I’m not sure what our lives hold beyond today, and it’s impossible to imagine life without them. But we wake up each day, trying to keep pushing because Kobe, and our baby girl, Gigi, are shining on us to light the way. Our love for them is endless — and that’s to say, immeasurable. I just wish I could hug them, kiss them and bless them. Have them here with us, forever. Thank you for sharing your joy, your grief and your support with us. We ask that you grant us the respect and privacy we will need to navigate this new reality. To honor our Team Mamba family, the Mamba Sports Foundation has set up the MambaOnThree Fund to help support the other families affected by this tragedy. To donate, please go to MambaOnThree.org. To further Kobe and Gianna’s legacy in youth sports, please visit MambaSportsFoundation.org. Thank you so much for lifting us up in your prayers, and for loving Kobe, Gigi, Natalia, Bianka, Capri and me. #Mamba #Mambacita #GirlsDad #DaddysGirls #Family ❤️ A post shared by Vanessa Bryant 🦋 (@vanessabryant) on Jan 29, 2020 at 4:59pm PST -
‘డోపీ’ సత్నామ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్ నుంచి నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు ఎంపికైన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన సత్నామ్ సింగ్ భమారా డోపీగా తేలాడు. దక్షిణాసియా క్రీడలకు సన్నాహక శిబిరం సందర్భంగా బెంగళూరులో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సత్నామ్ శాంపిల్స్‌ను సేకరించింది. వీటిలో ‘ఎ’ శాంపిల్‌ను పరీక్షించగా ఈ 23 ఏళ్ల పంజాబ్ ప్లేయర్ నిషిద్ధ ఉత్రే్పరకాన్ని తీసుకున్నట్లుగా పరీక్షలో వెల్లడైంది. దీంతో నవంబర్ 19 నుంచి భమారాపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది. అయితే దీనిని సత్నామ్ సింగ్ ఖండించాడు. తాను ఎప్పుడూ నిషిద్ధ ఉత్రే్పరకాలు తీసుకోలేదని, తీసుకోబోనని వ్యాఖ్యానించాడు. ‘నాడా’కు చెందిన ‘డోపింగ్ నిరోధక క్రమశిక్షణా ప్యానల్ (ఏడీడీపీ)’ తన వాదనను వినాలంటూ 7 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న సత్నామ్ అభ్యర్థన చేశాడు. ఒకవేళ ఏడీడీపీ అతన్ని డోపీగా నిర్ధారిస్తే ఏకంగా 4 సంవత్సరాల సస్పెన్షన్ విధిస్తారు. -
ఒకే మ్యాచ్‌లో 263 పాయింట్లు..
ముంబై: ప్రఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) మొదటిసారి భారత్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్ తొలి మ్యాచ్‌లో పాయింట్ల వర్షం కురిసింది. అనుక్షణం ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియానా పేసర్స్ 132–131తో కేవలం ఒక్క పాయింట్ తేడాతో సాక్రామెంటో కింగ్స్‌పై గెలిచింది. రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. 12 నిమిషాల చొప్పున నిడివితో నాలుగు క్వార్టర్లు జరిగాయి. తొలి క్వార్టర్ ముగిశాక పేసర్స్ 29–39తో, రెండో క్వార్టర్ ముగిశాక 59–72తో మూడో క్వార్టర్ ముగిశాక 92–97తో వెనుకంజలో ఉంది. నిర్ణాయక చివరి క్వార్టర్లో పేసర్స్ 26 పాయింట్లు స్కోరు చేయగా... కింగ్స్ 21 పాయింట్లు సాధించింది. దాంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 118–118తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి అదనంగా ఐదు నిమిషాలు ఆడించగా... పేసర్స్ 132–131తో విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ మ్యాచ్ బాల్‌ను నిర్వాహకులకు అందజేశారు. స్కోరు వివరాలు ఇండియానా పేసర్స్: 132 (టీజీ వారెన్ 30, సబోనిస్ 21, జెరెమీ ల్యాంబ్ 20, బ్రాగ్‌డన్ 15, మైల్స్ టర్నర్ 11, మెక్‌డెర్మట్ 9); సాక్రామెంటో కింగ్స్: 131 (బడ్డీ హీల్డ్ 28, హ్యారిసన్ బార్నెస్ 21, డెరాన్ ఫాక్స్ 16, బొగ్డాన్ 14, నెమాంజా 14, మారి్వన్ బాగ్లే 12, హోమ్స్ 10). -
ఎంటెక్కు.. ‘కొత్త’లుక్కు
జేఎన్టీయూ(ఏ)కు ఎన్బీఏ(నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు రాలేదు. ఫలితంగా నిధుల మంజూరుకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఆలోచనలో పడిన వర్సిటీ ఉన్నతాధికారులు ఎంటెక్కుకు ‘కొత్త’ లక్కు దక్కేలా ప్లాన్ చేశారు. జేఎన్టీయూ క్యాంపస్‌లో మరో కళాశాల ఏర్పాటు చేసి అధ్యాపక, విద్యార్థి నిష్పత్తి తగ్గించి నిధులు రాబట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేసిన ఉన్నతాధికారులు పాలకమండలి ముందుంచి ఆమోదం పొందాలని చూస్తున్నారు. – జేఎన్టీయూ జేఎన్టీయూ(ఏ) క్యాంపస్‌లో మరో ఇన్స్టిట్యూట్ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ పేరుతో నూతనంగా ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. వచ్చే పాలకమండలి సమావేశంలో ఆమోదించడానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. నూతన కోర్సులతో పాటు ఎంటెక్ కోర్సులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌లో తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎన్బీఏ గుర్తింపు రాక.... జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ( నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. మరో దఫా ఎన్బీఏ గుర్తింపునకు పునఃసమీక్ష కోరినా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో క్యాంపస్ కళాశాలకు రావాల్సిన నిధుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది. దీంతో కళాశాలలో సాంకేతిక పరికరాలు, నూతన ల్యాబ్‌లు , సెమినార్లు, సింపోజియంలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించుకోవడానికి మంజూరు చేసే నిధులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం టెక్విప్–3 (టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్) నడుస్తుండగా...2020 ఆగస్టు తర్వాత ప్రారంభమయ్యే టెక్విప్–4 నిధుల మంజూరుకు అవరోధం ఏర్పడింది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన వర్సిటీ అధికారులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కళాశాలను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. అధ్యాపక.. విద్యార్థి నిష్పత్తిలో వ్యత్యాసం జేఎన్టీయూ (ఏ)క్యాంపస్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం విద్యార్థి.. అధ్యాపక నిష్పత్తికి వ్యత్యాసం అధికంగా ఉంది. ప్రస్తుతం 6 బీటెక్ బ్రాంచ్‌లు, 24 ఎంటెక్ బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. బీటెక్ బ్రాంచ్‌లో అయితే 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు, ఎంటెక్‌లో అయితే ప్రతి 12 మందికి ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉండాలి. ఒక బ్రాంచ్ మొత్తానికి 1:2:6 ( ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ఆరు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు) కేడర్ రేషియో ప్రకారం నియమించాలని ఏఐసీటీఈ(ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) నిర్ధారించింది. ప్రస్తుతం జేఎన్టీయూ(ఏ) క్యాంపస్‌లో మొత్తం 286 మంది ఫ్యాకల్టీ మెంబర్లు అవసరం కాగా, 101 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. తక్కిన 185 మంది ఫ్యాకల్టీ మెంబర్లను భర్తీ చేయాల్సి ఉంది. అవసరమైన మేరకు ఫ్యాకల్టీ మెంబర్లు లేకపోవడంతో ఎన్బీఏ గుర్తింపు రాలేదు. దీంతో బీటెక్ బ్రాంచ్‌లకు ఒక కళాశాల, ఎంటెక్ బ్రాంచ్‌లకు మరో కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి వ్యత్యాసం లేకుండా ఉంటుంది. ఎంటెక్‌లో 24 బ్రాంచ్‌ల్లో 12 బ్రాంచులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కళాశాలకు బదిలీ చేయనున్నారు. ప్రత్యేక అనుమతితో ఉపకార వేతనాలు వర్సిటీలోని కొందరు ఎంటెక్ విద్యార్థులకు ఇప్పటికే ఉపకారవేతనాలు అందుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేస్తే ఉపకారవేతనాల మంజూరుకు ఆటంకం ఏర్పడకుండా న్యూఢిల్లీకి ప్రత్యేక కమిటీని పంపనున్నారు. ఏఐసీటీఈ ప్రత్యేక అనుమతితో విద్యార్థుల ఉపకారవేతనాలు మంజూరుకు చొరవ తీసుకోనున్నారు. వచ్చే పాలకమండలి సమావేశంలో ప్రత్యేక కళాశాలకు ఆమోదం తెలపనుంది. 39 ఎకరాల్లో నూతన ఎంబీఏ కళాశాల జేఎన్టీయూ(ఏ) క్యాంపస్‌లో ఎంబీఏ కళాశాలకు నూతన భవనాలను నిర్మించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం నుంచి 39 ఎకరాలను జేఎన్టీయూ(ఏ)కు బదలాయించనున్నారు. ఇందులో నూతనంగా ఎంబీఏ కళాశాల నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించనున్నారు. ఎంటెక్ కోర్సులను బలోపేతం చేస్తాం ఎంటెక్ కోర్సులను బలోపేతం చేయడానికి ప్రత్యేక కళాశాల, వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అధ్యాపక. విద్యార్థి నిష్పత్తి వ్యత్యాసం తగ్గాలి. శాశ్వత ప్రాతిపదికన బోధన ఉద్యోగాల భర్తీ చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. ఎంటెక్ కోర్సులో 24 బ్రాంచుల్లో 12 బ్రాంచులను నూతన కళాశాలలో నిర్వహించనున్నాం. – ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్ కుమార్, వీసీ, జేఎన్టీయూ(ఏ) -
కెనడాలో కాల్పుల కలకలం
టోరంటో: కెనడాలోని టోరంటోలో ఓ విజయోత్సవ ర్యాలీపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టోరంటోలోని సిటీహల్ స్క్వేర్‌లో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలమంది రాప్టార్ అభిమానులతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. ఇంతకు ముందు దీనిని ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వచ్చేలా ర్యాలీ కోసం ఏర్పాటు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో.. ఇదే అదునుగా భావించిన దుండగులు వారిపైకి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమేనీ జరగలేదు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. మరికొందరు స్వల్పంగా గాయాలపాలైనట్లు పోలీస్ చీఫ్ మార్క్ సాండర్స్ చెప్పారు. ఈ కాల్పుల సమయంలో ఎవరైన ఫోటోలు లేదా వీడియోలు తీసివుంటే వాటిని తమకుని అప్పగించి దర్యాప్తుకు సహకరించాలని సాండర్స్ కోరారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో, టోరంటో మేయర్ జాన్ టోరి, ఎన్బీఏ ఫైనల్స్ ఎంవిపి కవి లియోనార్ఢ్తో పాటు ఇతర ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలేమీ కాలేదని అధికారులు తెలిపారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు చేశారా.. లేక తీవ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
ఐఐటీ, ఐఐఎంలతో త్వరగా అక్రిడేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల సాయంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల అక్రిడేషన్ ప్రక్రియను త్వరగా చేపడతామని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అక్రిడేషన్ కోసం ఏర్పాటు చేసే కొత్త కమిటీలో చేరేందుకు ముందుకురావాలని ఐఐటీ, ఐఐఎంలను కోరామన్నారు. ఇంతకాలం 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లోనే అక్రిడేషన్‌ను చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్), జాతీయ గుర్తింపు మండలి(ఎన్బీఏ)లను విస్తరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా కొత్త పథకాన్ని తెస్తామని జవదేకర్ చెప్పారు. -
ఎన్బీఏ శిక్షణకు ఆశయ్ వర్మ
ముంబై: ప్రతిభ ఉంటే సరిహద్దులైనా దాటేయొచ్చని హైదరాబాద్ కుర్రాడు ఆశయ్ వర్మ తన ఎంపికతో నిరూపించాడు. ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) అంతర్జాతీయ గ్రూప్‌నకు 17 ఏళ్ల ఆశయ్ ఎంపికయ్యాడు. ఇతనితో పాటు కేరళకు చెందిన ప్రియాంక ప్రభాకర కూడా 67 మంది సభ్యుల బాలబాలికల గ్రూప్‌నకు ఎంపికై ంది. ఆశయ్కి హైటే అడ్వాంటేజ్ అరుు్యంది. 7 అడుగుల 1 అంగుళం ఎత్తున్న వర్మ అమెరికాలో నిర్వహించే శిక్షణ శిబిరానికి అర్హత సంపాదించాడు. హైదరాబాద్‌లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి అరుున ఆశయ్ ఈ అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా బాస్కెట్‌బాల్‌లో సత్తాచాటేవారిని ఎంపిక చేసి వీరికి మూడు రోజుల పాటు అమెరికాలోని న్యూ ఓర్లియాన్సలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే ఈ ప్రత్యేక శిబిరంలో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ స్టార్లతో కలిసి పాల్గొనే అవకాశాన్ని ఇస్తారు. -
ఎన్డీ టీవీకి ఊరట...!
న్యూఢిల్లీ : జాతీయ న్యూస్ ఛానల్ ఎన్డీ టీవీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 9వ తేదీన ఒకరోజు పాటు ప్రసారాలు నిలిపేయాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్టీ టీవీపై నిషేధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రసారాల నిలిపివేత నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పఠాన్‌కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ప్రసారాలు ఒకరోజుపాటు నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి. ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకున్న విషయం విదితమే. -
ఎన్డీ టీవీపై చర్యను ఖండించిన ఎన్బీఏ
న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన జాతీయ ఛానల్ ఎన్డీ టీవీ ఇండియా ప్రసారాలు నిలిపేయాలన్న కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఎన్బీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. పటాన్ కోట్ దాడిని మిగతా ఛానళ్లు ప్రసారం చేసినా... కేవలం ఎన్డీ టీవీ ఇండియాపైన మాత్రమే చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఆ నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసింది. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఎన్డీటీవీ లైవ్ ప్రసారాల వల్ల రక్షణ రహస్యాలు భంగం వాటిల్లిందని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. -
బై బై ‘బ్లాక్ మంబా’
లాస్ ఏంజిల్స్: నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) స్టార్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ తన రెండు దశాబ్దాల అద్భుత కెరీర్‌కు ముగింపు పలికాడు. తన కెరీర్ ఆద్యంతం లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టుకే ఆడిన 37 ఏళ్ల కోబ్ తన అసమాన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు. బుధవారం రాత్రి స్టేపుల్స్ సెంటర్స్‌లో ఉతా జాజ్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లోనూ సత్తా చూపిస్తూ ఏకంగా 60 పాయింట్లు సాధించాడు. ఇది ఏ ఆటగాడి చివరి మ్యాచ్‌లోనైనా రికార్డు స్కోరు. దీంతో లేకర్స్ 101-96 తేడాతో నెగ్గింది. బ్లాక్ మంబా అనే ముద్దుపేరుతో పిలుచుకునే ఈ స్టార్ చివరి ఆటను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బాస్కెట్‌బాల్ చరిత్రలోనే జత టిక్కెట్లకు అత్యధిక రేటు (రూ.18 లక్షల 30 వేలు) పలికింది. మరోవైపు హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఇతర క్రీడా దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు.