North America
-
రిలీజ్‌కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!
డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా మరో 9 రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. సినిమాపై హైప్ ఎక్కువగానే ఉంది. కానీ ప్రమోషన్సే సరిగా చేయట్లేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. తాజాగా 'భైరవ ఏంథమ్' పేరుతో ఓ పాట రిలీజ్ చేశారు. కానీ ఇందులో పంజాబీ ఫ్లేవర్ ఎక్కువగా ఉండేసరికి తెలుగు ఆడియెన్స్‌కి సరిగా ఎక్కలేదు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టాక్ నడుస్తూనే ఉంది. ఇదంతా ఓవైపు నడుస్తుండగానే 'కల్కి' ఖాతాలో సరికొత్త రికార్డ్ చేరింది.(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజు, మార్కెట్ పెరిగిపోయింది. సినిమాల విడుదలకు ముందే ప్రీ సేల్స్ విషయంలో మంచి బిజినెస్ జరుగుతోంది. తాజాగా అలా కేవలం ఉత్తర అమెరికాలోనే 2 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది. ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే గనక రూ.1000 కోట్ల వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.'కల్కి' ట్రైలర్ బాగుంది. కానీ ఎందుకో కావాల్సినంత హైప్ మాత్రం ఇంకా రావట్లేదు అనిపిస్తోంది. రిలీజ్ ట్రైలర్ మరేదైనా తీసుకొస్తే అప్పుడు అంచనాలు ఏర్పడొచ్చు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకుడు, సంతోష్ నారాయణన్ సంగీతమందిచాడు.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?) -
పగలే కమ్ముకున్న చీకట్లు
మునుపెన్నడూ చేసుకోని పరిణామాలకు ఉత్తర అమెరికా వేదిక అయ్యింది. గ్రహణంతో పగలే కారుచీకట్లు కమ్ముకున్నవేళ.. లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు.ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది. Ever seen a total solar #eclipse from space? Here is our astronauts' view from the @Space_Station pic.twitter.com/2VrZ3Y1Fqz — NASA (@NASA) April 8, 2024 అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణ గమనానికి సంబంధించి ఓ వీడియోను కూడా నాసా షేర్ చేసింది. ఇందులో సూర్యగ్రహణ గమనం కారణంగా నెమ్మదిగా కదులుతూ.. ఉత్తర అమెరికాపై చీకటి ఛాయ వ్యాపించడాన్ని అంతరిక్ష కేంద్ర నుంచి వ్యోమగాములు గమనిస్తున్నారని తెలిపింది. పట్టపగలే కొంత సమయం పాటు ఉత్తర ఆమెరికా ప్రాంతం చీకటిగా మారిందని తెలిపింది. ఇండియానాపోలిస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ.. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని వెల్లడించింది నాసా. Follow, follow the Sun / And which way the wind blows / When this day is done 🎶 Today, April 8, 2024, the last total solar #eclipse until 2045 crossed North America. pic.twitter.com/YH618LeK1j — NASA (@NASA) April 8, 2024 మరోవైపు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సూర్యుడు భ్రమిస్తూ గ్రహణం ఏర్పడటం ఆర్బిట్ నుంచి కనిపిస్తుంది’ అని కామెంట్ జత చేశారు. View of the eclipse from orbit pic.twitter.com/2jQGNhPf2v — Elon Musk (@elonmusk) April 9, 2024 -
‘తానా ప్రపంచసాహిత్య వేదిక’
డెట్రాయిట్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే. ఇప్పడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర గారి నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కొసరాజుగారి 37వ వర్దంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “దాదాపు నాల్గు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సాహితీ ప్రయాణంలో “ఏరువాక సాగాలోరన్న”; “అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”; “భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా”; “సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు”; “రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”; “ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది” లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు గారి కలంనుండి రెండువందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు గారు “గండికోట యుద్ధము” అనే ద్విపద కావ్యము; “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంధాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారని అన్నారు”. ఈ సందర్భంగా కొసరాజు గారి కుటుంబసభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు గారి కుటుంబసభ్యులకు, కొసరాజు గారి సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న పేరెన్నికగన్న సాహితీవేత్త, పరిశోధకులు, అనుభవజ్ఞులు అయిన అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్) కు కృతజ్ఞతలు అన్నారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర. -
పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందుడుగు వేశారు. తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రతిభగల పేద విద్యార్ధులకు అండగా నిలిచారు. తాను చదువుకున్న కళశాలలో ప్రస్తుతం అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందించారు. కళాశాల పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి నాట్స్ అధ్యక్షునిగా ఎన్నికై తాను చదువుకున్న కళాశాలలోనే పేద విద్యార్థులకు సహాయ,సహకారాలు అందించడం మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని పలువురు అభినందించారు. మెరిట్ స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ గల విద్యార్ధులను మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సాహిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. (చదవండి: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం) -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ.. మౌంట్ డెనాలి ఎక్కి ప్రపంచ రికార్డు
సాక్షి, నిజామాబాద్: మాలావత్ పూర్ణ అరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా’గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు. మే 23న బేస్ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్ శేఖర్ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్ చేసిన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్(వీఆర్ఎస్), సహకరించిన హైదరాబాద్ బీఎస్బీ ఫౌండేషన్ చైర్మన్ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది. పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7–సమ్మిట్స్ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్ వర్మ కూడా ఉన్నారు. దక్షిణభారత దేశం నుంచి తొలి యువతి.. కాగా, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ 2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ‘ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ 7–సమ్మిట్ ఘనతను సాధించిన మొదటి యువతి పూర్ణ కావడం విశేషం. పూర్ణ అధిరోహించిన పర్వతాలు: 1. ఎవరెస్టు (ఆసియా) 2. మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా) 3. మౌంట్ ఎల్బ్రస్ (యూరప్) 4. మౌంట్ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా) 5. మౌంట్ కార్టెన్జ్ (ఓషియానియా) 6. మౌంట్ విన్సన్ (అంటార్కిటికా) 7. మౌంట్ డెనాలి (ఉత్తర అమెరికా) -
ఐరోపా, అమెరికాలో మంకీఫాక్స్ కలకలం
-
Monkeypox: శారీరకంగా కలవడం వల్లే వైరస్ విజృంభణ
ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు యూరప్, యూకే, నార్త్ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ.. అది వ్యాపించడానికి గల కారణాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు వైద్య సంస్థలు ఒక స్పష్టమైన ప్రకటన చేశాయి. ► ఫ్లూ(జ్వరం) తరహా లక్షణాలు ఉండే మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉత్తర అమెరికాతో పాటు యూరప్‌లోనూ డజన్ల కొద్దీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే వీటిలో చాలావరకు సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వ్యాప్తి చెందినవే కావడం గమనార్హం. ► కెనడాలో డజను, స్పెయిన్.. పోర్చుగల్‌లో 40(అనుమానిత.. ధృవీకరణ కేసులు), బ్రిటన్‌లో తొమ్మిది(మే 6వ తేదీ నుంచి ఇప్పటిదాకా..), అమెరికాలో బుధవారం తొలి మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ► శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు వైరస్ బారిపడ్డ వాళ్లను పరీక్షిస్తే స్పష్టమయ్యింది. ఈ మేరకు అమెరికా సీడీసీ ప్రకటన చేసింది. మరోవైపు యూకే ఆరోగ్య భద్రత సంస్థ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది. గే, బైసెక్సువల్, పరస్పర పురుష శృంగారంలో పాల్గొన్న వ్యక్తుల్లోనే మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు వెల్లడించింది. యూకేలో వెలుగు చూసిన మొదటి కేసు నైజీరియాతోనే ముడిపడి ఉండడం విశేషం. ► ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గత వారం రోజులుగా యూకే, యూరోపియన్ ఆరోగ్య ప్రతినిధులతో సమన్వయం అవుతూ.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో చాలావరకు గే, బైసెక్సువల్‌గా గుర్తించినట్లు తెలిపింది. ‘‘పురుషుల పరస్పర శృంగారంతోనే వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయ్యింద’’ని డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోసే ఫాల్ వెల్లడించారు. ► మంకీపాక్స్ బారినపడ్డ వాళ్లు కోలుకోవడానికి పదిహేను రోజుల దాకా పట్టొచ్చు. ప్రాణాల మీదకు వచ్చేది చాలా తక్కువ సందర్భాల్లోనే. పది మందిలో ఒకరికి మాత్రమే ప్రాణాల మీదకు వస్తుంది. ఇంతకు ముందు.. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో వేలమంది మంకీపాక్స్ బారినపడ్డారు. కానీ, యూరప్, నార్త్ అమెరికాలో కేసులు వెలుగు చూడడం అరుదనే చెప్పాలి. ► మంకీపాక్స్.. జ్వరం తరహా లక్షణాలతో మొదలవుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. మంకీపాక్స్ వైరస్‌ను మనీపాక్స్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లూ ‘ఆర్థోపాక్స్ వైరస్’ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ► ఉచ్ఛ్వాస పెద్ద బిందువుల(తుంపర్ల) ద్వారా, శరీరంపై గాయాలు, కలుషితమైన పదార్థాలతో.. చాలాసందర్భాల్లో వ్యాపిస్తుంది. జంతువులు, మనుషులు, వైరస్ సోకిన వస్తువుల ద్వారానూ మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుంది. జంతువుల ద్వారా కాటు, కొరికిన గాయాలు, కరవడం.. ఇలా వ్యాప్తి చెందుతుంది. ► అయితే యూరప్, నార్త్ అమెరికాతో పాటు యూకేలో వెలుగు చూస్తున్న కేసుల్లో.. వైరస్ బారినపడ్డ వాళ్లు ఇతరులతో అత్యంత సన్నిహితంగా(శారీరక సంబంధం) మెలగడం వల్లే వైరస్ విజృంభించడం గమనించాల్సిన విషయం. ► మంకీపాక్స్ తొలి కేసు 1950లో.. రెండు దఫాల అవుట్‌బ్రేక్‌లు(వేవ్)లుగా విజృంభించింది. ► పరిశోధనల నిమిత్తిం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో గుర్తించారు. అయితే మనుషుల్లో గుర్తించింది మాత్రం 1970లో. అది కాంగోలో. ► ఆఫ్రికా ఖండంలో బయటపడ్డ వేల కేసుల్లో.. చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వైరస్ వ్యాపించింది. శారీరక కలయిక ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువే. ► స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్నే చాలాకాలంగా మంకీపాక్స్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కానీ, అది అథెంటిక్‌గా ప్రూవ్ కాలేదు. ► సాధారణ జ్వరానికి ఉపయోగించే చికిత్సతో పాటు యాంటీ వైరల్స్, వ్యాక్సినియా ఇమ్యూన్ గ్లూబ్లిన్ను కూడా మంకీపాక్స్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు. ► ఈ వైరస్ బారిన పడ్డవాళ్లు.. ఇతరులకు దూరంటూ, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ► ప్రస్తుతం బయటపడ్డ కేసుల వెనుక అరుదైన మంకీపాక్స్ వైరస్ ఉంది. అయినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సమయంలో వైరస్ కట్టడికి తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ::: సాక్షి, వెబ్‌స్పెషల్ -
China: చైనాలో మరో వైరస్.. ప్రపంచంలోనే ఫస్ట్
బీజింగ్: కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. కాగా, ఇది ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. అయితే, సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న బాలుడు(4) కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బాలుడికి పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(NHC) స్పష్టం చేసింది. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్ అతనికి సోకిందని చెప్పారు. అయితే, బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. దీంతో, చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మొదటిసారిగా 2002లో H3N8 వైరస్ ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఈ వైరస్ కేవలం గుర్రాలు, కుక్కలు, సీల్స్కు మాత్రమే సోకుతుందని వైద్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. కానీ, తాజాగా మనుషులకు కూడా ఈ వైరస్ సోకడంతో ఆందోళన నెలకొంది. 🚨 China has recorded the first human infection with the H3N8 strain of bird flu — a four-year-old boy from central Henan province. https://t.co/W8wPNgNzMf — Byron Wan (@Byron_Wan) April 27, 2022 ఇది కూడా చదవండి: నార్త్ కొరియా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ -
మెక్సికో మార్కెట్లోకి కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా కోవాగ్జిన్‌ను మెక్సికో మార్కెట్లో కూడా సరఫరా చేసే దిశగా బయోటెక్నాలజీ సంస్థలు భారత్ బయోటెక్, ఆక్యుజెన్ తమ ఒప్పందంలో మార్పులు చేశాయి. దీనితో మొత్తం ఉత్తర అమెరికాలో కోవాగ్జిన్ విక్రయానికి సంబంధించి ఆక్యుజెన్‌కు హక్కు లభిస్తుంది. అమెరికా మార్కెట్ తరహాలోనే లాభాల్లో వాటాల పంపకం రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని ఆక్యుజెన్ తెలిపింది. అమెరికా, కెనడా మార్కెట్లలో కోవాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సరఫరా, విక్రయాల కోసం ఆక్యుజెన్, భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం ఉంది. ప్రస్తుతం 2–18 ఏళ్ల బాలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌ను ఉపయోగించే అంశాన్ని మెక్సికో నియంత్రణ సంస్థ పరిశీలిస్తోందని ఆక్యుజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్లో కోవాగ్జిన్‌ను వాణిజ్యావసరాలకు ఉత్పత్తి చేసేందుకు ఆక్యుజెన్‌కు పూర్తి తోడ్పాటు అందిస్తామని భారత్ బయో చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. -
అమ్మో ‘డైనోసర్’ చేప.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు నివసిస్తున్నాయి. అప్పుడప్పుడు కొన్ని జీవాలను చూసి ఆశ్చర్యపోతుంటాం. యూనిమేషన్ సినిమాలు, హాలీవుడ్, కార్టూన్ ఛానెళ్లలో వింత జంతువులను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంటాం. అలాంటి జంతువులు నిజంగానే ఉన్నాయా అని అనుకుంటాం కదా.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నార్త్ అమెరికాలో వెలుగు చూసింది. సాధారణంగా మనం 50-100 కిలోల బరువున్న చేపలను చూసి ఉంటాం. కానీ, 10 అడుగులకు పైగా పొడువు, దాదాపు 500 పౌండ్ల నుంచి 600 పౌండ్ల బరువున్న చేపను చూశారా..? ఇంత సైజు, బరువు ఉన్న ఓ చేప( స్టర్జన్ ఫిష్) ఫ్రేజర్ నదిలో కనిపించింది. భయకరంగా ఉన్న ఆకృతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ స్టర్జన్ ఫిష్ వయసు ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలమే ఉంటుందని అంచనా. స్టర్జన్ చేపలు జురాసిక్ యుగం నుంచి ఉంటున్నాయని, ఇవి బతికున్న డైనోసార్స్ అని నిపుణులు చెబుతుండటం విశేషం. Giant. pic.twitter.com/K8w1yW6kek — Jamie Gnuman197... (@JGnuman197) April 10, 2022 -
చిక్కడపల్లిలో అరుదైన పక్షి.. పతంగి మాంజాకు చిక్కుకుని..
సాక్షి, హైదరాబాద్: ఓ అరుదైన నార్త్ అమెరికా దేశానికి చెందిన ఓవల్ పక్షినీ నగర వాసులు కాపాడారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో ఓ అరుదైన పక్షి ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షానికి ఉన్న పతంగి మంజాకి చిక్కుకొని విలవిల్లాడింది. అటుగా వెళ్తున్న స్థానికులు దానిని గమనించి సురక్షితంగా కాపాడారు. చెట్టుకు వేలాడుతున్న పక్షిని కాపాడి దాహాన్ని తీర్చారు. చదవండి: వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే? వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. స్థానికులు రక్షించిన ఆ పక్షి నార్త్ అమెరికాకి చెందిన ఓ అరుదైన ఓవెల్‌గా గుర్తించారు. ఈ అరుదైన ఓవల్ పక్షిని చూసేందుకు స్థానికులు గుమిగూడారు. -
అణు, మిసైల్ ప్రోగ్రాంలకు నిధుల కోసం... ఉత్తర కొరియా సైబర్ దాడులు
ఐరాస: అణు, మిసైల్ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. సైబర్ స్పెషలిస్టులను ఉటంకిస్తూ ఐరాస నిపుణుల ప్యానల్ సోమవారం ఈ మేరకు వెల్లడించింది. ‘‘ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని మూడు క్రిప్టో ఎక్స్చేంజీల నుంచి 2020 నుంచి 2021 మధ్య కనీసం 5 కోట్ల డాలర్లను ఉత్తర కొరియా కొట్టేసింది. అలాగే వాటిపై ఏడుసార్లు సైబర్ దాడులకు తెగబడి 40 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీనీ దొంగిలించింది. ఆ సంస్థల ఇంటర్నెట్ కనెక్టెడ్‌హాట్ వాలెట్ల నుంచి మాల్వేర్, ఫిషింగ్, కోడ్ ఎక్స్‌ప్లాయిట్స్, ఇతర అధునాతన సోషల్ ఇంజనీరింగ్ మార్గాల్లో కాజేసిన ఈ నిధులను డీపీఆర్కే నియంత్రిత అడ్రస్‌లకు తరలిస్తోంది. తర్వాత పకడ్బందీ మనీ లాండరింగ్ ప్రకియ ద్వారా క్రిప్టో కరెన్సీని సొమ్ము చేసుకుంటోంది’’ అని ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఈ ప్యానెల్ వివరించింది. డీపీఆర్కే అంటే డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. 2019–2020 మధ్య కూడా సైబర్ దాడుల ద్వారా 32 కోట్ల డాలర్లకు పైగా ఉత్తర కొరియా కొట్టేసిందని ఏడాది కిందే ఈ ప్యానెల్ ఆరోపించింది. నిషేధాలను ఉల్లంఘిస్తూ అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉందని తాజా రిపోర్టులో పేర్కొంది. ‘‘అణు పరీక్షల్లాంటివి జరిపినట్టు ఆధారాల్లేకున్నా కీలకమైన యురేనియం, ఫ్లూటోనియం తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగంపై విధించుకున్న నాలుగేళ్ల స్వీయ నిషేధాన్ని పక్కన పెడతామని కొరియా ఇటీవల హెచ్చరిస్తూ వస్తుండటం తెలిసిందే. -
మరోసారి నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్ నియామకం
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ ను సీఎం వైయస్ జగన్ మరోసారి ఎంపిక చేశారు. 2 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో పదవీకాలాన్ని పొడిగిస్తూ సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో బాధ్యతలను చేపట్టిన రత్నాకర్ ఇప్పుడు మరో 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రత్నాకర్ పార్టీ విధేయుడిగా ఉన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా అమెరికాలో ముందుండి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 2015లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి పార్టీకి విశేష సేవలు అందించారు. సీఎం వైయస్ జగన్, పార్టీలోని కీలక నేతలతోనే కాదు సాధారణ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో రత్నాకర్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రెండో సారి ఈ పదవి రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్, పార్టీలో ఇతర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం వైయస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని రత్నాకర్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా(నార్త్ అమెరికా) తనను మరోసారి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, సీఎం జగన్ గారికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా తన శక్తికి మించి కష్టపడతానని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శమని, విద్య- వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రత్నాకర్ అన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు
ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాటి చెప్పిన నా పార్టీ నాయకులకు, సహచరులకు వందనాలు. మానవీయతా కోణంలో పాలన అందిస్తున్న జగనన్నే స్ఫూర్తిగా.. ఈ కష్టకాలంలో వెలకట్టలేని సాయాన్ని అందిస్తూ వారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు అని రత్నాకర్ పండుగాయల, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్ అమెరికా) అన్నారు. అభివృద్ధిలో అందళం ఎక్కిన అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా ఈ కరోనా తాకిడికి అతలాకుతం అయింది చూస్తున్నాం. ఈ మహమ్మారి విజృంభించి ప్రాణాలు బలితీసుకుంటున్న వేళ, మన అనుకున్న వాళ్ళే కనుమరుగు అవుతున్న వేళ.. మనపై నమ్మకంతో మన సహాయాన్ని కోరుతున్న ప్రతీ ఒక్కరికీ మన శక్తి మేరకు సహాయం చేయడం ఈ సంక్షోభ సమయంలో సాటిమనిషిగా మన కర్తవ్యం అని రత్నాకర్ అన్నారు. ఈ అత్యవసర సమయంలో అర్ధరాత్రి, అపరాత్రి అని ఆలోచించకుండా, క్షణం ఆలస్యం చేయకుండా ఎంతో మంది స్పందించారు. వైద్యసహాయం కోసం అమెరికా నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించిన తక్షణమే వెంటనే సహయం చేశారు. శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు మన పార్టీ నాయకులకు, మంత్రులుకు వారి కార్యాలయ సిబ్బంది, ఎంపీలు,ఎమ్మెల్యేలు వారి సహాయ అధికారులు తమ శక్తికి మించి సహాయం చేసి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం/ ఆరోగ్య శ్రీ అధికారులు, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారిని/పార్టీని అభిమానించే డాక్టర్లు అందరూ తమ వంతుగా ఈ ఆపద సమయంలో సహాయ సహకారాలు అందించారు. ఆక్సీజన్, ఆస్పత్రి బెడ్ కావాలన్నా అనూహ్యంగా కన్ను మూసిన వారికి అంత్యక్రియలు జరగాలన్న.. అన్నీ విధాలుగా సహకరించిన పార్టీ శ్రేణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జగన్ అన్న ప్రభుత్వంలో, మన పార్టీ లో ఓక భాగస్వామి అయినందుకు, మీ అందరితో కలిసి పని చేసే అవకాశాన్ని నా అదృష్టంగా భావిస్తూ ఎంతో గర్వ పడుతున్నాను. మీరు చేస్తున్న సాయం ఒకరి జీవితాన్ని నిలబెట్టడం కాదు.. ఒక కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడుతుంది. ఈ ఆపత్కాలంలో నలుగురికీ సాయం చేయాలన్న మీ మనసు, మీ సేవాగుణం, మీ సహకారం ఎన్నటికీ మరువలేనివి, ఎవరూ మర్చిపోలేనివి మీ సాయం వల్ల నిలబడుతున్న జీవితాలే మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆశీస్సులు అందిస్తున్నాయి. ఈ ఆశీస్సులు ఎప్పటికీ మీకు, మీ కుటుంబానికి ఉంటాయని, ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. -
ఫార్మాకు కలిసొచ్చిన ఉత్తర అమెరికా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19, లాక్డౌన్ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఎగుమతులు 7.16 శాతం అధికమై రూ.37,875 కోట్ల నుంచి రూ.40,590 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఒక్కటే వృద్ధికి తోడైంది. ఇతర విభాగాలన్నీ నిరాశపరిచాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ విభాగం 15.14 శాతం వృద్ధితో రూ.31,042 కోట్లు నమోదైంది. మొత్తం ఎగుమతుల విలువలో ఈ విభాగం వాటా ఏకంగా 76.48 శాతం ఉండడం గమనార్హం. వ్యాక్సిన్స్ 30 శాతం, ఆయుష్ 25, సర్జికల్స్ 15.8, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 8 శాతం, హెర్బల్ ప్రొడక్ట్స్ 2.5 శాతం తిరోగమన వృద్ధి సాధించాయి. ఎగుమతులకు ఊతమిచ్చే బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్ ఈ త్రైమాసికంలో మాత్రం 8.38 శాతం మైనస్‌లోకి వెళ్లాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా ఫార్మా రంగం తిరోగమనంలో ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్‌లో ఎగుమతుల వృద్ధి సాధించడం విశేషమన్నారు. కొన్ని ప్రాంతాలు మినహా..: ఎగుమతుల్లో కొన్ని ప్రాంతాలు (రీజియన్లు) మినహా మిగిలినవన్నీ వృద్ధిని నమోదు చేశాయి. మధ్యప్రాచ్య మినహా ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు, దక్షిణాసియా, కొన్ని యూరప్ దేశాలు నిరాశపరిచాయి. అయితే 2020 ఏప్రిల్–జూన్‌లో ఉత్తర అమెరికా మార్కెట్ ఎగుమతులకు ఊతమిచ్చింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ రీజియన్ 15.67 శాతం వృద్ధితో రూ.15,450 కోట్ల ఎగుమతులను నమోదు చేసింది. మొత్తం ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్తర అమెరికా వాటా అత్యధికంగా 38 శాతం ఉంది. వృద్ధి పరంగా మధ్య ప్రాచ్య దేశాలు 14 శాతం అధికమై రూ.2,220 కోట్లు, ఆసియాన్ ప్రాంతం 10.5 శాతం హెచ్చి రూ.2,580 కోట్లు సాధించాయి. పరిమాణంలో రెండో స్థానంలో ఉన్న ఆఫ్రికా మార్కెట్లు 0.4 శాతం పెరిగి రూ.6,510 కోట్లు, మూడో స్థానంలో ఉన్న యురోపియన్ యూనియన్ 6.9 శాతం అధికమై రూ.6,000 కోట్ల ఎగుమతులను నమోదు చేశాయి. -
సంపన్న దేశాల్లోనే తగినంత ఆక్సిజన్
కోనాక్రి(గినియా) : కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన ఆక్సిజన్ కొరత ప్రపంచవ్యాప్తంగా కఠోర వాస్తవాలను వెలికితెస్తోంది. సంపన్న దేశాలైన యూరప్, ఉత్తర అమెరికాల్లోని ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ మాదిరిగా ఆక్సిజన్‌ను ప్రాథమిక అవసరంగా గుర్తిస్తారు. ఇక్కడ ద్రవరూపంలో పైప్‌ల ద్వారా నేరుగా ఆసుపత్రిలోని కోవిడ్ రోగుల బెడ్స్‌కి ఆక్సిజన్ చేరుతుంది. అయితే పెరు నుంచి బంగ్లాదేశ్ వరకు పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ప్రపంచ జనాభాలో కనీసం సగం మందికి ఆక్సిజన్ అందుబాటులో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగోలో కేవలం 2 శాతం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉంది. టాంజానియాలో 8 శాతం, బంగ్లాదేశ్‌లో 7 శాతం ఉన్నట్టు ఒక సర్వేని బట్టి తెలుస్తోంది. గినియాలో ఏ ఆసుపత్రలో ఒక్క బెడ్‌కి నేరుగా ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదు. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు) -
నార్త్ అమెరికాలో ఏపీ ప్రిన్సిపల్ లయజన్‌గా హరిప్రసాద్‌రెడ్డి
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి ఉత్తర అమెరికా నుంచి పెట్టుబడులు వచ్చేలా కృషి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిన్సిపల్ లయజన్‌గా లింగాల హరిప్రసాద్‌రెడ్డిని నియమించింది. ఏపీకి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఏపీలో స్థానికులకు ఉపాధి కల్పించే బాధ్యతలను హరిప్రసాద్‌రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి, పెట్టుబడిదారులకు మధ్య హరిప్రసాద్‌రెడ్డి వారధిలా కృషి చేస్తారని తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన లింగాల హరిప్రసాద్‌రెడ్డి చాలా కాలం కింద అమెరికా వెళ్లి డెట్రాయిట్లో స్థిరపడ్డారు. 2014 నుంచి అమెరికన్ తెలుగు అసొసియేషన్ సభ్యులుగా ఉన్న హరిప్రసాద్ రెడ్డి వేర్వేరు కంపెనీల్లో పలు హోదాల్లో పని చేశారు. గల్ఫ్ దేశం ఒమన్‌తో పాటు ఆఫ్రికాలోని పలు మైనింగ్ కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అలాగే హరిప్రసాద్‌రెడ్డికి పలు కంపెనీలతో మంచి సంబంధాలున్నాయి. ఆయన అనుభవం, ప్రజా సంబంధాల దృష్ట్యా హరిప్రసాద్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రిన్సిపల్ లయజన్ అధికారిగా నియమించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతల పట్ల లింగాల హరిప్రసాద్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన రత్నాకర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తానని నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పేర్కొన్నారు. అదేవిధంగా నార్త్ అమెరికాలో ఉన్న ఎన్నారైల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నార్త్ అమెరికాకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం అయిన తర్వాత ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రత్నాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఛైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డితో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కావటి మనోహర్ నాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. -
నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్
-
‘అమానా’ ఆత్మీయ సమావేశం
అమెరికాలో ముస్లిం సామాజిక వర్గం నుంచి గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నా సరైన వేదిక లేకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ ముస్లీం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (AMANA) పేరిట ఆత్మీయ సమావేశాన్ని జరుపుకున్నారు. ముస్లిం కుటుంబాలకు ఒక వేదిక లేకపోవడం.. వారి ఆధ్యాత్మిక అవసరాలకు అంతర్జాతీయ ముస్లిం సమాజంలో ఒకరుగా కలిసిపోయినా.. తాము పుట్టిన పెరిగిన ఆంధ్రప్రదేశ్ మూలాలను గుర్తు పెట్టుకుని అనుసంధానం అవడానికి, తెలుగు వారందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో పాలు పంచుకోవడానికి ఒక వేదిక అవసరాన్ని గ్రహించి ‘అమానా’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక అలెన్ లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ నివాసం లో దాదాపు 15 ముస్లిం కుటుంబాలు సమావేశమై.. ఆంధ్ర ప్రదేశ్ ముస్లింల ప్రాతినిధ్యం గురించి, తెలుగు సమాజంలో మమేకవ్వడం.. అమెరికాలో నివసిస్తున్న ఆంధ్ర ముస్లింలను ఒక వేదిక మీదకు తీసుకురావడం.. వారి సామాజిక, సాంఘిక అవసరాలలో తోడ్పాటు అందించడం.. గురించి చర్చించుకున్నారు. ఈ సమావేశాం లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ తో పాటు, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, మహమ్మద్ ఇక్బాల్ గగ్గుతురు, అక్బర్ సయ్యద్, షాజహాన్ షేక్, మస్తాన్ షేక్, షఫీ మహమ్మద్, ముజాహిద్ షేక్, ఫైజ్ షేక్, కాలిఫోర్నియా నుంచి అబ్దుల్ ఖుద్దూస్, జాకిర్ మహమ్మద్ మరియు నసీం షేక్ పాల్గొన్నారు. -
ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశానికి ఏపీ సీఎం
డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 15న బయలుదేరి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన డల్లాస్‌లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి శనివారం ఆగష్టు 17 న డల్లాస్ మహానగరంలో ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నామని, అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందని తెలిపారు. అభివృద్ధిలో మనలాంటి రాష్ట్రాలను ఆదుకోవడంలో ముందున్న అమెరికా దేశానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మొదటి సారిగా విచ్చేయనున్నారని, మతం, కులం, పార్టీ భేదాలు లేకుండా అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు, తెలుగు సంఘాలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమైనా, ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వైఎస్ జగన్ డల్లాస్‌లో అందరినీ కలిసి ప్రసంగించనున్నారని చెప్పారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సభ విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి సాదర స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమెరికాలో తెలుగు వారి కోసం పనిచేస్తున్న ఆయా సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. అందరూ ఆహ్వానితులే.. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రవాస తెలుగు వారి తరపున వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రియతమ నాయకుడు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా డల్లాస్ (టెక్సాస్) నగరానికి వస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 17న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడుగంటల వరకు కొనసాగే ఈ ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజాసంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఆత్మీయ సమావేశానికి అమెరికాలోని తెలుగు ప్రజలు సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి వైఎస్ జగన్‌ని ఆశీర్వదించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల’ని కోరారు. -
ఇది మామూలు పాము కాదండోయ్..
-
ఇది మామూలు పాము కాదండోయ్..
ఈ పామును చూడగానే మీకేమనిపించింది.. అయ్యో పాపం పాము చచ్చిపోయిందే.. అనుకున్నారు కదా..! కానీ ఇది మామూలు పాము కాదండోయ్.. పెద్ద మాయల మరాఠీ పాము. ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపించే ఈ పాము పేరు ‘హోగ్నోస్’.. దీని ‘నాటకాలు’ చూసి కొందరు ‘జాంబీ’ పాము అని కూడా పిలుస్తారు. ఇంతకీ దీన్ని ఇన్ని పేర్లతో ఎందుకు పిలుచుకుంటారో తెలుసా.. సాధారణంగా ఏ జంతువు అయినా శత్రువుల నుంచి రక్షించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఊసరవెల్లి అయితే రంగులు మార్చుకుంటుంది.. కొన్ని రకాల సీతాకోకచిలుకలు చెట్టు బెరడు రంగులో ఉంటాయి.. అయితే ఈ జాదూ పాము మాత్రం.. ఏదైనా ఆపద వచ్చిందనుకోండి.. మొదట తన తల చుట్టూ ఉన్న చర్మాన్ని ఒక్కసారిగా విదిల్చి తాచుపాము మాదిరిగా నటించి.. గట్టిగా హిస్ అంటూ శబ్దం చేస్తుందట. అది వర్క్అవుట్ కాలేదనుకోండి వెంటనే.. ప్లాన్–బీ సిద్ధంగా ఉంచుకుంటుంది. అదేంటంటే నోరును బాగా తెరిచి వెల్లకిలా పడుకుని (ఫొటోలో ఉన్నట్లు) చనిపోయినట్లు నటిస్తుందట. అంతే దీని శత్రువులు చనిపోయిన దాన్ని తినడమెందుకు అని వెళ్లిపోతాయట. అయితే దీని ఆస్కార్ లెవల్ నటన గురించి ముందే తెలిసిన వారు దాన్ని పట్టుకుంటే చాలు.. వెంటనే కదులుతుందట. చాలా తక్కువ సందర్భాల్లో కాటేస్తుందట. ఈ పాముకు తన ప్రాణంతో పాటు పక్కవాళ్ల ప్రాణం విలువ కూడా తెలుసేమో!! -
రూ 700 కోట్ల క్లబ్లో 2.ఓ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ 700 కోట్లు వసూలు చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ రూ 700 కోట్ల క్లబ్లో చేరిన తొలి కోలీవుడ్ సినిమాగా నిలిచింది. 2.ఓ ప్రపంచవ్యాప్తంగా రూ 710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ 166.98 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ 2.ఓ మెరుగైన వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల తర్వాత కూడా అమెరికాలో 2.ఓ వందకు పైగా థియేటర్లలో రన్ అవుతోంది. ఉత్తర అమెరికాలో ఈ తరహాలో ఎక్కువ రోజులు మరే ఇతర భారతీయ సినిమా ప్రదర్శింపబడలేదని చెబుతున్నారు. ఈ ప్రపంచం కేవలం మానవాళి కోసమే కాకుండా సమస్త జీవరాశుల కోసం సృష్టించబడిందనే సందేశంతో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్ డాక్టర్ వశీకరణ్, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్ 3.ఓ వంటి పలు పాత్రల్లో మెప్పించారు.