Partha Chatterjee
-
బెంగాల్ మాజీ మంత్రికి భవిష్యత్ బెయిల్!
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఒక బెయిల్ కేసులో వినూత్న పోకడకు శ్రీకారం చుట్టింది. బెయిల్‌కు ముందు పూర్తిచేయాల్సిన విధివిధానాలపై కిందికోర్టు సంతృప్తి చెందితే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటోతేదీ లోపు మాజీ మంత్రి పార్థా ఛటర్జీని షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టుకు వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ఏదైనా కేసులో ఇరువైపులా వాదనలు విన్నాక బెయిల్‌కు అవకాశం ఉంటే వెంటనే బెయిల్ ఉత్తర్వులు ఇస్తారుగానీ ఇలా కొద్దిరోజుల తర్వాతనే బెయిల్‌పై విడుదల చేయాలని సూచించడం ఇదే తొలిసారి అని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. నగదుకు ఉద్యోగం కుంభకోణంలో 2022 జూలై 22న అరెస్టయి ఇన్నాళ్లుగా విచారణ ఖైదీగా జైళ్లో గడుపుతున్న పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత పార్థా ఛటర్జీ బెయిల్ కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. #SupremeCourt to shortly pronounce judgment on the #bail plea of former West Bengal Education Minister and now MLA #ParthaChatterjee in the money laundering case arising out of the West Bengal cash-for-jobs scamBench: Justices Surya Kant and Ujjal Bhuyan pic.twitter.com/IB9mOBSFHI— Live Law (@LiveLawIndia) December 13, 2024‘‘జనవరి రెండో, మూడో, నాలుగో వారా ల్లో సాక్షుల వాంగ్మూలాలతోపాటు నేరాభి యోగాల సమర్పణ ట్రయల్ కోర్టులో పూ ర్తవ్వాలి. ఇదంతా పూర్తయితే ఫిబ్రవరి ఒకటి లోపు ఆయనకు బెయిల్ ఇవ్వండి’’ అని జడ్జి సూర్యకాంత్ తీర్పు రాశారు. భవిష్యత్ బెయిల్‌గా అభివర్ణించిన ఈ కేసులో ఫిబ్రవరిలో కూడా ఆయన బెయిల్‌పై బయటికొచ్చే అవకాశం లేకపోవడం గమనార్హం. ఈ కుంభకోణానికి సంబంధించిన వేరే కేసుల్లోనూ ఆయనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడమే ఇందుకు కారణం. మనీలాండరింగ్, ఇతర అక్ర మాల కోణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు పలు ఎఫ్ఐఆర్లు నమోదుచేసి విచారిస్తున్నాయి. ఈయనపై ఈడీ 3, సీబీఐ 5 కేసులను నమోదు చేశాయి. అరెస్ట్ సమయంలో మంత్రిగా ఉన్నా రన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఛటర్జీ తరఫు లాయర్ల వాదనను కోర్టు తప్పుబట్టింది. ‘‘ఎవరైనా నిందితుడు మంత్రి వంటి పదవులు, హోదాల్లో ఉన్నంత మాత్రాన వారికి బెయిల్ ఇచ్చే విషయంలో ప్రత్యేక మినహాయింపులు అంటూ ఏవీ ఉండవు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
మమతా బెనర్జీకి మరోసారి షాకిచ్చిన సీబీఐ.. ఎమ్మెల్యే అరెస్ట్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో సీబీఐ విచారణలో భాగంగా టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను అరెస్ట్ చేశారు. దీంతో, ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్ట్ ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించి కోల్కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో బుర్వాన్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు చేసింది. అనంతరం, జిబాన్‌ను సీబీఐ స్పెషల్ టీమ్ దాదాపు 65(ఏప్రిల్ 14 నుంచి దాదాపు మూడు రోజులు) గంటల పాటు విచారించింది. విచారణ తర్వాత.. జిబాన్ కృష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. అయితే, విచారణ సందర్భంగా జిబాన్.. తమకు సహకరించలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు.. కేంద్ర భద్రతా బలగాలతో పాటు సీబీఐ బృందం ముర్షిదాబాద్ జిల్లాలోని ఆయన నివాసానికి చేరుకుంది. అభ్యర్థుల రిక్రూట్మెంట్కు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో, ప్రభుత్వ పాఠశాలల్లో రెండు సెక్షన్ల రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్షల అడ్మిట్ కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, సీబీఐ దాడుల సందర్బంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఇంట్లో విచారణ సందర్భంగా, జిబాన్ వాష్‌రూమ్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. తరువాత అతను అకస్మాత్తుగా తన నివాసం పక్కనే ఉన్న చెరువు వైపునకు వెళ్లి తన ఫోన్లను అందులోకి విసిరేసాడు. దీంతో, అధికారులు షాకయ్యారు. ఇక, బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. టీఎంసీ నేతలు సాహా మాణిక్ భట్టాచార్య, పార్థా చటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో ఎమ్మెల్యే జిజాన్ కూడా చేరారు. -
మమతకు మరో షాక్.. స్కూల్ జాబ్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే మానిక్ భట్టాచర్యను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. టీచర్స్ జాబ్ స్కాంలో భాగంగా సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఈడీ.. ఉదయం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు దొరికిన క్రమంలో ఆయనను అరెస్ట్ చేసింది. పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ వాట్సాప్ చాట్‌ను పరిశీలించగా ఈ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భట్టాచార్యపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ తర్వాత భట్టాచార్యను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి.. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. పార్థా ఛటర్జీ అరెస్ట్ తర్వాత మానిక్ భట్టాచార్య పేరు బయటకు రావటంతో.. ఆయనను బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇదీ చదవండి: Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్ -
Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రాష్ట్రంలో 2016లో చోటుచేసుకున్న టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీల ఆస్తులను జప్తు చేసినట్లు సోమవారం తెలిపింది. ఈడీ సోమవారం వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది. వీరిద్దరినీ ఈడీ జూలైలో అరెస్ట్ చేసింది. వీరికి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈడీ రూ.55 కోట్ల నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. ఇలా ఉండగా, ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వీసీ సుబిరెస్ భట్టాచార్యను సోమవారం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉండేవారు. -
కోర్టు ముందు బోరున విలపించిన పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ కోర్టు ఎదుట బోరున విలపించారు. ఈడీ అరెస్టు అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరిద్దరూ బుధవారం కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. 'ప్రజల్లో నా ఇమేజ్ గురించి ఆందోళనగా ఉంది. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ను. మంత్రి కావడానికి ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నా. రాజకీయాలకు నన్ను బలిపశువును చేశారు. ఈడీ అధికారులను నా ఇంటిని సందర్శించమనండి. నా నియోజకవర్గానికి వెళ్లమనండి. నేను ఎల్ఎల్బీ చేశాను. బ్రిటిష్ స్కాలర్షిప్ కూడా పొందాను. నా కూతురు యూకేలో నివసిస్తోంది. అలాంటిది ఇలాంటి స్కామ్‌లో నేను ఎందుకు పాలుపంచుకుంటాను?' అని కోర్టుకు పార్థ చటర్జీ తెలిపారు. బెయిల్ కోసం విజ్ఞప్తి చేసిన ఆయన.. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, ఎలాంటి షరతులతో అయినా బెయిల్ మంజూరు చేయాలాని కోరారు. తాను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నానని, దయచేసి తనకు బెయిల్ ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. నాకేం తెలియదు.. పార్థ చటర్జీ అనంతరం కోర్టు ముందుకు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ వచ్చారు. ఈడీ సోదాల్లో డబ్బు ఎక్కడ దొరికిందో తెలుసా? అని జడ్జి ఆమెను ప్రశ్నించగా.. 'నా ఇంట్లో' అని బదులిచ్చింది. ఆ ఇల్లు నీదేనా? అని అడిగితే అవునని చెప్పింది. అయితే ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో తనకేమీ తెలియదని అర్పిత కోర్టులో వాపోయింది. తనది మధ్యతరగతి కుటంబం అని, 82 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని పేర్కొంది. తన లాంటి వాళ్ల ఇంటిపై ఈడీ ఎలా దాడి చేస్తుందని ప్రశ్నించింది. దీనికి కోర్టు స్పందిస్తూ.. అవసరమైతే దేశంలో ఎవరి ఇంట్లోనైనా తనిఖీలు చేసే అధికారం ఈడీకీ ఉంటుందని స్పష్టం చేసింది. టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి జులైలో అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీకి రూ.50కోట్లు లభ్యమయ్యాయి. కుప్పలుకుప్పలుగా ఉన్న నోట్ల కట్టల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన అనంతరం టీఎంసీ పార్థ చటర్జీని మంత్రి పదవితో పాటు పార్టీ బాధ్యతల నుంచి తొలగించింది. చదవండి: బయటి వ్యక్తులు తుపాకులు, బాంబులతో దిగారు -
ఊహించని షాక్.. జైలుకు పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలు
కోల్‌కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీలకు ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు. ఈడీ కస్టడీ నేటితో ముగియనుండంతో 14 రోజులు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారు మరో 14 రోజులు జైలులో ఉండనున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. పాఠశాల నియామకాల స్కామ్‌లో నటి అర్పితా ముఖర్జీ నివాసాల్లో సోదాని నిర్వహించిన ఈడీ పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. జులై 23న పార్థ ఛటర్జీ, నటి అర్పితా ముఖర్జీలని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి వారు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం మమతా బెనర్జీ. అలాగే.. పార్టీ పదవుల నుంచి సైతం తొలగించారు. మరోవైపు.. తన నివాసంలో దొరికిన డబ్బులు పార్థ ఛటర్జీవేనని ఈడీకి తెలిపారు నడి అర్పితా ముఖర్జీ. ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే -
అర్పిత ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ నియామకాల కుంభకోణం దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకేం సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెప్తుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ చెప్తున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైంలో తన ఇంట్లో ఆ డబ్బును పార్థనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారంటూ ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ తరుణంలో.. ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఈడీ బయటపెట్టింది. అర్పితా ముఖర్జీకి చెందిన దాదాపు 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీగా పార్థ ఛటర్జీ పేరు ఉందని ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాదు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు. కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు నిందితులిద్దరూ నగదు రూపంలోనే చేశారు. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిపెట్టాల్సి ఉంది అని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మనీల్యాండరింగ్ కేసులో పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాతే అరెస్ట్ చేసింది ఈడీ. అర్పితాకు చెందిన ఇళ్ల నుంచి సుమారు రూ. 50 కోట్ల నగదు, ఐదు కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది కూడా. ఆపై ఈడీ ఈ ఇద్దరినీ తమ కస్టడీలోకి తీసుకోగా.. ఆగస్టు 5వ తేదీతో ఆ కస్టడీ ముగియనుంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ సతీమణికి ఈడీ సమన్లు -
ఆ డబ్బంతా నాది కాదు.. నాకేం తెలియదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో దొరికిన డబ్బంతా తనది కాదని.. తాను లేనప్పుడు డబ్బంతా ఇంట్లో పెట్టారని ఆమె వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న అర్పితను మంగళవారం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళుతున్నప్పుడు ఆమె మీడియాతో మాట్లాడారు. కాగా, తన ఇంట్లో దొరికిన డబ్బంతా పార్థా ఛటర్జీదేనని ఈడీ విచారణలో అర్పితా ముఖర్జీ చెప్పినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. తన ఇంటిని మినీ బ్యాంక్‌లా ఆయన వాడుకున్నారని, డబ్బు దాచిన గదిలోకి తొంగి కూడా చూడకుండా తనను కట్టడి చేశారని వాపోయారు. అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించి 50 కోట్ల రూపాయలకు పైగా నగదు, ఆభరణాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్పిత చేసిన వ్యాఖ్యలను బట్టే చూస్తే పార్థా ఛటర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనబడుతోంది. ఈడీ విచారణలో పార్థా ఛటర్జీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. అయితే తనను ఈ కేసులో ఇరికించారని పార్థా ఛటర్జీ అంటున్నారు. అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన డబ్బులు తనవి కాదని, సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. (క్లిక్: పార్థా ఛటర్జీకి అవమానం.. ముఖం మీదే చెప్పులు విసిరి..) -
మెడికల్ చెకప్‌కి వెళ్లిన ఛటర్జీకి అవమానం!... ముఖం మీదే చెప్పులు విసిరి.....
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది. ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది. (చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!) -
పార్థ చటర్జీ ఎఫెక్ట్.. మమత కేబినెట్లో మార్పులు!
కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. అయితే కేబినెట్లో స్వల్ప మార్పులే ఉంటాయా లేక మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు అనంతరం కేబినెట్లో మార్పులు చేస్తామని మమతా బెనర్జీ గతవారమే తెలిపారు. అప్పటివరకు ఆయన శాఖలన్నీ తనవద్దే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కేబినెట్ భేటీ జరుగుతోంది. పార్థ చటర్జీ శాఖలను పార్టీలోని ఇతర నేతలకు అప్పగిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కేబినెట్లో సమూల మార్పులుంటాయా అనే విషయంపై మాత్రం తమకు తెలియదని పేర్కొన్నాయి. పార్టీలో ఒక్కరికి ఒకే పదవి ఉండాలని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలోనే చెప్పారు. ఆ నిబంధన మేరకు ఇకపై ఒక్క మంత్రికి ఒకే శాఖ కేటాయించాలనే యోచనలో మమత ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు. అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించమే గాక, పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు సీఎం మమతా బెనర్జీ. ఆ సమయంలో ఆయన వద్ద ఐదు శాఖలు ఉండటం గమనార్హం. చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది మృతి.. పలువురికి గాయాలు -
ఆ నటి ఇంట్లోని నోట్ల కట్టలపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు!
కోల్‌కతా: ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ తనపై వచ్చిన ఆరోపణలను మరోమారు తోసిపుచ్చారు. తన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ నివాసంలో దొరికిన డబ్బుల కట్టలు తనవి కావని పేర్కొన్నారు. తాను అరెస్టయిన తర్వాత కుట్ర జరిగిందని ఆరోపించారు. వైద్య పరీక్షల కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లిన క్రమంలో మీడియాతో మాట్లాడారు పార్థా ఛటర్జీ. ‘సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఆ డబ్బులు నావి కావు.’ అని పేర్కొన్నారు. టీచర్ నియామకాల్లో అవకతవకలపై మాజీ మంత్రి సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మూడు ఇళ్లల్లో సుమారు రూ.52 కోట్లు, విలువైన ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకుంది. అనంతరం విచారించగా.. ఆ డబ్బంతా మంత్రిదేనని, తన ఇంట్లోని గదులను ఉపయోగించుకునే వారని ఈడీకి చెప్పారు. ఆ గదుల్లోకి తాను సైతం వెళ్లేందుకు అనుమతించేవారు కాదని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు -
2001లో కేవలం రూ.6,300.. 2022లో కోట్లకు చేరిన మంత్రి సంపద..
కోల్‌కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు మొత్తం రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని కోట్లున్న మాజీ మంత్రి వద్ద పదేళ్ల క్రితం కేవలం రూ.6,300 ఉన్నాయంటే నమ్మగలరా? 2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థ చటర్జీ సమర్పించిన అఫిడవిట్లో ఆయన వద్ద రూ.6,300 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మొత్తం 23 రెట్లు పెరిగింది. ఈసారి అఫిడవిట్లో తన వద్ద రూ.1,48,676 నగదు ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అవినీతి కేసులో మంత్రి సన్నిహితుల ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం రాజకీయంగా కలకలం రేపింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీలోని అని పదవుల నుంచి తప్పించింది. ఇంకా పార్థ చటర్జీ, ఆయన సన్నిహితులకు సంబంధించిన నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన మాత్రం తనపై కుట్ర చేస్తున్నారని అంటున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందనడం గమానార్హం. చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి -
నాలుగు కార్లలో ఏముంది.. నటి అర్పితా ముఖర్జీ కేసులో మరో ట్విస్ట్
Arpita Mukherjee.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న నటి అర్పితా ముఖర్జీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ దాడుల్లో భాగంగా కోల్‌కత్తాలోని అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌లో రికార్డు స్థాయిలో రూ. 50కోట్లు వరకు నగదు, కిలోల చొప్పున బంగారం దొరికింది. కానీ, అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు కార్లు మాత్రం కనిపించకపోవడం మిస్టరీగా మారింది. ఈ కార్లులో భారీ ఎత్తున్న డబ్బు తరలించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, మిస్సైన కార్లను ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్వీ, మెర్సిడెస్ బెంజ్ కార్లుగా ఈడీ వర్గాలు గుర్తించాయి. ఈ కార్లలో నగదు ఉన్నట్టు వెల్లడించారు. ఇక, అర్పితా ముఖర్జీ అరెస్ట్ సమయంలో ఆమె ఇంట్లో కేవలం తెలుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే ఉందని.. ఆ కారును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా కనిపించకుండాపోయిన కార్లను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. అవినీతి, అక్రమార్జన ఆరోపణల నేపథ్యంలో పార్థా ఛటర్జీకి టీఎంసీ బిగ్ షాకిచ్చింది. ‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు. 4 luxury cars missing from Partha Chatterjee aide Arpita Mukherjee's residence.#ArpitaMukherjee #ParthaChaterjee #nvbcnews pic.twitter.com/0tyvp0iJS8 — NVBC News (@NewsNvbc) July 29, 2022 ఇది కూడా చదవండి: మంత్రి పార్థా ఛటర్జీకి షాకిచ్చిన సీఎం మమత -
బెంగాల్ కేబినెట్ నుంచి పార్థ ఛటర్జీ బర్తరఫ్
-
Partha Chatterjee: పార్థా ఛటర్జీపై సీఎం మమత బెనర్జీ వేటు
కోల్‌కత: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు. టీచర్ల నియామకానికి సంబంధించిన కేసులో ఛటర్జీ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వాణిజ్యం, పరిశ్రమల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రికన్స్ట్రక్షన్ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. (చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు) అవన్నీ చెప్పలేం ‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని మమత పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు. కాగా, టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు స్కామ్‌లో పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు గుర్తించిన ఈడీ కేసులు నమోదు చేసి విచారిస్తోంది. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని రికవరీ చేసింది. ఇవేకాకుండా స్థిరాస్తులు, విదేశీ నగదు ఎక్చేంజీకి సంబంధించిన పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. (చదవండి: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్) -
పార్థా ఛటర్జీ ఇంట్లో చోరీ.. ‘ఈడీ రైడ్’గా భావించి వదిలేశారటా!
కోల్‌కతా: టీచర్ నియామక కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసి విచారిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే ఆయనకు సంబంధించి నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రెండు సార్లు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది. మంత్రికి సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఈడీ దాడుల వేళ మంత్రి ఫార్థా ఛటర్జీకి సంబంధించిన సౌత్ 24 పరగానాల ప్రాంతంలోని నివాసంలో చోరీ జరిగింది. జులై 27న బుధవారం రాత్రి ఓ దొంగ ఇంట్లోకి దూరి అందినకాడికి దోచుకెళ్లాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి ఇంటి తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లాడు దొంగ. పెద్ద పెద్ద బ్యాగుల్లో పార్థా ఛటర్జీ ఇంట్లోంచి చాలా వస్తువులు తీసుకెళ్లాడు. అయితే.. ఆ దొంగను గమనించిన స్థానికులు అది మరో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేడ్ రైడ్‌గా భావించారటా. అలా వారు అనుకోవటమే ఆ దొంగకు అదృష్టంగా మారింది. అందినకాడికి దోచుకెళ్లాడు. ఛటర్జీకి సన్నిహితురాలైన నటి అర్పిత ముఖర్జీ రెండో అపార్ట్మెంట్లో బుధవారం దాడులు చేసిన ఈడీ రూ.28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా నగలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ముఖర్జీకి చెందిన మరో ఇంటిలో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే -
బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీకి ఊహించని షాక్!
partha chatterjee.. బెంగాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్‌ల వ్యవహారం దేశంలోనే హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, నటి అర్పితా ముఖర్జీ, పార్థా చటర్జీల ఈడీ విచారణలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత పార్థా ఛటర్జీకి షాకిచ్చారు. టీఎంసీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఛటర్జీని మంత్రి వర్గం నుంచి, పార్టీ పదవుల నుంచి, టీఎంసీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పు అయితే.. తనను అన్ని పదవులను నుంచి తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు కూడా కునాల్ ఘోష్.. పార్థా ఛటర్జీ అవినీతిపై ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు టీఎంసీ నేతల పరువును దిగజాచార్చాయి. పార్థా చటర్జీ తనకే కాకుండా రాష్ట్రానికి కూడా అప్రతిష్ట తీసుకువచ్చారని విమర్శలు చేశారు. Partha Chatterjee should be removed from ministry and all party posts immediately. He should be expelled. If this statement considered wrong, party has every right to remove me from all posts. I shall continue as a soldier of @AITCofficial. — Kunal Ghosh (@KunalGhoshAgain) July 28, 2022 ఇదిలా ఉండగా.. అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. మరోవైపు.. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాల్లో కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో అధికారులు తరలించారు. ఇది కూడా చదవండి: అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలు.. మంత్రితో సంబంధం ఉన్న మరో మహిళ ఎవరు? -
బాప్రే.. అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాల కుంభకోణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది కూడా. ఈ తరుణంలో అర్పిత నుంచి కీలక సమాచారం బయటపడుతోంది. తాజాగా ఆమెకు చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఆమె ఇంట్లో ఓ గది సెల్ఫ్ నుంచి కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. అందులో పార్థా ఛటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. రాజ్‌దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాలు ముగిశాయి. కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో తరలించారు అధికారులు. #WATCH | West Bengal: Hugh amount of cash, amounting to at least Rs 15 Crores, recovered from the residence of Arpita Mukherjee at Belgharia. She is a close aide of West Bengal Minister Partha Chatterjee. pic.twitter.com/7MMFsjzny1 — ANI (@ANI) July 27, 2022 మరో మహిళ ఎవరు? ఇదిలా ఉంటే.. స్కూల్ టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం దర్యాప్తులో భాగంగా ఈడీ చేపట్టిన సోదాల్లో.. గత శుక్రవారం అర్పితా ముఖర్జీ ఇంట్లో కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అదే సమయంలో మంత్రి పార్థా ఛటర్జీని సైతం ఈడీ ప్రశ్నించింది. ఇక శనివారం మనీలాండరింగ్ కేసులో పార్థా ఛటర్జీతో పాటు అర్పితా ముఖర్జీలను ఈడీ అరెస్ట్ చేసింది. ఆగష్టు 3వ తేదీ వరకూ ఈ ఇద్దరూ ఈడీ కస్టడీలోనే ఉంటారు. ఇక విచారణలో.. అర్పితా ముఖర్జీ మరో మహిళ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పార్థ చటర్జీ తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని మినీ బ్యాంక్‌గా వాడుకునేవారని, పదిరోజులకొకసారి పార్థా ఛటర్జీ, ఆయన అనుచరులు ఇంటికి వచ్చే వాళ్లని, డబ్బు దాచేవాళ్లని అర్పితా ముఖర్జీ అంగీకరించింది. అయితే మరో మహిళ ఎవరనే విషయంపై మాత్రం అధికారులు ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: అర్పిత ముఖర్జీ ఎవరంటే.. రాజీనామానా? దేనికి.. ఇదిలా ఉంటే.. పార్థా ఛటర్జీ బెంగాల్లో సీనియర్ రాజకీయ నేత. టీఎంసీ తరపున ఆయన కేబినెట్‌తో పాటు పలు కీలక భాద్యతలు చేపట్టారు కూడా. కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది ఆయనకు మీడియా నుంచి. దానికి ఆయన మండిపడ్డారు. ఎందుకు? ఏ కారణంతో రాజీనామా చేయాలి? అని అసహనం ప్రదర్శించారు. గవర్నర్‌కు ఫిర్యాదు కేబినెట్ మంత్రిపై ఆరోపణలు.. అరెస్ట్ జరిగినా టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ స్పందించకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్థా ఛటర్జీని మంత్రి పదవుల నుంచి తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. గవర్నర్ లా గణేశన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆధారాలు స్పష్టంగా ఉన్నా ఆమె(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ..) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాను మాత్రమే మంచి వ్యక్తినని.. ఎదుటివాళ్లు చెడ్డవాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆమె అని అధికారి సువేందు గవర్నర్‌నుకలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చదవండి: మంత్రి అరెస్టుపై సీఎం మమత కీలక వ్యాఖ్యలు -
మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్‌కతా: నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వీరిలో 21 మంది నేరుగా తనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుఫాన్ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ అన్నారు. ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. దీంతో మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు బెంగాల్లో కలకలం రేపుతున్నాయి. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ.. ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ.2000కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు. అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు వివరించారు. ఒకవేళ బీజేపీ వాళ్లను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు మిథున్ చక్రవర్తి. మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ 70 పైచిలుకు స్థానాలతో సరిపెట్టుకుంది. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
డబ్బంతా మంత్రిదే.. నా ఇంటికి వారానికోసారి వచ్చేవారు: నటి అర్పిత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈడీ విచారణలో నటి అర్పితా ముఖర్జీ.. పార్థా ఛటర్జీ గురించి కీలక విషయాలు తెలిపారు. అయితే, విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ.. తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్టు అర్పిత తెలిపారు. ఓ బెంగాలీ నటుడు తనను మంత్రికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లో దొరికిన రూ. 21కోట్ల డబ్బు పార్థా ఛటర్జీదేనని తెలిపారు. ఈ క్రమంలోనే పార్ధా తన ఇంట్లో ఉన్న ఓ రూమ్‌లోనే డబ్బును దాచాడని పేర్కొంది. తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంక్‌లా వాడుకున్నట్లు ఆరోపించారు. తన ఇంట్లోని రూమ్‌కు ఫుల్ సెక్యూర్టీగా పార్థా మనుషులే ఉండేవారని చెప్పింది. వారు మాత్రమే రూమ్ లోపలి వెళ్లి వచ్చేవారని స్పష్టం చేసింది. కాగా, తన ఇంటికి పార్థా ఛటర్టీ.. వారంలో ఒక్కరోజు లేదా 10 రోజులకు ఒకసారి వచ్చి వెళ్లే వారని తెలిపారు. వచ్చిన తర్వాత రూమ్‌లోకి వెళ్లి డబ్బులు చెక్ చేసుకునే వారిని వెల్లడించింది. అయితే, ఆ డబ్బంతా.. కాలేజీల విషయంలోనే లంచాల రూపంలో వచ్చిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. వీరిద్దరూ ఆగస్టు 3వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. దీంతో విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. #WATCH | Kolkata | West Bengal Min & former Education Min Partha Chatterjee and his close aide, Arpita Mukherjee brought to ESI Hospital for medical examination. As per court order, their Medical check-up should be done after every 48 hours. They are in… pic.twitter.com/pGpn7DXXII — Abhay Pandya (@abhaypndya) July 27, 2022 ఇది కూడా చదవండి: వాళ్లకు పూలు.. మాకు బుల్డోజర్లా?: యోగి సర్కార్‌పై ఒవైసీ కామెంట్లు -
నల్ల డైరీలో కీలకాంశాలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ అక్రమ నియామకాలకు సంబంధించిన స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పురోగతి సాధించింది. సోదాల్లో భాగంగా నాటి విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన ఇంట్లో నలుపు రంగు డైరీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కామ్‌కు సంబంధించిన కీలక ఆధారాలు అందులో రాసి ఉన్నట్లు ఈడీ చెబుతోంది. దీంతో దర్యాప్తు సరైన మార్గంలో కొనసాగేందుకు వీలవుతుందని ఈడీ అధికారులు చెప్పారు. బెంగాల్ ఉన్నత విద్య, పాఠశాల విద్యా విభాగానికి సంబంధించిన ఆ డైరీలోని 40 పేజీల్లో చాలా వివరాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పార్థా, అర్పితాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ నుంచి నేరుగా కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు తీసుకొచ్చి పార్థాను ప్రశ్నించారు. దీంతోపాటు గతంలో పశ్చిమబెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాఛార్యకు ఈడీ సమన్లు జారీచేసింది. బుధవారం కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు వచ్చిన వాంగ్మూలం ఇవ్వాలని ఈడీ ఆదేశించింది. ఈడీ గతంలోనే మాణిక్ ఇంట్లో సోదాలుచేయడం తెల్సిందే. కాగా, పార్థాను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి లేఖ రాశారు. -
ఇక్కడకు రాగలరా మీరు ?: స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మమతా
కోల్‌కతా: బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... బీజేపీని ఉద్దేశిస్తూ...మహారాష్ట్రలో పాగా వేసింది. ఇక చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించి అధికారం చేజక్కించుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు. అయినా మీరు ఇక్కడకు రావాలంటే... బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్, సుందరబన్స్‌లోని రాయల్ బెంగాల్ టైగర్లు, ఏనుగులు మీపై దాడి చేస్తాయ్ అంటూ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్థ ఛటర్జీ అడ్మిట్ అయిన ఎస్ఎస్కేఎం ఆస్పత్రి దేశంలోనే నెంబర్ వన్ హస్పటల్ అయినప్పటికీ ఎందుకు అభ్యంతరం చెప్పారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్పత్రి (భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కే ఆయన్ను ఎందుకు తరలించారు?. అసలు మీ ఉద్దేశం ఏమిటని నిలదీశారు. ఇది ముమ్మాటికీ బెంగాల్ ప్రజలను అవమానపరచటేమే అంటు ఆక్రోశించారు. కేంద్రం మాత్రమే మంచిది రాష్ట్రాలన్నీ దొంగలా? అంటూ బీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రాల వల్లే మీరు అక్కడ ఉన్నారు అంటూ మమతా గట్టి వార్నింగ్ ఇచ్చారు. (చదవండి: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా.. ఐసోలేషన్‌కు తరలింపు) -
ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే: అర్పితా ముఖర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తు వేళ తన ఇంట్లోంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు అంతా నాటి బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీదేనని నిందితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీలో విచారణలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామక స్కామ్‌లో భాగంగా ఈడీ సోదాల్లో ఆర్పిత ఇంట్లో రూ.20 కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ ఉన్నతాధికారి వెల్లడించారు. అర్పిత, పార్థా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలుచేయగా, సంబంధిత డాక్యుమెంట్‌ను ఈడీ స్వాధీనంచేసుకుంది. గ్రూప్ సీ, గ్రూప్ డీ తరగతి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, తుది ఫలితాలు, అపాయిమెంట్ లెటర్స్ తదితర పత్రాలూ అర్పిత ఫ్లాట్‌లో దొరికాయి. వెస్ట్ మేదినీపూర్ ఓ స్కూల్ పేరిట మంత్రి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కాగా, అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరిన మంత్రి పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చికిత్స అనవసరమని భువనేశ్వర్ ఎయిమ్స్ ప్రకటించింది. కాగా, మంత్రి, అర్పితలను ఆగస్ట్ మూడో తేదీ దాకా ఈడీ కస్టడీలోకి అప్పజెప్తూ ఈడీ కోర్టు ఆదేశాలిచ్చింది. -
అవినీతి కేసులో మంత్రి అరెస్టుపై సీఎం మమత కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: అవినీతికి పాల్పడే వారు, తప్పులు చేసే వారికి తాను మద్దతుగా నిలువబోనని చెప్పారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎవరైనా తప్పు చేసినట్లు నిరూపితమైతే వాళ్లకి యావజ్జీవ శిక్ష పడినా తానేం అనుకోనని తెలిపారు. అలాంటి వ్యవహారాల్లోకి తన పేరు లాగొద్దని సూచించారు. తాను ప్రభుత్వం నుంచి వచ్చే జీతం కూడా తీసుకోవట్లేదని వెల్లడించారు. మంత్రి అవినీతికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోయానని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానని మమత పేర్కొన్నారు. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసిన రెండు రోజులకు మమత ఈమేరకు స్పందించారు. ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తప్పులు చేసినవారికి సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇవ్వాలని మమత అన్నారు. అందరూ సాధువులు అని తాను భావించట్లేదని, కానీ ఇప్పటివరకు తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. మంత్రికి మరిన్ని అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అయితే అరెస్టు అయిన అనంతరం సీఎం మమతా బెనర్జీకి పార్థ చటర్జీ నాలుగుసార్లు ఫోన్ కాల్ చేశారని వార్తలొచ్చాయి. టీఎంసీ మాత్రం వీటిని ఖండించింది. చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. అర్పితకు కానుకలు! -
ముఖ్యమంత్రికి మూడుసార్లు ఫోన్ చేసిన అరెస్టయిన మంత్రి.. కానీ!
కోల్‌కతా: పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పాఠశాల ఉద్యోగాల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో శనివారం అరెస్టయిన మంత్రి.. తమ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేయటం వరకు బాగానే ఉన్నా... ఆయన చేసిన కాల్స్‌కు మమత ఎలాంటి స్పందన ఇవ్వకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తాము అరెస్టయిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు గానీ.. స్నేహితులకు గానీ తెలియజేసేందుకు ఫోన్ చేసే అవకాశాన్ని నిందితులకు పోలీసులు కల్పిస్తారు. ఈ అవకాశాన్ని అందుకున్న డెబ్బై ఏళ్ల పార్థ ఛటర్జీ.. తమ అధినేత్రి మమతాబెనర్జీకి మూడుమార్లు ఫోన్ చేసినట్టు అరెస్ట్ మెమోలో పోలీస్ అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి 55 నిమిషాల సమయంలో మంత్రి అరెస్టు కాగా.. 2 గంటల 33 నిమిషాలకు మొదటి కాల్ చేశారు. కానీ.. ఆ సమయంలో మమతా ఆ కాల్‌కు స్పందించలేదు. ఆ తర్వాత.. వేకువజామున 3 గంటల 37 నిమిషాలకు కూడా ఫోన్ చేయగా.. మమత నుంచి మళ్లీ ఎలాంటి స్పందన లభించలేదు. తిరిగి.. ఉదయం 9 గంటల 35 నిమిషాలకు మరోసారి ఫోన్ చేసినా పార్థ ఛటర్జీకి నిరాశే ఎదురైంది. ఈ విషయాన్ని అరెస్టు మెమోలో పోలీసున్నతాధికారులు పేర్కొన్నారు. చదవండి: కుక్కల కోసం లగ్జరీ ఫ్లాట్.. పార్థ చటర్జీ ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు అయితే ఈ విషయాన్ని తృణముల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. అరెస్టయిన మంత్రి సీఎం మమతాబెనర్జీకి ఫోన్ చేసే ప్రసక్తేలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మొబైల్ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు.. సీఎంకు ఫోన్ ఎలా చేయగలరని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఏయిడెడ్ పాఠశాలల్లో.. ఉపాధ్యాయుల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డట్టు మంత్రిపై అభియోగం ఉంది.దీంతో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో ఆయన నివాసంలో సుమారు 20 కోట్ల నగదు లభించగా.. మంత్రిని ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత.. మంత్రి అనారోగ్యానికి గురికావటంతో.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించటంతో.. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రి పార్థ ఛటర్జీని ఈరోజు ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌లోని ఏయిమ్స్‌కు తరలించారు. కాగా.. దృశ్య మాధ్యమం ద్వారా విచారణకు హాజరుకావాలని మంత్రికి న్యాయస్థానం తెలిపింది.