peddireddy ramchandrareddy
-
చంద్రబాబుకి వయసుకు తగ్గ సంస్కారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: చంద్రబాబుకి వయసుకు తగ్గ సంస్కారం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకి తనపై తనకు నమ్మకంలేదని విమర్శించారు. బాబు.. తన తాబేదార్లతో మాట్లాడించుకోవడం తగ్గించుకోవాలని.. లేకుంటే అదే స్థాయిలో సమాధానం చెబుతామని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. కుప్పం నియోజక వర్గంలో బాబు చేసిన అభివృద్ధి శూన్యం అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత బాబు.. కుప్పం వచ్చే పరిస్థితి ఉండదని మంత్రి పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు.. -
పరిషత్ ఎన్నికల ఫలితాలు: సీఎం జగన్‌ను కలిసి అభినందనలు తెలిపిన పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ నూతన రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకోవడంతో, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డుని నమోదు చేసింది. చదవండి: సచివాలయాల్లోనే ‘వన్‌టైం సెటిల్మెంట్’ -
నా మాటల్ని 100శాతం వక్రీకరించారు: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ‘‘ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప.. ఎల్లో మీడియాకు మరోకటి రాయాలనిపించడం లేదు.. నేను మాట్లాడింది కాకుండా.. ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు రాసింది.. నా మాటల్ని 100 శాతం వక్రీకరించింది’’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎల్లో మీడియా దివాళాకోరుతనంగా వ్యవహరిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును ఓర్చుకోలేక పోతున్నారు. చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియా రాస్తోంది. బాబు, ఎల్లో మీడియా కలిసి కుట్రలు పన్నుతున్నారు’’ అంటూ మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయన ఎల్లో మీడియాకు బంట్రోతుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రఘురామకృష్ణంరాజు సిగ్గులేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సిగ్గుంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. వార్డు మెంబర్ కాని రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎంపీ అయ్యారు. కొమ్ములు లేని దున్నపోతుతో ఆయనను పోల్చవచ్చు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి. ‘‘చంద్రబాబు స్క్రిప్ట్‌నే ఆయన చదువుతున్నారు. బ్యాంకులను వేల కోట్లు మోసం చేసిన చరిత్ర రఘురామ కృష్ణంరాజుది. దమ్ముంటే ఆయన తన పదవికి రాజీనామా చేసి గెలవాలి. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు హుందాగా వ్యవహరించాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచారు.. సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదు. చంద్రబాబు వ్యవహారమంతా చీకటి ఒప్పందాలు చేసుకోవడమే’’ అంటూ పెద్దిరెడ్డి మండిపడ్డారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి ‘రఘురామ కృష్ణంరాజు ముక్కు నేలకు రాయాలి’ -
జిల్లాలో మూడు కొత్త రిజర్వాయర్లు
తిరుపతి సెంట్రల్ : జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 15టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా మూడు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వేకోసం సీఎం అంగీకరించారని వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కటి ఐదేసి టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేలా నేటిగుట్టపల్లి, ఉప్పరపల్లి, పూతలపట్టు వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వే కోసం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైద్య చికిత్సల వల్ల నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న 48 మంది బాధితులకు తిరుపతిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 58.70 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 46 వేల కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికీ తాగునీరు అందించనున్నామని. తెలంగాణలో ఇప్పటికే వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో ప్రతి ఇంటికీతాగునీరు అందిస్తున్నారని తెలిపారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా అనుకున్నంత నీరు అందడం లేదని, అక్రమంగా నీటిని మళ్లిస్తుండడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు త్వరలోనే స్థానిక ఎన్నికలు రానున్నాయని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు ఈ ప్రక్రి య పూర్తవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయాల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 25 లక్షల ఇండ్లను ఇవ్వనున్నామని తెలిపారు. గతంలో జిల్లాలో నరేగా పనుల్లో అవకతవకలు జరిగా యని, వీటిపై విచారణ పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లించే యోచనలో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. -
అటు నుంచి 40 మంది రారని గ్యారంటీ ఉందా?
హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో నీతులు చెప్పారని.. ఇప్పుడు ఆయన ఏపీలో చేస్తున్నది ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి విమర్శించారు. 10 మందిని తీసుకెళ్తా అని చెప్పిన చంద్రబాబు కేవలం నలుగురిని మాత్రమే చేర్చుకోగలిగారని, దీంతో ఆయన ఏంటన్నది అందరికీ తెలిసిపోయిందని అన్నారు. తమ పార్టీ వాళ్లు నలుగురు ఆ పార్టీలోకి వెళితే టీడీపీ నుంచి 40 మంది తమ పార్టీలోకి రారని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఓ మాట, ఇక్కడ ఓ మాట మాట్లాడుతున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మాట్లాడినట్లే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాలు చేశారు. తమకు మెజార్టీ ఉన్నా అక్రమంగా జిల్లా పరిషత్ లను కైవసం చేసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి బాబు సీఎం అయ్యారని, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అక్కడ కేసీఆర్ చేశారు. ఇక్కడ నేను చేస్తాను అంటే నీ నైతికత ఏంటి చంద్రబాబూ అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. టీడీపీ నుంచి వెళ్లి పోయిన తర్వాత రాజీనామా చేసి ఓసారి, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు రెండుసార్లు రాజీనామా చేసి ఎన్నికలల్లో పోటీచేసి గెలిచారన్నారు. టీడీపీలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. దమ్ముంటే ఎన్నికల్లో మళ్లీ గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. నైతికత లేని నేత ఎవరంటే ఒక్క చంద్రబాబు తప్ప ఎవరూ లేరని, ప్రజలు ఇదే విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశావు బాబూ.. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉండి పాలించావు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తనపై ఓటుకు కోట్లు కేసులు వేశారని వాపోయిన చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్ తో ఏమైనా సెటిల్ మెంట్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అర్హత కోల్పోతున్నామా అని అడిగారు. నిజంగానే చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఈ మూడేళ్లే కాదు.. మరో 5 ఏళ్లు రాష్ట్రాన్ని మీ చేతుల్లోనే పెడతామని చెప్పారు. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రెండేళ్లు మిమ్మల్ని భరించారని, ఇంకా ఆయన పరిపాలన కొనసాగితే ఇంకెన్ని దుష్పరిణామాలు తలెత్తుతాయోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎవరో పార్టీ నుంచి వెళ్లిపోయారని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు. -
'ఎన్నికలు జరిగితే బాబుకు డిపాజిట్లూ రావు'
పుంగనూరు(చిత్తూరు జిల్లా): ‘‘ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ గల్లంతు కావడం ఖాయం. వైఎస్సాఆర్సీపీదే అధికారం. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి. మేం ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తాం. పార్టీని వదిలి మునిగిపోయే నావలోకి వెళ్లం’’ అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునిల్‌కుమార్ స్పష్టంచేశారు. పుంగనూరు మండలం వేపమాకులపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన పల్లె బాట కార్యక్రమంలో ఈ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్న నూతన రాజధాని పేరుతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తెలంగాణలో ప్రజలు టీడీపీని భూ స్థాపితం చేశారని, అలాగే ఆంధ్రలోనూ ఆ పార్టీ కనుమరుగవుతుందన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి వస్తుందని చెప్పారు. చంద్రబాబునాయుడుకు అధికార దాహం ఎక్కువని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. అధికారం కోసం ఆయన మామకే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల పేరుతో రూ.600 కోట్లు, పట్టిసీమ పేరుతో రూ.1300 కోట్లు, రాజధాని పేరుతో వేలకోట్లు స్వాహా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునిల్‌కుమార్ మాట్లాడుతూ దళిత కుటుంబంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అంటూ దళితులను అవమానపరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సిగ్గులేకుండా దళిత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాము వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో చివరిదాక పనిచేస్తామని, తెలుగుదేశం కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. -
'సొంత నియోజకవర్గంలో మంత్రి అక్రమాలు'
తిరుపతి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాక్షసపాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నారాయణ స్వామి, నియోజకవర్గం ఇన్ఛార్జీ బియ్యపు మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ లేని విధంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే అక్రమాలకు పాల్పడుతున్నారని వీరు ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడతున్నారని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నేతలకు తగిన శాస్తి తప్పదని శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తల బరోసయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలు అధికార పార్టీ నేతలకు సూచించారు.