సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ నూతన రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడంతో, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డుని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment