జిల్లాలో మూడు కొత్త రిజర్వాయర్లు | Three New Reservoirs Projects in Chittoor | Sakshi
Sakshi News home page

జిల్లాలో మూడు కొత్త రిజర్వాయర్లు

Published Sat, Dec 21 2019 11:00 AM | Last Updated on Sat, Dec 21 2019 11:00 AM

Three New Reservoirs Projects in Chittoor - Sakshi

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి సెంట్రల్‌ :  జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 15టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా మూడు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వేకోసం సీఎం అంగీకరించారని వెల్లడించారు.  ఇందులో భాగంగా ఒక్కొక్కటి ఐదేసి టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేలా నేటిగుట్టపల్లి, ఉప్పరపల్లి, పూతలపట్టు వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వే కోసం సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెప్పారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో  వైద్య చికిత్సల వల్ల నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న 48 మంది బాధితులకు తిరుపతిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 58.70 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.  రాష్ట్రంలో 46 వేల కోట్ల రూపాయలతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికీ తాగునీరు అందించనున్నామని. తెలంగాణలో ఇప్పటికే వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుతో ప్రతి ఇంటికీతాగునీరు అందిస్తున్నారని తెలిపారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా అనుకున్నంత నీరు అందడం లేదని, అక్రమంగా నీటిని మళ్లిస్తుండడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు.  

త్వరలోనే స్థానిక ఎన్నికలు
త్వరలోనే స్థానిక ఎన్నికలు రానున్నాయని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు ఈ ప్రక్రి య పూర్తవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయాల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 25 లక్షల ఇండ్లను ఇవ్వనున్నామని తెలిపారు. గతంలో జిల్లాలో నరేగా పనుల్లో అవకతవకలు జరిగా యని, వీటిపై విచారణ పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లించే యోచనలో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement