Post Production
-
‘యానిమల్’లో గీతాంజలిగా రష్మికా మందన్నా
‘మీ గీతాంజలి’ అంటూ ‘యానిమల్’లో రష్మికా మందన్నా చేస్తున్న పాత్ర పేరు ప్రకటించి, శనివారం లుక్‌ని విడుదల చేసింది యూనిట్. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ఈ 28న రిలీజ్ కానుంది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. -
‘గాంఢీవధారి అర్జున’ టీజర్ వచ్చేస్తుంది
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు వరుణ్ తేజ్. ఇందులో అర్జున్ అనే సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించారని, ఓ విపత్తు నుంచి ప్రజలను రక్షించేందుకు అర్జున్ ఎటువంటి సాహసాలు చేశాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. -
ఎవరు?
నటుడు, దర్శక–నిర్మాత జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీసిన తాజా చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్స్ గా నటించారు. రెడ్డెమ్మ బాలాజీ.కె నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా రెడ్డెమ్మ బాలాజీ.కె మాట్లాడుతూ–‘‘ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హూ’. ఈ మూవీలో జేడీ చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్ చంద్. -
ఓ తండ్రి తీర్పు
రాజేందర్ రాజు కాంచనపల్లి, సురభి శ్రావణి జంటగా ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో శ్రీరామ్ దత్తి నిర్మించిన చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘ప్రేమ, ఆప్యాయతలు పంచుకోవాల్సిన తల్లిదండ్రులు, పిల్లల స్వార్థపు మత్తులో ఎలా దూరం అవుతున్నారు? ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు? అనేది ఈ చిత్రకథాంశం. ఇందులో రాజేంద్ర రాజు ఆత్మీయత పంచే అల్లుడుగా నటించారు. ఆయన రాసిన ‘అమ్మానాన్నలు తెగిన గాలిపటాలు..’ టైటిల్ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. అలాగే క్లైమాక్స్‌లో ఆయన రాసిన డైలాగ్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ చెటిపల్లి, సంగీతం: బాపు శాస్త్రి, రచన–దర్శకత్వ పర్యవేక్షణ: రాజేంద్ర రాజు కాంచనపల్లి. -
పలాసకి మించి ఆపరేషన్ రావణ్
‘‘పలాస’ నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి’ అంటూ గతంలో చెప్పాను. ఇప్పుడు అంతకు మించిన నమ్మకంతో చెబుతున్నాను. ‘పలాస’కి మించి ‘ఆపరేషన్ రావణ్’ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. మా నాన్న వెంకట సత్య వరప్రసాద్‌గారు బాగా డైరెక్ట్ చేశారు’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్ థ్రిల్‌ను దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రసాద్‌గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. కానీ ట్రైలర్ చూశాక చాలా బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా బాగా రావడానికి కారణం రాధికగారు’’ అన్నారు వెంకట్ సత్య. ‘‘ఆపరేషన్ రావణ్’ మంచి చిత్రం’’ అన్నారు నటి రాధిక. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి. -
అలా నిన్ను చేరి ఫ్యామిలీ ఎంటర్టైనర్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నూతన దర్శకుడు మారేష్ శివన్ తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. త్వరలోనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: ఐ ఆండ్రూ. -
యాత్ర 2 ఉంటుంది.. జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై...
‘‘యాత్ర’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్రంలోని పాత్రలకు తగ్గ నటీనటులు కుదరడం లేదు. పూర్తి కథ, నటీనటులు ఫైనల్ అయ్యాక ‘యాత్ర 2’ ని సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అని డైరెక్టర్ మహీ వి.రాఘవ్ అన్నారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, హర్షవర్ధన్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. మహీ వి.రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మహీ వి.రాఘవ్ పంచుకున్న విశేషాలు... ► మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘సేవ్ ది టైగర్స్’ నిరూపించింది. కుటుంబం అంతా కలిసి మా వెబ్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. దీంతో ఒక మంచి సిరీస్ తీశామనే తృప్తి ఉంది. ఇలాంటి చక్కని సిరీస్‌ని నిర్మించే అవకాశం మాకు కల్పించిన డిస్నీ హాట్‌స్టార్‌కి థ్యాంక్స్. త్వరలో ‘సేవ్ ది టైగర్స్’ రెండో సిరీస్ షూటింగ్ ప్రారంభిస్తాం. ► ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల సమయంలో ‘యాత్ర 2’ ని విడుదల చేయనున్నారని, ఆ సినిమా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నకి సపోర్ట్‌గా ఉంటుందని వినిపిస్తున్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే సినిమా వల్ల ఓట్లు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. అలా అనుకుంటే ఇతర పార్టీల వారు కూడా నాలుగైదు సినిమాలు తీసుకోవచ్చు కదా? ఓటర్లందరూ నా ‘యాత్ర’ సినిమాని చూసుంటే ‘బాహుబలి’లా పెద్ద సినిమా అయ్యేది. ఓటర్లందరూ సినిమాలు చూస్తారని అనుకోవడం లేదు. జగన్ అన్న పాదయాత్రతో... ‘యాత్ర 2’ సినిమా జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుంది. కథ మొత్తం పూర్తయ్యాక ఆ వివరాలు చెబుతాను. ప్రస్తుతం నేను దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సైతాన్’ అనే కొత్త వెబ్ సిరీస్‌తో జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. -
ఆలస్యంగా వస్తున్న జవాన్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి, కీలక పాత్రల్లో సంజయ్ దత్, దీపికా పదుకోన్ నటించారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ‘జవాన్’ సినిమాను షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. కాగా ఈ సినిమాను తొలుత జూన్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండటం ‘జవాన్’ రిలీజ్ వాయిదా పడటానికి ముఖ్య కారణమని బాలీవుడ్ సమాచారం. -
వినాయక చవితికి రజనీకాంత్ ‘జైలర్’!
గత ఏడాది రజనీకాంత్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. 2021 నవంబర్‌లో ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్నయ్య’)తో అలరించారు. సూపర్ స్టార్ సినిమా రిలీజై æ ఏడాదిన్నర అవుతోంది కాబట్టి ఆయన నటించిన తాజా చిత్రం ‘జైలర్’ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదలవుతుందనుకున్నారు కానీ, రాలేదు. తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. రజనీకాంత్ పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయిందని ఇటీవల ఈ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఓ వేడుకలో స్పష్టం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో వినాయక చవితికి సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ అంటోంది. రజనీ సరసన తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేశారు. మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. -
భారీ బడ్జెట్‌తో విజయ్ సేతుపతి ‘విడుదల’, రూ. 10 కోట్లతో రైలు సెట్
విజయ్ సేతుపతి ఉపాధ్యాయుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘విడుదలై’ (విడుదల). కానిస్టేబుల్ పాత్రను సూరి చేస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ రెండు భాగాలుగా నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మొదటి భాగం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో రూ. 10 కోట్లతో రైలు, రైలు బ్రిడ్జి సెట్ రూపొందించాం. అలాగే సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యంలో భారీ సెట్ నిర్మించాం. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కొడైకెనాల్లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడుకి వచ్చిన స్టంట్ బృందం పాల్గొంటోంది’’ అన్నారు. భవాని శ్రీ, ప్రకాశ్‌రాజ్, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: వేల్రాజ్. -
యదార్థ సంఘటన ఆధారంగా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'
Prabhutva Junior Kalasala Movie Interesting Facts: ఓ యదార్థ సంఘటన ఆధారంగా, ఆసక్తికరంగా తెరకెక్కిన చిత్రం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ఈ సినిమాకు శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. ''మా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం చెప్పిన దాని కంటే కూడా సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాతగా మాకు ఇది మొదటి సినిమానే అయినా.. అంతా తానై చూసుకున్నాడు దర్శకుడు. నటీనటులు కొత్తవారు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. మాకు ఆయన మార్గ దర్శకుడిలా మారిపోయారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం గారికి 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా టీమ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. సినిమా ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించబోతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగ్జ్ అద్భుతమైన పాటలు అందించారు. అన్ని పాటలు చక్కగా కుదిరాయి. మా సినిమాలో 4 పాటలు ఉంటాయి. ఒకపాట ప్రముఖ గాయని చిన్మయి గారు, ఇంకో పాట ప్రముఖ గాయకులు విజయ్ ఏసుదాస్ గారు పాడారు. అంతేకాకుండా ఈ పాటలకు ప్రముఖ రచయిత సాయి కిరణ్ గారు అద్భుతమైన లిరిక్స్ అందించగా సయ్యద్ కమ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు'' అని తెలిపారు. ఈ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. -
హీరోగా మ్యూజిక్ డైరెక్టర్.. మరో హర్రర్ చిత్రం '13'
చెన్నై సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ 'డార్లింగ్' (తమిళం) చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా నటిస్తోన్న చిత్రం '13'. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలిసి నటించిన 'సెల్ఫీ' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి '13' మూవీలో నటించడం విశేషం. దీన్ని ఎస్. నందగోపాల్ సమర్పణలో మద్రాస్ స్టూడియోస్, అన్షు ప్రభాకర్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నటి ఆదిత్య, భవ్య, ఐశ్వర్య నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ నిర్మాత నందకుమార్ ఫోన్ చేసి మంచి హారర్ కథ ఉంది దర్శకుడు చెబుతారు వినమని చెప్పారన్నారు. తొలి చిత్రమే హర్రర్ నేపథ్యంలో డార్లింగ్ చేయడంతో కాస్త సందేహించానన్నారు. అయితే కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి అంగీకరించానని, ఇది హర్రర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన చిత్రమని చెప్పారు. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించినట్లు వెల్లడించారు. చదవండి:👇 రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_71236443.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పోస్ట్ ప్రొడక్షన్ దశలో 'చెష్మా రాజా సెల్ఫీ రాణి'
భయపెడుతూ, నవ్విస్తూ... ఫుల్ ఎంటర్టైన్ చేసే జోనర్ ఏదైనా ఉందంటే అది హారర్ మూవీనే. అందుకే టాలీవుడ్లో వచ్చిన హారర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే హారర్ జానర్లో మరో సినిమా ఆడియన్స్‌ను అలరించనుంది. రాగిణి క్రియేషన్స్ బ్యానర్‌పై వీరేంద్రబాబు హీరోగా 'చెష్మా రాజా సెల్ఫీ రాణి' గౌతమ్ కృష్ణన్ డైరక్టర్ గా పి.శ్రీనివాసరావు, రామ్ అవధానంలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా...నిర్మాతలు పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం మాట్లాడుతూ 'ఈ చిత్రంతో వీరేంద్రబాబుని హీరోగా పరిచయం చేస్తున్నాం. హార్రర్ కామెడీ జోనర్ మూవీ. డైరెక్టర్ గౌతమ్ కృష్ణన్ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోందీ సినిమా. అలాగే ఘనశ్యామ్ మ్యూజిక్ ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. ఇందులో ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్ సంచిత పాణిగ్రహీతో పాటు గౌతమ్ రాజు, జబర్దస్త్ రాజమౌళి, రామ్ అవధానం, నైమిష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల తేదీని అనౌన్స్ చేస్తాం' అని అన్నారు. -
ఇంటర్నెట్లో అది దొరకదు!
పార్వతీశం, శ్రీవల్లి, శరణ్య, నరేన్, పోసాని కృష్ణమురళి, బాలాచారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రపటం’. బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ఆర్.బి. చౌదరి విడుదల చేశారు. బండారు దానయ్య కవి మాట్లాడుతూ– ‘‘ఇంటర్నెట్లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.. దొరకనిదల్లా భావోద్వేగం మాత్రమే. దాన్ని మా చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రి, కూతురి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’ కూడా బాగా వచ్చింది. మరో రెండు చిత్రాలు కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను’’ అన్నారు. -
తప్పు చేస్తే తప్పించుకోలేరు..
ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘తప్పించుకోలేరు’. రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహించారు. రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)–తలారి వినోద్ కుమార్ ముదిరాజ్– శ్రీనివాస్ మామిడాల–లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విలేకరుల సమావేశంలో తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ– ‘‘తప్పు చేస్తే తప్పించుకోలేరు అనేది చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రం విడుదల తర్వాత దర్శకుడు ఆర్.వి.జికి మంచి పేరు వస్తుంది. వి.ఎస్.పి. తెన్నేటి మాటలు–పాటలు, రాజేష్ రాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఆర్.వి.జి దర్శకత్వంలోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టాం’’ అన్నారు. చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా -
దసరాకి టీజర్
‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రాజు హీరోగా, సుప్యార్దే సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘లింగొచ్చా’. ఆనంద్ బడా ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బ్లాక్ స్టూడియోస్ సమర్పణలో శ్రీకల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యాదగిరి రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. యాదగిరి రాజు, ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘దసరా కానుకగా ఈ నెల 23న మా సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ‘లింగొచ్చా’ టైటిల్‌కి అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆyì య¯Œ ్సలో మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లేశ్ కన్జార్ల, లైన్ ప్రొడ్యూసర్స్: సందీప్ తుమ్కుర్, శ్రీనాథ్ చౌదరి, సంగీతం: బికాజ్ రాజ్. -
పనులు ప్రారంభం
ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తమిళనాడు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం నుంచి తమిళ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’కు సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్స్ చెన్నైలోని రెండు వేరువేరు స్టూడియోల్లో ప్రారంభమయ్యాయట. ఇంకా విశాల్ హీరోగా నటించిన ‘చక్ర’ డబ్బింగ్ వర్క్స్, త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రాంగీ’ గ్రాఫిక్స్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే తమ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు పలు నిర్మాణ సంస్థలు సన్నాహాలు మొదలుపెట్టాయి. -
పోస్ట్ ప్రొడక్షన్స్‌కు ఓకే
కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావంతో సినిమా షూటింగ్స్ ఆగిన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ అండ్ టెలివిజన్ షోలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 11 (సోమవారం) నుంచి నిర్మాణ సంస్థలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టుకోవచ్చు. ఎడిటింగ్, డబ్బింగ్, రీ–రికార్డింగ్, సౌండ్ డిజైన్/ సౌండ్ మిక్సింగ్, డీఐ (డిజిటల్ ఇంటర్ మీడియట్) విభాగాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఐదుగురు మాత్రమే పాల్గొనాలి. గ్రాఫిక్స్ వర్క్ కోసం పది నుంచి పదిహేను మంది పని చేయవచ్చు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్, ట్రావెల్ పాస్‌లు.. ఇలా కరోనా నిర్మూలనలో భాగమైన వాటిని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో పాల్గొనేవారు పాటించేలా నిర్మాతలు తగిన చర్యలు తీసుకోవాలి. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా, సినిమా, టెలివిజన్ రంగాలకు సంబంధించిన నిర్మాతలు కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ టాక్. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అసాధారణ ప్రేమకథ
కల్వకోట సాయితేజ, తరుణీసింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ రెడ్డి లింగాల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘లవ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. యువతకి కావాల్సిన అంశాలతో పాటు మాస్ అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మీరన్, సంగీతం: సిద్ధార్ధ్ సదాశివుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్ వంగూరి, సహ నిర్మాత: పున్న మురళి. -
పాటల సందడి
సుజన్, తనిష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఓ పాటని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకి హైలెట్’’ అన్నారు. ‘‘కె.విశ్వనాథ్‌గారి విడుదల చేసిన మొదటి పాటకు, కె.రాఘవేంద్రరావుగారు విడుదల చేసిన మరో పాటకి మంచి స్పందన వచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌గారు విడుదల చేసిన టీజర్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో మా సినిమా మీద బజ్ పెరిగింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు. -
విద్యార్థుల సమస్యలపై పోరాటం
ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి కథను ‘జార్జిరెడ్డి’ పేరుతో వెండితెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి నిర్మించారు. సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అధినేత అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు’ సినిమాలను అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. ‘‘జార్జిరెడ్డి’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సుధాకర్ యెక్కంటి. -
భయపెట్టే ఆవిరి
రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సంద ర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్. ఈ రెండు జోనర్స్లో ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అలాంటి ప్రతిభ ఉన్న దర్శకునితో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆవిరి’ ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు. రవిబాబు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుతో ఓ సినిమా చేయాలని 15 సంవత్సరాలుగా అనుకుంటున్నా కుదరలేదు కానీ, ఇప్పుడు కుదిరింది. ‘ఆవిరి’ సినిమాకు ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం: వైధి. -
ధమ్కీ ఇవ్వడం పూర్తయింది
రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’. సత్యనారాయణ సుంకర నిర్మాత. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ – ‘‘ధమ్కీ’ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే చిత్రమిది. బిత్తిరి సత్తి కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ఖర్చుకి వెనకాడకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, శ్రీమణి సాహిత్యం, మా సినిమాకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు కెమెరా: దీపక్ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్. -
రొమాంటిక్ థ్రిల్లర్
‘రాజ్ సూరియన్, ఆకర్షిక, నస్రీన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నా పేరు రాజా’. అశ్విన్ కృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. రాజ్ సూరియన్ మూడు పాత్రల్లో నటించారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ పడలేదు. ఎల్విన్ జాషువా మంచి సంగీతం అందించారు. రామ్‌గోపాల్ వర్మ లాంటి గొప్ప దర్శకుడి సినిమాలకు చేసిన వెంకట్ సినిమాటోగ్రఫీ ఓ ఆకర్షణ. త్వరలో పాటలు, సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
కొంచెం ఆలస్యంగా..
రెహమాన్ తొలిసారి కథా రచయితగా, నిర్మాతగా మారిన చిత్రం ‘99 సాంగ్స్’. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎహన్ భట్, ఎడిల్సీ వర్గస్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను జూన్ 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతుందని రెహమాన్ తన ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘‘99 సాంగ్స్’ సినిమా మీద మీరు చూపిస్తున్న ఆసక్తి, ప్రేమ మమ్మల్ని విపరీతమైన ఆనందానికి గురి చేస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని తెలిపారు.