Raja ravindra
-
ఇకమీదట సరికొత్త రాజ్ తరుణ్‌ని చూస్తారు
-
ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హ్యాపీ మూమెంట్ ఇదే: రాజా రవీంద్ర
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈనెల 12న రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు.రాజా రవీంద్ర మాట్లాడుతూ.. 'సారంగదరియాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. మా సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు సంతోషకరమైన మూమెంట్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలై అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నా చిత్రానికి ఇంత మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. మంచి కథతో సినిమా తీశాం. మున్ముందు ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న నమ్మకం ఉంది. సినిమాలోని ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.' అని అన్నారు.దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చా. కెమెరా డిపార్ట్మెంట్లో ముందుగా పని చేశా. చివరకు రాజా సర్ వద్దకు చేరాను. నేను కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారికి థాంక్స్. మా సినిమాను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు. -
సారంగదరియా సినిమా రివ్యూ
టైటిల్: ‘సారంగదరియా’నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్ తదిరతులునిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్నిర్మాతలు: ఉమాదేవి, శరత్ చంద్ర, చల్లపల్లిదర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి(పండు)సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్సిసిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభువిడుదల తేది: జూలై 11, 2024కథమిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. పెద్ద కొడుకు అర్జున్(మెయిన్ మొహమద్) తాగుడుకు బానిసవుతాడు. రోజూ మద్యం తాగుతూ బార్లో గొడవపడుతుంటాడు. చిన్నోడు సాయి (మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతూ.. చివరకు తమ ఏరియాలోనే ఉండే కాలేజీ అమ్మాయి ఫాతిమా(మధులత)ను ప్రేమలోకి దింపి, రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. కూతురు అనుపమ(యశస్విని) మాత్రం బుద్ధిగా చదువుకుంటూ.. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. అనుపమ అంటే అదే కాలేజీలో చదువుతున్న రాజ్(శివచందు)కి చాలా ఇష్టం. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అనుపమ మాత్రం అతన్ని దూరం పెడుతుంది. మిస్ బ్యూటీ క్వీన్ కావాలనేది ఆమె లక్ష్యం. అయితే ఓ రోజు కృష్ణకుమార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా.. రాజ్ తండ్రి(కదంబరి కిరణ్)వచ్చి గొడవ చేస్తాడు. దీంతో అనుపమకు సంబంధించిన ఓ పెద్ద రహస్యం బయట పడుతుంది. అదేంటి? కృష్ణకుమార్ సొంత ఊరిని వదిలి వచ్చి వేరే చోట బతకడానికి గల కారణం ఏంటి? రెస్టారెంట్ పెట్టి మంచి బిజినెస్ చేసే అర్జున్.. తాగుడుకు ఎందుకు బానిసగా మారాడు? ఫాతిమాతో ప్రేమాయణం.. సాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? మిస్ బ్యూటీ క్వీన్ పోటీల్లో పాల్గొనే క్రమంలో అనుపమకు ఎదురైన సమస్యలు ఏంటి? తనకు తండ్రి కృష్ణ కుమార్ ఎలా సపోర్ట్‌గా నిలిచాడు? కృష్ణకుమార్ ఫ్యామిలీకి సమాజం నుంచి ఎదురైన సమస్యలేంటి? వాటిని అధిగమించి తన పిల్లలను ఎలా ప్రయోజకులుగా మార్చుకున్నాడు? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే?ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. ట్రాన్స్ ఉమెన్స్‌ని సమాజం ఎలా చూస్తుంది? సొంతవాళ్ల నుంచే వాళ్లకు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? అనేది చూపిస్తూనే.. వారిని ఎంకరేజ్ చేస్తే ఎలా రాణించగలరో ఇందులో చూపించారు. ఓ వైపు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పండు. ఒకే సినిమా ద్వారా నాలుగైదు సందేశాత్మక కథలను చెప్పాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడం మాములు విషయం కాదు. తొలి సినిమాతోనే మంచి సందేశం అందించిన డైరెక్టర్ని అభినందించాల్సిందే. కానీ ఇలాంటి సందేశాత్మక సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. అటు సరదాగా, ఇటు కమర్షియల్‌గా చెబితేనే సినిమా చూస్తామంటున్నారు. దర్శకుడు పద్మారావు ఆ కోణంలో సినిమా తీయాలని ప్రయత్నించాడు కానీ పూర్తిగా సఫలం కాలేకపోయాడు.విశ్లేషణకృష్ణకుమార్ కుటుంబ సభ్యులందరి గురించి వివరంగా చెప్పడంతో మూవీ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అర్జున్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటే సాయి పాత్ర టీనేజ్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యేలా చిల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. రెండో భాగంలో ఏమైనా మెరుపులు ఉంటాయా? అంటే అక్కడ తడబాటే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సీన్‌ను డీటెయిల్‌గా చెప్పేందుకు ప్రయత్నించడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. వరుసగా కష్టాలు ఎదురవడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి ఓరకమైన నిస్సహాయత అలుముకున్న భావన రాక మానదు. అను పాత్ర యాక్టివ్‌గా ఉంటుంది.'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం. కానీ, జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది' అన్న డైలాగ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో అను తండ్రి గురించి చెప్పే డైలాగ్స్‌కు విజిల్ వేయాల్సిందే! తన స్పీచ్.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్ష గురించి చర్చించేలా చేస్తుంది. ఎక్కువ సాగదీత వల్లే సినిమాలో ఎమోషన్ ఆశించినంత పండలేదు.నటీనటులుకృష్ణ కుమార్‌గా రాజా రవీంద్ర బాగా యాక్ట్ చేశాడు. ఎప్పుడూ పాజిటివ్, నెగెటివ్ రోల్స్ చేసే ఆయనకు తొలిసారి పూర్తి స్థాయి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో సాయి మెప్పించాడు. అనుగా యశస్వి ఆకట్టుకుంది. అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ లీనమైపోయి నటించాడు. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి. -
ప్రతి ఇంట్లో జరిగే కథ అనిపించింది
‘‘సారంగదరియా’ చిత్రం ట్రైలర్ చూస్తే ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి సందేశం ఇచ్చేందుకు ఈ మూవీ తీశారని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాని తప్పకుండా థియేటర్లోనే చూసి,ప్రోత్సహించాలి’’ అన్నారు హీరో నవీన్ చంద్ర. రాజా రవీంద్ర లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహించారు. చల్లపల్లి చలపతిరావు ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నవీన్ చంద్ర అతిథిగా హాజరయ్యారు. ‘‘ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదు. దీంతో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే విజయం సాధిస్తారనే కంటెంట్‌తో ఈ మూవీ రూపొందింది’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘మా సినిమాని అందరూ చూసి ఆదరించాలి’’ అన్నారు శరత్ చంద్ర చల్లపల్లి. ‘‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది’’ అన్నారు పండు. -
ప్రతీ ఇంట్లో జరిగే కథే ‘సారంగదరియా’: నవీన్‌చంద్ర
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’. ఈ మూవీతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జులై 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. ‘రాజా రవీంద్ర ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. మాలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశారని అర్థం అవుతోంది.ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడండి’ అని ప్రేక్షకులను కోరారు.రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘కంటెంట్ బాగుండటంతో బలగం ఆడింది. మన సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాత చెబుతుంటూ ఉంటారు. పండు టీం అందరితో చక్కగా పని చేయించుకున్నాడు. మా నిర్మాత సైతం దర్శకుడు పండుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోంది. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడకండి.. ట్రోలింగ్ చేయకండి’ అని అన్నారు.‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఇలాటి కథ చెప్పినప్పుడు సహజంగా ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ మా సాయిజా ప్రొడక్షన్స్ అధినేత శరత్ గారు వెంటనే ఒప్పుకున్నారు. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది’అని దర్శకుడు పండు అన్నారు. ఈ ఈవెంట్లో నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనెజర్ పాల్ , నటి యశస్విని, లిరిక్ రైటర్స్ కడలి, గోశాల రాంబాబు, ఆదిత్య నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం'.. ఆసక్తిగా ట్రైలర్!
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర, శివకుమార్, యశస్విని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సారంగదరియా'. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్లో రాజా రవీంద్ర నటన ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, ఉపాధ్యాయుడి పాత్రలో ఆయన కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ కష్టాలను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్ తెగ హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
వైఎస్ జగన్... ఆ పేరే ఓ స్ఫూర్తి...
సాక్షి, అమరావతి: ‘పేదలు ఎదగాలంటే ప్రభుత్వ సాయం కావాలి. అందుకు సంక్షేమ పథకాలు చాలా వరకూ తోడ్పడతాయి. ఒక వైపు సంక్షేమం... మరోవైపు అభివృద్ధి ఏపీలో సమపాళ్లలో జరుగుతోంది. అందుకు కారకుడైన జగన్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అంటున్నారు సినీ నటుడు రాజా రవీంద్ర. వ్యక్తిగతంగా తనకే కాదు చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల తన అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..పేదలు ఎదగాలంటే...ప్రభుత్వ ఆసరా కావాలి.. పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలు ఎదగాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చేరాలంటే అది వారి కాయకష్టం మీద అయ్యేపని కాదు. కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు అవసరమవుతాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు రూపాల్లో ఆసరా అందిస్తోంది.అన్నివర్గాల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే వారికి ప్రభుత్వం తప్పనిసరిగా అందివ్వాల్సింది విద్య, వైద్యం. ఈ విషయంలో చాలా మార్పులు జరిగాయి.దళారీలు లేకుండా చేరుతున్న లబ్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామ వలంటీర్ల విధానం చాలా మంచి కాన్సెప్‌్ట. వీరి వల్ల మధ్యలో ఎవరికీ ఎటువంటి లంచాలు, పైరవీలతో తావు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో... ప్రయోజనాలు పొందుతున్నవారికి బాగా అర్థమవుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి రావడం కోసం పొత్తుల కన్నా ఒంటరిపోరుకే జగన్ సై అంటారు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం తథ్యం. ఖరీదైన వైద్యానికీ సర్కారు సాయం ప్రస్తుతం రోగాలు వస్తే దానికి వైద్యం ఎంత ఖరీదైపోయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ రోగం వచ్చిన లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒక కిడ్నీ పాడైనా చికిత్సకు రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకోని వ్యాధి వస్తే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా తట్టుకోగలవు? ఇక నిరుపేదల సంగతైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం వారిని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు వైద్య పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. ఇది నిజంగా ఎక్స్ట్రార్డినరీ స్టెప్. విద్యతోనే విజయం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక సమగ్ర విద్యావికాస మార్గంగా చెప్పాలి. వీటన్నింటివల్లా పాఠశాలల్లో చదివే వారిలో కనీసం 10శాతం మంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కచి్చతంగా ఉంటుంది. అలా వచ్చిన వారు రూ.లక్షల్లో జీతాలు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు తప్పకుండా పేదల జీవన ప్రమాణాల స్థాయి మారిపోతుంది. నిజంగా జరగాల్సింది అదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. -
హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్
చాలా ఏళ్ల నుంచి చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజా రవీంద్ర. ఇప్పుడు ఇతడు ప్రధాన పాత్రలో ఓ మూవీ చేశాడు. అదే 'సారంగదరియా'. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే నెలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) టీజర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. మూవీ యూనిట్‌కి విషెస్ చెప్పారు. ఓ మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి.. తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!) -
సరికొత్త టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. క్రేజీ సాంగ్ రిలీజ్!
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సారంగదరియా’. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘అందుకోవా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. 'మా ‘సారంగదరియా’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు. లెజెండరీ సింగర్ చిత్ర మా పాటను పాడటం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం' అని అన్నారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా మూవీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి అందుకోవా అనే పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎబెనెజర్ పాల్ సంగీతమందిస్తున్నారు. -
జిందగీ షురూ
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, ‘మిర్చి’ కిరణ్, హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో ‘డియర్ జిందగి’ అనే సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) దర్శకునిగా పరిచయమవుతున్నారు. రాజా రవీంద్ర సమర్పణలో ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభంఅయింది. తొలి సీన్‌కి దర్శకుడు కల్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ– ‘ఇందులో ముగ్గురు పిల్లల తండ్రి పాత్రలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ సినిమాలను అందించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి ఈ బ్యానర్‌ని స్థాపించాను’’ అన్నారు శరత్ చంద్ర చల్లపల్లి. ‘‘మధ్య తరగతి వారికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు). -
Raja Ravindra : నటుడు రాజా రవీంద్రను ఎప్పుడైనా ఇలా చూశారా!
-
ఆచార్య షూటింగ్లో చిరంజీవి తిట్టారు: రాజా రవీంద్ర
మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు ఎంతోమంది. అందులో నటుడు రాజారవీంద్ర ఒకరు. ఆయనను అమితంగా ఆరాధించే రాజా రవీంద్ర తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'చిరంజీవి అన్నయ్యకు విపరీతమైన మెచ్యురిటీ ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడినప్పుడు కామెడీగా అంటున్నామా? కావాలని అంటున్నామా? అనేది ఆయనకు ఇట్టే తెలిసిపోతుంది. అలా ఓసారి నాకు ఆచార్య షూటింగ్లో తిట్లు పడ్డాయి' 'అన్నయ్య నాకెంతో క్లోజ్.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను. ఆచార్య షూటింగ్లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తున్నాను. దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుందని చెప్పాను. దానికాయన ఖర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది కానీ, నాకు బాగుంటుంది' అని చెప్పాడు రాజా రవీంద్ర. చదవండి: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నిర్మాత -
Evaru Meelo Koteeswarulu: రాజా రవీంద్రను కోటీశ్వరున్ని చేసిన ప్రశ్న ఇదే..
Evaru Meelo Koteeswarulu 1cr Question: రాజా రవీంద్ర.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. అనుకోకుండానే 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి హాజరై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో అడిగిన 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. అనంతరం మంగళవారం నాటి ఎపిసోడ్లో చెక్కు అందుకున్నారు. దీంతో ఈ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర నిలిచారు. ఈ షోలో రాజా రవీంద్ర ప్రయాణాన్ని మనం ఒకసారి గమనిస్తే.. రాజా రవీంద్రను హాట్ సీట్‌కి తీసుకెళ్లిన ప్రశ్న.. హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి? A)న్యూయార్క్ B)ముంబయి C)దుబాయ్ D)విజయవాడ ప్రశ్న చదవగానే సమాధానం అందరికీ తెలిసినట్టు అనుకున్నా హాట్‌సీట్‌పై కూర్చొని తక్కువ సమయంలోనే సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌కు తొలి ప్రాధాన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో రాజా రవీంద్ర కేవలం 2.637 సెకన్లలోనే సమాధానం ఇచ్చి హాట్‌సీట్‌ను చేరుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆయన వరుసగా సరైన సమాధానాలు చెప్తూ ఎన్టీఆర్‌ను సైతం ఆకట్టుకున్నారు. చదవండి: (Evaru Meelo Koteeswarulu: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!) సోమవారం ప్రసారమైన ప్రోగ్రాంలో ఆయన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఉన్న మూడు లైఫ్ లైన్లలో కేవలం ఒక్క దానిని మాత్రమే ఉపయోగించుకొని 12,50,000 గెలుచుకున్నారు. కోటి రూపాయలు గెలుచుకోవడానికి మరో మూడు ప్రశ్నల దూరంలో నిలిచారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జరిగిన షోలో రాజా రవీంద్ర కోటి రూపాయల వైపు అడుగులు వేసిన ప్రశ్నలను ఒకసారి చూస్తే.. ఆట ప్రారంభం కాగానే జూనీయర్ ఎన్టీఆర్.. రాజా రవీంద్రను 25 లక్షల రూపాయల ప్రశ్న అడిగారు. ఒక్క లైఫ్ లైన్‌ను అప్పటికే ఉపయోగించడం వల్ల ఇక రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 25 లక్షలకు రాజా రవీంద్రను అడిగిన ప్రశ్న.. 2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో '40 రోజులు' అని అర్థం వచ్చే ఒక పదం నుండి వచ్చింది? A)లాక్డౌన్ B)ఐసోలేషన్ C)క్వారంటైన్ D)పాండమిక్ ఈ ప్రశ్నకు చాలాసేపు ఆలోచించిన రాజారవీంద్ర మరో లైఫ్ లైన్‌ను ఉపయోగించుకుని క్వారంటైన్ అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో 50 లక్షల రూపాయల ప్రశ్నకు చేరుకున్నారు. ఈ షోలో పాల్గొని 50 లక్షల ప్రశ్నకు చేరుకున్న అతి తక్కువ మందిలో రాజారవీంద్ర ఒక్కరు. 50లక్షల ప్రశ్నను పరిశీలిస్తే.. జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు? A)మిజోరాం B)పశ్చిమబెంగాల్ C)ఉత్తరప్రదేశ్ D)కేరళ ఈ ప్రశ్నకు కొద్దిసేపు ఆలోచించి ఆప్షన్ బీ అంటూ కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న. ఎవరు మీలో కోటీశ్వరులు చరిత్రలోనే ఇద్దరు మాత్రమే కోటి రూపాయల ప్రశ్నను చూశారు. వారిలో ఒకరు సెకండ్ సీజన్లో అయితే.. ఇప్పడు రాజారవీంద్ర మాత్రమే. ఇక కోటి రూపాయల ప్రశ్నను పరిశీలిస్తే.. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు? A)రంగనాథ్ మిశ్రా B)రంజిత్‌సింగ్ సర్కారియా C)బీపీ మండల్ D)ఫజల్ అలీ కమిషన్ ఈ ప్రశ్నకు చాలా సేపు థింక్ చేసి ఉన్న మరో లైఫ్ లైన్ ఉపయోగించుకొని ఆప్షన్ డీ అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. దీంతో ఈఎమ్‌కే చరిత్రలోనే కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర నిలిచారు. చదవండి: (Evaru Meelo Koteeswarulu: కోటితో ఆగను.. అదే నా అసలు స్వప్నం) -
Evaru Meelo Koteeswarulu: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!
Evaru Meelo Koteeswarudu 1 Crore Winner: కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బీ రాజారవీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్న సంగతి మనకు తేలిసిందే. ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నారు. రాజారవీంద్ర ప్రైజ్ మనీ గెలిచిన ఎపిసోడ్ సోమ, మంగళ వారాల్లో రాత్రి 8.30 గంటలకు ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతుంది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. 2000 - 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఇదివరకు సాఫ్ట్వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించారు. ఎవరు మీలో కోటీశ్వరులు పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్న సబ్ ఇన్స్పెక్టర్ బీ రాజారవీంద్రకు దక్కేది మాత్రం తక్కువ అని సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. అయితే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గనుక గెలిస్తే అతడు కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది. గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూటర్ చెల్లింపు సమయంలో ఈ పన్ను మినహాయించి డబ్బు చెల్లిస్తారు. అంటే ఎవరు మీలో కోటీశ్వరులలో కోటి గెలిస్తే విజేతకు వచ్చేది రూ.68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000 వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. (చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!) -
Evaru Meelo Koteeswarulu: కోటితో ఆగను.. అదే నా అసలు స్వప్నం
అనుకోకుండానే కార్యక్రమానికి హాజరై చరిత్ర సృష్టించిన ఈ కోటీశ్వరుడు సోమవారం రాత్రి 8ç:30 గంటలకు టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో చెక్కు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మిగతా సగం మంగళవారం ప్రసారం కానుంది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. 2000 – 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఇదివరకు సాఫ్ట్వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించారు. హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్ క్రైంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర పిస్టల్, ఎయిర్ రైఫిలింగ్‌లోనూ దిట్ట. ఈ సందర్భంగా రవీంద్రను ‘సాక్షి’ ఫోన్లో పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. సివిల్స్ ప్రిపరేషన్ సహకరించింది.. గతంలో సివిల్స్‌కు సిద్ధమై ఉండటం నా గెలుపునకు తోడ్పడింది. ఒలింపిక్ క్రీడల్లో ఇండియా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించడం నా కల. ఇప్పటికే జాతీయ స్థాయి పోలీసు క్రీడాపోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని రెండుసార్లు బంగారు, రజతం, ఒకసారి కాంస్య పతకాలు సాధించాను. 2017 తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో, అదే ఏడాది గుహవాటిలో జరిగిన జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నా. 2019లో జరిగిన ఆలిండియా పోలీస్ పిస్టల్ విభాగం పోటీల్లో రజతం సాధించా. వచ్చిన రూ.కోటితో నాణ్యమైన శిక్షణ పొందుతా. నాలాగా అవసరం ఉన్నవారికీ సహకరిస్తాను. -
‘ది రోజ్ విల్లా’ మూవీ రివ్యూ
టైటిల్ : ది రోజ్ విల్లా నటీనటులు : దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చన తదితరులు నిర్మాణ సంస్థ : చిత్ర మందిర్ స్టూడియోస్ నిర్మాత : అచ్యుత్ రామారావు దర్శకత్వం :హేమంత్ సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : అంజి ఎడిటింగ్: శివ విడుదల తేది : అక్టోబర్ 1,2021 ‘కన్నడ `దియా` ఫేమ్ దీక్షిత్ శెట్టి, బిగ్‌బాస్ -5 ఫేమ్ శ్వేతా వర్మ హీరో,హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ది రోజ్ విల్లా. చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్‌పై అచ్యుత్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్ దర్శకత్వం వహించాడు. రాజా రవీంద్ర కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 1న ఈ మూవీ తెలుగు, కన్నడలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), శ్వేత (శ్వేత వర్మ) కొత్తగా పెళ్లి చేసుకున్న యువ జంట. ఇద్దరూ తాము కోరుకున్న విధంగా ఉండాలని.. మున్నార్ అనే అందమైన ప్రాంతానికి కారులో బయలుదేరుతారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగిస్తారు. అయితే వీరిద్దరు అనుకోకుండా నక్సల్స్ ఉన్న డేంజర్ పాయింట్‌కు వెళ్తారు. అక్కడ వారి కారు పాడైపోతుంది. ఎంతకీ స్టార్ట్ అవ్వదు. అలాంటి సమయంలో పోలీసులు వచ్చి వారిని సురక్షితంగా పక్క గ్రామంలో దిగబెడతారు. అక్కడ రెస్టారెంట్లో వీళ్ళు తింటుండగా మిలట్రీ రిటైర్ అయిన సోల్మాన్ (రాజా రవీంద్ర) తన భార్య హెలెన్‌తో (అర్చనా కుమార్)తో అక్కడే ఉంటాడు. అతన్ని ఓ ప్రమాదం నుంచి డాక్టర్ రవి కాపాడతాడు. దీంతో వారిద్దరు స్నేహితులైపోతారు. తనను కాపాడినందుకు ఆ యువ జంటని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. అలా అక్కడికి వెళ్ళిన ఈ యువజంటకు అక్కడి వాతావరణం వితంగానే కాకుండా భయం కలిగించేలా ఉంటుంది. అలా ఎందుకు అనిపించింది.. ఏం జరిగింది? అప్పుడు ఈ యువజంట ఏం చేశారు? అనేది మిగిలిన కథ ఎలా చేశారంటే.. డాక్టర్ రవి పాత్రకు దీక్షిత్ పూర్తి న్యాయం చేశాడు. బిగ్ బాస్ 5 తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న శ్వేతా వర్మ ఇందులో హీరోయిన్. ఈమె కూడా బాగానే నటించింది. తెరపై అందంగా కనిపించడంతో పాటు తనదైన నటనతో మెప్పించింది. రైటైర్ మిలట్రీ సోల్మాన్ పాత్రలో రాజా రవీంద్ర తన అనుభవాన్ని చూపించాడు. అర్చనతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ ఓ సాధారణ కథకి భావోద్వేగాన్ని అతికించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు హేమంత్. దర్శకుడు తీసుకున్న పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్స్ ప్రేక్షకుడిని థ్రిల్లింగ్ కలిగిస్తాయి. మాటలు కూడా బానే రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అర్చన, రాజా రవీంద్ర మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ పునరావృతం కావడం ప్రేక్షకుడి బోర్ కొట్టిస్తాయి. హీరో హీరోయిన్లు రాజా రవీంద్ర ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తాయి. దీక్షిత్‌ను చూసి తన కొడుకు అనుకుని ఇక్కడే ఉండమని బలవంతం చేయడంతో.. తను అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత ఏం జరిగిందనేది బాగానే అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. అంజి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు. ఎడిటర్ శివ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
గరం గరం ముచ్చట్లు 21 August 2021
-
చిరు సాయం లేకుంటే హేమ చనిపోయేది.. రాజా రవీంద్ర షాకింగ్ కామెంట్
మెగాస్టార్ చిరంజీవి.. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోనే. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. అలాగే కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఓ ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇలా పెద్ద ఎత్తున సేవా కార్యాక్రమాలు చేపడుతున్న ఈ రియల్ హీరో.. ఏనాడు కూడా తను చేసిన సహాయం గురించి బయట చెప్పుకోడు. కానీ ఆయన ద్వారా లబ్ది పొందిన వారు మాత్రం చిరు సాయాన్ని చెప్పుకొని మురిసిపోతుంటారు. తాజాగా నటుడు రాజా రవీంద్ర హేమకు చిరంజీవి చేసిన ఓ గొప్ప సహాయం గురించి చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి చేసే సహాయా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజంతా మాట్లాడినా సరిపోదు. కరోనా సమయంలోనూ ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఉన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ చేయించారు.. బ్లడ్ బ్యాంక్ వ్యవహారాలు చూసుకున్నారు.. ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు.. సీసీసీ పెట్టి అందరికీ నిత్యావసర సరుకులు అందించారు. కరోనా సమయంలో రక్తం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలోనూ అన్నయ్యే దగ్గరుండి అన్నింటిని చూసుకున్నారు. బ్లడ్ బ్యాంకే కదా అని మనం ఈజీగా తీసుకుంటాం. కానీ దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నాడు అన్నయ్య. నటి హేమ డెలివరీ సమయంలో రక్తం కావాల్సి వచ్చింది. ఆమెది ఓ నెగెటివ్ బ్లడ్. అది చాలా రేర్‌గా దొరుకుతుంది. ఆ సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ఆమె బతికింది. లేకపోతే చనిపోయేది. అలా రక్తం విలువ అవసరంలో ఉన్న వారికే తెలుస్తుంది. బ్లడ్ బ్యాంక్ నడపడం అంత సులేవీమీ కాదు. దానికి నెలకు కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది’అని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని గతంలో హేమ కూడా చెప్పారు. తాను ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకుందని హేమ తెలిపారు. -
అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!
‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. కరోనా సమయంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీ రాలేదు కాబట్టి మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు’’ అని నటుడు రాజా రవీంద్ర అన్నారు. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేకపోతేనే పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఓ పాయింట్‌ను వినోదాత్మకంగా చెప్పాం. ఈ సినిమాలో నా పాత్ర పేరు రాజు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. యాభై ఏళ్లు దాటిన రాజుని మనవళ్లు, మనవరాళ్లు వచ్చిన తర్వాత భార్య సరిగ్గా పట్టించుకోదు. ఆ సమయంలో సోషల్ మీడియాలో అమ్మాయితో చాటింగ్ చేస్తాడు. ఓ చిన్న తప్పు కారణంగా ఎలాంటి సమస్యలొచ్చాయి? అనేదే కథ. విలన్ పాత్రలు చేయడం ఈజీ. కానీ కామెడీ చాలా కష్టం.. సరైన టైమింగ్ ఉండాలి. చిరంజీవిగారి ‘ఆచార్య’లో మంచి పాత్ర చేశాను. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘రోజ్ విల్లా’తో పాటు సోహైల్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాను. నాకు సినిమా అంటే పిచ్చి. ఒకవేళ ఆర్టిస్టుగా అవకాశాలు రాకపోతే టీ, కాఫీలు ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలోనే ఉండిపోతా’’ అన్నారు. -
‘పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి’
యాంకర్ శ్రీముఖి, గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్లు ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్‌ను విడుదల చేయగా, నిర్మాత కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇ. సత్తిబాబు మాట్లాడుతూ.. ‘మా క్రేజీ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందనేది క్రేజీగా ఉంటుంది. అది సినిమాలో చూడాల్సిందే’ పేర్కొన్నాడు. ఇక శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ.. ‘మా ‘క్రేజీ అంకుల్స్’ రిలీజ్‌కు సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే పాయింట్‌తో ఈ సినిమాను సరదాగా తెరకెక్కించామని నిర్మాత శ్రీనివాస్ అన్నాడు. కోన వెంకట్ మాట్లాడుతూ.. నాకు ఎంతో కావాల్సిన అతి కొద్ది మందిలో శ్రీను ఒకడు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని పేర్కొన్నాడు. కాగా పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుండగా, ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడుతున్నారనేదే కథ. -
‘క్రేజీ అంకుల్స్’తో వస్తున్న శ్రీముఖి..
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె ట్రైలర్ విడుదలైంది. కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని చేసింది చిత్ర యూనిట్. ఇక క్రేజీ అంకుల్స్ సినిమాపై యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ..సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ నటించారు అని తెలిపింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు సైతం థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో క్రేజీ అంకుల్స్ సినిమాను కూడా థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అని నటుడు రాజా రవీంద్ర అన్నాడు. -
ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా ‘అర్థ శతాబ్దం’
ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా మార్చి 26న ‘అర్ధ శతాబ్దం’ మూవీ విడుదల కానుంది. ఈ మూవీని జాతీ, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంగా 2003లో జరిగిన నిజ జీవితం కథ ఆధారంగా ‘అర్ధ శతాబ్దం’ మూవీని దర్శకుడు రూపొందించాడు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26 నుంచి ఆహా వరల్డ్ ప్రీమియర్‌గా స్ట్రీమ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. ‘పెద్ద డైరెక్టర్ అయిన క్రిష్‌కు కథ నచ్చడంతో ఆయన మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. కార్తీక్‌కు హీరో రానా బర్త్ డే విషెస్ తెలపడం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికి మా టీంతో టైం స్పెండ్ చేసి మా చిత్రం గురించి తెలుసుకుని టీజర్‌ను లాంచ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక సాంగ్ లాంచ్ చేశారు. ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఈ ‘అర్ధశతాబ్దం’ సినిమా 1950 నుంచి 2003 వరకు జరుగుతుంది. ఇండియన్ డెమాక్రసీ మాములు పబ్లిక్పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకుని యుటిలైజ్ చేసుకుంటున్నాం. అలాగే దాని ఎలా మిస్ యూజ్ చేసుకొంటున్నాం అనే కథాంశంతో అద్భుతమైన లవ్ స్టొరీని జోడించి సినిమాను తెరకెక్కించడం జరిగింది. నిర్మాతల సపోర్టుతో చిత్రాన్ని పూర్తి చేసి చిత్ర టీజర్‌ను విడుదల చేశాము. ఆహా వారికి మా టీజర్ నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో సినిమాను మార్చి 26 నుంచి వరల్డ్ ప్రీమియర్‌గా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. అలాగే నిర్మాత చిట్టి కిరణ్ మాట్లాడుతూ.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో ఈ నెల 26వ తేదీన వస్తున్న ‘అర్ధ శతాబ్దం’ మూవీని ఆదరించి మాకు సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు. ఇక నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ... 22 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయస్తున్నే. అయితే రవి, కిరణ్‌లు షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నాకు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో నిర్మాతగా వారితో కలసి నిర్మించడం జరిగింది. సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశాము. అయితే కరోనా టైంలో థియేటర్స్ మూతపడటంతో మూవీని ఎలా విడుదల చేయాలని అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఈ క్రమంలోఆహా నుండి తమకు కాల్ వచ్చిదని, ఈ ఆఫర్‌ను మిస్ చేసుకోకుండా ప్రస్తుతం జనాల్లోకి వెళ్లేలా ఆహాలో విడుదల చేస్తే మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని ఈ నెల 26 న ఆహా లో విడుదల చేస్తున్నామన్నారు. అందరు అర్థ శతాబ్ధం మూవీ చూసి తమని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు. ఇందులో ప్రముఖ నటీనటులు కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్ర లోకేష్, అజయ్, శుభలేఖ సుధాకర్, రాజా రవీంద్ర, రామ రాజు, దిల్ రమేష్, టీఎన్ఆర్, శరణ్య, నవీన్ రెడ్డి, ఆమనిలు నటిస్తున్నారు. -
పండగకి అంకుల్స్ సందడి
‘ఈ సంక్రాంతికి సినిమా సందడి మొదలవుతోంది. వినోదం పుష్కలంగా ఉన్న ఈ ‘క్రేజీ అంకుల్స్’ బాగా సందడి చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్స్‌పై గుడ్ ఫ్రెండ్స్–బొడ్డు అశోక్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని నిర్మాతలు అచ్చిరెడ్డి, యంఎల్ కుమార్ చౌదరి, బెల్లంకొండ సురేశ్ విడుదల చేశారు. ‘‘క్రేజీ అంకుల్స్ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ చిత్రంతో డబ్బులు బాగా వచ్చి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మా శ్రీనుని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఇ. సత్తిబాబు మాట్లాడతూ– ‘‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘శ్రేయాస్ శ్రీను, నేను ఒక సినిమా చేయాలనుకుంటున్న సమయంలో డార్లింగ్ స్వామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు శ్రీవాస్. సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రాజా రవీంద్ర మాట్లాడారు. -
రాజ్‌తరుణ్ కారు కేసు: కార్తీక్ రూ.3లక్షలకు బేరం
సాక్షి, అమరావతి: హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదం వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నటుడు, రాజ్‌తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు రాజ్‌తరుణ్‌పై కార్తీక్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వాట్సాప్ ద్వారా కార్తీక్ కొన్ని వీడియోలు పంపాడని, తనతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేసినట్లు రాజా రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక్ మొదట రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ తర్వాత రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అన్నారు. కార్తీక్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నట్లు రాజా రవీంద్ర తెలిపారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని ఆయన ... రాజ్‌తరుణ్ వీడియోలతో కార్తీక్ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ గురువారం సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్‌తరుణ్ కారు కేసులో కొత్త ట్విస్ట్ కాగా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే కార్తీక్ అనే యువకుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ కారు దిగి పరుగులు పెడుతున్నట్లు... అతడిని పట్టుకోగా...తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే ఆ వీడియోలు ఇవ్వమని రాజా రవీంద్ర తనను ఫోన్లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్ మీడియా ముందుకు వచ్చాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్‌తరుణ్‌ను పోలీసులు విచారణ చేయలేదు. అంతేకాకుండా కేసు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే తాను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే కారు ప్రమాదం నుంచి బయటపడినట్లు రాజ్ తరుణ్ మీడియాకు ఓ మెసేజ్ పెట్టిన విషయం విదితమే. -
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీనటి జయసుధ