Rajiv gandhi international airport
-
Hyderabad To Delhi: హలో సిటీ.. చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యా పరంగా దేశంలోనే 4వ స్థానంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ త్వరలోనే తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం వరకూ చూస్తే నగరం నుంచి ఢిల్లీకి అత్యధికంగా 14.6 శాతం మంది, ముంబైకి 10.8 శాతం మంది, బెంగళూరుకు 10 శాతం మంది రాకపోకలు సాగించినట్టు వెల్లడించింది. మనకు నాలుగో స్థానం... మొత్తంగా చూస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 1,10,61,929 మంది ప్రయాణికులతో దేశంలోనే అత్యధిక సంఖ్యలో రాకపోకలు సాగించిన ఎయిర్‌పోర్ట్స్‌లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత 4వ స్థానం దక్కించుకుంది. అయితే 10.9 శాతం పెరుగుదలతో శరవేగంగా బిజీగా మారుతున్న ఎయిర్‌పోర్ట్స్‌లో నగరం ఒకటిగా నిలుస్తోంది.ట్రాఫిక్ హీట్ పుట్టించిన మే... ఈ ఏడాది తొలి అర్ధభాగం అత్యధిక ట్రాఫిక్‌ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చవిచూసింది. అందులోనూ గత మే నెలలో ప్రయాణికుల రద్దీ అత్యధికంగా కనిపించింది. సంఖ్యాపరంగా చూస్తే జనవరి నెలలో 1.802 మిలియన్, ఫిబ్రవరిలో 1.730 మిలియన్, మార్చిలో 1.861 మిలియన్, ఏప్రిల్‌లో 1.858 మిలియన్, మేలో 1.971 మిలియన్, జూన్‌లో 1.841 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీకే ఎక్కువ... నగరం నుంచి ఇతర నగరాలకు రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉండగా అందులో తొలిస్థానం ఢిల్లీకి దక్కింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఢిల్లీకి 16,14,660 మంది, ముంబైకి 11,97,952 మంది, బెంగళూరుకు 11,11,649 మంది రాకపోకలు సాగించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కొత్త లాంజ్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్‌కామ్ (ఇఎన్సీఎఎల్ఎమ్) హాస్పిటాలిటీ ‘ట్రాన్సిట్ బై ఎన్‌కామ్’ పేరిట ఏర్పాటైన తమ అధునాతన లాంజ్‌ను మంగళవారం ప్రారంభించింది. ఎన్‌కామ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వికాస్ శర్మ మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌లోని లెవల్ డి అరైవల్స్ వద్ద ఉన్న ఈ ట్రాన్సిట్ లాంజ్‌లో ప్రయాణికుల కోసం 17చ.మీ మీటర్ల నుంచి 51 చ.మీ వరకూ పరిమాణంలో 57 గదులు, జిమ్, ఎన్‌రూట్ కేఫ్, కాఫీ మేకర్, వాక్–ఇన్ షవర్స్, వైఫై, కరెన్సీ మార్పిడి, లగేజీ స్పేస్ లతో పాటు స్పా సౌకర్యం ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. -
విమానంలో సాంకేతిక లోపం.. గంటకుపైగా ఫ్లైట్‌లోనే సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కకుపోయారు. మధ్యాహ్నం 2.30కు ముంబై వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సమయానికి బయల్దేరలేకపోయింది. దీంతో గంట నుంచి రేవంత్, భట్టి, టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి విమానంలోనే ఉండిపోయారు. కాగా సీఎం రేవంత్, భట్టి, పొన్నం, దీపాదాస్ మున్షితోపాటు ఏఐసీసీ కార్యదర్శులు నేడు ముంబైలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ముంబైకు మధ్యాహ్నం 2.30 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. తీరా వీరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య రావడంతో గంటన్నర ఆలస్యం అయ్యింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా విమానంలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక కాసేపటి క్రితమే సాంకేతిక సమస్యను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది. చదవండి: ఇక రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్ -
Shamshabad Airport: సారీ.. ఎయిర్‌పోర్టుకు రాలేం
హైదరాబాద్: క్యాబ్‌వాలాలు సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సేవలను నిలిపివేస్తూ ‘లో ఫేర్..నో ఎయిర్’ ప్రచారం చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి నడిపే క్యాబ్‌డ్రైవర్లకు సరైన ఆదాయం లభించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సకాలంలో క్యాబ్‌లు లభించక.. ఒకవేళ సర్వీసులు బుక్ అయినప్పటికీ డ్రైవర్లు నిరాకరించడం వల్ల ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో క్యాబ్‌లు లభించక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ పుష్పక్ బస్సులు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, సొంత వాహనాలు మినహాయించి మరో 5 వేల క్యాబ్‌లు ఇటీవల వరకు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉండేవి. కానీ కొంతకాలంగా ఎయిర్‌పోర్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికి వెళ్లినా తమకు రూ.500 నుంచి రూ.700 వరకు మాత్రమే లభిస్తున్నాయని. దీంతో ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. ఇది మరింత భారంగా మారిందని తెలంగాణ గ్రిగ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీపెయిడ్ ట్యాక్సీలకు ఒక ట్రిప్పుపైన రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా తమకు మాత్రం అతి తక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. దీంతో ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు నడిపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఎయిర్‌పోర్టుకు నడిచే క్యాబ్‌లకు ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున ఇవ్వాలని, అగ్రిగేటర్ సంస్థలకు ఇచ్చే కమిషన్‌ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ నెలకొంది. బాంబు బెదిరింపు మెయిల్‌తో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ టీం తనిఖీలు చేపట్టాయి. అయితే కాసేపటికే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఇవాళ రాత్రి ఏడుగంటలకు పేల్చేస్తామంటూ ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే కాసేపటికే అదే మెయిల్ ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చింది. తమ కుమారుడి మానసిక స్థితి బాగోలేదని.. అందుకే అలా సందేశం పంపాడని.. క్షమించాలని ఆ మెయిల్లో ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తనిఖీలు మాత్రం కొనసాగించి.. ఆ బెదిరింపును ఫేక్‌గా నిర్ధారించుకున్నాయి. మరోవైపు ఆ మెయిల్స్ బెంగాల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మెయిల్స్ పంపిన చిరునామాను ట్రేస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. -
వారెవ్వా.. శంషాబాద్ రన్‌వేపై బెలుగా ఎయిర్‌బస్.. అదిరిపోయిందిగా! (ఫొటోలు)
-
శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుంచి వారణాసి మధ్య 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5గం.10ని. టేకాఫ్ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
Shamshabad Airport: ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి?
సాక్షి, హైదరాబాద్: ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొన్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొనడంతో కొంత దెబ్బతిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. సదరు ఎయిర్‌లైన్స్ అధికారులు, విమానాశ్రయ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. కాగా.. మరో ఘటనలో.. ఈ నెల 18న ఉదయం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానానికి వడగళ్ల వానతో ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పైలెట్లకు ముందు ఉన్న అద్దంతో పాటు వెనకాల కొంత పలుచోట్ల విమానం దెబ్బతిన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.. -
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సరికొత్త ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల విమానాలను ఫ్రైటర్లుగా మార్చే సరికొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్న బోయింగ్–737 విమానాన్ని ఫ్రైటర్గా మార్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) సేవలు అందజేసే జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ (జీఏటీ)కి, బోయింగ్ సంస్థకు మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా సేవలందిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారి విమానాల మార్పు రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. ఈ తరహా కన్వర్షన్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో చైనా, బ్రిటన్, కోస్టారికా తరువాత నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు బోయింగ్ –737 నుంచి బోయింగ్ –800 వరకు ప్రయాణికుల విమానాలను బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్స్ (బీసీఎఫ్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి రానున్న ఐదేళ్లలో 30 విమానాలను ఫ్రైటర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఒప్పందం ప్రతిష్టాత్మకం విమానాల కన్వర్షన్ కోసం బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాల నుంచి బిడ్లను ఆహా్వనించగా చివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎంఆర్ఓకు ఈ కాంట్రాక్ట్ లభించడం విశేషం. రానున్న రోజుల్లో బోయింగ్ సరుకు రవాణా రంగంలో తన సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 75 ఫ్రైటర్లను బోయింగ్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ కార్గోలో ఇది 6.3 శాతం వరకు విస్తరించనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ–కామర్స్ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందిన దృష్ట్యా హైదరాబాద్ నుంచి అమెరికాతోపాటు వివిధ దేశాలు, మన దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మధ్య ఫ్రైటర్స్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ దృష్ట్యా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో పలు ఎయిర్‌లైన్స్ సరుకు రవాణా రంగంలోకి తమ సేవలను మార్పు చేశాయి. ఈ క్రమంలోనే బోయింగ్ సైతం ఈ రంగంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. బోయింగ్ సంస్థ గత 40 ఏళ్లుగా ప్రయాణికుల సేవలో ఉంది. ఎంఆర్ఓలదే భవితవ్యం ప్రపంచవ్యాప్తంగా విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్(ఎంఆర్ఓ) సేవలకు గొప్ప భవిష్యత్తు ఉందని జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ సంస్థ సీఈవో అశోక్ గోపీనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాము ఎంఆర్ఓ సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన అంతర్జాతీయ నగరాలకు కార్గో సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. -
కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే, బుధవారం రోజున తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. చదవండి: (Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు) -
ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
-
Shamshabad: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు
శంషాబాద్: దశలవారీగా జరుగుతున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా తాత్కాలిక అంతర్జాతీయ డిపార్చర్‌ను మూసివేయనున్నారు. ప్రధాన టెర్మినల్ అనుసంధానంగా నిర్మాణం చేసిన విస్తరణ పనులు పూర్తవడంతో ఈ నెల 28 నుంచి గతంలో మాదిరిగానే ప్రధాన టెర్మినల్ నుంచే అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్ సంస్థ పూర్తి చేసినట్లు విమానాశ్రయ వర్గాలు బుధవారం మీడియాకు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..) -
హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీసులు.. 4 గంటల్లోనే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా వియత్నాంకు విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని హనోయి, హో చి మిన్, డా నాంగ్ నగరాలకు వియట్జెట్ ఫ్లైట్లను నేరుగా నడుపనున్నట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. ఈ సర్వీసులు 4 గంటల్లో వియత్నాం చేరుకుంటాయి. హనోయికి అక్టోబర్ 7న, హో చి మిన్ సిటీకి అక్టోబర్ 9న, డా నాంగ్‌కు నవంబర్ 29వ తేదీన వియట్జెట్ తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని ఫణికర్ అభిప్రాయపడ్డారు. అలాగే వ్యాపార, వాణిజ్య రంగాల్లోను సంబంధాలు మెరుగు పడతాయన్నారు. కొత్త సర్వీసుల వల్ల భారతదేశంలో తమ నెట్వర్క్ బలోపేతం అవుతుందని వియట్జెట్ కమర్షియల్ డైరెక్టర్ జె.ఎల్.లింగేశ్వర అన్నారు. ఆగ్నేయ, ఈశాన్య ఆసియా దేశాలకు వారధిగా ఉన్న వియత్నాం సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రావాలని ఆయన హైదరాబాద్ పర్యాటకులను ఆహ్వానించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్ విమానం రన్‌వే పైకి వెళ్లగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి రన్‌వేపై నిలిచిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు విమానం బయలుదేరకపోవడంతో అధికారులపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు ధర్నాకు దిగారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో -
రంగారెడ్డి: అబ్దుల్లాపుర్ మెట్లో చైన్‌స్నాచర్ వీరంగం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..
శంషాబాద్ రూరల్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు. విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. (చదవండి: ‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!) రూ.6 కోట్లతో విస్తరణ పనులు.. ఎయిర్‌పోర్టు లోపల నుంచి కార్గో వాహనాల కోసం గొల్లపల్లి శివారు వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం ఇది వరకే పూర్తి చేశారు. శంషాబాద్ నుంచి గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వరకు ఉన్న రహదారితో ఎయిర్‌పోర్టు రోడ్డును గొల్లపల్లి వద్ద అనుసంధానం చేస్తున్నారు. దీంతో గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్ వరకు ఉన్న దారిని సుమారు రూ.6 కోట్లతో విస్తరిస్తున్నారు. 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ దారిని ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గం ఇలా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరానికి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి గొల్లపల్లి నుంచి ఔటర్ జంక్షన్ మీదుగా పీ– వన్ రోడ్డు మీదుగా చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంగా ఈ రహదారిని నిర్ణయించడంతో ఈ మార్గంలో మొక్కలు, అందమైన పూల మొక్కలను నాటుతున్నారు. పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వద్ద రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’) -
పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా..
శంషాబాద్: ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్‌కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్‌కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్‌కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్‌ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమయంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్‌లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్‌కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా« ది నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) -
హైదరాబాద్: క్యాటరింగ్ ఉద్యోగి @ 2 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.1.09 కోట్ల విలువైన 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలోని క్యాటరింగ్ సర్వీస్ ఉద్యోగి నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న ఈ బంగారాన్ని ఆహార పదార్థాల లోడింగ్, అన్లోడింగ్ పద్ధతిలో హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ కనిపెట్టింది. ఇలా పార్శిల్లో వచ్చిన బంగారాన్ని క్యాటరింగ్ ఉద్యోగి బయటకు తీసుకొచ్చి స్మగ్లింగ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించింది. ఇతన్ని అరెస్టు చేసిన డీఆర్ఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ విధించింది. అసలు ఈ మాఫియాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారు ఎవరు? ఏయే దేశాల నుంచి ఎంత బంగారం ఇప్పటివరకు వచ్చిందన్న పూర్తి అంశాలపై విచారణ జరుగుతోందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫీజుల మోత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు చేసేవారికి చార్జీలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను పెంచుకునేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్)కు ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతించడం ఇందుకు కారణం. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. 2021 ఏప్రిల్ నుంచి 2026 మార్చి దాకా వర్తించే మూడో కంట్రోల్ పీరియడ్‌కు సంబంధించి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదన ప్రకారం టారిఫ్‌లను సవరిస్తూ ఏఈఆర్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేశీ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ను రూ. 480కి (ప్రస్తుతం రూ. 281), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే దాన్ని రూ. 700కి (ప్రస్తుతం రూ. 393) పెంచుకోవచ్చు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 31 నాటికి దేశీ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 750 దాకా, విదేశీ ప్రయాణికులకు రూ. 1,500 దాకా యూడీఎఫ్ పెరుగుతుంది. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్ పెంచొద్దు
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) చేసిన ప్రతిపాదనలపై దేశీ విమానయాన సంస్థల సమాఖ్య ఎఫ్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిణామాలతో ఎయిర్‌లైన్స్ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో యూడీఎఫ్ పెంచడం సరికాదని, పెంపు ప్రతిపాదన అమలును వాయిదా వేయాలని ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ)కి విజ్ఞప్తి చేసింది. థర్డ్ కంట్రోల్ పీరియడ్‌గా వ్యవహరిస్తున్న 2021 ఏప్రిల్–2026 మార్చి మధ్య కాలానికి టారిఫ్‌లను సవరించేందుకు అనుమతించాలంటూ ఏఈఆర్‌ఏకి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశీయంగా ప్రయాణించే వారికి యూడీఎఫ్‌ను ప్రస్తుతమున్న రూ. 281 నుంచి ఏకంగా రూ. 608కి (116% అధికం), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికులకు ప్రస్తుత రూ. 393 నుంచి రూ. 1300కి (231 శాతం) పెంపునకు అనుమతించాలని వీటిల్లో కోరింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచస్థాయిలో ఇచ్చే స్కైట్రాక్స్ అవార్డును దక్కించుకుంది. వరుసగా మూడుసార్లు ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. దీంతోపాటు ప్రపంచస్థాయిలో నిర్ధారించే టాప్ 100 విమానాశ్రయాల్లో 64 స్థానంలో నిలిచిందని జీఎంఆర్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. గతంలో 71వ ర్యాంకు ఉండేదని పేర్కొన్నాయి. ఆన్లైన్ ద్వారా స్కైట్రాక్స్ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కోవిడ్ పరిస్థితుల్లో కూడా జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోనే ఈ అవార్డు దక్కిందని గెయిల్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
శంషాబాద్‌లో 30 విమాన సర్వీసులు రద్దు
సాక్షి, శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నం దున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఇతర రాష్ట్రాలు షరతులు విధిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను వాయిదా వేసుకుంటున్నారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ కారణాలతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, çపుణే, చెన్నై తదితర నగరాలకు వెళ్లే సుమారు 30 విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు) -
మాస్కో నుంచి హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్
-
వచ్చేసిందోచ్: హైదరాబాద్ చేరిన స్పుత్నిక్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయానికి శనివారం సాయంత్రం వ్యాక్సిన్ కంటైనర్లు వచ్చాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ)కు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల మొదటి ప్రధాన కన్సైన్మెంట్ చేరుకుంది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఒక పెద్ద మైలురాయి. ఈ వ్యాక్సిన్ సరుకును ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ విమానంలో దిగుమతి చేసుకుంది. ఈ విమానం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారీ ప్రదేశంగా హైదరాబాద్‌కున్న ప్రత్యేక స్థానం దృష్ట్యా, వ్యాక్సిన్ల సంఖ్యలో పెరుగుదలకు అనుగుణంగా జీహెచ్ఏసీ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. కొన్నేళ్లల్లో ఈ ప్రాంతం నుంచి 3.5 బిలియన్ల వివిధ రకాల కరోనా వ్యాక్సిన్ల మోతాదులు ఉత్పత్తి అవుతాయని అంచనా. హైదరాబాద్ విమానాశ్రయంలో చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. వీటిని మైనస్ 20 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం జీహెచ్ఏసీ- డాక్టర్ రెడ్డీస్ సప్లై చైన్ బృందం, కస్టమ్స్ విభాగం, ఎయిర్ కార్గోకు చెందిన నిపుణులతో కలిసి పని చేస్తోంది. స్పుత్నిక్ వి కన్సైన్మెంట్ను సజావుగా నిర్వహించడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7.5 టన్నుల వ్యాక్సిన్ తెలంగాణకు చేరుకుంది. మొత్తం లక్షా 50 వేల డోసుల వ్యాక్సిన్ హైదరాబాద్ చేరింది. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం చదవండి: సంతలో లస్సీ ప్రాణం మీదకు వచ్చింది.. The first consignment of Russian COVID-19 vaccine #SputnikV arrived in Hyderabad. #IndiaFightsBack pic.twitter.com/rIRbl0d0cf — N Ramchander Rao (@N_RamchanderRao) May 1, 2021 -
మహిళ తెలివి: లో దుస్తుల్లో బంగారం పేస్ట్..
సాక్షి, శంషాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లో దుస్తుల్లో బంగారం పేస్టును రెండు ఉండలను గుర్తించారు. 548 గ్రాముల బరువు గల బంగారం విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన విదేశీ కరెన్సీ విదేశీ కరెన్సీ పట్టివేత హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకెళుతూ పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జి–9541 విమానంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగేజీలో భారత కరెన్సీలో రూ.8.4 లక్షల విలువ చేసే యూఎస్, ఒమన్, యుఏఈ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం