reconstruction
-
వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్ హోటల్లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుకారాంగేట్ టు సంస్కృతి టౌన్షిప్ నగరంలోని తుకారాంగేట్‌కు చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్íÙప్లో ఒంటరిగా ఉండేవారు. భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్‌కు వచ్చే అంకుర్తోనూ స్నేహం ఏర్పడింది. జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్‌ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి.. బోడుప్పల్ ప్రాంతంలో అంకుర్ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్ తన మెర్సిడిస్ బెంజ్ కారులో (టీఎస్ 07 ఎఫ్ఎస్ 5679) బయలుదేరారు. బోడుప్పల్–ఉప్పల్ మధ్యలో అంకుర్ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్‌ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్‌లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు.అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. -
పాక్‌లో హిందూ గుడికి మోక్షం.. 64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం
ఇస్లామాబాద్: ఇస్లామిక్ దేశం పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడి హిందూ ఆలయాలు ఎన్ని దాడులకు గురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది 64 ఏళ్ల తర్వాత పాక్‌లోని నరోవల్ జిల్లాలోని బావోలీ సాహిబ్ గుడిని అక్కడి ప్రభుత్వం పునర్నిర్మిస్తుండడం విశేషం.1960లోనే ఈ గుడి మూతపడింది. అయితే నరోవల్ జిల్లాలోని హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్కోట్కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ గుడిని పునర్నిర్మించాలని పాక్ ధర్మస్థాన్ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. గుడి నిర్మాణానికి పాక్ ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించిందని డాన్ పత్రిక వెల్లడించింది.ద ఎవాక్యూ ట్రస్ట్‌ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) గుడి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దానికి ధర్మస్థాన్ బోర్డుకు అప్పగిస్తారు. పాక్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్ సిద్దాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్ షోయబ్ సిద్దాల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు మంజూర్ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. బావోలీ సాహిబ్ గుడిని మళ్లీ నిర్మిస్తున్నందుకు పాక్ ధర్మస్థాన్ కమిటీ అధ్యక్షుడు సావన్ చంద్ అక్కడి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు -
AP: ఇదీ మార్పు.. రహదారి రయ్..రయ్..
నాడు ► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం ► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం ► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు ► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు ► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్ లేదు ► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు ► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు ► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే . ► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు నేడు ► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం ► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం ► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు ► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు ► పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు ► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు ► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు ► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు -
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్‌లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్‌లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ) -
ఏసీఆర్‌ఈ సీఈవో నీతా ముఖర్జీ రాజీనామా!
ప్రముఖ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అసెట్స్ కేర్ & రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతా ముఖర్జీ రాజీనామా చేసినట్లుగా సమాచారం. కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్న ఆమె కంపెనీ నుంచి వైదొలిగినట్లు ఎకనమిక్ టైమ్స్ నుంచి ఓ కథనం వెలువడింది. గ్లోబల్ ఫండ్ ఆరెస్ ఎస్ఎస్జీ క్యాపిటల్ మద్దతుతో 2020 నవంబర్‌లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఏసీఆర్ఈలో సీఈగా చేరారు. ఆమె ఐదు సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. నీతా ముఖర్జీ ప్రీమియర్ ఫైనాన్షియల్ సంస్థలలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంకర్. ఏసీఆర్ఈలో చేరడానికి ముందు ఆమె ఆర్బీఎల్ బ్యాంక్‌లో చీఫ్ క్రెడిట్ ఆఫీసర్‌గా పని చేశారు. దానికి ముందు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆఫ్ ఇండియా (ఆర్సిల్) అధ్యక్షురాలిగా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్తోనూ పనిచేశారు. “ముఖర్జీ తన ప్రణాళికల గురించి తెలియజేయలేదు. బోర్డు ఆమె తదుపరివారిని గుర్తించే ప్రక్రియలో ఉంది ” అని కంపెనీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పినట్లుగా ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. -
ఆ మేరకే సీఆర్ జెడ్ నుంచి అనుమతులు
-
దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన
న్యూఢిల్లీ: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలోని పలు రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 508 రేల్వే స్టేషన్లను రూ.24,470 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు తెలిపారు ప్రధాని. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పునర్నిర్మించనున్న 1309 రైల్వేస్టేషన్ల పనులకు ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా మొదట విడతలో 508 రైల్వే స్టేషన్ల పనులు మొదలుకానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.24,470 కోట్లను కేటాయించినట్లు తెలిపారు ప్రధాన మంత్రి. మొదటి విడతలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లను తెలంగాణలోని 39 స్టేషన్లకు గాను మొదట 21 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఏపీలోని రైల్వే స్టేషన్లకు రూ.453 కోట్లు తెలంగాణలోని రైల్వే స్టేషన్లకు రూ.893 కోట్ల నిధులతో రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో ప్లాజా మోడల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మించనున్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్లను పునరుద్ధరించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలో కాకినాడ టౌన్ జంక్షన్, తుని, పిడుగురాళ్ల, రేపల్లె, తెనాలి, కర్నూలు సిటీ, దొనకొండ, ఒంగోలు, సింగరాయకొండ, పలాస, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, భీమవరం టౌన్, ఏలూరు, నరసపూర్, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం స్టేషన్లు.. తెలంగాణలో ఆదిలాబాద్, హనుమకొండ కాజీపేట జంక్షన్, హఫీజ్ పేట, హప్పుగూడ, హైదరాబాద్, మలక్ పేట, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్, మహబూబాబాద్ హైటెక్ సిటీ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, జహీరాబాద్, పెద్దపల్లి రామగుండం, మల్కాజిగిరి జంక్షన్, వికారాబాద్ తాండూరు, యాదాద్రి స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఏపీ, తెలంగాణ మినహాయించి రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్ లో 21, జార్ఖండ్‌లో 20, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. #WATCH | Prime Minister Narendra Modi lays the foundation stone to redevelop 508 railway stations across India under Amrit Bharat Station Scheme; says, "Around 1300 major railway stations in India will now be developed as Amrit Bharat Railway Station. They will be re-developed in… pic.twitter.com/CPC67SWUEV — ANI (@ANI) August 6, 2023 ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి మొత్తం భారతదేశం వైపే ఉందన్నారు. ప్రపంచస్థాయిలో భారత ప్రతిష్ట పెరిగిందని, ప్రపంచం దృష్టిలో భారతదేశ స్థాయి కూడా పెరిగిందని అన్నారు. దీని వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి.. మొదటిది సుమారు 30 ఏళ్ల తర్వాత భారత్ దేశంలో ఒక ప్రభుత్వం పూర్తి స్థాయి మెజారిటీ సాధించడం కాగా రెండవది పూర్తి స్థాయి మెజారిటీ సాధించిన ప్రభుత్వం సవాళ్ళను స్వీకరించి కీలక నిర్ణయాలు తీసుకుని నిర్విరామంగా పనిచేయడమేనని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says, "Today, the focus of the entire world is on India. India's prestige, on a global scale, has increased. World's attitude towards India has changed. There are two main reasons behind this - 1) Indians brought in a full majority government… pic.twitter.com/H0aoSSyi0M — ANI (@ANI) August 6, 2023 ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ -
కాకతీయుల తర్వాత మళ్లీ ఇప్పుడే!
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఏడు శతాబ్దాల విరామం తర్వాత వేయి స్తంభాల దేవాలయంలో అంతర్భాగంగా ఉన్న కళ్యాణ మంటపంలో శివపార్వతుల కళ్యాణం జరగబోతోంది. కాకతీయుల హయాం తర్వాత మళ్లీ ఇంతకాలానికి కళ్యాణ మంటపం కళకళలాడబోతోంది. విఖ్యాత వేయి స్తంభాల దేవాలయ కళ్యాణ మంటపం పునర్నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో, సెప్టెంబరులో దాన్ని ఘనంగా ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే శివరాత్రి వేడుకలను అందులోనే నిర్వహించాలని భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి హయాంలో వేయి స్తంభాలతో రుద్రేశ్వరస్వామి దేవస్థానాన్ని నిర్మించారు. ఓవైపు దేవాలయం, దానికి మరోవైపు కళ్యాణమంటపాన్ని అద్భుత శిల్పకళా వైభవంతో రూపొందించారు. కాకతీయుల ఇలవేల్పుగా భాసిల్లిన పరమశివుడికి ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరిగేవి. డెక్కన్ ప్రాంతాన్ని వశం చేసుకునే సమయంలో తుగ్లక్ సేనలు దీన్ని పాక్షికంగా ధ్వంసం చేశాయని చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో కళ్యాణమంటపం పైకప్పు 40 శాతం కూలిపోయింది. దాంతో ఆ శిథిల మంటపంలో ఇక వేడుకలు నిర్వహించటం ఆపేశారు. అంతే.. మళ్లీ ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇప్పుడు ఆ మంటపాన్ని పునర్నిర్మించటంతో తిరిగి వేడుకల నిర్వహణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. చివరి దశలో పనులు.. దాదాపు 18 ఏళ్ల క్రితం కళ్యాణ మంటపాన్ని పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో పూర్తిగా విప్పదీశారు. అందులోని రాళ్లకు నంబర్లు వేసి పద్మాక్షి గుట్ట వద్ద ఉంచారు. కానీ పనులు ముందుకు సాగలేదు.మూడేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం దృష్టి సారించి వేగంగా పనుల నిర్వహణ ప్రారంభించింది. ఇప్పుడు ప్రధాన నిర్మాణ పనులు పూర్తికాగా, వారం రోజులుగా పైకప్పు పనులు చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి ఆ పనులు కొలిక్కి తెచ్చి సెప్టెంబరులో మంటపాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటి క్వారీ నుంచే ఇప్పుడూ రాళ్ల వినియోగం.. హనుమకొండకు చేరువగా ఉన్న అమ్మవారి పేట క్వారీ నుంచి మంటప పునర్నిర్మాణ పనులకు రాళ్లను తెచ్చి వాడుతున్నారు. అప్పట్లో కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయాలకు ఈ గుట్ట రాయినే వాడేవారు. నాడు రాళ్లను తొలిచేందుకు చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దాదాపు 60 టన్నుల బరువున్న ఓ భారీ బండరాయిని ఇటీవలే మంటపం వద్దకు తరలించారు. దాన్ని పైకప్పుపై అమర్చనున్నారు. ఆ గుండుపై 800 ఏళ్ల కింద తొలిచినప్పటి రంధ్రాల జాడలు ఇంకా ఉండటం విశేషం. అదే రాయి భాగాన్ని ఇప్పుడు మళ్లీ వేయిస్తంభాల కళ్యాణ మంటపానికి వినియోగిస్తుండటం యాదృచ్ఛికం. ఈ మంటపానికి సంబంధించి 163 బీమ్‌లకు గానూ 28 జాడ లేకుండా పోయాయి. కూలిన తర్వాత ప్రజలు వాటి ముక్కలను తరలించుకుపోయారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో ఒక్కోటి 8 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు, 30 టన్నుల బరువుండే 8 బీమ్ల ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. వాటిపై 32 పైకప్పు సల్పలను పరచనున్నారు. ఈ సల్ప రాళ్లు ఒక్కోటి 15 అడుగుల వెడల్పుతో ఉండనున్నాయి. పనుల్లో తమిళనాడు శిల్పులు తమిళనాడుకు చెందిన శివకుమార్ స్థపతి ఆధ్వ ర్యంలో అదే రాష్ట్రానికి చెందిన 28 మంది శిల్పులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. కేంద్రప్రభుత్వం రూ.19 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు కాగా, నిర్మాణ పనులు పూర్తయ్యే నాటికి మరో రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆ తర్వాత దాని చుట్టూ సుందరీకరణ, ఇతర పనులకు మిగతావి ఖర్చు చేయనున్నారు. ఏఎస్ఐ తెలంగాణ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు స్మిత ఎస్ కుమార్, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. అలనాటి శైలికి తేడా రానివ్వం ‘కాకతీయుల కాలంలో ఏ శైలిని వినియోగించారో ఆ శైలికి ఏమాత్రం తేడా రాకుండా రాళ్లను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నాం. అలనాటి నిర్మాణం మళ్లీ కళ్ల ముందుంచేందుకు అహరహం శ్రమిస్తున్నాం. ఆగస్టు చివరి నాటికి కళ్యాణ మంటపం సిద్ధమవుతుంది’ –శివకుమార్, స్థపతి -
బాలాలయానికి సరస్వతీ అమ్మవారు!
భైంసా: సరస్వతీ దేవి కొలువైన బాసర ప్రధాన ఆలయం పునర్నీర్మాణానికి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అర్చకులు, అధికారులు, వైదిక బృందం శృంగేరి వెళ్లి పీఠాధిపతి విదుశేఖర భారతిస్వామి సూచనలతో నమూనా రూపొందించారు. గర్భగుడిలో మార్పులు చేర్పులపై పీఠాధిపతి చేసిన సూచనలను ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన పండితులు.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డికి వివరించారు. కొత్త నమూనాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన బాసర ఆలయానికి రూ.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో అనునిత్యం అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు బాసర వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పునర్నీర్మాణ పనులు ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ప్రధానాలయం వద్ద భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. పనుల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అక్షర శ్రీకార మండపాన్ని బాలాలయంగా ఏర్పాటుచేసి అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. విశాలమైన ఈ మండపంలో ప్రధానాలయం గర్భగుడి పనులు పూర్తయ్యేవరకు అమ్మవారి దర్శనాలు, అక్షరాభ్యాస పూజలు ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రారంభించేలా.. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆలయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి నూతన నమూనాలు, మాస్టర్‌ప్లాన్ తదితరాలపై కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల బాసర వచి్చన మంత్రి మాస్టర్ ప్లాన్ అమలుపై ఆలయ అధికారులతో చర్చించారు. కృష్ణ శిలలతో నిర్మాణం... గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం సరస్వతి అమ్మవారి దర్శన సమయంలో పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించదు. రానున్న రోజుల్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకార మండపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామివారి స్థల మారి్పడి, నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. -
నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు విచారణలో భాగంగా రాచకొండ పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రేమించిన ప్రియురాలు దూరం అవుతుందన్న సాకుతో ఫిబ్రవరి 17 న తోటి స్నేహితుడిని అత్యంత పాశవికంగా నిందితుడు హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం పోలీసులు గుర్తుపట్టకుండా మృతదేహాన్ని క్రూరంగా చేతి వేళ్ళు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి దహనం చేశాడు. అనంతరం దొరికిపోతాననే భయంతో తానే స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎదుట గత నెల 24న లొంగిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు హత్యకు ముందు, తర్వాత పరిణామాలను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి తెలుసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడు హరిని హత్య జరిగిన ప్రదేశం అబ్దుల్లాపూర్ మెట్ కు తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. దానికంటే ముందు నిందితుడు హరిని చర్లపల్లి జైలు నుంచి తరలించి వనస్థలిపురం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి కస్టడీ విచారణ ప్రారంభించారు. యువతితో పరిచయం, సేహితుడి మధ్య విభేదాలను ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు హరిని తిరిగి చర్లపల్లి జైలులో రిమాండుకు తరలించారు. హసన్‌తో పాటు హరి సోదరినీ విచారించిన పోలీసులు నిందితుడు హరి సోదరి మూసారాంబాగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను కూడా విచారించినట్టు తెలిసింది. హత్య గురించి ఆమెకు ముందే తెలుసునని అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిందితుడు హరి స్నేహితుడు హసన్‌ను కూడా శనివారం మరోసారి పోలీసులు విచారించినట్టు తెలిసింది. యువతికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు– రాచకొండ సీపీ చౌహాన్ అబ్దుల్లాపూర్ మెట్ హత్య కేసులో యువతి కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. హరిని విచారిస్తున్నామని అన్ని ఆధారాలూ సేకరిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసుపై ఇప్పుడే పూరిస్థాయిలో సమాచారం చెప్పలేమన్నారు. -
శ్రేయి కంపెనీలకు ఎన్ఏఆర్సీఎల్ అత్యధిక బిడ్
కోల్‌కతా: సంక్షోభంలోని రెండు శ్రేయి గ్రూప్ కంపెనీలను దక్కించుకునేందుకు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) అత్యధికంగా రూ. 5,555 కోట్ల మేర ’ప్రస్తుత నికర విలువ’ ప్రాతిపదికన బిడ్ దాఖలు చేసింది. ఇందులో రూ. 3,200 కోట్లు నగదు రూపంలో ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 10 గంటల పాటు రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్వహించిన బిడ్డింగ్‌లో వర్దే పార్ట్నర్స్ కన్సార్షియం పక్కకు తప్పుకుంది. ఎన్ఏఆర్సీఎల్ అత్యధికంగా బిడ్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల దానికన్నా స్వల్పంగా వెనుకబడిన ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా బరిలోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రెండు సంస్థలు (ఎన్ఏఆర్సీఎల్, ఆథమ్) తమ సమగ్ర ప్రణాళికలను సీవోసీకి సమర్పిస్తాయని, జనవరి 8–9 మధ్య తుది ఓటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం దివాలా పరిష్కార ప్రణాళిక దాదాపు రూ. 13,000–14,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కనిష్టంగా రూ. 9,500–10,000 కోట్లయినా రావచ్చని పేర్కొన్నాయి. గవర్నెన్స్ లోపాలు, రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ల కారణంగా శ్రేయి గ్రూప్‌లోని శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (ఎస్‌ఐఎఫ్‌ఎల్), దాని అనుబంధ సంస్థ శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ (ఎస్‌ఈఎఫ్‌ఎల్) బోర్డులను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఈ రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) .. బ్యాంకులకు రూ. 32,750 కోట్ల మేర బాకీ పడ్డాయి. వీటిని రాబట్టుకునేందుకు 2021 అక్టోబర్‌లో దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. -
నెలాఖరులోగా మొండి పద్దుల విక్రయం పూర్తి
ముంబై: దాదాపు రూ. 48,000 కోట్ల మొండి పద్దులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు విక్రయించే ప్రక్రియ నవంబర్ నెలాఖరుకి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు యస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనితో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతం లోపునకు దిగి రానుంది. మొత్తం పద్దులకు గాను రూ. 11,183 కోట్లు యస్ బ్యాంక్‌కు జేసీ ఫ్లవర్స్ చెల్లించనుంది. ఇది సుమారు 23 శాతం రికవరీకి సమానం. మరోవైపు, డీల్ ప్రకారం ఏఆర్‌సీలో యస్ బ్యాంక్ 9.9 శాతం వాటాలు తీసుకోనున్నట్లు, ఆర్బీఐ అనుమతితో దీన్ని తదుపరి 20 శాతానికి పెంచుకోనున్నట్లు ఎఫ్‌ఐబీఏసీ 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ వివరించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. -
సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
-
జూబ్లీ హిల్స్ కేసులో కీలక వీడియో లభ్యం..!!
-
Jubilee Hills Pub Case: జూబ్లీ హిల్స్ కేసు సీన్ ను రీ-కన్ స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు
-
కష్టకాలంలో ఉక్రెయిన్‌కు భారీ సాయం, కానీ ఓ షరతు!
యుద్ధకాలంలో ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటన వెలువడింది. కానీ, ఈ సాయాన్ని షరతుల మేరకు అందిస్తున్నట్లు ప్రకటించింది ఈయూ. ఈ మేరకు ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కి తొమ్మిది బిలియన్ యూరోల(రూ. 73 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి రుణ రూపంలో ఈ సాయాన్ని అందచేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసిన తదనంతరం ఈయూ సాయంతో ఉక్రెయిన్ను పునర్నిర్మించడం పై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారామె. ఉక్రెయిన్ పునర్నిర్మాణ ప్రయత్నాలకు ఈయూ వ్యూత్మక నాయకత్వం వహించేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు ఆమె తెలిపారు. మిగతా దేశాలు కూడా ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈయూ నిబంధనలకు లోబడే ఈ సాయం ఉంటుందని ఆమె తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం అనేది.. గత కొన్నిసంవత్సరాలుగా రక్షణ కోసం కేటాయిస్తున్న తక్కువ వ్యయం పై దృష్టి కేంద్రీకరించేలా చేసిందన్నారు. ఆయుధాల ఉత్పత్తి, జాయింట్ ప్రొక్యూర్మెంట్ను మరింత మెరుగ్గా సమన్వయం చేసేందుకు ఈ కూటమి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాదు యూరప్ కంపెనీలను ఆ మార్గంలో పయనించేలా ఆర్థిక పన్ను ప్రోత్సాహాకాలను అందిస్తామని చెప్పారు. ఇది ఈయూ స్వతంత్ర శక్తి సామర్థ్యాలను బలపరుస్తుందన్నారు. అలాగే ఇంధన సరఫరాలపై రష్యా పై ఆధారపడకుండా చౌకగా, వేగవంతంగా ఇంధనాన్ని పోందే దిశగా అడుగులు వేస్తోంది. అదీగాక ఇప్పటికే ఈయూ యూరోపియన్లను థర్మోస్టాట్లను తగ్గించాలని, లైట్లను ఆపివేయాలని, ప్రజారవాణ వినియోగించమని సూచించింది కూడా. (చదవండి: ‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్) -
రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణం కేవలం నాలుగు నెలల్లో పూర్తయింది. ఇక్కడి బోడికొండపై పాత ఆలయం ఉన్నచోటే రూ.3 కోట్ల ఖర్చుతో నూతన హంగులతో కొత్త రాతి దేవాలయం పునర్నిర్మాణానికి 2021 డిసెంబరు 22న శంకుస్థాపన జరగగా.. సోమవారం (ఈనెల 25న) పునర్నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. వైఖానస ఆగమ పండితులు నిర్ణయించిన ముహుర్తం మేరకు సోమవారం ఉ.7.37 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వార్లను పునఃప్రతిష్టించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తుపాన్లతో పనులు ఆలస్యం 2020 డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు కొండపై స్వామి విగ్రహాన్ని తొలగించగా.. అనంతరం అది కొండపైన కోనేరులో బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. విగ్రహాల పునఃప్రతిష్టతో పాటు పురాతన ఆలయం మొత్తాన్ని కూడా పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సంఘటన జరిగిన ఐదు రోజుల్లోనే నాటి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి రూ.3 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. జనవరి 3న మంత్రి ప్రకటన చేయగా.. జనవరి 9కల్లా దేవదాయ శాఖ అనుమతులిచ్చింది. అలాగే, 2021 జనవరి 22 నాటికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ సీతారామలక్ష్మణ నూతన విగ్రహాలు రామతీర్థం చేరాయి. 28న కొండ కింద శ్రీరామాలయంలోని ఏర్పాటుచేసిన బాలాలయంలో ఆ విగ్రహాల చర ప్రతిష్ట జరిగింది. ఇక 2021 ఆగస్టు నాటికే పాత ఆలయాల శిథిలాలను తొలగించి కొత్త ఆలయ పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినప్పటికీ, అప్పట్లో రెండుసార్లు తుపాను రావడం.. గ్రానైట్ రాళ్ల తరలింపునకు అవరోధాలు ఎదురవడంతో డిసెంబర్లో శంకుస్థాపన జరిగింది. ఈలోపు కొండపైకి కొత్తగా త్రీఫేజ్ కరెంటు ఏర్పాటుచేశారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని కొండ దిగువన ఏర్పాటు చేసిన యాగశాల జనరేటర్ వెలుగుల్లో పనులు.. ఇక పాత ఆలయం స్థానంలో గ్రానైట్ రాయితో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి మూడేసి టన్నుల బరువు ఉండే గ్రానైట్ రాళ్లను కూడా ఆలయ పునర్నిర్మాణంలో ఉపయోగించారు. 600 మీటర్ల ఎత్తులోని బోడికొండ పైకి గ్రానైట్ రాళ్లను తరలించేందుకు 200 మీటర్ల పొడవున ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటుచేయడంతో పాటు 12 టన్నుల బరువుండే రాళ్లను ఎత్తగలిగే భారీ హైడ్రాలిక్ క్రెయిన్లను ఉపయోగించారు. మరోవైపు.. త్వరగా ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసేందుకు జనరేటర్ల సాయంతో రాత్రి వేళల్లో పనులు జరిపారు. కుప్పం, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చిన 25 మంది శిల్పులతో పాటు దేవదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఈ పనుల్లో పాల్గొన్నారు. మరిన్ని అదనపు వసతులతో.. ప్రధాన ఆలయ పనులు ఇప్పటికే పూర్తికాగా, ఆలయం వద్ద మరికొన్ని ఆదనపు వసతులు కల్పించనున్నారు. ► గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారం (కాంపౌండ్ వాల్), కొత్తగా యాగశాలనూ నిర్మిస్తున్నారు. వీటిని మరో మూణ్ణెలల్లో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ► మెట్ల మార్గానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేశారు. గతంలో స్వామివారికి సమర్పించే నివేదనను వండడానికి వసతిలేదు. ఇప్పుడు కొత్తగా నివేదనశాలలను ఏర్పాటుచేస్తారు. ► అలాగే, కొండపైన భక్తుల కోసం ప్రత్యేక షెల్టరును ఏర్పాటుచేయడంతోపాటు భక్తుల కోసం మంచినీటి ట్యాంకు, వాష్ రూములు నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా నేను విజయనగరం జిల్లా కలెక్టరుగా ఉన్న సమయంలోనే రామతీర్థం ఆలయంలో ఆ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పుడూ, విగ్రహ ప్రతిష్ట సమయంలో దేవదాయ శాఖ కమిషనర్‌గా నేనే ఉన్నాను. ఆ స్వామివారే మళ్లీ నాకు దేవదాయ శాఖ కమిషనర్ పోస్టు ఇప్పించి తొందరగా ఆ పనులన్నీ చేయించుకోమని అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నాను. – హరిజవహర్‌లాల్, దేవదాయ శాఖ కమిషనర్ -
రిలయన్స్, ఏసీఆర్‌ఈ చేతికి సింటెక్స్ ఇండస్ట్రీస్!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ (ఏసీఆర్‌ఈ) దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్ ప్రణాళికను సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఏకగ్రీవ (కమిటీ ఆఫ్ క్రెడిటార్స్– సీఓసీ) ఆమోదం తెలిపారు. తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ కోసం దివాలా పరిష్కా ప్రక్రియ కింద రిలయన్స్, ఏసీఆర్‌ఈలు ఉమ్మడి బిడ్ దాఖలు చేశాయి. శ్రీకాంత్ హిమత్సింకా, దినేష్ కుమార్ హిమత్‌సింకాతో పాటు వెల్స్పన్ గ్రూప్ సంస్థ ఈజీగో టెక్స్టైల్స్, జీహెచ్‌సీఎల్, హిమత్సింకా వెంచర్స్ వచ్చిన బిడ్స్‌ను కూడా కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ పరిశీలించినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సింటెక్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. బిడ్ విలువ రూ.3,000 కోట్లు? రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆర్ఐఎల్, ఏసీఆర్‌ఈ ఉమ్మడి బిడ్ల విలువ వివరాలు తెలపనప్పటికీ, ఇది దాదాపు రూ.3,000 కోట్లని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల్లో రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ హెయిర్‌కట్ (రాయితీ) తీసుకున్నట్లు కూడా సమాచారం. పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గించడం జరుగుతుంది. అలాగే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుండి డీలిస్ట్ అవుతుంది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై దివాలా ప్రక్రియను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. కంపెనీపై దాదాపు రూ.7,500 కోట్ల క్లెయిమ్‌లు (రుణ బాకీలు) దాఖలయ్యాయి. దివాలా కోడ్ (ఐబీసీ)నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితి... 2020–21 లో సింటెక్స్ ఇండస్ట్రీస్ ఆదాయం రూ. 1,689.15 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో, కన్సాలిటేడెడ్ నిర్వహణా ఆదాయం 80 శాతం పెరిగి, రూ.942.66 కోట్లకు చేరింది. ఇదే కాలంలో నికర నష్టం రూ.214.99 కోట్ల నుంచి రూ.103.25 కోట్లకు తగ్గింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో సోమవారం 5 శాతం నష్టపోయి రూ.7.80 వద్ద ముగిసింది. -
రామతీర్థం ఆలయానికి 22న శంకుస్థాపన
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీకోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే రూ.3 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయబోతోంది. 22వ తేదీ ఉదయం 10.08 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. చదవండి: ఉనికే లేని ఓఆర్ఆర్కు ఉరా? మెట్ల మార్గం, కోనేరు ఆధునికీకరణ.. కొండపై ఉన్న ఆలయంలోని శ్రీరాముని విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండగులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహాల ప్రతిష్టతో పాటు ఆలయం మొత్తాన్నీ పునః నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కొండ రాయితో ఉండే పాత ఆలయం స్థానంలో డ్రస్డ్ గ్రానైట్ రాయితో అభివృద్ధి చేస్తారు. గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారాన్ని కూడా పునః నిర్మించబోతున్నారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరును పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తారు. భక్తులు పొంగళ్లు వండుకునేందుకు వీలుగా కొండపైన ఆలయ ప్రాంగణంలోనే పాకశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతకుముందు భక్తులు పొంగళ్లను కొండ దిగువున వండి, వాటిని కొండపైకి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వీటికి తోడు కొండపైకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిన మెట్ల మార్గాన్ని కూడా ఆధునీకరిస్తారు. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా డిజైన్లు.. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ పునః నిర్మాణానికి దేవదాయ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అవసరమైన గ్రానైట్ రాయిని కాంట్రాక్టర్ ఇప్పటికే ఆలయ ప్రాంగణం వద్దకు తరలించారు. పెద్దపెద్ద గ్రానైట్ రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రిని 600 అడుగుల ఎత్తులో ఉండే కొండపైకి సులభంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన తర్వాత 6 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేవదాయ శాఖ అధికారి వాణీ మోహన్ తెలిపారు. -
హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా
తెగూసిగల్పా(హోండూరస్): సెంట్రల్ అమెరికా దేశమైన హోండూరస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్ పార్టీ ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్ష లిబర్టీ అండ్ రీఫౌండేషన్ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. మంగళవారం వరకూ 52 శాతం ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53 శాతం ఓట్లు సాధించగా, అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురాకు 34 శాతం ఓట్లే వచ్చాయి. అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది. -
‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో సాక్షుల నుంచి విచిత్ర సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్స్ట్రక్షన్కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ ఓ పంచ్ సాక్షిని శుకవ్రారం విచారించింది. నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, కేసు పూర్తిగా సందర్భానుసారాలపై ఆధారపడి ఉన్నప్పుడు.. అలాంటి పంచనామాకు ఎలాంటి అపఖ్యాతి లేని వ్యక్తులను పంచ్ విట్నెస్గా తీసుకెళతారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: కేటీఆర్ అలాగే ‘దిశ’ కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్కు.. షాద్‌నగర్ ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్‌ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్‌ను విచారించింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు. రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం ఉదయం అబ్దుల్ రహుఫ్‌ను విచారించి.. మధ్యాహ్నం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వొకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. ‘దిశ’ ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
దసరా నాటికి ‘యాదాద్రి’
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి ఈ దసరా నాటికి ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్నచిన్న పనులు మినహా ఇప్పటికే గుట్టపై నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చాయి. గుట్ట దిగువన కొన్ని ప్రధాన పనులు తుదిదశలో ఉన్నా యి. వీటిని అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. దసరాకు ప్రారంభించే విషయంలో సీఎం స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ చినజీయర్ స్వామితో చర్చించి ప్రారంభ ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ దసరాకు ప్రారంభించడం కుదరకపోతే.. వచ్చే ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభోత్సవాన్ని చేపట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. దాదాపు పనులన్నీ పూర్తి.. ►యాదగిరిగుట్టపై ఆలయ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపలి భాగానికి సంబంధించిన కొన్ని పనులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ వాటిని పూర్తి చేయను న్నారు. గుట్టపైన ఉన్న పుష్కరిణి పనులు రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దిగువన పుష్కరిణి నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రధాన ఆలయం పక్కనే ఉన్న శివాలయంలో ఒక ప్రాకారం నిర్మించాల్సి ఉంది. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్న విద్యుద్దీపాల ఏర్పాటు కూడా పదిరోజుల్లో పూర్తి కానున్నట్టు అధికారులు చెప్తున్నారు. దిగువన కల్యాణకట్ట రెండు నెలల్లో సిద్ధమవుతుందని అంచనా. ►నిత్యాన్నదాన భవనం పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. పనులు చేపట్టేందుకు ఓ దాత ముందుకొచ్చారు. పూర్తవటానికి కొంత సమ యం పట్టనుంది. ఊ గండిచెరువు వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ విల్లాతోపాటు వీఐపీ కాటేజీలు సిద్ధమయ్యాయి. ►గుట్ట దిగువన వ్రత మండపం సిద్ధమయ్యేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే గుట్టపై ప్రత్యామ్నాయ మండపం ఉన్నందున భక్తులకు పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఊ ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మిస్తున్నందున చాలా జాగ్రత్తగా పనులు జరపాల్సి ఉంటుందని, అదే జాప్యానికి కారణమని పేర్కొంటున్నారు. -
ఓ క్రేన్.. పనులాపింది..
సాక్షి, హైదరాబాద్: రామప్ప దేవాలయం ప్రపంచవారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ, కాకతీయుల హయాంలోనే నిర్మితమై, ‘ఇంత మంచి నిర్మాణం ఉండగా రామప్పనే ఎందుకు ఎంచుకున్నారు’అని యునెస్కో ప్రతినిధితోనే అనిపించుకున్న వరంగల్ నగరంలోని వేయిస్తంభాల దేవాలయం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. శిథిలమై పడిపోయే స్థితికి చేరిందన్న ఉద్దేశంతో వేయిస్తంభాల రుద్రేశ్వరాలయానికి దక్షిణం వైపు ఉన్న నాట్యమండపాన్ని పునర్నిర్మించేందుకు విప్పదీసి దశాబ్దన్నర గడుస్తున్నా తిరిగి నిర్మించలేక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) విభాగం చతికిలబడింది. కేవలం 18 నెలల్లో నిర్మిస్తానని చెప్పి, 16 ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయలేక అభాసుపాలవుతోంది. ఇదీ సంగతి.. కాకతీయుల నిర్మాణాల్లో వేయిస్తంభాల గుడి అగ్రపథాన ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణశైలి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 800 ఏళ్ల క్రితమే ఆ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అబ్బురపరుస్తోంది. శివాలయం, దాని పక్కనే నాట్యమండపం ఉన్నాయి. రెండింటిలో కలిపి వేయిస్తంభాలు ఉండటం విశేషం. కానీ, కాలక్రమంలో నాట్యమండపం శిథిలమవుతూ వస్తుండటంతో దాన్ని తిరిగి పూర్వవైభవం తెస్తామంటూ ఏఎస్ఐ 2005లో విప్పదీసింది. వెంటనే పనులు మొదలుపెట్టి 18 నెలల్లో పూర్తిచేస్తామని పేర్కొని కసరత్తు ప్రారంభించింది. రెండుమూడేళ్ల విరామంతో ఎట్టకేలకు పనులు ప్రారంభించింది. నాలుగేళ్లపాటు నిపుణుల ఆధ్వర్యంలో శ్రమించి 80 శాతం పనులు పూర్తి చేశాక అర్ధంతరంగా ఆగిపోయాయి. క్రేన్ తెచ్చిన తంటా.. అలనాటి నిర్మాణంలో వాడిన రాళ్లనే యథావిధిగా తిరిగి వినియోగించేందుకు వాటిపై నంబర్లు వేసి పెట్టారు. ఆ రాళ్లనే తిరిగి పాత నిర్మాణశైలిలో క్రమపద్ధతిలో పేర్చి, డంగు సున్నం మిశ్రమాన్ని బైండింగ్‌కు వాడి పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ 50 టన్నులు, 12 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు క్రేన్లను అద్దెకు తెచ్చి పనులు చేపట్టగా, ఏఎస్ఐకి సొంత క్రేన్ ఉండగా అద్దె క్రేన్లు ఎందుకు వాడారంటూ అధికారులు అభ్యంతరం చెప్పి బిల్లులు నిలిపివేశారు. అయితే అప్పటికే దాదాపు రూ.ఏడు కోట్ల వ్యయంతో 80 శాతం పనులు పూర్తిచేయడం, క్రేన్లకు సంబంధించిన రూ.కోటిన్నర బిల్లులు రాకపోవటంతో కాంట్రాక్టర్ పనులు నిలిపేశారు. దాన్ని కొలిక్కి తెచ్చే బాధ్యతను ఉమ్మడి ఏపీ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్యకు అప్పగించారు. అయితే కొద్దిరోజులకే ఆయ న మృతి చెందటంతో ఇక ఆ కసరత్తు కంచికి చేరింది. కాగా, తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి ఇప్పుడు కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉండటంతో వేయిస్తంభాల దేవాలయ మండప పునర్నిర్మాణం కొలిక్కి వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. భారీగా పెరిగిన ఖర్చు.. క్రేన్ల వినియోగానికి అనుమతుల విషయంలో ఏర్పడ్డ గందరగోళం ఇప్పుడు ఖర్చును భారీగా పెంచేందుకు కారణమవుతోంది. కేవలం రూ.కోటి వ్యయంతో మిగతా పనులు పూర్తిచేయాల్సిన తరుణంలో, ఇప్పుడు దాని ఖర్చు ఏకంగా రూ.6 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రూఫ్ బీమ్‌లు ఏర్పాటు చేసి పైకప్పు నిర్మించాల్సి ఉంది. దీనికి రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 13 స్తంభాలు గల్లంతు నాట్యమండపంలోని పైకప్పునకు ఆధారంగా 132 స్తంభాలున్నాయి. విప్పదీసినప్పుడు వాటికి నంబర్లు వేసి పెట్టారు. కానీ, ఇప్పుడు 119 స్తంభాలే లెక్కతేలాయి. మిగతా 13 గల్లంతు కావటంతో కొత్తగా వాటిని తయారు చేశారు. -
అబ్బురపడేలా రాజన్న ఆలయం
సాక్షి, హైదరాబాద్: దేశం అబ్బురపడేలా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో వేములవాడ ఆలయ, పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి ఆరా తీశారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారని, వేములవాడ ఆలయాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. వీటీడీఏ, దేవాదాయ, పురపాలక, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, స్తపతులను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు సమాంతరంగా పట్టణాభివృద్ధి జరగాలని సూచించారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పుష్కరిణి, కల్యాణకట్ట, కల్యాణ మండపం, క్యూ కాంప్లెక్స్, కళాభవనం పనుల్లో వేగం పెరగాలని చెప్పారు. టెంపుల్ టూరిజంగా వేములవాడ దేవాలయ పర్యాటకంలో భాగంగా వేములవాడను సమగ్ర అభివృద్ధి చేయాలని, చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించాలని, బోటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేములవాడ, మిడ్‌మానేరులో పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, స్థల సేకరణ వెంటనే చేపట్టాలని, విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. వేములవాడలో దశల వారీగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని, బ్రిడ్జి నుంచి గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉచిత ప్రయాణం కల్పించాలని, దానికి అనుగుణంగా మినీ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
న్యాయవాదుల హత్య: సీన్ రీకన్స్ట్రక్షన్?!
రామగిరి(మంథని): హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై తమ అదుపులో ఉన్న నిందితులతో పోలీసులు శుక్రవారం పొద్దుపోయాక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలిసింది. రామగిరి మండలం కల్వచర్ల శివారులోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకట నాగమణి దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిని శుక్రవారం కోర్టులో రిమాండ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే రిమాండ్ చేయకుండా సంఘటన స్థలికి నిందితులను సాయంత్రం భారీ బందోబస్తు మధ్య తీసుకొచ్చినట్లు సమాచారం. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో మర్డర్ సీన్‌ను రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రధాన రహదారిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న విషయం తెలియని ప్రయాణికులు మళ్లీ ఏదైన జరిగిందా అని ఆసక్తిగా తిలకించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిందితులకు కరోనా పరీక్షలు కోల్‌సిటీ(రామగుండం): హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, పీవీ.నాగమణి జంట హ్యత కేసులో ప్రధాన నిందితులైన కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను పోలీసులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించా రు. ముగ్గురికీ కరోనా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. వైద్యులు వారికి ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. రిమాండ్‌కు తరలించడం కోసం ముందస్తుగా టెస్టులు చేయించారు. కాగా, నిందితులను భారీ బందోబస్తు మధ్య ఆస్పత్రికి తీసుకొచ్చారు. వాహనంలో నిందితులతోపాటు వారికి కత్తులు సమకూర్చినట్లు పోలీసులు తెలిపిన బిట్టు శ్రీను కూడా ఉన్నాడు. అయితే బిట్టు శ్రీనుకు కూడా కరోనా పరీక్షలు చేయించనున్నట్లు తెలిసింది. రాత్రి 11 గంటల కోర్టుకు.. మంథని: రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో బుధవారం జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌ను రాత్రి 11 గంటలకు భారీ బందోబస్తు మధ్య పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో మంథని కోర్టుకు తీసుకొచ్చారు. జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్, జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు ఎదుట ముగ్గురినీ హాజరు పర్చారు. జడ్జి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించా రు. అనంతరం వారిని పోలీసులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. గురువారం అరెస్టు చేసిన ముగ్గురితోపాటు శుక్రవారం అదుపులోకి తీసుకున్న బిట్టు శ్రీను సైతం మంథని కోర్టులో రిమాండ్ చేస్తారనే సమాచారం మేరకు నిందితుల కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. మీడియా ఉదయం నుంచి రాత్రి వరకు కోర్టు వద్దే పడిగాపులు కాశారు. మొదట మధ్యాహ్నం ఒంటిగంటకు అని తర్వాత సాయంత్రం 4 గంటలకని తెలిపారు. కోర్టు సమయం ముగిశాక.. రాత్రి 8 గంటల వరకు మంథని లేదా గోదావరిఖనిలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తారని ప్రచారం జరిగింది. కానీ రాత్రి 11 గంటలకు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. నిందితులు మీడియా, ప్రజల కంట పడకుండా కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం ‘కేకులు కోసినట్లు పీకలు కోస్తారా?’ న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు