RGUKT
-
ఆర్జీయూకేటీ యోగా జట్ల ఎంపిక
నూజివీడు: జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీల్లో పాల్గొనే ఆర్జీయూకేటీ జట్లను ఆదివారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎంపిక పోటీల్లో నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన యోగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ప్రారంభించారు. టీం ఈవెంట్, వ్యక్తిగత, రిథమిక్, ఆర్టిస్టిక్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని ఆర్జీయూకేటీ జట్లకు ఎంపిక చేశారు. వీరు డిసెంబర్ 24 నుంచి 27 వరకు భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా రాజమహేంద్రవరం శాప్ యోగా కోచ్ నాగేంద్రన్ వ్యవహరించారు. ఎంపికైన విద్యార్థులు.. మహిళల విభాగంలో టీం ఈవెంట్ జట్టుకు ఏవీఎల్ నిఖిల, ఎస్.ప్రమీల, ఎ.అనూష, సీహెచ్ దివ్య, జేహెచ్‌వీఎస్ దుర్గ, సీహెచ్ మేఘశ్రీ, వ్యక్తిగత విభాగంలో ఎ.అశ్విత, ఆర్టిస్టిక్ విభాగంలో పి.మేఘన, రిథమిక్ విభాగంలో బి.హేమ ఎంపికయ్యారు. పురుషుల జట్టులో టీం ఈవెంట్‌కు కె.లక్ష్మణరావు, ఆర్.శేషసురేష్, పి.ఆదిశంకర్‌రెడ్డి, టి.అభిషేక్, టి.అశోక్, పి.సాయిసురే‹Ù, వ్యక్తిగత విభాగంలో పి.భరత్‌కుమార్, ఆర్టిస్టిక్ విభాగంలో ఆర్.సాయిచైతన్య, రిథమిక్ విభాగంలో టి.దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. వీరంతా నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందినవారే కావడం గమనార్హం. -
ట్రిపుల్ ఐటీలకు 53,863 దరఖాస్తులు
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకుగాను ఈనెల 25తో దరఖాస్తు స్వీకరణకు గడువు ముగిసింది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 అడ్మిషన్లకు సంబంధించి మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4 వేల సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద మరో 400 సీట్లు కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్‌ను అనుసరించి ట్రిపుల్ ఐటీల సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 34,154 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 19,671 మంది ఉన్నారు. అలాగే బాలురు 23,006 మంది, బాలికలు 30,857 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో స్పెషల్ కేటగిరిలైన క్యాప్ నుంచి 3,495 మంది, ఎన్సీసీ నుంచి 2,129 మంది, దివ్యాంగులు 381 మంది, క్రీడా కోటాలో 1,389 మంది, స్కౌట్స్ అండ్ గైడ్ నుంచి 327 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 28,573 మంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 21,559 మంది, తెలంగాణ నుంచి 3,693 మంది, రెండు తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాలకు చెందిన 38 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు సంబంధించిన సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌ను జూలై 1 నుంచి నిర్వహించనున్నారు. సైనికోద్యోగుల పిల్లలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జూలై 1 నుంచి 3వ తేదీ వరకు, క్రీడా కోటా జూలై 3 నుంచి 6 వరకు, దివ్యాంగుల కోటా జూలై 3న, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా జూలై 2, 3 తేదీల్లో, ఎన్సీసీ కోటా జూలై 3 నుంచి 5 వరకు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నట్లు ట్రిపుల్ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జూలై 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఎంపికైన అభ్యర్థుల సరి్టఫికెట్లను పరిశీలన చేసి అడ్మిషన్లను కలి్పంచనున్నారు.ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ కన్వినర్‌గా అమరేంద్ర వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఆయా ట్రిపుల్ ఐటీల్లో 2024–25 జరిగే అడ్మిషన్ల ప్రక్రియకు కన్వినర్‌గా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న అధ్యాపకుడు డాక్టర్ అమరేంద్ర కుమార్ సండ్రాను ఆర్జీయూకేటీ అధికారులు నియమించారు. గతంలో ఆయన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా, ఎగ్జామ్స్ కంట్రోలర్‌గా, ఏఓగా పనిచేశారు. అడ్మిషన్ల ప్రక్రియను సమర్థంగా చేపడతానని అమరేంద్ర తెలిపారు. ఈయన నియామకంపై ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. -
4 ట్రిపుల్ ఐటీలకు 48 వేల దరఖాస్తులు
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్లలో భాగంగా మంగళవారం వరకు 48 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు మే 6న విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుంది. ఇంతవరకూ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద మరో 400 సీట్లు ఉన్నాయి. మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ అనుసరించి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 50 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ట్రిపుల్ఐటీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.జూలై ఒకటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై ఒకటి నుంచి నిర్వహించనున్నారు. సైనిక ఉద్యోగుల పిల్లలకు జూలై ఒకటి నుంచి 3 వరకు, క్రీడా కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు, దివ్యాంగుల కోటా అభ్యర్థులకు జూలై 3న, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థులకు జూలై 2, 3 తేదీల్లో, ఎన్సీసీ కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు పరిశీలించనున్నట్లు ట్రిపుల్ ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. -
ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకుగాను వర్సిటీ ఈ నెల 6న నోటిఫికేషన్ వెలువరించింది. ఒక్కో సెంటర్లో 1,000 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఈ నెల 8 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రవేశాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీ–ఏకు 7 %, బీసీ–బీకి 10 %, బీసీ–సీకి 1%, బీసీ–డీకి 7%, బీసీ–ఈకి 4% చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తారు. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 5%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, ఎన్సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్ కోటా కింద 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5% సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలోనూ 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.ప్రవేశార్హతలు అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలోనే 2024లో ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి.వయస్సు 31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇలా.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ హైసూ్కళ్లు, మున్సిపల్ హైసూ్కళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4% డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటేజీగా పేర్కొన్నారు. 85% సీట్లను స్థానికం గాను, మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. -
అక్కడ ఎందుకలా చనిపోతున్నారు?
నిర్మల్: విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కలకలం రేపుతున్నాయి. ఇందులో చాలా మరణాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. జూన్‌లోనే ఇద్దరు విద్యార్థి నులు తనువు చాలించగా, ఇటీవలే వర్సిటీలోకి అడుగుపెట్టిన కొత్త విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం కలచివేస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీలు వేసినా అసలు కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఘటనలు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావుడి చర్యలు తీసుకుంటూ ఆ తర్వాత చేతులు దులిపేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఒకప్పుడు 20 వేల నుంచి 30 వేల మధ్య దరఖాస్తులు వచ్చేవి. వరుస ఘటనలతో ఇప్పుడు 10 వేల నుంచి 12 వేల మధ్యకు దరఖాస్తులు పడిపోవడం గమనార్హం. బలవన్మరణాలు ఎందుకు? ఎంత ఒత్తిడి, ఎంత బాధ, భవిష్యత్తుపై ఎంత భయం కలిగి ఉంటే.. ఓ 17ఏళ్ల విద్యార్థి ని బాత్రూమ్లో.. అదీ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు తన చున్నీతోనే ఉరేసుకుంటుంది..? జూన్ 13న సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక(17) ఇలానే ప్రాణాలు తీసుకుంది. ఆమె చనిపోయిన రోజే నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా.. ఇప్పటికీ కారణాలు బయటపెట్ట లేదు. ఇక దీపిక మృతిచెంది రెండురోజులు కూడా గడవకముందే తనతోపాటే పీయూసీ–1 చదువుతున్న గజ్వేల్‌కు చెందిన బుర్ర లిఖిత జూన్ 15న అర్ధరాత్రి తర్వాత గంగా బ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయింది. లిఖిత మరణంలోనూ ఏదో మిస్టరీ ఉందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. తాజాగా ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం నాగాపూర్‌కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కౌన్సెలింగ్ చేస్తున్నారా.. విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పా ర్టీలు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల బాసర సరస్వతీమాత ఆలయంలో హుండీ లెక్కించగా, అందులో తల్లిదండ్రులు రాసిన లేఖ బయటపడింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉంది. అసలు ఆ విభాగం ఏం చేస్తోంది.. నూతన విద్యార్థులకు తరచూ కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు, మరణాలపైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరుగుతోంది.. అసలు.. బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. జూన్‌లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయినప్పుడు నలుగురు సభ్యులతో వేసిన కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో బయటకు రాలేదు. ఇక కళాశాల విద్యార్థులు చనిపోతే ఆ మృతదేహాలను అనాథ శవాల్లా ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులతో మార్చురీకి తరలించేసి యాజమాన్యం దులిపేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు కొన ఊపిరితో ఉన్నప్పుడే ఆస్పత్రులకు పంపించామని చెబుతున్న అధికారులు, బాసరకు దగ్గరగా ఉన్న నిజామాబాద్‌కు పంపించాలి కానీ.. దూరంగా ఉన్న నిర్మల్‌కు ఎందుకు పంపిస్తున్నారన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.. -
నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత బీ.టెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఆయన అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైనవారి జాబితాను జూలై 13న విడుదల చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోటాను 3 నుంచి 5 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు చేపడతామన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారు మాత్రమే ఈ కోటాలో అర్హులని చాన్సలర్ తెలిపారు. పీహెచ్సీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ తదితర ప్రత్యేక కేటగిరీ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను నూజివీడు ట్రిపుల్ ఐటీలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. ఒక్కో క్యాంపస్‌లో ఉన్న వెయ్యి సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో వంద సీట్లు కూడా భర్తీ చేస్తామన్నారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తామని తెలిపారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ కోటాలో చేరినవారు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైనవారికి జూలై 21, 22 తేదీల్లో, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్‌కు కన్వీనర్‌గా ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజును నియమించినట్లు తెలిపారు. -
RGUKT బాసర VC ప్రొఫెసర్ వి.వెంకట రమణ మీట్ అండ్ గ్రీట్
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి..
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ 2 చదువుతున్న బాను ప్రసాద్ సూసైట్ నోట్ రాసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్ల తెలుస్తోంది. అయితే అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి మృతి నేపథ్యంలో అధికారులు బాసర ట్రిపుల్ ఐటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను.. -
ట్రిపుల్ ఐటీలకు 9 వరకు దసరా సెలవులు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 9వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. దీంతో ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులందరూ శనివారం ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులందరూ నేరుగా వారి ప్రాంతాలకు చేరుకునేందుకు గాను ఆర్టీసీ నూజివీడు అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపు 8 వేల మంది విద్యార్థులుండగా వారి కోసం రాజమండ్రి, అమలాపురం, రాజోలు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు 56 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ బస్సలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యార్థులను వారి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అయితే దూర ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్లకు వెళ్లారు. -
ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యల్పంగా విద్యార్థులు ఎంపికయ్యారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,400 సీట్లు ఉండగా, వీటిలో 400 సీట్లు ఈడబ్ల్యూఎస్ సీట్లు కాగా, ప్రత్యేక కేటగిరి కింద 280 సీట్లు మినహా 4,120 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు. వీటిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 463 మంది, గుంటూరులో 434 మంది, నెల్లూరులో 393 మంది, పశ్చిమ గోదావరిలో 128 మంది, శ్రీకాకుళంలో 391 మంది, విజయనగరంలో 337 మంది, విశాఖలో 244 మంది, తూర్పు గోదావరిలో 275 మంది, కృష్ణాలో 269 మంది, కడపలో 231 మంది, కర్నూలో 260 మంది, చిత్తూరులో 357 మంది, అనంతపురంలో 232 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో బాలికలే అధికం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. బాలికలు 2,721 మంది ఎంపికవ్వగా, బాలురు 1,399 మంది మాత్రమే ఎంపికయ్యారు. మొత్తం సీట్లలో ఎంపికైన బాలికల శాతం 66.04, బాలుర శాతం 33.96గా ఉంది. బాలికలు నూజివీడు ట్రిపుల్ ఐటీకి 677 మంది, ఇడుపులపాయకు 676 మంది, ఒంగోలుకు 680 మంది, శ్రీకాకుళానికి 688 మంది ఎంపికయ్యారు. ఏపీ నుంచి 4,014 మంది, తెలంగాణ నుంచి 106 మంది ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో ఉన్నారు. (క్లిక్ చేయండి: అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు..) ముగిసిన ట్రిపుల్ ఐటీ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న అడ్మిషన్లలో భాగంగా సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి దివ్యాంగులకు 120 సీట్లు, సైనికోద్యోగుల పిల్లలకు 80, ఎన్సీసీ 40, స్పోర్ట్స్ కోటా 20, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 20 సీట్లు ఉన్నాయి. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు పర్యవేక్షణలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించారు. క్రీడా కోటాకు 622 మంది, ఎన్సీసీ కోటాకు 1,267 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు 272 మంది, వికలాంగుల కోటాకు 198 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
విద్యారంగానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు: బొత్స
-
AP: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, విజయవాడ: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 77 శాతం మంది ఆర్జీయూకేటీలో సీట్లు దక్కించుకున్నారు. తొలి 20 ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూలు విద్యార్ధులే సాధించారు. చదవండి: విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రారంభించిన ఆర్జీయూకేటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్తగా ఒంగోలు క్యాంపస్ ప్రారంభించామన్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా పారదర్శకంగా ప్రవేశాలు చేట్టామన్నారు. ఈబీసీ కోటాలో 400 సీట్లు కేటాయించామన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది.. దరఖాస్తు చేసుకోండి ఇలా
సత్తెనపల్లి (పల్నాడు జిల్లా): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్టీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో సెంటర్లో 1100 సీట్లు (ఈడబ్ల్యూఎస్ కింద వంద సీట్లు అదనం) అందుబాటులో ఉన్నాయి. గతనెల 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చదవండి: అది ‘ఐ–టీడీపీ’ పనే పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నూజివీడు, ఇడుపులపాయలోని సీట్లలో 85 శాతం సీట్లు స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఈ–మెయిల్, మొబైల్‌కు సమాచారం ఇస్తారు. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కులలిస్టు, రెసిడెన్స్ సర్టిఫికెట్, సంబంధిత రిజర్వేషన్ల ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. అర్హతలు ♦అభ్యర్థులు ప్రథమ ప్రయత్నం లోనే 2022లో ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. ♦ఈ ఏడాది సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారూ రెగ్యులర్‌గానే ప్రభుత్వం ప్రకటించినందున వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ♦ ఏపీ ఆన్లైన్ సెంటర్ ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 250, ఎస్సీ, ఎస్టీలు రూ. 150 చెల్లించాలి. ♦ రశీదును జాగ్రత్తగా పెట్టుకోవాలి, సర్వీసు చార్జి కింద ఆన్లైన్ సెంటర్‌కు అదనంగా రూ.25లు చెల్లించాలి. ఫీజుల వివరాలు ♦ రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ♦ ట్యూషన్ ఫీజు కింద పీయూసీ–1, పీయూసీ–2లకు ఏడాదికి రూ.45వేలు, ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలకు ఏడాదికి రూ.50వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి ♦ ఎన్నారై, అంతర్జాతీయ విద్యార్థులు అయితే ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి కోర్సులు పీయూసీ : గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంగ్లిషు, తెలుగు, ఐటీ, బయాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇంజినీరింగ్ : కెమికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ (ఈ రెండు నూజివీడు, ఇడుపులపాయలో మాత్రమే ఉన్నాయి). సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లు. గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు : సెప్టెంబర్ 19 అర్హుల జాబితా విడుదల : సెప్టెంబర్ 29 కౌన్సెలింగ్ తేదీలు : అక్టోబరు 12 నుంచి 15 వరకు తరగతులు ప్రారంభం : అక్టోబరు 1 -
ట్రిపుల్ ఐటీలో విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు
వేంపల్లె (వైఎస్సార్ కడప జిల్లా): ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతుల కోసం ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ (ఈ4) విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి (సోమవారం) పీ2 (ఒంగోలు, ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే సుమారు 1,100 మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు చేరుకున్నారన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి పీ1 విద్యార్థులకు, 19వ తేదీ నుంచి ఈ3 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. మార్చి 2వ తేదీలోపు ఈ1, ఈ2 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు బహిష్కరిస్తున్నట్లు మెయిల్స్ పెట్టారని, అందుకు స్పందించి త్వరలోనే వారికి ఆఫ్‌లైన్ తరగతుల కోసం షెడ్యూల్ ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీలో ఖాళీల భర్తీ నూజివీడు (ఆగిరిపల్లి): కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది, విద్యార్థులు చేరకపోవడంతో ఖాళీ అయిన 66 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేసినట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలు క్యాంపస్‌లో 34, శ్రీకాకుళం క్యాంపస్‌లో 32 సీట్లకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పూర్తయిందన్నారు. ఖాళీల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆచార్య జి.వి.ఆర్.శ్రీనివాసరావు, అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య గోపాలరాజు పర్యవేక్షించారు. -
ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీ
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు సోమవారం తెలిపారు. కౌన్సెలింగ్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్సీసీ, సైనిక సంతతి కోటా వారికి ఈ నెల 12న, క్రీడా, వికలాంగుల కోటా వారికి ఈ నెల 13న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీతో జనరల్ కౌన్సెలింగ్ పూర్తికాగా ప్రత్యేక కేటగిరీకి చెందిన 257 సీట్లు అలాగే ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనను నవంబరు నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరిశీలన అనంతరం స్పోర్ట్స్, ఎన్సీసీ, వికలాంగులు, సైనిక సంతతి కోటాలకు సంబంధించి మెరిట్ జాబితాను తయారు చేశారు. ఈ జాబితాను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. -
నేడు ఆర్జీయూకేటీ సెట్
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మొత్తం 75,283 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష నిర్వహణకు ఏపీలో 467, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫలితాలను అక్టోబర్ 4న మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల 10వ తరగతి పరీక్షలు జరగనందున.. ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థుల్లో 40,555 మంది బాలురు, 34,728 మంది బాలికలున్నారని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు.. వచ్చే ఏడాదిలోగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనేక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి.. మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. 2008–14 బ్యాచ్‌కు చెందిన జి.విద్యాధరి సివిల్ సర్వీసెస్‌లో 211వ ర్యాంకు, అలాగే 2012వ బ్యాచ్‌కు చెందిన చీమల శివగోపాల్‌రెడ్డి 263వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఇడుపులపాయ, నూజివీడులో సోలార్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటివల్ల ఏడాదికి రూ.కోటికి పైగా నిధులు ఆదా అవుతున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అనలాగ్ డివైజెస్ కంపెనీ ఈ ఏడాది 50 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసుకుందని చెప్పారు. మెంటార్లను రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదని.. 4 ట్రిపుల్ ఐటీల్లో 400 వరకు లెక్చరర్ పోస్టులున్నాయని, వారిని ఆ పోస్టుల్లో నియమిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్జీయూకేటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ కె.సామ్రాజ్యలక్ష్మి, సెట్ కన్వీనర్ డి.హరినారాయణ, నూజివీడు డైరెక్టర్ జి.వి.ఆర్.శ్రీనివాసరావు సెట్ కో–కనీ్వనర్ ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు, ఏఓ భానుకిరణ్, డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి పాల్గొన్నారు. -
26న ఆర్జీయూకేటీ సెట్–2021
నూజివీడు/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఆర్జీయూకేటీ సెట్–2021ని ఈ నెల 26న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏదైనా మండలం నుంచి 100 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే అదే మండలంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తక్కువ వస్తే సమీపంలోని మండల కేంద్రంలోని సెంటర్‌ను కేటాయిస్తామని వెల్లడించారు. తెలంగాణలో 8 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 74,403 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 11 వరకు దరఖాస్తుకు అవకాశం ఆర్జీయూకేటీ సెట్–2021కి రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ హరినారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ సవరణకు శనివారం (11వ తేదీ) వరకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఇవీ చదవండి: ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అధిక డేటా.. మరింత వేగం -
మునిసిపాలిటీల్లోనూ అడ్డగోలు వ్యవహారాలే
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి పెద్దల సన్నిహితులకు అడ్డగోలుగా మునిసిపల్ స్థలాలను కట్టబెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా మునిసిపల్ ఆస్తుల శాశ్వత బదలాయింపు, లీజుల పేరిట అస్మదీయులకు ధారాదత్తం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్ల నుంచి మొబలైజేషన్ అడ్వాన్సులు వసూలు చేయలేదు. 2019 మార్చి 31తో ముగిసిన కాలానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీయే)కి చెందిన 313.79 చదరపు గజాల స్థలాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం తమ సన్నిహితుల సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అత్యంత తక్కువ రేటుకు కట్టబెట్టేసింది. మార్కెట్ విలువ ప్రకారం అక్కడ గజం రూ.48 వేలుగా ఉందని వీఎంఆర్డీయే ప్రభుత్వానికి నివేదించింది. కానీ.. టీడీపీ పెద్దల ఒత్తిడితో అప్పటి కేబినెట్ చదరపు గజం కేవలం రూ.16 వేల చొప్పున ఆ సంస్థకు అప్పగించింది. నిబంధనల ప్రకారం భూ కేటాయింపు ప్రతిపాదనలు రాష్ట్ర భూ నిర్వహణ అథారిటీ ద్వారా రాష్ట్ర మంత్రివర్గానికి వెళ్లాలి. కానీ ఆ అథారిటీ పరిశీలించకుండానే, సిఫార్సు లేకుండానే అప్పటి మంత్రివర్గం ఆమోదించేసింది. దాంతో ప్రభుత్వానికి రూ.కోటి నష్టం వాటిల్లింది. అంతేకాదు చదరపు గజానికి రూ.16 వేల చొప్పున ఆ సంస్థ చెల్లించాల్సిన మొత్తం రూ.50.21 లక్షలకు గాను కేవలం రూ.40.21 లక్షలే చెల్లించింది. మిగలిన రూ.10 లక్షలు చెల్లించకపోయినా వీఎంఆర్డీయే పట్టించుకోలేదు. లీజుల్లోనూ ఇష్టారాజ్యం విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన వివేకానంద కల్యాణ మండపాన్ని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతల సన్నిహితులకు 2015లో మూడేళ్లకు లీజుకు ఇచ్చేశారు. ఈ అడ్డగోలు వ్యవహారంతో విశాఖపట్నం కార్పొరేషన్‌కు రూ.92.67 లక్షల నష్టం వాటిల్లింది. విశాఖపట్నం కార్పొరేషన్లో 24 గంటల తాగునీటి సరఫరా కోసం ప్యాకేజీ–1 కింద రూ.86.90 కోట్ల పనులను ఎస్ఎంసీ–సీసీఎస్పీల్–ఈసీఎల్ అనే జాయింట్ వెంచర్ సంస్థకు అప్పగించారు. పనులు త్వరగా పూర్తి చేయాలనే షరతుపై జీవీఎంసీ కాంట్రాక్టరుకు రూ.8.69 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ చెల్లించింది. కానీ కాంట్రాక్ట్ సంస్థ కేవలం 30 శాతం పనులు మాత్రమే చేసి 2016 జూలై అర్ధంతరంగా పనులు వదిలేసి వెళ్లిపోయింది. ఆ సంస్థ నుంచి మొబలైజేషన్ అడ్వాన్స్‌ను మునిసిపల్ కార్పొరేషన్ వసూలు చేయలేకపోవడంతో ప్రజాధనం రూ.8.69 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అనంతపురం మునిసిపల్ మార్కెట్ లీజు, అద్దె మొత్తాలను వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి 2011–12 నుంచి 2015–16 వరకు అద్దెలు వసూలు చేయకపోవడంతో రూ.1.57 కోట్ల నష్టం వాటిల్లింది. నిరుపయోగమైన ఆర్జీయూకేటీ పరికరాలు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థుల ప్రయోజనాల కోసం రూ.1.95 కోట్లతో 2013–2014లో ఏర్పాటుచేసిన విలువైన పరికరాలను నిరుపయోగంగా ఉంచారని కాగ్ నివేదిక తప్పుబట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరికరాలను వినియోగించడంలో నిర్లిప్తంగా ఉండడాన్ని ఎండగట్టింది. ఆర్జీయూకేటీలో ఇన్స్ట్రుమెంటెడ్ పెండ్యులం ఇంపాక్ట్ టెస్టర్, 100 కెఎన్ హై టెంపరేచర్ యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ సరఫరాకు ఒక సంస్థకు 2013–2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. 2014 ఆగస్టులో ఈ పరికరాలను ఆర్జీయూకేటీ ఇడుపులపాయ క్యాంపస్‌కు అందించారు. పరికరాలు సరఫరా చేసిన సంస్థకు 90 శాతం అంటే రూ.1.75 కోట్లను ఆర్జీయూకేటీ చెల్లించింది. మిగిలిన 10 శాతాన్ని పరికరాలు అమర్చి వాటి వినియోగం ప్రారంభం అయిన తరువాత చెల్లించాల్సి ఉంది. ఈ పరికరాలను అమర్చి తమకు ఉపయోగపడేలా చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, అధ్యాపకులు విన్నవించినా ఐదేళ్లు పట్టించుకోలేదు. మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ భవన నిర్మాణం పూర్తికాకపోవడం, విద్యుత్ లేకపోవడంతో పరికరాలు అమర్చలేదని ఆర్జీయూకేటీ సమాధానం ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. అమర్చడానికి స్థలం నిర్ధారించకుండా పరికరాలు సేకరణను తప్పుబట్టింది. పాఠశాలల్లో పనులు చేయలేదు ఉపాధి హామీ పథకం కింద 3 వేల పాఠశాల మైదానాలను ఆటస్థలాలుగా అభివృద్ధి చేయాలని 2017 ఫిబ్రవరిలో పాఠశాల విద్యాశాఖ సూచనలిచ్చింది. రూ.58.28 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 2019 సెప్టెంబర్ నాటికి రూ.15.59 కోట్లతో 1,046 పనులు పూర్తయ్యాయి. రూ.42.69 కోట్లతో చేయాల్సిన పనులు పూర్తికాలేదని కాగ్ ఎత్తిచూపింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని అధికారులకు సూచించామని, ఇంకా నివేదికలు రావాల్సి ఉందని 2020 నవంబర్‌లో ప్రభుత్వం తెలిపిందని కాగ్ నివేదికలో పేర్కొంది. వాణిజ్య పన్నుల శాఖకు రూ.84.11 కోట్లు నష్టం వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు రూ.84.11 కోట్ల ఆర్థిక నష్టం కలిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్)లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం117 వాణిజ్య శాఖ కార్యాలయాలు ఉండగా.. 2018–19 సంవత్సరానికి గాను అందులో 37 కార్యాలయాల్లోని రికార్డులను కాగ్ పరిశీలించింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల మొత్తం 448 కేసుల్లో రూ.84.11 కోట్ల వ్యాట్‌ను తక్కువగా మదింపు చేసినట్టు వెల్లడైంది. 180 కేసుల్లో వ్యాట్‌ను విధించకపోవడం లేదా తక్కువగా విధించడం ద్వారా ఖజానాకు రూ.65.29 కోట్ల నష్టం వాటిల్లింది. జరిమానాలు, వడ్డీలు విధించకపోవడం ద్వారా రూ.6.68 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా రూ.5 కోట్లు, సీఎస్టీ చట్టం కింద 67 కేసుల్లో పన్ను విధించకపోవడం వల్ల రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా రాయితీల చెల్లింపులు రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015–20కి విరుద్ధంగా కొన్ని పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించినట్టు కాగ్ నివేదికలో నిగ్గు తేలింది. నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు ఐస్ ఫ్యాక్టరీలకు 2017 నుంచి 2019 మార్చి కాలానికి రూ.1.32 కోట్ల రాయితీలను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు కాగ్ పేర్కొంది. తినడానికి ఉపయోగించే ఐస్‌ను కాకుండా నిల్వ, సంరక్షణ కోసం తయారు చేసే ఐస్ ఫ్యాక్టరీ అయినప్పటికీ ఆహార తయారీ ప్రోత్సహాక విధానం కింద వీటికి రాయితీలు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తం మంజూరైన రూ.1.32 కోట్ల రాయితీ సక్రమం కాదని, ఇప్పటికే చెల్లించిన రూ.76.39 లక్షలు తిరిగి రాబట్టాలని కాగ్ ప్రభుత్వానికి సూచించింది. రుణ భారంలో పీఎస్‌యూలు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల పేరుతో భారీగా రుణాలను సమీకరించినట్టు కాగ్ పేర్కొంది. వరి ధాన్యం కొనుగోలు, పీడీఎస్ బియ్యం సేకరణ, మౌలిక వసతుల కల్పన పేరిట ప్రభుత్వరంగ సంస్థల పేరిట భారీగా రుణాలను సేకరించినట్టు తెలిపింది. 2016–17లో రాష్ట్ర పీఎస్‌యూల అప్పులు రూ.8,518.99 కోట్లుగా ఉంటే.. 2018–19 నాటికి రూ.30,530.91 కోట్లకు గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎస్బీఐ నుంచి రూ.19 వేల కోట్లను అప్పు తీసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఈడబ్ల్యూఎస్ ఇళ్ల భూములు, మౌలిక వసతుల కల్పనకు ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ రూ.3,951.59 కోట్ల రుణాలను తీసుకున్నట్టు పేర్కొంది. -
గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో పెద్దపీట
సాక్షి, అమరావతి/నూజివీడు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యాసంవత్సరానికి గ్రామీణ విద్యార్థులకే అత్యధిక సంఖ్యలో సీట్లు లభించాయి. రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్ ఐటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒక్కో దానిలో వేయి చొప్పున మొత్తం 4 వేల సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో అదనంగా సూపర్ న్యూమరరీ కింద 10 శాతం చొప్పున 400 సీట్లను, ఎన్ఆర్ఐ కోటా కింద 7 సీట్లను కలిపి మొత్తం 4,407 సీట్లను ఈ విద్యాసంవత్సరంలో కేటాయించారు. గతేడాది కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ సెట్లో ఎక్కువ స్కోరు సాధించి ర్యాంకులు పొందిన వారికి రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించారు. -
4 నుంచి ట్రిపుల్ ఐటీల అడ్మిషన్ల కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి/నూజివీడు: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జనవరి 4వ తేదీనుంచి ప్రారంభం కానుంది. కృష్ణాజిల్లా నూజివీడు, వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లలో సమాంతరంగా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ రెండు కేంద్రాల్లో తమకు సమీపంలోని దేనికైనా అభ్యర్థులు హాజరుకావచ్చని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్ ర్యాంకుల ఆధారంగా వర్సిటీ పరిధిలోని నూజివీడు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు డిప్రవేషన్ స్కోర్ కింద 0.4 మార్కులను కలిపి ర్యాంకులను ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీలోని దివ్యాంగులు, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు మినహా ఇతర అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేశారు. మెరిట్ ర్యాంకుల జాబితా, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీ.ఐఎన్’లో ఉంచారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు ఏ రోజున హాజరుకావాలో ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. అభ్యర్థులు జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు తమకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 8 గంటలకల్లా ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండేసి జిరాక్స్ కాపీలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. జనవరి 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులలో ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28 నుంచి, దివ్యాంగుల ధ్రువపత్రాల పరిశీలన జనవరి 2న నూజివీడు క్యాంపస్‌లో చేపట్టనున్నారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,100 సీట్లు భర్తీ చేస్తారు. దీన్లోనే కేంద్రప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10 శాతం అదనపు కోటా కింద 100 సీట్లు ఉన్నాయి. 85 శాతం ఏపీ లోకల్, 15 శాతం ఏపీ, తెలంగాణ వారికి.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 371డీ ప్రకారం మొత్తం సీట్లలో 85 శాతం ఏపీ స్థానికత ఉన్న అభ్యర్థులకు, 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ కింద ఏపీ, తెలంగాణ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తారు. 85 శాతం లోకల్ కోటాలో రిజర్వేషన్లను అనుసరించి ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్సీసీ కోటాలో 1 శాతం, స్పోర్ట్సు కోటాలో 0.5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.1/3 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు. బాలికలు లేనట్లయితే అదే కేటగిరీ బాలురతో ఆ సీట్లు భర్తీచేస్తారు. ట్రిపుల్ఐటీల్లో కోర్సులు నూజివీడు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. నూజివీడు, ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లలో అదనంగా కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు ► ఆర్జీయూకేటీ సెట్ మార్కుల మెమో ► ఆర్జీయూకేటీ ర్యాంకు కార్డు ► టెన్త్ హాల్‌టికెట్ ► నివాస ధ్రువపత్రం (ఏపీ లోకల్) ► నివాస ధ్రువపత్రం లేదా పేరెంట్సు సర్వీస్ సర్టిఫికెట్ (నాన్‌లోకల్ కేటగిరీ) ► కుల ధ్రువీకరణపత్రం ► ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం ► దివ్యాంగ ధ్రువపత్రం ► సీఏపీ ధ్రువపత్రం l ఎన్సీసీ, స్పోర్ట్సు ధ్రువపత్రాలు (ఆయా ధ్రువపత్రాలు ఆర్జీయూకేటీ నిర్దేశించిన ప్రొఫార్మాల్లో ఉండాలి) -
ఆర్జీయూకేటీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. అదే నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆర్జీయూకేటీ సెట్–2020 ఫలితాలను శనివారం విజయవాడలో ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం సెట్‌ను నిర్వహించామన్నారు. కరోనా కారణంగా 6.30 లక్షల మందికిపైగా విద్యార్థులను పదో తరగతిలో పాస్ చేసినట్లు చెప్పారు. ఆర్జీయూకేటీ సెట్‌కు 88,974 మంది దరఖాస్తు చేయగా 85,755 మంది హాజరయ్యారన్నారు. ఈ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. వారంలోనే ఫలితాలను విడుదల చేయడంలో ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి, ఇన్చార్జ్ వీసీ హేమచంద్రారెడ్డి, కన్వీనర్ హరినారాయణల కృషి అభినందనీయమన్నారు. ఫలితాలను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో పొందుపర్చామన్నారు. విద్యార్థులకు కటాఫ్ మార్కులతో కూడిన కాల్ లెటర్లు పంపిస్తామన్నారు. 1,900 అభ్యంతరాలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నలపై 1,900 అభ్యంతరాలు రాగా ఫిజిక్స్, మ్యాథ్‌్సలో రెండు తప్పులను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి సురేశ్ చెప్పారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ–గుంటూరు, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ– తిరుపతి, డా.వైఎస్సార్ హార్టికల్చర్ వర్సిటీల పరిధిలో డిపొ్లమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 300 జూనియర్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతోపాటు ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని వాటి డైరెక్టర్లకు సూచించారు. ఈ మేరకు విజయవాడలోని ఒక హోటల్లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ట్రిపుల్ ఐటీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె.సి.రెడ్డి, హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.. నేను గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివా. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉపాధ్యాయుల సహకారంతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఆర్జీయూకేటీ సెట్లో నాకు 99 మార్కులు వచ్చాయి. ఉన్నత విద్యాభ్యాసం అయ్యాక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తా. – గుర్రం వంశీకృష్ణ, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, ఆర్జీయూకేటీ సెట్, గుంటూరు -
‘ఆర్జీయూకేటీ సెట్’ విజయవంతం
సాక్షి, విజయవాడ: ‘ఆర్జీయూకేటీ సెట్-2020’ పరీక్ష విజయవంతంగా ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 638 పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షకు 85,760 మంది విద్యార్థులు హాజరయ్యారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 97.61 శాతం, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 95.38 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షపై అభ్యంతరాలుంటే ఈ నెల 7 వతేదీ సాయంత్రం 5 గంటలలోపు www.rgukt.in లో నమోదు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన " కీ " ని 8న విడుదల చేస్తామని ఆర్జీయూకేటీ ఎగ్జామినేషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ డి.హరినారాయణ వెల్లడించారు. -
ల్యాప్‌టాప్‌ల కొను‘గోల్మాల్’..!
సాక్షి, నూజివీడు: ఆర్జీయూ కేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించిన ల్యాప్‌టాప్ కొనుగోళ్లలో కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వైస్ చాన్స్‌లర్, వీసీ కార్యాలయంలో పనిచేసిన కొంతమంది కాంట్రాక్టు అధికారులు, అప్పటి ఆయా ట్రిపుల్‌ఐటీల డైరెక్టర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు నిమిత్తం నియమించిన కమిటీ సభ్యులు ఈ తతంగంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి ఒక కంపెనీకి అనుకూలంగా టెండర్ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. రూ. 8,500 అదనంగా.. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ఒక్కోక్కటికీ 3,500, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీకి 4వేలు.. మొత్తం 11,000 ఏఎండీ ప్రాసెసర్లు కల్గిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. వీటి ధర ఆన్లైన్లో రూ.20వేలు ఉండగా, ఆర్జీయూకేటీ అధికారులు మాత్రం రూ.28,500లకు కొన్నారు. సింగిల్ టెండర్ రాగా దానినే ఆమోదించారు. ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా.. ల్యాప్‌టాప్‌లు చాలా నాసిరకంగా ఉన్నాయని, ఏఎండీ ప్రాసెసర్ కావడంతో ఏమాత్రం పనిచేయడం లేదని విద్యార్థులు, ఫ్యాకల్టీ పేర్కొనడం గమనార్హం. నూతన ల్యాప్‌టాప్‌ల కంటే 2011, 2012 సంవత్సరాలలో కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లే బాగా పనిచేస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. రిపీట్ ఆర్డర్‌పై ఆరా..! ముందుగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలిచి 7వేల ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయగా, ఆ తర్వాత ఒంగోలు ట్రిపుల్ఐటీకి మాత్రం 4వేల ల్యాప్‌టాప్‌లను రిపీట్ ఆర్డర్‌పై కొనుగోలు చేయడం గమనార్హం. అప్పట్లో నూజివీడుకు కూడా రిపీట్ ఆర్డర్‌తో కొనుగోలు చేయాలని అప్పటి వైస్‌చాన్స్‌లర్ డైరెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ అందుకు ఒప్పుకోలేదు. తాను చెప్పిన మాట వినలేదనే ఆ తర్వాత నూజివీడు డైరెక్టర్‌కు రెండోసారి రెన్యువల్ చేయకుండా పంపించేశారు. దీనిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. టెండర్ ఫైనలైజ్ అయినా రద్దు.. దీనికి ముందు 2017లో ల్యాప్‌టాప్ టెండర్‌ను పిలువగా, ఒక కంపెనీ న్యూజనరేషన్ ప్రాసెసర్‌తో 6 ఏళ్ల గ్యారెంటీతో బై బ్యాక్ పద్ధతిలో రూ.30,400ల ధరకు కోట్ చేయడం జరిగింది. అంతే కాకుండా వీటిని మార్చేటప్పుడు రూ.5,200లతో తానే కొనుగోలు చేస్తానని కూడా ఆ కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన టెండర్ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత అప్పటి వీసీ ఈ టెండర్‌ను రద్దు చేసి మరలా టెండర్ పిలిచారు.దీనిపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బెంచ్‌మార్కు టెస్ట్‌లు లేకుండానే.. ఏ కంపెనీకి చెందినవైనా తప్పనిసరిగా వాటి పనితీరును పరిశీలించేందుకు బెంచ్‌మార్కు టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. 11వేల ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేముందు ఇక్కడ ఎలాంటి బెంచ్‌మార్కు టెస్ట్‌లు జరపకుండా నాసిరకం ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసి విద్యార్థులకు అంటగట్టేశారు. అయితే విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..
సాక్షి, విశాఖపట్నం : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నాలుగు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 10వ తరగతిలో ఉత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యా సంస్థల్లో రెండేళ్లపాటు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటివి బోధిస్తారు. ఈ రెండేళ్లు చదువును ఇంటర్మీడియెట్‌తో సమానంగా పరిగణించి.. ఆ తర్వాత ఇంటర్లో వచ్చే మార్కులు, సామాజిక వర్గాల రిజర్వేషన్ ప్రాతిపదికన ఇంజినీరింగ్‌లో శాఖలను కేటాయించి నాలుగేళ్లపాటు విద్యనందిస్తారు ప్రవేశాల షెడ్యూల్ ఇదే.. ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఈ ఏడాది కొత్తగా 4 వేల మందికి సీట్లు లభించనున్నాయి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు జూలై 1 వరకు ఆఖరు తేదీగా పరిగణించారు. వికలాంగ, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ క్రీడా కోటాల వంటి ప్రత్యేక కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీలను జూలై 1లోగా యూనివర్సిటీకి పంపాలి. ఇతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు ప్రింట్ ఔట్ కాపీలు పంపాల్సిన అవసరం లేదు. ప్రత్యేక కేటగిరీల అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూలై 14, 15వ తేదీల్లో నూజివీడులో నిర్వహిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా ఇతర అభ్యర్థుల ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను జూలై 23న ప్రకటిస్తారు. మొదటి విడతలో నూజివీడు, ఇడుపులపాయ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రవేశాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో ఆయా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో నిర్వహిస్తారు. ఆగస్టు 7, 8వ తేదీలలో ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ధ్రువపత్రాల పరిశీల న ఉంటుంది. ట్రిపుల్ ఐటీలలో వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్సీసీ క్రీడల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 20న ప్రకటిస్తారు. వీరికి జూలై 24, 25, 26, 27వ తేదీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువపత్రాల పరిశీలన , ప్రవేశాలు క ల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్టు 9 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయి. ప్రవేశ విధానం ఇలా.. 2019 పదో తరగతిలో సాధించిన జీపీఏ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి మండలానికి చెందిన విద్యార్థులకు ఈ ట్రిపుల్ ఐటీలలో అవకాశం కల్పిస్తారు. ఇడుపులపాయ, నూజి వీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో ఒక్కొక్క దానిలో 1000 మంది చొప్పున 4 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 85 శాతం సీట్లను ఆయా విశ్వవిద్యాలయాలు ట్రిపుల్ ఐటీల పరిధిలోని జిల్లాకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లలో ప్రతిభ ఆధారంగా ఏపీ, టీఎస్ రాష్ట్రాలకు చెంది న విద్యార్థులను ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేస్తారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు పంపాలి 2019లో ఉత్తీర్ణత సాధించిన 10వ తరగతి విద్యార్థులు ఆన్లైన్లో http://www.rgukt.in/ వెబ్సైట్లో జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్లో 10వ తరగతి హాల్ టికెట్, మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి తల్లిదండ్రుల ఫొటోలను సమర్పించాలి. వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్సీసీ, క్రీడ కోటా కింద ఎంపికైన వారు సంబంధిత అధికారులు ఇచ్చే ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు దరఖాస్తు ప్రింట్ ఔట్ కాపీలు, ఏపీ ఆన్లైన్ రసీదు, పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలన్నింటినీ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ వారే గుంటూరు జిల్లా తాడేపల్లెలోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు ప్రింట్ పత్రాలు పంపాలి. వికలాంగులు, ఎన్సీసీ, సైనికుల పిల్లలు, క్రీడా కోటా కింద దరఖాస్తు చేస్తున్న వారు ఆన్లైన్లో దరఖాస్తులను ద కన్వీనర్, యూజీ అడ్మిషన్స్, 2019 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి, టెక్నాలజీస్, ప్లాట్ నంబర్ 202, సెకండ్ ఫ్లోర్, ఎన్ఆర్ఐ బ్లాక్ సి, శ్రీమహేంద్ర ఎన్క్లేవ్, తాడేపల్లె, గుంటూరు జిల్లా 522501, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు జూలై 1లోగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం ఆన్లైన్లో పంపే దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఒకే దరఖాస్తు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అభ్యర్థులు ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు, ఫీజు, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 150, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులు రూ.100, అదనంగా రూ.25 ప్రాసెసింగ్ ఫీజు చెల్లిం చాలి. నాలుగు ట్రిపుల్ ఐటీలకు ప్రాధాన్యతను చూపుతూ ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ వారు మాత్రమే తమ రిజర్వేషన్ ప్రింట్ ఔట్లు, ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్ చేసి వాటిపై విద్యార్థి సంతకంతో పంపాలి. దరఖాస్తులో మొదటి, రెండు, మూడు, నాలుగు ప్రాధాన్యాలను వెల్లడి చేస్తూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ట్రిపుల్ ఐటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్థులకు ఈ–మెయిల్, సెల్ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. పోస్టల్ ద్వారా కూడా ఉత్తరం పంపుతారు. విద్యార్హతలు 2019లో పదో తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31 డిసెంబర్ 2019 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 21 ఏళ్లు. -
పేదింటి విద్యార్థులకు..పెద్ద చదువులు
పశ్చిమ గోదావరి, నిడమర్రు : గ్రామీణ ప్రాంతాల్లోని పేదింటి విద్యార్థులకు పెద్దింటి చదువులు అందించాలనే ఉన్నత లక్ష్యంతో దివంగత వైస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నవే ట్రిపుల్ ఐటీ కళాశాలలు. ఈ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల సమీకృత బీటెక్ డిగ్రీ విద్యా కార్యక్రమంలో 2018–19 సంవత్సరానికి మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు 1,581 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన వారు తక్కువగానే ఉన్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ప్రభుత్వ విద్యార్థికి సీటు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు 10 జీపీఏ గ్రేడ్ పాయిట్స్కు దిగువున ఉన్న గ్రేడ్స్ సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులందరూ ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో అభ్యసించేందుకు అవసరమైన దరఖాస్తులు జూన్ 8వ తేదీ వరకూ ఆన్లైన్లో స్వీకరిస్తారు. ప్రవేశ అర్హతలు ఇలా.. అభ్యర్థులు తొలి ప్రయత్నంలోనే 2018లో ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఏపీ/తెలంగాణ రాష్ట్రాల్లో రెగ్యులర్ విద్యార్థిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎస్ఈలో పది చదివినవారు కూడా అర్హులే. వయోపరిమితి 2018 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయోపరిమితిలో 21 ఏళ్ల వరకూ సడలింపు ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా.. ⇔ అభ్యర్థులు కేవలం ఏపీఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ⇔ మీ సేవా కేంద్రాల నుంచి ఆర్జీయూకేటీ వెబ్సైట్ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ⇔ ఓసీ, బీసీలకు రూ.150, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 ఏపీఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలి. ⇔ అప్లికేషన్‌తోపాటు సర్వీస్ చార్జి కింద ఆన్లైన్ సెంటరుకు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ⇔ దరఖాస్తుతోపాటు పదో తరగతి హాల్ టికెట్ ⇔ పది పరీక్షల్లో సాధించిన గ్రేడ్ పాయింట్స్ ఏవరేజ్(జీపీఏ) సర్టిఫికెట్ ⇔ ఇతర రిజర్వేషన్లు ఉంటే(స్పోర్ట్/ఎన్సీసీ/క్యాప్/దివ్యాంగ) వాటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ⇔ 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు. రిజర్వేషన్ కోటాలు ఇలా ⇔ ఒక్కో కళాశాలలో 85 శాతం సీట్లు స్థానికంగానూ, మిగిలిన 15 శాతం సీట్లు మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ⇔ ప్రతీ వంద మంది విద్యార్థుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ–ఏ 7 శాతం, బీసీ–బీ 10 శాతం, బీసీ–సీ 1 శాతం, బీసీ–డీ 7 శాతం, బీసీ–ఈ 4 శాతం ⇔ సీట్లలో ప్రత్యేక కోటాకింద దివ్యాంగులకు 3 శాతం, సైనిక ఉద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటాకింద 0.5 శాతం సీట్లు భర్తీ చేస్తారు. ⇔ నూటికి 33.33 శాతం సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. ఫీజుల విరాలు ⇔ ఏపీ/తెలంగాణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు కింద ప్రతీ ఏటా రూ.36 వేలు చొప్పున చెల్లించాలి. తెల్లకార్డు ఉన్న వారు/ఫీజ్ రీయంబర్స్‌మెంట్‌కు అర్హులైనవారు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. ⇔ ఫీజు రీయంబర్స్మెంట్ పొందాలంటే విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థి కుటుంబాలకైతే రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలి. ⇔ రిజిస్ట్రేషన్ ఫీజుకింద ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చొప్పున చెల్లించాలి. ⇔ కాషన్ డిపాజిట్ కింద అన్ని కేటగిరి అభ్యర్థులూ రూ.2 వేలు చెల్లించాలి. ⇔ ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలకు ఏడాదికి ట్యూషన్ ఫీజుకింద రూ.1.36 లక్షలు చెల్లించాలి ⇔ విదేశీ/ఎన్ఆర్ఐ విద్యార్థులకు ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి ⇔ ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించినప్పటి రసీదు, టెన్త్ హాల్ టికెట్, మార్కుల లిస్ట్, నివాస ధ్రువీకరణ పత్రం, బీసీ/ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులు కుల« ధ్రువీకరణ పత్రాలు, ⇔ దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనికోద్యోగుల పిల్లలకు సంబంధిత అధికారి జారీచేసిన సర్టిఫికెట్ ⇔ ఎన్సీసీ/స్పోర్ట్ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. ఎంపిక ఇలా.. ⇔ టెన్త్ పరీక్షల్లో సాధించిన విద్యార్థుల గ్రేడ్ల వారీగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గ్రేడ్ పాయింట్స్ సమానమైతే వారి ఎక్కువ జీపీఏ సాధించిన(గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషల్) సబ్జెక్ట్ వారీగా సాధించిన గ్రేడ్ పాయిట్స్ పరిగణనలోకి తీసుకుంటారు. ⇔ ఈ గ్రేడ్ పాయింట్స్‌లోనూ పోటీఉంటే, పుట్టిన తేదీ ప్రకారం వయసులో పెద్దవారిని ఎంపిక చేస్తారు. ⇔ నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జెడ్పీ, మున్సిపల్ పాఠశాలు, ఏపీ మోడల్స్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు, కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో టెన్త్ చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలిపి కౌన్సెలింగ్‌లో ప్రతిభను నిర్ధారిస్తారు. ⇔ ఎంపికైన అభ్యర్థులకు ఆరేళ్లపాటు ల్యాప్‌టాప్, ప్రతీ ఏటా మూడు జతల డ్రస్సులు, రెండు జతల షూలు, హాస్టల్లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది. ముఖ్యమైన తేదీలు... ⇔ ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జూన్ 8 ⇔ పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/స్పోరŠట్ప్ విద్యార్థులు పోçస్టులో పంపిన ⇔ ధ్రువీకరణ పత్రాల కాపీలు స్వీకరించుటకు ఆఖరి తేదీ: జూన్ 11 ⇔ పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూన్ 18, 19 ⇔ స్పెషల్ కేటగిరి సెలక్షన్ లిస్ట్ ప్రకటన (ఫేజ్–1) జూన్ 29 ⇔ ఇతర రాష్ట్రాలు, ఇంటర్నేషనల్ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ అడ్మిషన్స్ జులై 6,7 ⇔ స్పెషల్ కేటగిరి సెలక్షన్ లిస్ట్ ప్రకటన (ఫేజ్–2) జులై 16 ⇔ ట్రిఫుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్/అడ్మిషన్స్ జులై 21 నుంచి 23 వరకూ ⇔ ట్రిఫుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు: జులై 24 నుంచి 31 వరకూ ⇔ ట్రిఫుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ 2018–19 ట్రిపుల్ ఐటీ బ్యాచ్ తరగతుల ప్రారంభం: ఆగస్టు 1