Ross Taylor
-
ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్.. కేన్ మామ ముందున్న భారీ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి నోయిడా గ్రౌండ్‌ను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. ఈ వేదికపైనే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాల్టి ఉదయమే ప్రారంభం కావాల్సి ఉన్నా.. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఆలస్యమైంది. టాస్ కూడా ఇంకా పడలేదు. తుది జట్లను ప్రకటించాల్సి ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కేన్ మామ మరో 72 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (అన్ని ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు రాస్ టేలర్ పేరిట ఉంది. రాస్ టేలర్ మూడు ఫార్మాట్లలో 450 మ్యాచ్‌లు ఆడి 18199 పరుగులు చేయగా.. కేన్ మామ 358 మ్యాచ్‌ల్లో 18128 పరుగులు చేశాడు. ప్రస్తుత తరం న్యూజిలాండ్ క్రికెటర్లలో కేన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఫాబ్ ఫోర్లో ప్రధముడిగా చెప్పుకునే కేన్ ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే 100వ టెస్ట్ ఆడిన కేన్.. తన చివరి 20 టెస్ట్‌ల్లో ఏకంగా 2267 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాబ్ ఫోర్లో (జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి) ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. కేన్‌కు మించి ఫామ్‌లో ఉన్న రూట్ సైతం గత 20 టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీ సాయంతో 1761 పరుగులే చేశాడు. ప్రస్తుతం కేన్ టెస్ట్‌ల్లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా (8743) ఉన్నాడు. -
AUS VS WI 1st T20: వార్నర్ 'ట్రిపుల్ ‘సెంచరీ’
ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్ వార్నర్ టీ20 కెరీర్లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్ ఇప్పటివరకు 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. వార్నర్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్ టేలర్ 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్‌లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, వార్నర్ తన 100వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ భారీ స్కోర్ సాధించేందకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ వరసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం మందగించింది. 17 ఓవర్ల తర్వత ఆ జట్టు స్కోర్ 173/5గా ఉంది. వార్నర్, జోష్ ఇంగ్లిస్ (39), మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ 10), స్టోయినిస్ (9) ఔట్ కాగా.. టిమ్ డేవిడ్ (18), మాథ్యూ వేడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలరల్లో అల్జరీ జోసఫ్ 2, జేసన్ హోల్డర్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే..!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఖాతాలో అతి భారీ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో సూపర్ సెంచరీ (132) సాధించి, ఫాలో ఆన్ ఆడుతున్న తన జట్టును గట్టెక్కించిన కేన్ మామ.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 25 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బరిలోకి దిగిన విలియమ్సన్.. ఆండర్సన్ బౌలింగ్‌లో బౌండరీ బాది న్యూజిలాండ్ టాప్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. కెరీర్లో ఇప్పటివరకు 92 టెస్ట్‌లు ఆడిన విలియమ్సన్ 53.33 సగటున 26 సెంచరీలు, 33 అర్ధసెంచరీల సాయంతో 7787 పరుగులు చేసి, కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (112 టెస్ట్‌ల్లో 44.66 సగటున 19 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీల సాయంతో 7683 పరుగులు)ను వెనక్కు నెట్టి కివీస్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విలియమ్సన్, రాస్ టేలర్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172), బ్రెండన్ మెక్కల్లమ్ (6453), మార్టిన్ క్రో (5444), జాన్ రైట్ (5334), టామ్ లాథమ్ (5038) వరుసగా 3 నుంచి 7 స్థానాల్లో నిలిచారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 202/3తో (ఫాలో ఆన్) నాలుగో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి మ్యాచ్ చేజారకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (132) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. డారిల్ మిచెల్ (54), టామ్ బ్లండల్ (90) తమ పాత్రలను న్యాయం చేశారు. ఫలితంగా న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్ చేసి, ప్రత్యర్ధికి 258 పరుగుల డిఫెండింగ్ టార్గెట్‌ను నిర్ధేశించింది. కష్టసాధ్యంకాని టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తమదైన స్టయిల్లో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. వరుస బౌండరీలతో విరుచుకుపడిన జాక్ క్రాలే (30 బంతుల్లో 24; 5 ఫోర్లు) మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఓటవ్వగా.. బెన్ డక్కెట్ (23), ఓలీ రాబిన్సన్ (1) ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి, లక్ష్యానికి 210 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేయగా.. న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
విధ్వంసం సృష్టించిన టేలర్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా గంభీర్ సేన
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇండియా క్యాపిటిల్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు రాస్ టేలర్, మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్ టేలర్, జాన్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టేలర్ 41 బంతుల్లో 82 , జాన్సెన్ 35 బంతుల్లో 62 పరుగులు సాధించారు. కాగా టేలర్ ఇన్నింగ్స్‌లో 4 పోర్లు, 8 సిక్స్‌లు ఉండటం గమానార్హం. ఇక అఖరిలో నర్స్(19 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భిల్వారా కింగ్స్ బౌలర్లలో రాహుల్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పనేసర్ రెండు, బ్రెస్నెన్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భిల్వారా కింగ్స్.. 18.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. భిల్వారా బ్యాటర్లలో షేన్ వాట్సన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో పంకజ్ సింగ్, ప్రవీణ్ తాంబే, పవన్ సయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ప్లంకెట్, భాటియా చెరో వికెట్ సాధించారు. Time for #legendary Celebrations! 🥳@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/XBFMJtj6Zf — Legends League Cricket (@llct20) October 5, 2022 చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్ -
రాణించిన రాస్ టేలర్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ లెజెండ్స్ సూపర్ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా దిగ్గజాలు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. వికెట్‌కీపర్ దిమాన్ ఘోష్ (32 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), అలోక్ కపాలీ (21 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఓపెనర్లు నజీముద్దీన్ (0), మెహ్రబ్ హొసేన్ (1) దారుణంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ మిల్స్ 2 వికెట్లు పడగొట్టగా.. బెన్నెట్‌కు ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనతంరం 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ దిగ్గజ టీమ్.. 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జేమీ హౌ (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. డీన్ బ్రౌన్లీ (19 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ రాస్ టేలర్ (17 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో అబ్దుర్ రజాక్, అలోక్ కపాలీకి తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) ఎగబాకగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. ఇండియా లెజెండ్స్, విండీస్ లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్, న్యూజిలాండ్ లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్ వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇవాళ ఇదే వేదికగా మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో విండీస్ లెజెండ్స్‌ను ఇంగ్లండ్ దిగ్గజ టీమ్ ఢీకొట్టాల్సి ఉంది. -
ఎదురుగా పులులు కనిపిస్తున్నా.. అందరి కళ్లు ద్రవిడ్‌పైనే!
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన ఆత్మకథ ''బ్లాక్ అండ్ వైట్'' ద్వారా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. రెండురోజుల క్రితం సొంత జట్టు క్రికెటర్లే వివక్ష చూపారంటూ సంచలన వార్త బయటపెట్టిన టేలర్.. శనివారం.. ఐపీఎల్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో డకౌట్ అయినందుకు రాజస్తాన్ రాయల్స్ యాజమాని ఒకరు తన చెంప పగులగొట్టారంటూ మరొక సంచలన విషయం బయటపెట్టాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెట్.. ప్రస్తుత భారత హెడ్‌కోచ్ ద్రవిడ్‌తో జరిగిన అనుభవాన్ని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా రాస్ టేలర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే జట్టులో షేన్ వార్న్ సహా రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న టేలర్.. అప్పట్లో బయట టీమిండియా ఆటగాళ్లకు పాపులారిటీ ఎంతనేది కళ్లారా చూశానంటూ పేర్కొన్నాడు. ''2011 ఐపీఎల్ సందర్భంగా ఒకసారి ద్రవిడ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కును సందర్శించా. ఈ సందర్భంగా ద్రవిడ్‌ను.. మీరెన్ని సార్లు పులులను సందర్శించారు. అని అడిగాను. దానికి ద్రవిడ్.. లేదు ఇంతవరకు ఒక్క పులిని కూడా దగ్గరి నుంచి చూడలేదు. ఇది 21వ సపారీ అనుకుంటా.. కానీ ఒక్క పులిని కూడా చూడలేకపోయా అని చెప్పాడు. దీంతో ఏంటి 21 సార్లు సఫారీకి వచ్చినా ఒక్కసారి కూడా పులిని చూడకపోవడం ఏంటి. అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత అందరం కలిసి ఎస్యూవీ మోడల్ ఓపెన్ టాప్ కారులో సఫారీకి వెళ్లాం. దాదాపు 100 మీటర్ల దూరంలో ఒక aపులిని చూశాం. ద్రవిడ్.. నావల్ల ఈరోజు నువ్వు పులిని దగ్గర్నుంచి చూశావు.. దానికి థ్యాంక్స్ చెప్పాలి అని పేర్కొన్నాను. ఇక మా మధ్య ఏవో మాటలు సందర్బంలో వచ్చాయి. ఈ సమయంలోనే నేనొక అద్భుత విషయాన్ని గమనించా. అది చూశాకా భారత్‌లో క్రికెటర్లను ఇంతలా ఎందుకు అభిమానిస్తారా అని ఆశ్చర్యమేసింది. అదేంటంటే.. మేము వెళ్తున్న వాహనం వెనకాల వస్తున్న మరో సఫారీ వాహనంలో కొంతమంది వస్తున్నారు. అప్పటిదాకా కనిపిస్తున్న పులులను తమ కెమెరాల్లో బందిస్తున్న వాళ్లు.. అది ఆపేసి ఒక్కసారిగా కెమెరాలన్నింటిని ద్రవిడ్‌వైపు తిప్పారు. అంటే ఒక జాతీయ పార్క్‌కు వచ్చి.. ఎదురుగా అరుదైన పులి జాతి సంపద కనిపిస్తున్నా సరే.. అందరు ద్రవిడ్‌నే చూడడం నాకు ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగా ఒక విషయం కోట్ చేయలానుకున్నా.. 'ప్రపంచంలో సుమారు 4వేల పులులు ఉండుంటాయి.. కానీ వాటికి మించిన ప్రత్యేకం రాహుల్ ద్రవిడ్' అన్న విషయం కచ్చితంగా చెప్పగలను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Ross Taylor About Racism: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Asia Cup 2022: ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం -
అది అస్సలు ఊహించలేదు.. డకౌట్ అయ్యానని చెంపపై కొట్టాడు: టేలర్
ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. కాగా గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మూడేళ్లపాటు సేవలందించిన తర్వాత.. టేలర్‌ను 2011 వేలంలో రాయల్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తను డకౌట్ అయ్యాక రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తనపై చేయి చేసుకున్నారని టేలర్ అన్నాడు. "మెహాలీ వేదికగా రాజస్తాన్ రాయల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. 195 పరుగుల లక్ష్య చేధనలో నేను డకౌట్‌గా వెనుదిరిగాను. మేము ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవి చూసం. కనీసంలక్ష్యం దగ్గరకు కూడా చేరలేక పోయాం. మ్యాచ్ అనంతరం మా జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అనంతరం హోటల్‌కు చేరుకున్నాము. ఆ తర్వాత మేము అందరం కలిసి హోటల్ పై అంతస్తులోని బార్‌కు వెళ్లాం. అక్కడ షేన్ వార్న్‌తో పాటు లిజ్ హర్లీ కూడా ఉంది. ఈ సమయంలో రాజస్తాన్ రాయల్స్ యాజమాని ఒకరు నా దగ్గరకు వచ్చారు. రాస్ నువ్వు డకౌట్ అయ్యేందుకు కాదు మేం నీకు మిలియన్ డాలర్లు చెల్లిస్తుందని అన్నాడు. ఈ క్రమంలో అతడు నవ్వుతూ నా చెంపపై మూడు నాలుగు సార్లు కొట్టాడు. అయితే అతడు నన్ను గట్టిగా మాత్రం కొట్టలేదు. అతడు సరదాగా కొట్టాడో లేక ఉద్దేశ పూర్వకంగా చేశాడో నాకు తెలియదు. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్ద సమస్య చేయదలుచుకోలేదు. కానీ జెంటిల్మెన్ గేమ్ పిలిచే క్రికెట్లో మాత్రం ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ సీజన్లో రాజస్తాన్ నన్ను భారీ ధరకు కొనుగోలుచేసినందు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఈ సంఘటన జరిగాక ఆర్సీబీ నన్ను సొంతం చేసుకుని ఉంటే బాగున్ను అనిపించింది" అని తన ఆత్మ కథ 'బ్లాక్ అండ్ వైట్'లో టేలర్ పేర్కొన్నాడు. చదవండి: Ross Taylor About Racism: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! -
రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా!
న్యూజిలాండ్‌కు క్రికెట్లో ఎలాంటి వివాదాలు లేని జట్టు అనే పేరుంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లు తమ హుందాతనాన్ని చూపిస్తారు. ఇప్పటివరకు కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడ్డ దాఖలాలు కానీ.. కవ్వింపు చర్యలకు పాల్పడడం గానీ ఎరిగింది లేదు. ఒకవేళ జరిగినా కూడా గుర్తుంచుకునేంత పెద్దవి కావు. అలాంటి న్యూజిలాండ్‌కు "కూల్ జట్టు" అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఇటీవలే కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన 16 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. తాజాగా తన ఆటోబయోగ్రఫీ ద్వారా న్యూజిలాండ్ క్రికెట్‌పై ఒక బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో తోటి ఆటగాళ్లచే తాను వివక్ష ఎదుర్కొన్నట్లు "రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్"లో సుధీర్ఘంగా పేర్కొన్నాడు. టేలర్ వ్యాఖ్యలు ప్రస్తుతం కివీస్ క్రికెట్లో సంచలనం కలిగిస్తోంది. టేలర్ వ్యాఖ్యలతో కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా అనిపిస్తుంది. "నా 16 ఏళ్ల కెరీర్ అంతా సక్రమంగా జరిగిందనేది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మీకు తెలియని వివక్ష ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కివీస్ క్రికెట్‌కు మంచి పేరు ఉంది. దానిని నేను చెడగొట్టదలచుకోలేను. కానీ సొంతజట్టుకు చెందిన కొందరు క్రికెటర్లు.. నా మొహం గురించి కామెంట్ చేసేవారు. నువ్వు న్యూజిలాండ్‌కు ఆడుతున్నప్పటికి నీలో ఆసియా మూలాలు కనిపిస్తున్నాయి. పొరపాటు మా దేశంలో క్రికెట్ ఆడుతున్నావనుకుంటా అని పేర్కొనేవాళ్లు. రాస్.. నువ్వు సగం మాత్రమే మంచోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే నిర్ణయించుకో అని ఒక తోటి క్రికెటర్ హేళన చేసేవాడు. ఇదంతా డ్రెస్సింగ్‌రూమ్ వరకు మాత్రమే పరిమితం. మళ్లీ మైదానంలోకి వచ్చామంటే అంతా మాములే. అందుకే న్యూజిలాండ్ క్రికెట్లో వివక్ష ఎక్కడా కంటికి కనబడదు.. కానీ అంతా తెరవెనుక జరుగుతుంది. అందుకే మా డ్రెస్సింగ్‌రూమ్‌ను నేను ఒక బారోమీటర్‌గా అభివర్ణిస్తున్నా. మొదట్లో అలా అంటుంటే ఏదో సరదాకు అంటున్నారులే అని అనుకునేవాడిని.. కొన్నాళ్లు పోయిన తర్వాత కూడా అదే పనిగా మాట్లాడడంతో వివక్షకు గురవుతున్నానని అర్థమయింది. జట్టులో నన్ను చాలా మంది భారతీయ లేదా ఆసియా మూలాలు ఉన్న క్రికెటర్‌గా చూసేవారు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండే న్యూజిలాండ్ ప్రాంతంలో నా మూలాలున్న ఆటగాళ్లు చాలా తక్కువగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే డ్రెస్సింగ్‌రూమ్‌లో వివక్ష ఎదుర్కొన్నప్పటికి ఆ విషయాలను ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పటికి బయటికి చెప్పలేకపోయాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. టేలర్ కెరీర్ ను 2011 వన్డే ప్రపంచకప్ మార్చేసింది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్ గా ఉన్న అతడిని హీరోగా మార్చేసింది. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ తర్వాత నుంచి రాస్ టేలర్ ను ఏ బౌలర్ కూడా అంత తక్కవగా అంచనా వేయలేదు. ఆ ప్రపంచకప్ లో రాస్ టేలర్... 324 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. జట్టు 175 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్థితి నుంచి 302/7కు చేర్చడంలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో టేలర్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Sourav Ganguly Resign: దాదాకు తప్పని ఫేక్‌న్యూస్ గోల.. ఇది వారి పనేనా? SA vs ENG: టాప్ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు! -
Ross Taylor: రాస్‌టేలర్ వీడ్కోలు
హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రాస్ టేలర్‌కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. టేలర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన మూడో వన్డేలో కివీస్ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. రాస్ టేలర్ తన చివరి ఇన్నింగ్స్‌లో 16 బంతుల్లో 1 సిక్స్‌తో 14 పరుగులు సాధించాడు. అనంతరం నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. స్టెఫాన్ మైబర్గ్ (43 బంతుల్లో 64; 13 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మ్యాట్ హెన్రీకి 4 వికెట్లు దక్కాయి. రాస్ టేలర్ వన్డే రికార్డు: 236 వన్డేల్లో 47.55 సగటుతో టేలర్ 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉండగా...అత్యుత్తమ స్కోరు 181 నాటౌట్. -
సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్.. భావోద్వేగానికి లోనవుతూ..!
Ross Taylor Bids Emotional Goodbye To Cricket: న్యూజిలాండ్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు జట్టుకు సేవలందించిన స్టార్ ఆటగాడు రాస్ టేలర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 16 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి ఔటైన రోస్కో (రాస్ టేలర్ ముద్దు పేరు).. కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఆఖరి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన టేలర్‌కు నెదర్లాండ్స్ ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో స్వాగతం పలికారు. మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన టేలర్.. ఉబికి వస్తున్న దుఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Ross Taylor is about to play his final international game of cricket for New Zealand. We will miss you Rosco #SparkSport #NZvNED pic.twitter.com/Y6kmXVHvSH — Spark Sport (@sparknzsport) April 4, 2022 2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన 38 ఏళ్ల రాస్ టేలర్.. న్యూజిలాండ్ తరుపున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్‌ల్లో 44.16 సగటున 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీల సాయంతో 7684 పరుగులు చేసిన టేలర్.. వన్డేల్లో 47.52 సగటుతో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీల సాయంతో 8602 పరుగులు చేశాడు. టేలర్.. టీ20ల్లో 7 హాఫ్ సెంచరీల సాయంతో 1909 పరుగులు సాధించాడు. టేలర్ జాతీయ జట్టు తరఫునే కాకుండా ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 55 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సహకారంతో 1017 పరుగులు స్కోర్ చేశాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. ఛేదనలో నెదర్లాండ్స్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కాగా, తొలి రెండు వన్డేల్లోనూ గెలుపొందిన కివీస్.. 2-0తేడాతో సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడేందుకు భారత్‌కు వెళ్లడంతో న్యూజిలాండ్ ఈ సిరీస్‌కు బీ టీమ్‌తో బరిలోకి దిగింది. చదవండి: IPL 2022: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్..! -
కివీస్-ఆసీస్ సిరీస్ వాయిదా.. కారణం అదే!
వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన న్యూజిలాండ్ జట్టు తమ పర్యటను నిరవధికంగా వాయిదా వేసుకుంది. ట్రాన్స్-టాస్మాన్ ప్రత్యర్థులు మధ్య ఫిబ్రవరిలో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ జరాగాల్సి ఉంది. న్యూజిలాండ్ క్వారంటైన్ నిభందనలు, సరిహద్దు నియంత్రణలు దృష్ట్యా ఈ పర్యటనను కివీస్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 తీవ్రత దష్ట్యా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య వైట్-బాల్ సిరీస్ వాయిదా పడడం వరుసగా ఇది మూడో సారి. కాగా రానున్న వేసవిలో ఆస్ట్రేలియా జట్టుకు వన్డే ఇంటర్నేషనల్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలి అని భావించిన రాస్ టేలర్‌కు నిరాశే మిగలనుంది. కోవిడ్, ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా న్యూజిలాండ్ ప్రభుత్వం కఠినమైన 10 రోజుల క్వారంటైన్ నిభందనలు విధించింది. కాగా త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించిన రీషెడ్యూల్‌ను ప్రకటిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ పేర్కొంది. చదవండి: SL Vs Zim: శ్రీలంకకు జింబాబ్వే షాక్... 94 బంతుల్లో 102 పరుగులు.. కానీ పాపం కెప్టెన్.. -
వికెట్ పడగొట్టాడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు!
NZ vs BAN: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రాస్ టేలర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో టేలర్ 112 టెస్టుల్లో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 290. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత టేలర్‌దే. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ అతడి కేరిర్‌లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు 38 ఏళ్ల టేలర్ తన కెరీర్లో రెండే వికెట్లు (2010లో) తీశాడు. అయితే చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపించకపోవడంతో కివీస్ కెప్టెన్ లాథమ్ అతనితో సరదాగా బౌలింగ్ చేయించాడు. తన మూడో బంతికే అతను బంగ్లా చివరి వికెట్ (ఇబాదత్)ను అవుట్ చేసి ఘనంగా ఆటను ముగించడం విశేషం. న్యూజిలాండ్ ఘన విజయం తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ జట్టు ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 395 పరుగుల ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్ ఆడిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (102; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. జేమీసన్‌కు 4, వాగ్నర్‌కు 3 వికెట్లు దక్కాయి. చదవండి: Virat Kohli: శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..! Gotta love Ross Taylor getting his 3rd Test wicket in his final Test to win the match. pic.twitter.com/8KsjuWMExR — Andrew Donnison (@Donno79) January 11, 2022 -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్.. రెండో టెస్టులో ఘన విజయం!
కింగస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్, 117పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్ సమం చేసింది. ఫాలో ఆన్ ఆడిన బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి టెస్టులో ఓటమికి బదులుగా న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిటన్ దాస్ (102), మోమినుల్ హక్(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జామీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, నీల్ వాగ్నర్ మూడు వికెట్లు సాధించాడు. కాగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 521 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగగా, కాన్వే(109), యంగ్(54) పరుగులతో రాణించారు. ఇక కివీస్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కూప్పకూలింది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా టామ్ లాథమ్ ఎంపిక కాగా, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కాన్వేకి దక్కింది. కాగా కేరిర్‌లో అఖరి టెస్టు ఆడుతున్న రాస్ టేలర్‌కి ఘన విజయంతో న్యూజిలాండ్ విడ్కోలు పలికింది. చదవండి: Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్.. టాస్ గెలిస్తే.. -
రాస్ టేలర్ ఉద్వేగ క్షణాలు.. వీడియో వైరల్
రెండో టెస్ట్ సందర్భంగా న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించాడు. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్.. తన కేరిర్‌లో చివరి టెస్టు ఆడుతున్నాడు. 112 మ్యాచ్‌లు ఆడిన టేలర్ 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7600కి పైగా పరుగులు చేశాడు. రెండో రోజు టేలర్ బ్యాటింగ్ వచ్చిన సమయంలో బంగ్లా ఆటగాళ్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకలు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 39 బంతుల్లో 28 పరుగులు చేసి అతడు పెవిలియన్ చేరాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ టేలర్ అరంగట్రేం చేశాడు. దాదాపు 16 ఏళ్లపాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు అతడి సేవలను అందించాడు. ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 521 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 521-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(252), కాన్వే (109), బ్లండల్(57) పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్! A great gesture for a great of the game 🙌 Ross Taylor is given a guard of honour as he makes his way out to bat for possibly the final time in Test cricket for New Zealand 🥺#NZvBAN pic.twitter.com/ejJjTo5w4v — Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022 -
Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా..
Nz Vs Ban 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు కూడా మెరుగ్గా రాణించింది ఆతిథ్య బంగ్లాదేశ్. అంతకు ముందు బ్యాటర్ల విజృంభణతో 458 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన బంగ్లా... కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 5 వికెట్లు కూల్చింది. కానీ, క్యాచ్‌లు డ్రాప్ చేయడం, రనౌట్లు మిస్ చేయడం వంటి తప్పిదాల కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా 37వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి నిమిషంలో రివ్యూ కోరి వేస్ట్ చేసుకుంది. టస్కిన్ వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడేందుకు రాస్ టేలర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టేలర్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన బంగ్లా కెప్టెన్ మొమినల్ అప్పీలు చేయగా నెగటివ్ ఫలితం వచ్చింది. దీంతో అతడు రివ్యూకు వెళ్లగా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. అంతేగాక బంగ్లాకున్న రివ్యూ అవకాశాలు అన్నీ ఊడ్చుకుపోయాయి. కాగా బంతి రాస్ టేలర్ బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ మొమినల్ రివ్యూకు వెళ్లడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు చూసిన అత్యంత చెత్త రివ్యూ ఇదే’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ WORST REVIEW EVER??! Bangladesh lost their last remaining review when THIS was given 'not out' for LBW! FOLLOW #NZvBAN LIVE: 👉 https://t.co/vIAFgN1IK7 👈 pic.twitter.com/f8CmxEKkpk — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) January 4, 2022 -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్..
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గురువారం టేలర్ ప్రకటించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం తప్పుకోనున్నట్లు తెలిపాడు. "ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడిన తర్వాత తప్పుకుంటాను. 17 సంవత్సరాలపాటు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను" అని టేలర్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా 2006లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్లో టేలర్ అరంగటేట్రం చేశాడు. ఇప్పటి వరకు 233 వన్డేల్లో 8576 పరుగులు చేశాడు. అతడి వన్డే కేరిర్‌లో 21 సెంచరీలు సాధించాడు. అతడు 102 టీ20ల్లో 1909 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 110 టెస్టుల్లో 7585 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాకు షాక్.. నిర్ణయం మార్చుకున్న కీలక ఆటగాడు.. సిరీస్‌కు దూరం! Today I'm announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp — Ross Taylor (@RossLTaylor) December 29, 2021 -
అది నా డ్రీమ్ బాల్.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్
It was a dream delivery for any fast bowler on Ross taylor wicket:ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్బతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రాస్ టేలర్‌ను అద్బుతమైన బంతితో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. కాగా టేలర్‌ను ఔట్ చేసిన బంతి.. తన డ్రీమ్ డెలివరీ అంటూ మ్యాచ్ అనంతరం సిరాజ్ తెలిపాడు. రెండో రోజు ఆటముగిశాక విలేకరుల సమావేశంలో సిరాజ్ మాట్లాడాడు. “మేము ఇన్‌స్వింగ్ డెలివరీకి తగ్గట్టుగా ఫీల్డ్‌ని పెట్టాము. కానీ నేను తర్వాత నా మనసుని మార్చుకుని అవుట్‌స్వింగ్ బౌలింగ్ ఎందుకు చేయకూడదని అనుకున్నాను. అందుకే అవుట్‌స్వింగ్ డెలివరీ వేశాను. దీంతో టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగలిగాను" అని సిరాజ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో గాయపడిన సిరాజ్ తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో ఇషాంత్ శర్మ స్ధానంలో తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. కాగా గాయంనుంచి కోలుకున్నాక.. తను ఫిట్నెస్ సాధించాడానికి ఎలా సాధన చేశాడో తెలిపాడు. "నేను గాయం నుంచి కోలుకున్నాక తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు వీలైనంత ఎక్కువ స్వింగ్ పొందాలనే లక్ష్యంతో సింగిల్ వికెట్ బౌలింగ్ చేసాను. నాకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తే ఆ విధంగా బౌలింగ్ చేయాలి అనుకున్నాను. సింగిల్ వికెట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఈ మ్యాచ్‌లో నాకు చాలా ఊపయోగపడింది అని సిరాజ్ తెలిపాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Andre Russell: బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో.. Absolute peach of a delivery 📦 #Siraj #MiyaanMagic pic.twitter.com/aqU82Ersrr — King (@DNKWrites) December 4, 2021 -
Mohammed Siraj: సిరాజ్ దెబ్బ.. కివీస్ అబ్బా.. జోరు మామూలుగా లేదుగా..
IND vs NZ 2nd Test: Mohammed Siraj Peach of a Delivery to Get Ross Taylor Bowled in Mumbai Test: ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆదిలోనే వరుసగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి టెస్టులో రాణించిన కివీస్ ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్‌ను పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆ తర్వాత అద్భుతమైన బంతితో రాస్ టేలర్‌ను బౌల్డ్ చేశాడు. ఆరో ఓవర్ తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. చక్కని లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రాస్ టేలర్‌కు ఊహించని షాకిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘వరుసగా 3 వికెట్లు... సూపర్ సిరాజ్.. నీ దెబ్బకు రాస్ టేలర్‌కు దిమ్మతిరిగింది.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు... నిన్ను నీవు నిరూపించుకున్నావు’’ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండో టెస్టు రెండో ఆటలో భాగంగా భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. సిరాజ్(3), అశ్విన్(4) చెలరేగడంతో కివీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో 62 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్‌కు రెండు, జయంత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే That's Ripper from Mohammad Siraj 💥💥#INDvzNZ pic.twitter.com/ja5vkgMbka — Diwakar¹⁸ (@diwakarkumar47) December 4, 2021 -
టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన కివీస్.. ఇద్దరు సీనియర్లు ఔట్
New Zealand ICC T20 World Cup 2021 Team: యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టుకు కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేయగా, సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, వెటరన్ ఆల్ రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌లను తప్పించింది. ఇంజ్యూరీ కవర్‌గా అడమ్ మిల్నేను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, గడిచిన రెండు మూడేళ్లుగా కేన్ సారధ్యంలో న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది. భారత్‌తో స్వదేశంలో సిరీస్(5-0) దగ్గరి నుండి ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోకుండా పొట్టి ఫార్మాట్లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దీంతో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్ జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టాడ్ ఆస్టల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్, మిచెల్ సాట్నర్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఐష్ సోధి, టిమ్ సౌథీ, అడమ్ మిల్నే(ఇంజ్యూరీ కవర్) -
రాస్ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాడ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ రోజున న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌కి చేదు అనుభవం ఎదురైంది. రాస్ టేలర్‌పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్‌లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా! -
ఏజ్ అనేది ఓ నంబర్ మాత్రమే.. ఇప్పట్లో రిటైర్ కాను
వెల్లింగ్టన్: వయస్సనేది కేవలం ఓ నంబర్ మాత్రమేనని, దాన్ని అటతో ముడిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టిన ఈ కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. జాతీయ జట్టుకు మరికొన్నేళ్లు అడగలిగే సత్తా తనలో ఉందని తేల్చి చెప్పాడు. 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్న మాట వాస్తవమేనని, కానీ దానిపై పునారాలోచించుకొని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని వెల్లడించాడు. ఆటను ఆస్వాదించగలిగినన్ని రోజులు క్రికెట్ ఆడతానని, ప్రస్తుతానికి తన ఫామ్‌కు ఏమాత్రం ఢోకా లేదని, స్థాయికి తగ్గ ప్రతిభను కనబర్చలేని రోజు స్వచ్చందంగా తప్పుకుంటానని పేర్కొన్నాడు. నేటి తరం ఆటగాళ్లు రిటైర్మెంట్పై లెక్కలేసుకోవడం మానుకోవాలని, వారిలో సత్తా ఉన్నన్ని రోజులు జట్టుకు సేవలందించడంపై దృష్టి సారించాలని సూచించాడు. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం కేన్ విలియమ్సన్ సారధ్యంలో అద్భుతంగా రాణిస్తుందని.. యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమాతూకంగా ఉందని అభిప్రాయడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ ఓ పీడకలగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ తరఫున టెస్ట్, వన్డే ఫార్మట్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన ఈ వెల్లింగ్టన్ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఈ పర్యటనలో కివీస్.. రెండు టెస్ట్‌లు ఆడనుంది. అనంతరం భారత్‌తో డబ్యూటీసీ ఫైనల్ పోరులో తలపడనుంది. చదవండి: ఇంగ్లండ్ పర్యటనలో అతను పాంటింగ్‌ను అధిగమిస్తాడు.. -
‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి
న్యూఢిల్లీ: ఏడాది క్రితం వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదుర్కొన్న ఓటమి బాధను న్యూజిలాండ్ క్రికెటర్లు అంత సులువుగా మరచిపోయేలా లేరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడం, ఆపై సూపర్ ఓవర్ కూడా ‘టై’ కావడంతో బౌండరీ కౌంట్‌తో కివీస్ ఓడింది. దీనిపై ఆ జట్టు టాప్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మాట్లాడుతూ... వన్డేల్లో సూపర్ ఓవర్ అవసరమే లేదని...ఆ నిబంధనను తొలగించి, మ్యాచ్ ‘టై’గా ముగిస్తే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించాలన్నాడు. ‘టి20ల్లో సూపర్ ఓవర్ అంటే కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఫుట్‌బాల్ తరహాలో ఏదో ఒక ఫలితం కోసం అలా ఆడవచ్చు. కానీ వన్డేలో సూపర్ ఓవర్ ఆడించడమే అసమంజసం. ఇరు జట్లు అప్పటికి 100 ఓవర్లు ఆడి ఉంటాయి. ఇంతసేపు పోటీ పడిన తర్వాత రెండు జట్లు సమఉజ్జీగా నిలిచాయంటేనే ఎవరూ గెలవలేదనే కదా అర్థం. మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించడంలో తప్పేముంది’ అని టేలర్ వ్యాఖ్యానించాడు. -
టై అంటే టై.. సూపర్ ఓవర్ ఏమిటి?
వెల్లింగ్టన్: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను విజయం వరించినట్లే వరించి చేజారిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ రెండు సార్లు సూపర్ ఓవర్‌కు దారి తీయడంతో చివరకు బౌండరీ కౌంట్ విధానం అనుసరించాల్సి వచ్చింది. దాంతో ఇంగ్లండ్‌ను విజయం వరించగా, న్యూజిలాండ్‌ను పరాజయం వెక్కిరించింది. దాంతో వన్డే వరల్డ్‌కప్ సాధించాలనుకున్న కివీస్ ఆశలు నెరవేరలేదు. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరినా కివీస్‌కు కప్‌కు దక్కకపోవడం ఇక్కడ గమనార్హం. కాగా, తమ జట్టును ‘సూపర్ ఓవర్’ దెబ్బ తీసిన బాధ ఆ జట్టు వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ మనసులో అలానే ఉండిపోయింది. ఇదొక అనవసరపు విధానమని తాజాగా టేలర్ పేర్కొన్నాడు. ('కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా') ‘వన్డే ఫార్మాట్లో సూపర్ ఓవర్ అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక 50 ఓవర్ల వరల్డ్‌కప్‌లో కూడా ఈ విధానంతో ఉపయోగం లేదు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ టై అయితే కప్‌ను ఇరు జట్లకు పంచాలి. సంయుక్త విజేతలుగా ప్రకటించాలి. అంతేగానీ సూపర్ ఓవర్‌తో ఒక్క జట్టును ఫేవరెట్ చేయడం భావ్యం కాదు. దీనిపై నేను ఇంకా గందరగోళంలో ఉన్నాను. నేను చాలాకాలం నుంచి క్రికెట్ ఆడుతున్నా. వన్డే టైగా ముగిస్తే ఎలాంటా సమస్యా లేదు. ఫుట్‌బాల్, లేదా ఇతర క్రీడలు కానీ, టీ20లు కానీ టై అయితే మ్యాచ్‌ను కొనసాగించడం సరైనది. దాంతో విజేతను ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ వన్డే మ్యాచ్‌లో సూపర్ ఓవర్ అవసరం అని నేను అనుకోను. తుది పోరు టై అయితే సంయుక్త విజేతగా ప్రకటించాలి. సూపర్ ఓవర్ అనేది అప్పటికప్పుడు తీసుకొచ్చిన నిబంధనలా అనిపించింది. అది వరల్డ్‌కప్‌లో ఉందనే విషయం నాకు తెలియదు. మ్యాచ్ టై అంటే టై.. అంతే కానీ సూపర్ ఓవర్ ఏమిటి?. కప్ విషయంలో సూపర్ ఓవర్ అనేది మంచి ఆలోచన కాదు’ అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడిన టేలర్ పేర్కొన్నాడు. -
‘న్యూజిలాండ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా రాస్ టేలర్
వెల్లింగ్టన్: ప్రతిష్టాత్మక ‘న్యూజిలాండ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ ఎంపికయ్యాడు. జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలోనూ విశేషంగా రాణించిన టేలర్ శుక్రవారం ‘సర్ రిచర్డ్ హాడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల టేలర్ ఈ అవార్డును అందుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. గత సీజన్లో అద్భుతంగా ఆడిన టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 1389 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (7238) చేసిన ఆటగాడిగా నిలిచిన టేలర్... మూడు ఫార్మాట్లలో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా టేలర్ మాట్లాడుతూ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాల తర్వాత ఈ స్థాయికి చేరుకున్నానని అన్నాడు. -
రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం లభించింది. న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు టేలర్‌ను వరించింది. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో జరిగిన వర్చువల్ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఫలితంగా మూడోసారి రిచర్డ్ హ్యాడ్లీ అవార్డును టేలర్ గెలుచుకున్నాడు. వరుస రెండు వన్డే వరల్డ్‌కప్‌లో కివీస్ ఫైనల్‌కు చేరడంలో భాగస్వామ్యమైన టేలర్.. గత ఏడాది కాలంలో న్యూజిలాండ్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా టేలర్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. తాజా అవార్డుపై టేలర్ స్పందిస్తూ.. ‘ గడిచిన ఏడాది నా కెరీర్లో అద్భుతమైనదిగా నిలిచింది. ఎన్నో ఎత్తు-పల్లాలతో నా కెరీర్ ఇంకా సాగుతుండటం ఆనందంగా ఉంది. (ఆ టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇస్తా) 2023లో భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడటమే నా ముందున్న లక్ష్యం. వరుసగా రెండు వరల్డ్‌కప్‌ల్లో మా జట్టు ఫైనల్ చేరడంలో భాగస్వామ్యం అయ్యా. ఇక వరుసగా మూడోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా. పరుగులు చేయాలనే దాహం. మానసికంగా ధృడంగా ఉండటమే నా సానుకూలాంశం. వయసు అనేది ప్రామాణికం కాదు. అది కేవలం నంబర్ మాత్రమే. నాకు కివీస్ తరుఫున ఇంకా ఆడాలని ఉంది’ అని 36 ఏళ్ల టేలర్ పేర్కొన్నాడు. 2006లో కివీస్ తరఫున అరంగేట్రం చేసిన టేలర్.. 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు.ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు టేలర్. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో కివీస తరఫున వంద టెస్టులు ఆడిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డానియల్ వెటోరి(112), స్టీఫెన్ ఫ్లెమింగ్(111), బ్రెండన్ మెకల్లమ్(101)లు టేలర్ కంటే ముందు వంద టెస్టులు ఆడిన కివీస్ ఆటగాళ్లు.(మూడేళ్లలో 217 సిక్సర్లు.. అందుకే కదా అలా అనేది!)