rtc bus accident
-
ట్రక్కును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రకు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రంలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాడిగోద్రి – జల్నా మార్గంలోని షాహపూర్ ఏరియా వద్ద మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన ఆర్టీసీ బస్సు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. #जालना वडीगोद्री मार्गावर शहापूर गावाजवळ आज सकाळी बस आणि आयशर ट्रकच्या भीषण अपघातात बसच्या वाहकासह ६ जण ठार झाले असून १० जण जखमी झाले आहेत. #Jalna #Accident pic.twitter.com/HJkbmoapzX— AIR News Mumbai, आकाशवाणी मुंबई (@airnews_mumbai) September 20, 2024అయితే, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. బస్సు అద్దాలను పగులగొట్టి, చాలా మందిని బయటకు లాగి ప్రాణాలతో రక్షించారు. అనంతరం గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బస్సు జెవారి నుంచి జల్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ట్రక్కులో ఆరెంజ్ పండ్లను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇది కూడా చదవండి: నా హత్యకు కుట్ర: పన్నూ -
వర్షాల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల బీభత్సం
సాక్షి, వనపర్తి/ఆదిలాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో రెండు ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం సందర్భంగా ఓ బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం.మరోవైపు.. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్-భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పింది.ఈ అనంతరం బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి అనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సందర్భంగా కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. దీంతో, ఎద్దు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు. అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సుఆదిలాబాద్ - భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పి బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి ఆనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లి.. కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది.ఆ… pic.twitter.com/AvqlYGKQnF— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024వీడియో క్రెడిట్: Telugu Scribe -
యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు బోల్తా
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు ఉదయం 10 గంటలకు బయలుదేరింది. కాగా జిల్లాలోని అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి పల్టీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మరణించారు. మృతులను అడ్డ గూడూరు మండలం చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములుగా గుర్తించారు. కొండ రాములు అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తేలింది. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ -
పాడేరులో బస్సు ప్రమాదం
సాక్షి, పాడేరు, పాడేరు రూరల్, సాక్షి, అమరావతి, నెట్వర్క్: విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీస్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అత్యవసర వైద్యం అవసరమైతే విశాఖ కేజీహెచ్ లేదా కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించాలని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సాయం అందించాలని స్పష్టం చేశారు. పాడేరు ఘాట్‌లో ప్రమాదాలు నివారించేందుకు రవాణ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. ఎలా జరిగింది..? మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ బస్సు(ఏపీ 31జెడ్ 0285) పాడేరుకు బయలుదేరింది. ఈ క్రమంలో చోడవరంలో కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. మొత్తం 34 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌లోని వ్యూపాయింట్ వద్ద మలుపులో రోడ్డు పక్కన చెట్టు కొమ్మలను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొట్టి వందడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూర్రెడ్డిపాలెంకు చెందిన నరవ నారాయణమ్మ(50), అల్లూరి జల్లా పాడేరు మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజనుడు సీసా కొండన్న(55) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన ద్విచక్రవాహనదారులు గడ్డంగి రమేష్, ఆనంద్, కారులో వెళ్తున్న టి.శేషగిరి లోయలోకి దిగి బాధితులను కాపాడారు. గాయాలపాలైన వారిన రోడ్డుపైకి మోసుకొచ్చి 108 సాయంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. లోయలో బస్సు కింద పడి ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సీఐ సుధాకర్, ఎస్ఐ రంజిత్, స్థానికులంతా ఎంతో శ్రమించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ జిల్లా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మెడికవర్‌కు తరలింపు క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం రాత్రి విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రోలుగుంట మండలం యర్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కిల్లో బోడిరాజు (39), బొట్ట చిన్నమ్ములు (48), బొట్ట దుర్గాభవాణి (14), బొట్ట రామన్న (14), సామర్ల బాబురావు (50) ఉన్నారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నమ్ములుకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మనవడు, మనవరాలిని చూసేందుకు వెళ్లి.. బస్సు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నారాయణమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. అనారోగ్యంతో ఉన్న తమ మనవడు, మనవరాలిని చూసేందుకు ఈశ్వరరావు, నారాయణమ్మ దంపతులు ఉదయం 10 గంటల సమయంలో సబ్బవరం వద్ద బస్సు ఎక్కారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోడలికి ఫోన్ చేసి దారిలో ఉన్నట్లు చెప్పారు. అంతలో ప్రమాదం జరగడంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ముందే భార్య చనిపోవడంతో ఈశ్వరరావు గుండెలవిసేలా రోదించారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లి మృతి చెందిన వార్త తెలియటంతో కుమారులు ప్రసాద్, అర్జునరావు, వెంకట రమణ విషాదంలో కూరుకుపోయారు. చెట్టును తప్పించబోయి.. ‘వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్’ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టు పక్క నుంచి బస్సును పోనిచ్చే క్రమంలో డ్రైవర్ అంచనా తప్పింది. బస్సు రోడ్డు అంచు వరకు వెళ్లడంతో వెనుక చక్రాలు రక్షణ గోడను దాటి లోయవైపు జారిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో నేను పాడేరు నుంచి బైకుపై ఘాట్ రోడ్డులో దిగువకు వస్తున్నా. ఎదురుగా బస్సును చూసి బైకు పక్కకు తీసి ఆపా. చెట్టును దాటుకుని వస్తుందనుకున్న బస్సు ఒక్కసారిగా లోయలోకి జారిపోవటాన్ని చూసి చేష్టలుడిగిపోయా! రోడ్డు అంచుకు పరిగెత్తుకుని వెళ్లాం. అన్నీ పరిమి డొంకలు కావడంతో కిందకు వెళ్లడానికి అవకాశం లేదు. తుప్పల్లో పడిపోయి ఒకరు చనిపోగా.. బస్సులో మరొకరు మృతి చెందారు. గాయాలతో బయట పడ్డ వారిని అంతా కలసి 108, ఇతర వాహనాల్లో పాడేరు ఆస్పత్రికి తరలించాం. బస్సులో ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది. కళ్ల ముందే లోయలోకి.. మైదాన ప్రాంతానికి కారులో వెళుతున్నాం. మా కళ్ల ముందే ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోయింది. లోయలోకి దిగి తీవ్ర గాయాల పాలైన ప్రయాణికులను రోడ్డుపైకి మోసుకొచ్చాం. అదే దారిలో వస్తున్న కొందరు వాహనదారులు మాకు సహాయపడ్డారు. ఇద్దరు వృద్ధులు చనిపోయారు. పోలీసులకు సమాచారం అందించి అంబులెన్స్‌లు, 108 వాహనాల్లో గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాం. – ప్రత్యక్ష సాక్షులు గడ్డంగి రమేష్‌బాబు, పూజారి ఆనంద్, శేషగిరి చెట్టు కొమ్మను తప్పించబోయి.. ఘాట్‌లో బస్సును నెమ్మదిగా నడుపుతున్నా. మలుపులో రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మను తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పింది. అదే సమయంలో ఓ బైక్ ఎదురుగా రావడంతో బస్సు లోయలోకి దూసుకుపోయింది. చెట్టు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దిగువ రోడ్డులో బస్సు బోల్తా కొట్టి ఉంటే ప్రాణనష్టం అధికంగా ఉండేది. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడం, అనేకమంది గాయపడడం ఎంతో బాధగా ఉంది. –కిముడు సత్తిబాబు, బస్సు డ్రైవర్ ఆ చిన్నారి మృత్యుంజయురాలు.. పాడేరు ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో నెలల వయసున్న ఓ శిశువు సురక్షితంగా బయటపడింది. డుంబ్రిగుడ మండలం తూటంగి గ్రామానికి చెందిన తాంగుల జ్యోతి, సత్యనారాయణ దంపతులకు నాలుగు నెలల క్రితం శిశువు జన్మించింది. ప్రస్తుతం వీరు విశాఖలో ఉంటున్నారు. పాడేరు మండలం పి.గొందూరులో తమ బంధువుల ఇంటికి వచ్చేందుకు విశాఖలో బస్సెక్కారు. ప్రమాదంలో తల్లి జ్యోతి తన బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుకుంది. ఆమె తలకు మాత్రం తీవ్ర గాయమైంది. క్షతగాత్రులలో కొందరి వివరాలు.. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కోటగున్నలకు చెందిన పాంగి సింహాద్రి, హుకుంపేట మండలం ఇసుకగరువుకు చెందిన వంతాల కోటిబాబు, అడ్డుమండకు చెందిన వంచంగిబోయిన రవిబాబు, పాడేరు మండలం దిగుమోదాపుట్టుకు చెందిన కిరసాని వెంకటేష్, కించూరు పంచాయతీ దోనెలకు చెందిన కోడా పద్మ, కిండంగి గ్రామానికి చెందిన జంబు మాధవి, డోకులూరు పంచాయతీ మండిపుట్టుకు చెందిన బోయిన నాగేశ్వరరావు, గెడ్డంపుట్టుకు చెందిన చల్లా పెంటమ్మ, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీకి చెందిన పి.చిట్టిబాబు, అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం లోవ కృష్ణాపురం గ్రామానికి చెందిన కిముడు సత్తిబాబు, చింతపల్లి మండలం కోటగున్నల గ్రామానికి చెందిన పాంగి సింహాద్రి, గెమ్మెలి నగేష్, హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాకకు చెందిన బంటు రఘునాథ్, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నరవ ఈశ్వరరావు, నాతవరం మండలం యర్రవరంలోని ఒకే కుటుంబానికి చెందిన బొట్టా చిన్నమ్మలు, బొట్టా నర్శింహమూర్తి, బొట్టా దుర్గాభవాని, బొట్టా రమణ, ముంచంగిపుట్టు మండలం సొనియాపుట్టుకు చెందిన కిల్లో బొదినేష్, హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజుపుట్టు గ్రామానికి చెందిన కొర్రా బొంజుబాబు, ముంచంగిపుట్టు మండలం కిలగాడకు చెందిన సమల లక్ష్మీకాంత్. -
బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాగా, పాడేరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది. చదవండి: మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి -
గతి తప్పుతున్న ప్రగతి చక్రం
సాక్షి, హైదరాబాద్: వరుసపెట్టి జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఆ సంస్థను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుశిక్షితులైన డ్రైవర్లు ఉండి కూడా ప్రమాదాలు చోటు చేసుకోవడం అధికారులను కలవరబెడుతోంది. ప్రమాదాల నివారణపై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించింది. వాస్తవానికి ప్రైవేటు వాహన డ్రైవర్లతో పోలిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వద్ద మంచి నైపుణ్యం ఉంటుంది. డ్రైవర్‌గా విధుల్లో చేరేటప్పుడు మంచి శిక్షణ పొందటమే కాకుండా, తరచూ పునఃశ్చరణ తరగతులు, డిపోల్లో గేట్ మీటింగ్స్ ద్వారా వారికి ప్రత్యేక సూచనలు అందుతుంటాయి. ఫలితంగా ఆర్టీసీ బస్సులు అతి తక్కువ ప్రమాదాలకు గురవుతుంటాయి. ఎదుటి వాహనాల తప్పిదం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ దీనికి భిన్నంగా ఇటీవల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయంపైనే శ్రద్ధ.. కొరవడిన నిఘా కొంతకాలంగా ఆర్టీసీ తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆదాయం పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇది డ్రైవర్లపై ప్రభావం చూపుతోంది. గతంలో నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్నవారిని, ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించి ప్రత్యేక సిబ్బంది సూచనలు చేసేవారు. డ్రైవర్లపై నిఘా ఉండేది. ఆదాయం పెంచుకునే క్రమంలో కొంతకాలంగా ఈ కసరత్తు గతి తప్పింది. డ్రైవర్ల డ్యూటీల విషయంలోనూ చోటుచేసుకున్న మార్పులు వారిలో ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇటీవల వరంగల్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డుపక్కన నిలిచిఉన్న మరో ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీకొంది. పట్టపగలే ఈ ప్రమాదం జరగటం ఆర్టీసీ అధికారులను విస్మయానికి గురిచేసింది. అప్పటికే ఆ డ్రైవర్ డబుల్ డ్యూటీ చేసి విశ్రాంతి లేకుండా మరో డ్యూటీకి వచ్చాడని గుర్తించినట్టు తెలిసింది. 12 ఏళ్లుగా నియామకాలు లేవు.. ఆర్టీసీలో 2010 తర్వాత డ్రైవర్ నియామకాలు జరగలేదు. 12 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరినవారే కొనసాగుతున్నారు. దీంతో యువ డ్రైవర్ల కొరత ఉంది. కొంతమంది సీనియర్ డ్రైవర్లకు అనారోగ్య కారణాలు, త్వరగా అలసిపోవటం, నిద్రను నియంత్రించుకోలేకపోవటం లాంటి సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. ఇక కొన్ని డిపోల్లో డ్రైవర్లకు సెలవులు దొరకటం లేదన్న ఫిర్యాదులున్నాయి. డ్యూటీ–డ్యూటీకి మధ్య ఉండాల్సిన విరామం సరిగా పాటించటం లేదని, వరస డ్యూటీలతో అలసిపోయే డ్రైవర్లు ఏమరపాటుగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్న వాదనలున్నాయి. ప్రత్యేక శిక్షణ అవసరం.. మూడు రోజుల క్రితం వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ హైదరాబాద్– బెంగుళూరు గరుడ ప్లస్ బస్సు అతి వేగంగా వెళ్తూ ఓ చెరుకులోడు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చే లోడు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తప్పించే విషయంలో డ్రైవర్లకు మరింత శిక్షణ అవసరమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. చలికాలం సూచనలు జారీ.. పొగమంచు ఆవహిస్తున్నందున డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. పొగమంచు ఉన్నప్పుడు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, ఎదుటి వాహనాలను గమనిస్తూ ఉండటం, ఓవర్టేకింగ్స్తో జాగ్రత్తలు, మంచు లైట్లు, ఇండికేటర్లు, వైపర్ల వినియోగం, అవసరమైతే రోడ్డుపక్కన ఆపేసి మంచు తగ్గాక వెళ్లటం, సెంట్రల్ లైనును దాటకపోవటం, రాంగ్రూట్లో వెళ్లకపోవటం, విధిగా డ్రైవర్లు అర్ధరాత్రి–తెల్లవారుజాము సమయాల్లో నిద్ర తేలిపోయేలా నీటితో మొహం కడుక్కోవటం, డ్యూటీకి వచ్చే ముందు సరైన విశ్రాంతి తీసుకోవటం లాంటి అంశాలపై సూచనలు జారీ చేసింది. -
ఆర్టీసీ బస్సుకు తగిలిన ‘విమానం’ రెక్క.. పలువురికి గాయాలు
తిరువనంతపురం: రోడ్డుపై వెళ్తున్న బస్సుకు విమానం రెక్క తగిలి ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకాశంలో వెళ్లే విమానం.. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు ఎలా తగిలిందని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడ విమానం లేదు. ట్రక్కులో తరలిస్తున్న ఓ పాత విమానం రెక్క.. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు తగిలింది. ఈ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని బలరామపురంలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. విమానం రెక్క తరలిస్తున్న ట్రెయిలర్ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంది. దీంతో రహదారిని కొన్ని గంటల పాటు మూసివేశారు అధికారులు. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
రెప్పపాటులో 'ఘోరం'.. జల్లేరు వాగులో బస్సు బోల్తా
సమయం మధ్యాహ్నం 12 గంటలు.. పల్లె వెలుగు బస్సు ఓ వంతెనపై వెళుతోంది.దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణం.. సాఫీగానే సాగుతోంది... మరో పావు గం టలో గమ్యస్థానం చేరుకోనుండటంతో ప్రయాణికులంతా సిద్ధంగా ఉన్నారు.. అంతలో.. హఠాత్తుగా పెద్ద కుదుపు.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపైనే ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు దూసుకొచ్చాడు.. అదుపు తప్పిన బస్సు డివైడర్‌ను ఎక్కి వంతెన ఎడమ వైపు రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.. తేరుకునేలోపే బస్సు వాగులో పడిపోయింది.. పది ప్రాణాలు నీటిలో కలిశాయి.. పశ్చిమ గోదావరి జిల్లా వేగవరం వద్ద జల్లేరు వాగులో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. ప్రముఖుల దిగ్భ్రాంతి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్, ఏలూరు టౌన్: కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన బస్సు ప్రయాణం కొన్ని కుటుంబాలకు అంతిమయాత్రగా మారింది. మృతుల కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో పది ప్రాణాలు పోయాయి. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అక్కడున్న స్థానికులు తక్షణమే స్పందించగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను కాపాడటంతోపాటు వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్య సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరో రూ.2.5 లక్షల చొప్పున అదనంగా పరిహారాన్ని అందించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లె వెలుగు బస్సు (ఏపీ 37 జడ్ 0193) జల్లేరు వాగు వంతెనపై ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 8 గంటలకు బయల్దేరిన ఈ బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాగులో నీరు నిండుగా ప్రవహిస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వీఆర్ ఎలీజా, తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీ హిమాన్షు శుక్లా, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు సహాయ చర్యలను పర్యవేక్షించారు. జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు ఆర్టీసీ తరఫున రూ.2.50 లక్షలు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలు అవసరమైతే తక్షణమే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఆర్టీసీ పర్యవేక్షణలోనే అందిస్తామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి మృతులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని, ఆర్టీసీ తరపున మరో రూ.2.50 లక్షలు అందచేస్తామని చెప్పారు. తొలుత వారిద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రి వద్ద విలపిస్తున్న బాధితులు నిమిషాల వ్యవధిలో... ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 20 నిమిషాల్లోనే రెస్క్యూ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎస్పీలు డాక్టర్ రవికిరణ్ తదితరులు ఆగమేఘాలపై అక్కడకు వెళ్లారు. సుమారు 4 గంటలకుపైగా శ్రమించిన రెస్క్యూ టీం వాగులో పడిన బస్సును మూడు భారీ క్రేన్ల సాయంతో వెలికి తీసింది. క్షతగాత్రులకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల వివరాలు.... పసుపులేటి రాజారావు (సూర్యారావుపాలెం–ఉండ్రాజవరం), కె.హరినాథ్‌బాబు (నల్లజర్ల), కవ్వాడి కామరాజు (గోపన్నగూడెం–అశ్వారావుపేట), సత్తెనపల్లి కృష్ణవేణి (తాళ్లపూడి), సత్తెనపల్లి పద్మారావు (తాళ్లపూడి), చోడేదేవి (పూసర్ల–వేలేరుపాడు), చోడే సీతమ్మ (పూసర్ల–వేలేరుపాడు), మల్లిడి సోమశేఖర్‌రెడ్డి (రామవరం–అనపర్తి), కోట మనీషా(కుక్కునూరు), కోట ముత్యాలు (కుక్కునూరు), ఎం.లక్ష్మి (జంగారెడ్డిగూడెం), కె.నాగమ్మ (దేవులపల్లి), పంపన శకుంతలదేవి (గొల్లగూడెం–ద్వారకాతిరుమల), కె.కీర్తి (నాగిగూడెం–కుక్కునూరు), కోట ప్రశాంతి (కుక్కునూరు), తాటి సుబ్బలక్ష్మి (తోటపల్లి–బుట్టాయగూడెం),కె.సులోచన (నాయుడుగూడెం– కుక్కునూరు), పాయం శివ (భద్రాచలం), పాయం రమేష్ (పండువారిగూడెం), ఉమ్మడి దుర్గ (టి.నర్సాపురం), జి.రవిశేఖర్ (కరిచెర్లగూడెం), పసుపులేటి మంగ (సూర్యారావుపాలెం), కేత వరలక్ష్మి, కండెల్లి స్వప్న (గోపాలపురం), ఉండ్రాజవరపు గీతికాన్షి (జి.కొత్తపల్లి–ద్వారకాతిరుమల). ఈత రావడంతో.. బస్సు ముందు సీట్లల్లో కూర్చున్నాం. హఠాత్తుగా వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో తప్పించే క్రమంలో వంతెనను ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ఈత రావడంతో వాగులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాం. స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి నాటు పడవలు, తాళ్ల సాయంతో గాయపడ్డ వారిని రక్షించారు. – శివ, రమేష్, భద్రాచలం (ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షులు) ఆర్డీవోతో విచారణ కమిటీ క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ఆయన వెంటనే జంగారెడ్డిగూడెం చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 9 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ఆర్డీవో స్థాయి అధికారితో కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ సానుభూతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ బాసట సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నట్లు పేర్కొన్నారు. బాధాకరం: మండలి చైర్మన్ సాక్షి,అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ప్రభుత్వం స్పందించి సత్వరంగా రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం జంగారెడ్డిగూడెం, ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని పేర్కొన్నారు. ఘటనపై సత్వరమే స్పందించి, విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆర్టీసీ బస్సు బోల్తా
మర్పల్లి/ ఖమ్మం మయూరిసెంటర్: ఓ ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో కండక్టర్‌సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు 70 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మర్పల్లి మీదుగా తాండూరుకు వెళుతోంది. వేగంగా ఉన్న బస్సు మర్పల్లి సమీపంలోని గుర్రంగట్టు తండా మూల మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో భయాం దోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కొందరు బస్సు అద్దాలను పగులగొట్టి బయట కు వచ్చారు. కండక్టర్ రాజమణి తలకు బలమైన గాయం కాగా, ఓ ప్రయాణికురాలి కం టికి తీవ్ర గాయం అయ్యింది. మరొకరికి కాళ్లూ చే తులు విరిగాయి. క్షతగాత్రులను మర్పల్లి ఎస్ఐ వెంకట శ్రీను తన వాహనం, మరో ఆటోలో మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రం గా గాయపడిన 10 మందిని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో 15 మందిని హైదరాబాద్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ భుజంగం నిర్లక్షమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ వెంకట శ్రీను తెలిపారు. బస్సు వేగంగా నడపడం వల్లే మూలమలుపు వద్ద అదుపు తప్పిందన్నారు. మంత్రులు పువ్వాడ, సబితారెడ్డి ఆరా ప్రమాదం ఘటనపై మంత్రులు సబితారెడ్డి, పు వ్వాడ అజయ్ అధికారులను ఆరా తీశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్, సంగారెడ్డి ఆర్టీసీ రీజనల్ మేనేజర్లను పువ్వాడ ఆదేశించారు. -
వైరల్: ఆమె అదృష్టం బాగుంది.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
అనంతపురం క్రైం: అదృష్టం బాగుండి ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. అనంతపురంలోని క్లాక్‌టవర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు.. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన నాగలక్ష్మి... ఐర్లాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు నెల కిందట అనంతపురానికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం టవర్‌క్లాక్ సమీపంలోని దుకాణంలో మందులు కొనుగోలు చేసి, సోదరి దివ్యాంజలితో కలిసి స్కూటీపై మారుతీనగర్‌కు వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించారు. ట్రాఫిక్ సిగ్నల్ వెలగడంతో అప్పటి వరకూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సును గమనించని నాగలక్ష్మి తన స్కూటీని ఆపకుండా అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో బస్సు బంపర్ తగిలి కిందకు పడ్డారు. బస్సు డ్రైవర్ బ్రేక్ వేసేలోపు ముందు చక్రం స్కూటీ పైకి వెళ్లింది. ఘటనలో నాగలక్ష్మి కాలు విరిగింది. వెనుక కూర్చొన్న దివ్యాంజలికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు పోలీసులతో మాట్లాడుతూ.. కేవలం తన అజాగ్రత్త కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, దీనిపై ఎలాంటి కేసు అవసరం లేదంటూ పోలీసులకు విన్నవించారు. ఇదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. -
అతి వేగానికి బలైన ఇద్దరు యువకులు
సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ బస్సులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తరుచూ జరుగుతున్న ప్రమాదాలతో ప్రయాణికులను కలవరానికి గురిచేస్తోంది. ఆర్టీసీలో 42 రోజులుగా సమ్మె కొనసాగుతుండటం.. అంతంతగానే త నిఖీలు, మరమ్మతు చేయకుండానే.. సా మర్థ్యాన్ని పరీక్షించకుండానే బస్సులు రోడెక్కడంతో గాడి తప్పుతున్నాయి. డిపో అధికారి మినహయిస్తే అన్ని విభా గాల కార్మికులు సమ్మెలోకి వెళ్లటంతో గ్యారేజీల్లో మరమ్మతు నామమాత్రంగా మారాయి. పదిమందిలోపు తాత్కాలిక సిబ్బందితో బస్సుల మరమ్మతు చేయిస్తున్నా.. అవగాహనన లేమితో అధ్వానంగా మారుతోంది. ఎంతో అనుభవం ఉన్న ప్రత్యేక నిపుణులు తప్ప.. ఆర్టీసీ బస్సుల సామర్థ్యాన్ని గాడిలో పెట్టడం సాధ్యంకాదు. మరోవైపు సరైనా మరమ్మతుల్లేక అక్కడక్కడా బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు గజ్వేల్‌లో ముందు భాగం నుజ్జునుజ్జయిన ఘటన మరవకముందే తాజాగా కరీంనగర్లో బస్సురోడ్డు ప్రమాదానికి గురికావటం.. పలువురికి గాయాలు కావటం ఆందోళన కల్గిస్తోంది. బస్సులకు మరమ్మతులేవి..? ప్రతిరోజు బస్సు ప్రత్యేకంగా గ్యారేజీలో బస్సుల మరమ్మతు చేస్తుంటారు. విధిగా బస్సులకు మరమ్మతు, చెకప్‌లు పూర్తి చేస్తారు. 350 కిలోమీటర్లు తిరిగిన బస్సుకు ఇది తప్పనిసరి. పొద్దున బయల్దేరిన బస్సుకు సాయంత్రం.. నైట్‌హాల్ట్ పోయిన బస్సుకు పగలు మరమ్మతు చేస్తుంటారు. ఏదైనా పెద్ద సమస్య తలెత్తితే పూర్తిచేసిన తర్వాతే బస్సును రోడ్డుపై తిప్పుతారు. జిల్లాలో 141 బస్సుల్లో 50 బస్సులు అద్దెవి కాగా 91 బస్సులు ఆర్టీసీ సంస్థ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. డిపోలో 557 మంది ఉద్యోగులు, కార్మికులుండగా సమ్మె కారణంగా 549 మంది వి«ధులకు దూరంగా ఉంటున్నారు. ఒక డిపో మేనేజర్, ఏడుగురు సెక్యూరిటీ గార్డులతో ఇతరత్రా డిపార్ట్మెంట్ అధికారులను తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు. 76 మంది గ్యారేజ్ కార్మికులు విధులు నిర్వర్తించాల్సిన చోట పదిమందిలోపు మెకానిక్, సహాయకులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. దీంతో బస్సు మరమ్మతు, చెకప్‌లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని తెలుస్తోంది. బస్సుకు ఏమేమి పరీక్షలు చేయాలంటే..? ఆర్టీసీ బస్సు సామర్థ్యం సవ్యంగా కొనసాగాలంటే కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. బస్సుల టైర్లు, ఇంజిన్ కండీషన్, డీజిల్ ట్యాంకు, బ్రేక్ ఆయిల్, ప్రధానమైన అంశాలుగా కండీషన్‌ను సరిచేసుకోవాలి. టైర్లు పనితీరు, డ్రమ్స్ ఎలా పనిచేస్తున్నాయో ఒకటికి రెండుసార్లు చూడాలి. గ్రీజింగ్ సవ్యంగా ఉందోలేదో పూర్తిస్థాయిలో పరీక్షించుకుని లోపాలు సరిచేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ మార్చటం, బ్రేక్ ఆయిల్ ఫిల్టర్‌ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇదంతా సజావుగా సాగినప్పుడే బస్సులను రోడ్డు మీదకు తీసుకొచ్చే అవకాశాలుంటాయి. ఆర్టీసీ బస్సుల కండీషన్ పరీక్షించి రోజులు గడిచిపోతున్నాయి. వారంలో అన్ని దశల్లో బస్సుల మరమ్మతు పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలి. అలా చేయకపోవటంతో బ్రేక్‌లు పనిచేయకపోవటం, గమనంలో ఉన్న బస్సు అదుపుతప్పటం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. గేర్‌బాక్స్ ఇరుక్కుపోవటం వంటి ప్రమాదాలు తప్పవు. ఇంకోవైపు ప్రస్తుతం మరమ్మతు చేయిస్తున్న తాత్కాలిక సిబ్బంది తమకు వచ్చిన మెకానిజం చేయటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న హైడ్రాలిక్పవర్ స్టీరింగ్ బస్సులకు సంబంధించిన విడిభాగాలు అందుబాటులో లేకపోవటంతో నానాతంటాలు పడుతూ తాత్కాలిక కార్మికులు బస్సులను రోడ్డుపైకి అనుమతి ఇస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్ల చేతిలో బస్సుల క్లచ్‌లు, గేర్లు ఎక్కువగా చెడిపోతున్నాయని తెలుస్తోంది. దీంతో బస్సు వేగం తగ్గిపోతోందనే అభిప్రాయాలున్నాయి. ఘటనలు ఇవిగో.. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటనలో ముందు భాగం నుంచి కండక్టర్ సీటు వరకు పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. హైదరాబాద్–మంచిర్యాల నడిచే బస్సు కూడా గేర్ బాక్స్ ఫెయిల్ అయి అక్కడి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలోనే బస్సులు ఉంచాల్సి వచ్చింది. ఈనెల 14న రాత్రి మంచిర్యాల–బెల్లంపల్లి ప్రధాన రహదారిపై శ్రీనివాసగార్డెన్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంకోవైపు డ్రైవర్ తప్పిదాలతో 17 బస్సుల అద్దాలు (సైడ్గ్యాస్లు) పగిలిపోయాయి. తాజాగా మంచిర్యాల నుంచి బయల్దేరిన ‘రాజధాని’ బస్సు కరీంనగర్ జిల్లా నీరుకుల్ల వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. వెనుకాలే వస్తున్న మరో లారీ ఈ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఇలా ఏదోచోట బస్సులు ప్రమాదాలకు గురికావటంతో పూడ్చుకోలేని నష్టం ఆర్టీíసీ సంస్థకు వాటిల్లుతోంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
సాక్షి, భువనగిరి : యాద్రాద్రి జిల్లా భువనగి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరకాల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలు దేరిన బస్సు.. భువనగిరి బైపాస్ రోడ్డు దగ్గరకు రాగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కొంత మంది ప్రయాణికులు కాల్వలో పడిపోయారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు
సాక్షి, పెనమలూరు(కృష్ణా) : ఆర్టీసీ బస్సు కరకట్టపై పల్టీ కొట్టి 15 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన మండలంలోని చోడవరం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ నుంచి అవనిగడ్డకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరింది. కరకట్టపై పెదపులిపాక– చోడవరం గ్రామాల మధ్యలో ఉన్న ఉండరపు కట్ట వద్దకు చేరింది. అక్కడ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను బస్సు డ్రైవర్ కాసాని నానిబాబు గమనించకుండా బస్సును వేగంగా దూకించాడు. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి కుడివైపు కట్ట దిగువకు పల్టీ కొట్టింది. అయితే చెట్టు అడ్డుగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఎడమ వైపుకు పల్టీ కొట్టి ఉంటే కేఈబీ కెనాల్లోకి పడి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన వద్ద.. బస్సు ఒక్కసారిగా కరకట్ట దిగువకు పల్టీ కొట్టడంతో భయాందోళణకు గురైన ప్రయాణికుల ఆరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ కేఎస్‌హెచ్ బాబు తెలిపారు. బస్సు పడిపోవటంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో బస్సులో తొక్కిసిలాటలో 15 మందికి గాయపడ్డారు. గాయపడిన వారిలో కోడూరుకు చెందిన అన్నంరమేష్ (16), అన్నంఓంకార్(17), చాగంటాపాడుకు చెందిన దేవరకొండ గోపీకృష్ణ(24), అవనిగడ్డకు చెందిన శివపార్వతి(50), మోపిదేవికి చెందిన మత్తి శివనాగబాబు(23), కలపాల రజిత్‌కుమార్(18), కలపాల రజిత(19), రామానగరానికి చెందిన కొత్తపల్లి భుజంగరావు(64), కాసాని సాంబశివరావు(64), కాసానివెంకటరామమూర్తి(24), విజయవాడకు చెందిన గొలికొండ మహేష్, ముబారక్హుస్సేన్, నాగాయలంకకు చెందిన వెంకటశివనాగరాజు, చల్లపల్లికి చెందిన శివనాగమణి, కాసరనేనివారిపాలేనికి చెందిన బి.రత్నంరాజు గాయపడ్డారు. గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పది మందిని తరలించగా, 108 వాహనం సిబ్బంది మిగితా వారికి చికిత్స చేశారు. బస్సులో ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. ఇంత నిర్లక్ష్యమా... ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపగా, సామర్థ్యానికి మించి 70 మంది ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పిందని,లేక పోతే భారీగా ప్రాణనష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఎమ్మెల్యేలు.. ఘటనా స్థలం వద్దకు తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చేరుకున్నారు. ఆ తరువాత పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వచ్చారు. వారు ప్రయాణికులను పరామర్శించారు. జరిగిన ఘటన పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి వైద్యం అందించాలని అధికారులను కోరారు. -
ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సులు
ఉమ్మడికరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, హుజూరాబాద్‌లలో ఆదివారం ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సిరిసిల్ల రగుడు శివారులో జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ వైద్యుడు జలగం యాదగిరిరావు(45), హుజూరాబాద్లోఆర్టీసీ డిపో క్రాస్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రభాకర్ (46) అనే ఎల్ఐసీ ఉద్యోగి మృతి చెందాడు. సిరిసిల్లక్రైం/సిరిసిల్లటౌన్: సిరిసిల్ల రగుడు శివారులో ఆదివారం బైకుపై వస్తున్న ప్రభుత్వ వైద్యుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని సాయి మణికంఠ ఫంక్షన్హాల్లో బంధువుల పెళ్లికి ప్రభుత్వ వైద్యుడు జలగం యాదగిరిరావు(45) హాజరయ్యారు. భోజనం చేసి బైకుపై సిరిసిల్లకు రావడానికి రంగినేని ట్రస్ట్ ప్రాంతంలో యూటర్ను తీసుకుంటుండగా కరీంనగర్ నుంచి సిరిసిల్ల వైపు వస్తున్న నాన్‌స్టాప్ బస్సు వేగంగా ఢీకొట్టింది. బస్సు అతివేగంతో ఉండటంతో బ్రేకులు సరిగా పడక ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో యాదగిరిరావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా చేసి పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ నారా గౌడ్‌పై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య శ్వేత, కుమారుడు కృతిక్, కూతురు ఉన్నారు. జిల్లా వైద్యశాఖలో విషాధం.. రోడ్డు ప్రమాదంలో డాక్టర్ యాదగిరిరావు మృతిచెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యశాఖలో పెను విషాదం నెలకొంది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామ వాస్తవ్యులైన ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన జలగం మాధవరావు–భారతమ్మల కుమారుడు యాదగిరిరావు తల్లిదండ్రులతోపాటు సిరిసిల్ల అనంతనగర్‌లో నివాసముంటున్నాడు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్సీలో యాదగిరిరావు ఐదేళ్లపాటు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నగునూరులోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థలో మెడిసిన్‌లో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకున్న స్థానికులు వందల సంఖ్యలో సంఘటన స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం కోసం జిల్లా ఏరియాస్పత్రికి తీసుకురాగా ఆస్పత్రి ప్రాంగణం రోధనలతో దద్దరిల్లింది. సిరిసిల్లలో వైద్యుడిగా యాదగిరిరావు మంచి కీర్తి గడించారు.ఆయన మృతికి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఐఎంఏ అధ్యక్షుడు చింతోజు శంకర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి, ప్రముఖ వైద్యులు పెంచలయ్య, మానేరు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంతాపం ప్రకటించారు. బస్సు ఢీకొని ఎల్ఐసీ ఉద్యోగి మృతి హుజూరాబాద్: పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ (46) అనే ఎల్ఐసీ ఉద్యోగి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ప్రభాకర్ (46) పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరిత్యా పట్టణంలోని కాకతీయకాలనీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటికి నిత్యవసర వస్తువులు తీసుకొని వెళ్తుండగా ఆర్టీసీ డీపో నుంచి బయటకు వస్తున్న బస్సు ఢీకొనడంతో ప్రభాకర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతివార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గమ్యం చేరని ప్రయాణం
విశాఖపట్నం,నల్లజర్ల: నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. నల్లజర్ల ఎస్సై వి.సుబ్రహ్మణ్యం అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం డిపో బస్సు గురువారం విజయవాడ నుంచి ఏలేశ్వరం వెళుతుండగా పుల్లలపాడు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో వెనుక సీట్లో ఉన్న హైదరాబాదు నుంచి ఏలేశ్వరం వెళుతున్న తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం, కె.పెదపూడికి చెందిన చింతా విజయ భ్రమరాంబ (50)కు తీవ్రగాయాలయ్యయి. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న రెస్ట్ డ్రైవర్ నాగం సత్యనారాయణ (ఏలేశ్వరం) తీవ్రంగా గాయపడటంతో ఆయనను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీతానగరంకు చెందిన నేమాని సత్యవతి ఆమె కుమారుడు రామ్మోహనచౌదరి, మృతురాలు కుమారుడు పవన్‌కుమార్ కు స్వల్పగాయాలయ్యాయి. వీరందరికి నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం: తహసీల్దార్ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది వచ్చి ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదని తహసీల్దార్ గౌరినాయుడు ఆరోపించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తాను సంఘటనా స్థలానికి వెళ్లానని, 108కు ఫోన్ చేస్తే సిబ్బంది డ్యూటీలు మారుతున్నామని చెప్పి ఆలస్యం చేశారని, ముందుగా వచ్చి ఉంటే ప్రయాణికురాలు భ్రమరాంబ బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కళ్లేదుటే ఆమె చనిపోయిందన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
కాటారం(మల్హర్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ పీవీనగర్ వద్ద కాటారం – మంథని ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని డిపోకు చెందిన (ఏపీ 01 వై 2992) నంబర్ అద్దె బస్సు గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లికి 63 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పెద్దపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన అడవిసోమన్‌పల్లి మానేరు వంతెన దాటిన అనంతరం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు రోడ్డు పక్కకు దిగి పల్టీ కొట్టింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు అప్రమత్తమై బస్సు లోపల భాగాలను గట్టిగా పట్టుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, 30 మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలవ్వగా మరో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికుల తల, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు 108, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను కాటారం, మహదేవపూర్, మంథని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
-
డ్రైవర్ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్ వదిలేయడంతో..
సాక్షి, భూపాలపల్లి: గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పీవీనగర్ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. గోదావరి ఖని డిపోకు చెందిన ఈ బస్సులో 63 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 25 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. కాగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్ వదిలేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : డ్రైవర్ నిర్లక్ష్యం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు -
దారితప్పిన ప్రగతి రథం
సాక్షి, హైదరాబాద్: ఎర్ర బస్సు అనగానే ఓ అనుబంధం.. ఓ ఆత్మీయత.. అది మన ఇంటి వాహనమన్నంత ప్రేమ.. ఊరికి బస్సు వచ్చిందంటే అదో ఆనందం.. నైట్ హాల్ట్ చేస్తే, ఆ రాత్రికి డ్రైవర్, కం డక్టర్ ఆ ఊరికి అతిథులే.. ఆర్టీసీ బస్సంటే అంత అభిమానం మరి. అందులో ప్రయాణిస్తే హాయిగా గుండె మీద చేయి వేసుకుని నిద్రపోయేంత నమ్మకం. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని బస్సుపై ఉన్న నినాదం నిజమేన్న విశ్వాసం. మరి.. వాస్తవంగా పరిస్థితి అలాగే ఉందా..? ఆర్టీసీ బస్సు ప్రయా ణం సురక్షితమేనా? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. గత ఐదేళ్లలో ఆర్టీసీ ప్రస్థానం చూశాక, ఆ బస్సెక్కాలంటే కొంచెం ఆందోళన చెం దాల్సిన దుస్థితి. కాలక్రమంలో బస్సు నుంచి ఎర్ర రంగు పోయినా.. వరుస ప్రమాదాలతో మన బస్సు మళ్లీ ‘ఎర్ర’బడుతోంది. మసకబారుతున్న ప్రతిష్ట... దేశంలోనే అతి తక్కువ ప్రమాదాలు నమోదయ్యే రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీకి పేరుంది. కానీ నెమ్మదిగా ఆ ప్రతిష్ట మసకబారుతోంది. గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల తీరు చూస్తే ఆందోళన కలుగుతోంది. 2013–14 నుంచి గతేడాది డిసెంబర్ వరకు ఏకంగా 5వేల రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సు భాగస్వామ్యమైంది. ఈ ప్రమాదాల్లో 2,304 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం.. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున రాష్ట్ర సరిహద్దు దాటాక బోల్తాపడింది. అందులోని ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యారు. గతంలో ఈ సర్వీసు గుంటూరు వరకు ఉండగా, అక్కడికి మరో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు వరకు పొడిగించారు. కానీ డ్రైవర్ విశ్రాంతి సమయం మాత్రం పెరగలేదు. సాధారణంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గమ్యం చేరిన తర్వాత డ్రైవర్‌కు కనీసం 8 గంటల విశ్రాంతి ఉండాలి. కానీ అది 6 గంటలకే పరిమితమవుతోంది. ట్రాఫిక్ జాంలు, రోడ్లు బాగాలేకపోవటం వంటి కారణాలతో అందులో రెండు గంటల సమయం హరించుకుపోతోంది. దీంతో డ్రైవర్‌కు నికరంగా మిగిలే సమయం నాలుగు గంటలు మాత్రమే. తిరుగు ప్రయాణానికి గంట ముందు సన్నద్ధం కావాల్సి ఉంటున్నందున అది మరీ తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు రెండు మూడు గంటలే పడుకుంటున్నారు. గతంలో దూరప్రాంతాలకు వెళ్లొచ్చాక మధ్యలో ఒకరోజు పూర్తి విశ్రాంతి ఉండేది. ఇప్పుడు డ్రైవర్ల కొరత వల్ల అది ఉండటంలేదు. ఒంగోలు వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడానికి కారణం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడమేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యం ఉన్నా డ్యూటీకి... రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ డిపోకు చెందిన డ్రైవర్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. ప్రయాణం మధ్యలో కళ్లు తిరుగుతుండటంతో బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఓ గంట తర్వాత తేరుకుని బస్సు తీసుకుని డిపోకు వచ్చి, అనారోగ్యంగా ఉన్నందున ఒక్కరోజు సెలవు కావాలని అడిగారు. అయితే, డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉందని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఒత్తిడి చేయటంతో డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తోటి కార్మికుల ఆందోళనతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అనుమతించారు. అలాగే వారం రోజుల క్రితం పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ వీక్లీఆఫ్ రోజున ఇంటిపట్టునే ఉండి మద్యం తాగారు. కానీ, ఇద్దరు డ్రైవర్లు అనుకోకుండా సెలవు పెట్టడంతో వెంటనే డ్యూటీకి రావాల్సిందిగా డిపో నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను బస్సు నడిపే స్థితిలో లేనన్నా సిబ్బంది వినిపించుకోలేదు. డిపోకు వచ్చిన తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశాక, అతిగా మద్యం సేవించినట్టు తేలడంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి పంపించారు. కానీ ఆ లెవల్స్ తక్కువగా ఉంటే డ్యూటీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కార్మికులు చెబుతున్నారు. ఒత్తిడితో చిత్తు.. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్రమైన డ్రైవర్ల కొరత ఎదుర్కొంటోంది. ఆరేళ్లుగా నియామకాలు లేకపోవటంతో ప్రస్తుతం 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పదవీ విరమణ చేస్తుండటం, మృత్యువాత పడుతుండటంతో డ్రైవర్ల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం సంస్థ అవసరాల మేరకు 20,300 డ్రైవర్లు కావాల్సి ఉండగా.. 18,500 మంది మాత్రమే ఉన్నారు. డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో నిత్యం కొన్ని సర్వీసులు డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. అసలే ప్రయాణికుల సంఖ్యకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో కొన్ని సర్వీసులు నిలిపివేయాల్సి రావడం సమస్యను మరింత పెంచుతోంది. దీంతో ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేసి పనిచేయించాల్సి వస్తోంది. దీంతో డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. అసలే డ్రైవింగ్ సవాల్‌తో కూడుకున్న పని కావడం.. దానికి ఒత్తిడి తోడు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ డ్రైవర్లు మంచి నైపుణ్యం ఉన్నవారే కావడంతో జాగ్రత్తగానే డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ, ఎదురుగా వచ్చే వాహనదారుల తప్పిదం, చాలా ప్రాంతాల్లో రోడ్లు ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శిక్షణ లేని అద్దె బస్సు డ్రైవర్లు... సొంత బస్సుల నిర్వహణ భారం నుంచి తప్పించుకునేందుకు కొంతకాలంగా ఆర్టీసీ అద్దె బస్సులను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,800 అద్దె బస్సులున్నాయి. వీటి యజమానులే డ్రైవర్లను నియమిస్తారు. వారు ఆర్టీసీ సొంత డ్రైవర్ల తరహాలో శిక్షణ తీసుకున్నవారు కాదు. ఇది కూడా ప్రమాదాలు పెరిగేందుకు కారణమవుతోంది. గతంలో గోదావరిఖని సమీపంలోని బసంత్‌నగర్ వద్ద లోయలో బస్సు పడి ఏడుగురు ప్రాణాలను హరించింది అద్దె బస్సే. ఆ ప్రమాదంలో దాని డ్రైవర్ కూడా చనిపోయాడు. బస్సు రోడ్డెక్కితే చాలు అనుకుంటున్న ఆర్టీసీ.. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇప్పించాలన్న విషయాన్ని విస్మరిస్తోంది. ఆటోలు నడిపినవారు కూడా అద్దె బస్సు స్టీరింగ్ పట్టుకుని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ జీతంతో అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమిస్తున్నారు. దీనిని సంస్థ పట్టించుకోవడంలేదు. అక్కడలా.. ఇక్కడిలా.. 2013 అక్టోబర్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ఓ ప్రైవేటు వోల్వో బస్సు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి కావటంతో 45 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన రోడ్లకు వోల్వో బస్సు డిజైన్ అనుకూలం కాదన్న వాదన రావడంతో ఆ కంపెనీ దిగొచ్చింది. ఉన్నతస్థాయి బృందాన్ని పంపి బస్సును పరిశీలించి, కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదకరంగా ఉండటంతో జాతీయ రహదారుల విభాగం అధికారులు సర్వే చేసి దానిని సరిచేశారు. అలాంటి లోపాలు మిగతా చోట్ల ఎక్కడున్నాయో పరిశీలించి కొన్ని మరమ్మతులు చేశారు. 2015 జూన్: గజ్వేల్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొనడంతో 17 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. కాపలా లేని లెవల్ క్రాసింగ్స్‌ను యుద్ధప్రాతిపదికన తొలగిస్తామని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ మేరకు రైల్వేశాఖ తగిన చర్యలు కూడా తీసుకుంది. 2018 సెప్టెంబర్ 11: కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న ఆర్టీసీ బస్సు.. పక్కనే ఉన్న గుంతలో పడిపోయి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏకంగా 67 మంది దుర్మరణం పాలయ్యారు. కానీ తర్వాత ఏం జరిగింది? ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే అని తేల్చేసి ఆర్టీసీ చేతులు దులుపుకొంది. నిజానికి ఆ బస్సు నడిపింది గతంలో ఉత్తమ డ్రైవర్ పురస్కారం అందుకున్న వ్యక్తే. కానీ, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ బస్సులో వంద మంది కంటే ఎక్కువ మంది ఎక్కిన విషయాన్నీ విస్మరించారు. డీజిల్ పొదుపు పేరుతో దూరం నుంచి వెళ్లాల్సిన బస్సును ఘాట్ రోడ్డు మీదుగా మళ్లించాలని ఆదేశించిన తీరునూ తొక్కిపెట్టారు. అన్నింటికీ మించి ఆ బస్సు అప్పటికే 13 లక్షల కిలోమీటర్లు తిరిగి పనికిరాకుండా పోయిన డొక్కు బస్సనే సంగతీ పట్టించుకోలేదు. ఇంత భారీ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీలో ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు చేటు చేసుకోకుండా కొత్తగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుతం నడుస్తున్న డొక్కు బస్సులను పక్కన కూడా పెట్టలేదు. ఆర్టీసీలో అంతా గందరగోళం... ఆర్టీసీలో అంతా గందరగోళం రాజ్యమేలుతోంది. గత ఐదేళ్లుగా సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేరు. సాధారణంగా ఆర్టీసీకి ఐపీఎస్ అధికారి ఎండీగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యాక.. ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణరావు ఎండీ అయ్యారు. ఆయన మాటను తోటి ఈడీలు పట్టించుకోలేదు. చైర్మన్‌గా ఉన్న సోమారపు సత్యనారాయణను ఆయన లెక్క చేయలేదు. ఫలితంగా ఆర్టీసీ పతనావస్థకు చేరింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎండీ లేరు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈడీల మధ్య సఖ్యత లేక అంతర్గత కీచులాటలు పెరిగాయి. ఓ అధికారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి స్థితిలో బస్సు ప్రమాదాల నివారణపై దృష్టి సారించే పరిస్థితే లేకుండా పోయింది. అప్పు తెచ్చి పరిహారం చెల్లింపు ప్రస్తుతం ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రతినెలా జీతాలు చెల్లించేందుకే దిక్కులు చూడాల్సి వస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్న ప్రమాదాలు సంస్థను మరింత గుల్ల చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 2018లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.46 కోట్లు, అంతకుముందు సంవత్సరం రూ.45 కోట్లు చెల్లించారు. ఇలా గత ఆరేళ్లలో ఏకంగా రూ.200 కోట్లు చెల్లించింది. ఆర్టీసీ పురోగతి చర్యలకు నిధులు ఉండటంలేదు. దీంతో ప్రతి పనికీ అప్పు తేవాల్సిన దుస్థితి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం గ్రాంటు రూపంలో డబ్బులు ఇవ్వకున్నా, రుణం తీసుకునేందుకు మాత్రం అనుమతి ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్టీసీ అప్పు తెచ్చుకుంటోంది. ఆ అప్పు నుంచే పరిహారం కూడా చెల్లిస్తోంది. బస్సుల సంఖ్య పెంచాలి తెలంగాణలో వెంటనే ఆర్టీసీ బస్సుల సంఖ్య, అందుకు అనుగుణంగా డ్రైవర్ల సంఖ్య పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు పరస్పరం ఢీకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. బస్సులు సరిపోకపోవడంతో జనం ఆటోల్లో పది, పదిహేను మంది వరకు ఎక్కుతున్నారు. అనువుగా లేని రోడ్లలో ఇవి ఢీకొంటున్నాయి. ఈ సమస్య పోవాలంటే వెంటనే ఆర్టీసీ కనీసం 2వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిందే. రోడ్లను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. – సుదర్శనం పాదం, మాజీ డైరక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాన్స్‌పోర్టు ఇప్పటికైనా సంస్థ కళ్లు తెరవాలి తెలంగాణ ఆర్టీసీ బస్సులు సురక్షితమన్న పేరు కొనసాగేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలి. డొక్కు బస్సులు తొలగించటంతోపాటు డ్రైవర్లపై పనిభారాన్ని కూడా తగ్గించాలి. పని ఒత్తిడితో డ్రైవర్లు డ్యూటీలోనే గుండెపోటుతో చనిపోవడం, ప్రమాదాలకు గురికావడం ఇటీవల పెరిగింది. బస్సులో పెద్ద సంఖ్యలో ఉండే ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని వెంటనే సంస్థ కళ్లు తెరవాలి. డ్రైవరకు విరామం కల్పించటంతోపాటు వారికి వైద్య వసతి పెంచాలి. తరచూ మెడికల్ టెస్టులు నిర్వహించాలి. – నాగేశ్వరరావు, ఎన్ఎంయూ ప్రతి డ్రైవర్ అప్రమత్తంగా ఉండాల్సిందే చాలాచోట్ల రోడ్లు సరిగా లేవు. ట్రాఫిక్ ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రతి ఆర్టీసీ డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు తప్పవు. బస్సులో తాను కాకుండా కనీసం మరో 50 మంది ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని డ్రైవింగ్ చేయాలి. ఆరోగ్యం సరిగా లేకుంటే డ్రైవింగ్‌కు వెళ్లకపోవడం చాలా ఉత్తమం. ఏవైనా అనుమానాలుంటే శిక్షణకు హాజరు కావాలి. – కంది సురేందర్ రెడ్డి, ఉత్తమ డ్రైవర్ పురస్కార గ్రహీత -
బస్సు ఢీకొని మహిళ మృతి
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: బ్యాంక్ పని ముగించుకుని స్కూటర్‌పై ఇంటిముఖం పట్టిన భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలైన ఘటన పూలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, పాలకొల్లు మండలం వెలివెల గ్రామానికి చెందిన కొప్పినీడి పద్మ ఆంజనేయులు, అతడి భార్య సరోజిని (43) బ్యాంక్ పనిమీద స్కూటర్‌పై పాలకొల్లు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా పూలపల్లి వద్ద భీమవరం నుంచి పాలకొల్లు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో సరోజిని అక్కడికక్కడే మృతి చెందగా ఆంజనేయులు వెన్నెముక జారిపోవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె సాయిరత్నం గ్రామంలో డ్వాక్రా యానిమేటర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె వెంకట దుర్గ డిగ్రీ పాసై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం
హైదరాబాద్: సికింద్రాబాద్ క్లాక్‌టవర్ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి నాలుగు వాహనాలను, ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఓ పాదచారి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు... మియాపూర్ డిపో–2 ఆర్టీసీ బస్సు(రూట్ నంబర్ 10జే) జేఎన్టీయూ నుంచి సికింద్రాబాద్‌కు వస్తోంది. బస్సు క్లాక్‌టవర్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద మెట్రో పిల్లర్ నంబర్ 14 వద్దకు రాగానే అదుపు తప్పి పాదచారిని ఢీ కొట్టింది. వెంటనే డ్రైవర్ అహ్మద్ బ్రేకులు వేసేందుకు యత్నించినా బస్సు అలాగే ముందుకు వెళ్లి 16–17 పిల్లర్ల మధ్య డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు మరోవైపు వచ్చింది. అక్కడి నుంచి రాంగ్రూట్లో వెళ్లి కారు, ఆటోలు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లి పిల్లర్ 24ను ఢీకొట్టి ఆగిపోయింది. ఒకరు మృతి– ముగ్గురికి గాయాలు పిల్లర్ 14 వద్ద ఓ యాచకుడి(51)ని బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఒంగోలుకు చెందిన ప్రసాద్, పద్మజారాణి డ్రైవర్ వెంకటేశ్‌తో కలసి కారులో అమీర్‌పేట్ వైపు వెళుతుండగా బస్సు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు వీరికి గాయాలుకాలేదు. దాని వెనుకాలే ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టింది. దీంతో బోయిన్పల్లి సిక్విలేజ్కి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మేడ్చల్ కండ్లకోయకు చెందిన ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస్ సికింద్రాబాద్‌కు వచ్చి వెళుతుండగా ఢీకొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వెళ్తున్న ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన డి.ధనమ్మ(45)ను ఢీ కొట్టడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 2015లో బీహెచ్ఈఎల్ డిపోలో పనిచేసే సమయంలోనే ఆర్సీ పురం వద్ద ఓ పాదచారిని అహ్మద్ నడుపుతున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీంతో యాజమాన్యం 14 నెలల పాటు అహ్మద్‌ను సస్పెండ్ చేసింది. మళ్లీ విధుల్లో చేరిన కొద్ది నెలల్లోనే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బస్సు కండీషన్లోనే ఉంది: ఆర్ఎం రమాకాంత్ (సికింద్రాబాద్) బస్సును మా నిపుణులు వచ్చి పరిశీలించారు. బస్సు బ్రేక్ మీటర్లో ఎయిర్ 6 పాయింట్లు చూపిస్తోంది. అంటే.. బ్రేకు బాగున్నట్లే. ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందనేది తర్వాత దర్యాప్తులో తేలుతుంది. ఫిట్నెస్ బాగానే ఉంది. డిసెంబర్ 27, 28వ తేదీల్లో బస్సు పూర్తిస్థాయి సర్వీసింగ్ చేశాం. ఎలాంటి లోటుపాట్లు లేవు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం. గాయపడినవారికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాం. బ్రేకులు పడలేదు: డ్రైవర్ అహ్మద్ క్లాక్‌టవర్ చౌరస్తాకు రాగానే పాదచారి వచ్చాడు. బస్సు బ్రేకులు వేసేందుకు యత్నిం చినా ఆగలేదు. బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. అందరూ కేకలు వేస్తున్నారు. నేను సీటులోంచి లేచి నిల్చుని బ్రేకులు ఒత్తిపట్టినా పడలేదు. ముందుకు వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఆగిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి...
బోడుప్పల్: ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో దంపతులు మృతి చెందారు. మేడిపల్లి ఇనస్పెక్టర్ డి.అంజిరెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం... రాజమండ్రికి చెందిన పి.కోటేశ్వరరావు (29) గత కొంత కాలంగా నగరంలో ఉంటూ తార్నాకలోని ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగినేని పల్లికి చెందిన స్వప్న(27) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పీర్జాదిగూడ మునిసిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో నివసిస్తున్న వీరు ఆదివారం పనిమీద అన్నోజిగూడకు బయలుదేరారు. నారపల్లి చౌరస్తా వరకూ వచ్చి ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చేందుకు వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఏపీ 29జడ్ 2157 నంబరు కలిగిన ఆర్టీసీబస్సును మరో టూవీలర్ వేగంగా క్రాస్ చేసి వెళ్లింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి హఠాత్తుగా సీట్లో నుంచి బస్సులో కింద పడిపోయాడు. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ ఎక్కింది. బస్సు వెళ్లాక వెళ్దామని అక్కడే ఆగి ఉన్న కోటేశ్వరరావు వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ టీవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి మల్కాజ్గిరి ఏసీపీ గోనె సందీప్‌రావు సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపడమే కారణమని కొందరు స్థానికులు చెప్పారు. -
బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం
గోపాల్పేట (వనపర్తి): ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన నాగపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన చక్రి (13), బాలరాజు (20), వినయ్ లు గురువారం బావాయిపల్లి నుంచి గౌరిదేవి పల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అదే స మయంలో కొల్లాపూర్ డిపోకు చెందిన (ఏపీ 28 జెడ్ 4173) నంబర్‌గల ఆర్టీసీ బస్సు నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళుతుండగా నాగపూర్ గ్రా మం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చక్రి అనే యువకుడికి తీ వ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలరాజును స్థానికులు నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా నాగపూర్ సమీపంలో ప్రాణాలు వది లాడు.వినయ్ తీవ్ర గాయాలతో కొల్లాపూ ర్ ప్ర భుత్వాస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. ఒ క్కగానొక కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రు లు తిరుపతయ్య, పార్వతమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. చక్రిమృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం రేవల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్నోవా ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి గాయాలు పెంట్లవెల్లి (కొల్లాపూర్): మండల కేంద్రంలోని న మాజ్ చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయప డ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. జటప్రోల్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మిద్దేటి వెంకటేశ్వర్లు (52), మిద్దేటి శ్రీధర్ కొల్లాపూర్‌కు బ్యాండ్ వాయించడానికి వెళ్లారు. ప ని ముగించుకుని తిరిగి జటప్రోల్‌కు వస్తుండగా మార్గమధ్యలో కేవైఎఫ్ సంస్థకు చెందిన కారు ప్ర చారానికి వెళ్లి వస్తూ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకటేశ్వర్లు ప్రాణాలు వదిలాడు. శ్రీధర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని వైద్యుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనపై డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. -
ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్సు ఆటోట్రాలీని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, 12 మంది గాయపడిన సం ఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రతి రోజు ఆకుకూరలను అమ్ముకునేందుకు హైదరబాద్ మార్కెట్‌కు వెళ్తుంటారు. రోజూ మాదిరిగానే ఆటోట్రాలీలో కూరగాయాలు నింపుకొని గ్రామం నుంచి బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ సమీపంలో రైతులు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న గొడుకాండ్లు యాదయ్య(59) అక్కడికక్కడే మృతిచెందగా కట్టెల రాములు(40), మంచాల జంగయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరితో పాటు ప్రమాదంలో గాయపడిన మర్రిపల్లి వినోద్‌కుమార్, గుర్రం మధుకర్‌రెడ్డి, బోరిగె మహేందర్, కట్టల మహే ందర్, మేకల యాదగిరిరెడ్డి, మొగిలి జంగారెడ్డి, జి. రవీందర్, శ్యామల లక్ష్మమ్మ, గుడాల బాలమ్మ, మేకల కల్పనలను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం నగరంలోని ఉస్మానియా, యశోద, సాయి సంజీవిని ఆస్పత్రులకు తరలించారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపించిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మొండిగౌరెల్లిలో విషాదఛాయలు యాచారం: కరువు పరిస్థితులు పండించిన ఆకుకూరలకు మంచి ధర వస్తుందనే ఆశ ప్రాణాల మీదకు తెచ్చింది. పూదీనా, కొత్తిమీరా పండించే మొండిగౌరెల్లి రైతులు నిత్యం ప్రైవేట్ వాహనా ల్లో హైదరాబాద్‌లోని మాదన్నపేట మార్కెట్‌కు తరలించి 5:30 గంటల్లోపే విక్రయాలు జరిపి తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఏళ్లుగా ఇదే మాదిరిగా గ్రామానికి చెందిన రైతులు ఆకుకూరలను మార్కెట్లో విక్రయిస్తారు. అదే మాదిరిగా ఆదివారం ఉదయం 4 గంటలకు ఆటోలో పూదీనా, కొత్తిమీరా తదితర ఆకుకూరలను తీసుకుని 13 మంది రైతులు మాదన్నపేట మార్కెట్‌కు బయల్దేరారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు రైతులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలపాలైన గొడుకొండ్ల యాదయ్య మృతిచెందగా, పలువురు తీవ్ర గాయాలపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యాదయ్య మృతితో వీధిన పడిన కుటుంబం... గొడుకొండ్ల యాదయ్య మృతితో ఆయన కుటుంబం వీధిన పడింది. యాదయ్యకు నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నప్పటికీ బోరుబావుల్లో నీళ్లు లేకపోవడంతో యాచారం గ్రామానికి చెందిన కుమ్మరి గాలయ్య వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని ఆకుకూరలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాదయ్యకు భార్య మల్లమ్మతో పాటు ఇద్దరు కుమారులు ప్రవీణ్‌కుమార్, రాంప్రసాద్కుమార్, దివ్యాంగురాలైన కూతురు జంగమ్మ ఉంది. యాదయ్య మృతితో కుటుంబం వీధినపడింది. ఈ ప్రమాదంతో మొండిగౌరెల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటోట్రాలీ ప్రమాదాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచనలు చేశాడు. యాదయ్య కుటుంబీలకు సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్, యాచారం జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అచ్చెన మల్లీకార్జున్ తదితరులు ఉన్నారు. -
కొండగట్టు సాయానికి ‘కోడ్’ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషి యా చెల్లింపునకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రమాదంలో 62 మంది మృత్యువాత పడగా, మరో 43 మంది గాయపడిన విషయం తెలిసిందే.