RTC JAC Leaders
-
TSRTC: ఉద్యోగుల జీతాలు కట్.. ఈసీని కలిసిన టీఎస్ఆర్టీసీ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీఎస్ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడంపై ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం..‘తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై టీఎస్ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అశ్వథ్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అక్రమంగా జీవో ఇచ్చారు. హరిత నిధి పేరుతో కార్మికుల జీతాల నుంచి రూ.300 కట్ చేస్తున్నారు. అక్రమంగా జీవో ఇచ్చి జీతాలు కట్ చేయడం చట్టరీత్యా నేరం. జీవో రద్దు చేయాలని కమిషన్‌ను కోరాం’ అని తెలిపారు. మరోవైపు.. అశ్వథ్థామ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఇంకా పార్టీలు మారుతూనే ఉన్నారు. -
ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఇక కాలగర్భంలో కలిసిపోనుందా? త్వరలోనే ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. గురువారం జరగబోయే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసే యోచనలో ఉందని తెలుస్తోంది. చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష అత్యంత సుదీర్ఘంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా.. కాదన్నా మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరుకావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని ప్రకటనలో తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అరెస్ట్
-
తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తు ఏమిటి?
-
అధికారులపై ఇలాంటి దాడులు జరగడం దారుణం
-
మాది చట్టబద్ధమైన ఉద్యమం
-
సమ్మె విరమించే ప్రసక్తే లేదు
-
29వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
-
డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత
-
ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర
-
కరీంనగర్లో రణరంగం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు అంతిమయాత్ర రణరంగంగా మారింది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బాబు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర వేలాది కార్మికులు కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి గ్రామానికి తరలివచ్చారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు చేసేది లేదని బాబు కుటుంబ సభ్యులతో సహా జేఏసీ నేతలు, విపక్షాల నేతలు ప్రతినబూనారు. మృతదేహాన్ని భద్రపరిచిన ఫ్రీజర్ చెడిపోవడాన్ని గమనించకపోవడంతో 3 రోజుల కిందట మృతి చెంది న బాబు మృతదేహం డీకంపోజింగ్ అవుతుందని గమనించిన నేతలు దహన సంస్కారాలు నిర్వ íహించేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహాన్ని ఆయన పనిచేస్తున్న కరీంనగర్ –2 డిపో కు తరలించి, తిరిగి శ్మశానవాటికకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టిన అంతిమ యాత్రను పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచనల మేరకు పోలీసులు బాబు మృతదేహాన్ని శ్మశానవాటికకు మళ్లించి, నాయకులను మరోవైపు పంపించారు. పోలీసుల దారి మళ్లింపుతో ఉద్రిక్తత నాయకులను అడ్డుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలసి శ్మశానానికి తరలించడంతో జేఏసీ నాయకులు, బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాల నాయకులకు మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఎదురునిలిచారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీల నాయకులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు వాహనానికి అడ్డు తిరిగి కట్టెలు వేసి మంటలు పెట్టారు. ఈ క్రమంలోనే బాబు మృతదేహాన్ని మరికొంత మంది పోలీ సులు శ్మశానవాటిక వరకు తరలించి అంత్యక్రియ లు నిర్వహించారు. బండి సంజయ్ నేతృత్వంలో మంద కృష్ణమాదిగ, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ, టీడీపీ, ఆర్టీసీ జేఏసీ, టీజేఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఇంటిపార్టీ్ట, ఆదివాసీ తుడుం దెబ్బ, ఏబీవీపీ నేతలు కోర్టు చౌరస్తాకు చేరుకుని బైఠాయించారు. తోపులాటలో సమయంలో ఏసీపీ వీరేంద్రసింగ్ ఎంపీ బండి సంజయ్ కాలర్‌ను పట్టుకుని చేయిచేసుకోబోయాడని, దానికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కార్మికులు హక్కుల కోసం గొంతెత్తితే ఉక్కుపాదంతో ప్రభుత్వం అణచివేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఎంపీ సంజయ్ కాలర్ పట్టుకున్న ఏసీపీ బాబుకు కన్నీటి వీడ్కోలు బాబు అంత్యక్రియల ప్రక్రియ ఓవైపు జరుగుతుండగా.. ఎస్సాఆర్ఆర్ కళాశాల చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేసి రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. డ్రైవర్ నంగునూరి బాబు అంత్య క్రియలకు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబన్నకు అంతిమ వీడ్కోలు పలికారు. -
జేఏసీ నిర్ణయంతో బాబు అంత్యక్రియలు
సాక్షి, కరీంనగర్ : ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బాబు కుటుంబ సభ్యుల అనుమతితోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్ బస్ డిపో వరకు శవయాత్ర నిర్వహించి తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా 28 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా.. మూడు రోజులుగా బాబు మృతదేహంతో దీక్ష చేసినా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ యావత్ సమాజం, ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారస్తులు మద్దతు తెలిపిన కేసీఆర్‌లో మార్పు రాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఖరి వల్ల కార్మికులంతా ఆవేదనకు లోనై ఆత్మహత్య, మానసికంగా, చనిపోతున్నారని ధామస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ బాబు కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులెవరు ఆత్మహత్య చేసుకోవద్దని, సీఎంకు ఆ పరిస్థితులు తీసుకొచ్చేవరకు ఊరుకునేదిలేదని అన్నారు. చదవండి : ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత -
అలాంటప్పుడు చర్చలెందుకు..?
-
24వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
-
ఆర్టీసీ అధికారులతో కేసీఆర్ సమీక్ష
-
ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. ఎండీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. చర్చలు విఫలం కావడానికి కారణం మీరంటే మీరు అని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం సంస్థ ఎండీకి లేఖాస్త్రాన్ని సంధించారు. మొత్తం 45 డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూ లేఖలో నేతలు పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు కలెక్టరేట్ల ముట్టడి ఆర్టీసీ సమ్మెలో భాగంగా తమ ఉద్యమాన్ని కార్మిక సంఘాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపునకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. -
లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం..
‘అంతా సవ్యంగానే సాగింది. హైకోర్టు చెప్పిన సూచనల ప్రకారమే చర్చల ఎజెండా సిద్ధం చేశాం. కానీ వాటిని చర్చించేందుకు జేఏసీ నేతలు ఇష్టపడలేదు. మొత్తం డిమాండ్లపై చర్చకు పట్టుబట్టారు. అదెలా కుదురుతుంది. ఇదే విషయం అడిగితే తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లి తిరిగి రాలేదు – అధికారులు ఆర్టీసీ చరిత్రలోనే కాదు ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎన్నడూ చూడలేదు. ఫోన్లు కూడా లాగేసుకుని, పోలీసు పహారా పెట్టి జరిపేవి చర్చలెలా అవుతాయి. యూనియన్ల డిమాండ్లు పక్కన పెట్టి తమ ఎజెండా ప్రకారమే చర్చ జరగాలని అధికారులు చెప్పటం దారుణం – కార్మిక సంఘాల జేఏసీ సాక్షి, హైదరాబాద్ : ఇరవై రెండు రోజుల సమ్మె తర్వాత పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిస్తూ ఇటు ప్రభుత్వం చర్చలకు పిలవటం, వెంటనే కార్మిక సంఘాలు స్వాగతించటంతో.. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ చర్చలు ఇటు జేఏసీ నేతలు, అటు అధికారులు సమావేశ మందిరంలో కూర్చున్న కొద్దిసేపటికే అర్ధంతరంగా ఆగిపోయాయి. ఎవరి పట్టు వారు ప్రదర్శించటంతో చర్చలు విఫలమ య్యాయి. అధికారులది తప్పంటూ కార్మిక సంఘాల జేఏసీ, జేఏసీ తీరు సరికాదంటూ అధికారులు ప్రకటించి నిష్క్రమించారు. మళ్లీ చర్చలకు పిలిస్తే తాము సిద్ధమని జేఏసీ పేర్కొనగా, తాము చర్చల హాలులోనే ఉన్నా మళ్లీ జేఏసీ నేతలు రాలేదని అధికారులు పేర్కొనటం విశేషం. వెరసి మళ్లీ చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఆదివారం దీపావళి కావ టం, సోమవారమే కోర్టుకు నివేదించాల్సి ఉండటంతో పరిస్థితి అయో మయంగా మారింది. విఫలం కావాలన్న ఎజెండాతోనే ప్రభుత్వం ఈ తరహా చర్చలకు ప్లాన్ చేసిందని జేఏసీ ఆరోపించింది. సమ్మె యథాతథంగా సాగుతుందని, 30న సకల జనుల సమర భేరీ భారీ స్థాయిలో నిర్వహించే ఏర్పాట్లు సాగుతున్నాయని జేఏసీ నేతలు వెల్లడించారు. ఉదయమే చర్చలపై సమాచారం.. శుక్రవారం సాయంత్రం ఆరుగురు సభ్యుల అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రగతి భవన్లో అధికారులతో సీఎం దాదాపు 5 గంటల పాటు సమీక్షించి చర్చలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. కానీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ సంతకంతో ఉన్న లేఖలు అందజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు చర్చలుంటాయని, ఎండీ కార్యాలయం ఉన్న ఎర్రంమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయాన్ని వేదికగా పేర్కొన్నారు. దీనికి జేఏసీ నేతలు సమ్మతించి అఖిలపక్ష నేతలతో భేటీ అయి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా జేఏసీ నేతలు 16 మంది ఆ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. గేట్ వద్దనే వారిని ఆపేసి జేఏసీలోని నాలుగు సంఘాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు మాత్రమే హాజరు కావాలని పేర్లను పిలిచారు. దీంతో కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్లు రాజిరెడ్డి, వీఎస్‌రావు, వాసుదేవరావులు చర్చలకు వెళ్లడంతో మిగతావారు బయటే ఉండిపోయారు. లోపలికి వెళ్లిన వారి ఫోన్లు బయటే డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఇది పద్ధతి కాదని, అవసరమైతే తాము వెలుపల ఉన్న నేతలతో మాట్లాడాల్సి ఉంటుందని, ఫోన్లు అనుమతించాలని కోరినా అధికారులు అంగీకరించలేదు. వాటిని స్విచ్ఛాఫ్ చేసి పెట్టిన తర్వాతే అనుమతించారు. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాలు చర్చలకు సిద్ధమయ్యారు. హైకోర్టు సూచించినట్లు 21 అంశాలపై చర్చలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అదెలా సాధ్యమని, అసలు హైకోర్టు 21 అంశాలపైనే చర్చించాలని చెప్పలేదని, జే ఏసీ సూచించిన 26 అంశాలపైన అయినా, కోర్టులో మరో పిటిషన్‌దారు అయిన టీఎంయూ పేర్కొన్న 45 డిమాండ్లపైన అయినా చర్చించాలని జేఏసీ నేతలు కోరారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఆధారంగానే ఈ చర్చలుంటాయని, అన్ని డిమాండ్లపై సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో దాదాపు రెండు గంటలు గడిచాక జేఏసీ నేతలు వెలుపలికి వచ్చారు. మీడియా ప్రతినిధులను కూడా గేట్ వద్దనే పోలీసులు అపేయటంతో, వారు గేట్ వద్దకు వచ్చి చర్చలు మొదలు కాకుండానే అర్ధంతరంగా ఆగిపోయినట్లు వెల్లడించారు. తాము అధికారులు పిలిస్తే ఎప్పుడైనా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని, వారి పిలుపు కోసం ఎదురు చూస్తామని చెప్పి నిష్క్రమించారు. వారు వెళ్లిన గంటన్నర తర్వాత చర్చల్లో పాల్గొన్న ఇద్దరు అధికారులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడి నిష్క్రమించారు. కోర్టు ఉత్తర్వును వక్రీకరించారు: జేఏసీ నేతలు ‘ప్రభుత్వానికి చర్చలు ఫలించాలన్న ఆలోచన లేదని ఈ చర్చల తంతుతో తేలిపోయింది. చర్చలు విఫలమయ్యేలా సొంత ఎజెండా రూపొందించింది. చర్చల సారాంశాన్ని సోమవారం హైకోర్టుకు నివేదించాల్సి ఉన్నందున, జేఏసీ నేతలే చర్చలను విఫలం చేశారని కోర్టుకు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అసలు కోర్టు ఆదేశించింది వేరు.. ఇక్కడ జరిగింది వేరు. 21 అంశాలపైనే చర్చించాలని కోర్టు చెప్పలేదు. జేఏసీ సూచించిన 26 అంశాలపై చర్చించమని కోరాం. వాటిల్లో మేం, అధికారులు ఏయే విషయాల్లో పట్టువిడుపులతో వ్యవహరిస్తారనేది తర్వాత సంగతి. ముందు చర్చిస్తే తేలిపోతుంది కదా.. దానికి అధికారులు సిద్ధంగా లేరు. వారు 21 అంశాలపైనే చర్చిస్తామని పట్టుపట్టి కూర్చున్నారు. సమ్మెకు పూర్వం జరిగిన చర్చల్లో 16 మందిని అనుమతించారు. ఇప్పుడు వారిని బయటే ఆపారు. ఫోన్లు లాగేసుకున్నారు. దీనిపై మేం మాట్లాడుతుండగానే అధికారులే సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. వారు మళ్లీ వస్తారని కాసేపు అక్కడే కూర్చుని, సిబ్బందితో టీ తెప్పించుకుని తాగాం. అధికారులు రాకపోవటంతో మేం బయటకొచ్చాం. శత్రు దేశాల మధ్య చర్చలు కూడా ఇంత దారుణంగా ఉండవు. చర్చల తంతు మొత్తం వీడియో రికార్డు చేయించాం. ఆ వీడియోను కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని చూస్తే ఎవరు చర్చలను విఫలం చేశారో తెలుస్తుంది’ మళ్లీ వస్తామని వెళ్లిపోయారు: చర్చల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు చర్చలు ఫలవంతమయ్యేలా మేం ప్రయత్నించాం. కానీ జేఏసీ నేతలే సహకరించలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదని ప్రభుత్వం ఎప్పుడో తేల్చి చెప్పింది. కోర్టుకు కూడా విన్నవించింది. అది మినహాయించి మిగతావాటిల్లోని 21 అంశాలపై చర్చించాలని కోర్టు సూచించింది. ఆ మేరకే 21 అంశాలపై చర్చిద్దామని పేర్కొన్నాం. కానీ అన్ని డిమాండ్లపై చర్చించాలని వారు పట్టుపట్టారు. కాసేపు బయటకు వెళ్లి మాట్లాడుకుని వచ్చారు. మళ్లీ అదే పట్టుపట్టారు. మేం మళ్లీ అదే విషయాన్ని వారికి చెప్పాం. దీంతో తమ వారితో మాట్లాడి వస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర వరకు వేచి చూశాం. వారు రాలేదు. దీంతో ఇక వారు చర్చల నుంచి నిష్క్రమించినట్లు భావించి మేం కూడా వెలుపలికి వచ్చేశాం. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు ఉండాలని ఎక్కడా రూల్ లేదు. ఫోన్లను అనుమతించటానికి వేరే కారణమేమీ లేదు. సమావేశం మధ్యలో ఫోన్లు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే వాటిని అనుమతించకూడదనుకున్నాం’ మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ అధికారులు -
చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం
-
ఆర్టీసీ ఆస్తుల వివరాలడిగిన గవర్నర్ !
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణలో కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్, అన్ భజిగన్ తదితర జాతీయ నేతలు బుధవారం తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథ్థామ రెడ్డి జాతీయ యూనియన్ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అశ్వథ్థామ రెడ్డి మాట్లాడుతూ.. 12వ రోజు కూడా సమ్మె ఉధృతంగా సాతుతోందని, కార్మికులు ఎవ్వరూ ప్రభుత్వ ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. అలాగే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఆస్తుల గురించి వాకబు చేసినట్టు తెలిసిందని వెల్లడించారు. కేకే దివాకరన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తోన్న సమ్మెకు ప్రజా మద్దతు ఉందని, ఇక తమ మద్దతు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19న నిర్వహించనున్న బంద్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు దివాకరన్ వెల్లడించారు. బంద్‌తో ప్రభుత్వం స్పందించకుంటే తదనంతరం తమ కార్యాచరణను ప్రకటిస్తామని దివాకరన్ స్పష్టం చేశారు. -
ప్రతిపక్షాల వలలో ఆర్టీసీ నేతలు
సాక్షి, హైదరాబాద్:ఆర్టీసీ యూనియన్ నాయకులు ప్రతిపక్షాల వలలో పడ్డారని, సంస్థను నాశనం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కంకణం కట్టుకున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. ‘పండగ సమయంలో యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఆర్టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మా మేని ఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. యూనియన్ నేత లు ప్రతిపక్షాల వలలో పడ్డారు. ఇదో రాజకీయ కుట్రగా అనిపిస్తోంది. గతంలో ఆర్టీసీ కార్మికు లకు, వారు కూడా ఊహించనంతగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్ నేతల కుట్రలను ఆర్టీసీ కార్మి కులు అర్ధం చేసుకోవాలి. సంస్థకి గత ఐదేళ్లలో రూ. 3,303 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో కేటాయించింది రూ. 1,600 కోట్లే. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదు. ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయడంలేదు? దమ్ముంటే బీజేపీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రధానితో ప్రకటన ఇప్పించగలరా? ఆర్టీసీ కార్మికులకు నచ్చ చెప్పాల్సింది పోయి బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు. ఆర్టీ సీని నాశనం చేయాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రయత్నాలను సఫలం కానివ్వం’ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. -
ఉధృతంగా ఆర్టీసీ సమ్మె..
-
ఉధృతంగా ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతంగా ఉద్యమించనున్నట్లు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, హైకోర్టులో కేసు విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించాయి. కార్మికుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని చెప్పాయి. ఉద్యమ కార్యాచరణ రూపొందించి సమ్మెను తీవ్రతరం చేయాల్సిందిగా అభిప్రాయపడ్డాయి. ఆరు రోజులపాటు కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేయడం ఐక్యతకు నిదర్శనమని, ఇదే స్ఫూర్తితో డిమాండ్లను సాధించుకోవాలని సూచించాయి.ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గా ల మద్దతు కూడగడితే సమ్మె తీవ్రత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. సమ్మెను తీవ్రతరం చేసే క్రమంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంపైనా ఈ భేటీలో చర్చించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్ నిర్వహించే అంశాన్ని సైతం సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కూడా ఉద్యమంలో కలుపుకొని వెళ్తే బాగుంటుందన్న భావనను అందరూ వ్యక్తం చేయడంతో ఆ దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ఆర్టీసీ జేఏసీ సమాలోచనలు చేస్తోంది. సమ్మెకు పూర్తి మద్దతు: పెన్షనర్ల జేఏసీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పెన్షనర్ల జేఏసీ తెలిపింది. పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సమ్మెపై సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ‘సంఘాలు మద్దతివ్వాలి’ ఆరు రోజులుగా కార్మికులంతా సమ్మె లో ఉండి పోరాట పటిమ చాటారని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెను తీవ్రం చేసేందుకు రెండు రోజుల కార్యాచరణను ఖరారు చేశామన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బస్ డిపోల వద్ద అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం గాంధీజీ, జయశంకర్ విగ్రహాల వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు వివరించారు. కార్మికుల ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ట్రేడ్ యూనియన్లను కోరారు. కార్మికులతోపాటు సమ్మెలో పాల్గొంటున్న సూపర్వైజ ర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మెపై నేడు కీలక సమావేశం
-
ఆర్టీసీలో సమ్మె యోచన విరమణ
సాక్షి, అమరావతి: తాము చేయతలపెట్టిన సమ్మెను విరమించుకుంటు న్నట్టు ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సచివాలయంలో కలిసిన జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జేఏసీ నేతలు వలిశెట్టి దామోదరరావు, సీహెచ్ సుందరయ్య, వి.వరహాలనాయుడు, వైవీ రావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు చెప్పారు. కృతజ్ఞతలు తెలియజేసిన తమతో ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం తమ భుజం తట్టి చెప్పారన్నారు. ‘ఆర్టీసీకి ఎన్ని నష్టాలున్నా.. ప్రభుత్వమే భరిస్తుంది.. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా.. ప్రభుత్వ ఉద్యోగులకు అందే సౌకర్యాలన్నీ మీకు అందుతాయి. ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను నడపాలని’’ సీఎం తమకు చెప్పారని జేఏసీ నేతలు వివరించారు. ఆర్టీసీ అప్పులను, కేటాయించాల్సిన బడ్జెట్ గురించి జేఏసీ నేతలు ప్రస్తావించగా.. అవన్నీ ఆర్థికశాఖ చూసుకుంటుందని చెప్పారన్నారు. సీఎం తమ పట్ల కనబరిచిన ఆప్యాయత, స్పందన ఆనందదాయకంగా ఉందన్నారు. రవాణా, ఆర్ధిక శాఖ మంత్రులతో కూడిన కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుందని సీఎం భరోసా ఇచ్చారని నాయకులు చెప్పారు. విలీన ప్రక్రియ పూర్తి అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం వల్ల 55 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది’ అని జేఏసీ కన్వీనర్ దామోదరరావు పేర్కొన్నారు. రవాణా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో కలిసి వెళ్లి సచివాలయంలో సీఎంను కలిసి వచ్చామని వివరించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె యోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఆర్టీసీ జేఏసీ నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు
సాక్షి, అమరావతి : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. చర్చలకు రావాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలకు ముఖ్యమంత్రి పేషీ నుంచి ఆహ్వానం అందింది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలు వివరించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం సమ్మె ఉంటుందా లేదా అనే విషయమై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. ఇక ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో జేఏసీ నేతలు మంగళవారం జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో సమ్మె విరమణ దిశగానే నిర్ణయం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. (ఆర్టీసీ ఎండీతో ముగిసిన జేఏసీ నేతల చర్చలు) ఎండీ సురేంద్రబాబుతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, మొత్తం 26 అంశాలపై ఎంవోయూ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పీ. దామోదరరావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము చేసిన 27 డిమాండ్లలో 26 డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సానుకూల స్పందించిందని, ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకునే డిమాండ్ ఒక్కటే మిగిలి ఉందని తెలిపారు. 90శాతం వరకూ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని జేఏసీ నాయకులు తెలిపారు.