Saif Ali Khan
-
కత్తితో దాడి.. నా కుమారుడి మాటలకు కన్నీళ్లు వచ్చాయి: సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన రోజు ఏం జరిగిందో మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తితో తనను కత్తితో పొడిచిన సమయంలో తాను పెద్దగా కంగారుపడలేదని చెప్పారు. అయితే, కొంత సమయం తర్వాత ఎక్కువ నొప్పి రావడంతో ఆ గాయం తీవ్రత ఎంతో తెలిసింది. ఆ సమయంలో తన కుమారుడు తైమూర్ మాటలను సైఫ్ గుర్తు చేసుకున్నారు.'నాపై దాడి జరిగిన తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. నా వెన్నులో బలమైన కత్తితో దాడి చేశాడని తెలిసింది. ఆ సమయంలో కరీనా చాలా కంగారు పడింది. ఏం చేయాలో తనకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మా కుటుంబ సభ్యలకు అందరికీ కాల్స్ చేస్తూ ఉంది. కానీ, అర్ధరాత్రి కావడంతో ఎవరూ రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాలని ఆమె పిచ్చిగా కాల్స్ చేస్తూ ఉంది. కరీనా పరిస్థితి గమనించే నేనే తనకు ధైర్యం చెప్పాను. నాకు ఏం కాదని తెలిపాను. ఆ సమయంలో తైమూర్ నా దగ్గరకు వచ్చి.. నాన్నా.. నువ్వు చనిపోతావా..? అని అడిగాడు. అప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాంటిది ఏమీ జరగదు అమ్మ ఉంది కదా అని చెప్పాను. చికిత్స కోసం వెళ్తుండగా నేనూ వస్తానంటూ తైమూర్ కూడా ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో నేను కూడా వాడిని తీసుకొని వెళ్లాలని అనుకున్నాను. నాకు ఏమైనా జరిగితే నా కుమారుడు నా పక్కనే ఉండాలని ఆ సమయంలో అనిపించింది.' అని ఆయన అన్నారు.ముంబై బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లడం గమనించిన కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలోనే సైఫ్ గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నెట్‌ఫ్లిక్స్‌తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
సైఫ్ అలీఖాన్ కుమారుడి తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అన్న టైటిల్ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఓటీటీలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్‌లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.ఇబ్రహీం..సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్ -
‘సైఫ్’పై దాడి చేసింది ఒక్కడు కాదా..? రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ జాతీయుడు షరిఫుల్ ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లామ్ ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసులో జనవరి 19న ఇస్లామ్‌ను పోలీసులు ముంబయిలోని థానెలో అరెస్టు చేశారు. ఇస్లామ్‌కు కోర్టు జనవరి 29దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లామ్ నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకక్ను బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తోంది.ఇక ఇస్లామ్‌కు సిమ్‌కార్డు అందించిన జహంగీర్ షేక్ అనే వ్యక్తి కోసం ముంబయి పోలీసులు ఆదివారం(జనవరి26) కోల్‌కతా వెళ్లారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లామ్ కొన్ని రోజులపాటు కోల్‌కతాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.కాగా, జనవరి 16వ తేదీ రాత్రి 2 గంటలకు సైఫ్‌అలీఖాన్‌పై ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స తీసుకున్న సైఫ్ ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పనిమనిషిపై దాడి చేసిన దుండగుడు తనను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సైఫ్ ఇప్పటికే పోలీసులకు తెలిపారు. -
‘సైఫ్’ కేసులో అరెస్టుతో జీవితం నాశనమైంది: ఆకాశ్
ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టయిన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తొలుత ఆకాశ్ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేషన్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాశ్ కాదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. సైఫ్ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాశ్ పేర్కొన్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్ కేసులో ప్రధాన అనుమానితుడినని చెబుతూ మీడియాలో నా ఫొటోలు వేశారు. ఫొటోలు చూసిన మా కుటుంబం షాక్‌కు గురైంది.నాకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గ్‌లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు నాపై దాడి కూడా చేశారు’ అని ఆకాశ్ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు. ఇటీవల సైఫ్‌అలీఖాన్‌పై ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన దుండగున్ని అడ్డుకుంటుండగా అతడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఆకాశ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అరెస్టు చేసి తర్వాత నాలిక్కరచుకొని వదిలిపెట్టారు. -
సైఫ్ అలిఖాన్పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్!
ముంబై: దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారిస్తున్న ముంబై పోలీసులు (mumbai police) దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన ప్రదేశం నుంచి ఫింగర్ ప్రింట్స్ (fingerprints) సేకరించారు. ఆ వేలిముద్రలకు.. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దొంగతనం చేసే ప్రయత్నంలో నిందితుడు షరీఫుల్ఇస్లాం సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడికి యత్నించాడు. అయితే హైప్రొఫైల్ కేసు కావడంతో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటినుంచి 19 సెట్ల వేలిముద్రల్ని సేకరించారు. ఆ వేలి ముద్రలు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని నిర్ధారించారు.ముంబై పోలీసులు సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలను సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపారు. అక్కడ వేలిముద్రల్ని పరిశీలించగా..షరీఫుల్ ఫింగర్ ప్రింట్లతో సరిపోలడం లేదని సిస్టమ్ జనరేటేడ్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఫింగర్ ప్రింట్ పరీక్షల్లో ఫలితం నెగిటీవ్‌గా వచ్చింది. ఫలితం నెగిటివ్ అని సీబీఐ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. తదుపురి పరీక్షల కోసం సైఫ్ ఇంటినుంచి మరిన్ని వేలిముద్రల నమోనాల్ని సేకరించిన పోలీసులు మరోసారి సీఐడీ విభాగానికి పంపినట్లు సమాచారం.దాడి జరిగిందిలా.. సైఫ్ వాంగ్మూలం ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. -
సైఫ్‌పై దాడి కేసులో నా కుమారుడిని ఇరికించారు: నిందితుడి తండ్రి
'పొట్టకూటి కోసం వచ్చిన నా కొడుకు నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేయలేదు. కావాలనే అతడ్ని ఈ కేసులో ఇరికించారు' అంటున్నాడు నిందితుడి తండ్రి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించిన విషయం తెలిసిందే! నిందితుడిని బంగ్లాదేశ్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 29వరకు పోలీసుల కస్టడీకి ముంబై కోర్టు అనుమతిచ్చింది.తిరిగి వచ్చేయాలనుకున్నాడుఈ క్రమంలో నిందితుడి తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ ఫకీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాతో ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగోలేనందున నా కుమారుడు మధ్యవర్తి సాయంతో ఇండియాకు వచ్చేశాడు. ఉద్యోగావకాశాల కోసం గతేడాది ఏప్రిల్‌లో భారత్‌లో ప్రవేశించాడు. కావాల్సినంత సంపాదించుకున్నాక తిరిగి బంగ్లాకు వచ్చేయాలనుకున్నాడు.ముంబైలో ఎందుకంటే?ముందుగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ హోటల్లో పని చేశాడు. బెంగాల్ కంటే ముంబై రెస్టారెంట్లలో ఎక్కువ జీతం కావడంతో తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. తరచూ మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చివరిసారిగా శుక్రవారం నాతో ఫోన్లో మాట్లాడాడు. ప్రతి నెల పదో తారీఖున అతడికి జీతం పడుతుంది. అలా నాకు రూ.10 వేలు పంపాడు. తన ఖర్చుల కోసం రూ.3 వేలు ఉంచుకున్నాడు. మేము పేదవాళ్లమే కానీ నేరస్తులం కాదు. బంగ్లాదేశ్‌లో అతడు బైక్ టాక్సీ నడిపేవాడు.అన్యాయంగా ఇరికిస్తున్నారునా కొడుకును అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది నా కొడుకు కాదు. మీరంతా పొరబడుతున్నారు. అతడెప్పుడూ తన జుట్టు అంత పొడవుగా ఉంచుకునేవాడు కాదు. ఎవరో కావాలనే ఈ కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు. అధికారులు నా కొడుకే నిందితుడు అని పొరబడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇండియాలో మాకు తెలిసినవారెవరూ లేరు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నా కొడుకు నిర్దోషిగా వస్తాడని ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.సైఫ్‌పై దాడికాగా జనవరి 16న ముంబైలోని ఇంట్లో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ గదిలో చొరబడ్డాడు. అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో అతడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్.. కుమారుడు తైమూర్‌తో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సైతం రక్తంతో తడిసిన సైఫ్‌ను చూసి రూపాయి కూడా తీసుకోలేదు. తీవ్రగాయాలపాలైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వెన్నెముకలో విరిగిన 2.5 అంగుళాల కత్తి మొనను సర్జరీ చేసి తొలగించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్.. బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకుని భారత్‌లో అక్రమంగా చొరబడ్డాడని గుర్తించారు.చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష -
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్‌కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్‌ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్‌కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్‌కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్‌పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్‌తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్‌పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్‌లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. -
సైఫ్ పూర్వీకుల రూ.15 వేల కోట్ల ఆస్తుల పరిస్థితేంటి?
భోపాల్: బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది. ‘‘ స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్‌గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్‌కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్‌లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ వాదనను లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు. తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. దీనిపై జడ్జీ స్పందిస్తూ.. ‘‘ వాస్తవాలను పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నాం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆరోజు జడ్జి ఇచ్చిన గడువు ఇప్పడు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన కత్తిపొట్లకు గురై ఆస్పత్రి పాలైన సైఫ్ బాగోగులు చూడటంలోనే వాళ్ల కుటుంబానికి ఉన్న పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనేదే అసలు ప్రశ్న. ‘‘ దాడి జరిగిందన్న కారణం చూపి హైకోర్టు గడువు పొడిగించాలని కోరతాం’’ అని న్యాయవాది చెప్పారు. -
సైఫ్‌పై దాడి.. విచారణలో మరికొన్ని కీలక విషయాలు
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్‌పై దాడి అనంతరం నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.‘ సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు. షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు. తాజాగా, షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు. మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి 3, 1994న జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రెండవ గుర్తింపు కార్డు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది షరీఫుల్ దక్షిణ-మధ్య బంగ్లాదేశ్‌లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది. లైసెన్స్ నవంబర్ 2019లో జారీ చేయగా.. ఫిబ్రవరి 2020లో గడువు ముగియాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి 18, 2020కి హాజరయ్యాడు. ఇప్పటికే.. 12వ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో కొంతకాలం ఉన్నాడని, అనుమానం రాకుండా నిందితుడు తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
ఏంటి సైఫ్? అర లక్ష ఏం సరిపోతుంది? కనీసం రూ.11 లక్షలైనా..: సింగర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి అతడి ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఆదుకున్న నీకు ఏమిచ్చినా తక్కువే అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ సదరు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసి అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. రూ.50 వేల నగదును బహుమానంగా ఇచ్చాడు. అలాగే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా రానాకు రూ.11 వేల రివార్డు అందించింది.రూ.1 లక్ష సాయం ప్రకటించిన సింగర్తాజాగా సింగర్ మికా సింగ్.. ఆటో డ్రైవర్‌కు రూ.1 లక్ష సాయం ప్రకటించాడు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండియా ఫేవరెట్ సూపర్‌స్టార్‌ను కాపాడిన అతడికి కనీసం రూ.11 లక్షలైనా రివార్డుగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమయానికి హీరోలా వచ్చి కాపాడాడు. దయచేసి అతడి వివరాలు ఎవరైనా నాకు తెలియజేస్తారా? అతడు చేసిన మంచి పనికి మెచ్చుకోలుగా రూ.1 లక్ష సాయం చేయాలనుకుంటున్నాను అని పేర్కొన్నాడు.అతడు రియల్ హీరోసైఫ్ అర లక్ష సాయం చేశాడని రాసున్న పోస్ట్‌ను షేర్ చేస్తూ.. సైఫ్ భాయ్, దయచేసి అతడికి రూ.11 లక్షలివ్వు. అతడు రియల్ హీరో. ముంబై ఆటోవాలా జిందాబాద్ అని రాసుకొచ్చాడు. కాగా జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దుండగుడు చొరబడ్డాడు. సైఫ్ చిన్నకుమారుడి జెహ్ దగ్గర అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దం విని కిందకు వచ్చిన సైఫ్.. దుండగుడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతడు తన దగ్గరున్న కత్తితో నటుడిని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.(చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష)ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు కూడా అందుబాటులో లేదు. దీంతో అతడు నడుచుకుంటూ రోడ్డు మీదకు రాగా ఓ ఆటో డ్రైవర్ అతడిని చూసి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో సైఫ్‌కు చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలవగా వెన్నెముక దగ్గర 2.5 అంగుళాల కత్తిమొనను వైద్యులు సర్జరీ చేసి తొలగించారు.నిందితుడి అరెస్ట్నటుడిపై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతడిని బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌గా గుర్తించారు. భారత్‌కు వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.చదవండి: ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి -
సైఫ్‌పై నిజంగానే దాడి జరిగిందా? యాక్టింగా?
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరకు నిందితుడు పట్టుబడడంతో ప్రతిపక్షాల విమర్శలకు పుల్‌స్టాప్ పడింది. అయితే ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఘటన జరిగాక ఐదు రోజులకు నటుడు సైఫ్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ పరిణామం ఆధారంగా నితేష్ రాణే తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే దాడి జరిగిందా? లేక ఆయన నటించారా? అని ప్రశ్నించారాయన. పనిలో పనిగా ప్రతిపక్షాలను ఆయన తిట్టిపోశారు.పుణేలో జరిగిన ఓ ఈవెంట్లో రాణే మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు చూశా. ఆయన్ని నిజంగానే పొడిచారా? లేకుంటే నటిస్తున్నారా? అనే అనుమానం కలిగింది నాకు అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం కూడా నాకు అలాగే అనిపించింది. కేవలం ఖాన్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు స్పందిస్తారా?.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించరా? అని ప్రశ్నించారాయన.సుప్రియా సూలే.. సైఫ్ అలీ ఖాన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. షారూక్ కొడుకు గురించి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ గురించి బాధపడ్డారు. కానీ, ఓ హిందూ నటుడి కష్టాల గురించి ఆమె ఏనాడైనా ఆలోచించారా?. అన్నారు.గతంలో బంగ్లాదేశీయులు ముంబై ఎయిర్‌పోర్టు వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలో చొరబడుతున్నారు. బహుశా వాళ్లు ఆయన్ని(సైఫ్)ను తీసుకెళ్లడానికే వచ్చి ఉంటారేమో! అని రాణే సెటైర్ వేశారు.మహా మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే తనయుడే ఈ నితీశ్ నారాయణ రాణే. శివసేనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. కాంగ్రెస్, ఆపై బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనకవల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాటట్రిక్ ఎమ్మెల్యే ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.నితీశ్ నారాయణ రాణేకు వివాదాలూ కొత్తేం కాదు. 2009లో మరాఠీ చిత్రం ‘జెండా’లో తన తండ్రి నారాయణ రాణే పాత్రను అభ్యంతరకంగా చూపించారంటూ నిరసనలకు దిగి తొలిసారి ఆయన మీడియాకు ఎక్కారు. ఆపై ఓ చిరువ్యాపారిపై హత్యాయత్నం చేశారనే కేసు నమోదు అయ్యింది. 2013లో ముంబైని గుజరాతీలు విడిచివెళ్లిపోవాలంటూ మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అదే ఏడాదిలో గోవాలో ఓ టోల్‌బూత్‌ను ధ్వంసం చేసిన కేసులో అరెస్టయ్యారు. 2017లో ఓ ప్రభుత్వ అధికారిపైకి చేపను విసిరిన కేసులో, 2019లో ఓ అధికారిపై దాడి చేసిన కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. తాజాగా.. కిందటి నెలలో కశ్మీర్‌ను మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపై కేరళ అంటే అందరికీ ఇష్టమేనంటూ మాట మార్చారు. -
సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్?
-
ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్‌కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్‌ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్‌కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ షరీఫుల్‌గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
పటౌడీ ఆస్తుల కేసు.. సైఫ్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తప్పదా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే దాడికి గురై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తాజాగా ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.2011లో సైఫ్ అలీఖాన్(Saif Ali khan) తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందారు. ఆ తర్వాత సైఫ్‌కు భోపాల్ నవాబ్‌గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో అక్కడి ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అక్కడ ఉన్నాయి. కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన సుమారు 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు. అయితే.. ఆ చారిత్రక భూమిపై ఎనిమీ ప్రాపర్టీ కేసులో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయినా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో.. తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్(Enemy Property Act) 1968 ప్రకారం విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన వ్యక్తులు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను ప్రభుత్వం నియత్రించాలని ప్రయత్నించింది. అయితే.. సైఫ్ కుటుంబం ఈ నిర్ణయాన్ని 2015లో సవాల్ చేశారు. దీంతో.. కోర్టు స్టే విధించింది. అయితే తాజాగా ఆ స్టేను కోర్టు ఎత్తేసింది. దీంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పటౌడీ చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్థాన్ వెళ్లారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా(ఎనిమీ ప్రాపర్టీ) ప్రకటించారు. అయితే.. నవాబ్ మరణం తరువాత అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్‌కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్‌వంటివారు సాజిదా(Sajida) వారసులు. ఈ నేపథ్యలో ఆస్తిపై తమకూ హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్‌లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సైఫ్ అలీఖాన్‌కు సెక్యూరిటీగా 'జై లవకుశ' నటుడి టీమ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ నెల 16న సైఫ్‌పై దుండగుడు దాడి చేసి, కత్తితో గాయపరచిన సంగతి తెలిసిందే. అదే రోజు అక్కడి లీలావతి హాస్పిటల్లో చేరిన సైఫ్ కోలుకోవడంతో వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. వారంరోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ప్రస్తుతం జరిగిన సంఘటనల దృష్ట్యా సైఫ్ కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సైఫ్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్‌కి చెందిన దుండగుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు.(ఇదీ చదవండి: చిత్ర పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు.. కారణం ఇదే: నిత్య మేనన్)సైఫ్ అలీఖాన్ రక్షణ కోసం బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ (Ronit Roy) ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్లుగా ముంబైలో ఆయన సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్‌ఫై దాడి జరిగిన తర్వాత వారు వెంటనే తమ కుటుంబానికి రక్షణగా వ్యక్తిగత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సైఫ్ కుటుంబం పూర్తిగా రోనిత్ రాయ్ సెక్యూరిటీలో ఉంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మేం కొద్దిరోజులుగా సైఫ్‌తోనే ఉన్నాం.. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఎలాంటి ఇబ్బంది లేదు' అని తెలిపారు.రోనిత్ రాయ్ నటుడు మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా.. బాలీవుడ్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన రోనిత్ తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలకపాత్రలలో కనిపించాడు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాల్లో ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్లో 2018 థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంలో చివరగా ఆయన కనిపించాడు. డైరెక్టర్ పూరి కోరిక మేరకు 2022లో లైగర్ సినిమాలో ఆయన నటించాడు. జనవరి 16న సైఫ్ ఇంట్లోకి బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30) చొరబడిన సంగతి తెలిసిందే. అతడిని అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా అతనికి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. ఆయన చేతికి, మెడకు, వెన్నుకు తీవ్రమైన కత్తిపోటు గాయాలయ్యాయి. రక్తపు గాయాలను లెక్కచేయకుండా తన వెన్నులోకి దిగిన కత్తి ముక్కతోనే లీలావతి ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు శస్త్రచికిత్స ద్వారా ఆ కత్తిని తొలగించారు. దొంగను సైఫ్ గట్టిగా బంధించడం వల్లే కత్తితో దాడి చేసినట్లు ఒక పోలీసు అధికారి వెళ్లడించారు. -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. ఆటో డ్రైవర్‌కు పారితోషికం ఎంత ఇచ్చారంటే? (ఫోటోలు)
-
Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్.. బిల్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను విచారించిన పోలీసులు క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు కూడా సైఫ్ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్ పూర్తి ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు ఇప్పటి వరకు రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్ నేడు డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది. -
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాలో క్రియేట్ చేసిన వీడియోను ఓ బాలీవుడ్ నటుడు షేర్ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ మీడియాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైఫ్ ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు. (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల)ఈ వార్తలు చూసిన కరీనా కపూర్ ఆవేదనతో ఒక పోస్ట్ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది. -
సైఫ్ అలీ ఖాన్‌ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. -
సైఫ్ ఇంట్లోకి దొంగోడు ఎలా చేరాడో, ఎలా తప్పించుకున్నాడో తెలుసా?