Sakshi Breaking News
-
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. CM Jagan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్ దెబ్బతింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా పార్టీలో తిరుగులేదనుకున్న దేవినేని ఉమాకు, గన్నవరం ఇన్చార్జిగా ఇటీవల వెళ్లిన బచ్చుల అర్జునుడుకు పార్టీ తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు? రాష్ట్రంలో మరిన్ని ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్స్ కొలువులకు నోటిఫికేషన్లు జారీకాగా.. తాజాగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్ విద్యార్థినిపై ఫ్రొఫెసర్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనలో తప్పించుకున్న బాధితురాలు.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. International Disability Day: నిశ్శబ్ద విజయం పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సొంత ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..! ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి... ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్ నిర్ణయించుకుంటాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో భాగంగా మహ్మద్ షమీ చేతికి గాయమైనట్లు బీసీసీఐ ఆధికారి ఒకరు తెలిపారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటున్న స్టార్ హీరోలు అభిమాన హీరో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ చెప్పిన తేదీకి ఆ సినిమా రాకపోతే నిరుత్సాహపడతారు. 2022లో అలా అభిమానులను నిరాశపరచిన స్టార్స్ ఉన్నారు. ఈ ఏడాది సిల్కర్ స్క్రీన్‌పై కనిపించాల్సిన ఆ హీరోల సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకతో మదనపల్లె కిక్కిరిసింది. సభా ప్రాంగణం, రోడ్లన్నీ కిటకిటలాడాయి. ఇంత వరకు ఏ రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి దక్కని ఘన స్వాగతం, జన నీరాజనం ఆయనకు లభించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్ మదనపల్లెలో బుధవారం సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని ‘జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా’ అని వేడుకుంది. బస్సులో నుంచి ఆ దృశ్యం గమనించిన సీఎం.. ఆమెను సభాస్థలి వద్దకు పిలిపించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కవిత, షర్మిల ట్వీట్ల యుద్ధం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.పేదల బియ్యంతో కోట్లకు పడగ రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న తొలి విడత పోలింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. భారత్‌లో అబ్బాయిలకే కేన్సర్ వ్యాధి ఎక్కువ భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.ఐసిస్ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్ బ్యూటీ మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గార్గీ వంటి సక్సెస్‌ఫ/ల్ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఇటీవల అమ్ము అనే చిత్రంతో టైటిల్ పాత్ర పోషించింది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి పేరును తెచ్చిపెట్టింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు ఊహించని షాక్! కానీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అందరి కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించిన ఫ్రాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. నేడు జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: టీచర్లు.. టీచింగ్కే విద్యారంగ సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల సమగ్ర పురోభివృద్ధికి వీలుగా ప్రభుత్వ టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని నిర్ణయించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎదురుదాడికి టీఆర్ఎస్ స్పెషల్ స్ట్రాటజీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీపై సాగుతున్న ప్రతికూల ప్రచారానికి పకడ్బందీగా అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్‌తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు కర్ణాటక–సరిహద్దు వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో అతి ముఖ్యమైన విచారణ జరగనుండగా, అందరి చూపు సర్వోన్నత న్యాయస్థానంపై కేంద్రీకృతమైంది. తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్కారుతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుజరాత్ ఎన్నికలు: కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుందా? గుజరాత్లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న రెండో, తుది దశ పోలింగ్‌తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. యూనివర్సిటీలు ఖాళీ చైనాలో ‘జీరో కోవిడ్’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. యాకమ్మ ఒక గొప్ప వెలుగు తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరిద్దరు ఏం చేశారు? అది ఎటాక్‌లా లేదే.. దొరికిపోయావ్ శ్రీహాన్! బిగ్‌బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..! బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Neena Rao: విజేత తల్లి ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! ‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ 2022 ఖరీఫ్ సీజన్లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘పండంటి’ రాష్ట్రం.. దేశంలోనే ఏపీ అగ్రగామి ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే అన్నదాత అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. పండ్ల తోటలు తగ్గిపోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులను ఉత్సాహపరుస్తున్నాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఆ లాకర్స్‌లో ఏమున్నాయి? తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యువతరం.. ఎవరి పక్షం...! ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పులో కాస్త మార్పు కనిపించింది. ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పక్షులు చూపిన ‘బుల్లెట్’ మార్గం.. నిజమే.. ఆ కథేంటంటే జపాన్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకూ మూలం. గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు ఆ దేశానికి ప్రత్యేకం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్స్ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘తోడేలు’ మూవీ రివ్యూ తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా పోర్చ్‌గల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని ఎంపీ రఘురామ అన్నట్లు సమాచారం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు లభించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. 2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం? క్రికెట్ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Kamal Haasan: కమల్ హాసన్‌కు అస్వస్థత స్టార్ హీరో కమల్‌హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఏపీ సర్కార్ కొత్త చరిత్ర.. మీ భూమి మా హామీ అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.ఏపీకి కేంద్ర బృందం కితాబు.. దేశమంతటా సచివాలయాలు గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలన్నీ సర్వత్రా ప్రశంసలు అందుకోగా దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కుమారులు, బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. దక్షిణం గాలి ఎటువైపు? ఆప్ దెబ్బకు బీజేపీ ఆశలు గల్లంతేనా? దక్షిణ గుజరాత్. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు? 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది? మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆర్థిక వ్యవస్థ: 40 లక్షల కోట్ల డాలర్లకు భారత్! స్వచ్ఛ ఇంధనం, డిజిటలీకరణ విప్లవాల దన్నుతో 2047 నాటికి భారత ఎకానమీ 13 రెట్లు వృద్ధి చెందనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా తెలిపారు. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 40 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని చెప్పారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. త్రిష పారితోషికం డబుల్.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లో తెలుసా? అదృష్టం ఎవరిని ఎప్పుడు? ఎలా? వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసొస్తే ప్రతిభ అనేది రెండోది అవుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సౌదీ అరేబియా కమాల్ కియా... లుజైల్ స్టేడియం 88 వేల మంది ప్రేక్షకులతో హోరెత్తిపోతోంది... అందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా అభిమానులే అయినా... అర్జెంటీనాను ఆరాధించేవారు కూడా తక్కువేమీ కాదు! 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా.. వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. లంకమల అడివి కానరాని కలివి కోడి.. ట్విక్–టూ.. ట్విక్–టూ అరుపులేవి! వైఎస్సార్ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ ఇప్పట్లో హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సిట్ గతంలో ఇచ్చిన నోటీసు మేరకు బీఎల్ సంతోష్ సోమవారం విచారణకు కావాల్సి ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను? బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా? ఆది మానవుడు ఆహారాన్ని వండుకుని కాకుండా పచ్చిగానే తినేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చిమాంసం, ఆకులు అలములు తిన్నట్లు కూడా చదువుకున్నాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకుని తినడం నేర్చుకున్నాడు. అయితే, మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?! పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్లో బీజేపీకి షాక్ తగులుతుందా? గుజరాత్లో విద్యుత్ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. హార్దిక్ ఆదేశించాడు.. అలా చేయమని!నేను పూర్తి చేశాను టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్.. ఇప్పడు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోను అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య అద్భుతమైన శతకం సాధించాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'వారిసు' చిత్ర వివాదం.. విజయ్ ఏం ప్రకటన చేయనున్నారు? సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పూజలో పాల్గొనేందుకు గుమిగూడిన జనం.. ట్రక్కు దూసుకెళ్లి 12 మంది దుర్మరణం.. బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. ‘తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ మీడియాను వాడుకుంటున్నారు’ మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని చంద్రబాబు అధికారం కోసం ఎంతకయినా దిగజారుతారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీకి క్యాన్సర్ సోకిందన్న వ్యాఖ్యలపై టీపీసీసీ చర్యలు తీసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఫాంహౌస్ కేసులో బీజేపీ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఎల్ సంతోష్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అబ్బబ్బే అలాంటిదేం లేదు, క్లారిటీ ఇచ్చిన గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార కార్యకలాపాల్ని విదేశాల్లో ప్రారంభించే యోచనలో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బిగ్‌బాస్: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? ఊహించని ఎలిమినేషన్లతో వరుస ట్విస్టులిచ్చిన బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఊహించని కంటెస్టెంట్‌నే బయటకు పంపించాడు. ఈవారం ఎవరు బయటకు వెళ్తున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ సొంతం సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సాగర తీరంలో రయ్ రయ్.. రేసింగ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో ఈ పోటీలు సాగాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశాలు మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎంపీ ఇంటిపై దాడి.. తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పాపం శ్రద్ధా వాకర్.. అప్పుడు కూడా అదే టార్చర్.. 2020 ఫోటో వైరల్ శ్రద్ధా వాకర్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2020లో తీసిన ఫోటో ఇది. దీనిని చూస్తుంటే అఫ్తాబ్ అమిన్ పునావాలాతో ఆమె రిలేషన్ ఎంత భయంకరంగా ఉందనే దానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలో శ్రద్ధా కళ్లు, ముక్కు, చెంప చుట్టూ గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మరో షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. బెండకాయ వేపుడు.. బెండకాయ పులుసు.. బెండకాయ 65.. బెండకాయ కూర.. వంటకం ఏదైనా అందులో బెండీ ఉంటే చాలు లొట్టలేసుకుని భోజనం లాగించేస్తారు. కేవలం నోటికి రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది బెండకాయ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్! ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్‌కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది' న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సైమన్ డౌల్ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విడాకులకు సిద్ధమైన మరో యంగ్ హీరో నిఖిల్? ఫోటోతో తేల్చేశాడుగా! టాలీవుడ్లో చై-సామ్‌ల విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో భార్య పల్లవితో విడిపోయేందుకు నిఖిల్ సిద్ధమయ్యాడని, కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడని రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు నిఖిల్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఒక రికార్డు ఉంది. దేశంలోనే మరే నేత అంతలా అబద్దాలు ఆడలేరన్నది ఆయన రికార్డుగా చాలామంది చెబుతుంటారు. ఆయన విశిష్టత ఏమిటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న అబద్దాన్ని అలవోకగా చెప్పడం. దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే, పదే వల్లె వేస్తుండడం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా కెసిఆర్ పైన, ఆయన కుటుంబంపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాకపోతే కెసిఆర్ పేరు ఎత్తలేదు. కాని మోడీ ప్రసంగంలో విమర్శల తీవ్రత భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా తీసుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవు.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశావ్ చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. చివరి అవకాశం అంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా ప్రజల మీద పడ్డావు అని మండిపడ్డారు. కులపిచ్చితో రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని నాశనం చేశావని మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారికి భారీగా పెరగనున్న జీతాలు రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అమెరికా అధ్యక్ష బరిలో బరాక్ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్ అమెరికా మాజీ ప్రథమ మిచెల్ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్....నివ్వెరపోయిన పోలీసులు యావత్తు దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అప్తాబ్ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ఢిల్లీలో ఒక ఫ్లాట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు ఫ్లాట్ విషయంలో క్లూస్ కోసం దర్యాప్తు చేస్తుండగా.. నీటిబిల్లుల విషయం వారిని ఆశ్చర్యపరిచింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం! సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 కష్టమే! టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం అనంతరం టీమిండియా తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ కావడంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగామరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తారు అసలు ఏం కంపెనీకి సీఈవోగా ఉండాలని కోరుకోవడం లేదని ఈ క్రమంలోనే త్వరలోనే ట్విటర్‌కు కొత్త సీఈవోను ఎంపిక చేయనున్నామని ప్రకటించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐకి నో చెప్పిన హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Viral Video: ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం! ధోనికి కీలక బాధ్యతలు.. త్వరలోనే బీసీసీఐ ప్రకటన ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియాది నెం1 స్థానం. ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. చివరిసారిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. అప్పటి నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ట్రెక్కింగ్ సమయంలో జోరున వర్షం. వర్షం ధాటికి వెనక్కి రాలేం. ముందుకు రాలేం. అలా అని అక్కడే ఉండిపోలేం. అచ్చం ఆ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి పై నుంచి 130 నుంచి 150 అడుగుల లోయలో పడ్డాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాళ్ల దగ్గర ఉండే ఈ సిరలు దెబ్బతినడం, లేదా పై వైపునకు వెళ్లాల్సిన రక్తం సాఫీగా ప్రవహించకపోవడంతో కాళ్ల కింది భాగంలో, ప్రధానంగా పిక్కల వంటి చోట్ల రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ‘వేరికోస్ వెయిన్స్’ అంటారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్ ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినా కానీ మునుగోడులో రాజకీయ కాక మాత్రం తగ్గలేదు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అంటూ ఎద్దేవా చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. 'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేసి ఓట్లను వృధా చేయకండి అన్నారు. అందుకు బదులుగా ఆప్‌కి ఓటు వేసి గెలిపించండి అని ప్రజలను అభ్యర్థించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. భర్తను చంపేందుకు ఆరుసార్లు యత్నం...మహిళకు 50 ఏళ్లు జైలు శిక్ష మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో.. ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది కుడి మోకాలికి గాయమైన విషయం విదితమే. ఈ గాయం తీవ్రతరం కావడంతో అతడు స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. అత్యవసర చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. షాకింగ్,ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు మల్టీమిలియనీర్, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేశారు. అయితే ఈ వారం ముగిసేలోపే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్ రేడియో! అంతా వాళ్లిష్టమే బడి అంటే పాఠాల బట్టీ కాదు.. వినోదం.. విజ్ఞానం కూడా! వాటిని పంచే ఓ సాధనం రేడియో! ఎస్.. ఆకాశ వాణి! కాకపోతే ఇది పిల్లల వాణి.. దీనికి కేంద్రం స్కూల్! అనౌన్సర్లు, రైటర్లు, స్టోరీ టెల్లర్లు, ఆర్టిస్టులు, ప్రోగ్రామ్ డిజైనర్లు.. స్టేషన్ డైరెక్టర్లు అందరూ పిల్లలే! అంటే విద్యార్థులే!! మరి శ్రోతలు..? 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్ మంగళగిరిలో జనసేన నాయకులపై టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి జనసేన కార్యకర్తలు మంగళగిరిలోని జగనన్న నగర్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను లబ్ధిదారులు అడ్డుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఊహించని షాక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్‌ఫ్లాప్.. తీవ్ర అసహనం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంకలాం జగనన్న కాలనీ పర్యటన అట్టర్ ప్లాప్ అయింది. జగనన్న గృహ లబ్ధిదారుల నుంచి కనీస స్పందన కరువైంది. గత కొద్ది రోజులుగా జనసేన నాయకులు జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు అంటూ ప్రచారం చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్‌నగర్‌లోని హోటల్ డెక్కన్ కిచెన్‌లో కొంతభాగాన్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! ఉదయ్‌పుర్- అహ్మదాబాద్ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా? చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా! 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. T20 WC 2022 Final Winner: పాకిస్తాన్‌ను చిత్తుచేసి విశ్వవిజేతగా ఇంగ్లండ్ పొట్టి ఫార్మాట్ క్రికెట్లో ఇంగ్లండ్ మరోసారి జగజ్జేతగా నిలిచింది. 2010లో పాల్ కాలింగ్ వుడ్ బృందం ట్రోఫీ గెలవగా.. బట్లర్ సేన టీ20 ప్రపంచకప్-2022 కప్‌ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వరల్డ్‌కప్ టైటిల్ గెలవాలన్న పాక్ ఆశలు అడియాసలయ్యాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పుష్ప-2 మేకర్స్‌పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్.. గీతా ఆర్ట్స్ వద్ద టెన్షన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప- 2 మూవీ అప్ డేట్స్ త్వరగా ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు! కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. IBS Ragging: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి: సీఎం జగన్ దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోదీ అని, సహృదయంతో ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదయింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?! ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రావడం, పవన్ కళ్యాణ్‌ను కలవడం.. ఇది ఎల్లో మీడియాకు మహాదానందం కలిగించిందన్నది వారి పత్రికల్లో అచ్చేసిన రాతలను బట్టి సగటు ఆంధ్రులందరికీ అవగాహన కలిగిన విషయం. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. నన్ను ఎంత తిట్టినా ఫర్వాలేదు, కానీ..: ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే తెలంగాణలో చీకట్లు తొలగిపోవాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. హిమాచల్‌లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఎట్టకేలకు పుతిన్ సేనలకు ఊహించని పరాభవం.. ఫుల్ జోష్‌లో ఉక్రేనియన్లు ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఉక్రెయిన్ సేనలను, ఆ దేశ పౌరులను భయభాంత్రులకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వణుకుతున్న ఉద్యోగులు.. ఏడాది చివరికల్లా మాంద్యంలోకి ఆ దేశాలు! ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే? టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్ తుది సమరంలో పాకిస్తాన్‌తో తలపడనుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. జగనన్న లే ఔట్‌ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రామచంద్రభారతిపై ప్రశ్నల వర్షం.. కీలక స్టేట్మెంట్.. అందులో ఏముంది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను రాజేంద్రనగర్ సీఎస్‌లో పోలీసులు విచారించారు. తొలి రోజు విచారణలో సుమారు 7 గంటల పాటు నిందితులను ప్రశ్నించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రమాణం చేయగలవా..? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని.. అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? అంటూ చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్ నాయకులు పోటీ విముఖత చూపారు. తాము పోటీ చేయడం లేదని, అభ్యర్థుల ఎంపికలో తమ పేర్లు పరిశీలించొద్దని అధిష్టానానికి తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. గొప్ప మనసు చాటుకున్న లాలూ కూతురు.. తండ్రికి కిడ్నీ దానం చేయాలని నిర్ణయం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అన్నంత పనిచేస్తున్న పుతిన్... చిన్నారులకు సైతం సైనిక శిక్షణ ఉక్రెయిన్‌పై గెలుపు కోసం పుతిన్ పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల మందికి పైగా సైనికులను సైతం రిక్రూట్ చేసుకుంది రష్యా. ఇప్పుడూ ఏకంగా చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వమంటూ ఆదేశాలు జారీ చేసింది రష్యా. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడ్డ రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. కన్నీరు పెట్టుకున్న రోహిత్ శర్మ ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్ర నిరాశపరిశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్ తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్(7) చికిత్సకు సీఎం వైఎస్ జగన్ సహాయం అందించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది? మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్‌ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. పీఎంఓ సీరియస్..! టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చినికిచినికి గాలివానలా మారుతుండటం, నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు రావడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నన్ను చంపజూసింది ప్రధానే ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సెలూన్ వ్యాపారంలోకి రిలయన్స్! వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు సెలూన్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. తప్పయింది క్షమించండి: మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి కాంతార సినిమా తరహాలో పంజర్లి దేవుడి వేషం వేసి రీల్స్ చేసి తుళునాడు (కొడగు) ప్రజల ఆక్రోశానికి గురైన హైదరాబాద్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. విరాట్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.అయితే ప్రతీ మనిషికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రేమించొద్దని చెప్పినా వినలేదని.. ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పినా వినలేదని కన్న కూతురిని తండ్రి హత్యచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. తూర్పుగోదావరికి సీఎం జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వక్రబుద్ధి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్‌టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే.. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్‌ను (మొత్తం నాలుగు క్లిప్‌లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం బహిర్గతం చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? మునుగోడులో ఓటింగ్ సరళి, వివిధ వర్గాల ఓటర్ల స్పందనను బట్టి బీజేపీదే గెలుపు అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. పెరిగిన ఓటింగ్ శాతం, సాయంత్రం దాకా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెల్లువెత్తడం వంటివి తమకు అనుకూలమని అంచనా వేస్తున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.గుజరాత్లో ముక్కోణపు పోటీ! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలయ్యింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆగమనంతో ఈసారి ముక్కోణపు పోటీ జరగబోతోంది. రాష్ట్రంలో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఎన్నికల పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు ‘ఆప్’ సైతం ఆ రెండు పార్టీలకు సవాళ్లు విసురుతూ రణరంగంలోకి అడుగు పెడుతోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Shikha Khanna: నూరు తల్లుల కథ 31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అక్టోబర్‌లో ‘సేవలు’ బాగున్నాయ్! భారత్ సేవల రంగం అక్టోబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సూచించింది. సెప్టెంబర్‌లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్‌లో 55.1కు ఎగసింది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్ బంగ్లాదేశ్‌తో అఖరి హోరాహోరీగా జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లా బ్యాటర్ నూరల్ హసన్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వివాదాస్పద ఘటనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘బనారస్’మూవీ రివ్యూ సిద్ధార్థ్(జైద్ ఖాన్) ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు.. ట్రిప్స్ అంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే సిద్ధార్థ్.. ఓ పందెంలో నెగ్గడం కోసం ధని(సోనాల్ మోంటెరో)కి దగ్గరవుతాడు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. Munugode Bypoll 2022: ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. నాపై ఈగ వాలినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊరుకోదు.. ఈటల హెచ్చరిక తన హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని చెప్పారు. సీఎం ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, పక్కా స్కెచ్ ప్రకారమే మంగళవారం మునుగోడులో తనపై దాడి జరిగిందని అన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పిల్లల్ని చదువుకోనివ్వండి రామోజీ! ఇంకెన్నాళ్లు కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ము కాసే ఈ రాతలు? ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్మటం వెనక రామోజీరావు ఆందోళన ఒక్కటే. ప్రభుత్వ స్కూళ్లను ఫణంగా పెట్టి తాము పెంచిపోషించిన కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు నూకలు చెల్లుతున్నాయన్నదే!. గాలీవెలుతురూ లేని భారీ భవనాల్లో.. విద్యార్థులను బట్టీపట్టే యంత్రాల్లా మార్చేసే ఈ ‘కార్పొరేట్’ స్కూళ్లకు కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు ఇపుడు అధికారంలో లేరన్నదే ఆయన బాధ. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గెహ్లాట్ VS సచిన్ రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్‌పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్‌పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్? టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము టైటిల్ గెలవడానికి రాలేదని, టీమిండియాను మాత్రం ఓడించితీరతామని అని షకీబ్ కామెంట్ చేశాడు. అయితే బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే! ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టు ఫోర్జరీ లేఖ వైరల్.. స్పందించిన బండి దొంగ పాస్‌పోర్టులు తయారుచేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోర్జరీ లేఖ వైరల్ కావడంపై మంగళవారం రాత్రి ఆయన స్పందించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పించడం సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. గుర్తింపుకు నోచని రక్తచరిత్ర.. మాన్‌గఢ్ ధామ్.. మరో జలియన్ వాలాబాగ్ ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్ ప్రాంతమది. బ్రిటిష్ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి.. ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్‌గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్ను త్యాగం చేసేస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా? బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూ టిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూ టిక్‌ను నిలుపు కోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్‌కు చేరే జట్లను భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అంచనా వేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Bigg Boss 6: నిందలు తట్టుకోలేక బాత్రూంలోకి ఇనయా.. రంగంలోకి బిగ్‌బాస్ బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్లో హౌస్మేట్స్ అంతా ఇనయాను టార్గెట్ చేశారు. ఆమె పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ నేడే అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడుపై కేసీఆర్‌ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే.. మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి! మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం.. మునుగోడులో ఆ అభ్యర్థి కోసమే.. జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. జో బైడెన్, కమలా హారిస్ సంతాపం గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దం అవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తమ సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత 'మయోసైటిస్' వ్యాధిపై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ ఇప్పుడు చర్చంతా నటి సమంత గురించే. ఇంతకుముందు ఈమె వ్యాఖ్యలు, గ్లామరస్ పొటోలు, నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి రకరకాలుగా చర్చించుకున్న సినీ వర్గాలు ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీలో మారుతున్న రాజకీయం! టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మారతాయా? ఆ పరిణామాలు ఏ పార్టీకి ప్రయోజనం? ఏ పార్టీకి నష్టం ? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలిసి పొత్తు పెట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీచేస్తే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందా అన్న సందేహం కొందరికి రావచ్చు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పలకని పవన్.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే ! జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? మనిషి శ్వాస తీసుకుంటేనే ప్రాణాలతో ఉంటాడు. శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు ఎంతో కీలకం. మనిషి సాధారణంగా ఒక్క రోజులో దాదాపు 25,000 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, నత్రజని, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు, తేలియాడే బ్యాక్టీరియా, వైరస్, వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ .. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విభాగాలను భారీగా కుదించడంపై దృష్టి పెట్టారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం టీ20 ప్రపంచకప్-2022లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 49 పరుగులుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా? నటుడు, నిర్మాతగా బిజీగా ఉన్నా విశాల్‌పై తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంది. అయితే ఇలాంటి వదంతులు ఆయనకు కొత్తేమీ కాదు. స్టార్ హీరోగా రాణిస్తున్న విశాల్ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..! కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ను గాడినపెట్టే బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్‌కు మొదట్నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో తల్లి పనిచేసే ఫార్మసీ షాప్‌లో పని చేసినప్పుడే వాటి జమా ఖర్చులన్నీ చూసేవారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.ప్రధాని పదవి పూలపాన్పు కాదు.. రిషికి ముందుంది ముళ్లబాటే..! అపజయం ఎదురైన చోటే విజయాన్ని అందుకొని బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆ పదవి పూలపాన్పు కాదు. ముందున్నది అంతా ముళ్లబాటే. బ్రెగ్జిట్, కోవిడ్–19 సంక్షోభం, , రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్ను దారిలోని తీసుకురావాల్సిన అతి పెద్ద సవాల్ ఆయన ఎదురుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం మొదట ఓ పిటిషన్ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్ టిల్లు?’ చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్ నిర్వహణలో మరో ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.Deepmala Pandey: స్పెషల్ టీచర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి! కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే! సిడ్నీలో నెట్ సెషన్ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా.. తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి: సీఎం వైఎస్ జగన్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బాబు, పవన్ సస్పెన్స్ పాలిటిక్స్‌కు తెర.. ముసుగు తొలగింది! ఏపీ రాజకీయాల్లో ముసుగు తొలగింది. గత మూడేళ్ల నుంచి తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు ఈరోజు దాదాపుగా బహిర్గతమయ్యాయి. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడని ఇన్నాళ్ల నుంచి వైఎస్సార్సీసీ చేస్తున్న ప్రకటనలకు పూర్తి ఆచరణ రూపం ఇచ్చిన చంద్రబాబు.. నేరుగా విజయవాడ నొవాటెల్‌కు వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘సినిమా డైలాగులతో నీ నోటి తీట తీరుతుంది.. అంతే తప్ప ఏమీ పీకలేవు’ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ముసుగు తొలిగిపోయింది. ముసుగు వెనకాల చంద్రబాబు గులాంగిరి ఉంది. చంద్రబాబుకు లబ్ధి కలిగించడమే పవన్ అంతిమ లక్ష్యం. సన్నాసి నాలుక చీరేస్తా.. అని నేను అనలేనా?. కానీ.. నాకు సంస్కారం అడ్డు వస్తోంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం! మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు. వీరిద్దరు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్‌కు ఎదురైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో బలపరీక్ష! స్పీకర్‌ను కలిసిన బీజేపీ రాజస్థాన్‌లో రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని బీజేపీ నేతల బృందం మంగళవారం ఉదయం కలవడం చర్చనీయాంశమైంది. గత నెలలో రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మీ కారు, బైక్ ఏ కంపెనీవి..దొంగలు టార్గెట్ చేస్తున్న వాహనాల జాబితా ఇదే! వాహన కొనుగోలు దారులకు అలెర్ట్. ఇప్పటికే కింద పేర్కొన్న కార్లు కొనుగోలు చేసినా, లేదంటే కొనుగోలు చేయాలని అనుకున్నా తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే? దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. T20 World Cup Records: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ రికార్డులివే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 8వ టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే సంచలనాలకు వేదికైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకివ్వగా, రెండో రోజు మరో పసికూన స్కాట్లాండ్.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌కు ఫ్యూజులు ఎగరగొట్టింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Bigg Boss 6: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఫైర్.. షాకింగ్ నిర్ణయం! బిగ్‌బాస్-6లో కెప్టెన్సీ కంటెడర్ టాస్కులు అంతగా పేలడం లేదు. కంటెస్టెంట్స్ అతిగా ఆలోచించి.. వాళ్లకు వాళ్లే కొత్త రూల్స్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా బిగ్‌బాస్ ఆశించిన ఔట్పుట్ రావడంతో లేదు. ఈ వారం కూడా కంటెస్టెంట్స్ అలాంటి పనే చేసి బిగ్‌బాస్ ఆగ్రహానికి గురైయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. షాకింగ్.. కదులుతున్న రైలు నుంచి యువకుడ్ని కిందకు తోసేసిన ప్యాసెంజర్ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని తోటి ప్యాసెంజర్ కదులుతున్న రైలులోనుంచి కిందకు తోసేశాడు. ఇద్దరు గొడవపడిన అనంతరం ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయితే యువకుడు రైలు నుంచి కిందపడిపోయినా అతడ్ని తోసేసిన వ్యక్తి ఏమాత్రం పశ్చాతాపం, ఆందోళన లేకుండా యథావిధిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. వైఎస్సార్ రైతు భరోసా: రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు జమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల సాయాన్ని అందించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్‌పై పేర్ని నాని స్ట్రాంగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్ గ్యాప్‌లో పవన్ విశాఖకు వెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’ రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్.. రుణాల పేరిట మోసం చేసిన కేసులో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నామా కుటుంబానికి చెందిన రూ.80.65 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ అటాచ్ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు.. 600 మంది మృతి.. 2 లక్షల ఇళ్లు ధ్వంసం దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆరోపించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అమానవీయం.. అప్పు చెల్లించలేదని స్కూటర్‌కు కట్టేసి.. నడిరోడ్డుపై.. ఒడిశా కటక్ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్‌కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. రూపాయి పతనం: ఆమెకు నోబెల్ ఇవ్వాల్సిందే! సోషల్ మీడియా కౌంటర్లు దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో ప్రకంకపనలు పుట్టిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర విలువ పెరుగుతోందని పేర్కొన్నారు డాలర్ నిరంతరం బలపడుతూ ఉండటంతో అన్ని కరెన్సీలు బలహీన పడుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది? టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. స్వదేశం, విదేశాల్లో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన రోహిత్ సేన.. టైటిల్ విజేతగా నిలవాలని భావిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రపంచంలో అందమైన మహిళలు.. టాప్ టెన్‌లో బాలీవుడ్ నటి..! బాలీవుడ్లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన ఉనికి చాటుకుంది. తాజాగా ఆమె పేరు అరుదైన జాబితాలో చేరింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి