Sarath Babu
-
మురికివాడల్లో ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి..నేడు సీఈవోగా రూ. 8 కోట్లు..!
మురికి వాడలో కటిక దారిద్యం మధ్య పెరిగాడు. తండ్రి మరణం, తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన స్థితి. ఏకంగా ఐదుగురు సంతానం. ఒక్కరోజు కూడా కడుపు నిండా తినలేని ధీన స్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి చేసే ఇడ్లీ అమ్మే వ్యాపారంలో చేదోడుగా ఉంటునే ఐఐఏం వంటి ఉన్నత చదువులు చదివాడు. చివరికీ స్వంతంగా ఓ ఫుడ్ కేటరింగ్ సర్వీస్ పెట్టి.. తనలాంటి మురికి వాడ పిల్లల్నే స్టాఫ్‌గా పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతడెవరంటే.. చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్‌బాబు తల్లి, నలుగురు తోబుట్టువులతో కలసి మురికి వాడలో జీవించేవాడు. తండ్రి మరణించడంతో తల్లే కుటుంబ జీవనాధారం. తనపై ఆధారపడిని ఐదుగురు పిల్లల కడుపు నింపేందుకు ఆమె రోజుకు మూడు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఇక శరత్ తన తల్లికి మురికివాడలో ఇడ్లీలు అమ్మే విషయంలో సాయం చేస్తుండేవాడు. తనతల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన శరత్ బాగా చదువుని ఎట్టి పరిస్టితుల్లో నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చేవాడు. ఎందుకంటే..? తల్లి గ్రాడ్యుయేట్ అయ్యుంటే ఏదో ఉద్యోగం చేసి పోషించగలిగేది ఇన్ని పాట్లు పడేది కాదు కదా అని బాధపడేవాడు. అందుకే అతడు తినడానికి తిండి లేని ఎన్నో రాత్రుళ్లు గడుపుతూ కూడా చదవడం మాత్రం మానలేదు. అలా పదోతరగతిలో క్లాస్ టాపర్‌గా నిలిచి మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఆంగ్లంలో మంచి ప్రావిణ్యం లేకపోవడంతో స్నేహితుల ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా తన చదువును సాగించాడు. అలా బిట్స్ పిలానీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే పోలారీస్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు సరిగ్గా 30 నెలలు పనిచేసి ఇంటి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలనే ఆశ కలిగింది. దీంతో పోలారీస్లో ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కి ప్రీపేరయ్యాడు. అలా మొదటి ప్రయత్నంలో విఫలమైన చివరికీ క్యాట్ ఉత్తీర్ణుడై అహ్మదాబాద్ ఐఐఏంలో ఎంబీఏలో చేరాడు. అక్కడ హాస్టల్ మెస్ కార్యదర్శి పదవికి ఎంపికయ్యాడు. ఇదే అతడికి ఆహారాన్ని తయారు చేసే సంస్థను నిర్వహించడం ఎలా అనేదానిపై అవగాహన ఏర్పడేలా చేసింది. ఇక విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే లక్షల ప్యాకేజీలతో ఎన్నో కార్పోరేట్ ఉద్యోగాలు వచ్చినా అటువైపుకి అసలు వెళ్లలేదు. తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం రూ. 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. తాను పెరిగిన మురికివాడలోనే ఓ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా తనలా మురికివాడలో పెరిగిన వారే. బాల్యమంతా కటిక దారిద్య్రం మధ్యే గడిచింది. ఆ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు. ఓ పక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో భయాన కష్టాలు, సమస్యలు చవి చూశాడు. అయినప్పటికీ ఎన్నడూ బాబోయ్! నావల కాదని పారిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైన ఈ కష్టం నుంచి గట్టేక్కిస్తే చాలని తప్పన పడ్డాడు. అందుకు చదువొక్కటే మార్గం అని భావించాడు. కటిక దారిద్య్రాన్ని భరిస్తూనే ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పైగా తన మూలలను మర్చిపోకుండా తనలాంటి వారికే జీవనోపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు శరత్ బాబు. ఇతడి కథ సమస్యలతో ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తుంది. పైగా అచంచలంగా కష్టపడితే ఎప్పటికైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చాటి చెబుతోంది కదూ.! (చదవండి: నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!) -
శరత్‌బాబుతో బిడ్డను కనాలనుకున్నా..: జయలలిత
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఐటం సాంగ్స్, గ్లామర్ పాత్రలు పోషించింది జయలలిత. అప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుని చేతినిండా సంపాదించింది. కానీ ఆ గ్లామర్ పాత్రల వల్ల ఇప్పటికీ తనకు మంచి పాత్రలు రావడం లేదు. అప్పటి సీనియర్ హీరోయిన్లంతా అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అలాంటి చెప్పుకోదగ్గ పాత్రలే రావట్లేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమెకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉండిపోయింది. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకున్నా తాజాగా ఆమె ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. దివంగత నటుడు శరత్‌కుమార్‌ను మనసారా ప్రేమించానని చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ.. 'చాలామంది నన్ను రెండో పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ నేను ఆసక్తి చూపలేదు. ఒక్క పెళ్లితోనే నరకం చూశాను. ఇక దానికి జోలికి వెళ్లొద్దనుకున్నాను. అమ్మానాన్న చనిపోయాక హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. ఆఫర్ల సంగతి ఏమో కానీ సినీ ఆత్మీయులు ఉంటారని ఇక్కడ సెటిలయ్యాను. బిడ్డను కనాలనుకున్నాం నేను శరత్‌బాబును ప్రేమించాను. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు! ఆయనతో కలిసుండాలని ఎంతో అనుకున్నాను. కానీ ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడాయన లేరు కాబట్టి అన్ని వివరాలు చెప్తాను. ఆయనతో కలిసే యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకంటూ ఓ గైడ్ పంపించాడనుకున్నాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపారు. మేమిద్దరం కలిసి ఓ బిడ్డను కనాలని కూడా ప్లానింగ్ చేసుకున్నాం. కానీ ఆయన దేని గురించైనా సంవత్సరాలతరబడి ఆలోచిస్తారు. అభ్యంతరం లేకపోతే.. మనిద్దరం బిడ్డను కని చనిపోయాక ఆస్తి గురించి ఆమెను ఏమైనా హింసిస్తారేమోనని భయపడేవారు. మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. శరత్‌బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్. ఆమెను అక్కా అని, ఆయన్ను బావ అని పిలిచేదాన్ని. బావ.. బావ అంటూ నేను తనకు క్లోజ్ అయ్యాను. తన దగ్గర కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. నేను ఆడదాన్ని అన్న అభ్యంతరం లేకపోతే మీరు యాత్రలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని చెప్పాను. అలా తనతో నా జర్నీ మొదలైంది. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు పట్టుకెళ్లిపోయాడు' అని చెప్పుకొచ్చింది జయలలిత. తప్పించుకోలేకపోయా.. ఇంకా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు ఎక్కువ వేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు.. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్ని తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేక, తప్పనిసరై లొంగిపోయాను. నేను చెడిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో వాళ్లు బాగుండాలి అనుకున్నాను. అందుకే అలా చేశాను. అలా అని ఎవరూ ప్రేమ చూపించేవారు కాదు. పైశాచికత్వంగా ప్రవర్తించేవారూ కాదు. వాళ్ల అవసరం తీర్చుకునేవారు' అని తెలిపింది జయలలిత. చదవండి: కల నెరవేర్చుకున్న మెగా హీరో.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవేనట! -
సెప్టిక్ షాక్: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!
టాలీవుడ్ నటుడు శరత్ బాబు తెలుగు , కన్నడతో సహా వివిధ భాషలలో హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఆయన దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు . ఆయన క్యారెక్టర్ రోల్స్‌లో కూడా ప్రేక్షకులను అలరించారు. చివరికి 71 ఏళ్ల వయసులో ఈ మహమ్మారి సెప్సిస్ బారిన పడి మృతి చెందారు. ఆఖరి దశలో తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై చాల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చిన సెప్సిస్ ప్రాణాంతకమా? ఎందువల్ల వస్తుంది..? సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్‌కి సంబంధించిన తీవ్ర దశ. దీని కారణంగా శరీరంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోయి శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవ్వుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది. ఈ దశలో మెదడు నుంచి సమస్త అవయవాలు వైఫల్యం చెంది పరిస్థితి విషమంగా మారిపోతుంది. దీన్ని బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసే వైద్య పరిస్థితి అని అంటారు. సెప్సిస్ అంటే.. సెప్సిస్‌ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)గా పిలుస్తారు. అంటే.. ఇన్ఫెక్షనకు శరీరం తీవ్ర ప్రతిస్పందించడం అని అర్థం. ఈ పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుందటే..శరీరం అంతటా ఇన్షెక్షన్ చైన్ రియాక్షన్‌లా వ్యాపించడం జరిగితే ఈ సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే ముందు ప్రారంభమవుతాయి. ఈ సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, మూత్రనాళాలు, చర్మం లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి ప్రారంభమవుతాయి. కారణం.. సూక్ష్మక్రిములు ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి.ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. అయితే దీనికి చికిత్స తీసుకుంటూ ఆపేసినా లేక తీసుకోకపోయినా సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సెప్సిస్‌కు కారణం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సెప్సిస్‌ని శరీరంలో అభివృద్ధి చేసే వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల లేదా బలహీనమైన రోగనిరోధక వ్యకవస్థతో తీవ్ర వైద్య పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్తో బాధపడే వారిలో దాదాపు పావు నుంచి ఒక వంతు దాక ఆస్పత్రిని సందిర్శించిన ఒక్క వారంలోనే మళ్లీ ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. సెప్సిస్ దశలు.. మూడు దశలు సెప్సిస్: ఇది రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు అతిగా స్పందించే పరిస్థితి. తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్ అవయవాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువ రక్తపోటు, వాపు ఫలితంగా జరుగుతుంది. సెప్టిక్ షాక్: సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ చివరి దశ. చాలా IV (ఇంట్రావీనస్) ద్రవాలు ఉన్నప్పటికీ, ఇది అత్యంత తక్కువ రక్తపోటు ద్వారా నిర్వచించబడింది. ఈ దశ ప్రాణాంతకమని చెప్పొచ్చు. లక్షణాలు.. వేగవంతమైన హృదయ స్పందన రేటు జ్వరం లేదా అల్పోష్ణస్థితి (ఉష్ణోగ్రతలు పడిపోవడం) వణుకు లేదా చలి వెచ్చగా, తడిగా లేదా చెమటతో కూడిన చర్మం గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి హైపర్వెంటిలేషన్ (వేగవంతమైన శ్వాస) శ్వాస ఆడకపోవుట. సెప్టక్ షాక్ లేదా చివరి దశకు చేరినప్పుడు.. చాలా తక్కువ రక్తపోటు కాంతిహీనత మూత్ర విసర్జన తక్కువగా లేదా లేదు గుండె దడ అవయవాలు పనిచేయకపోవడం చర్మ దద్దుర్లు (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
నా గ్లామర్ సీక్రెట్ అదే: శరత్ బాబు
-
ఆ సినిమా తర్వాత ఫ్రెండ్ అంటే నీ లాగే ఉండాలి అనేవారు
-
నా పేరు ముందు ఎటువంటి తోకలు వద్దు అనుకున్న
-
నా ఫస్ట్ సినిమానే ఆయనతో చేయడం అదృష్టం
-
నేను శరత్ బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. ఆ ఫోటోలపై స్పందించిన నటి!
స్నేహ నంబియార్ మలయాళీ అయినప్పటికీ.. ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులోనే. స్నేహా ఎక్కువగా కన్నడ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. మలయాళ కుటుంబం నుంచి వచ్చిన స్నేహ బెంగళూరులో పుట్టి పెరిగడంతో కన్నడ భాష సులభంగానే నేర్చుకుంది. అంతే కాకుండా ఆమెకు తమిళ భాషపై కూడా పట్టుంది. దక్షిణాది భాషలపై ఆమెకున్న ప్రావీణ్యం కారణంగా తమిళం, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. అలా స్నేహ తమిళ ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు ఆమెపై అప్పట్లో కొన్ని వార్తలు వ్యాపించాయి. ప్రముఖ నటుడు శరత్‌బాబును స్నేహ రెండో పెళ్లి చేసుకుందన్న వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు కొంతకాలానికి వీరు విడాకులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్‌కు తెరలేపేవారు) నా ఫోటోలు ప్రచారం చేశారు అయితే శరత్ బాబు రెండో భార్యగా స్నేహ నంబియార్ ఫోటోలకు బదులుగా తన ఫోటోలు ప్రచురించారని వాపోయింది మరో నటి స్నేహ. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. 'నా పేరుతో సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. శరత్ బాబు రెండో భార్యగా నా ఫొటో పెట్టారు. శరత్ బాబు రెండో భార్య స్నేహ నంబియార్ అని.. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారంటూ నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్పుడు కూడా వదల్లేదు ఆ వార్తలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఆయన చనిపోయినప్పుడు కూడా శరత్ బాబు రెండో భార్యను నేనే అని ప్రచారం చేశారు. కానీ నేను ఆయన భార్యను కాదు. అసలైన స్నేహ నంబియార్ నాకంటే పెద్దది. తను ప్రముఖ నటుడు నంబియార్ కూతురు. మా ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రతిసారి నా ఫోటోలు పెట్టేవారు. నిజానికి నా పేరు కేవలం స్నేహ మాత్రమే! అయితే స్నేహ అనే పేరుతో చాలామంది నటీమణులు ఉన్నందున నా పేరు పక్కన మా నాన్న పేరును చేర్చారు. స్నేహ పేరు పక్కన నంబియార్ చేర్చడానికి కారణం.. పైగా నంబియార్ అనేది కేరళలోని కన్నూరులో ఓ చిన్న వర్గం. అందుకే తన పేరు తర్వాత మా వర్గమైన నంబియార్‌ను జత చేశారు. అలా నన్ను స్నేహ నంబియార్ అని పిలిచారు. అప్పట్లో అది కూడా పెద్ద వార్తే. ఎందుకంటే నేను ప్రముఖ తమిళ నటుడు ఎంఎన్ నంబియార్ కుమార్తె అని చెప్పుకుంటున్నాననీ విమర్శించారు. నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు. నంబియార్ కుమార్తెను కూడా కాదు' అని ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది నటి. (ఇది చదవండి: పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్) రమాప్రభతో పెళ్లి-విడాకులు సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. 14 ఏళ్ల తర్వాత విడాకులు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ నంబియార్‌ను రెండో పెళ్లి చేసుకోగా వీరి బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. -
మెగాహీరోకి పోటీగా శరత్ బాబు వారసుడు
కొన్నాళ్ల క్రితం (మే 22) కన్నుమూసిన సీనియర్ నటుడు శరత్‌బాబు ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు. శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. కాగా గతంలో ఆయుష్‌ని తన నటవారసుడిగా శరత్‌బాబు పేర్కొన్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ‘దక్ష’ ఈ నెల 25న విడుదల కానుంది. ఇదే రోజున మెగా హీరో వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' థియేటర్లలోకి రానుంది. ‘‘మా రెండేళ్ల కష్టం ఈ సినిమా. మా ప్రోడ్యూసర్, డైరెక్టర్ రాజీ పడకుండా పూర్తి చేశారు. మా నాన్న (శరత్‌బాబు)గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం’’ అన్నారు ఆయుష్. అఖిల్, రవి రెడ్డి, అను, రియా, పవన్, నక్షత్ర తదితరులు నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రానికి సంగీతం: లలిత్. -
నాకు ఆ స్టార్ బిరుదులు వద్దమ్మా.. !
-
నా లైఫ్ లో ఇద్దరే ఇద్దరు.. వాళ్ళ వల్లే నా జీవితం మారిపోయింది
-
శరత్ బాబు చివరి ఇంటర్వ్యూ
-
జాలేస్తోంది, నవ్వు వస్తోంది, ఒక్కోసారి బాధగానూ..: రమా ప్రభ
దివంగత నటుడు శరత్ బాబు మాజీ భార్య రమాప్రభ తనపై వస్తున్న కొన్ని వార్తలపై మండిపడింది. అదే సమయంలో శరత్ బాబు మరణ వార్తపై పరోక్షంగా విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రమాప్రభ ప్రయాణం అనే సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను వదిలింది. 'ఈ మూడు నెలల్లో చిన్న టూర్లు వేశాను. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, షిరిడీ వెళ్లొచ్చాను. ఈ మూడు నెలల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి జాలేస్తుంది.. ఒక్కోసారి నవ్వు వస్తుంది.. ఒక్కోసారి బాధగా ఉంటుంది.. ఈ మధ్య ఏదో ఒకరకంగా పాపులర్ అవుతున్నా. ఒకటీ రెండు సంఘటనలు నా గురించే ఉన్నాయి. కాబట్టి మాట్లాడాలి. చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉంది. నా ఇంట్లో చాలామంది ఉన్నారు. అక్కడుంది రమాప్రభ హీరో అని ఎవరూ చెప్పడం లేదు. అందరూ అక్కడే ఉన్నారు కానీ అది నా ఇల్లు అని కాకుండా వేరేవాళ్ల ఇల్లు అని చెప్తున్నారు. నాకు నవ్వొచ్చింది. నాకు రజనీకాంత్ డబ్బులిచ్చారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. నేను 13 ఏళ్ల నుంచే సంపాదిస్తున్నాను. ఇప్పుడు నా గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ మిగతావారు సంపాదిస్తున్నారు' అని చెప్పుకొచ్చింది రమాప్రభ. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. 'శరత్‌బాబు గురించి ఫీల్ అవుతున్నారా అమ్మ? 13 ఏళ్లు కలిసున్నారు కాబట్టి ఆ బాధ తప్పకుండా ఉంటుంది', 'శరత్‌బాబును హీరోగా నిలబెట్టడం కోసం వింత ఇల్లు సంతగోల అనే సినిమా తీసి మీరు ఎంత నష్టపోయారో నాకు తెలుసు. ఈ రోజు ఆయన కీర్తి మీ చెమట, మీ రక్తం.. వాటి పునాది మీదే ఆయన ఆనాడు నిలబడ్డారు' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హీరోయిన్‌తో లవ్.. ముద్దు ఫోటో షేర్ చేసిన అజిత్ బావమరిది -
శరత్ బాబు ఆస్తులు.. అంతా వారికే రాసిచ్చాడా?
సీనియర్ శరత్ బాబు ఇటీవలే అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూసిన ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం చెన్నైలో అభిమానులు, కుటుంబసభ్యుల అశ్రనయనాల అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో నటించారు. (ఇది చదవండి: ఆ విషయం అందరికీ తెలుసు.. అర్థం కాకపోతే అంతే: మంచు విష్ణు) నటి రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు సంతానం లేదు. దీంతో శరత్ బాబు ఆనారోగ్యానికి గురి కావడంతో ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో శరత్ బాబు మరణం తర్వాత ఆయన ఆస్తుల గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ శరత్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయి? వాటిని ఎవరి పేరు మీదనైనా రాశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. వారి పేరు మీదే వీలునామా! అయితే దీనికి ఆస్తులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఆయన బతికుండగానే ఓ వీలునామా రాశారని తెలిసింది. హైదరాబాద్, చెన్నై , బెంగళూరులో ఆయనకు ఇళ్లు, స్థలాలూ, షాపింగ్ మాల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన ఆస్తిని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల పిల్లల పేర్ల మీద వీలునామా రాశారట శరత్ బాబు. ఆయన మరణం తర్వాత ఈ విషయం బయటపడింది. సోదరి కన్నీటి పర్యంతం శరత్ బాబు మరణం తర్వాత ఆయన సోదరి సరిత స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్న మరణాన్ని తలచుకుని ఎంతో బాధపడిన ఆమె.. తనకు తల్లి, తండ్రి మొత్తం శరత్ బాబు అన్నయ్యే అంటూ బోరున విలపించారు. తన కొడుకును చదివించి.. తన కుమార్తె పెళ్లి కూడా చేశారని చెప్పారు. చివరగా తన కుమార్తె సోనియా డెలివరీ కోసం బెంగుళూరు వచ్చారని.. సోనియాని దత్తత తీసుకుంటానని అన్నయ్య చాలా సార్లు అన్నారని శరత్ బాబు సోదరి తెలిపారు. (ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్) శరత్ బాబు ప్రస్థానం 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శరత్ బాబు జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. కాగా.. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు.. నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిసారిగా నరేశ్-పవిత్ర నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కనిపించారు. -
ఆరోజు చెప్పిన వినలేదు..
-
శరత్‌బాబుకు తమిళ సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
Sarath Babu Funerals: సీనియర్ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు (ఫొటోలు)
-
శరత్ బాబుకు తుది వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
సీనియర్ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, సన్నిహితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాగా.. శరత్ బాబు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబు కోలుకోలేక మృతి చెందారు. (ఇది చదవండి: చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో..) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. -
నా పెళ్లి దగ్గరుండి చేసాడు
-
చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో..
సీనియర్ నటుడు శరత్‌బాబు మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు.చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన చివరగా నరేష్-పవిత్రా లోకేష్‌ల మళ్లీ పెళ్లి సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనరోగ్యంతో ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీలో చేరిన శరత్‌బాబు మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. నేడు అంత్యక్రియలు శరత్‌బాబు తోడబుట్టినవాళ్లల్లో అన్నయ్య ఉమా దీక్షితులు, తమ్ముళ్లు గోపాల్, గోవింద్, సంతోష్, మధు, మంజు ఉన్నారు. శరత్‌బాబు రెండో అన్నయ్య రమా దీక్షితులు మూడేళ్ల కిందట మృతి చెందారు. అక్కచెల్లెళ్లు సిరి, రాణి, బేబీ, మున్ని, రోజా ఉన్నారు. శరత్‌బాబు మృతికి రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సోమవారం సాయంత్రం 2 గంటల పాటు హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం శరత్‌బాబు భౌతికకాయాన్ని ఉంచి, ఆ తర్వాత చెన్నై తరలించారు. చెన్నైలో నేడు శరత్‌బాబు అంత్యక్రియలు జరుగుతాయి.అయితే ఆయనకు పిల్లలు లేకపోవడంతో తలకొరివి ఎవరు పెడతారన్నది సందేహంగా మారింది.చదవండి: 'ఆర్ఆర్ఆర్' నటుడు స్టీవెన్ సన్ మృతికి కారణమిదే! -
చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు
కథానాయకుడు, ప్రతినాయకుడు, సహాయ నటుడు... ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయిన అందాల నటుడు శరత్‌బాబు (71) ఇక లేరు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కిత్స తీసుకుని, బెంగళరు వెళ్లారు. అయితే మళ్లీ అస్వస్థతకు గురి కావటంతో బెంగళరులోని ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గత నెల 20న ఆయన్ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. శరత్‌బాబు శరీరంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతినగా, వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. చివరికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్! అదే చివరి కోరిక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళంలో శరత్‌బాబు చేసిన చివరి చిత్రం ‘వసంత ముల్లై’ (2023). ఈ నెల 26న విడుదలకు సిద్ధమైన ‘మళ్ళీ పెళ్లి’లో శరత్‌బాబు కీలక పాత్ర చేశారు. తెలుగులో ఆయనకు ఇదే చివరి సినిమా. వ్యక్తిగతంగా హార్సిలీ హిల్స్‌లో స్థిరపడాలనేది శరత్‌బాబు కోరిక. అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. అయితే నిర్మాణం పూర్తి కాలేదు. చివరికి శరత్ కోరిక నెరవేరలేదు. అదే చివరిరోజైంది... నటుడుగా బిజీగా ఉన్న సమయంలోనే శరత్‌బాబుకు హార్సిలీహిల్స్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. 1980ల్లోనే హార్సిలీహిల్స్ కో–ఆపరేటివ్ బిల్డింగ్ సోసైటీలో సభ్యత్వం పొందారు. ఈ సభ్యత్వంతో 16–4–1985లో ఆయనకు కొండపై మానస సరోవరం పక్కన ఇంటి నివేశనస్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో అప్పట్లోనే ఇంటి నిర్మాణం ప్రారంభించినా పూర్తి చేయకపోవడంతో గోడల వరకే నిర్మాణం ఆపేశారు. ఈ ఇంటిని కొనుగోలు చేస్తామని, విక్రయించాలని పలువురు కలిసినా విక్రయించడానికి సుముఖత వ్యక్తం చేసేవారు కాదు. ఇంటి నిర్మాణం పూర్తి చేయించకపోవడం, అలాగే వదిలేయడంతో దాన్ని సంరక్షించే బాధ్యతను స్థానిక వ్యక్తికి అప్పగించారు. అతను తరచూ ఫోన్లో శరత్‌బాబుతో మాట్లాడేవారు. శరత్‌బాబు ఏటా హార్సిలీహిల్స్ వచ్చి అసంపూర్తిగా ఉన్న ఇంటిని చూసుకుని, స్థానికులతో ముచ్చటించేవారు. ఆయన చివరగా 2021 మార్చి, 24న హర్సిలీహిల్స్ వచ్చారు. ఆరోజు తనకు పరిచయం ఉన్న స్థానికులతో మాట్లాడారు. పలు చిత్రాల్లో నటిస్తున్నానని, ఆ చిత్ర నిర్మాణాలు పూర్తయ్యాక హార్సిలీహిల్స్‌కు వచ్చేసి కుటుంబంతో ఇక్కడే ఉండిపోతానని అప్పుడు చెప్పారు. ఆ రోజు సాయంత్రం తిరిగి వెళ్లాక శరత్‌బాబు హార్సిలీహిల్స్ రాలేదు. ఆదే చివరిరోజైంది. -
ముగిసిన శరత్ కాలం..
సాగర సంగమం సంపూర్ణమవ్వాలంటే బాలుకు ఓ రఘుపతి కావాలి. సీతాకోక చిలుక అందంగా ఎగరాలంటే ఆ కథకు డేవిడ్ ఉండి తీరాలి. అన్వేషణ అంతం కావాలంటే అడుగడుగునా జేమ్స్ కనిపించాలి. ఆపద్బాంధవుడిలా చిరంజీవి మారాలంటే శ్రీపతి లాంటి ఉత్తముడు రావాలి. అప్పలనరసయ్య సంసారాన్ని చదరంగంలా ఆడాలంటే ప్రకాష్ అనే పొగరుబోతు కొడుకు ఇంటిలో తిరగాలి. పనివాడు ముత్తు గొప్పవాడిగా మారాలంటే నిజం తెలుసుకునే జమీందార్ అతని కళ్ల ముందుండాలి. ఇన్ని గొప్ప కథలకు, ఇలాంటి కథకులకు వరంలా దొరికిన నటుడు శరత్‌బాబు. ఆమదాలవలసలో పుట్టి పెరిగిన ఈ అందగాడు తెలుగు, తమిళ సినిమాల్లో మర్చిపోలేని పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. వెండితెరపై అందంగా వికసించిన ఆయన నవ్వు ఇప్పుడు మాయమైపోయింది. అర్ధ శతాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన నట ప్రస్థానం నేటికి కళామతల్లి పాదాల చెంతకు చేరుకుంది. వంశధార నుంచి మెరీనా తీరం వరకు ఆయన సాగించిన ప్రయాణం సిక్కోలు స్మరించుకుంటోంది. ఆమదాలవలస: వంశధార నదీ తీరాన సత్యనారాయణ దీక్షితులుగా ఆడిపాడిన శరత్‌బాబు వేలాది మంది సినిమా అభిమానులను శోకంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆమదాలవలసకు చెందిన ఆయన రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముందు చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు, మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఇష్యూతో ఆయన ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆమదాలవలసలోనే.. ► శరత్‌బాబు బాల్యం, యవ్వనం ఆమదాలవలసలో నే గడిచింది. ఆయన తండ్రి విజయ్‌శంకర్ దీక్షితులు ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి చేసుకుని ఆమదాలవలస వచ్చి స్థిరపడ్డారు. ► శరత్‌బాబు ఇక్కడే పుట్టారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 13 మంది సంతానంలో శరత్‌బాబు ఒకరు. వీరికి ఆమదాలవలసలో రైల్వేస్టేషన్ ఎదురుగా గౌరీ శంకర్ విలాస్ అనే బ్రాహ్మణ భోజన హొటల్ ఉండేది. ► శరత్‌బాబు ఆమదాలవలసలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాలలో చదివారు. ► తిత్లీ తుఫాన్ సమయంలో రెండు లక్షల రూపాయలు జిల్లాకు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆమదాలవలసలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, సంగమేశ్వర దేవాలయాలకు ఒక్కో లక్ష చొప్పున విరాళాలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దిగ్భ్రాంతికి గురయ్యా: స్పీకర్ ఆమదాలవలసకు మంచి పేరు తెచ్చిన నటుడు శరత్‌బాబు మృతి చెందడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఓ ప్రకటనలో తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలో, ఆమదాలవలస పట్టణానికి చెందిన సత్యనారాయణ దీక్షితులు అలియాస్ శరత్ బాబు మృతి చెందిన సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదువుకున్న రోజుల్లోనే నటనపై శరత్ బాబుకు మక్కువ ఉండేదన్నారు. అప్పట్లో ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ‘వాపస్’ నాటకంలో నిరుద్యోగ యువకుడిగా శరత్ బాబు వేసిన పాత్ర రక్తి కట్టించిందన్నారు. 44 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఆమదాలవలస పేరు ప్రఖ్యాతలు బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో శరత్ బాబు ఒకరిని కొనియాడారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని లోటు శరత్‌బాబు మృతి అటు సినీ పరిశ్రమకు, ఇటు ఆమదాలవలసకు తీరని లోటని ఆమదాలవలసకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ జేజే మోహన్‌రావు అన్నారు. శరత్‌బాబుతో తమ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేవని జ్ఞాపకం చేసుకున్నారు. చివరిసారిగా ఆమదాలవలసలో అయ్యçప్పస్వామి ఆలయ ప్రతిష్ట సమయంలో ఆయన వచ్చారని చెప్పారు. ఆమదాలవలస పట్టణంలోని గల ప్రధాన రహదారి సింగపూర్ రహదారిలా తీర్చిదిద్దుదామని శరత్‌బాబు అన్నారని తెలిపారు. శరత్‌బాబుకు ఆమదాలవలస లో ఎర్నాగుల ప్రభాకరరావు, పీరు యర్రయ్య, రవిబ్రహ్మం అనే స్నేహితులు ఉన్నారని, ప్రస్తుతం వారంతా ఉద్యోగరీత్యా వేరే చోట్ల నివసిస్తున్నారని తెలిపారు. సంగమయ్య ఆలయానికి విరాళం ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండకు శరత్‌బాబు తన సొంత ఖర్చుతో ఐదేళ్ల కిందట టైల్స్ వేయించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్వహించే జాతర సంగమేశ్వర జాతర. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు జనం వచ్చి సంగమయ్య కొండను, గుహలో ఉన్న సంగమయ్యను దర్శించుకుంటారు. అలాంటి సమయాల్లో గుహ లోపలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు శరత్‌బాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే గుహ లోపల టైల్స్ వేయించాలని తన సోదరులకు తెలపడంతో వాటిని అమర్చారు. కలిసి చదువుకున్నాం శరత్ బాబు మృతి చెందారని తెలియగానే సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయాననే బాధ కలిగింది. నేను, శరత్ బాబు ఏడో తరగతి నుంచి కలిసి చ దువుకున్నాం. శ్రీకాకుళం డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో ఆయన ఎంపీసీ, నేను సీబీజెడ్లో చేరాం. మంచి తెలివైన విద్యారి్థ. క్రమశిక్షణకు మారుపేరు. శరత్ బాబు ఒరిజనల్ పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన ముప్పైఏళ్లు వరుసగా అయ్యప్ప మా ల వేశారు. 2019 వరకూ ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తర్వాత తగ్గింది. 1980 లో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో టంకాల బాబ్జీ తదితరులు శరత్‌బాబును సత్కరించారు. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. – పీరు ఎర్రయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ -
'శరత్ బాబు వెండితెర 'జమిందార్'': మెగాస్టార్ చిరంజీవి
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. హుందాతనంతో ఉట్టిపడే నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని.. అనేక చిత్రాలలో నా సహనటుడుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) కాగా.. అనారోగ్య కారణాలత హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శరత్ బాబు సోమవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించిన కుటుంబసభ్యులు.. మంగళవారం చెన్నై ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఒకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా… pic.twitter.com/za0FpSyeJV — Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2023 -
Sarath Babu: శరత్‌బాబు పార్థీవ దేహానికి సినీ ప్రముఖుల నివాళులు
-
ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. అంకితభావం గల నటుడు: నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) శరత్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్‌గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు.