saurav ganguly
-
మా బౌలింగ్ సూపర్... మారాల్సింది బ్యాటింగే...
-
ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్
‘భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అన్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. డైరెక్టర్ లవ్ రంజన్ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం ‘తూ ఝూటీ మై మక్కార్’. రణ్‌బీర్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రణ్‌బీర్ కపూర్. ‘‘గంగూలీగారికి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన బయోపిక్ అంటే అది అందరికీ స్పెషలే. కానీ ఆయన బయోపిక్‌లో నటించాలనే అవకాశం నాకు రాలేదు. నాకు తెలిసి ఈ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రముఖ గాయకులు, నటులు కిషోర్ కుమార్‌గారి బయోపిక్ కోసం 11ఏళ్లుగా వర్క్ జరుగుతోంది. దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ బసు ఈ స్క్రిప్ట్ వర్క్‌లో భాగస్వామిగా ఉన్నారు. నేను చేయబోయే నెక్ట్స్ బయోపిక్ కిషోర్ కుమార్గారిదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యాని మల్’ చేస్తున్నారు రణ్‌బీర్ కపూర్. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కానుంది. -
సౌరవ్ గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీచేయించాలి: దీదీ
-
ముందు షారుక్‌ను తీసేసి గంగూలీని పెట్టు.. మమతకు బీజేపీ కౌంటర్
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం తనను షాక్‌కు గురి చేసిందని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని, గంగూలీని ఐసీసీకి పంపాలని ఆమె కోరారు. అయితే మమత వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. గంగూలీ గొప్పతనం గురించి నిజంగా ఆమెకు తెలిస్తే.. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్‌ను తప్పించాలని, ఆ స్థానాన్ని దాదాతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాతే మమత మాట్లాడాలని తెలిపింది. బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈమేరకు వ్యాఖ్యానించారు. అంతేకాదు క్రీడలపై రాజకీయం చేయొద్దని మమతకు సూచించారు సువేందు అధికారి. ఇలాంటి విషయాలకు ప్రధాని మోదీ చాలా దూరంగా ఉంటారని, ఆయన ప్రస్తావన తీసుకురావద్దని హితవు పలికారు. క్రికెట్ వ్యవహారాల్లో ప్రధాని జోక్యం చేసుకోరని మమతకు ఆ మాత్రం తెలియదా? అని సెటైర్లు వేశారు. అంతకుముందు గుంగూలీకి మద్దతుగా మాట్లాడారు మమతా బెనర్జీ. ఆయన ఏం తప్పు చేశారని బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి తప్పించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అయినా జోక్యం చేసుకుని గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమిత్ షా కుమారుడు జైషాను మాత్రం రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించడాన్ని ప్రశ్నించారు. చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆరోపించారు. దాదా బెంగాల్‌కు మాత్రమే కాదు యావత్ దేశానికి గర్వకారణమని, అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి అని కొనియాడారు. టీమిండియా కెప్టెన్‌గా విశేష సేవలందించిన ఆయనకు ఇలా జరగడం తనను షాక్‌కు గురి చేసిందని మమత పేర్కొన్నారు. గంగులీ ఏం తప్పు చేశారని ఆయనను పక్కకు పెట్టారని ప్రశ్నించారు. గంగూలీ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు మమత. బీసీసీఐ పదవి ఇవ్వనప్పుడు ఆయనను ఐసీసీకి పంపితే న్యాయం చేసినట్లవుతుంది సూచించారు. అందుకే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాకు అనుమతి ఇవ్వాలని కోరారు. తన విజ్ఞప్తిని ప్రతీకార రాజకీయంగా చూడొద్దని, క్రికెట్ కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జైషా రెండోసారి కొనసాగేందుకు కోర్టు అనుమతిచ్చిన విషయాన్ని మమత గుర్తు చేశారు. అమిత్‌షా కుమారుడైన జైషాను మాత్రం కొనసాగించి, గుంగూలీని తప్పించానికి కారణమేంటని ప్రశ్నించారు. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల నామినేషన్‌కు అక్టోబర్ 20 చివరితేది. ఈ పదవికి భారత్ నుంచి ఎవరైనా పోటీ చేయాలనుకుంటే బీసీసీఐ వాళ్ల పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బీసీసీఐ, ఐసీసీలో ఎలాంటి పదవి దక్కే సూచనలు లేకపోవడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తానని గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన స్థానంలో రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది. చదవండి: సింగిల్ బ్రాండ్ భారత్‌తో అన్ని సబ్సిడి ఎరువులు: మోదీ కొత్త స్కీం -
గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్..
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల కింద నెలకొల్పిన ఓ అరుదైన రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే బద్దలు కొట్టాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో బుధవారం మొదలైన తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అజేయమైన 136 పరుగులు సాధించిన కాన్వే.. 1996లో ఇదే వేదికపై గంగూలీ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించాడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో అరంగేట్రంలో సెంచరీ సాధించిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. దీంతో పాటు కాన్వే మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్‌లోనే శతకం నమోదు చేసిన 12వ ఆటగాడిగా, అలాగే న్యూజిలాండ్ తరఫున అరంగేట్రంలో నాలుగో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు. కాగా, గంగూలీ, కాన్వేకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృచ్చికంగా ఒకేలా ఉన్నాయి. వీరిద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, రైట్ హ్యాండ్ మీడియం పేసర్లు కాగా, వీరిద్దరి పుట్టిన రోజు కూడా ఒకే రోజు కావడం విశేషం. దాదా, కాన్వేలు జులై 8న జన్మించారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం మొదలైన తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (240 బంతుల్లో 136 నాటౌట్; 16 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (46 నాటౌట్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయమైన 132 పరుగులు జోడించారు. టామ్ లాథమ్(23), కెప్టెన్ విలియమ్సన్(13), రాస్ టేలర్(14) తక్కువ స్కోర్‌కే అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ రెండు, అండర్సన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: ఆ ఐపీఎల్ ఆటగాళ్లకు జీతాలు కట్.. -
ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’
సాక్షి, ముంబై: ప్రస్తుత టెక్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేశారు. వ్యంగ్య బాణాలు, మీమ్స్‌తో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనవరి 3 న తేలికపాటి గుండెపోటుకు గురైన తరువాత భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎండార్స్ చేసిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె ప్రకటనపై యూజర్లు భారీగా ట్రోల్ చేశారు. ఇది నిజంగా హెల్దీ అయిలేనా? అంటూ.. ఇప్పటికైనా తెలిసిందా దాదా.. గెట్ వెల్ సూన్ అంటూ.. గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ క్యాంపెయిన్‌పై సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పించారు. క్రీడాకారుడైన గంగూలీ రోజూ వ్యాయామం చేస్తారు. ఫిట్‌గా ఉంటారు...అయినా గుండెపోటుకు గురయ్యారు. గంగూలీ యాడ్‌లో చెప్పినట్టుగా ఆ ఆయిల్ నిజంగా ఆరోగ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. ఒత్తిడే ప్రధాన కారణం కావచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా "దాదా త్వరగా కోలుకోవాలి. ఎపుడూ పరీక్షించిన, ప్రయత్నించిన ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఉండాలి.. గాడ్ బ్లెస్’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు: దీంతో గంగూలీ నటించిన సదరు ప్రకటనను అన్ని ప్లాట్‌ఫాంనుంచి తొలగించడం గమనార్హం. ‘దాదా బోలే వెల్కం టూ ది ఫార్టీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె యాడ్ వస్తుంది. ఈ ప్రకటన ఏప్రిల్ 2020 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయం నుంచి వివిధ ఛానళ్ల సమయంలో ప్లే అవుతోంది. అంటే 40ల ఏళ్ల వయసులో కూడా తమ నూనె గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అనేది ఈ ప్రకటన సారాంశం. అయితే తాజాగా గంగూలీకి గుండెపోటు రావడం, గుండెలో రెండు బ్లాక్ ఉన్నాయని తేలడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ నూనె ప్రామాణికతపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని, బ్రాండ్ క్రియేటివ్ ఫార్చ్యూన్ క్రియేటివ్ ఏజెన్సీ ఓగిల్వి & మాథర్ ప్రతినిధి తెలిపారు. అటు కస్టమర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సంస్థ వేగిరమే తగిన చర్యలు చేపట్టాలని యాడ్ ఏజెన్సీ నిపుణులు భావిస్తున్నారు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఛాతీ నొప్పితో( జనవరి 2 న) పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. మూడు కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. యాంజియోప్లాస్టీ అనంతరం, గూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని రేపు( బుధవారం) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 Seen many tweets on the irony in Sourav Ganguly endorsing Fortune RiceBran Oil. Got to realise it’s the risk one takes in any endorsement. It isn’t that Ganguly lived an unhealthy lifestyle. Importantly, sportsmen with a 10-15 year playing life need to keep the earnings coming in — Lloyd Mathias (@LloydMathias) January 3, 2021 Now you know .. #Fortune does not work .. @SGanguly99 dada get well soon pic.twitter.com/tawBK0Uv5Q — Jaspal Singh (@JaspalSinghSays) January 3, 2021 Dada @SGanguly99 get well soon. Always promote tested and tried products. Be Self conscious and careful. God bless.#SouravGanguly pic.twitter.com/pB9oUtTh0r — Kirti Azad (@KirtiAzaad) January 3, 2021 -
6 రోజులు కాదు...36 గంటలే!
దుబాయ్: ఐపీఎల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లను తొలి మ్యాచ్‌నుంచి ఆడించాలనుకున్న ఫ్రాంచైజీలను సంతోషపెట్టే వార్త ఇది. యూఏఈకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ప్రతీ ఒక్కరు కనీసం ఆరు రోజులు క్వారంటీన్లో ఉండాల్సిందే. ఇదే జరిగితే అన్ని జట్లు ఆరంభ మ్యాచ్‌లలో ఆయా క్రికెటర్ల సేవలు కోల్పోయేవి. అయితే టి20, వన్డే సిరీస్ కోసం తాము ఇప్పటికే బయో బబుల్‌లో ఉన్నాం కాబట్టి క్వారంటీన్ సమయాన్ని కనీసం మూడు రోజులకు తగ్గించాలంటూ ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు వారంతా 36 గంటలు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే చాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానిక అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ‘క్రికెటర్ల ఐసోలేషన్ సమయానికి సంబంధించిన సమస్య పరిష్కృతమైంది. వారంతా 6 రోజులు కాకుండా 36 గంటలు విడిగా తమ హోటల్ గదుల్లో గడిపితే చాలు. ప్రతీ జట్టు తొలి మ్యాచ్‌లోనే తమ స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఇది మంచి అవకాశం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూఏఈలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ప్రొటోకాల్ ప్రకారం వారికి వరుసగా కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లనుంచి కలిపి 21 మంది క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొంటున్నారు. అయితే వీరిలో కమిన్స్, మోర్గాన్, బాంటన్ (ముగ్గురూ కోల్‌కతా) మాత్రం ఆరు రోజుల క్వారంటీన్లో ఉండాల్సి ఉంది. ఈ ఆటగాళ్లంతా ప్రత్యేక విమానంలో గురువారం దుబాయ్ చేరుకున్నారు. -
బీసీసీఐ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా పడింది. అతి ముఖ్యమైన ఈ మీటింగ్‌ను ఆన్లైన్లో నిర్వహించే వీలు లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా తమ నిర్ణయాన్ని అనుబంధ, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు తెలిపారు. నిబంధనల ప్రకారం ఏటా సెప్టెంబర్ 30లోపు ఏజీఎం నిర్వహించాలి. ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో ఆలోపు నిర్వహించడం కుదరట్లేదు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న మీదటే ఏజీఎంను వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా ఏజీఎం నిర్వహించాల్సిన అవసరమైతే లేదని, తదుపరి ఎప్పుడు ఏజీఎం ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జై షా వివరించారు. ఐపీఎల్ తదితర కీలకాంశాలపై చర్చించేందుకు బోర్డు గతంలో వర్చువల్ మీటింగ్ (ఎక్కడివారక్కడే ఉండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం) నిర్వహించింది. చివరిసారిగా బోర్డు ఏజీఎం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పుడే మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
సుశాంత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ : గంగూలీ బయోపిక్
న్యూఢిల్లీ: ‘ఎంఎస్ ధోని’ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అద్భుతంగా నటించి కొట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌నే కాక యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై సీబీఐ( కేంద్ర దర్యాప్తు సంస్థ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. అయితే భవిష్యత్తులో సుశాంత్ చేయాలనుకున్న సినిమాలను ఆయనే స్నేహితులు ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు. అయితే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణలో భాగంగా సుశాంత్ వ్యాపార సహచరుడు(పార్ట్నర్), వరుణ్ మాథూర్ కీలక విషయాలను వెల్లడించాడు. వరణ్ తెలిపిన వివరాల ప్రకారం ధోని బయోపిక్‌తో ఊపు మీదున్న సుశాంత్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌ను తన సోంత నిర్మాణ సంస్థలో నిర్మించాలనుకునేవాడని తెలిపాడు. కాగా సౌరవ్ బయోపిక్ సుశాంత్‌కు కళల(డ్రీమ్) ప్రాజెక్ట్ అని తెలిపాడు. అయితే సౌరవ్ బయోపిక్ మాత్రమే కాకుండా సుశాంత్ మదిలో 12 దిగ్గజ వ్యక్తుల బయోపిక్‌లు (స్వామి వివేకానంద, మదర్ తెరెసా, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ) జీవిత చరిత్రలను నిర్మించాలనే ఆలోచన చేసేవాడని వరుణ్ మాథూర్ పేర్కొన్నాడు. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తితో పాటు ఆమె తండ్రి, సోదరుడు షోవిక్ చక్రవర్తిని సీబీఐ విచారించింది. ఇక రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ఎదుట కూడా హాజరైన విషయం తెలిసిందే. చదవండి: సుశాంత్ మృతి కేసు: ఆయన తండ్రి ఏం చెప్పారు? -
మ్యాచ్ ఫీజులు చెల్లించండి మహాప్రభు!
ముంబై: కరోనా... లాక్డౌన్... ఎక్కడికక్కడ ఆగిపోయిన ఆటలు... కొత్త సీజన్‌పై ఆశలేదు. ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందన్న విశ్వాసం లేదు. ఆర్థిక కష్టాలు... వెరసి కనీసం గత సీజన్ మ్యాచ్ ఫీజులైనా చెల్లించండి అంటూ భారత దేశవాళీ క్రికెటర్లు అత్యంత ధనవంతమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను వేడుకుంటున్నారు. పైగా బోర్డు స్థూల ఆదాయం (జీఆర్ఎస్) తాలూకు ఆటగాళ్ల వాటా కూడా నాలుగేళ్లుగా విడుదల చేయడం లేదు. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్లు, బ్రాండింగ్ ఎండార్స్‌మెంట్లున్న ఆటగాళ్లకు ఈ ఫీజులతో నష్టం లేకపోయినా... దేశవాళీ ఆటగాళ్లకు బోర్డు చెల్లింపులే జీవనాధారం. కాబట్టి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే బోర్డు కరుణించాలని నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. హామీ ఇచ్చినా... గతేడాది బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టగానే... దేశవాళీ క్రికెటర్ల చెల్లింపులు పెంచడమే తన లక్ష్యమన్నారు. కానీ ఆయన ఏలుబడిలో పెరగడం అటుంచి... లెక్క ప్రకారం రావాల్సినవే ఆటగాళ్లకు అందడం లేదు. గత ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ‘ఎ’ సీజన్ మార్చి నెలతో ముగిసింది. బోర్డు లెక్కల ప్రకారం రంజీ ఆటగాడికి రోజుకు రూ. 35 వేలు, ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 17,500 మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తారు. అంటే రంజీ ట్రోఫీ అసాంతం (గరిష్టంగా 9 మ్యాచ్‌లు) ఆడిన ప్లేయర్లకు మొత్తం కలిపి రూ. 13 లక్షలు ఇవ్వాలి. అయితే ముంబై, మహారాష్ట్ర, బెంగాల్, త్రిపుర, హైదరాబాద్ సహా ఏ రాష్ట్ర జట్టు ఆటగాళ్లు ఇప్పటివరకు బోర్డు నుంచి నయాపైసా అందుకోలేకపోయారు. దీంతో పాటు బోర్డు ఆర్జనలో కొంత వాటా దేశవాళీ ఆటగాళ్లకు చెల్లిస్తారు. దీన్నే జీఆర్ఎస్ అంటారు. ఇది నాలుగేళ్లుగా నిలిచిపోయింది. కారణాలేవైనా కానివ్వండి దేశవాళీ ఆటగాళ్ల ఆర్థిక కష్టాలైతే బోర్డుకు పట్టడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆటగాళ్లు బాహాటంగా మీడియా వద్ద తమ అసంతృప్తిని, కష్టాలను వెళ్లగక్కుతున్నారు. పైగా వచ్చే సీజన్‌పై అనిశ్చితి నెలకొందని, బయట ఎక్కడా ఆడే పరిస్థితి కూడా లేదని అందువల్లే మ్యాచ్ ఫీజులపైనే ఆధారపడ్డామని వాటి కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నామని వాపోతున్నారు. మరి బోర్డు మాటేమిటి... మ్యాచ్ ఫీజులు విడుదల చేయని మాట వాస్తవమేనని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అంగీకరించారు. కొన్ని సాంకేతిక కారణాలు, పద్దుల పరిశీలన వల్లే ఈ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలైతే లెక్కాపద్దుల్ని, ఇన్వాయిస్లను ఇప్పటికీ సరిగ్గా పంపలేదని ఆయన ఆరోపించారు. ఇన్వాయిస్ల వివరాలు పూర్తిగా పంపితే చెల్లింపుల ప్రక్రియ వేగంగా చేపడతామన్నారు. స్థూల ఆదాయ వాటా (జీఆర్ఎస్)పై స్పందిస్తూ... 2017–18 బ్యాలెన్స్ షీట్ తయారీ చాలా ఆలస్యమైందని అందువల్లే ఆటగాళ్ల వాటా చెల్లించలేకపోయామని, ప్రస్తుత లాక్డౌన్ సమస్య కూడా ఓ కారణమని ధుమాల్ వివరించారు. మహారాష్ట్ర రంజీ జట్టు (ఫైల్) -
నాకు కరోనా సోకలేదు
కోల్‌కతా: తనకు కరోనా సోకినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడైన స్నేహాశిష్ గంగూలీ వివరణ ఇచ్చాడు. అయితే ముందు జాగ్రత్తగా స్నేహాశిష్ తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపాడు. తన ఆరోగ్యం బాగున్నట్లు, తనకు కూడా వైరస్ సోకినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్నేహాశిష్ స్పష్టం చేశాడు. ఇకనైనా ఇలాంటి అబద్ధపు వార్తలు ప్రచారం చేయొద్దని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా వ్యవహ రిస్తున్న స్నేహాశిష్ కుటుంబంలో మాత్రం ముగ్గురు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలారు. -
ఐపీఎల్ ఆలస్యం
న్యూఢిల్లీ: ‘కరోనా’ మజాకా... ఇది వచ్చాకా అన్నీ వేగంగా మారిపోతున్నాయి. నేడు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ రోజు ముందుగానే తీసుకుంది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. అప్పటిదాకా మ్యాచ్‌ల్ని నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ తర్వాతైనా ఆయా వేదికల్లో సవ్యంగా జరుగుతుందా... లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రకాల క్రీడా ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ‘కోవిడ్–19’ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఢిల్లీ హోమ్ గ్రౌండ్. ఢిల్లీ సర్కారు నిర్ణయం వెలువరించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీసీసీఐ కూడా స్పందించింది. ‘ఐపీఎల్–2020ని ఏప్రిల్ 15వ తేదీ వరకు నిలిపివేస్తున్నాం. నోవల్ కరోనా వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్య ల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అయితే బీసీసీఐ వచ్చేనెల 15 వరకు మ్యాచ్‌ల్ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఏప్రిల్ 16 నుంచైనా షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఈవెంట్ల రద్దు నిర్ణయం తీసుకోగా... మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మ్యాచ్‌లకు అనుమతిని నిరాకరిస్తున్నాయి. పైగా విదేశీ ఆటగాళ్లు ఆడాలంటే వచ్చే నెల 15 వరకు వీసా నిబంధనలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యం లో బోర్డు, ఐపీఎల్ పాలక మండలి ప్రత్యామ్నాయ వేదికలపై కసరత్తు చేస్తున్నాయి. విదేశీ స్టార్లు లేకపోతే ఐపీఎల్ కూడా ఓ దేశవాళీ టోర్నీగా మారిపోతుందని దీంతో లీగ్ మజానే ఉండదని ఫ్రాంచైజీలు బోర్డుకు తెలిపాయి. అందుకే బోర్డు తాత్కాలికంగా పోటీలను రద్దు చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఆడనివ్వకపోతే ప్రత్యామ్నాయ వేదికలుగా విశాఖపట్నం, లక్నో, రాజ్‌కోట్, ఇండోర్, రాయ్‌పూర్‌లను పరిశీలిస్తుంది. ఏం జరగొచ్చు... ►ఐపీఎల్‌ను పూర్తిగా వాయిదా వేసే అవకాశమే లేదు. ఎందుకంటే భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) ఎప్పుడో ఖరారైంది. బిజీ షెడ్యూలు వల్ల మార్పులకు అవకాశముండదు ►మార్చి 29 నుంచి మే 24 వరకు మొత్తం 56 రోజుల ఈవెంట్ కాస్తా ఇప్పుడు 39 రోజులకే (ఏప్రిల్ 16 నుంచి మే 24) పరిమితం అవుతుంది. ►ప్రతి రోజూ రెండేసి మ్యాచ్‌లు నిర్వహించాల్సిందే. ఇన్నాళ్లు శని, ఆదివారాల్లోనే రెండు మ్యాచ్‌లు జరిగేవి. ►ఫ్రాంచైజీలు టికెట్ల రూపేణా కోల్పోయే రాబడిని బీసీసీఐ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ►వేల కోట్ల రూపాయలు వెచ్చించిన స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు కూడా ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. ►ఇటీవలే ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర సంఘాలకు మ్యాచ్‌కు రూ. 30 లక్షలకు బదులుగా రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా దీన్ని సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఐపీఎల్ వాయిదా వేయడం ముఖ్యం. అది జరిగిపోయింది. ప్రజల భద్రతకే అన్నింటికంటే ప్రథమ ప్రాధాన్యత కాబట్టి మేం వాయిదా వేశాం. ఏప్రిల్ 15 తర్వాత నిర్వహించగలమా అనేది ఇప్పుడే చెప్పలేం. అది మరీ తొందరపాటు అవుతుంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇష్టమున్నా, లేకపోయినా మరో ప్రత్యామ్నాయమైతే లేదు. –గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు -
రంజీలు కాదు.. దేశమే ముందు
కోల్‌కతా: భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో రంజీ ఫైనల్ ఆడించాలనుకున్న సౌరాష్ట్ర క్రికెట్ సంఘా నికి (ఎస్సీఏ) నిరాశ ఎదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... జడేజా రంజీ ఫైనల్ ఆడేందుకు అనుమతి నిరాకరించాడు. దేశమే ముందని, ఆ తర్వాతే ఏదైనా టోర్నీలని గంగూలీ తెగేసి చేప్పేశాడు. టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. మరోవైపు సోమవారం నుంచి రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ జరుగనుంది. కీలకమైన ఫైనల్స్‌లో జడేజాను ఆడించేందుకు ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా బీసీసీఐ చీఫ్ గంగూలీని కోరాడు. కానీ తన అభ్యర్థనను గంగూలీ తిరస్కరించాడని షా చెప్పాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జయదేవ్ రంజీ ఫైనల్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించరాదన్నాడు. ‘ఐపీఎల్ ఉన్నపుడు బోర్డు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించదు. ఎందుకంటే లీగ్ ద్వారా బాగా డబ్బు వస్తుంది. రంజీ ట్రోఫీకి ఆదరణ దక్కాలంటే స్టార్ ఆటగాళ్లను ఆడించాల్సిందే. ఆ దిశగా బోర్డు ఆలోచించాలి. రంజీ ఫైనల్ జరిగే రోజుల్లో అంతర్జాతీయ మ్యాచ్ లేకపోతే స్టార్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటారు. మ్యాచ్ రసవత్తరంగా జరిగేందుకు అవకాశముంటుంది. ఆదరణ కూడా పెరుగుతుందని జయదేవ్ షా తెలిపాడు. -
షూటింగ్ ప్రపంచ కప్ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక షూటింగ్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు కోవిడ్–19 వైరస్ అడ్డుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుండటంతో పాటు... దేశంలో కూడా పలు కేసులు నమోదు కావడంతో ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 25 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో 31 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం... కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్ దేశాలపై భారత ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించడంతో టోర్నీని ప్రస్తుతం నిర్వహించడం సాధ్యం కాదని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) తెలిపింది. అంతేకాకుండా టోర్నీలో పాల్గొనే 22 దేశాలు కూడా చివరి నిమిషంలో వైదొలిగాయని పేర్కొంది. అయితే షూటింగ్ ప్రపంచ కప్‌ను రెండు దశల్లో నిర్వహించే విషయమై పరిశీలిస్తున్నామని ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంది. మే 5 నుంచి 12 మధ్య రైఫిల్, పిస్టల్ ఈవెంట్లను... జూన్ 2–9 మధ్య షాట్‌గన్ షూటింగ్ పోటీలను నిర్వహించాలని ఎన్ఆర్ఏఐ తమను కోరినట్లు ఐఎస్ఎస్ఎఫ్ తెలిపింది. దీంతో పాటు ఏప్రిల్ 16 నుంచి టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ కూడా రద్దు అయింది. బయోమెట్రిక్‌కు ‘బ్రేక్’ ఇచ్చిన ‘సాయ్’ అథ్లెట్లు, సిబ్బంది హాజరు కోసం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తెలిపింది. బయోమెట్రిక్ ద్వారా కోవిడ్–19 ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘సాయ్’ తెలిపింది. అనుకున్న సమయానికే ఐపీఎల్: గంగూలీ కోవిడ్ దెబ్బకు ఒక్కో టోర్నీ వాయిదా పడుతున్నా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ సీజన్–13 అనుకున్న తేదీనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశాడు. వైరస్ ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని... దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ప్రారంభమవుతుంది. -
రాత్రి 8 గంటల నుంచే...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో రాత్రి మ్యాచ్‌ల సమయాన్ని కాస్త ముందుగా జరపాలనే ప్రతిపాదనపై గవర్నింగ్ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు జరిగే ఐపీఎల్ టోర్నీలో ఎప్పటిలాగే రాత్రి మ్యాచ్‌లు 8 గంటల నుంచే ప్రారంభమవుతాయని ప్రకటించింది. మ్యాచ్‌లు నిర్ధారిత సమయానికి పూర్తి కాకుండా అర్ధరాత్రి వరకు కొనసాగుతుండటంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ఈ అంశంపై బీసీసీఐ సోమవారం సుదీర్ఘంగా చర్చించింది. బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది. అయితే ఈసారి మొత్తం షెడ్యూల్లో రెండు మ్యాచ్‌లు జరిగే (సాయంత్రం 4 గం.; రాత్రి 8 గం.) రోజులను తగ్గించారు. వీటిని ఐదుకు మాత్రమే పరిమితం చేశారు. ఐపీఎల్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లంతా కలిసి సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ‘ఆల్ స్టార్స్ మ్యాచ్’ ఆడనున్నారు. మరోవైపు మార్చిలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కోసం జట్టును కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని ప్రకటించాడు. ‘నోబాల్’ అంపైర్లు కూడా: ఈసారి ఐపీఎల్లో అంతర్జాతీయ క్రికెట్లో అమలు చేస్తున్న విధంగా ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’ను అనుమతించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అతని స్థానంలో రిఫరీ విచక్షణ మేరకు అదే తరహా ఆటగాడిని బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలనేదే ఈ నిబంధన. ఇక నోబాల్స్‌ను మాత్రమే చూసేందుకు ఒక టీవీ అంపైర్‌ను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. గత ఐపీఎల్లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో ముంబై పేసర్ మలింగ వేసిన నోబాల్‌ను అంపైర్ గుర్తించకపోవడం వివాదానికి కారణమైంది. -
మీడియా ప్రశ్నలకు గంగూలీ ఆసక్తికర జవాబులు..
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై ముడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా గంగూలీ అండ్ టీం మీడియాతో సరదాగా ముచ్చటించారు. బీసీసీఐలో టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేల పాత్ర గురించి అడగగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ గురించి ఓ రిపోర్టర్ సౌరవ్‌ను ప్రశ్నించగా కేవలం ఆ ముగ్గురితోనే కాకుండా కాకుండా జైషా(బీసీసీఐ సెక్రటరీ), అరుణ్ దుమాల్(బీసీసీఐ కోశాధికారి), జయేష్ గెరోజ్(బీసీసీఐ జాయింట్ సెక్రెటరీ)లతో సమన్వయ పరుచుకుంటూ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా బీసీసీఐ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని, వాటిని పరిష్కరించి బీసీసీఐని మేటి బోర్డుగా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. గత మూడు నెలలుగా క్రికెట్ అభివృద్ధి కోసం కొన్ని మార్పులు చేశామని అన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా తన పనితీరు గురించి గంగూలీని ప్రశ్నించగా.. తనకు ఎన్ని మార్కులు పడతాయో చెప్పడం కష్టమని, తన దృష్టంతా క్రికెట్‌ను అభివృద్ది పరచడంపైనే ఉంటుందన్నారు. టీమిండియా గురించి స్పందిస్తూ.. విరాట్ కోహ్లి నాయకత్వంలో అనేక విజయాలు అందుకుందని అన్నారు. అక్టోబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ, నవంబర్‌లో జరిగిన టీమిండియా మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. -
అజహర్‌కు రూ. 1.5 కోట్లు
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు బాకీగా ఉన్న రూ. కోటీ 50 లక్షలను చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మొత్తాన్ని అజహర్‌కు ఇవ్వాలని బోర్డు ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. బోర్డు నిబంధనల ప్రకారం మాజీ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పెన్షన్ తదితర సౌకర్యాలతో కలిపి అజ్జూకు రూ. కోటిన్నర రావాల్సి ఉంది. అయితే అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన నిషేధం కొనసాగుతుండటంతో బోర్డు వీటిని నిలిపివేసింది. 2012లోనే ఏపీ హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తన బాకీలు చెల్లించాలంటూ రెండేళ్ల క్రితమే అజహర్ విజ్ఞప్తి చేశాడు. అయితే సీఓఏ మాత్రం స్పందించలేదు. ఎట్టకేలకు ఇప్పుడు బోర్డు అధ్యక్షుడి హోదాలో గంగూలీ తన తొలి కెప్టెన్‌కు మేలు చేకూర్చేలా అధికారిక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న అజహర్... భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. -
‘థ్యాంక్యూ’...
న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్యం నగరాన్ని కమ్మేసిన సమయంలో కూడా ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టి20 మ్యాచ్ మాత్రం ఆగలేదు. ఇరు జట్లు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఆటను కొనసాగించాయి. ఒక దశలో రద్దు అవుతుందేమో అనిపించినా... అవాంతరం లేకుండా నిర్ణీత సమయం ప్రకారమే మ్యాచ్ జరిగింది. దాంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఊపిరి పీల్చుకున్నాడు. రెండు జట్లకు కూడా అతను కృతజ్ఞతలు చెప్పాడు. ‘కఠిన పరిస్థితుల మధ్య మ్యాచ్ ఆడినందుకు ఇరు జట్లకు కృతజ్ఞతలు. బాగా ఆడిన బంగ్లా జట్టుకు అభినందనలు’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. మరోవైపు ఢిల్లీ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని బయటకు చెప్పినా... సౌమ్య సర్కార్‌తో పాటు మరో బంగ్లా క్రికెటర్ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక మైదానంలో వాంతి చేసుకున్నట్లు సమాచారం. ‘మహా’ ఆపుతుందా! భారత్, బంగ్లా మధ్య గురువారం రెండో టి20 మ్యాచ్ జరగడంపై సందేహాలు రేగుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్ తీవ్రమైన తుఫాన్ ‘మహా’ బారిన పడే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం గుజరాత్ తీరానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాజ్‌కోట్‌పై తుఫాన్ ప్రభావం ఉండవచ్చు. ‘మహా’ కారణంగా 6, 7 (మ్యాచ్ జరిగే రోజు) తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జైదేవ్ షా అన్నారు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ
-
శ్రీలంకను చూస్తే జాలేస్తుంది: గంగూలీ
కోల్‌కతా: శ్రీలంకతో మొహాలీలో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. అదొక అసాధారణమైన ఇన్నింగ్స్ అంటూ గంగూలీ కొనియాడాడు. ప్రధానంగా శతకాన్ని ద్విశతకంగా మార్చుకున్న క్రమంలో రోహిత్ చెలరేగిన విధానంగా నిజంగా అద్బుతమన్నాడు. కేవలం సెంచరీ నుంచి డబుల్ సెంచరీకి చేరడానికి 36 బంతులే తీసుకోవడం రోహిత్ అద్వితీయమైన ఆటకు నిదర్శనమన్నాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ ఊచకోతతో శ్రీలంక బౌలర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైందన్నాడు. రోహిత్ దెబ్బకు లంక ఫీల్డర్లు బౌండరీ లైన్‌కే పరిమితమయ్యారన్నాడు. 'శ్రీలంక క్రికెట్ జట్టును చూస్తే జాలేస్తుంది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న శ్రీలంకకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల దెబ్బకు ఇలానే శ్రీలంక బెంబేలెత్తిపోయేది. ఇప్పుడు కోహ్లి-రోహిత్‌లు లంకను ఆడేసుకుంటున్నారు. రోహిత్ శర్మ చాలా సీరియస్ ప్లేయర్. ఈ ఏడాది అతని వన్డే రికార్డే అమోఘం. టీ 20 ఫార్మాట్‌తో రోహిత్ ఆట తీరే మారిపోయింది. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లిలతో పోల్చదగ్గ ఆటగాడు రోహిత్. ఇదే ఊపును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా'అని గంగూలీ తెలిపాడు. మరొకవైపు డే అండ్ నైట్ టెస్టులపై కూడా గంగూలీ తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలంటే ఎక్కువగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉందన్నాడు. టెస్టులకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే డే అండ్ నైట్ టెస్టులే మార్గమన్నాడు. -
'సెంచరీ కొట్టి.. షాపింగ్ చేసేవాడు'
కోల్ కతా: ఈడెన్ గార్డెన్ లో భారత్-న్యూజిలాండ్ ల మధ్య రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత దిగ్గజ ఆటగాళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ టెస్టు మ్యాచ్ లో సెంచరీ కొట్టిన మరుసటి రోజు షాపింగ్ కు వెళ్లి తనకు ఇష్టమైన బ్రాండ్ల దుస్తులను కొనుగోలు చేసేవాడని దాదా చెప్పుకొచ్చాడు. సచిన్ కు దుస్తులపై మక్కువ ఎక్కువని తెలిపాడు. తనతో జట్టులో ఉన్న సమయంలో సచిన్ వార్డ్ రోబ్ నిండా చక్కని దుస్తులు ఉండేవని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ నిత్యం ఆలస్యంగా వచ్చేవాడని తెలిపాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో బ్యాటింగ్ కు దిగాల్సిన పరిస్ధితి ఉన్నా చివరి నిమిషంలో బస్సు వద్దుకు చేరుకునేవాడని చెప్పాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో రాహుల్ ద్రవిడ్, సచిన్, హర్భజన్, సెహ్వాగ్, కుంబ్లేలు అనుకున్న పనిని తమదైన శైలిలో పూర్తి చేసేవారని కొనియాడాడు. వారి కృషే భారతీయ క్రికెట్ ను ప్రపంచదేశాల వరుసలో అగ్రభాగాన నిలబెట్టిందని అన్నాడు. -
ఆ అర్హత నాకు లేదు: గంగూలీ
బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు కావల్సిన అర్హత ఇంకా తనకు లేదని టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడు కావడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అయితే ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడు సార్లు వార్షిక సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే జగ్మోహన్ దాల్మియా మరణించిన తర్వాత గత సంవత్సరం అక్టోబర్ 15నే గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు. దాంతో మూడు వార్షిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇంకా దాదాకు రాలేదు. అందువల్ల తనకు బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం లేదనే భావిస్తున్నట్లు చెప్పాడు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నకు.. సమాధానం ఇవ్వడం కష్టమన్నాడు. ఆ పదవి చేపట్టేందుకు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారని, దాని గురించి అసలు తాను ఆలోచించడం లేదని తెలిపాడు. -
ధోనీ తర్వాత నువ్వే కెప్టెన్!
ధోనీ.. వ్యూహాలు రచించడంలో దిట్ట. ధోనీ.. వికెట్ కీపింగ్‌లో నెంబర్ వన్. ధోనీ.. అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్.. ఇన్ని లక్షణాలున్నా.. అతడు ఎంతకాలం ఆడతాడు? మూడేళ్ల తర్వాత.. అంటే 2019లో జరగబోయే 50 ఓవర్ల ఐసీసీ ప్రపంచ కప్‌లో టీమిండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించడం అనుమానమేనంటున్నాడు క్రికెట్ దాదా.. సౌరవ్ గంగూలీ. అందుకే విరాట్ కోహ్లీని అందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నాడు. ప్రతి జట్టుకు భవిష్యత్ ప్రణాళిక ఉంటుందని, మూడు నాలుగేళ్ల తర్వాత కూడా ధోనీ కెప్టెన్‌గా ఉంటాడా అని సెలెక్టర్లకు దాదా సూటి ప్రశ్న వేశాడు. ధోనీ నాయకత్వం గురించి గంగూలీ ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు కానీ, క్రమంగా అతడు తన బాధ్యతలను వేరే వాళ్లకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నం అవుతోందని సూచించాడు. ఆ స్థానానికి విరాట్ కోహ్లీ అయితేనే సరిగ్గా సరిపోతాడన్నది దాదా అంచనా. ధోనీ తొమ్మిదేళ్లు కెప్టెన్‌గా ఉన్నాడని, అదేమీ తక్కువ సమయం కాదని గంగూలీ చెప్పాడు. ఇప్పటికే అతడు టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడని, కేవలం వన్డేలు, టి20లు మాత్రమే ఆడుతున్నాడని గుర్తుచేశాడు. ఇంకో నాలుగేళ్ల పాటు ఇంతే సామర్థ్యం ఉంటుందని ఎలా చెప్పగలమన్నాడు. కోహ్లీని ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనాతో గంగూలీ పోల్చాడు. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్న కోహ్లీ.. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసింది, ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసినది కూడా కోహ్లీయే. కోహ్లీ రోజు రోజుకూ బెటర్ అవుతున్నాడని, నిలకడ విషయంలో ఇప్పుడు ప్రపంచంలోనే అతడు బెస్ట్ అని దాదా ప్రశంసలు కురిపించాడు. అందువల్ల 2019 నాటికి ధోనీకి ప్రత్యామ్నాయం ఎవరనే విషయమై సెలెక్టర్లు ఆలోచించుకోవాలని.. వాళ్లు ఒకవేళ ధోనీనే కొనసాగించాలని అనుకుంటే మాత్రం తాను చాలా ఆశ్చర్యపోతానని చెప్పాడు. -
స్వచ్ఛభారత్‌కు కపిల్, గంగూలీని నామినేట్ చేసిన మోదీ
గాంధీ జయంతి రోజున తాను ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వారణాసి పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ ఈసారి మరింతమందిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేశారు. ప్రధానంగా ముంబై డబ్బావాలాలను, క్రికెట్ యువరాజు సౌరవ్ గంగూలీని కామెడీ నైట్స్ వ్యాఖ్యాత కపిల్ శర్మను, కిరణ్ బేడీని ఆయన ఈసారి ప్రస్తావించారు. వాళ్లతో పాటు నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, సోనాల్ మాన్సింగ్, రామోజీరావు, ఆరోన్ పూరీ, ఐసీఏఐ.. ఇలా వ్యక్తులతో పాటు సంస్థలు, సమూహాలను కూడా ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నామినేట్ చేశారు. అంతకుముందు వారణాసి శివార్లలోని బాబత్‌పూర్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగారు. అక్కడ ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్ర మంత్రి అహ్మద్ హసన్ తదితరులు స్వాగతం పలికారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు, హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ, రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి తదితరులు కూడా ప్రధాని పర్యటనలో ఉన్నారు.