shivani Rajashekar
-
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగులో ప్రతి ఏడాది 200-300 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వాటిలో హిట్ కొట్టి నిలబడేవి పదుల సంఖ్యలో ఉంటాయి. కొన్ని చిత్రాలైతే ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా పెద్దగా గుర్తుండదు. అలా గతేడాది థియేటర్లలో విడుదల ఓ మూవీ.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)అప్పట్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్.. చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. కొడుకు శ్రీ కమల్ని హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.ఆహా ఓటీటీలో జూలై 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీ కమల్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కథ విషయానికొస్తే.. హాస్టల్ లో చదువుకునే స్టూడెంట్ కమల్ (శ్రీ కమల్). అనుకోని పరిస్థితుల్లో ఈ హాస్టల్లోకి లక్ష్మీ భారతి అలియాస్ జిలేబీ వస్తుంది. అసలు బాయ్స్ హాస్టల్లోకి అమ్మాయి ఎందుకొచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. మరి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా మైదాన్.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్) -
శివావీ రాజశేఖర్ బర్త్‌డే స్పెషల్.. క్యూట్ అండ్ హాట్నెస్ తగ్గేదే లే! (ఫొటోలు)
-
Shivani Rajashekar: శివాని రాజశేఖర్ క్యూట్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
-
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
టైటిల్: విద్య వాసుల అహంనటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులునిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి దర్శకత్వం: మణికాంత్ గెల్లిసంగీతం: కళ్యాణి మాలిక్ఎడిటర్ : అఖిల్ వల్లూరిఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: ఆహా(మే 17 నుంచి)ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్ సినిమా మాదిరి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాసు(రాహుల్ విజయ్) ఓ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి? గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్టైనింగ్గా తీస్తే చాలు టాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్టైనింగ్ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమకథలోని భావోద్వేగాలను తెరపై చక్కగా పండించాడు.పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో. డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎంటర్టైన్ కావడానికి వీకెండ్లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ జనరేషన్ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్ విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం ‘విద్య వాసుల అహం’.
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. మహేష్ దత్తా, లక్ష్మి నవ్య నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో మణికాంత్ గెల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘విద్య వాసుల అహం’ రూపొందింది. వెంకీ అద్భుతమైన కథ రాయడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను’’ అన్నారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ (అహం) ఉండే ఫన్ ఫిలిం’’ అన్నారు. ‘‘రాహుల్ మంచి రైటర్ కూడా. ఈ స్క్రిప్ట్‌ని తను ఒప్పుకున్నాడంటే కథ బాగుంటుందని అనిపించి నేను కూడా ఓకే చేశాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. -
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో జతకట్టిన టాలీవుడ్ హీరో కూతురు!
తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరచుకున్న దర్శకుడు పా.రంజిత్. ఆయన చిత్రాల్లో సామాజిక దృక్ప థం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు. ఒకవైపు దర్శకుడిగా రాణిస్తూనే నీలం ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి.. తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. ఇంతకుముందు దర్శకుడు మారి సెల్వరాజ్ వంటి సక్సెస్ పుల్ దర్శకులను పరిచయం చేశారు. తాజాగా తన మరో శిష్యుడు అకిరన్ మోసెస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో అతనికి జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ నటిస్తున్నారు. శ్రీనాథ్ బాజీ, లింగేష్, విశ్వంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్నారంటే ఆ చిత్రానికి కచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆయన రూపొందిస్తున్న చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించడం మరో విశేషం. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి కథ, తదితర వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తంగలాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. A start to a new chapter✨ The shoot for our next production begins today with bright smiles and fond memories🎆 Written and directed by @AkiranMoses Produced by @beemji #NeelamProductions Starring @gvprakash @Rshivani1@sreenathbhasi @PasupathyMasi @LingeshActor @EditorSelva… pic.twitter.com/P5KrELtXGX — Neelam Productions (@officialneelam) February 29, 2024 -
హీరో రాజశేఖర్ అరుదైన (ఫొటోలు)
-
ఇంటికి నేనే దరిద్రం.. నా వల్లే మా నాన్న ఐసీయూలో..: శివానీ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ జంట జీవిత- రాజశేఖర్ల కూతుర్లిద్దరూ వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులను ఎంచుకుంటూ ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. శివానీ రాజశేఖర్ ఈ మధ్యే కోటబొమ్మాళి పీఎస్ సినిమాతో హిట్ అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. 'www సినిమా షూటింగ్లో నాకు కరోనా సోకింది. అంతలోనే ఇంట్లో అందరికీ వ్యాపించింది. నేను త్వరగానే కోలుకున్నాను. అమ్మ, చెల్లికి కూడా కొద్ది రోజుల్లోనే తగ్గిపోయింది. నా వల్ల కుటుంబానికి గండం! కానీ నాన్నకు మాత్రం సీరియస్ అయింది. వెంటిలేటర్ వరకు వెళ్లి వచ్చాడు. నాన్నకు నా వల్ల కరోనా రావడంతో నా జాతకం బాలేదని, నా వల్ల కుటుంబానికి గండం ఉందని చాలామంది ఏవేవో మాటలు చెప్పారు. మొదట నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నాన్న వెంటిలేటర్‌పైకి వెళ్లాడో అప్పుడు చాలా బాధపడ్డాను. నా వల్లే ఇదంతా జరుగుతుందేమో.. ఇంటికి నేనే దరిద్రం ఏమో.. నా జాతకంలో ఏదైనా దోషం ఉందేమో, నా వల్ల మా నాన్నకు ఏమవుతుందోనని భయపోడిపోయాను. నాకు అనారోగ్య సమస్య అప్పుడు నాకు ఓ అనారోగ్య సమస్య ఉండేది. దానివల్ల ఉన్నట్లుండి గుండెదడ ఎక్కువయ్యేది. గుండెచప్పుడు సడన్‌గా 170-200 వరకు వెళ్లేది. నాన్న డాక్టర్ కాబట్టి గుండె దడ మొదలవగానే మందులు ఇచ్చేవాడు. అది నెలకోసారి వచ్చిపోతూ ఉండేది. నాన్నకు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ రెండుమూడుసార్లు గుండెదడ వచ్చేది. నాన్న పక్కనే ఐసీయూ బెడ్లో నిద్రపోయేదాన్ని. ఒకరోజు అతడి పరిస్థితి మరీ సీరియస్ అయింది. ప్రార్థనలే బతికించాయి అందరూ ప్రార్థించండి, ఇక అదే మిగిలింది అని పేపర్ మీద రాశాడు. నీకేమైనా అయితే నేను కూడా చనిపోతాను.. నువ్వు పోరాడు అని చెప్పాను. ఆయన్ని అభిమానుల ప్రార్థనలే బతికించాయి' అని చెప్పుకొచ్చింది. ఉప్పెన సినిమాను చేజార్చుకోవడంపై స్పందిస్తూ.. 'ఉప్పెన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. కానీ ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో చేయనని చెప్పాను. కానీ నాకు చెప్పిన కథకు, సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉంది' అని తెలిపింది శివానీ రాజశేఖర్. చదవండి: తెలుగులో హీరోయిన్గా, పనిమనిషిగా నటించిన బ్యూటీ.. కొట్టి మరీ ఏడిపించారు.. గుర్తుపట్టారా? -
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రాజకీయాలతో సంబంధం లేదు
‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్ తేజా మార్ని అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది. కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు. -
నటుడికి సంతృప్తి అనేది ఉండదు
‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్‌ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ సెటైర్ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ. ►ఓ మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా ఉంటుంది. నేను హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి. ►దాదాపు 32 ఏళ్ల కెరీర్లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్‌తో ‘దేవర’, మోహన్‌లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నాను. -
Kotabommali PS Pre Release Photos: ‘కోట బొమ్మాళి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్ చేస్తారేమో అనుకున్నా
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్‌గారు, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్ నటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్’ రీమేక్. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మా నాన్నగారు (ఫైట్ మాస్టర్ విజయ్) అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా, ఫైట్ మాస్టర్‌గా చేశారు. అదే బ్యానర్లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్‌గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది'.. శివాని క్రేజీ కామెంట్స్!
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కోటబొమ్మాళి పీఎస్'. ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్- 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివాని రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. గ్లామరస్ పాత్రల గురించి మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే వాటి గురించి ఆలోచించడం లేదు. మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతా. నచ్చింది చేసుకుంటూ పోవడమే నా పని. రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. మా కథల విషయంలో అమ్మా, నాన్న జోక్యం చేసుకోరు. మా పై వారికి నమ్మకం ఉంది.' అని అన్నారు. శ్రీకాంత్ సార్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఆయన సెట్లో చాలా సరదాగా ఉంటారని తెలిపింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని తెలిపింది. -
Shivani Rajashekar: శివాని రాజశేఖర్ అద్భుతమైన లుక్ చూశారా? (ఫోటోలు)
-
ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా కోట బొమ్మాళి పాట
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది. ఈ సినిమా నుంచి ‘ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి గ్రామంలోని కోటమ్మ తల్లి సన్నిధానంలో ఈ పాటను విడుదల చేశారు. రంజన్ రాజ్ సంగీతం అందించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, తేజా మార్ని, చిత్రసహ నిర్మాత భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
Kota Bommali Ps Teaser Launch: 'కోట బొమ్మాళి పి.ఎస్' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'గన్ కన్నా.. ఫోన్ బాగా పేలుతుంది సార్'
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'కోట బొమ్మాళి పి.ఎస్'. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!) టీజర్ చూస్తే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య జరిగే సన్నివేశాలే కథాంశంగా తీసినట్లు కనిపిస్తోంది. సస్పెన్స్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే యాక్షన్ సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. అసలు ఈ కోట బొమ్మాళి పీఎస్ కథేంటో తెలియాలంటే ఈనెల 24 వరకు ఆగాల్సిందే. Haunting tale from the rustic lands of Srikakulam 🔥🔥#KotabommaliPS teaser out now! - https://t.co/GrvWpLzMBL Grand release worldwide on November 24th ❤🔥@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni @varusarath5 @bhanu_pratapa @Rshivani_1… pic.twitter.com/TG1Pq39zV3 — GA2 Pictures (@GA2Official) November 6, 2023 -
బొమ్మాళి డేట్ ఫిక్స్
శ్రీకాంత్ మేకా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. ‘‘ఓ పోలీస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పవర్ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్‌గా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే ‘లింగి లింగిడి..’ పాట కొన్ని కోట్ల వ్యూస్ సాధించింది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, సహనిర్మాతలు: భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్: అజయ్ గద్దె. -
’కోట బొమ్మాళి పీ ఎస్’వచ్చేస్తోంది
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ నాయాట్టుకి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన శ్రీకాకుళం మాస్ జానపద పాట ‘లింగి లింగి లింగిడి’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించింది చిత్రబందం. నవంబరు 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నేడు విడుదల తేది పోస్టర్ నువిడుదల చేశారు. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. -
తెలుగోడి జానపదం దమ్ము చూపించింది
‘‘ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ మేక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని. -
జిలేబి సినిమా రివ్యూ
స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేశాడు. జిలేబి అంటూ నేడు తండ్రీకొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.. కథ జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కాలేజ్ చదువుకునే కుర్రాళ్లు హాస్టల్లో ఉంటారు. ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ. కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో ఎలా పరిచయం ఏర్పడింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీరిద్దరి మధ్యలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేస్తాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి నటనకు వంక పెట్టే అవకాశమే ఉండదు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారంతా కూడా ఆకట్టుకున్నారు. విశ్లేషణ విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తనదైన స్టైల్లో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపిస్తాయి. బాయ్స్ హాస్టల్లోకి హీరోయిన్ వచ్చిన దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రథమార్దంలో పాత్రల పరిచయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలో చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు. చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ.. బాగున్నాయి కానీ సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను ఎక్కువ సాగదీయడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్‌పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. చదవండి: Bigg Boss 7 Nagarjuna Remuneration: బిగ్‌బాస్ కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?