Sivatmika Rajasekhar
-
అది మరచిపోలేని జ్ఞాపకం.. తెలుగు యంగ్ హీరోయిన్ కామెంట్స్
‘‘నేను ఎప్పట్నుంచో స్కై డైవింగ్ చేయాలనుకుంటున్నాను. అది 2023లో నెరవేరింది. దుబాయ్‌లో అక్క(శివాని, నేను రెండు వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశాం. 2023 అనే కాదు.. నా జీవి తంలోనే నేను మరచిపోలేని జ్ఞాపకంగా ఈ స్కై డైవింగ్ అడ్వెంచరస్‌ను గుర్తు పెట్టుకుంటాను’’ అని హీరోయిన్ శివాత్మిక అన్నారు. 2023కి వీడ్కోలు పలుకుతూ 2024కి స్వాగతం పలుకుతున్న శివాత్మిక రాజశేఖర్ పంచుకున్న విశేషాలు... ► మీ జీవితంలో 2023 ఎలా గడిచింది? చెప్పాలంటే... 2023 నాకు గొప్పగా గడిచింది. చాలా విధాలుగా కలిసొచ్చింది. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యాననే భావన కలిగింది. ఎప్పట్నుంచో నేను చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నన్ను నేను మెరుగుపరచుకోవడం కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నాను. కుటుంబం పరంగా కూడా బాగా గడిచింది. దేవుడి దయవల్ల, అదృష్టంగా 2023 నా జీవితంలో సంతోషంగా ముగిసింది. ► ఈ ఏడాది మీ జీవితంలో జరిగిన చెడు ఘటనలు ఏవైనా ఉన్నాయా? మంచి జరిగినట్లే... ప్రతి ఏడాది చెడు కూడా ఉంటుంది. అయితే కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టబోయే ఈ తరుణంలో వాటిని నేను గుర్తుతెచ్చుకోవాలనుకోవడం లేదు. ► కొత్త ఏడాది కోసం మీరు తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటి? నా మనసును ఎక్కువగా ఫాలో అవుతూ వర్క్స్ చేస్తాను. ప్రతి అంశం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తాను. ఇలా గత ఏడాదిలో ప్రయత్నించి సంతోషంగా జీవనం సాగించాను. ఈ ఏడాది కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ► 2024 మీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు. ఫ్లోను బట్టి ముందుకెళ్తాను. అయితే అన్నీ మంచి, గొప్ప అంశాలే జరగాలని కోరుకుంటున్నాను. సంతోషంగా, హాయిగా, ఆరోగ్యకరంగా గడవాలని ఆశిస్తున్నాను. ► కొత్త ఏడాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? కొత్త ఏడాది ఎప్పటిలానే అమ్మానాన్న(జీవిత, రాజశేఖర్), అక్క శివానీలతో హైదరాబాద్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను కలుస్తాను. -
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
అలాంటి అమ్మాయిలు డేంజరస్ అంటోన్న నటి
♦ కుక్కపిల్లతో ఫొటో దిగిన దేత్తడి హారిక ♦ అలాంటి అందమైన అమ్మాయికన్నా భయంకరమైనది ఏదీ ఉండదంటున్న సాక్షి అగర్వాల్ ♦ థ్యాంక్స్ చిన్నపదం అంటోన్న హరితేజ ♦ వర్కవుట్స్ వీడియో షేర్ చేసిన లక్ష్మీరాయ్ ♦ చీరకట్టులో క్యూట్‌గా కనిపిస్తోన్న శివాత్మిక రాజశేఖర్ ♦ వ్యాక్సిన్ వేయించుకున్న కీర్తి సురేశ్ ♦ ఏదైనా గొప్పగా ఆరంభించాలన్న సయ్యద్ సోహైల్ ♦ ఆ కనులలో సంభాషణలు ఎన్నో అంటోన్న దివి View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) View this post on Instagram A post shared by Roll Rida (@rollrida) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) -
రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్..
-
రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్..
హీరో రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవితలకు చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన కుమార్తె శివాత్మిక అరగంటలో రెండు ట్వీట్లు చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ శివాత్మిక మొదటి ట్వీట్ చేశారు. అందరి అభిమానంతో క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. (చదవండి: మేం బాగానే ఉన్నాం) Dear All. Nanna's fight with covid has been difficult, yet he is fighting hard. We believe that it is your prayers love and well wishes that protect us and keep us going. I am here asking you, to pray for Nanna's speedy recovery! With your love, he'll come out stronger💖🙏 — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020 మరి కాసేపటికే.. నాన్న బాగానే ఉన్నారంటూ... మరో ట్వీట్ చేశారు శివాత్మిక. కరోనా నుంచి కోలుకుంటున్నారంటూ రెండో ట్వీట్లో పేర్కొన్నారు. ఇక జీవితకు కూడా కరోనా నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. I cannot thank you all enough for your love and wishes! But please know, he is not critical.. he is stable and getting better! We just need your prayers and positivity💖 Thank you once again💖 Do not panic Please do not spread fake news💜 — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020 -
మేం బాగానే ఉన్నాం
రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకింది. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘జీవితాకి, పిల్లలకి, నాకు ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాం. పిల్లలిద్దరికీ పూర్తిగా తగ్గిపోయింది. నేను, జీవిత ప్రస్తుతం బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి వెళ్లనున్నాం’’ అని ట్వీట్ చేశారు రాజశేఖర్. -
సీఎం సహాయనిధికి శివానీ, శివాత్మికా విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ (కోవిడ్ –19) నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు లక్షలు విరాళంగా ఇచ్చారు. 'దొరసాని' సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక పుట్టినరోజు (ఏప్రిల్ 22) సందర్భంగా ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ...విరాళం చెక్‌ను అందించారు. (అన్నయ్యా.. వదినకు చాన్స్ ఇస్తున్నవా? ) అనంతరం శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్’ అని అన్నారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. (సీఎం సహాయ నిధికి రూ.4.70 కోట్ల విరాళం) -
‘విధి విలాసం’ చిత్రం ప్రారంభం
-
మూడు కోణాలు
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి. ‘‘దశరథ్ గారి దగ్గర దుర్గ నరేష్ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్ ఆదిత్. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల. -
అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’
నూతన దర్శకుడు దుర్గానరేశ్ గుట్ట డైరెక్షన్లో రొమాంటిక్ హీరో అరుణ్ అదిత్, ‘దొరసాని’ ఫేమ్ శివాత్మిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విధివిలాసం’. శివదినేశ్ రాహుల్, అయ్యర్ నకరకంటితో పాటు ఎస్కేఎస్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్‌నగర్‌లోని ఓ ఆలయంలో పూజాకార్యక్రమాల అనంతరం ఈ సినిమాను ప్రారంభించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందించగా.. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించాడు. తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, సత్య, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన శివాత్మిక.. తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక 24 కిస్సెస్ చిత్రంతో అరుణ్ అదిత్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఓ రకంగా చెప్పాలంటే హీరోహీరోయిన్లుగా వీరిద్దరికి ఇది రెండో సినిమా. మరి ద్వితీయ విఘ్నాన్ని వీరు అధిగమిస్తారో లేదో చూడాలి. చదవండి: దొరసాని’ మూవీ రివ్యూ హృదయాలను గెలుచుకున్న పూజా -
రంగ మార్తాండలో...
ఈ ఏడాది విడుదలైన ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు శివాత్మికా రాజశేఖర్... డాటరాఫ్ జీవితారాజశేఖర్. తొలి చిత్రంతోనే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందారామె. తాజాగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే చాన్స్ కొట్టేశారు శివాత్మిక. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ మార్తాండ’. నానా పటేకర్ నటించిన మారాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాలో గాయనిగా నటిస్తున్నారట శివాత్మిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో శివాత్మిక పాల్గొంటున్నారని తెలిసింది. ఇందులో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణల కూతురి పాత్రలో కనిపిస్తారట శివాత్మిక. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
టాక్ బాగున్నా.. కలెక్షన్లు వీక్!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ హీరోగా.. సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కూతురు శివాత్మికను హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా దొరసాని. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ బాగానే వినిపించింది. అయితే టాక్ బాగున్నా కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవన్న టాక్ వినిపిస్తోంది. దొరసానితో పాటు రిలీజ్ అయిన నిను వీడని నీడను నేనే ఇప్పటికే దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్‌కు చేరువ కాగా దొరసాని కలెక్షన్ల వేటలో బాగా వెనుక పడిందన్న టాక్ వినిపిస్తోంది. వీకెండ్స్‌లోనే పెద్దగా ప్రభావం చూపించకపోవటంతో వీక్ డేస్‌లో పరిస్థితి మరి మరింత దారుణంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. -
‘దొరసాని’ మూవీ రివ్యూ
-
‘దొరసాని’ మూవీ రివ్యూ
టైటిల్ : దొరసాని జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, వినయ్ వర్మ, కిషోర్ తదితరులు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి నిర్మాత : మధుర శ్రీధర్, యష్ రంగినేని దర్శకత్వం : కె.వీ.ఆర్ మహేంద్ర విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా దొరసాని చిత్రంతో పరిచయం అవుతున్నారు. గడీలు, దొరల కాలం నేపధ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్‌తో అంచనాలను పెంచేసి.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ దొరసాని చిత్రం.. ఆనంద్, శివాత్మికలకు మంచి బ్రేక్ ను ఇచ్చిందా? తొలి ప్రయత్నం లొనే విజయం సాధించి.. వీరిద్దరు మంచి నటులుగా గుర్తింపును తెచ్చుకున్నారా? అన్నది చూద్దాం. కథ అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో గడీల రాజ్యం నడిచేది. ఓ ఊరి దొర రాజారెడ్డి (వినయ్ వర్మ) కూతురు దొరసాని దేవకి(శివాత్మిక రాజశేఖర్)ని రాజు (ఆనంద్ దేవరకొండ) ప్రేమిస్తాడు. గడీ వైపు చూడాలంటే కూడా భయపడే ఊళ్లో.. రాజు మాత్రం ఏకంగా దొరసానిని ప్రేమిస్తాడు. దొరసాని కూడా రాజును ప్రేమిస్తూ ఉంటుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన దొర ఏం చేశాడు? ఈ కథలో కామ్రేడ్ శంకరన్న(కిషోర్)కు ఉన్న సంబంధం ఏంటి? శంకరన్న వీరి ప్రేమకు ఎలాంటి సహాయం చేస్తాడు? రాజు-దొరసానిల ప్రేమ ఫలించి చివరకు ఒక్కటయ్యారా? లేదా అన్నదే మిగతా కథ. నటీనటులు రాజు పాత్రలో ఆనంద్ దేవరకొండ చక్కని నటనను కనబర్చాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ ఉంటే.. ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ గుర్తుకు వస్తుంటాడు. అతని గొంతులోనే కాకుండా లుక్స్ పరంగానూ అక్కడక్కడా విజయ్‌లా కనిపిస్తాడు. మొత్తానికి మొదటి ప్రయత్నంగా చేసిన ఈ రాజు పాత్ర ఆనంద్‌కు కలిసి వచ్చేలా ఉంది. ఇక దొరసానిగా నటించిన శివాత్మికకు ఉన్నవి ఐదారు డైలాగ్‌లే అయినా.. లుక్స్‌తో ఆకట్టుకుంది. దొరసానిగా హావభావాలతోనే నటించి మెప్పించింది. ఈ చిత్రంలో ఇద్దరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. ‘దొరసాని’ని వీరిద్దరే నడిపించారు. దొర పాత్రలో వినయ్ వర్మ, నక్సలైట్‌గా కిషోర్, రాజు స్నేహితులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు. విశ్లేషణ పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి మధ్య ప్రేమ.. ఇలాంటి కథలు మన టాలీవుడ్లో ఎన్నోం చూశాం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో ప్రేమ అనేది లేకుండా మనవాళ్లు తెరకెక్కించిన దాఖాలాలు లేవు. ప్రేమే ఇతివృత్తంగా లేదంటే.. ప్రేమను ఓ భాగంగా గానీ చేసి కథ రాసి మనవాళ్లు సినిమాలను తీస్తుంటారు. అయితే ఎన్నోసార్లు చూసిన ప్రేమ కథే అయినా.. తెరకెక్కించడంలో కొత్తదనం చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. హీరోహీరోయిన్లు తమ నటనతో తెరపై ఫ్రెష్‌నెస్‌ను తీసుకొస్తే అందరూ ఆ కథలో లీనమౌతారు. దొరసాని కూడా అలాంటి కథే. ఈ కథకు తెలంగాణ గడీల నేపథ్యాన్ని, యాసను జోడించడమే దర్శకుడి మొదటి విజయం. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి.. స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లను తీసుకుంటే ఆ పాత్రకు సరైన న్యాయం జరిగేది కాదేమో అని అనిపించేలా ఆ పాత్రలను మలిచాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని కమర్షియల్ బాట పట్టించకుండా తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి.. ‘దొరసాని’ని ఓ కళాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే నిదానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందా అన్నది తెలియాలి. ఎక్కడా బోర్ కొట్టించకపోయినా.. తరువాతి సీన్ ఏంటో అన్నది ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతుంది. నిదానంగా సాగుతూ ఉండటంతో.. ప్రేక్షకులు కొంత అసహనానికి ఫీలయ్యే అవకాశం ఉంది. చివరగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించిందే అయినా.. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్. విహారి తన పాటలతో ఆకట్టుకోగా, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సన్నీ కూరపాటి తన కెమెరాతో అప్పటి తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ఎడిటర్ నవీన్ నూలి ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. చక్కటి ఫీల్ ఉన్నా.. నెమ్మదిగా సాగే ఈ ‘దొరసాని’ని ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్లస్ పాయింట్స్ నటీనటులు సంగీతం మైనస్ పాయింట్స్ స్లోనెరేషన్ ఊహకందేలా సాగే కథనం బండ కళ్యాణ్, సాక్షి వెబ్‌డెస్క్. -
‘మా ప్రేమను మీరూ ఫీల్ అవుతారు’
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధురా ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొరసాని. మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ని పొందింది. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న దొరసాని చిత్రం ఈ నెల 12న రిలీజ్‌కి రెడీ అవుతున్న సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. దొరసాని గురించి ఇది ఒక పిరియాడిక్ లవ్ స్టోరీ, రాజు, దొరసాని మద్య జరిగిన ప్రేమకథ. నిజజీవితానికి దగ్గరగా ఉండే ప్రేమకథ. కథలోని స్వచ్ఛత, నిజాయితీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. అన్నీ రియల్ లోకేషన్స్‌లో షూటింగ్ చేసాము. ఆ కథలోని ఆత్మను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసాం. దర్శకుడు మహేంద్ర ఎక్కడా ఫేక్ ఎమోషన్స్‌ని రానీయలేదు. కథను దర్శకుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆ ఆఫర్స్ ని సీరియస్ గా తీసుకోలేదు అన్నయ్య (విజయ్ దేవరకొండ) అర్జున్ రెడ్డి తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు సీరియస్‌గా తీసుకొలేదు. ఇండియాకి అన్నయ్య బిజినెస్‌ని సపోర్ట్ చేద్దామని వచ్చాను. యూఎస్‌కి వెళ్ళకు ముందు థియేటర్స్ చేసాను. యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందికానీ సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. ఆ టైంలో దర్శకుడు మహేంద్రను కలిశాక సినిమా మీద ఉన్న భయాలు పోయాయి. ఆయన 5 గంటలు కథ చెప్పాడు. ఆ కథను చెప్పిన తీరులోనే నాకు అర్దం అయ్యింది. ప్రతీ పాత్ర రియల్‌గా ఉంటుంది. కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట, కోదాడ దగ్గరలోని గడిలో ఎక్కువ రోజులు షూట్ చేసాము. అన్న టెన్షన్ పడ్డాడు సినిమా చూసే ముందు అన్న టెన్షన్ పడ్డాడు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా ఆనంద పడ్డాడు. సినిమా చూసిన తర్వాత నాకు అన్న ఇచ్చిన ఎనర్జీ కాన్ఫిడెన్స్‌ని పెంచింది. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యాము విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఒకడు ఉన్నాడు అని సినిమా సర్కిల్లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్‌లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్ చేసాము. ఆ క్యారెక్టర్స్‌కి ఫిట్ అవుతాము అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మేము ప్రాజెక్ట్‌లోకి వచ్చాము. శివాత్మికను అందుకే కలవలేదు ఈ కథలో రాజు, దేవకి పాత్రల మద్య ఎక్కువ చనువు ఉండదు. అందుకే మాకు వర్క్ షాప్‌లు విడివిడిగా నిర్వహించారు. షూటింగ్ లోకేషన్లో కూడా పాత్రల మద్య గ్యాప్‌ను మెయిన్ టైన్ చేసాము. మేము ప్రెండ్స్ అయితే ఆ ఫీల్ స్క్రీన్ మీదకు వస్తుందని ఆ జాగ్రత్త తీసుకున్నాము. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అన్న నాకు ధైర్యం ఇచ్చాడు అన్న చాలా స్ట్రగుల్స్ చూసాడు. కానీ అన్నకు వచ్చిన సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. టాలెంట్ ఉంటే సక్సెస్ అవ్వొచ్చు అనే నమ్మకం కలిగింది. కానీ నా ప్రతిభే నన్ను నిలబెడుతుందని నాకు తెలుసు. ఒక బ్రదర్‌గా తన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ స్టార్‌గా కాదు. అన్నతో పోలికలన్నీ సినిమా తర్వాత పోతాయి అని నమ్ముతున్నాను. నా పాత్ర హీరోలాగా ఉండదు ఇందులో నాపాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. రాజు చాలా సహాజంగా అనిపిస్తాడు. దొరసానిని ప్రేమించిన రాజు లాగా కనపడతాను. చేసిన పాత్రలు రియల్ లైఫ్ పాత్రలను ప్రతిబింబిస్తే చాలు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని నమ్ముతాను. అన్న మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చాయి ఇంట్లో అందరం ప్రాక్టికల్‌గా ఉంటాము. ఎమోషనల్ టాక్స్ తక్కువ. కానీ అన్న నాగురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే తమ్ముడ్ని చూసుకోవాలని అన్నకు ఉంటుంది. కానీ నా కష్టం నేను పడాలి, నా కథ నేను వెతుక్కొవాలి అని అన్న అనుకున్నాడు. స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్నలాగే ఫీల్ అయ్యాను. అన్నది పదేళ్ళ ప్రయాణం. అందులో చాలా చూసాడు. అన్నతో పాటు ఒక సారి ఆడిషన్స్‌కి వెళ్ళాను. సెలెక్ట్ అవలేదు ఆ రోజు అన్న ఎంత బాధ పడ్డాడో నేను దగ్గర నుండి చూసాను. నాన్న సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్కషన్స్ ఉండేవి. సినిమా ముందు వచ్చే కామెంట్స్ ని పట్టించుకోను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా నటన మీద వచ్చే విమర్శలను తీసుకుంటాను. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది. ఇది స్వచ్చమైన ప్రేమకథ ఇందులో మా ప్రేమకథ స్వచ్చంగా ఉంటుంది. యాక్షన్, యాంగర్ అలాంటివి ఏమీ ఉండవు. లిప్ లాక్‌లు అంత ఇపార్టెంట్ కావు. మా ప్రేమకథలో చాలా టర్న్స్ ఉంటాయి. మా ప్రేమను మీరు ఫీల్ అవుతారు. దర్శకుడు మహేంద్ర గ్రేట్ స్టోరీ టెల్లర్. మా కథలోని అన్ని క్యారెక్టర్స్ మీద అతనికి పూర్తి క్లారిటీ ఉంది. అతను మంచి దర్శకుడిగా నిలబడతాడు. నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు కథను ఓకే చేసాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అంతా కొత్త వాళ్లమే అయినా మాపై పూర్తి నమ్మకం ఉంచారు. మా బాద్యతను మరింత పెంచారు. ఫైనల్ ప్రొడక్ట్ చూసి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. -
‘దొరసాని’ కోసం ఎదురు చూశాను
ఆనంద్ దేవరకొండ, శివాత్మికలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’. ఈ చిత్రం జూలై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ఈ మూవీ ప్రత్యేకమైన ముద్రను వేసింది. కేవీఆర్ మహేంద్ర దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. దొరసాని ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియాతో హీరోయిన్ శివాత్మిక ముచ్చటించారు. ‘షూటింగ్స్ అనేవి నా ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితంలో బాగమయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కువగా షూటింగ్‌లోనే టైం స్పెండ్ చేసే దానిని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ ప్రైజ్ అవలేదు. కానీ దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందడి ఎక్కువవుతోంది. ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం నాలుగు గంటల సేపు కథ చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్‌ను నన్ను, ఆనంద్‌ని కలిపే చేసారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర కోసం నేను ఎదురు చూశాను. నేనే అని తెలిశాక చాలా ఎగ్జైట్ అయ్యాను’ అంటూ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూర్చారు. -
నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా రాబోతోన్న దొరసాని చిత్రం గురించి అందరికీ తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రబృందం.. పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ‘దొరసాని’పై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. విజయ్ దేవరకొండ తమ్మునిగా వెండితెరకు ఆనంద్ ఎంట్రీ ఇస్తుండగా.. రాజశేఖర్ కూతురు శివాత్మిక టాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదో స్వచ్చమైన ప్రేమ కథ అని టీజర్‌తో చెప్పేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో తన ప్రేమకు గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలను చూపించారు. తెలిసిన కథే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సంగీతం, డైలాగ్‌లు, హీరోహీరోయిన్ల నటన ఈ చిత్రానికి పాజిటివ్‌గా మారనుంది. ముఖ్యంగా మాటలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ టీజర్‌లోని.. ‘ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే’., ‘నా ప్రేమ కూడా ఓ ఉద్యమమే’లాంటి డైలాగ్‌లు.. ‘కదిలించావు నన్నే గుండెను మీటి.. కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి’, ‘దొరసాని.. నిన్ను చూడని నిశిరాతిరి నేనొక రాలిన నక్షత్రం.. నీ ఊసులే లేని మలిసంధ్యలో నేనో కరిగిన మేఘం’ లాంటి గోడపై రాసిన కొటేషన్స్ ఈ ప్రేమకథలోని లోతును తెలిపేలా ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించారు. యష్ రంగినేని, మధుర శ్రీదర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని కెవీఆర్ మహేంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘దొరసాని’ రెండో సినిమా రెడీ!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హీరోయిన్ శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ తో కలిసి దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు శివాత్మిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తొలి సినిమా దొరసాని రిలీజ్ కాకుండానే శివాత్మిక మరో మూవీకి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలో రాజ్‌దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్, రెండో సినిమాలో శివాత్మిక హీరోయిన్గా నటించనున్నారట. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాను మేఘాంశ్ తొలి చిత్ర నిర్మాత ఎమ్ఎల్వీ సత్యనారాయణ నిర్మించనున్నారు. -
నింగిలోన పాలపుంత.. ‘దొరసాని’
అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించికున్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంతో జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా విడుదలైన దొరసాని టీజర్.. సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. గడీలో ఉన్న దొరసానికి, పేద కుటుంబంలో పుట్టిన రాజుకు మధ్య జరిగే కథాంశంగా ‘దొరసాని’ని తెరకెక్కించారు. ఈ కథకు తెలంగాణ నేపథ్యాన్ని తీసుకోవడంతో తెరపై కొత్త అనుభూతి కలిగేలా ఉంది. ఈ మూవీ నుంచి నింగిలోన పాలపుంత అనే పాటను రేపు (జూన్ 10) ఉదయం 9.10గంటలకు విడుదల చేయనున్నారు. Experience the world of Raju & Dorasaani #NingilonaPaalapuntha lyrical song, Tomorrow @ 9:10AM@ananddeverkonda @ShivathmikaR @madhurasreedhar @YashBigBen @SureshProdns @kvrmahendra @DheeMogilineni @vrsiddareddy @prashanthvihari @GskMedia_PR@anuragkulkarni_ @MadhuraAudio pic.twitter.com/Bgj5yBGkeQ — BARaju (@baraju_SuperHit) June 9, 2019 -
వైరల్ అవుతున్న ‘దొరసాని’ టీజర్
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక జంటగా రాబోతోన్న దొరసాని టీజర్ గురువారం విడుదలైంది. పాత కథే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ప్రేమ కథను గడీల కాలంలోకి తీసుకెళ్లి తెలంగాణ ఫ్లేవర్‌ను కలపడంతో ఈ టీజర్‌కు కొత్త లుక్ వచ్చింది. దీనికి తోడు ఆనంద్, శివాత్మిక తమ పాత్రల్లో కనిపించిన తీరు.. అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ టీజర్ 1మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. -
దొరసాని గుర్తుండిపోయే ప్రేమకథ
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘దొరసాని’. ఇంకో విశేషం రాజశేఖర్–జీవితా దంపతుల కుమార్తె శివాత్మిక ఇందులో కథానాయికగా నటించడం. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకు సహ–నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన డి. సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘టీజర్లో విజువల్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఈ సినిమా కథ రెడీ అవుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఒక అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ అందరూ బాగా శ్రమించారు. హీరో హీరోయిన్ల పాత్రలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. దొరసాని గుర్తుండిపోయే కథ అవుతుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘నాలుగేళ్ల క్రితం మొదలైన ‘దొరసాని’తో నా జర్నీ ఇంతవరకు రావడానికి కారణం సురేష్‌బాబు, ‘మధుర’ శ్రీధర్‌గార్లు. పదికాలాలు గుర్తుండిపోయే ప్రేమకథగా దొరసాని నిలిచిపోతుంది’’ అన్నారు మహేంద్ర. ప్రముఖ దర్శకులు, మార్గదర్శకులు డి. రామానాయుడు జయంతి రోజున దొరసాని టీజర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. మహేంద్ర క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. -
‘కాదు.. మీరు నా దొరసాని’
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో యాంగ్రీస్టార్ రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం కాబోతోంది. ‘దొరసాని’ అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచీ ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తెలంగాణలోని ఒకప్పటి గడీల కాలంలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లో.. మీ పేరు అని శివాత్మిక అని అడిగితే ‘రాజు’ అని చెప్పి.. ‘మీరు దొరసాని’ అని మన హీరో అనడం.. వెంటనే శివాత్మిక ‘కాదు దేవికా’ అని అనడం.. వెంటనే ‘కాదు మీరు నా దొరసాని’ అని ఆనంద్ ఆనడం ఆకట్టుకుంది. ఆనంద్ డైలాగ్ డెలివరీలో కూడా విజయ్ మాడ్యులేషన్ కనబడటం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందించారు. -
ఓ దొరసాని ప్రేమకథ
తోట రాముడు, కోటలో మహారాణి. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనే కథాంశంతో ఎన్నో ప్రేమకథలొచ్చాయి, మన మనసుని గెలుచుకున్నాయి. తాజాగా పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’. రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘80వ దశకంలో తెలంగాణలో జరిగిన కథగా ఈ చిత్రం రూపొందింది. జూన్ 6న టీజర్ రిలీజ్ చేస్తాం. జూలైలో చిత్రం రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
‘దొరసాని’ లుక్ ఇదే!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దొరసాని పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో ఆనంద్‌తో పాటు హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో హీరోయిన్ల లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఎమోషనల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను జూన్ 6న రిలీజ్ చేయనున్నారు. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకే సినిమాతో ఇద్దరు స్టార్ వారసులు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. -
‘దొరసాని’ రిలీజ్ డేట్ ఫిక్స్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసింది. దొరసాని పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం అవుతోంది. తెలంగాణ నేపథ్యంలో ఎమోషనల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు. ఒకే సినిమాతో ఇద్దరు స్టార్ వారసులు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.