special teams
-
వైఎస్ జగన్ ఆదేశాలు.. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ప్రత్యేక బృందాలు
-
Nagaraju Incident in Palnadu: రంగంలోకి 6 స్పెషల్ టీంలు..
-
తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట
సాక్షి, తిరుమల: ఇటీవల తిరుమల నడకమార్గంలో బాలిక లక్షిత.. చిరుత దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ భక్తుల భద్రతపై అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తిరుమలలో చిరుతల వేట కొనసాగుతోంది. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. తిరుమలకు నడకదారిలో జంతువుల సంచారం కోసం 500 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటుచేస్తోంది. అలాగే, వివిధ ప్రాంతాల్లో చిరుతల కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మోకాళ్ల మెట్టు, 36వ మలుపు వద్ద బోన్లును అమర్చారు. అంతేకాకుండా నడకదారిలో అదనపు ఎల్ఈడీ లైటను అధికారులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం ఎన్ని గంటలంటే? -
రెండేళ్ల చిన్నారి అదృశ్యం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తల్లి ఒడిలో ఆడుకునే రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన రామయ్య, పాపమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరు బిడ్డలను వెంటబెట్టుకుని రోడ్ల వెంబడి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి సెకండ్ షో సినిమా చూసి కుక్కలగుంట వద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి మెట్ల వద్ద పిల్లలతో కలిసి నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున లేచి చూసే సరికి రెండేళ్ల మూగ బాలిక పాపమ్మ కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో స్థానికుల సహకారంతో చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి సీఐ అన్వర్‌బాషా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నాలుగు ప్రత్యేక టీమ్‌లు, మరో రెండు టెక్నికల్ టీమ్‌లను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. -
మామిడి మార్కెట్లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: ‘మధురఫలం.. చైనా హాలాహలం’ శీర్షిక న మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగిం చింది. సీజనల్ ఫ్రూట్స్‌ను 24 గంటల్లో మగ్గపెట్టి సొమ్ము చేసుకునే లక్ష్యంతో కొంతమంది వ్యాపారులు నిషేధిత ఎథెఫాన్ పౌడర్‌ను మోతాదు కు మించి వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పురుగుమందుల మాటున చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎథెఫాన్ పౌడర్‌ను ఇష్టానుసారం వినియోగిస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపింది. ఆహార భద్రతా విభాగం, ఉద్యానశాఖ కమిషనర్లు కాటమనేని భాస్కర్, డాక్టర్ ఎస్. ఎస్.శ్రీధర్ ఆదేశాల మేరకు ఉద్యాన, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో కలిసి ఆహార భద్రతా విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదేశాలతో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు నేతృత్వంలో ఉద్యానశాఖ ఏడీ దయాకరబాబు, ఫుడ్ సేఫ్టీ అధికారులు శేఖరరెడ్డి, గోపాలకృష్ణ, శ్రీకాంత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మ్యాంగో మార్కెట్లను విస్తృతంగా తనిఖీ చేశా రు. రాష్ట్రంలోని ప్రధాన మ్యాంగో మార్కెట్లలో ఒకటైన నున్న మ్యాంగో మార్కెట్‌తో పాటు జిల్లాలోని ఇతర మార్కెట్లలో దాడులు నిర్వహించారు. దాదాపు అన్ని మార్కెట్లలోను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు విరుద్ధంగా ఎథెఫాన్‌ను విచ్చలవిడిగా విని యోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ మార్కెట్లలో శాంపి ల్స్ సేకరించి కేసులు పెట్టారు. ఈదరలోని కేజీఎన్ మ్యాంగో కంపెనీ, చీమలపాడులోని రసాలు మ్యాంగో కంపెనీ, చీమలగూడెంలో శ్రీరామాంజనేయ ఫ్రూట్ మార్కెట్, ఎ.కొండూరులో కృష్ణ ఆగ్రోస్ (మ్యాంగో యార్డు), నున్న మార్కెట్లోని యశస్వినీప్రసన్నలక్ష్మి ఫ్రూట్ కంపెనీ, కోటేశ్వరరావు ఎస్బీఎఫ్ కంపెనీలపై 9 కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఈ దాడులు కొనసాగుతాయి. ఈరోజు కృష్ణాజిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తనిఖీలు మ్యాంగో సీజన్‌కు పరిమితం కాదు. బొప్పాయి, బత్తాయి, జామ, అరటి తదితర పండ్లను మాగబెట్టే విషయంలో ఎథెఫాన్ వంటి విషపూరిత రసాయనాలు వినియోగిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. – స్వరూప్, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ -
ఎలాంటి భయాందోళన చెందొద్దు: సీఎం జగన్
-
ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, ఏలూరు: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రస్తుత పరిస్థితులను, బాధితుల వివరాలను సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి, బాధితులకు బాసటగా నిలిచి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో వైద్యబృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్ అభినందించారు. రాత్రంతా మేల్కొని గవర్నమెంట్ ఆస్పత్రిలో బాధితులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నాని పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: (ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్) కాగా, ఏలూరులో వివిధ లక్షణాలతో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. వ్యాధి లక్షణాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏలూరుకు వైద్యబృందాలను పంపిస్తున్నాం. ఎలాంటి భయాందోళన చెందొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులయిన వైద్య పరీక్షలు చేయిద్దాం. అవసరమయితే మెరుగైన వైద్యసదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రత్యేక వైద్యబృందాలు ఈ ఉదయం ఏలూరుకు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని సీఎం వైఎస్ జగన్ మంత్రి ఆళ్లనానికి భరోసా ఇచ్చారు. చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) -
బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్
సాక్షి, విజయవాడ: నగరంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఘటన మూలాలపై ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. నిందితులను స్పాట్‌కు తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కేసును కొలిక్కి తెచ్చేందుకు ఆరు ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. కేసు దర్యాప్తు అత్యంత గోప్యంగా సాగుతోంది. ఇప్పటికే సందీప్, పండు గ్యాంగ్‌లకు చెందిన 24 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన స్ట్రీట్ ఫైటర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (యువతి కోసం గుంటూరులో గ్యాంగ్ వార్) గుంటూరు ఆసుపత్రి నుంచి పండు డిశ్చార్జ్ కాగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. బెజవాడ రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రౌడీ దర్బార్ ల ద్వారా నేరగాళ్లలో పరివర్తనకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీరు మార్చుకోకుంటే నగర బహిష్కరణ తప్పదని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ఆయుధాలతో కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. (‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’) -
గ్యాంగ్‌వార్: పోలీసుల అదుపులో రౌడీషీటర్లు..
సాక్షి, విజయవాడ: నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ మూలాలపై పోలీసులు ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. స్టీట్‌ఫైట్‌లో పాల్గొన్న వారి నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లతో పాటు, మరో పదమూడు మందిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సందీప్ గ్యాంగ్ వాడిన ఆయుధాలు స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ గ్యాంగ్ వివరాలను సీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించనున్నారు. (ఇప్పుడు దృష్టంతా కాల్‌డేటా పైనే!) పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డీల్ కుదిర్చిన నాగబాబులను పోలీసులు విచారిస్తున్నారు. గ్యాంగ్‌వార్ ఘటనకు సంబంధించి కాల్‌డేటా ఆధారంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. (గ్యాంగ్‌వార్ కేసు కొలిక్కి!) -
గ్యాంగ్‌వార్: వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
గ్యాంగ్ వార్: ఇప్పుడు దృష్టంతా ఆ సమాచారం పైనే!
సాక్షి, అమరావతి: విజయవాడలోని పటమట తోటవారి వీధిలో ఇటీవల జరిగిన గ్యాంగ్‌వార్ లింక్‌లపై పోలీసులు ముమ్మరంగా శోధిస్తున్నారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలోని 6 టీమ్‌లు ప్రత్యేకంగా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. గ్యాంగ్‌వార్ ఘటనకు సంబంధించి కాల్‌డేటా ఆధారంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. తొలుత మాజీ రౌడీషీటర్ తోట సందీప్ దగ్గర కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు అనుచరుడుగా ఉండేవాడు. సందీప్ చేసే సెటిల్మెంట్లలో పండు చురుగ్గా పాల్గొనేవాడని పోలీసుల విచారణలో తేలింది. చదవండి: గ్యాంగ్‌వార్‌లో వారి ప్రమేయం లేదు ఇలా చాన్నాళ్లపాటు వీరిద్దరు కలిసి సెటిల్మెంట్లు చేశారు. వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో సందీప్ బ్యాచ్ నుంచి పండు బయటకొచ్చి వేరే గ్రూపు పెట్టాడు. పండుతో సఖ్యతగా ఉండే సందీప్ బ్యాచ్‌లోని కొంతమంది అతని వెంట వచ్చారు. సందీప్‌తోనే శతృత్వా న్ని పెంచుకున్న పండు ఆయన గ్యాంగ్‌లో ఇతర సభ్యులతో మాత్రం విరోధం పెట్టుకోలేదు. అవసరమైనప్పుడు ఇరు గ్యాంగ్‌ల సభ్యులు కలుసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవ డం వంటివి జరిగాయని పోలీసులు ధృవీకరిస్తున్నారు. సందీప్, పండులు గ్యాంగ్‌వార్‌కు కొన్ని రోజుల కిందట మంగళగిరికి చెందిన రౌడీషీటర్లు కిరణ్‌కుమార్, రఘునాథ్ అలియాస్ ఏవీఎస్లతోపాటు మరికొందరు యువకులతో కలిసి తాడేపల్లి మండలం కుంచినపల్లి, మంగళగిరి మండలం కురుగల్లు గ్రామాలకు వెళ్లి సెటిల్మెంట్లలో పాల్గొన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! ఈ వ్యవహరంపై పూర్తిస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సందీప్‌పై దాడిచేసిన కేసులో నిందితుడైన రేపల్లె ప్రశాంత్ గుంటూరులోని ఓ ప్రైవేటు యూనివర్సీటిలో చదువుతున్నాడు. ఇతను ఆ యూనివర్సిటీలో జరిగే వ్యవహారాలను పండు దృష్టికి తీసుకురావడం, ఆ తర్వాత మంగళగిరి బ్యాచ్‌ను రంగంలోకి దించడంలో కీలకపాత్ర పోషించేవాడని పోలీసుల వద్ద సమాచారం ఉంది. మొత్తం మీద సందీప్, పండు వ్యవహారాలపై అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ గ్రూప్ సభ్యుల కాల్‌డేటాను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ కాల్‌డేటా ఆధారంగా ఈ గ్రూపులతో ఎవరెవరికి లింక్‌లు ఉన్నాయనే దానిపైనా దృష్టి సారించారు. వీటి ఆధారంగా దర్యాప్తు మరింత సమగ్రంగా జరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. చదవండి: గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు -
కరోనా జాడ.. పల్లెల్లో జల్లెడ
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా’ పంజా విసురుతోంది. దీంతో అ ప్రమత్తమైన ప్రభుత్వం గ్రామాలను జల్లెడ పడుతోంది. అందుకోసం ప్రతీ గ్రామంలో ‘కరోనా’అనుమానిత లక్షణాలున్న వారికోసం ఇ ల్లిళ్లూ తిరుగుతున్నాయి. అందుకోసం 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 8 వేల మంది ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, గ్రామాని కో పోలీసు కానిస్టేబుల్‌తో ప్ర త్యేక బృందాలను నియమించింది. వారికి గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు సహకరిస్తున్నారు. రెండ్రోజులుగా ఈ ప్ర క్రియ నడుస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వందలాది మంది అ నుమానితులతో జాబితా త యారు చేసినట్లు సమాచారం. ఆయా బృందాల వద్ద ఉన్న ట్యాబ్‌లలో తెలంగాణ కోవిడ్ పేరుతో ఉన్న యాప్‌ను ఇన్‌స్టా ల్ చేసుకున్నారు. వాస్తవంగా ఇప్పటికే ఏఎన్ఎం ల వద్ద ట్యాబ్‌లున్నాయి. వారు గ్రామాల్లో వివిధ వ్యాధులపై జాబితా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్యాబ్‌లను ఇప్పుడు దీనికి విని యోగిస్తున్నారు. దీంతో కరోనా అనుమానితుల జాబితా తయారు చేయడం సులువైంది. విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపు.. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం నెల రోజుల నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి 77,045 మంది మన విమానాశ్రయం ద్వారా తెలంగాణలోకి ప్రవేశించారు. ఇతర రాష్ట్రాల్లో దిగి బస్సు లు, రైళ్ల ద్వారా వచ్చినవారు మరో 10 వేల మం దికి పైనే ఉంటారని అంచనా. ఆ ప్రకారం దాదా పు లక్ష మంది ఈ నెలలో విదేశాల నుంచి వచ్చి నట్టు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగినవారిలో 77,045 మందికి థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అందులో 17,283 మం దిని అనుమానిత లక్షణాలున్న వారిగా గుర్తించా రు. వారిలో 764 మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. అందులో 39 మందికి పైగా పాజిటివ్ వచ్చిన ట్లు నిర్ధారించారు. మరికొందరి ఫ లితాలు రావాల్సి ఉంది. ఇక జన సమూహంలో కలిసిపోయిన వేల మంది వివరాలు తెలియాల్సి ఉంది. ఈ పనిలోనే గ్రామస్థాయి బృందాలు నిమగ్నమయ్యాయిు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన 39 మందిలో 34 మంది విదేశాల్లోనుంచి వైరస్ ను పట్టుకొచ్చినవారే. వారి ద్వారా మరో ఐదుగురు స్థానికులకు సోకింది. ప్రధానంగా ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది మత ప్రచారక బృందానికి కోవిడ్ పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ ప్రత్యేక బృందాలు విదేశాల నుంచి వచ్చిన వారెవరు అన్నదానిపైనే ప్రధానంగా దష్టిసారించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండ్రోజు ల్లో 1,500 మందిని గుర్తించినట్లు చెబుతున్నారు. కాగా, పాజిటివ్ లక్షణాలున్న వారి ప్రాంతాలు, జిల్లాలు, ఏరియాల్లో పెద్ద ఎత్తున సర్వైలెన్స్ బృం దాలు తనిఖీలు చేస్తున్నాయి. ప్రధానంగా అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో పాజిటివ్ కేసులున్న వారు ఎక్కడెక్కడ తిరిగారో గుర్తిస్తున్నారు. -
రేపటి నుంచి ఆపరేషన్ స్మైల్
సాక్షి, హైదరాబాద్: వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న చిట్టి చేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగితేవాలన్న సంకల్పంతో చేపడుతోన్న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలను ఇస్తోంది. ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ పేరిట పోలీసులు చేపడుతున్న దాడులు వేలాది మంది చిన్నారులకు విముక్తి కలిగిస్తున్నాయి. ఈసారి దాడుల్లో గుర్తించిన పిల్లల్లో దళిత, గిరిజనులు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టనున్నారు. 2020 మొత్తం వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల పోలీసులకు సూచించారు. చిన్నారుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు.. రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, బాలికల వివరాలను సేకరించి వారి ఫొటోలతో ఆల్బమ్‌ను రూపొందిస్తారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న జంక్షన్లు, చౌరస్తాలను తనిఖీ చేస్తాయి. దీనికిగాను ప్రతీ సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ టీమ్‌లో ఒక మహిళా సిబ్బంది కూడా ఉంటారు. -
డేటా చోరీపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలు
-
డేటా చోరీపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ వేగంగా పావులు కదుపుతోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టడానికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు సాక్షుల, నిందితుల విచారణ చేపడుతూనే మరోవైపు యూజర్ల సమాచారం తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సిట్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాట చేసింది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) సైబర్ క్రైమ్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం.. ఈ కేసుకు సంబంధించి సైబర్ నిపుణల సలహాలతో డేటా అనాలసిస్, డేటా రిట్రైవ్ చేపట్టనుంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులను, నిందితులను విచారించడానికి సీనియర్ అధికారితో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరో టీమ్ ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతో సంప్రదింపులు జరపనుంది. మిగిలిన రెండు ప్రత్యేక బృందాలు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు చేపట్టనున్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన యూజర్ల సమచారం ఇవ్వాల్సిందిగా అమెజాన్, గూగుల్‌ని కోరింది. డేటా చోరీకి సంబంధించి యూఐడీఎఐ, ఎన్నికల కమీషన్లకు లేఖ ద్వారా సిట్ సమాచారం అందజేయనుంది.(ఇదీ జరుగుతోంది!) -
కేరళకు ఏపీ బృందాలు
సాక్షి, అమరావతి: కేరళలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. శనివారం ఈ బృందాలు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరాయి. 66 మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్డీఆర్ఎఫ్), జిల్లా అగ్నిమాపక అధికారి, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి, అయిదుగురు స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, బోట్ మెకానిక్, ఈత శిక్షకుడు, 12 మోటార్ బోట్లు, ఇతర రక్షణ పరికరాలు తదితరాలు ఈ బృందంలో ఉన్నాయి. -
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి దారుణ హత్య
సాక్షి, చెన్నై: వావి వరుసలు మరచిన ఓ యువకుడు, కుటుంబ గౌరవానికి, బంధాలకు కలంకం తెచ్చే రీతిలో కిరాతకుడయ్యాడు. వరుసకు చిన్నాన్న కుమార్తెను ప్రేమించాడు. తనకు దక్కని ఆ అమ్మాయి మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ప్రేమోన్మాదిగా మారాడు. బుధవారం నిశ్చితార్ధానికి సిద్ధం అవుతున్న ఆ యువతిని మంగళవారం రాత్రి దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా వన్‌సైడ్ ప్రేమకు బలి అవుతున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్నారు. అయితే చెల్లెలు వరుస అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తూ, చివరకు ఆమెను హతమార్చడం తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలం రేపింది. వన్‌సైడ్ లవ్.. తిరుచ్చి నెం.1 టోల్ గేట్ సమీపంలోని కీరమంగలంకు చెందిన శివ సుబ్రమణ్యన్‌కు హేమలత(27) కుమార్తె ఉంది. పట్టభద్రురాలైన హేమలత తిల్లె నగర్‌లోని ఓ మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలో పనిచేస్తుంది. శివ సుబ్రమణ్యన్‌కు వరుసకు అన్న అయిన జ్ఞాన సంబంధం కుమారుడు సత్యకుమార్(30) ప్రతిరోజూ హేమలతను తన బైక్‌లో ఆ సంస్థ వద్ద డ్రాప్ చేసి, ఇంటికి తీసుకొస్తుంటాడు. వారి కుటుంబాల మధ్య హఠాత్తుగా విభేదాలు తలెత్తాయి. పక్క పక్క ఇళ్లలో ఉన్నా, మాటలు, రాకపోకలు కరువయ్యాయి. ఇందుకు సత్యకుమార్ కారణమని ఆ పరిసర వాసులు చెప్పుకునే వారు. ఆగిన నిశ్చితార్థం.. ఈ నేపథ్యంలో హేమలతకు బుధవారం తిరుచ్చికి చెందని ఓ యువకుడితో వివాహ నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లోకి వెళ్లిన సత్యకుమార్ తన చేతిలోని వేట కత్తితో శివసుబ్రమణ్యంను నరికాడు. అడ్డొచ్చిన అతని సోదరుడు వైరవేల్ను సైతం కత్తితో దాడి చేశాడు. వీరి కేకలు విని హేమలత బయటకు పరుగెత్తికు వచ్చింది. ఆ ప్రేమోన్మాది కత్తితో హేమలత గొంతు మీద నరికాడు. ఈ సంఘటన నుంచి తేరుకున్న ఇతర కుటుంబీకులు సత్యకుమార్‌ను అడ్డుకునే యత్నం చేయడంతో ఉడాయించాడు. గొంతు తెగడంతో హేమలతను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న సమయపురం సీఐ జ్ఞానవేల్, టోల్ గేట్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందతుడు సత్యకుమార్ కోసం గాలింపు చేపట్టారు. విచారణలో సత్యకుమార్ వన్‌సైడ్ లవ్, ప్రేమోన్మాదంతో సాగించిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాదిగా మారాడు.. ఒక్కరోజు సత్యకుమార్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానని హేమలత దృష్టికి తెచ్చాడు. తనకు అన్నయ్య అన్న విషయాన్ని మరచినట్టున్నావని అతడ్ని ఆమె మందలించింది. ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించి అతడికి దూరంగా ఉండడం మొదలెట్టింది. అయితే, రోజు రోజుకు సత్యకుమార్ వేధింపులు పెరగడంతో కొన్ని నెలల క్రితం ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది. దీతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. హేమలతకు సత్యకుమార్ నుంచి వేధింపులు పెరగడంతో ఆమెకు వివాహ ఏర్పాట్లు చేశారు. బుధవారం నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న సత్యకుమార్ ఉన్మాదిగా మారాడు. మంగళవారం రాత్రి సత్యకుమార్ ఆగ్రహాంతో హేమలత కుటుంబాన్నే మట్టుబెట్టే యత్నం చేశాడు. అంతేకాక ఆమె గొంతు నరికి పారిపోయినట్లు విచారణలో వెలుగు చూసింది. అజ్ఞాతంలో ఉన్న సత్యకుమార్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
90 శాతం మూతే!
► అధికారులు ఒత్తిళ్లకు లొంగకుంటేనే.. ► క్వారీల తనిఖీల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు ► నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రత్యేక బృందాలు ► నేటితో ముగియనున్న బృందాల తనిఖీలు సాక్షి, అమరావతి బ్యూరో : క్వారీల్లో అడుగడుగునా అక్రమాలే. యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండానే క్వారీలు నడుపుతున్నారు. కలెక్టర్ నియమించిన ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. ఫిరంగిపురం సమీపంలోని క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు బండరాళ్ల కింద సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన క్వారీ వద్ద నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఎలాంటి భద్రతా చర్యలూ తీసుకోలేదని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. జిల్లాలోని 224 రోడ్డు మెటల్ క్వారీల తనిఖీ కోసం కలెక్టర్ కోన శశిధర్ నియమించిన ఆరు ప్రత్యేక బృందాలు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. శుక్రవారంతో తనిఖీలు ముగియనున్నాయి. అనుమతులు లేకుండా... ఆరు ప్రత్యేక బృందాలు ఇప్పటికి 80 శాతానికి పైగా రోడ్డు మెటల్ క్వారీలను తనిఖీ చేశాయి. ఇందులో ఏ ఒక్కటీ నిబంధనల ప్రకారం నడవటం లేదని అధికారులు తేల్చినట్లు సమాచారం. ప్రత్యేక బృందం తనిఖీలలో ప్రధానంగా క్వారీలను పర్యావరణ అనుమతులు లేనట్లు తెలిసింది. బ్టాస్టింగ్ అనుమతులు, మైన్ లీజు, జనావాసాలకు దగ్గరగానే బ్లాస్టింగ్ చేయడం, లీజు ప్రాంతం దాటి మైనింగ్ చేయడం, కార్మికులకు సంబంధించి ఎటువంటి భద్రతా ప్రమాణాలనూ క్వారీ యజమానులు పాటించకపోవడాన్ని నిర్ధారించారు. క్వారీల సమీపంలో మొక్కల పెంపకం, కార్మిక చట్టాల మేరకు కార్మికులకు అందుతున్న కూలి.. ఇలా 37 అం«శాలను పరిశీలిస్తున్నారు. మొక్కుబడిగా తనిఖీలు.. ఈ బృందాల్లో కొంత మంది అధికారులు క్వారీలను నామమాత్రంగా చూసి మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పరిశీలించిన ప్రతి క్వారీకి సంబంధించి, అక్కడ ఉన్న లోపాలపై అధికారులు నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా క్వారీలను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. తనిఖీ బృందాలు వస్తున్నాయనే సమాచారంతో క్వారీ యజమానులు ముందుగానే క్వారీల్లో పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ తావు లేకుండా కఠినంగా చర్యలు తీసుకొంటే 90 శాతానికి పైగా క్వారీలు మూతపడక తప్పదని ప్రత్యేక బృందాలలోని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాల తనిఖీల నివేదిక ఆధారంగా కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకొంటారనేది వేచిచూడాలి. ఇప్పటికే కొంత మంది క్వారీ యజమానులు అధికార పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, గండం నుంచి గట్టెక్కించాలని కోరినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. çప్రమాద సంఘటనలు జరిగినప్పుడు అధికారులు ఇలాంటి హడావుడి చేయడం మామూలేనని, కొంతకాలం గడిస్తే మళ్లీ యథాతథమే అవుతుందని వారికి నేతలు భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది. -
పరారైన వేటగాళ్లు ఒంగోలులో..
♦ ఓ భూస్వామి ఇంట ఆశ్రయం ♦ ఏడుగురికి ఇద్దరు సహాయకులు ♦ ముగ్గురి లొంగుబాటు, పరారీలో మిగిలిన వారు ♦ కరీంనగర్, హైదరాబాద్‌లో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు సాక్షి, భూపాలపల్లి: రోజుకో మలుపు తిరుగుతున్న దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితులు ఏపీలో ఓ భూస్వామి ఇంట ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు లొంగిపోగా మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో దుప్పులను వేటా డిన కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై పోలీసు శాఖ అభియోగం మోపింది. అయితే, కేసులో కీలక పాత్ర పోషించిన ఏ 4 నింది తుడు అక్బర్‌ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నా డు. ఘటన జరిగిన తర్వాత ఐదు రోజుల పాటు అతను మహదేవపూర్‌లో స్వేచ్ఛగా తిరిగాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో గత శుక్రవారం రాత్రి నలువాల సత్యనారాయణ, అస్రార్ఖాన్, ఖలీముల్లా ఖాన్లు లొంగిపోయారు. వీరి లొంగుబాటు వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించి అక్బర్ ఖాన్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహదేవపూర్ ప్రాంతంలో దగ్గరి సంబంధా లున్న ఒంగోలుకు చెందిన భూస్వామి వద్దకు వీరు చేరుకున్నట్లు తెలుస్తోంది. మూడు బృందాలు దుప్పులను వేటాడి చంపిన నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఫజల్ మహ్మద్ ఖాన్ కోసం ఓ బృందం హైదరాబాద్ లో గాలిస్తుండగా గోదావరిఖని, సెంటినరీ కాలనీకి చెందిన నిందితుల కోసం మరో బృం దాన్ని ఏర్పాటు చేశారు. మున్నా అనే నింది తుడి కోసం ఇంకో బృందం గాలిస్తోంది. పోలీసు రికార్డుల్లో ఏ 1 నిందితుడు సత్యనారాయణతో పాటు అతని బంధువు వేటలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. అదే నంబరుతో అనేక ఇళ్లు.. సంఘటనస్థలంలో లభించిన ఫజల్ మహ్మద్‌ఖాన్ ఆధార్‌కార్డు ప్రకారం అతని అడ్రసు 10–3–292, విజయనగర్ కాలనీ, హైదరాబాద్‌గా ఉంది. ఈ కాలనీలో ఓ పాఠ శాల పక్కన ఇదే నంబరుతో పదుల సంఖ్యలో ఇళ్లు ఉండటం గమనార్హం. పోలీసులు ఇందు లో ఏ ఇంటికి వెళ్లారు... అసలు ఫజల్ మహ్మద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది తేలడం లేదు. చౌటుప్పల్‌లో జింకపిల్ల మార్చి 23న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామం దగ్గర హైవే టోల్గేట్ సమీప పొలాల్లో గాయంతో తిరుగుతున్న జింకపిల్లను రైతులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగిం చారు. 25న జింకపిల్ల చనిపోయింది. మహదేవపూర్ అడవుల్లో మార్చి 19న ఐదు వన్యప్రాణులను చంపగా ఇందులో రెండు దుప్పుల కళేబరాలను అటవీ శాఖ అధికా రులు పట్టుకున్నారు. మిగిలిన వన్యప్రాణు లతో ఏటూరునాగారం మీదుగా హైదరాబా ద్‌కు వేటగాళ్లు పారిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెళ్లే క్రమంలో వీరు జింకపిల్లను మార్గమధ్యలో విడిచి వెళ్లారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో అమ్జద్ అరెస్ట్? దుప్పుల వేటలో పాల్గొన్నాడనే అనుమానం తో మహదేవపూర్‌కు చెందిన అమ్జద్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అమ్జద్ కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఏసీ మెకానిక్ గా జీవనం సాగిస్తున్నాడు. అక్బర్ఖాన్కు సన్నిహితుడిగా పేరున్న అమ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వేటగాళ్లను త్వరలోనే పట్టుకుంటాం అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో రాజశేఖర్ మహదేవపూర్: దుప్పులవేట సంఘటనలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి వేటగాళ్లం దరినీ పట్టుకుంటామని అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో రాజశేఖర్ చెప్పారు. మహదేవపూర్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. వేటగాళ్లు దుప్పులను వేటాడిన పంకెన అడవుల్లోని సంఘ టన స్థలాన్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించా మని, వేటగాళ్ల ముఠాలో చాలామంది ఉన్న ట్లుగా ప్రజలు సమాచారమిచ్చారని చెప్పా రు. ప్రధాన నిందితుడు అక్బర్‌ఖాన్‌ను అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. వేటగాళ్లలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోందని, హైదరాబాద్, కరీంనగర్, సెంటినరీకాలనీ, మహదేవపూర్, సూరారం గ్రామాలకు చెం దిన వారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు విచారణలో తెలుస్తోందని పేర్కొ న్నారు. మహదేవపూర్‌లోని తెనుగువాడలో నెన్నెల గట్టయ్య బంధువు ఇంట్లో గట్టయ్య తో పాటు మున్నా షల్టర్ తీసుకున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించామని, తమ రాకను ముందుగానే గమనించిన ఇంటి యజమాని ఆనవాళ్లను మాయం చేసి నట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. గట్టయ్య ఇంటివద్ద విచారణ జరుపుతున్న సమ యంలో ఆయన భార్యకు వచ్చిన ఫోన్‌కాల్ డాటాను సేకరించేందుకు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలోని కారు గట్టయ్య ఇంటి సమీపంలో లభించడంతో దానినీ అధీనంలోకి తీసుకున్నట్లు రాజశేఖర్ వివరించారు. వేటగాళ్లకు సహకరిస్తున్న ఇంటి దొంగలపై దృష్టిసారిస్తామని హెచ్చరించారు. -
అక్కడే ఎందుకో?
హైవేల్లోని ప్రమాద స్థలాల పరిశీలన రెండు అధికారుల బృందాల సర్వే రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఒకే ప్రాంతంలో పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రాణనష్టం జరుగుతుంటే.. అక్కడ ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని వాటి నివారణకు చర్యలు చేపట్టాలి్సందే. ఈ కోణంలోనే జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశాలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపే దిశగా ఓ సమగ్ర సర్వే జరిగింది. రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఈ సర్వే ఈ నెల 11 నుంచి మొదలై ఆదివారంతో ముగిసింది. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురం టౌన్ : జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వారం రోజులుగా అధికారుల రెండు సర్వే బృందాలు విస్తృతంగా పర్యటించి ప్రమాదాల ప్రదేశాలను, కారణాలను, పరిష్కారాలను కనుగొన్నాయి. డీఎస్పీ స్థాయి అధికారి, మోటారు వెహికల్ ఇ¯ŒSస్పెక్టర్ (ఎంవీఐ), ఆర్అండ్బీ ఇంజినీరు, స్థానిక పోలీసు అధికారులు ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో సమగ్ర సర్వేను ఆదివారం సాయంత్రానికి పూర్తి చేశాయి. ఒక బృందంలో కాకినాడ మహిళా విభాగం డీఎస్పీ వి.విజయారావు, కాకినాడ ఎంవీఐ దుర్గావిఠల్, ఆర్అండ్బీ ఇంజినీరు నరసింహరావు ఉన్నారు. మరో బృందంలో కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. పరిష్కార మార్గాలు సూచించే ఈ సర్వే నివేదికలు డీజీపీకి అందజేస్తారు. వంద మీటర్లు.. మూడు ప్రమాదాలు.. మూడు ప్రాణాలు సర్వే నిర్వహణకు కొన్ని పరిమితులతో శాస్త్రీయంగా నిర్వహించారు. జాతీయ లేదా రాష్ట్ర రోడ్డులో ఎక్కడైనా ఏడాది కాలంలో వంద మీటర్ల రోడ్డు పరిధిలో వరుసగా మూడు రోడ్డు ప్రమాదాలు జరిగి కనీసం ముగ్గురు... ఆ పైన వ్యక్తులు చనిపోతే... అలాంటి చోట్ల మరింతగా పరిశీలన చేశారు. అసలు అక్కడే ఇన్ని ప్రమాదాలు... ఇంతమంది చనిపోవడానికి కారణాలను కూడా ఐదు కోణాల్లో సర్వే పత్రాల్లో నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవటమా? మానవ తప్పదమా? (నిర్లక్ష్య డ్రైవింగ్) వాహన లోపమా? రోడ్డు నిబంధనలు పాటించకపోవడమా? రోడ్డు మార్జిన్లు ఆక్రమణలకు గురై రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లా? ఈ కారణాలపై బృందాలు అధ్యయనం చేశాయి. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి శివారు ఆర్ఆర్ నగర్ వద్ద స్టేట్ హైవే 104 రోడ్డులో వంద మీటర్ల పరిధిలో గత ఎనిమిది నెలల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. డీఎస్పీ విజయారావు ఆధ్వర్యంలోని సర్వే బృందం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్‌తో కలసి ఆదివారం మధ్యాహ్నం గంటకు పైగా ఆ రోడ్డుపై ఉండి వాహనాలు రాకపోకలు... వేగం.. పరిశీలించారు. వివరాలను సర్వే పత్రాల్లో నమోదు చేశారు. ఇవీ డేంజర్ స్పాట్లు.. ఈ రెండు బృందాలు జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో దాదాపు 130 చోట్ల రోడ్డు ప్రమాదాలపై సర్వేతో అధ్యయనం చేసింది. జిల్లాలో అడ్డతీగల, రంగంపేట, పి.గన్నవరం నుంచి గంటి రోడ్డు (కాలువ పక్క రోడ్డు), ఐ.పోలవరం మండలం కొమరిగిరి మలుపు (216 హైవే) రోడ్లపై ఒకేచోట పలు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు వాటిల్లినట్టు గుర్తించాయి. జాతీయ రహదారిలో జగ్గంపేట, రాజానగరం–కాకినాడ రోడ్డు (ఏడీబీ)పై ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు బృందం నిర్ధారించింది. ఇవీ వైఫల్యాలు.. ఈదరపల్లి ఆర్ఆర్ నగర్ వద్ద ఈ వంద మీటర్ల రోడ్డు కొద్ది దూరంలో చిన్నపాటి మలుపు ఉండడాన్ని గుర్తించారు. స్టేట్ హై వేలు ఏడు మీటర్ల వెడుల్పు ఉండాల్సి ఉంది. అయితే ఇక్కడ ఐదున్నర మీటర్ల వెడుల్పు మాత్రమే ఉంది. రోడ్డు మధ్యలో సెంట్రల్ లై¯ŒS (తెల్లటి రంగుతో ఉండే లై¯ŒS) రోడ్డుపై లేదు. రోడ్డుకు ఓ పక్క మార్జి¯ŒS లేకుండా మట్టిగుట్టలు ఉన్నాయి. దీని వల్ల వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు రోడ్డు మార్జి¯ŒSలోకి వచ్చే వీలు లేదు. వీటి వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంచనాకు సర్వే బృందం వచ్చినట్టు తెలిసింది. ఈ విషయాలపై ఆర్అండ్బీ ఇంజినీరును సర్వే బృందం గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. రోడ్డుకు ఉండాల్సిన కొన్ని నిబంధనలు ఇక్కడ అమలు కాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
అల్‌ఖైదా అడుగులు
ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పరిణామాలు రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చాప కింద నీరులా అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో చేపట్టిన కార్యకలాపాలు వెలుగులోకి రావడం ఉత్కంఠ రేపుతోంది. మధురై కేంద్రంగా సాగుతున్న ఈ గుట్టును ఎన్ఐఏ గుర్తించింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి చడీ చప్పుడు గాకుండా నాలుగు చోట్ల తనిఖీ చేసి నలుగురిని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. సాక్షి, చెన్నై : రాష్ట్రం ప్రశాంతతకు నిలయం. శాంతి భద్రతల పనితీరు భేష్ అన్నట్టు పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా, చోటు చేసుకుం టున్న నేరాలు, వెలుగుచూస్తున్న పరిణామా లు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక నగరం మదురై, పారిశ్రామిక నగరం కోయంబత్తూరు మీద తీవ్ర వాదులు గురి పెట్టినట్టుగా గతంలో కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. అయితే, చాప కింద నీరులా తీవ్రవాద కలాపాలు ఆయా నగరాల్లో సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు తగ్గట్టుగా సంఘటనలు వెలుగులోకి వస్తున్నారుు. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు కోయంబత్తూరు, తిరునల్వేలి నగరాల చుట్టూ తిరగడం ఇందుకు ఓ ఉదాహరణ. అజ్ఞాత తీవ్రవాదులు రాజమార్గంలో చెన్నైకు వచ్చి వెళ్తున్నా, ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడే వరకు విషయం బయటకు రాలేదు. ఇక, కేరళలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల మద్దతు దారులు పట్టుబడడం, వారు ఇచ్చిన సమాచారంతో మరికొందరు రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో చిక్కడం గమనించాల్సిన విషయం. ఇక, ఆ సంస్థ శిక్షణ నిమిత్తం వెళ్తూ పట్టుబడ్డ వారిలో రాష్ట్రానికి చెందిన యువత ఉండడం బట్టి చూస్తే, తీవ్రవాదుల కార్యకలాపాలకు యువత ఆకర్షింపబడుతోందా? అన్న ప్రశ్న ఏర్పడుతోంది. ఇక, నిషేధిత సిమి, అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు రాష్ట్రంలో తిష్టవేసి, యువతను దారి మళ్లించే ప్రయత్నంలో ఉన్నారన్న ఆందోళన కలుగుతోంది. తాజాగా, అల్‌ఖైదా తీవ్రవాదులు పట్టుబడటంతో రాష్ట్రం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ: రాష్ట్రంలో తాము అప్రమత్తంగానే ఉన్నామని పోలీసు యంత్రాంగం చెప్పుకుంటున్నా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) గుర్తించి, రంగంలోకి దిగేవరకూ ఇక్కడ అల్‌ఖైదా మద్దతు సానుభూతి సంస్థ చాప కింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తుండడం వెలుగులోకి రావడం బట్టి చూస్తే, మన యంత్రాంగం పనితీరును ప్రశ్నించక మానదు. ఆధ్యాత్మిక నగరం మదురై మీద గురి పెట్టి బెదిరింపులు ఇటీవల కాలంగా పెరిగినా, స్పందన కరువే. తాజాగా, ఎన్ఐఏ రంగంలోకి దిగడంతో మదురైలో కలకలం రేగింది. అదుపులో ముగ్గురు: ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఉదయాన్నే మదురై పోలీసు యంత్రాంగంతో కలిసి నాలుగు చోట్ల దాడులకు దిగింది. ఒక చోట ఇద్దరు, మరో చోట ఒకరు పట్టుబడ్డారు. మరో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పట్టుబడిన వారు అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా యువతను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడడం దీన్ని ఎన్ఐఏ గుర్తించి రంగంలోకి దిగడం ఆహ్వానించదగ్గ విషయమే. అదుపులోకి తీసుకున్న వారిలో కరీం, అయుబ్, అబ్బాస్‌లు ఉన్నారు. హకీం, దావూద్ సులేమాన్‌లు అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం వేట సాగుతోంది. మైసూర్ బాంబు పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ఈ సంస్థ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అరుుతే, అదుపులోకి తీసుకున్న విషయాన్ని రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పష్టం చేసినా, పూర్తి వివరాలను ప్రకటించలేదు. అదుపులోకి తీసుకున్న వాళ్లను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు, సాంకేతిక సంబంధిత పరికరాలు, ల్యాప్ టాప్‌లను ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. వీరి వలలో పడ్డ యువత వివరాలను, ఏదేని రాష్ట్రంలో కుట్రలకు వ్యూహరచన చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు వేగం పెరిగింది. మరొకరి అరెస్టు: పట్టుబడిన ముగ్గురు ఇచ్చిన సమాచారంతో చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరువాన్మియూర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న దావూద్ సులేమాన్‌ను సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దావూద్ సులేమాన్ చెన్నైలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిసింది. -
కదులుతున్న వక్ఫ్‌భూముల డొంక
సరిహద్దుల నిర్ధారణలో సర్వే బృందాలు వివరాల కోసం మున్సిపాలిటీ, రిజిస్ట్రార్లకు వక్ఫ్‌బోర్డు లేఖలు ఆ భూముల నివాసితుల్లో ప్రకంపనలు అమలాపురం టౌ¯ŒS : అమలాపురం పట్టణం, రూరల్ మండలంలోని వక్ఫ్ భూముల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వక్ఫ్ బోర్డు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ఆ భూముల డొంక కదులుతోంది. పట్టణంలోని వడ్డిగూడెంలో సర్వే నంబరు 455 లోని 27.95 ఎకరాలను, మండలంలోని భట్నవల్లి, సమనస, తాండవపల్లి, నడిపూడి, నల్లమిల్లి గ్రామాల్లోని దాదాపు 275 ఎకరాల భూములను వక్ఫ్ బోర్డు కాకినాడ ఇ¯ŒSస్పెక్టర్ సులేమా¯ŒS బాషా రెండురోజుల క్రితం పరిశీలించారు. అంతేగాకుండా అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, అమలాపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఇ.లక్షి్మలతో ఇప్పటికే సులేమా¯ŒS విడివిడిగా చర్చించారు. ఈ పరిణామాలతో అమలాపురం వడ్డిగూడెంలోని వక్ఫ్ బోర్డు భూములుగా భావిస్తున్న 27.95 ఎకరాల్లో ఇప్పటికే భవంతులు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, ఆస్పత్రులు నిర్మించుకున్న వారు ఉత్కంఠలో ఉన్నారు. ఈ 27.95 ఎకరాల విలువ ప్రస్తుతం దాదాపు రూ.500 కోట్లు చేస్తుందని అంచనా. అంతటి విలువైన ప్రాంతంలో రూ.లక్షలు పెట్టి స్థలాలు కొని, ఇళ్లు, భవనాలు నిర్మించుకున్న వారు ఈ భూములను వక్ఫ్‌బోర్డు స్వా ధీనం చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరైతే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే రూరల్ మండలంలో గుర్తించిన 275 ఎకరాల్లోని యాజమానులకు వక్ఫ్ బోర్డు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ భూములు వక్ఫ్ బోర్డువని...వాటిని ఆక్రమించుకోవటం చట్టరీత్యా నేరమని...తమకు స్వాధీనం చేయాలని ఈ నోటీసులో పేర్కొంది. రెండు రోజుల్లో సర్వేకు సన్నాహాలు అమలాపురంలో వక్ఫ్ బోర్డు ఆస్తులుగా మొత్తం 91.8 ఎకరాలను గుర్తించారు. అందులో తొలుత వడ్డిగూడెంలో వెలుగు చూసిన 27.95 ఎకరాలపై వక్ఫ్‌బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. పట్టణంలోని నల్ల వంతెన, కచేరీ చావిడి ప్రాంతాల్లో మిగిలిన వక్ఫ్ భూములను గుర్తించినట్టు తెలిసింది. వడ్డిగూడెంలోని భూముల్లో రెండు రోజుల్లో సర్వే నిర్వహించేందకు వక్ఫ్‌బోర్డు బృందాలను సిద్ధం చేస్తోంది. ఈ సర్వే బృందాల్లో వక్ఫ్ బోర్డు, రెవెన్యూ, మున్సిపల్ సర్వేయర్లతో పాటు మరికొందరు ఉద్యోగులు ఉంటారు. ఈ బృందాలు ఆ 27.95 ఎకరాల్లో సరిహద్దులను నిర్ధారించనున్నాయి. రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాలకు లేఖలు వక్ఫ్ భూముల వివాదం వెలుగు చూసిన వెంటనే స్థానిక రిజిస్ట్రేష¯ŒS కార్యాలయంలో ఆ భూముల క్రయ, విక్రయలను, రిజిస్ట్రేషన్లను అమలాపురం ఆర్డీవో గణేష్‌కుమార్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వక్ఫ్‌బోర్డు అటు మున్సిపాలిటీకి.. ఇటు రిజిస్ట్రేష¯ŒS కార్యాలయానికి లేఖలు రాసింది. మున్సిపాలిటీ పరిధిలోని ఫలానా సర్వే నంబర్లలోని భూముల్లో ప్రస్తుతం ఎలాంటి కట్టడాలు ఉన్నాయి? ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి? భవనాలకు వాటి హక్కుదారులు చెల్లిస్తున్న పన్నుల వివరాలను తెలియజేయాలంటూ మున్సిపాలిటీని వక్ఫ్‌బోర్డు కోరింది. అలాగే ఫలానా సర్వే నంబరులో ఉన్న భూములకు ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను తెలియజేయాలని కూడా కోరింది. పట్టణం, రూరల్ మండలాల్లో గుర్తించిన దాదాపు 366 ఎకరాల వక్ఫ్ భూముల విలువ దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
జ్వరాల నివారణకు 30 వైద్య బృందాలు
– కలెక్టర్ భాస్కర్ ఏలూరు (మెట్రో) : జిల్లాలో మలేరియా జ్వరాల నివారణ, దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు అక్కడికక్కడే వైద్య చికిత్స అందించేందుకు 30 వైద్య బందాలను నియమించినట్టు జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వైద్యాధికారులు, పంచాయతీ, డ్వామా, డీఆర్డీఏ, విద్యాశాఖాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ప్రజారోగ్యంపై సమగ్రంగా సమీక్షించారు. మలేరియా, డెంగీ, గన్యా, డయేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ అంటు వ్యాధులను నూరుశాతం నిరోధించేందుకు ప్రతి ఒక్కరినీ చైతన్య పరిచి అవగాహన పరచాలన్నారు. దీని కోసం జిల్లాలో ఐదు రోజుల పాటు ప్రత్యేక వ్యాధి నిరోధక, పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలను కొనసాగింపుగానే ఈ ప్రత్యేక వైద్య బందాలు పనిచేస్తాయన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రై వేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించినట్టు తెలిస్తే సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి పీహెచ్సీలో యాంటీ మలేరియా మందులు, పాముకాటు నివారణ మందులు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 21, 22, 23, తేదీల్లో అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీల్లో, పారిశుధ్య కార్యక్రమాలను ఉద్యమ రూపంలో చేపడుతున్నట్టు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, డీపీవో కె.సుధాకర్, డీసీహెచ్ఎస్ శంకరరావు, డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీఈవో డి.మధుసూదనరావు పాల్గొన్నారు. ప్రతి రోజూ క్లోరినేషన్ చేయండి ప్రజారోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులు, వనరులు కలుషితం కాకుండా ప్రతి రోజూ క్లోరినేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 21వ తేదీ నుంచి 26 వరకూ నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంపై సమీక్షించారు. తాగునీటి పైపులైన్ సంబంధించి లీకేజీలు ఉంటే, తాగునీటి విషయంలో ఎమైనా లోపాలు కనిపిస్తే సమస్య పరిష్కారానికి 08812–222891 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. -
దావూద్ కోసం 5 ప్రత్యేక టీంలు!
గత రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పక్కా ప్రణాళికను రూపొందించిన భారత్.. ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్(రా), సీబీఐ ఇంటర్ పోల్ వింగ్ ల నుంచి మొత్తం 50 మందిని ఇందుకోసం ఎంపిక చేసింది. నాలుగు వింగ్ ల నుంచి మొత్తం పది మంది సభ్యులు ఒక్కో టీంకు ప్రాతినిధ్యం వహిస్తారు. పాకిస్తాన్, యూఏఈతో పాటు ప్రపంచదేశాల్లో దావూద్ గ్యాంగ్ కదలికలపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నడుపుతున్న 11మంది దావూద్ సన్నిహితులను నిఘా వర్గాలు గుర్తించాయి. విమానయానం, పవర్, ఆయిల్, కన్ స్ట్రక్షన్, గార్మెంట్ రంగాల్లో ఉన్న ఏడు దావూద్ కంపెనీలను కూడా నిఘా సంస్థలు అనుసరిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో నివసిస్తున్న దావూద్ ఆరోగ్యపరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం ఉంది. పాక్ లో ఉన్నా కూడా తన కుటుంబానికి, తనకు ప్రమాదం ఉన్నట్లు దావూద్ భావిస్తున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా ఆరు బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజ్ కార్లను దావూద్ కుటుంబం తెప్పించుకుందని తెలిపాయి. షేక్ ఇస్మాయిల్ అనే వ్యాపారస్తుడి పేరు మీద దావూద్ ప్రస్తుతం కరాచీలో నివసిస్తున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా దావూద్ ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా ఆపేశాడు. ప్రస్తుతం అతని భార్య మెహజబీన్ షేక్ ఫోన్లను తీసుకుంటుందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ లను కూడా ఆమే రన్ చేస్తోంది. -
మొబైల్ రైతు బజార్ల కోసం ప్రత్యేక టీంలు
– మార్కెట్‌యార్డుల్లో శీతల గోదాములు – సీఈఓ రమణమూర్తి వెల్లడి – టెక్కె మార్కెట్లోని రైతు బజార్ పరిశీలన నంద్యాలరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు అందించేందుకు చర్యలు చేపట్టామని రైతుబజార్ల రాష్ట్ర సీఈఓ రమణమూర్తి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులోని రైతుబజార్–2ను మంగళవారం ఆయన పరిశీలించారు. అమరావతిని పైలెట్‌ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇంటింటికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మొబైల్ రైతుబజార్ల ద్వారా అందించనున్నామని చెప్పారు. ఈ ప్రక్రియను రాష్ట్రంలోని 13జిల్లాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రైతులు కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు కాకుండా సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉత్పత్తి చేసి రైతుబజార్లకు విక్రయించుకోవాలని సూచించారు. రైతుల పంటను నేరుగా పొలాల వద్ద నుండి మొబైల్ రైతుబజార్ల ద్వారా కొనుగోలు చేసి వినియోగదారులకు తాజాగా తక్కువ ధరకు అందిస్తామని తెలిపారు. మార్కెట్‌యార్డుల్లో కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా శీతల శీతల గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వెంట ఏడీఎం సత్యనారాయణచౌదరి, నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ బాల వెంకటరెడ్డి, అధ్యక్షులు శివరాం తదితరులు పాల్గొన్నారు.