Sri ranganatha raju
-
ఎగ్జిట్ పోల్స్ పై ఆచంట ఎమ్మెల్యే రియాక్షన్
-
ఆచంట నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం
-
తిరుమలకు రంగనాథుడు అలా వచ్చాడు!
1328వ సంవత్సరంలో శ్రీరంగంపై ముస్లింల దండయాత్ర జరిగింది. ఆ సమయంలో శ్రీరంగంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవమూర్తులను ఉదయమే కావేరి నదికి తీసుకువెళ్ళి నది మధ్యలో తిరుమంజనాది సేవలను భక్తుల సమక్షంలో నిర్వహించేవారు. సాయంత్రం వరకు స్వామి వారికి సేవలు నిర్వహించి అటు తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకునేవారు. ఇలా శ్రీరంగనాథుడి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ అశ్విక సేనలు అకస్మాత్తుగా కన్ననూరు వైపు నుంచి కావేరి ఒడ్డుకు చేరుకున్నాయి. దీనితో సైన్యం వీరిదగ్గరకు చేరుకునేలోపు స్వామివారి విగ్రహాలను రక్షించాలని భావించిన భక్తులు బలిష్ఠుడైన లోకాచారి అనే యువకుడి సారథ్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి చిన్నపల్లకిలో స్వామివారిని వేంచేపు చేసి రహదారి గుండా పుదుక్కొటై్ట్టకి పంపారు. దారిలో తిరుమలకు వెళ్తే సురక్షితమని భావించి అటు వైపుగా బయలుదేరాలనుకున్నాడు లోకాచారి. అయితే నేరుగా తిరుపతికి వెళ్తే ముస్లింల బారిన పడతామన్న భయంతో తెరుకనంబి, మైసూరు మీదుగా చుట్టూ తిరిగి ముఖ్య రహదారులలో కాకుండా అడ్డదారులలో ప్రయాణం చేస్తూ తిరుపతికి చేరుకున్నాడు. ఆ సమయంలో తిరుపతి సింగమనాయకుడు పాలనలో వుండేది. అలా తిరుమల చేరుకున్న శ్రీరంగనాథుడు శ్రీవారి ఆలయంలో ఆగ్నేయంగా వున్న మండపంలో విడిది చేసి శ్రీవారి అతిథిగా సేవలందుకున్నారు. శ్రీనివాసునికి వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహిస్తూ వుంటే శ్రీరంగనాథునికి పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించేవారు. దీనితో శ్రీవైష్ణవులే కాక దక్షిణాది భక్తులందరూ శ్రీనివాసుని శ్రీరంగనాథుని దర్శనానికి పెద్దసంఖ్యలో తిరుమలకు తరలి రావడం మొదలుపెట్టారు. అదేరోజులలో హిందూరాజులు, సామంతులు చేతులు కలిపి మథుర సుల్తానులపై దండెత్తి వారిని ఓడించారు. అదే సమయంలో హరిహర బుక్కరాయల నాయకత్వంలో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు మొదలయ్యాయి. 1370 సంవత్సరానికి తిరుమల–తిరుపతి ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యం బలంగా ఏర్పడింది. దక్షిణ దేశమంతా కూడా వీరి పరిపాలనలో సుభిక్షం, సురక్షితమైంది. దీనితో హిందువులలో ధైర్యం, శాంతిభద్రతలపై నమ్మకం ఏర్పడ్డాయి. 1371లో అంటే 43 సంవత్సరాల తరువాత తిరుమల నుంచి శ్రీరంగానికి శ్రీరంగనాథన్ తిరుగు ప్రయాణం వైభవంగా జరిగింది. అంత గొడవల్లో కూడా ముస్లింల విధ్వంసానికి గురికాని దేవాలయం ఏదైనా వుంది అంటే అది తిరుమల ఆలయం మాత్రమే. ముస్లింలు కొండవైపు కూడా రాలేదు. దీనికి కారణం స్వామివారి మహిమే అన్న భావన భక్తులందరిలో కలిగింది. తమిళ ప్రాంతం నుంచి భక్తులు తిరుమలకు రావడం అప్పటి నుంచే మొదలైంది. ఆధ్యాత్మిక భావాలకు తిరుమల ఒక ఆసరాగా నిలిచిపోయింది. -
పేదల గుండెల్లో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘స్వాతంత్య్రానంతరం ఇందిరమ్మ, ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్సార్ హయాంలోనే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్సార్ హయాంలో 23 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఇళ్ల పట్టాల కోసం సెంటు భూమి సేకరించలేదు. పార్టీలకతీతంగా ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు నిర్మించాలన్న తపనతో సీఎం జగన్ 30.76 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ద్వారా రూ.4 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టిస్తున్నారు. పేదల గుండెల్లో నిలిచిపోతారు’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన సమాధానమిస్తూ మాట్లాడారు. తొలి దశలో రూ.28 వేల కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 11.65 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ కాగా, 3 లక్షల ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. గృహ నిర్మాణంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. 40 పార్టీలు కలిసొచ్చినా భయం లేదు నాలుగు పార్టీలు కాదు.. 40 పార్టీలు కలిసొచ్చి పోటీ చేసినా.. 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటారు. 80 శాతం మంది ప్రజలు, దేవుడి ఆశీర్వాదం మా నాయకుడికే ఉంది. ఆయన్ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్కరికీ లేదు. తెలంగాణాలో 5.72 లక్షల ఇళ్లు, తమిళనాడులో 5 లక్షల ఇళ్లు, కేరళలో 5.19 లక్షల ఇళ్లు, కర్ణాటకలో లక్ష ఇళ్లు నిర్మిస్తే ఏపీలో ఏకంగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. మా చిన్నప్పుడెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే నేటికీ చెప్పుకుంటున్నాం. ఇకపై మరో వెయ్యేళ్లు వైఎస్ జగన్ గురించి చెబుతారు. నేడు జగనన్న ఇంటిని చూపించి ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. – బియ్యపు మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
శ్రీరామవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీరంగనాథ రాజు
-
సంక్షేమ ప్రభుత్వానికే ప్రజలు ఓటు వేశారు
-
తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రి: శ్రీరంగనాథరాజు
విజయవాడ: తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారునికి 40 శాతం తక్కువ ధరకే సామాగ్రిని అందిస్తున్నట్లు, ఇళ్ల లే ఔట్ల దగ్గరకే మెటీరియల్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.వేల కోట్లు ఆదా చేయడంతో పాటు అదనంగా ఇంటి నిర్మాణానికి పేదలకు పావలా వడ్డీకి రుణం ఇప్పిస్తున్నామన్నారు. చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే.. లబ్ధిదారులకు ఆప్షన్ లు బలవంతంగా మారుస్తున్నారన్నది తప్పుడు ప్రచారమని, వారికి ఎలా కావాలంటే అలా ఇళ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్ 25 నుంచి మూడో కేటగిరి ఇళ్ల నిర్మాణం చేపడతున్నట్లు తెలిపారు. -
ప్రతి జగనన్న కాలనీకి నోడల్ అధికారి నియామకం
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం ఆయన విశాఖ జిల్లాలో జగనన్న కాలనీల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు ఉత్తర్వులతోపాటు నిధులను, మెటీరియల్‌ను కూడా ఇస్తున్నట్లు వివరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి కాలనీకి మండల స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన లేఅవుట్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారునికి సుమారు రూ.30 వేల విలువైన ఇసుకను ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
సామూహిక ఇళ్ల శంకుస్థాపనలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంపై మంత్రి బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 1, 3, 4వ తేదీల్లో జరిగే సామూహిక శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఈనెల 10 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల గృహాలకు శంకుస్థాపన పూర్తికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. సెప్టెంబర్ నాటికి మొదటి దశలో 15.6 లక్షల గృహాలకు శంకుస్థాపనలు పూర్తి చేసి, 2022 జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, చీఫ్ ఇంజనీర్ పి.శ్రీరాములు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి లే అవుట్‌ను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం
ఒంగోలు అర్బన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు నిర్మించే ఇళ్ల తాలూకు లే అవుట్లను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో శుక్రవారం గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి రంగనాథరాజు మీడియాతో మాట్లాడారు. ప్రతి లే అవుట్లో తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతుల్ని అండర్ గ్రౌండ్ విధానంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద లే అవుట్లు ఉన్న చోట్ల బస్టాండ్‌తో పాటు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 2, 3, 4, 5 తేదీల్లో భారీగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించి నిర్మాణాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం: మంత్రి సురేష్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమని చెప్పారు. అందువల్లే ముందునుంచీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపిందని, పరీక్షల రద్దును కేవలం రెండో ఆప్షన్‌గానే చూశామని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ స్పష్టం చేశామన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసే నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. -
‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సాఆర్ జగనన్న కాలనీలను .. మోడల్ కాలనీలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా, ఏపీలో రూ.33 వేల కోట్లతో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈపథకంలో అర్హులై ఉండి కూడా.. ఇంటిపట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రతి గ్రామంలో పార్టీల కతీతంగా, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి: ‘‘స్పందన"పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ -
‘ఏపీలో మరో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి’
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో మరో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని మంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి రంగనాథరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్ధికవృద్ధి పెరుగుతుందని, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు అవుతాయని భరోసానిచ్చారు. చదవండి: ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు -
రేపు వైఎస్సార్ జగనన్న ఇళ్ల ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: రేపు(గురువారం)వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. 28 లక్షల 30 వేల మందికి పక్కాఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడతగా 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. రూ.51 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: మాజీ సీఎం సిద్ద రామయ్యకు అస్వస్థత -
‘రఘురామను అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు’
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదని, ఆయన్ని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సీఎంను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ప్రజలు సహించరని అన్నారు. ఎంపీ రఘురామ అరెస్ట్ అనంతరం మంత్రి బాలినేని స్పందించారు. రఘురామలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గానికి వెళ్లి అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీ ఎక్కడో ఉండి తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం సరైంది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: శ్రీరంగనాథరాజు ‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు గత 13 నెలలుగా నరసాపురం పార్లమెంట్ ప్రజలను వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో మకాం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. నరసాపురం పరిధిలో నమోదైన కేసులపై కూడా పోలీసులు విచారణ చేయాలి. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. చదవండి : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ -
గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయ శాఖలతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు అవార్డుల ప్రదానంపై గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. సమీక్షలోని ముఖ్యంశాలు.. ⇔ సంక్షేమ కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేసి, సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో వాలంటీర్లకు సత్కారం చేయాలని తెలిపారు. ⇔ ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికిపైగా సేవలు అందించిన.. 2,18,115 మంది వాలంటీర్లకు సేవా మిత్ర 4వేల మంది వాలంటీర్లకు సేవా రత్న అందించాలన్నారు. ⇔ ప్రతి మండలానికి ఐదుగురు, ప్రతి మున్సిపాలిటీకి ఐదుగురు, ప్రతి కార్పొరేషన్ నుంచి 10 మంది ఎంపిక చేయాలన్నారు. ⇔ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున సేవా వజ్రాలుగా ఎంపిక చేసి, 875 మంది వాలంటీర్లకు సేవా వజ్రాలు కింద సత్కారం చేయాలని తెలిపారు. ⇔ సేవామిత్రలకు రూ.10వేల నగదు, సేవా రత్నాలకు రూ. 20వేలు, సేవా వజ్రాలకు రూ.30వేల నగదు ప్రోత్సాహకం అందించాలని తెలిపారు. ⇔ తామే ఇళ్లు కట్టుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న వారికి.. నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ⇔ స్టీలు, సిమ్మెంటు, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని.. తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్ ⇔ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా .. నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం జగన్ ⇔ కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ⇔ ఇళ్లనిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని తెలిపారు. ⇔ ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, కచ్చితంగా నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టంగా తెలిపారు. ⇔ తయారు చేసిన డిజైన్లను సీఎం పరిశీలించి సూచనలు చేశారు. ⇔ జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వసతుల కల్పనపై కూడా సీఎం జగన్ చర్చించారు. ⇔ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. -
నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.(చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. -
చంద్రబాబు చరిత్ర హీనుడు..
సాక్షి, పశ్చిమగోదావరి: పేదల ఇళ్ల పట్టాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. ఆచంట నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి విడతలో భాగంగా రెండవ రోజు పెనుగొండ, దొంగగూడెం, మునమర్రు రోడ్ , వడలి గ్రామాల్లో 1,194 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. (చదవండి: ‘సినిమాల్లో వకిల్ సాబ్.. బయట పకీర్ సాబ్’) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టాలివ్వడమే కాకుండా.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తిలో 15 వేల మందికి ఒకే చోట ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. పేదలకు ఇళ్ల పట్టాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లు అనుభవం ఉందంటూ హైకోర్టులో వేలాది కేసులు వేసి, 25న పేదలకు పట్టాలు ఇస్తుంటే 24 తేదీన కూడా కోర్టులో స్టే వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కతుందని ఆయన ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్క సెంటు భూమి కూడా సేకరించి అవ్వలేని చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శలు గుప్పించారు (చదవండి: ‘అది చిడతల నాయుడికే చెల్లింది’) అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలతో 7 వేల కోట్లతో ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీటి ట్యాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆచంట నియోజకవర్గంలో 54 వేల కుటుంబాలు ఉంటే, 18 వేల ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 68 వేల ఎకరాల్లో భూమిని 12 వేల కోట్ల రూపాయల భూముల లే అవుట్లు నిర్మించి ఇచ్చామన్నారు. 175 నియోజకవర్గంలో కూడా ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. -
లంక గ్రామాలను పరిశీలించిన మంత్రి మేకతోటి సుచరిత
-
లంక గ్రామాల్లో మంత్రుల పర్యటన
సాక్షి, గుంటూరు: బంగాళఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు, వరదలకు పంటపొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. వరదలకు నీట మునిగిన పంటపొలాలను, లంక గ్రామాలను పరిశీలించారు. గ్రామ ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రుతో పాటు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఉన్నారు. అదే విధంగా మంత్రులు, అధికారులు చిర్రావూరు, బొమ్మ వాణి పాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, వెల్లటూరు పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు. -
గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి రూ. కోటి విరాళం
సాక్షి, గుంటూరు: మహమ్మారి కోవిడ్-19 సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీజీహెచ్ తొమ్మిది జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాని కోసం వ్యక్తిగతంగా జీజీహెచ్‌కు రూ.కోటి విరాళం అందజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కోవిడ్ రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు. -
రాజకీయ కుట్రతోనే దాడులు: వెల్లంపల్లి
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై రాజకీయ కుట్ర సాగుతుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు సోమవారం ఆయన విశాఖ శారద పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యమంత్రి చేపట్టే సంక్షేమ పథకాలకు ఆశీస్సులు కావాలని స్వామిని కోరామని తెలిపారు. కుట్రలతోనే ఆలయాలపై దాడులు జరిగాయని.. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. రాజకీయ కుట్రతో ప్రజలను అయోమయం చేసే ఘటనలు జరిగాయన్నారు. ఈ కుట్రలను ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. (చదవండి: ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..) ‘‘కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చివేశారు. ఆలయాలను పున:నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సీఎం కమిటీ వేశారని’’ ఆయన తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి వెల్లంపల్లి దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా ముందుకెళ్తామన్నారు. చంద్రబాబుకు హిందువులపై ప్రేమ లేదని.. ఆయన ట్వీట్లు పట్టించుకోవద్దని ప్రజలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం) -
అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం
సాక్షి, విశాఖపట్నం : అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం.. కొన్ని దుష్ట శక్తుల పనని, ఆ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోందని మంత్రి శ్రీ రంగనాథ్ రాజు తెలిపారు. త్వరలోనే రథం దగ్ధం చేసిన కుట్రదారులను పట్టుకుంటామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులకు కులాలు, మతాలు ఉండవన్నారు. నారా చంద్రబాబు నాయుడు హయాంలో గుళ్లను కూల దోస్తే ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చదవండి : దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ -
నియోజకవర్గం వైపు కన్నెత్తి చూశారా..?
-
పార్టీలు మారడం ఆయన నైజం
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లో ఆయనకు అంతపేరు ప్రఖ్యాతలు ఉంటే.. ఆయనే సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేయాలన్నారు. పార్టీని కాకుండా తనను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన రోజు గోడ ఎందుకు దూకారో మోదీకి చెప్పాలన్నారు. తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టంతోనే గెలిచామని మంత్రి పేర్కొన్నారు. తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘురామకృష్ణంరాజు పప్పులు ఇక్కడ ఉడకవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు : మంత్రి శ్రీరంగనాథరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కేబినెట్లో చోటు కల్పించారని ప్రశంసించారు. ఎంపీ రఘురామకృషంరాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదు వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేశారు కాబట్టే రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. రఘురామ కృష్ణంరాజు ఏ మాత్రం పద్దతిగా మాట్లాడడం లేదని విమర్శించారు. నరసాపురంలో ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదని ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణంరాజు గతం మర్చిపోయారు: ఎమ్మెల్యే గ్రంధి ఎంపీ రఘురామకృషంరాజు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. గతంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, జిల్లా నేతలంతా సీఎం జగన్‌ను కలిసి విన్నవిస్తే.. రఘురామకృష్ణంరాజును మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఆయన ఎంపీగా గెలిచారన్నారు. టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారిన వ్యక్తి .. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. -
రూ.80 కోట్లతో అయోధ్యలంకకు వంతెన
సాక్షి, పెనుగొండ: గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అయోధ్యలంక, పుచ్చల్లంక మధ్య గోదావరిపై రూ.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని, లంక గ్రామాల పరిరక్షణే ధ్యేయంగా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సీహెచ్ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం ఉభయ గోదావరి జిల్లా ల్లోని పల్లిపాలెం, రావిలంక, అయోధ్యలంక తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించా రు. వంతెన నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల మధ్య రవాణా సదుపాయం మరింత మెరుగవుతుందని మంత్రి అన్నారు. వశిష్ట, వైనతేయ గోదా వరి పాయలు కలిసే ప్రాంతంలో కోత ఎక్కువగా ఉందని, శాశ్వత పరిష్కారం కోసం పరిశీలన జరిపి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల కమిటీ నివేదిక సమర్పిస్తారని చెప్పారు. వచ్చే నవంబర్ చివరిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎస్ఈ ప్రకాశ్‌రావు, ఈఈ మోహనరావు, డీఈఈ జి.శ్రీనివాసు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఈఈలు సీహెచ్ఎన్వీ సుబ్రహ్మణ్యం, పవన్‌కుమార్, సుబ్బారావుతో పా టు పార్టీ నాయకులు సుంకర సీతారాం, కొప్పాడి సత్యనారాయణ, గొల్లపల్లి బాలకృష్ణ, అడ్డాల గంగరాజు పాల్గొన్నారు.