srinivasarao
-
తెలంగాణ పోలిస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ ‘హైట్’ ఉన్నవారికి మరో ఛాన్స్!
సాక్షి, హైదరాబాద్ : యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా అభ్యర్థులకు నిర్వహించిన ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో అవకాశం కల్పించనుంది. ఒక సెంటీమీటర్, ఆ లోపు తేడాతో అనర్హులైన అభ్యర్థులకు మరోమారు ఎత్తు కొలతలు తీయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఎలీ్పఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎత్తు కొలతలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు www.tslprb.in వెబ్సైట్ ఈనెల 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు లాగిన్ ఐడీల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎస్ఏఆర్ సీపీఎల్ అంబర్పేట్, 8వ బెటాలియన్ కొండాపూర్‌లలో ఈ ఎత్తు కొలతలను తీయనున్నట్లు వెల్లడించారు. భౌతిక కొలతలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను తీసుకురావాల్సి ఉంటుందని, ఆన్లైన్లో దరఖాస్తు చేయకుండా వినతిపత్రాలు రాసి తెచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. -
ఎన్నిసార్లయినా కేసీఆర్ పాదాలకు నమస్కరిస్తా : డీహెచ్ శ్రీనివాసరావు
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఫస్ట్ వికెట్.. ఈడీ అదుపులో గోల్డ్‌మైన్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారిగా అనుమానిస్తూ గోల్డ్‌మైన్ శ్రీనివాసరావు అలియాస్ వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు సోదాలకు పరిమితమైన ఈడీ సోమవారం ఒకరిని అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, అకస్మాత్తుగా శ్రీనివాసరావు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడమే కాకుండా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించడాన్ని బట్టి చూస్తే.. ఈ ఉదంతం మరింత సంచలనానికి దారితీసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. అకస్మాత్తుగా తెరపైకి.. సోమవారం వరకు శ్రీనివాసరావు పేరు గానీ, ప్రస్తావన గానీ లిక్కర్ స్కామ్‌లో బయటకు రాలేదు. ఈ స్కామ్‌లో 14వ నిందితుడిగా ఆరోపణలెదుర్కొంటున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో పాటు ఆయనకు చెందిన రాబిన్ డిస్టిలరీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినిపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు, ఆడిటర్ బుచ్చిబాబు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు గత వారం సోదాలు నిర్వహించాయి. ఇక్కడ లభించిన కీలక ఆధారాల నేపథ్యంలోనే శ్రీనివాసరావుపై దృష్టి సారించినట్టు తెలిసింది. సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు.. శ్రీనివాసరావు కేంద్రంగా జరిగిన మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఆయన కార్యాలయాలున్న హైదరాబాద్‌లోని రామాంతపూర్ (సాలిగ్రామ్ టెక్నాలజీస్), మాదాపూర్ (వరుణ్ సన్), బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ (శ్రీనివాసరావు కార్యాలయం)తో పాటు మరో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. రూ.కోట్ల లావాదేవీలపై ఆధారాలు లభ్యం శ్రీనివాసరావు ద్వారా కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగినట్టు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు వారివద్ద ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది. సోదాల్లో బయటపడ్డ కంపెనీల ఏర్పాటు సంబంధిత డాక్యుమెంట్లు, కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒప్పంద పత్రాల ద్వారా ఈడీకి కీలక సమాచారం అందినట్లు సమాచారం. సంభాషణలు రిట్రైవ్ చేసిన ఈడీ పిళ్లై విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. అతని ఫోన్లోని సిగ్నల్ యాప్ ద్వారా జరిగిన సంభాషణను ఈడీ అధికారులు రిట్రైవ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీనివాసరావుతో సాగిన సంభాషణలు ఈడీకి కీలక సమాచారాన్ని ఇచ్చినట్టు తెలిసింది. వీరిద్దరి చాటింగ్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు స్కామ్‌లో వినిపిస్తున్న ప్రముఖుల మొబైల్‌కు పంపించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. పంజాబ్‌కు వెళ్లిన రూ.200 కోట్లెక్కడివి? ఈడీ అధికారుల సోదాలో మరో సంచలనాత్మక అంశానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతకు రూ.200 కోట్లు ఇచ్చినట్టుగా ఆధారాలు లభించినట్లు సమాచారం. కాగా ఆ డబ్బులు శ్రీనివాసరావు ద్వారానే అక్కడికి చేరాయా? అన్న అంశంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ డబ్బు ఏ ఒప్పందంలో భాగంగా ఇచ్చారు, లిక్కర్ టెండర్ల కోసమేనా? లేక మరేదైనా కారణముందా? అన్న కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ డబ్బు ఎవరి ఆదేశాల మేరకు వెళ్లింది? కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిందా? లేక లెక్కల్లో లేని డబ్బా? అన్న కోణంలో ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఆడిటర్ బుచ్చిబాబు నివాసాల్లో జరిగిన సోదాల్లో ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అడ్వాన్స్ అని, పర్సంటేజీ అన్న పేరుతో సాగిన ఓ వాట్సాప్ సందేశంపై ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్టు తెలిసింది. అక్కడ పిళ్లై.. ఇక్కడ శ్రీనివాసరావు.. మధ్యలో? ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేజిక్కించుకునేందుకు ఆ రంగంలో ప్రావీణ్యం ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైని రంగంలోకి దించారు. ఆయన ఢిల్లీలోని పలువురిని కలిసి లంచాలు ముట్టజెప్పారని సీబీఐ ఆరోపిస్తోంది. అదే విధంగా లిక్కర్ దందాకు కావాల్సిన కంపెనీలు, వేయాల్సిన టెండర్లు, ముట్టాల్సిన సొమ్ము.. కట్టాల్సిన సొమ్ము సమీకరణ బాధ్యత శ్రీనివాసరావుకు అప్పగించారని తెలుస్తోంది. అయితే.. హైదరాబాద్ టూ ఢిల్లీ అన్నట్టుగా సాగిన ఈ దందాలో మధ్యవర్తిత్వం చేసిందెవరు? వారికి ఈ వ్యవహారంతో ఉన్న సంబంధం ఏమిటి? అన్నదానిపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దూకుడు పెంచడం కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి వరకు సుమారు ఆరు గంటల పాటు శ్రీనివాసరావును ఈడీ ప్రశ్నించింది. ఎవరీ శ్రీనివాసరావు? శ్రీనివాసరావుది ప్రస్తుత సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతగల్ గ్రామం. అధికార పక్ష ముఖ్య నేతల అండదండలతో ఆర్థికంగా ఎదిగినట్లు తెలుస్తోంది. ఆయనకు పవిత్ర పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇటీవలే రామాంతపూర్‌లో సాలిగ్రామ్ ఐటీ కంపెనీ ప్రారంభించారు. మాదాపూర్‌లోని వరుణ్ సన్ షోరూమ్‌లో వాటాలున్నట్లు, రంగారెడ్డి జిల్లాలో గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మినరల్స్ పేరిట మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. రూ. 2 వేల కోట్లతో 18 జోన్లు కైవసం! ఢిల్లీలోని 32 జోన్లలో లిక్కర్ దందా కోసం నిధుల సమీకరణ, లావాదేవీల వ్యవహారం మొత్తం వెన్నమనేని శ్రీనివాసరావు ద్వారానే జరిగినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. రూ.2 వేల కోట్లకు పైగా నగదును 9 కంపెనీలకు మళ్లించి, ఆ కంపెనీల ద్వారా టెండర్ల దాఖలుకు దగ్గరుండి ఏర్పాట్లు చేసినట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీలకు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబు, శ్రీనివాసరావు మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారం కూడా తాజాగా బయటపడుతోందని వెల్లడించాయి. రూ.2 వేల కోట్లతో దాదాపు 18 జోన్లలో లిక్కర్ దందాను చేజిక్కించుకున్నట్టు ఈడీ అనుమానిస్తోంది. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ఖాతాల ద్వారా సంబంధిత కంపెనీల్లోకి మళ్లించారు? తదితర అంశాలపై శ్రీనివాసరావును ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ బయటకొచ్చి పోరాడాలి
సాక్షి, అమరావతి/ఒంగోలు/మంగళగిరి: ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి బయటకు వచ్చి పోరాడాలని సీపీఎం, సీపీఐ సూచించాయి. బీజేపీతో దోస్తీ చేసిన ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడలేదని పేర్కొన్నాయి. మంగళవారం ఒంగోలులో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీలను జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్ పూడ్చేందుకు ఎలాంటి సాయం చేయని కేంద్రం.. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా సాధన కమిటీ చైర్మన్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఐసీయూలో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇవ్వాలన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు వాటి కోసమే పాకులాడుతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.మధు విమర్శించారు. మంగళవారం గుంటూరు జిల్లా నిడమర్రులో ఆయన ‘అమరావతి ప్రజాబాట’ను ఆయన ప్రారంభించారు. -
పాస్‌పోర్ట్ రద్దు.. పుకార్లు మాత్రమే
సాక్షి, అమరావతి: ఉద్యమాల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని అమరావతిని తరలిస్తున్నారంటూ ఉద్యమం చేస్తున్న వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తున్నారంటూ రెండ్రోజులుగా ఎవరో పుకార్లు పుట్టించారని తెలిపారు. ఒక్కసారి పాస్‌పోర్టు జారీ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారం తమకుగానీ, పోలీసులకు గానీ ఉండదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు, రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసి.. స్వయానా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడే పాస్‌పోర్ట్ రద్దు సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
శ్రీనివాస్‌కు 22వరకూ రిమాండ్ పొడిగింపు
విజయవాడ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించింది. శ్రీనివాసరావుకు నేటితో రిమాండ్ ముగియడంతో అతడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కేసు ఛార్జ్‌షీట్ మీడియాలో రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కత్తితో శ్రీనివాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. -
శ్రీనివాసరావు రిమాండ్ పొడగింపు
-
జగన్‌పై హత్యాయత్నం కేసు: కోర్టులో ఛార్జీషీట్ దాఖలు
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్ సహాయ నిరాకరణపై ఎన్ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్ ఏసీసీ నాగేశ్వరరావుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించారు. -
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
-
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తుకు రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు సహకరించడం లేదని ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏ, సిట్ అధికారులను ఆదేశించింది. (ఎన్ఐఏకు సిట్ సహాయ నిరాకరణ) వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఎన్ఐఏ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి అడగ్గా.. ఏం లేదని శ్రీనివాసరావు సమాధానమిచ్చాడు. మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న నిందితుడి విజ్ఞప్తిని తిరస్కరించారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పటిష్ట భద్రత నడుమ నిందితుడిని రాజమండ్రికి తీసుకెళుతున్నారు. (ఎన్ఐఏ విచారణకు హర్షవర్ధన్ గైర్హాజరు) -
‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది.. ఎవరు తెచ్చారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదోరోజు విచారించింది. నిందితుడి విచారణ న్యాయవాదుల సమక్షంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదోరోజు విచారణలో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును న్యాయవాది సలీం సమక్షంలో విశాఖపట్నంలోని కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విచారించారు. (కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ) శ్రీనివాస్ 20 మంది యువతులతో మాట్లాడిన కాల్ డేటా వివరాలపై ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారని న్యాయవాది సలీం తెలిపారు. ‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు’ అనే అంశాలపై శ్రీనివాస్‌కు ప్రశ్నించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ కాల్ డేటాను అధికారులు పరిశీలించారని చెప్పారు. మిగిలిన రెండు రోజులు శ్రీనివాస్‌ను ఎక్కడ విచారస్తారనేది ఎన్ఐఏ ఇంకా చెప్పలేదని సలీం బుధవారం మీడియాకు చెప్పారు. కాగా, వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజు ఎయిర్ పోర్ట్ లాంజ్ వద్ద ఉన్న ఇద్దరి వ్యక్తుల నుంచి ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. -
కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తమ కార్యాలయంలో నాలుగో రోజు విచారిస్తోంది. న్యాయవాదుల సమక్షంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావుతో పాటు పలువురిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలు ముందుంచి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు చెప్పే విషయాలను రికార్డ్ చేస్తున్నారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు నిందితుడు ఎన్ఐఏ కస్టడీలో ఉండనున్నాడు. ఎన్ఐఏ అధికారులతో కూడిన మరో బృందం విశాఖపట్నంలో విచారణ జరుపుతోంది. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగుందని అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. విచారణ కోసం శ్రీనివాస్‌ను మరోసారి విశాఖపట్నం తీసుకెళ్లే అవకాశం లేదని, మిగతా మూడు రోజులు హైదరాబాద్‌లోనే విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. (వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?) -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
సాక్షి, అమరావతి/సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారించింది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ మూడో రోజు పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాక విచారణ కొనసాగించారు. మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో శ్రీనివాస్‌రావును అతని న్యాయవాది సమక్షంలోనే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం ఎందుకు చేశావు.. వెనుక ఎవరున్నారనే దానిపై విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఒక్క సంవత్సరంలో వందలాది సిమ్ కార్డులు, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు మార్చడం వెనకున్న ఆంతర్యమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. టీడీపీ నేతతో శ్రీనివాసరావు ఫోన్ కాల్స్‌పై దృష్టి: జగన్‌పై హత్యాయత్నం చేయడానికి ముందుగా జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఎయిర్ పోర్టులో ఫ్యూజన్‌ఫుడ్స్ యజమాని వద్ద పనికి కుదిర్చిందెవరు? సంబంధిత టీడీపీ నేతతో శ్రీనివాస్‌రావుకు జరిగినట్టు భావిస్తున్న ఫోన్ కాల్స్ సంభాషణలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేందుకు ఇచ్చే అనుమతి పాస్ తాత్కాలికమైనా క్రిమినల్ కేసులున్న వ్యక్తికి ఎలా ఇచ్చారు? తాత్కాలిక పాస్ ఇప్పించిందెవరన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పాస్‌కు సిఫారసు లేఖతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు ఎవరన్నది ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. హత్యాయత్నం చేయడానికి ఎవరైనా పురిగొల్పారా? అనే కోణంపై దృష్టి సారించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన వివరాలను రికార్డు చేశారు. శ్రీనివాసరావు కస్టడీలో నాల్గో రోజైన మంగళవారం మరోసారి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లేందుకు ఎన్ఐఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శ్రీనివాసరావును తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేర స్థలంలో మరికొన్ని అదనపు వివరాలు సేకరించే విషయంపై ఎన్ఐఏ అధికారులు దృష్టిసారించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. -
లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం హైదరాబాద్‌లో విచారించారు. న్యాయవాదుల సమక్షంలో అతడిని ప్రశ్నించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. నిందితుడి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. వైఎస్ జగన్‌పై దాడి ఎందుకు చేశావు, దాడి వెనుక ఎవరున్నారనే దానిపై లోతుగా విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, దీనిపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. నేటితో నిందితుడి మూడో రోజు కస్టడీ ముగిసింది. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా రేపు మరోసారి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం అతడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో అతడిని విచారించారు. (శ్రీనివాసరావుపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం) -
ఎన్ఐఏ అదుపులో శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక భద్రత నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. (ఎన్ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు) శ్రీనివాసరావును విచారణ నిమిత్తం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడే వారం రోజుల పాటు నిందితుడిని అధికారులు విచారించనున్నారు. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడికి మూడురోజులకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
శ్రీనివాసరావుని కోర్టులో హాజరుపరిచిన ఎన్ఐఏ
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ అధికారులు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుని విజయవాడ ఎంఎస్‌జే కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. ఈ నెల 25 వరకు నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడి తరుపు న్యాయవాదులు ఎవరూ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయక పోవడంతో కస్టడీ పిటిషన్ కాపీని నిందితుడికి కోర్టు అందజేసింది. (శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ డిస్మిస్) -
కట్టు కథలకు పదును!
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసులో రోజుకో అసత్యాన్ని వల్లె వేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు తాజాగా మరో అంకానికి తెరతీశారు. అసలిది హత్యాయత్నం కాదు కదా దాడి కూడా కాదంటూ సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చారు. ఈ కేసులో హైకోర్టు క్రియాశీలంగా వ్యవహరిస్తుండంతోపాటు ఢిల్లీలోని బీసీఏఎస్ డీజీ ఇచ్చిన నివేదికతో కలవరపాటుకు గురై కేసును తప్పుదారి పట్టించేందుకు మార్గాలను అన్వేషిస్తూ అసలు జగన్‌పై దాడే జరగలేదన్న అసత్య ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చేందుకు తెగించారు. తమ నియంత్రణలో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు కుటుంబీకులను ఈ కట్టుకథలో పావులుగా వాడుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. అదే డ్రామా...కొత్త కోణంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పక్కా పన్నాగంతో జరిగిన హత్యాయత్నాన్ని కోడి కత్తితో దాడి అంటూ హేళనగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఈ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రయత్నించారు. ఈ ఎత్తుగడ ఫలించకపోవడంతో తమ నియంత్రణలో ఉన్న నిందితుడి కుటుంబ సభ్యులను వ్యూహాత్మకంగా రప్పించి మరో అసత్య ప్రచారానికి సిద్ధమయ్యారు. నిందితుడు శ్రీనివాసరావును అతడి తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, సమీప బంధువు రామకృష్ణ ప్రసాద్ గురువారం విశాఖ సెంట్రల్ జైలులో కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడిన మాటలు ప్రభుత్వ పెదల కపట నాటకాన్ని వెల్లడిస్తున్నాయి. ‘యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనలో వైఎస్ జగన్‌కు చిన్న గాయమై రక్తం కారింది. అంతేగానీ అసలు కత్తినే వాడలేదు’ అని ములాఖత్ సందర్భంగా శ్రీనివాస్ తమకు చెప్పినట్లు వారు పేర్కొనటం విస్మయపరుస్తోంది. మరి శ్రీనివాస్ ఇంకేదైనా ఆయుధం వాడాడా? అని మీడియా ప్రశ్నించగా వారు సమాధానం దాటవేశారు. హత్యాయత్నం అనంతరం నిందితుడు వినియోగించిన పదునైన కత్తిని సైతం ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా, ప్రభుత్వ పెద్దలే పక్కా వ్యూహంతో శ్రీనివాస్ కుటుంబీకులను తాజాగా జైలుకు రప్పించి వారితో ఈ మాటలు పలికించినట్లు స్పష్టమవుతోంది. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గతంలో చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా తాజాగా మాట్లాడటం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కుటుంబం పరువు తీశావని నాడు మందలింపు గతంలో ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులను ఓసారి విశాఖకు రప్పించారు. ఆ సందర్భంగా వారు శ్రీనివాసరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కుటుంబం పరువు తీశావు. ఎందుకీ పని చేశావు? ఇప్పటికైనా నిజం చెప్పు’ అని కొడుకును తీవ్రంగా మందలించారు. తమ బిడ్డ ఎందుకు ఈ హత్యాయత్నం చేశాడో తెలియడం లేదని అనంతరం పోలీసుల వద్ద వాపోయారు. శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఠాణేలంకలో అతడి సోదరి రత్నకుమారి విలేకరులతో మాట్లాడుతూ ‘మా తమ్ముడు శ్రీనివాసరావు వద్ద డబ్బులుండేవి కావు. ఈ హత్యాయత్నం వాడికి పుట్టిన బుద్ధి కాదు. ఎవరో డబ్బు ఆశ చూపించి వాడితో ఈ పని చేయించారు’ అని వాస్తవాన్ని కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పారు. దీనికి పూర్తి విరుద్ధంగా శ్రీనివాసరావు తల్లి, సోదరుడు, సమీప బంధువు తాజాగా విశాఖ సెంట్రల్ జైలు వద్ద మాట్లాడటం గమనార్హం. నిందితుడిని జైలుకు తరలించాక అతడి కుటుంబ సభ్యులు ఎవరూ ములాఖత్‌కు రాలేదు. నిందితుడిని ఎవరూ కలవకుండా టీడీపీ పెద్దలే కట్టడి చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలే వ్యూహాత్మకంగా శ్రీనివాసరావు కుటుంబీకులను మరోసారి తెరపైకి తెచ్చారని సమాచారం. పెద్దల ఆదేశాలతోనే ములాఖత్‌కు! ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ, సీఎం చేసిన వ్యాఖ్యలతో ఈ కేసును రాష్ట్ర పోలీసులు పారదర్శకంగా విచారించే అవకాశమే లేదన్న విషయం తేలిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారించాలని కోరుతూ వైఎస్ జగన్, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు ప్రభుత్వ, పోలీసుల లోపాలను ప్రశ్నించింది. విమానాశ్రయంలో మూడు నెలలుగా సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదని నిలదీస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఎంపీ వి.విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో ఢిల్లీలోని బీసీఏఎస్ డీజీ కుమార్ రాజేష్‌చంద్ర కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు గానీ, ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని అయిన టీడీపీ నేత హర్షవర్థన్గానీ విమానాశ్రయంలో ప్రవేశించేందుకు అవసరమైన ఏరోడ్రోమ్ ఏంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు కూడా చేయలేదని తెలిపారు. దీంతో ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. ఈ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే తమ కుట్ర బయటపడుతుందని ఆందోళన చెందారు. దీంతో అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పక్కా స్క్రిప్ట్ రచించారు. అందుకు శ్రీనివాసరావు కుటుంబీకులను పావులుగా వాడుకుంటూ దిగజారుడు రాజకీయాలకు తెగించారు. శ్రీనివాసరావు బెయిల్‌పై నేడు నిర్ణయం విశాఖ లీగల్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలక్ష్మి తన వాదనలను మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. మరికొంత మందిని విచారించాల్సిన అవసరముందని.. అలాగే హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం సరైంది కాదని వివరించారు. అనంతరం న్యాయమూర్తి తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. -
శ్రీనివాసరావుకు మానసిక వైద్యం పిటిషన్ తిరస్కరణ
సాక్షి, విశాఖపట్నం/విశాఖ లీగల్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. పోలీసులు నిందితుడిని శుక్రవారం అడవివరం జైలు నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య విశాఖపట్నం మూడో అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. ఈ కేసును విచారించిన మెజిస్ట్రేట్ ఈనెల 23 వరకు నిందితుడి రిమాండ్‌కు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో శ్రీనివాసరావు తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ జిల్లా కోర్టు నుంచి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఈ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ విలేకరులకు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేనందున విశాఖ మానసిక ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ తాను వేసిన సీఆర్పీసీ 328 పిటిషన్‌ను మెజిస్ట్రేట్ తిరస్కరించారని ఆయన వెల్లడించారు. నిందితునికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు, ప్రత్యేక వైద్య పరీక్షలు కావాలనుకున్నప్పుడు నిందితుడే స్వయంగా పిటిషన్ వేయాలి తప్ప నిందితుని తరుఫున పిటిషన్ ఇస్తే పరిగణనలోకి తీసుకోబోమని కోర్టు పేర్కొన్నట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల విచారణ కోసం మెమో ఈ కేసులో ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వని ప్రత్యక్ష సాక్షులకు సీఆర్పీసీ 164 కింద నోటీసులు ఇచ్చేందుకు అనుమతినివ్వాలని సిట్ తరుఫున మెమో ఫైల్ చేశారు. తమ ఎదుట వాంగ్మూలం ఇవ్వని వారు మెజిస్ట్రేట్ ఎదుట వారి వాంగ్మూలం రికార్డు చేసేందుకు వీలుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు నిందితుడికి లేఖరాసేందుకు సహకరించినవారికి, ఫ్లెక్సీ తయారు చేసినవారు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తనతో పాటు పనిచేసిన సహచర ఉద్యోగుల నుంచి కూడా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం తీసుకొనే వీలుగా సీఆర్పీసీ 164 కింద నోటీసులు ఇవ్వనున్నారు. ఈ విధంగా సాక్షులతో పాటు 30 మందికి నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరారు. -
వైఎస్ జగన్‌పై దాడి కేసు: సిట్ విచారణలో ఊహించిందే జరిగింది
-
వైఎస్ఆర్సీపీతో ఎలాంటి సంబంధం లేదు
-
ఇదీ అసలు కథ
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ బాస్ ఏం చెప్పారో అవే మాటలు నిందితుడు శ్రీనివాసరావు నోటి వెంట చెప్పించేందుకు ‘సిట్’ బృందం తమదైన పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందురోజు ఎవరికంటా పడకుండా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పోలీస్ శైలిలో కోటింగ్ ఇచ్చి తాము చెప్పినట్లే మీడియాకు చెప్పాలని కోచింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కస్టడీకి తీసుకున్న మూడోరోజు ప్రైవేటు వైద్యుడు సూచించాడంటూ కేజీహెచ్‌కు తరలిస్తూ హైడ్రామా ఆడారు. పోలీస్‌స్టేషన్ లోపలినుంచి గుమ్మం వరకు తనంతట తానుగా నడిచి వచ్చిన అతడు ఉన్నట్టుండి కూలబడి పోయాడు. ('పిచ్చి’ కుట్రలు) పోలీసులు రెండు చేతులు పట్టుకుని జీపు ఎక్కించడం.. ఆ వెంటనే నేను ప్రజలతో మాట్లాడాలి.. అంటూ అతను కేకలు వేయడం.. అక్కడనుంచి మీడియాను ఏమారుస్తూ కేజీహెచ్‌కు తరలించడం. అక్కడ అతనితో మీడియాకు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. తాను జగన్ అభిమానని, జగన్ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని, అతనితో పోలీసులు చెప్పించేందుకు విఫల యత్నం చేశారు. చివరకు తనకు ప్రాణహాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. (‘బాస్’ల నివేదిక సిద్ధం) వెలుగులోకి వచ్చిన హైడ్రామా... ఈ కథ వెనుక పోలీసులు ఆడిన హైడ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి సీపీ మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా నిందితుణ్ని గాజువాక సబ్ డివిజన్ పరిధిలోని ఓ మారుమూల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెల్లవారు జామువరకు పోలీసులు తమదైన శైలిలో కోటింగ్, కోచింగ్ ఇచ్చి ‘రేపు కేజీహెచ్‌కు తీసుకెళ్తాం.. మీడియాకు మేము చెప్పినట్టు చెప్పు’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (జగన్‌ను చంపేయాలనుకున్నా) మీడియా వెళ్లిపోయిన తర్వాత వేరే పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తగా... కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు నిబంధనల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగించాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే అతని కదలికలు పూర్తిగా రికార్డు చేయాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో కూడా కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగిస్తున్నారు. ఇక్కడ తమదైన శైలిలో నిందితుడిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అర్ధరాత్రి తర్వాత లైట్లన్నీ ఆర్పేసి ఆ తర్వాత నిందితుడ్ని వేరే స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ తమ బాస్ చెప్పిన ఆ నాలుగు మాటలు చెప్పించేందుకు లాఠీలకు పని చెప్పారని చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీతో సంబంధం లేనేలేదు
సాక్షి, విశాఖపట్నం: తమ కుమారుడికి వైఎస్సార్సీపీతో అసలు సంబంధాలు లేనేలేవని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మాకు కూడా ఆపార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలిపారు. విచారణ కోసం ముమ్మిడివరం మండలం ఠానేలంక నుంచి బుధవారం రాత్రి పోలీసులు శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రమ్మ, తాతారావులను విశాఖకు తీసుకొచ్చారు. తొలుత గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో విచారించిన సిట్ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గురువారం రోజంతా అక్కడ వివిధ కోణాల్లో విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గ్రామంలో రాజకీయంగా ఏ పార్టీ వారితో తిరిగేవాడు, చురుగ్గా పాల్గొనే వాడా? వంటి విషయాలపై వారిని సిట్ ఆరా తీయగా... వాడు ఎప్పుడూ ఊళ్లో సరిగా ఉండనేలేదు.. వైఎస్సార్సీపీలో లేనే లేడు. ఆ పార్టీ నేతలతో పరిచయం కూడా లేదని వారు చెప్పారు. తొలుత వారిని వేర్వేరుగా విచారించిన సిట్ అధికారులు ఆ తర్వాత ఇద్దర్ని ఒకే రూమ్‌లో పెట్టి శ్రీనివాసరావు ప్రవర్తన, నడవడిక, గుణగణాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత శ్రీనివాసరావును వారి ఎదురుగా పెట్టి అడిగారు. నిందితుని ప్రవర్తన, ఆలోచనా విధానాలే కాకుండా, ఎవరెవరితో ఎక్కువగా ఉండేవాడని అడిగారు. ఎంతపని చేశావ్... ఏరా ఎందుకింత పనిచేశావ్.. ఏం సాధించాలని చేశావ్.. ఎవరి కోసం చేశావ్? తలదించుకునేలా చేశావ్.. ఊళ్లో తల ఎత్తుకోలేకపోతున్నాం..నీ వల్ల అందరి పరువు పోయిందిరా.. అంటూ తాతారావు, సావిత్రమ్మలు కుమారుడిని నిలదీశారు. రాజకీయంగా ఎంతో పేరున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితునిగా నిలబడిన తన కొడుకును చూసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టిందిరా? ఎవరుచెయ్యమన్నారు ? అసలెందుకు చేశావ్? అంటూ కొట్టినంత పనిచేశారు. మందలించినా కనిపించని పశ్చాత్తాపం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొడుకు ఉన్న గదిలోకి ఇద్దర్ని తీసుకెళ్లగానే వారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. గదిలో ఓ మూలన చేతికి బేడీలు వేసు కుని కూర్చొన్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నా అతనిలో కనీస పశ్చాత్తాపం కూడా కన్పించలేదు. మౌనంగా నిల్చుని ఏం సమాధానం చెప్పలేదు. కొనసాగిన విచారణ నిందితుడు శ్రీనివాసరావుపై విచారణ ఐదో రోజు గురువారం నిందితుని కాల్ డేటా చుట్టూనే తిరిగింది. కాల్ డేటా ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తీసుకొచ్చిన సయ్యద్ బీ షేక్, అమ్మాజీ షేక్, నాగర్ వల్లీ, రసూల్‌ను మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేసుకుని గురువారం తెల్లవారు జామున పంపించేశారు. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో పాటు ఆ రెస్టారెంట్లో పనిచేసిన ముగ్గురు యువతులను విచారించారు. పాదయాత్ర సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టుమీదుగా వైఎస్ జగన్ రాకపోకలు సాగించడం మొదలు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాల పుటేజ్‌ను విశ్లేషిస్తున్నారు. మరో వైపు శ్రీనావాసరావు ఫోన్లో 321 మందితో గడిచిన నెల రోజులుగా ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా నిర్ధారణకు వచ్చారు. వారిలో వందమందికి పైగా పేర్లను నిందితుడు చెప్పడంతో వారి వివరాలు ఆరా తీస్తున్నారు.ఇప్పటి వరకు 40 మందిని విచారించగా, వారిలో 25 మంది మహిళలే కావడం గమనార్హం. నిందితుడికి కేజీహెచ్ వైద్యలు పరీక్షలు నిర్వహించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ప్రకటిం చారు. కస్టడీ ముగియనుండడంతో శుక్రవారం నిందితుడిని తిరిగి సెంట్రల్ జైలుకు తరలించాల్సి ఉంది. -
జగన్‌పై హత్యాయత్నం ఘటనలో సిట్ విచారణ