Srisailam Power Plant
-
శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది మందిని బలి తీసుకున్న శ్రీశైలం పవర్ ప్లాంట్ దుర్ఘటన విచారణలో మరో ముందడుగు పడింది. ఈ కేసును సీఎం ఆదేశాలతో సీఐడీ చీఫ్ ఏడీజీ గోవింద్ సింగ్ స్వయంగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సీఐడీ ప్రత్యేక బృందాలు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం దుర్ఘటనకు అసలు కారణాలేమై ఉంటాయన్న విషయంలో సీఐడీ నిర్ధారణకు రానుంది. ఈ కేసులో మొదటి నుంచి కుట్ర కోణంపై ఎలాంటి ఆధారాలు లేవు. ఇది మానవ తప్పిదమా..? సాంకేతిక లోపమా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలంలో పర్యటించిన సమయంలో ఫోరెన్సిక్ విభాగ నిపుణులు పలు కీలక ఆధారాలు సేకరించారు. వాటిని పూర్తిగా విశ్లేషించిన అనంతరం నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. సీఐడీ తాను దర్యాప్తులో సేకరించిన అంశాలు, ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైన సాంకేతిక అంశాలను ఆధారంగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనుంది. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ కూడా తన పనిని వేగవంతం చేసింది. -
శ్రీశైలం అగ్ని ప్రమాదం: పరిహారం భారీగా పెంపు
సాక్షి, నాగర్ కర్నూల్ : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వెల్లడించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్కంఠ!) తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశం సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో శనివారం జరిగింది. శ్రీశైలం ప్రమాదంపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మరణించిన వారికి బోర్డు సభ్యులు సంతాపం తెలిపారు. సమావేశంలో సీఎండీ పాటు డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. (శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మళ్లీ పేలుడు?) గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందింది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణలోకి తీసుకుని, ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చేయగలిగినంత సాయం చేయాల్సిందిగా సీఎండీని కోరారు. ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాలను పరిగణలోకి తీసుకుని, మరణించిన వారి త్యాగాన్ని, సాహసాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సహాయంపై బోర్డు విస్తృతంగా చర్చించింది. శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేకమైన అంశంగా పరిగణించి సహాయం అందించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది. ‘‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అందరినీ కలిచివేస్తున్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. మరణించిన వారిని మళ్లీ తీసుకురాలేకపోవచ్చు. కానీ మానవ మాత్రులుగా చేయాల్సినంత సహాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కాకుండా, ప్రత్యేక అంశంగా పరిగణించి సహాయం అందించాలి. ప్రభుత్వం ప్రకటించిన సహాయానికి అదనంగా తెలంగాణ జెన్ కో పక్షాన అదనపు సహాయం అందించాలని భావిస్తున్నాం’’ అని సీఎండీ ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతిపాదనలు చేయగా, వాటిని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. అవి 1. ప్రమాదంలో మరణించిన డిఇకి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. దీనికి అదనంగా తెలంగాణ జెన్ కో ఒక్కొక్క కుటుంబానికి రూ.75లక్షల చొప్పున సహాయం అందిస్తుంది. దీని వల్ల డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున సహాయం అందుతుంది. 2. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది. విద్యార్హతలను బట్టి డిఈ, ఎఈల కుటుంబాలకు ఎఈ/పీఓ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 3. ప్రమాదానికి గురైన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అసవరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని సీఎండీప్రభాకర్ రావు నియమించారు. జెన్ కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సిఇలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించడం లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది. -
ప్రమాదమా.. మాక్ డ్రిల్లా?
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అధికారులు, ఉద్యోగులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. గత నెల 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంతో రూ.వందల కోట్లలో నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మరవక ముందే బుధవారం షార్ట్‌సర్క్యూట్‌తో మరోసారి మంటలు చెలరేగడం ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. అయితే అది మాక్‌డ్రిల్‌గా జెన్కో ఉన్నతాధికారులు ప్రకటించడంతో.. అది ప్రమాదమా.. మాక్ డ్రిల్లా అనే చర్చ మొదలైంది. ఉద్యోగులు, సిబ్బంది పరుగులు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనుల్లో భాగంగా బుధవారం మొదటి యూనిట్లో నీటిని తోడిపోసి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మోటారు, ఇతర సామగ్రిని విద్యుత్ కేంద్రంలోకి తీసుకొస్తున్న డీసీఎం వాహనం కేంద్రంలో తాత్కాలికంగా లైటింగ్ కోసం దోమలపెంట సబ్‌స్టేషన్ నుంచి కనెక్షన్ తీసుకున్న విద్యుత్ కేబుళ్లపై వెళ్లింది. అధిక లోడ్‌తో కూడిన డీసీఎం వాహనం విద్యుత్ కేబుళ్లపై వెళ్లడంతో వైర్లలో స్పార్క్ వచ్చి షార్ట్‌సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇటీవల జరిగిన ప్రమాదం నుంచి తేరుకోని ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. పొగ కమ్ముకోవడంతో అక్కడే ఉన్న అధికారులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేశారు. విద్యుత్ సరఫరా కూడా వెంటనే నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో నీటిని తోడి పోస్తున్న మూడు మోటార్లకు సంబంధించిన పైపులు కూడా కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదంలో విద్యుత్ వైర్ కాలిపోవడంతో వెంటనే మరో కేబుల్ వేసుకొని అక్కడి విద్యుత్ లైట్లను పునరుద్ధరించుకొని పనులు చేపట్టినట్లు తెలిసింది. ఘటన బయటికి తెలియడంతో మళ్లీ ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరిగింది. అప్రమత్తతను గుర్తించేందుకే.. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో బుధవారం జరిగిన ఘటన ప్రమాదంగా భావిస్తున్న తరుణంలో జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఈ సురేష్ రహస్య మాక్‌డ్రిల్‌గా ప్రకటించారు. పనులు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల అప్రమత్తతను గుర్తించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పునరుద్ధరణ పనులు చేపడుతున్న క్రమంలో అక్కడ కేవలం జెన్కో ఉద్యోగులే కాకుండా పారిశుద్ధ్య పనులు చేసేవారు, ఇతర కార్మికులు కూడా ఉన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తికాక ముందే మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారు. ఒకవేళ మాక్‌డ్రిల్ నిర్వహిస్తే బయటి సబ్‌స్టేషన్ నుంచి లైటింగ్ కోసం కనెక్షన్ తీసుకున్నప్పుడు స్థానిక విద్యుత్ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా, అప్రమత్తం చేయకుండా, అసలు విద్యుదుత్పత్తి ప్రారంభం కానప్పుడు మాక్‌డ్రిల్ ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాన్ని కప్పిపుచ్చుకునేందుకే మాక్ డ్రిల్‌గా అధికారులు ప్రకటించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అది అనుకోకుండా జరిగిన ఘటనగానే చెబుతున్నారు. -
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మళ్లీ పేలుడు?
-
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మళ్లీ పేలుడు?
సాక్షి, శ్రీశైలం: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు కలకలం రేపింది. బుధవారం సాయంత్రం భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో భయంతో పవర్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు లో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు ప్రభాకరరావు స్పష్టం చేశారు. గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించమని సీఎండీ ప్రభాకరరావు ఆదేశించారు. సిఎండి అదేశాలతోనే మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. -
శ్రీశైలం ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి విచారం
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాద ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంస్థ భవిష్యత్తు కోసం ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. ఈ సందర్బంగా శ్రీశైల ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఆర్కే సింగ్.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఈఏ) ద్వారా విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హైడ్రల్ పవర్ ప్రాజెక్టులను ఆడిట్ చేసి భద్రతా లోపాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు) కాగా ఆగస్టు 20న శ్రీశైలం పవర్ హౌజ్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే. అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైడ్రో పవర్ టన్నెల్లో పని జరుగుతున్న సమయంలో సడన్‌గా మెషీన్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏఈ, డిఈ , ఏఏఈ లతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. (చదవండి: శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం) -
శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
-
శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ బృందం దర్యాప్తును ముమ్మరంగా చేసింది. విచారణలో భాగంగా నిన్న మరోసారి శ్రీశైలం వెళ్లిన సీఐడీ బృందం నేడు (శుక్రవారం) సంఘటన స్థలంలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారిస్తోంది. ఇప్పటికే ప్రమాద ఘటనపై పలు ఆధారాలు సేకరించిన బృందం సభ్యులు ప్రమాద ఘటనపై శాఖా పరమైన విచారణ పూర్తి చేసింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డ ఉద్యోగుల నుంచి పవర్ ప్లాంట్‌కు సంబంధించిన విషయాలు, ప్రమాద కారణాలను సేకరిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రమాద జరిగిన తీరు, కారణాలపై సీఐడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. బ్యాటరీ మార్చే క్రమంలో ప్రమాదం! కాగా, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం ఘటనపై శ్రీశైలం ప్లాంట్ ఇంచార్జ్ ఉమా మహేశ్వర చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం.. ఆగస్టు 20 వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. హైడ్రో పవర్ టన్నెల్లో పని జరుగుతున్న సమయంలో సడన్‌గా మెషీన్లో ప్రమాదం సంభవించింది. ఏఈ, డిఈ , ఏఏఈ లతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ప్రాజెక్టులో బ్యాటరీలు అమర్చడానికి వచ్చిన అమర్ రాజ కంపెనీకి చెందిన ఇద్దరు మెకానిక్‌లు కూడా ఉన్నారు. టర్బైన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన పవర్ హౌస్ జనరేటర్లు. కేబుల్, ప్యానెల్స్, బ్యాటరీ చేంజ్ చేసేటపుడు న్యూకిలెన్స్ న్యూట్రల్‌గా మారకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని సీఐడీ బృందం ప్రాథమిక అంచనాకొచ్చింది. (చదవండి: 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ) -
15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగింది కానీ, ఆస్తి నష్టం అంతగా జరగలేదని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రమాదంలో వేల కోట్ల రూపా యల నష్టం జరిగిందనే ప్రచారంలో వాస్త వం లేదని చెప్పారు. బుధవారం శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇండోర్ గ్యాస్ సబ్‌స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూంలను ఆయన పరిశీలించారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నాయకత్వంలోని బృందంతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. జపాన్ నుంచి నిపుణుల బృందం త్వరలో ప్లాంట్‌ను సందర్శిస్తుందని, 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగో యూనిట్ బాగా దెబ్బతిన్నదని, ఒకటి, రెండు, ఐదు యూనిట్లలో కొంత నష్టం జరిగిందని, ఆరో యూనిట్లో ప్యానల్ దెబ్బతిందని వివరించారు. త్వరలో వీటి పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగల భద్రతే ముఖ్యం విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రభాకర్‌రావు అన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహించే 200 మంది సిబ్బందితో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలన్నారు. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నాలుగంత స్తుల్లో నిండిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల పేలిన ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు, ఇతర పరికరాలను సీఎండీ పరిశీలించారు. త్వరలో 2 విద్యుత్ యూనిట్లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆరో యూనిట్ సీజ్ శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రం పనులను సీఎండీ ప్రభాకర్‌రావు క్షుణ్నంగా పరిశీలించారు. దోమలపెంట నుంచి ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ద్వారా కేంద్రంలో లైట్లను వేయించారు. నాలుగు ఫ్లోర్లలో నీళ్లు నిండటంతో మోటార్లు ఏర్పాటు చేసి ఎత్తిపోస్తున్నారు. సీఐడీ విచారణలో భాగంగా ప్రమాదం సంభవించిన ఆరో యూనిట్‌ను సీజ్ చేశారు. విద్యుత్ ఎక్కడి నుంచి ప్రసారమైందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. పుట్టెడు దుఃఖంలోనూ.. ఇదిలాఉండగా తన సోదరుడు శ్రీనివాసరావు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరా మర్శించి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, అజయ్, సీఈలు ప్రభాకర్‌రావు, సురేష్, టెక్ని కల్ ఎస్ఈ హనుమాన్ పాల్గొన్నారు. -
ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమర్చున్న తరణంలోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అర్దరాత్రి వేళ బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఏముంది..? బ్యాటరీలు అమర్చే సమయంలో జరిగిన పొరపాటే 9 మంది ప్రాణాలు బలితీసుకున్నాయా..? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు జన్కోలో పనిచేసి ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ప్రమాదంపై సీఐడి విచారణ ముమ్మరం చేసింది. దర్యాప్తుకు కావాల్సిన పూర్తి స్థాయి ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఓ వైపు సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా..? లేక మానవ తప్పిదం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదంతా సాంకేతికమైన అంశం కావడంతో ప్రధానంగా యూనిట్ల పనితీరు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకోసం విద్యుత్ రంగ నిపుణుల సహకారం, ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఐతే సీఐడి విచారణ ఇలా కొనసాగుతుండగానే ప్రమాదం రోజుకో ఒకరమైన వాదనలు వెలుగు చూస్తున్నాయి. ఆ వాదనలు ప్రమాదం ముమ్మాటికి మానవ తప్పిదాలే కారణం అన్న ప్రచారం సాగుతుంది. (కొంపముంచిన అత్యవసర స్విచ్!) 220 కేవీకి డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్యానల్ బోర్డులో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని జన్కో ఉద్యాగులు భావిస్తున్నారు. జనరేటర్‌ను నియంత్రించే సెన్సార్ కు నేరుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోడ్ పెరిగి మంటలు చెలరేగినట్టు అధికారులు అనుకుంటున్నారు. ప్రమాదం జరిగిన రోజున హైద్రాబాద్ జల సౌదాలో సీఈ స్థాయిలో ఉన్న ఓ అధికారి వచ్చి బ్యాటరీలను మార్పించే పనులను హడావిడిగా చేశారన్న గుసగులు వినిపిస్తున్నాయి. ఇక్కడ సీఈ ఉన్నా ఆయన ప్రమేయం లేకుండానే సదరు అధికారే నలుగురిని తీసుకువచ్చి బ్యాటరీ మార్పిడి కార్యక్రమం చేపట్టినట్టు సమాచారం. అక్కడ పనిచేస్తున్న డీఈ, ఏఈ హడాహుడి పనులపై అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నేను చెప్పింది చేయాల్సిందేనని హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడి నుంచి బదిలీ ఐన ఓ డీఈ రిలీవ్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. బ్యాటరీలను మార్చాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదించినా... ఇంత జాప్యం జరగడం వెనక ఈ తతంగం నడిపిన సీఈ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అర్దరాత్రి సమయంలో హడావిడిగా బ్యాటరీల మార్పు వెనక కూడా ఈయన హస్తం ఉందని స్పష్టమౌతుంది. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఐతే ఈ దారుణ ఘటనపై అనుమానాలు, వాదనలు, విమర్శలు ఎలా ఉన్నా... ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్ప లేదు. ప్రస్తుతం జల విద్యుత్ కేంద్రం మళ్లీ పూర్వ వైభవానికి నోచుకోవాలంటే వేల కోట్లకు పైగా ఖర్చు చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది. అంతే కాదు ప్రమాదానికి గురైన యూనిట్లలో కొన్ని పరికరాలను జపాన్ కు ఆర్డర్ పై తెప్పించాల్సి ఉండటంతో పునరుద్దరణకు నెలలు సమయం పట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బ్యాటరీలు పాడయ్యేవరకు ఎందుకు నిర్లక్ష్యం?
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్‌హౌస్ ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. ప్యానల్ బోర్డులో వచ్చిన మంటలపై దర్యాప్తు కొనసాగుతోంది. 220 కేవీ డీసీ విద్యుత్ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్టు అంచనాకొచ్చింది. అయితే, అర్ధరాత్రి బ్యాటరీలు ఎందుకు బిగించాల్సి వచ్చింది? అధికారులు, సీఈలు లేకుండా బ్యాటరీలు ఎందుకు ఏర్పాటు చేశారు? బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదు? బ్యాటరీలు పూర్తిగా పాడయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అని శ్రీశైలం విద్యుత్ అధికారులను సీఐడీ బృందం ప్రశ్నించింది. దాంతోపాటు చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలను సేకరించింది. చదవండి: కొంపముంచిన అత్యవసర స్విచ్!) కాగా, శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్ కాయిల్స్ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
కొంపముంచిన అత్యవసర స్విచ్!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం ఎట్టకేలకు ప్రమాద స్థలానికి నిపుణుల బృందం చేరుకోగలిగింది. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, మంగళవారం వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్ కాయిల్స్ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్విచ్ పని చేయకపోవడంతోనే.. ఆరో యూనిట్‌కు సంబంధించిన ఎక్సైలేషన్ ప్యానెల్లో నిప్పురవ్వలు వచ్చిన వెంటనే.. దీనికి డీసీ కరెంట్ సరఫరా ఆటోమేటిక్‌గా ట్రిప్ కావాల్సి ఉంది. అలా జరిగి ఉంటే మంటలు ఆగిపోయి అగ్ని ప్రమాదం జరిగి ఉండకపోయేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఆటోమేటిక్‌గా పవర్ ట్రిప్ కాకున్నా, స్విచ్ ద్వారా నిలుపుదల చేసే ఏర్పాటు సైతం ఉంటుంది. ఈ స్విచ్ సైతం ఆ కీలక సమయంలో పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంచనాకు వస్తున్నారు. టర్బయిన్లలో ఉండే జనరేటర్లలోని వైన్డింగ్ కాయిల్స్ పరిధిలో అయస్కాంత క్షేత్రం ఏర్పాటు చేయడానికి ఎక్సైలేషన్ ప్యానెల్స్ ద్వారా డీసీ విద్యుత్‌ను వాటికి సరఫరా చేస్తారు. దీనితో జనరేటర్ రోటర్లు తిరిగి విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రారంభంలో డీసీ విద్యుత్‌ను బ్యాటరీల ద్వారా ఎౖMð్సలేషన్ ప్యానెల్‌కు అక్కడి నుంచి వైన్డింగ్ కాయిల్స్‌కు పంపుతారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరపడానికి బ్యాటరీలతో సరఫరా చేసే విద్యుత్ సరిపోదు. జనరేటర్ల నుంచి ఉత్పత్తి అయిన హైడెల్ పవర్‌నే ఏసీ విద్యుత్‌గా మార్చి మళ్లీ జనరేటర్లకు పంపిస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేటప్పుడే ఎౖMð్సలేషన్ ప్యానెల్లో స్పార్క్స్ వచ్చాయి. అప్పటికప్పుడు ఎక్సైలేషన్ ప్యానెల్‌కు పెద్ద మొత్తంలో డీసీ విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండకపోయేదని చెబుతున్నారు. కీలక సమయంలో డీసీ విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసే స్విచ్ పని చేయలేదని నిపుణులు అంటున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో బ్యాటరీలు పని చేయకపోవడంతోనే స్విచ్ పని చేయలేదని తెలుస్తోంది. పునరుద్ధరణ పాక్షికమే! శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మూడు రోజుల తర్వాత పవర్‌హౌస్‌లో పొగలు అదుపులోకి వచ్చినా పునరుద్ధరణ పనులు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా లేవు. అతికష్టం మీద కేబుల్ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పవర్‌హౌస్‌లోని కొన్ని విద్యుత్ లైట్లు, ఎగ్జిట్స్ ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతి అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే భూగర్భ పవర్‌హౌస్‌లోకి నీరు వచ్చి చేరుతున్నట్టు భాస్తున్నారు. దీంతో ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తి చేపట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగో యూనిట్‌లోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతోనే 9 మంది మృతి చెందారని భావిస్తున్నారు. -
‘శ్రీశైలం మృతుల కుటుంబాలకు 2 కోట్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ప్లాంట్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నివాళులు అర్పించింది. కొవ్వొత్తులు వెలిగించి, మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ మాట్లాడుతూ.. ‘తెలంగాణ జెన్కోలో 20వ తేదీన అనుకోకుండా జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ప్లాంట్ కాపాడాలని చూశారు. యువ ఇంజనీర్లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు 2 కోట్ల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎండిని కోరుతున్నాం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం సీఎండీని కలిసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని మా ఉద్యోగులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎమర్జెన్సీ కండిషన్లో కూడా మా విద్యుత్ ఉద్యోగులు నిరంతరం పని చేస్తున్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరుగకూడదు అని కోరుకుంటున్నాం. ఆగస్టు 21వ తేదీని విద్యుత్ ఉద్యోగుల అమరుల వీరుల దినోత్సవం ప్రకటించాలని కోరుతున్నాం. ఇదే చివరి ఘటన కావాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ -
పవర్ హౌస్‌లోకి నీళ్లు.. విచారణకు ఆటంకం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో సోమవారం విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో చీకటి, వేడి ఎక్కువగా ఉండడంతో పూర్తి అండర్ గ్రౌండ్‌కు దర్యాప్తు బృందం వెళ్లలేకపోయింది. కొన్ని చోట్ల కాలిన పదార్థాల నుండి సీఐడీ బృందం షాంపిల్స్ సేకరించారు. మానవ తప్పిదమా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఇప్పటికే అధికారుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని సాక్ష్యాల కోసం సీఐడీ అధికారులు నేడు విచారణ చేట్టారు. అదే విధంగా పవర్ హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో చేస్తున్న మరమ్మతుల వల్ల దర్యాప్తుకు కొంత ఆటంకం ఏర్పడింది. పవర్ హౌస్‌లోకి విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది బయటి నుంచి లోపలికి విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. ఊట నీరును మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. (శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ) -
శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ
-
శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై ఇప్పటికే సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ ఆరంభించగా, తాజాగా మరో కమిటీని నియమించారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎండీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలో శ్రీనివాసరావు(జేఎండీ), జగత్‌రెడ్డి(ట్రాన్స్మిషన్ డైరెక్టర్), సచ్చిదానందం(టీఎస్ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్), రత్నాకర్(కన్వీనర్)లు సభ్యులుగా ఉన్నారు.( చదవండి: శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) -
శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ
-
శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ
సాక్షి, నాగర్‌కర్నూల్ : శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన ఏఈలు సుందర్, మోహన్ల చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు మోహన్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలను వీడియో తీశాడు. శనివారం మోహన్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టిన అతడి భార్య అందులోని వీడియో దృశ్యాలు, సంభాషణలను చూసి కన్నీటి పర్యంతమైంది. (నువ్వు, పిల్లలు జాగ్రత్త.. సుందర్ చివరి మాటలు) మృతులు సుందర్, మోహన్ల మధ్య సంభాషణ సుందర్ : ఇక కష్టం! మన పని అయిపోయింది. ఆశలు వదులుకో. మోహన్ : నైబై ఆశగా ఉండాలె. కొద్దిసేపు ఆలోచించుకుని పోదాం. సుందర్ : ఇక మనం బతకం! పొగ మొత్తం అలుముకుంది. అంతకు క్రితం సుందర్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణ సైతం వైరల్‌గా మారింది. ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అన్న సుందర్ చివరి మాటలు పలువురిని కదిలించాయి. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీ విచారణ
-
శ్రీశైలం ప్రమాదం: వివరాలు సేకరిస్తున్న సీఐడీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలను సీఐడీ దర్యాప్తు బృందం విశ్లేషించనున్నది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందని టెక్నికల్ బృందాలు వీడియో తీశారు. (కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) పవర్ సప్లై ఎలా ఇచ్చారనే వివరాలు సీఐడీ రాబడుతోంది. పలువురు అధికారుల నుంచి సీఐడీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మొదట ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న స్థలంలోని పదార్థాలను అధికారులు సేకరించారు. అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా? లేదా? అన్న దానిపై సీఐడీ టెక్నికల్ బృందం విశ్లేషించనుంది. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. మానవ తప్పిదం ఉందా లేదా అనేది సీఐడీ అధికారులు తేల్చనున్నారు. (శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ) చదవండి: (‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
-
‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రo ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. అజాంపురా హరిలాల్ బాగ్‌లోని ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఆయన కలిశారు. ఫాతిమా ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె చిన్నప్పటి నుంచి ధైర్యశాలియని, చదువులో ముందుడేదని ఎంపీ గుర్తు చేసుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇతరులను కాపాడే క్రమంలో ఫాతిమా అసువులు బాశారని అన్నారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. కాగా, శ్రీశైలం ఎడమ గుట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 17 మంది విధుల్లో ఉండగా.. 8 మంది గాయాలతో బయటపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: మృత్యుసొరంగం) -
కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత
-
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ విచారణ కొనసాగుతోంది. శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై విచారణకు నాలుగు బృందాలు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ సైన్స్, సీఐడీ, లోకల్ పోలీసుల టీమ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాద ఘటనపై ఈగలపెంట పోలీస్ స్టేషన్లో 174 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 8 మంది గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. (చదవండి: కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) (చదవండి: మృత్యుసొరంగం) -
కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. (చదవండి: పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదాలు!) పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి మరో 8 మందికి గాయాలు కాగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాషియా ప్రకటించింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. (చదవండి: మృత్యుసొరంగం) ఆ స్వేచ్ఛ కూడా లేదా: ఎంపీ రేవంత్ ఇదిలా ఉంటే శ్రీశైలం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వంపై ఎంపీ రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్‌కు అంత భయమెందుకు? దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?’ అని ఆయన సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.