the stock market
-
ఒడిదుడుకుల వారం..
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం వచ్చే నెల 5న ఆర్బీఐ పాలసీ సమీక్ష రేట్ల కోతపై అంచనాలు న్యూఢిల్లీ: మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారం స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని నిపుణులంటున్నారు. హోలి, గుడ్ ప్రైడే కారణంగా గత వారంలో గురు, శుక్రవారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఈ దీర్ఘకాల సెలవుల అనంతరం ప్రారంభం కానున్న ఈ వారం స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల విక్రయాల గణాంకాలను ఈ శుక్రవారం(ఏప్రిల్ 1న) వాహన కంపెనీలు వెల్లడించనున్నందున ఆ కంపెనీ షేర్లు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వారం కూడా ఇదే. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలో గురువారం నాడు(మార్చి 31న) ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేయనున్న నేపధ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. రేట్ల కోత కీలకం.. వచ్చే నెల 5న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. సమీప కాలంలో స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నదని సింఘానియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు... స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య సమీక్షపైననే తర్వాతి దశ స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్)వినోద్ నాయర్ చెప్పారు. ఈ సమీక్షలో సానుకూల నిర్ణయం వెలువడితే స్టాక్ మార్కెట్ మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు. పరిమితశ్రేణిలో ట్రేడింగ్.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమితశ్రేణిలో ట్రేడవుతుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభమయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని వివరించారు. చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లను తగ్గించినందున ఆర్బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలు సర్వత్రా నెలకొన్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవుతోందని, తాజాగా పొజిషన్లు తీసుకోవడం ద్వారా ట్రేడర్లు.. స్టాక్ మార్కెట్ పెరిగితే లాభపడతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా మార్కెట్ మరింత బలహీనపడవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) వైభవ్ అగర్వాల్ చెప్పారు. ఆర్బీఐ రేట్ల కోత, కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు మార్కెట్ పెరగడానికి దోహద పడవచ్చని పేర్కొన్నారు. ఒడిదుడుకులున్నప్పటికీ, స్టాక్ సూచీలు తమ జోరును కొనసాగిస్తాయని యెస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ చెప్పారు. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగానే ఉంటుందని వివరించారు. భారత్‌తో సహా అన్ని వర్ధమాన దేశాలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు కీలకం కానున్నదని వివరించారు. మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు (1.54 శాతం)లాభపడి 25,338 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు(1.47 శాతం) లాభపడి 7,717 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లో రూ.16,500 కోట్లు (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)ఈ నెల 23 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ.15,660 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.816 కోట్లు పెట్టుబడుటు పెట్టారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. -
23వేల దిగువకు సెన్సెక్స్..
‘ప్రభ’వించని రైల్వే బడ్జెట్ 7,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్ డేటా... టర్నోవర్ (రూ.కోట్లలో) బీఎస్ఈ 2,319 ఎన్ఎస్ఈ (ఈక్విటీ విభాగం) 18,483 ఎన్ఎస్ఈ (డెరివేటివ్స్) 5,95,640 ఎఫ్ఐఐ - 1,466 డీఐఐ 807 రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపుకు ప్రపంచ మార్కెట్ల బలహీనతలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 23,000, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 113 పాయింట్లు నష్టపోయి 22,976 పాయింట్లకు, నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 6,971 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఐటీ, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోగా, లోహ, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధులు తరలిపోతుండటంతో చైనా స్టాక్ సూచీ 6 శాతానికి పైగా క్షీణించడం, రూపాయి 30 నెలల కనిష్టానికి పతనం కావడం, ప్రతికూల ప్రభావం చూపాయి.సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. 30 నెలల కనిష్టానికి రూపాయి డాలర్‌తో రూపాయి మారకం గురువారం 30 నెలల కనిష్టానికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలనుంచి నిధులు ఉపసంహరించు కోవడం, బ్యాంక్‌లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ నేపథ్యంలో రూపాయి 15 పైసలు క్షీణించి 68.72 వద్ద ముగిసింది. నెల చివర కావడంతో దిగుమతిదారులు.. ముఖ్యంగా చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ బాగా ఉందని ఒక ఫారెక్స్ డీలర్ వ్యాఖ్యానించారు. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం నాటి ముగింపుతో (68.57)తో పోల్చితే డాలర్‌తో రూపాయి మారకం గురువారం 68.47 వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ఎస్డీఆర్ నిబంధనల సవరణ భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వ్యూహాత్మక రుణ పునర్వ్యస్థీకరణ(ఎస్డీఆర్) నిబంధనలను సవరిం చింది. బ్యాంక్‌లు మొత్తం రుణ విలువలో 15 శాతం వరకూ ఎస్‌డీఆర్‌లకు కేటాయింపులు జరపాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకులు తనఖాగా తీసుకున్న ఈక్విటీ విలువ మరింత తగ్గకుండా ఉండేలా ఈ నిబంధనలను ఆర్బీఐ రూపొందించింది. ఎస్డీఆర్ నిబంధనలో మరింత సరళత్వం కావాలని పలువురు కోరడంతో కొత్త నిబంధనలను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులు ఎస్డీఆర్ ద్వారా తీసుకున్న కంపెనీల్లోని వాటాను 18 నెలలలోపు కొత్త ప్రమోటర్లకు విక్రయించరాదని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. -
సెన్సెక్స్ 378 పాయింట్లు డౌన్
ఐదో రోజూ నష్టాలే 25,743 వద్ద ముగిసిన సెన్సెక్స్ అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మంగళవారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. బిహార్ ఎన్నికల్లో మోదీకి ఎదురుదెబ్బ తగలడంతో ఆర్థిక సంస్కరణలకు అడ్డంకులు ఏర్పడుతాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు క్షీణించి 25,743 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 7,783 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ.సెన్సెక్స్‌లకు ఇవి ఆరు వారాల కనిష్ట స్థాయిలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 412 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 847 పాయింట్లు నష్టపోయింది. డిసెంబర్లోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతోందంటూ తాజా సంకేతాలు వెలువడడం, అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రభావం చూపాయి. రిఫైనరీ, లోహ, ఫార్మా, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ, విద్యుత్తు షేర్లు పతనమయ్యాయి. 2071 సంవత్ సంవత్సరం చివరి రోజు స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. 2071 సంవత్ సంవత్సరంలో సెన్సెక్స్ 1,044 పాయింట్లు (3.89 శాతం), నిఫ్టీ 213 పాయింట్లు(2.65 శాతం) చొప్పున క్షీణించాయి. సంవత్ సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటే పదేళ్ల కాలంలో సెన్సెక్స్ ఇంత అధ్వాన పనితీరు కనబరచడం ఇది మూడోసారి. స్పెషల్ మూరత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా నేడు(బుధవారం) బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో సాధారణ ట్రేడింగ్ వుండదు. అయితే ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ జరగనున్నది. సాయంత్రం 5.45 నుంచి 6.45 వరకూ గంట పాటు ఈ ట్రేడింగ్ జరుగుతుంది. బలిపాడ్యమి కారణంగా గురువారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. -
భారీ నష్టాల నుంచి రికవరీ
మైనస్ 608 నుంచి మైనస్ 144కు బిహార్ ఫలితాల ప్రభావం స్వల్పమే బిహార్ ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్లుగానే స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. అయితే అందరూ ఊహించినట్లుగా భారీగానే పతనమైనప్పటికీ, ఎవరూ ఊహించని విధంగా స్టాక్ సూచీలు రికవరీ అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 608 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 144 పాయింట్ల నష్టంతో 26,121 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 7,915 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ నష్టాల పాలయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. తదుపరి సంస్కరణలపై ఆర్థిక మంత్రి జెట్లీ వ్యాఖ్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుందన్న ఫిచ్ రేటింగ్..తదితర అంశాలు రికవరీకి తోడ్పడ్డాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి హెచ్చరిక లేఖలు అందిన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేర్ పతనం కొనసాగుతోంది. సీఎన్ఎక్స్ నిఫ్టీ ఇక నుంచి నిఫ్టీ 50 న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన సూచీలన్నింటీని రీబ్రాండ్ చేసింది. అన్ని సూచీల పేర్ల నుంచి సీఎన్ఎక్స్ను తొలగించాలని ఎన్ఎస్ఈ నిర్ణయించింది. సీఎన్ఎక్స్ నిఫ్టీ ఇక నుంచి నిఫ్టీ 50గానూ, నిఫ్టీ జూనియర్‌ను ఇక నుంచి నిఫ్టీ నెక్స్ట్ 50 గానూ, సీఎన్ఎక్స్ ఐటీని నిఫ్టీ ఐటీగానూ వ్యవహరిస్తారు. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ ఐపీఓకు సెబీ ఓకే న్యూఢిల్లీ: ప్రముఖ డయాగ్నస్టిక్ చెయిన్ డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు కలిసి 14 శాతం వాటాకు సమానమైన 1.1 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఆఫర్ ధరను ఇంకా నిర్ణయించలేదని కంపెనీ పేర్కొంది. -
27,000పైకి సెన్సెక్స్
ముడి చమురు ధరల రికవరీ ప్రభావం వరుసగా ఆరో రోజూ లాభాలే 103 పాయింట్ల లాభంతో 27,036కు సెన్సెక్స్ 24 పాయింట్లు లాభపడి 8,177కు నిఫ్టీ మైనింగ్, ఇంధన షేర్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆర్బీఐ రేట్ల కోతతో మొదలైన స్టాక్ మార్కెట్ లాభాల పరుగు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగింది. రూపాయి రెండు నెలల గరిష్టానికి బలపడడం, ముడిచమురు ధరలు రికవరీ అవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభపడడం కూడా ప్రభావం చూపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 27,036 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 8,177 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల బాగా పతనమైన లోహ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దిగువ స్థాయిలో షార్ట్‌కవరింగ్ జరగడం, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పుంజుకుంటుండడం వంటి కారణాల వల్ల లోహ షేర్లు లాభపడ్డాయి. వచ్చే ఏడాది చమురు సరఫరాలను మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా యోచిస్తోందన్న వార్తలు, భవిష్యత్తు ఉత్పత్తిపై చర్చలు జరపడానికి సౌదీ అరేబియా రష్యాలు సుముఖంగా ఉన్నాయన్న వార్తల కారణంగా ముడిచమురు ధరలు ఎగిశాయి. బ్యారెల్ ముడి చమురు ధర 50 డాలర్లకు పెరగడంతో ఇంధన షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 26,967 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రా డేలో 26,878 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ముగింపులో కొనుగోళ్లు పుంజుకోవడంతో 27,083 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 103 పాయింట్ల లాభంతో 27,036 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,419 పాయింట్లు లాభపడింది. విప్రో 2 శాతం డౌన్: లింగ వివక్ష, అసమాన వేతనాలతోపాటు అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని లండన్‌లో ఒక భారత మహిళా ఉద్యోగి విప్రో కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 1.8 శాతం క్షీణించి రూ.589 వద్ద ముగిసింది. -
ఆసక్తికరమైన సరుకు కావలసిందే కానీ...!
అవలోకనం మన ప్రసార మీడియా సంచలనం పేరుతో పసలేని కథనాల వెంటపడుతున్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యానికి గురికాలేదు. అదేమంత కొత్త విషయం కాదు. కానీ స్టాక్‌మార్కెట్ పతనం వంటి ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన ముఖ్య కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వస్తున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చడమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. మీడియా ఉన్నది దేనికి? తాజా వార్తలు లేక లోతైన వార్తా కథనాలను అందించాలని కోరుకుంటున్న వాళ్ల కోసమేనా? మన మీడియా అంతటి స్థాయిలో ఉందని నేననుకోవడం లేదు. ఉదాహరణకు.. చైనా మార్కెట్లలో అనిశ్చితి, అస్థిర త్వం తర్వాత ఏం జరగనుందనే అంశంపై ఈ వారం స్టాక్ మార్కెట్లు ప్రకంపించిపోయాయి. ఆగస్టు 24 సోమవారం నాడు నేను కాస్త త్వరగా మేల్కొని, ఆసియా మార్కెట్లు ఒకదాని వెనుక ఒకటి కుప్ప కూలిపోయిన తీరుపై వార్తా కథనాలు చదివాను. అప్పుడు సమయం ఉదయం 5 గంటలయింది. స్టాక్‌మార్కెట్ పత నం నేపథ్యంలో భారత్‌లో ఏం జరగనుందో అవగతం చేసుకోవడానికి నేను అంత పొద్దుటే వేచిచూస్తుండిపో యాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. యావత్ ప్రపంచ మీడియా దాని గురించి చర్చిస్తూ ఉండేది. మార్కెట్లు ఉద యం 9 గంటలకు ప్రారంభమైనప్పుడు టీవీ చానళ్లను చూడటం ద్వారా స్టాక్ మార్కెట్ పరిణామాల గురించి ఇంకా మంచిగా అర్థం చేసుకోవచ్చని నేను భావించాను. అయితే ఆ సమయంలో మన ఇంగ్లిష్ వార్తా చానళ్లలో కింది కథనాన్ని ప్రసారం చేశారు. పంజాబ్‌లో ఒక బాలిక తన ఫేస్బుక్లో మోటార్ సైకిల్‌పై ఉన్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేసింది. అతగాడు తనను బూతులతో సత్కరించాడని ఆమె రాసింది (అయితే ఆమె నిర్దిష్టంగా ఏం జరిగిందో వివ రించలేదు). ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్న వారు చెబు తున్నట్లుగా ఆ పోస్ట్‌ను ఆన్లైన్లో విపరీతంగా చూసే శారట. మీడియా ఆ సమయంలో చర్చిస్తూ ఉండిన కథనం ఇదే. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకుండానే చానళ్లు ఆ వ్యక్తి ఉపయోగించిన అశ్లీల పదాల గురించి చర్చిస్తూపోయాయి. ఇంగ్లిష్‌లో ఒక్క జాతీయ చానల్ కూడా స్టాక్ మార్కెట్ కల్లో లాన్ని చూపించలేదు, మార్కెట్ కుప్పకూలడంపై చర్చించ లేదు. ఇక బిజినెస్ చానల్స్ విషయానికి వస్తే.. వీటి విశ్లేషణ ఎక్కువగా మదుపుదారులపైనే సాగింది కానీ, స్టాక్ మార్కె ట్ పతనంలోని విస్తృత అంశాలపై ఆసక్తి చూపిన వారిపై ఇవేవీ దృష్టి పెట్టలేదు. మీడియాలో చాలాకాలంగా పని చేస్తున్న నాలాంటి వ్యక్తికి ఇది చాలా కొత్త పరిణామం. మన ప్రధాన స్రవంతి మీడియా.. టాబ్లాయిడ్ తర హాకు కుదించుకుపోవడం గమనించిన మీలాంటి అనేక మంది లాగే నేను కూడా, మీడియా పసలేని కథనాల వెంట పడుతున్నప్పుడు ఆశ్చర్యానికి గురికాలేదు. అది కొత్త విష యమేమీ కాదు. కానీ.. ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన ముఖ్య కథనంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చ డమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్స లు ఊహించలేదు. ఆనాటి ఉదయం ఇదే నన్ను నిస్పృహకు గురిచేసింది. మన ఆర్థిక వ్యవస్థలను, అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం ఒకటి ద్రవ్య మార్కెట్లలో ఏర్ప డుతోందని ప్రపంచం మనకు తెలుపుతున్న సమయమది. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి ప్రవర్తనపై మరొక వ్యక్తి వ్యాఖ్యకు సంబంధించిన విషయంపైనే మన మీడియా ఆసక్తి చూపుతోంది. ఆ మరుసటి దినం పటేళ్ల ఆందోళన జాతీయ వార్తగా మారిపోయింది. ఇది ఒకే వార్తలోకి పలు అంశాలను తీసు కువచ్చింది: కుల రాజకీయాలు, గుజరాత్ నమూనా, రిజ ర్వేషన్ భావజాలం, అసమానాభివృద్ధి వైైగె రా వగైరా. భార త్లో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన వార్త. ఒక మేరకు ప్రపంచం దృష్టిని కూడా ఇది ఆకర్షించింది. ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’, ‘బీబీసీ’తో సహా పలు విదేశీ మీడియా చానళ్లు ఈ విషయమై నా ఇంటర్వ్యూ తీసుకు న్నాయి. గుజరాత్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇవి చాలా ఆసక్తి చూపాయి. గుజరాత్ పటేళ్ల ఆందోళన నన్ను ఎంతగానో ఆకట్టు కుంది. నేను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాడిని అయినందుకు మాత్రమే కాదు. అది విస్తృతంగా జనం వీక్షించే పెద్ద, ముఖ్యమైన కథనం. కానీ బుధవారం నేను పని నుంచి తిరిగి వచ్చి టీవీ ఆన్ చేసినప్పుడు ఇంత పెద్ద కథనాన్ని కూడా సంపన్న కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక హత్యా వార్త మరుగున పడే సింది. నిజమే. ఫేస్బుక్లో ప్రచురించిన ఏదైనా పోస్టు కన్నా ఆ బాలిక మరణ ఘటన మరింత తీవ్రమైనదే.. కాదనను. కానీ పది మంది మరణాలకు దారితీయడమే కాకుండా, ప్రధానమంత్రి జోక్యానికి కూడా కారణమైన ఆందోళన కంటే ఈ వార్త ఎంతో ముఖ్యమా? పటేళ్ల ఆందోళన చాలా కాలం గుర్తుండిపోయే తరహా కథనం. కులం, రిజర్వేషన్‌పై చర్చను రగిల్చేంత శక్తి కలిగిన కథనం ఇది. దీని ప్రాథమిక డిమాండ్ ఏదంటే రిజర్వేషన్ల తొలగింపే. ఇది కూడా పటేళ్లు గతంలో చేసిన పాత డిమాండే. ఈ సమస్య రగులుకొన్నట్లయితే, అగ్రకులాల ప్రజ లకు ఇది అతి పెద్ద సమస్యగా మారుతుంది కూడా. రిజర్వే షన్ కాదు మెరిట్‌కు పట్టం కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్‌ను చాలాకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అగ్రకు లాలు భావిస్తున్నాయి. పాతికేళ్ల క్రితం మండల్ కమిషన్ నివే దిక తరహాలో దేశ రాజకీయాలనే మార్చివేసేంత శక్తివంత మైన కథనం ఇది. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు. కానీ మనం మాత్రం పటేళ్ల ఆందోళనపై తక్కువగానూ, ఆ బాలిక హత్యపై ఎక్కువగానూ ప్రసారమవుతున్న వార్తల పైనే దృష్టి పెట్టాం. టెలివిజన్‌కి ఆసక్తికరమైన సరుకు కావాలన్న విషయం నాకు తెలుసు. దాన్ని నేను గుర్తిస్తాను కూడా. వ్యక్తిగతంగా నాకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ, టీవీలు వినోద, అసందర్భ వార్తలను ప్రసారం చేస్తున్నప్పటికీ వాటితో నాకు పెద్దగా సమస్య లేదు. కానీ, అదే సమయంలో అంతకు మించిన అతి పెద్ద, ప్రముఖ వార్త సంచలనం కలిగిస్తున్న సందర్భంలో అలాంటి పరమ బాధ్యతారహిత వైఖరిని క్షమించడం నాకు కష్టమే. పటేళ్ల డిమాండ్ అనేది ఒక అపరి చిత వ్యక్తి హత్య ఘటనతో సమానమైనస్థాయి కలిగిన కథ నంకాదని దమ్మున్న జర్నలిస్టు ఎవరైనా అంచనా కట్టగలరు. ప్రధాన సమర రంగంలో పూర్తి కార్యాచరణను రిపోర్టు చేయవలసి ఉన్న తరుణంలో, అప్రధాన రంగంలోని అసం బద్ధ అంశాలను నివేదించేందుకు పరుగులు తీస్తున్న టెలివి జన్ మీడియా ప్రత్యేకించి ఇంగ్లిష్ చానళ్లు తమ శ్రోతలకు, వీక్షకులకు ద్రోహం చేస్తున్న మాట నిజం. ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)aakar.patel@icloud.com) -
సెన్సెక్స్ సెంచరీ..
- ఫార్మా, ఐటీ షేర్ల దన్నుతో లాభాలు - కలసివచ్చిన షాంఘై రికవరీ - 100 పాయింట్ల ప్లస్‌తో 27,932కు సెన్సెక్స్ గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో క్షీణిస్తూ వస్తున్న రూపాయి కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ నిధుల ఉపసంహరణను నిరోధించడానికి, యువాన్ విలువ తగ్గింపు కారణంగా లిక్విడిటీతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకులకు మరి న్ని నిధులు ఇవ్వనున్నామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో 5 శాతం వరకూ నష్టపోయిన చైనా షాంఘై సూచీ చివరకు 1 శాతం లాభపడింది. దీంతో వరుసగా రెండు రోజుల మన స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 27,932 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 8,495 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్ బుధవారం అర్థరాత్రి వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో 20% వరకూ ఎగసిన బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 28 వేల పాయింట్లు, నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువనే ముగిశాయి. -
గణాంకాల జోష్‌తో...
వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ అప్ - 161 లాభంతో 26,587 పాయింట్లకు సెన్సెక్స్ - 30 పాయింట్ల లాభంతో.. 8,014కు నిఫ్టీ ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం, మేలో ద్రవ్యోల్బణం నిలకడగా ఉండటంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. వాహన, ఆరోగ్య సంరక్షణ షేర్ల దన్నుతో బీఎస్ఈ సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 26,587 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 8.014 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల బాగా క్షీణించిన షేర్లలో కొనుగోళ్లు జరగడం, ఇప్పటిదాకా కురిసిన వర్షాల సగటు సాధారణ పరిమితి కంటే 5 శాతం అధికమని వాతావారణ విభాగం వెల్లడించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా శుక్రవారానికి కొనసాగింపుగా మన స్టాక్ మార్కెట్ మాత్రం లాభాలు పంచింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, వాహన షేర్లతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల, ఆర్థిక సేవల కంపెనీలు షేర్లు పెరిగాయి. రిలీఫ్ ర్యాలీ: ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. దక్షిణాదిన సకాలంలో వచ్చిన రుతుపవనాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయన్నారు. లాభ నష్టాల్లో... 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,353 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.11,654 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,12,556 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.605 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.650 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. 1,440 షేర్లు లాభాల్లో, 1,207 షేర్లు నష్టాల్లో ముగిశాయి. -
8,000 దిగువకు నిఫ్టీ
వర్షాభావ భయాలతో మార్కెట్ కుదేల్ ♦ 470 పాయింట్ల నష్టంతో 26,371కు సెన్సెక్స్ ♦ నిఫ్టీకి 159 మైనస్... సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయన్న ఆందోళనలు గురువారం స్టాక్‌మార్కెట్‌పై పిడుగులు కురిపించాయి. దీనికి తోడు రుణ వృద్ధి మందగమనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 470 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు వచ్చేసింది. కరంట్ అకౌంట్ లోటు తగ్గడం, సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు. వీటిని వేటినీ ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు.శుక్రవారం విడుదల కానున్న ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి, మే నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టిపెట్టిన ట్రేడర్లు తమ పొజిషన్లను తగ్గించుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు. మొత్తం మీద సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 26,371 పాయింట్ల వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 7,965 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు గత ఏడాది అక్టోబర్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. బ్యాంక్, ఆర్థిక సేవలు, వాహన, విద్యుత్ రంగ కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి. బ్యాంక్ షేర్లు బేర్ ... ప్రభుత్వ రంగ బ్యాంకులకు బడ్జెట్లో కేటాయించినదాని కంటే మరిన్ని పెట్టుబడులు కావాలంటూ ఆర్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ఆర్థికమంత్రి జైట్లీ శుక్రవారం పీఎస్ బ్యాంకు చీఫ్‌లతో భేటీ కానున్నారు. 30 సెన్సెక్స్ షేర్లలో 29కి నష్టాలే: వేదాంతా మినహా 30 సెన్సెక్స్ షేర్లలో 29 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,508 కోట్లు. ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,406 కోట్లు. డెరివేటివ్స్ విభాగంలో రూ.2,80,050 కోట్లుగా నమోదైంది. నిఫ్టీ టార్గెట్‌ను సవరించిన యూబీఎస్ ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ టార్గెట్‌ను స్విట్జర్లాండ్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సవరించింది. ఈ టార్గెట్‌ను గత 9,200 నుంచి వర్షాభావ అంచనాల వల్ల ప్రస్తుతం 8,600కు తగ్గిస్తున్నామని తెలిపింది. మూడు నెలల్లో 12 శాతం పతనం సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 27,000 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ కారణంగా 26,349 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 470 పాయింట్లు(1.75 శాతం) నష్టంతో 26,371 పాయింట్ల వద్ద ముగిసింది. 7,958-8,163 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు 159 పాయింట్ల (1.96 శాతం)నష్టంతో 7,965 పాయింట్ల వద్ద ముగి సింది. ఈ ఏడాది మార్చి 4న సెన్సెక్స్ 30,025, నిఫ్టీ 9,119 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అప్పటి నుంచి చూస్తే కేవలం మూడు నెలల్లో సెన్సెక్స్ 12.2 శాతం, నిఫ్టీ 12.7 శాతం చొప్పున పతనమయ్యాయి. -
ఒడిదుడుకుల వారం!
- మార్కెట్‌పై నిపుణుల అంచనా - మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ముగింపు - కార్పొరేట్ల ఫలితాల తుదిదశ న్యూఢిల్లీ: చివరిదశ కార్పొరేట్ ఫలితాలు, మే నెల డెరివేటివ్స్ ముగింపు వంటి అంశాలతో ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేశారు. ఈ వారం బ్లూచిప్ కంపెనీలైన బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, గెయిల్, కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లాలు క్యూ4 ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇక మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నాయి. వీటి ముగింపు, జూన్ నెలకు జరిగే రోలోవర్స్ కారణంగా మార్కెట్ అటూ, ఇటూ ఊగిసలాడవచ్చన్న అంచనాల్ని నిపుణులు వ్యక్తంచేశారు. కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరిదశకు వచ్చిందని, ఆయా ఫలితాలకు అనుగుణంగా షేర్లు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఆర్థిక వృద్ధికి కీలకమైన రుతుపవనాల కదలికల్ని మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుందని ఆయన చెప్పారు. ఆర్బీఐ వైపు చూపు....: రేట్ల కోతపై రిజర్వుబ్యాంక్ తీసుకోబోయే నిర్ణయంపై అంచనాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. జూన్ 2న ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష వుంటుంది. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం వంటి కారణాలతో ఆర్బీఐ ఈ దఫా సమీక్షలో రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని ఆయన చెప్పారు. గతవారం మార్కెట్...: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత ఫలితంగా గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 27,957 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడువారాల్లో సెన్సెక్స్ 946 పాయింట్లు వృద్ధిచెందింది. అదేతీరులో ఎన్ఎస్ఈ నిఫ్టీ 197 పాయింట్ల లబ్దితో 8,459 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు క్రితం వారం ర్యాలీ జరిపాయి. ఎఫ్‌పీఐల విక్రయాలు 14,000 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మే నెలలో ఇప్పటివరకూ స్టాక్, డెట్ మార్కెట్లలో రూ. 14,000 కోట్ల నికర విక్రయాలు జరిపారు. రూ. 5,867 కోట్ల విలువైన షేర్లను, రూ. 8,807 కోట్ల విలువైన రుణపత్రాల్ని విక్రయించడంతో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 14,674 కోట్లకు చేరినట్లు డేటా వెల్లడిస్తున్నది. పన్నుల సమస్య, అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరగడం, ఆర్బీఐ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి అమ్మకాలకు కారణమని విశ్లేషకులంటున్నారు. -
ద్రవ్యలోటు గణాంకాల జోష్
* 363 పాయింట్ల లాభంతో 27,687కు సెన్సెక్స్ * 111 పాయింట్ల లాభంతో 8,374కు నిఫ్టీ * కొనసాగుతున్న కీలక రేట్ల కోత అంచనాలు ద్రవ్యలోటు గణాంకాల జోష్‌తో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోయాయి. ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతానికే పరిమితమైందని ప్రభుత్వం వెల్లడించడం, ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కొనసాగుతుండడం, సకాలంలోనే వర్షాలు కురుస్తాయన్న అంచనాలు, తదితర అంశాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 27,687 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 8,374 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. పెట్రోల్ ధరలు పెంచడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీల షేర్లు 4% పెరగడం కూడా స్టాక్ మార్కెట్ పెరుగుదలకు దోహదం చేసింది. నిఫ్టీ మళ్లీ 8,300 పాయింట్ల పైన ముగిసింది. ఆర్థిక మంత్రి అదే కోరుకుంటున్నారు.. నిర్దేశించుకున్న లక్ష్యానికంటే కూడా తక్కువ స్థాయిలోనే ద్రవ్యలోటును కట్టడి చేయగలిగామన్న ప్రభుత్వ ప్రకటన సెంటిమెంట్‌ను బలపరచిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లకు, ఆసియా మార్కెట్ పటిష్టంగా ట్రేడవడం తోడవడంతో స్టాక్ మార్కెట్ జోరు పెరిగిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి చెప్పారు. వచ్చే నెల 2న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ కీలక రేట్లలో కోత విధించాలని తాను కూడా కోరుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం సెంటిమెంట్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ 3.5 శాతం అప్ రిఫైనరీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, బ్యాంకింగ్, ఐటీ, టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. సిటికోలిన్కు ఇన్నోవేటర్ బ్రాండ్‌గా సోమాజిన ఔషధాన్ని భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.5 శాతం పెరిగి రూ. 3,613వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 27షేర్లు లాభపడ్డాయి. గెయిల్ 3.4 శాతం, టాటా పవర్ 3 శాతం, హెచ్డీఎఫ్సీ 2.3 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.9 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.8 శాతం, ఐటీసీ 1.8 శాతం, బజాజ్ ఆటో 1.8 శాతం, ఇన్ఫోసిస్ 1.6%, భెల్ 1.5 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.4%, హిందాల్కో 1.3 శాతం చొప్పున పెరిగాయి. 1,046 షేర్లు లాభాల్లో, 1,046 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,194 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,234 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,23,343 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.202 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.619 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
మార్కెట్ అప్డేట్ 6 పాయింట్ల నష్టంతో 28,879కు సెన్సెక్స్ 2 పాయింట్ల లాభంతో 8,780కు నిఫ్టీ ఐదు రోజుల బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. అయితే స్వల్ప లాభంతో నిఫ్టీ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిసింది. లాభాల స్వీకరణ (ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో) కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టాలకు లోనైంది. వెరశి సెనెక్స్ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 28,879 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,780 పాయింట్ల వద్ద ముగిశాయి. మొత్తం మీద స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారమూ లాభాల్లోనే ముగిసింది. బ్యాంకింగ్ కీలకం మార్కెట్ ఫ్లాట్‌గా మొదలై బేరిష్ మూడ్‌లోనే కొనసాగిందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. ఇక ఇప్పటి నుంచి నిఫ్టీ కదలికలకు బ్యాంకింగ్ రంగమే కీలకం కానున్నదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.బ్యాంక్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాల సూచీలు మినహా మిగిలిన 9 రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. టారిఫ్‌లు పెరుగుతాయనే అంచనాలతో టెలికాం షేర్లు పెరిగాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,102 కోట్లుగా, ఎన్ఎసీ నగదు విభాగంలో రూ.18,328 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,57,175 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.363 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.135 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
యెమెన్ షాక్... 654 పాయింట్లు పతనం
మధ్య ఆసియా ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. దీనికి మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియడం, చమురు ధరలు పెరగడంతో గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల కంపెనీలు, టెక్నాలజీ షేర్లు బాగా కుదేలయ్యాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 654 పాయింటు, నిఫ్టీ 189 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. , బుధవారం అమెరికా మార్కెట్ల పతనం కావడంతో కూడా స్థానిక మార్కెట్ క్షీణతకు మరో కారణం. ఇంట్రాడేలో సెన్సెక్స్ నష్టం 727 పాయింట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగియడం ఇది వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్. ఈ ఏడు ట్రేడింగ్ సెషన్లలోనూ సెన్సెక్స్ మొత్తం 1,260 పాయింట్లు తగ్గింది. వచ్చే వారం మార్కెట్ మూడు రోజులే పనిచేస్తుండడం కూడా ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. యెమెన్ సంక్షోభం యెమెన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి హౌతి మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో సౌదీ అరేబియా నేతృత్వంలోని పది దేశాల కూటమి ఈ తిరుగుబాటుదారులపై గురువారం వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాల్లో అవాంతరాలేర్పడి, ధరలు పెరుగుతాయనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. రెండో అధ్వాన ముగింపు గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాల్లోనే ప్రారంభమైంది. 27,385 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకి చివరకు 654 పాయింట్ల (2.33 శాతం) నష్టంతో 27,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 6న సెన్సెక్స్ 855 పాయింట్లు నష్టపోయింది. దాని తర్వాత ఇదే అత్యధిక నష్టం. ఇక నిఫ్టీ 189 పాయింట్లు(2.21 శాతం) నష్టపోయి 8,342 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది పదివారాల కనిష్టం. క్యాపిటల్ మార్కెట్లో లావాదేవీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ట్రేడింగ్ విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ డీఐఐ : 26-03 4,288 3,601 687 25-03 2,029 1,933 97 24-03 1,858 2,490 - 632 ఎఫ్ఐఐ: 26-03 7,733 8,255 -521 25-03 6,910 6,097 813 24-03 4,648 3,910 738 (విలువలు రూ.కోట్లలో) లక్షన్నర కోట్ల సంపద ఆవిరి బుధవారం రూ.1,01,24,877 కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ విలువ గురువారం ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.99,66,783 కోట్లకు పడిపోయింది. అంటే గురువారం ఒక్క రోజులో రూ.1,58,094 కోట్ల సంపద ఆవిరయ్యింది. రూపాయి అరశాతం డౌన్ ఒకవైపు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించడం మరోవైపు నెలాఖరులో డాలర్లకు డిమాండ్ పెరగడం పరిణామాలతో రూపాయి మారకం విలువ గురువారం రెండు వారాల కనిష్ట స్థాయికి పడింది. డాలర్‌తో పోలిస్తే 34 పైసలు తగ్గి 62.67 వద్ద ముగిసింది. వచ్చేవారం మూడు రోజులే మార్కెట్ వచ్చే వారం మూడు రోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 2(గురువారం) మహావీర్ జయంతి, ఏప్రిల్ 3(శుక్రవారం) గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవులు. దీంతో వచ్చే వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానున్నది. ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కాబట్టి, సెటిల్మెంట్ లావాదేవీలు జరగవు. -
స్టాక్ మార్కెట్లో మరికొంత కాలం... సర్దుబాటు ధోరణే..!
‘సాక్షి’ ఇంటర్వ్యూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సీఐవో మనీష్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి కంపెనీల ఆదాయాలు పెరిగితే స్టాక్ మార్కెట్లో తిరిగి ర్యాలీ మొదలవుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనా వేస్తోంది. స్టాక్ మార్కెట్లో లక్ష కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్న తొలి ప్రైవేటు రంగ బీమా కంపెనీగా రికార్డులకు ఎక్కిన సందర్భంగా ప్రస్తుత మార్కెట్ల స్థితిగతులపై ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) మనీష్ కుమార్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... బడ్జెట్ తర్వాత నుంచి దేశీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది మరింత కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుత కరెక్షన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ ఎన్నికల ఫలితాల (జూన్, 2014) తర్వాత మార్కెట్లు సుదీర్ఘ ర్యాలీ చేయడంతో బడ్జెట్ తర్వాత సర్దుబాటు మొదలయ్యింది. దేశ ఆర్థిక వృద్ధి ఫలాలు వాస్తవ రూపంలోకి వచ్చే వరకు సూచీలు పరిమిత శ్రేణిలో కదులుతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరిగినప్పుడే మార్కెట్లో తిరిగి ర్యాలీ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది కాలంలో స్టాక్ సూచీల నుంచి ఎటువంటి రాబడులను అంచనా వేస్తున్నారు? సెన్సెక్స్, నిఫ్టీల రాబడి కార్పొరేట్ కంపెనీల ఆదాయాలను ప్రతిబింబిస్తాయని అంచనా వేస్తున్నాం. కంపెనీల ఆదాయాల్లో ఏమైనా వృద్ధి ఉంటే ఆ మేరకు సూచీలు కూడా పెరుగుతాయి. కానీ చరిత్రను పరిశీలిస్తే మాత్రం.. దేశీయ ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో 13 నుంచి 15 శాతం రాబడిని అందించాయి. బీమా బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత మోదీ సంస్కరణల అమలుపై మార్కెట్లకు నమ్మకం పెరిగిందా? దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మోదీ ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తుందన్న నమ్మకం ఉంది. బీమా బిల్లు చట్ట సవరణ తర్వాత రానున్న కాలంలో ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రానున్నాయి. భవిష్యత్తు వ్యాపార విస్తరణకు నిధుల కొరతను ఎదుర్కొంటున్న బీమా కంపెనీలకు ఈ బిల్లు పెద్ద ఊరటనిస్తుందని చెప్పొచ్చు. ఇంటా బయట నుంచి దేశీయ మార్కెట్లు తక్షణం ఎదుర్కొనే నష్టభయాలు ఏమిటి? గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ల కదలికలను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత విషయానికి వస్తే... అమెరికా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల వల్ల పెద్ద ఎత్తునున్న ఎఫ్ఐఐ నిధులు రావడంతో దేశీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఆ మేరకు నిధులపై తప్పక ప్రభావం కనిపిస్తుంది. అలాగే దేశాల మధ్య ఏమైనా యుద్ధాలు వచ్చినా, ఓపెక్ దేశాలు ముడిచమురు ఉత్పత్తిని తగ్గించినా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు అంతర్జాతీయ విషయాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఇక స్థానిక విషయాలకొస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో జాప్యం జరిగితే మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తాయి. అంటే..అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం తగ్గి మార్కెట్లు మరింతగా పతనమయ్యే అవకాశం ఉందా? అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఇండియాతో సహా అన్ని వర్ధమాన దేశాల మార్కెట్లలో ఒడిదుడుకులు పెరుగుతాయి. కానీ ఇండియా విషయానికి వస్తే ఈ ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్లు చాలామటుకు డిస్కౌంట్ చేసుకున్నాయి. అలాగే... ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచితే అదే సమయంలో యూరప్, జపాన్ దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు పెంచే అవకాశం ఉంది. దీంతో అమెరికా నుంచి తగ్గే ఎఫ్ఐఐల నిధుల ప్రవాహాన్ని యూరప్, జపాన్ దేశాల నిధులు భర్తీ చేయవచ్చు. వచ్చే ఏడాది కాలంలో దేశీయ మార్కెట్లో వడ్డీరేట్లు ఇంకా ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది? ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికే అరశాతం వడ్డీరేట్లు తగ్గడం చూశాం. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిరేటు బలహీనంగా ఉంటంతో వడ్డీరేట్లు మరింత తగ్గడానికే అవకాశాలున్నాయి. డిసెంబర్‌లోగా వడ్డీరేట్లు మరో అరశాతం తగ్గొచ్చని అంచనా. సూచీలు నూతన రికార్డులు నెలకొల్పిన తర్వాత యులిప్ పథకాల అమ్మకాలు ఏమైనా పెరిగాయా?... ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో యులిప్స్ పథకాల్లో పెట్టుబడులు పెరగడం స్పష్టంగా కనిపించింది. రానున్న కాలంలో మార్కెట్ పరిస్థితులు బాగుండే అవకాశాలుండటంతో యులిప్స్ అమ్మకాలు పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. ఇది మార్కెట్ల వృద్ధికి మరింత దోహదం చేస్తుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఏ రంగ షేర్లపై ఆసక్తి చూపుతున్నారు? వేటికి దూరంగా ఉండమని సూచిస్తారు? దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వడ్డీరేట్ల కదలికతో నేరుగా సంబంధం ఉన్న ప్రైవేటు బ్యాంకులు, ఆటో రంగ షేర్లతో పాటు టెలికం షేర్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్, కమోడిటీ రంగాల షేర్లకు దూరంగా ఉండమని సూచిస్తా. -
10 వారాల కనిష్ట స్థాయి
ఆరో రోజూ నష్టాలే 50 పాయింట్ల నష్టంతో 28,112కు సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో 8,531కు నిఫ్టీ మార్కెట్ అప్డేట్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు మరో ఒక్క రోజు ఉన్న నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, లోహ షేర్లకు నష్టాలు విస్తరించడంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ సూచీలు క్షీణపధంలోనే సాగాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. మొత్తం మీద బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టపోయి 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది పదివారాల కనిష్ట స్థాయి. తీవ్రమైన ఒడిదుడుకులు రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తుండటంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. మార్చి కాంట్రాక్టులు గురువారంతో ముగుస్తుండటంతో ట్రేడర్లు త పొజిషన్లను ఏప్రిల్ సిరీస్‌కు క్యారీ ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మందకొడిగా సాగిందని నిపుణులంటున్నారు. లాభాల్లోనే ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 28,250-28,031 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 50 పాయింట్ల నష్టంతో 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 625 పాయింట్లు(2.17 శాతం) నష్టపోయింది. ఇక నిఫ్టీ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 12 పాయింట్లు నష్టపోయి 8,531 పాయింట్ల వద్ద ముగిసింది. 12.5 శాతం తగ్గిన ఇప్కా ల్యాబ్స్ విలీన ప్రక్రియ పూర్తికావడంతో సన్ ఫార్మా 1.3 శాతం, ర్యాన్‌బాక్సీ 1.6 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రతి 10 ర్యాన్‌బాక్సీ షేర్లకు 8 సన్ ఫార్మా షేర్లు లభిస్తాయి. త్వరలో ర్యాన్‌బాక్సీని స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయనున్నారు. పీతంపూర్, సిల్వెసా ప్లాంట్లకు అమెరికా ఎఫ్‌డీఏ ఇంపోర్ట్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్కా ల్యాబ్స్ షేర్ 12.5 శాతం తగ్గింది. మౌలిక, లోహ, మైనింగ్, ఆయిల్, గ్యాస్ రంగాల్లోని భారత కంపెనీలు భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయాయని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ సర్వీసెస్ వెల్లడించడంతో ఈ రంగాల్లోని షేర్లు డీలా పడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,406 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.16,401 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,57,911 కోట్లుగా నమోదైంది. మోసాల వివరాలు వెల్లడించాలి: సెబీ లిస్టెడ్ కంపెనీల్లో మోసాలు, ఆర్థిక అవకతవకలు, వాటి వెల్లడి గురించిన నియమని బంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. డిస్క్లోజర్ నిబంధనలను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా సెబీ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఏదైనా కంపెనీలో మోసం జరిగిందని వెల్లడైనప్పుడు, ఏదైనా ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పుడు, కీలకమైన వ్యక్తులు అరెస్టయినప్పుడు. ఆ వివరాలను, వాటికి గల కారణాలను, వాటి ప్రభావాన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలపాల్సి ఉంటుంది. -
నెలన్నర కనిష్టానికి స్టాక్ సూచీలు
మార్కెట్ అప్డేట్ పోటెత్తుతున్న అమ్మకాలు కొనసాగుతున్న లాభాల స్వీకరణ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు-బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు శుక్రవారం ఒకటిన్నర నెల కనిస్టానికి పడిపోయాయి. సెన్సెక్స్ 209 పాయింట్లు నష్టపోయి 28,261 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 8,571 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్స్, వాహన, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లూ పతనబాటలోనే సాగాయి. రూపాయి పతనంతో ఐటీ షేర్ల జోరు అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైందని, ఇదే పోకడ చివరి వరకూ కొనసాగిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్( రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. రూపాయి పతనం కూడా ప్రభావం చూపిందని వివరించారు. రూపాయి పతనం వల్ల ఐటీ షేర్లు పెరిగాయని, అయితే ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాల పాలయ్యాయని పేర్కొన్నారు. గనుల బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ, స్టాక్ మార్కెట్ పట్టంచుకోలేదని, మంచి వార్తలు వచ్చినప్పుడల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారని ఆల్టామౌంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డెరైక్టర్ ప్రకాశ్ దివాన్ చెప్పారు. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 475 పాయింట్లు(1.65 శాతం) నష్టపోయింది. ఈ వారంలో 242 పాయింట్లు నష్టపోయింది. ఇలా స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారం కూడా నష్టాల్లోనే ముగిసింది. 2,117 షేర్లు నష్టాల్లో, 752 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,664 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.20,175 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,27,529 కోట్లుగా నమోదైంది ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ పేరు మార్పు ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎంసీఎక్స్-ఎస్ఎక్స్) పేరు ఇకపై మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజీగా (ఎంఎస్ఎక్స్ఐ) మారనుంది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి అనుమతి లభించినట్లు ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ తెలిపింది. సంస్థకు కొత్త రూపునిచ్చేందుకు పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఐనాక్స్ విండ్ ఐపీవోకు 18 రెట్లు సబ్స్క్రిప్షన్ పవన విద్యుదుత్పత్తి సంస్థ ఐనాక్స్ విండ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 18 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ మొత్తం 2.32 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. ఐపీవో ముగింపు రోజైన శుక్రవారం నాటికి మొత్తం 43.08 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి రూ. 315-325 ధరల శ్రేణితో ఐనాక్స్ విండ్ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. పునరుత్పాదక వనరులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యమిస్తుండటం ఐనాక్స్ విండ్‌కు లాభించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దాదాపు రూ. 700 కోట్లు సమీకరించేందుకు ఐనాక్స్ విండ్ ఐపీవోకి వచ్చింది. 2013 జూన్ తర్వాత వచ్చిన ఐపీవోల్లో ఇదే అత్యధికంగా నిల్చింది. -
సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూ: వొడాఫోన్
న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్.. భారత్‌లోని తమ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ప్రణాళికల్లో ఉంది. పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) జారీకి సరైన సమయం కోసం వేచిచూస్తున్నామని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ విటోరియో కొలావో చెప్పారు. మంగళవారమిక్కడ గ్రూప్ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరుతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘ప్రస్తుతానికైతే మేం మా నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరడం, బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణపైనే అత్యధికంగా దృష్టిపెడుతున్నాం. కచ్చితంగా ఏదో ఒకరోజు ఐపీఓకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. దీనికి నేనేమీ వ్యతిరేకం కాదు. మంచి సమయం చూసి లిస్టింగ్ నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని కొలావో పేర్కొన్నారు. కాగా, ఐటీ, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కూడా కొలావో కలిశారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు, ఇందులో ప్రైవేటు రంగం భాగస్వామ్యం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసులో రూ.3,200 కోట్ల పన్ను చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి వొడాఫోన్‌కు ఇటీవలే ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాఖలు చేసిన ఈ కేసులో బాంబే హైకోర్టు వొడాఫోన్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేయకూడదని మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, హచిసన్ నుంచి వొడాఫోన్ వాటా కొనుగోలుకు సంబంధించిన కేసులో మాత్రం రూ.11,200 కోట్లకు పైగా పన్ను చెల్లింపు వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. -
కన్సాలిడేషన్ బాటలో మార్కెట్
ఈ వారం ట్రెండ్‌పై స్టాక్ నిపుణుల అంచనాలు విదేశీ అంశాలు, ఎఫ్ఐఐలపై దృష్టి న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపగల దేశీ అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అవకాశముందని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. గడిచిన వారంలో 0.6% లాభాలతో పురోగమించడం ద్వారా మార్కెట్ సరికొత్త రికార్డులను సాధించిన నేపథ్యంలో ఇకపై కూడా సానుకూలంగానే కదలవచ్చునని అంచనా వేశారు. శుక్రవారం(14న) మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 28,047 వద్ద, నిఫ్టీ 8,390 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డులను నమోదు చేశాయి. వారం మొత్తంలో సెన్సెక్స్ 178, నిఫ్టీ 53 పాయింట్ల చొప్పున పుంజుకున్నాయి. చమురు ధరలు, డాలర్ ఎఫెక్ట్ దేశీయంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను డిసెంబర్ 2న చేపట్టనుంది. ఇప్పటికే ఐదేళ్ల కనిష్టానికి జారిన చమురు ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు సెంటిమెంట్‌కు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ 62 స్థాయికి జారడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. సోమవారం(17న) జపాన్ క్యూ3 తొలి జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. బుధవారం(19న) యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ చివరినాటి పాలసీ సమావేశ వివరాలు వెల్లడికానున్నాయి. సంస్కరణలపై దృష్టి: ప్రభుత్వం చేపట్టనున్న తదుపరి సంస్కరణలు, ఆర్బీఐ పాలసీ సమీక్ష, విదేశీ పెట్టుబడులు వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని కొటక్ సెక్యూరిటీస్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్వెస్టర్లకు సూచించారు. ఇకపై మార్కెట్ స్థిరీకరణ బాటపడుతుందని, ఆపై తిరిగి మరింత పుంజుకుంటుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ సానుకూలంగానే కదులుతుందని, సమీప కాలంలో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 8,500 పాయింట్లను అధిగమించే అవకాశముందనేది ఏంజెల్ బ్రోకింగ్ అంచనా. -
షేర్ల కంటే ఫండ్సే ముద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ నూతన గరిష్ట స్థాయికి చేరడంతో ఇప్పుడిప్పుడే రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై దృష్టిసారిస్తున్నారు. కాని గతంలో లాగా నేరుగా షేర్లను కొనుగోలు చేయడం కాకుండా మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. అందులోనూ ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేసే సిస్టమాటిక్ విధానాన్ని (సిప్)ఎంచుకుంటున్నారు. గతేడాది నుంచి మార్కెట్ పెరుగుతున్నా గత రెండు నెలల నుంచే రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఆంఫీ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. గత రెండు నెలల నుంచి సగటున కొత్తగా రెండు లక్షలకు పైగా సిప్ ఖాతాలు ప్రారంభమవుతున్నాయని, ఇంత పెద్ద మొత్తంలో రిటైల్ ఇన్వెస్టర్లు ముందుకు రావడం ఇదే మొదటిసారని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ చెప్పారు. గతంలోలాగా అధిక రిస్క్ ఉండే మిడ్‌క్యాప్, సెక్టోరియల్ ఫండ్స్‌లో కాకుండా డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాల్లోనే ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేస్తుండటం గమనించదగ్గ విషయమన్నారు. ఈ సారి రిటైల్ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారని, గత బుల్ ర్యాలీలో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే, తాజా ర్యాలీలో మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి తెలిపారు. స్టాక్ మార్కెట్‌పై చిన్న మదుపరులకు అవగాహన పెరిగిందనడానికి ఇది సంకేతంగా భావించవచ్చన్నారు. గత 3 నెలల్లో నికరంగా రూ.15,000 కోట్లు కేవలం ఈక్విటీ(ఆర్బిట్రైజేషన్ ఫండ్స్ కాకుండా) ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు శరత్ శర్మ తెలి పారు. గత 8 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్క ఆగస్టు నెల లోనే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కలిసి స్టాక్ మార్కెట్లో రూ.5,847 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. పెరుగుతున్న ఎన్‌ఎఫ్‌వోలు.. రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారిస్తున్నాయి. గడిచిన ఏడు నెలల్లో 33కిపైగా ఈక్విటీ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా రూ.3,580 కోట్ల నిధులను సమీకరించాయి. ఈ మధ్యనే ముగిసిన ఎన్ఎఫ్వోకి వచ్చిన యూటీఐ ఫోకస్డ్ ఫండ్ అంచనాలను మించి రూ. 770 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం రెండు ఈక్విటీ పథకాలు ఎన్‌ఎఫ్‌వోలు నడుస్తుండగా, రానున్న కాలంలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ట్యాక్స్ ఫండ్ జోరు... గతేడాదితో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్(ఈఎల్ఎస్ఎస్) అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2013, జూలై నెలలో ట్యాక్స్ ఫండ్స్ అమ్మకాలు రూ.134 కోట్లుగా ఉంటే ఈ ఏడాది ఈ మొత్తం రూ. 472 కోట్లకు పెరగడం విశేషం. అంటే 252 శాతం మేర వృద్ధి నమోదైంది. స్టాక్ మార్కెట్ జోరుకు తోడు గత బడ్జెట్లో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి లక్షన్నరకు పెంచడంతో మదుపుదారులు అధిక మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లు అమితాసక్తి చూపిస్తున్నారని, డిసెంబర్ నుంచి ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని యూటీఐ ట్యాక్స్ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ పేర్కొన్నారు. -
పడితే కొనండి.. పెరిగినా అమ్మకండి
ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిల్లో కదులుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ స్టాక్ మార్కెట్ అందివ్వని విధంగా 22 శాతం లాభాలను మన సూచీలు అందించాయి. మార్కెట్ కొత్త శిఖరస్థాయిలకు చేరడంతో ఇక ఇక్కడ ఆగుతుందా లేక ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది చాలామంది ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే మన మార్కెట్లు అంత చౌకగా ఏమీ లేవు. 2014-15 రాబడులతో పోలిస్తే సెన్సెక్స్ 17 పీఈ వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది సెన్సెక్స్ సగటు గరిష్ట ఈపీఎస్ విలువ కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ వాస్తవ విలువకు దగ్గరగానే ఉంది. సెన్సెక్స్ ఈపీఎస్ విలువ ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇది వాస్తవ రూపంలోకి వస్తే 2015-16 కంపెనీల ఆదాయాలు భారీగా పెరుగుతాయి. సహజంగానే ఈ అంశాన్ని స్టాక్ మార్కెట్లు ముందుగా డిస్కౌంట్ చేసుకుంటూ పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అంతా సానుకూలమేట అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడి చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే విధంగా చేస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 101 డాలర్ల వద్ద కదులుతోంది. ఇది 100 డాలర్ల కిందకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే సబ్సిడీ భారం తగ్గి ద్రవ్యలోటు 4.7 శాతానికి కంటే దిగువకు చేరుతుంది. అంతేకాదు రుతుపవనాలు ఆలస్యంగానైనా కరుణించడంతో ముప్పుతప్పినట్లే. ఈ అంశాలన్నీ ఈ ఏడాది వృద్ధిరేటు 5.5 శాతానికి, వచ్చే ఏడాది 6.5 శాతానికి చేరుస్తాయి. 2015-16 ఆర్థిక ఏడాదికి వృద్ధిరేటు 6.5 శాతంగా అంచనా వేస్తే కంపెనీల ఆదాయాల్లో కనీసం 20 శాతం వృద్ధి అంచనా వేయొచ్చు. ఈ లెక్కన చూస్తే సెన్సెక్స్ ఈపీఎస్ 1,850గా ఉంటుంది. సెన్సెక్స్ చారిత్రక సగటు పీఈ నిష్పత్తి 16 లెక్కన అంచనా వేస్తే సెన్సెక్స్ 29,600 స్థాయికి ఎగబాకుతుంది. ఈ అంశాలన్నీ మార్కెట్లు 2015 ప్రారంభం నుంచే డిస్కౌంట్ చేసుకొని పెరగడం ప్రారంభిస్తాయని అంచనా వేస్తున్నాం. పడితే కొనండి సూచీలు గరిష్ట స్థాయిలో ఉండటంతో కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఈ కరెక్షన్కు దోహదం చేస్తున్నాయి. ఇలాంటి పతనం సమయంలో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న షేర్లను ఎంపిక చేసుకొని కొనుగోలు చేస్తుం డండి. సహజంగా సెక్యులర్ బుల్ మార్కెట్ మధ్య మధ్యలో కొనుగోళ్లకు అవకాశం ఇస్తుంటుంది. మొదట్లో కొనలేక పోయిన వారు ఈ పతనాలను అందిపుచ్చుకోవాలి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కరణల పేరుతో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు బాగా లాభాలు అందించాయి. అలా అని చెప్పి అన్ని షేర్లను కాకుండా ఆచితూచి ఎంపిక చేసుకోండి. ముఖ్యంగా లార్జ్‌క్యాప్‌కు చెందిన ఐటీ, ఫార్మా, సైక్లికల్స్ రంగాలకు చెందిన షేర్లను ప్రతీ పతనంలో కొనుగోలు చేస్తూ ఉండండి. దీర్ఘకాలం కొనసాగే సెక్యులర్ బుల్ మార్కెట్లో ‘పడితే కొనండి.. పెరిగినా అమ్మకండి’ అనే వ్యూహాన్ని అమలు చేయాలి. -
స్టాక్ మార్కెట్‌పై ‘చిన్న’ చూపు ఎందుకో?
హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్, రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్.... ఈ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అదనంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీలో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలుపగలరు? - హితేష్, నిజామాబాద్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్ అనేది వాల్యూ-ఓరియెంటెడ్ ఫండ్. మీ పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోదగ్గ ఫండ్ ఇది. ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గత కొన్నేళ్లుగా ఇది మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ ఫండ్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఇది సెక్టోరియల్ ఫండ్. వ్యవస్థాగత మార్పులకు, తీవ్ర ఒడిదుడుకులకు గురువుతుండే ఫండ్ ఇది. ఇప్పటికైతే ఈ ఫండ్ ద్వారా మీకు మంచి లాభాలే వచ్చి ఉంటాయనుకుంటున్నాను. అందుకే ఈ ఫండ్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం. ఈ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించి ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. కానీ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2008 భారీ పతనం తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్కేసే చూడడం లేదు. ఎందుకని? - భువనేశ్వరి, గుంటూరు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో వచ్చింది చిన్న ర్యాలీ మాత్రమే. చిన్న ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్నారన్న మీ అభిప్రాయం సరైనదే. భారత మార్కెట్లు ఆకర్షణీయమైనవని విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. ఈ విషయంపై చిన్న ఇన్వెస్టర్లకు ఇంకా నమ్మకం కుదరడం లేదు. బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్లపై 10% రాబడి వస్తుండటంతో చిన్న ఇన్వెస్టర్లు.. వాటిపై ఆసక్తి చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లు బాగా లేకపోయినప్పటికీ, వడ్డీరేట్లు పెరిగిపోవడంతో తమ రాబడులు బాగానే ఉన్నాయని వారనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నా ఇన్వెస్టర్లకు దక్కే నికర రాబడులు స్వల్పమే అయినప్పటికీ, అదే పదివేలు అనుకుంటున్నారు. సాధారణంగానే భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం తక్కువే. నేను ఒక మిత్రుడి సలహా ప్రకారం అవైవా-సేవ్‌గార్డ్ యులిప్ స్కీమ్‌లో 2006లో ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే నేను ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోలిగాను. ప్రతీ ఏడాది ఈ సంస్థ పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేస్తోంది. మరోవైపు సరెండర్ పెనాల్టీ భారీగా ఉండటంతో ఈ స్కీమ్‌ను బలవంతంగా కొనసాగించాల్సి వస్తోంది. ఎనిమిదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తూ వచ్చినప్పటికీ, సంతృప్తికరమైన రాబడులు లేవు. ఇలాంటి సంస్థలు ఇలాంటి స్కీమ్‌లను నిర్వహించడానికి నియంత్రణ సంస్థలు ఎలా అనుమతిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. చిన్న ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన సొమ్ములు ఇలాంటి సంస్థల పాలు కావల్సిందేనా? ఈ పరిస్థితుల నుంచి తక్కువ నష్టాలతో బయటపడే మార్గాన్ని సూచించండి. - హఫిజ్, హైదరాబాద్ అవైవా సేవ్‌గార్డ్ అనేది నాన్-పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ఇది చాలా పాత పాలసీ. ఈ సంస్థ పెద్ద మొత్తంలో చార్జీలను వసూలు చేస్తుందనే విషయం వాస్తవమే. ఈ ప్లాన్‌కు సంబంధించి ప్రీమియం అలొకేషన్ చార్జ్ అనేది ప్రతీ ఏడాది 4 నంచి 6 శాతంగా ఉంటోంది. ఇక ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు 0.75 శాతం నంచి 1.75 శాతం రేంజ్లో ఉంటున్నాయి. ఇవి కాక పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీ, మోర్టాలిటీ చార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో రాబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సంప్రదాయక బీమా పాలసీలు మంచి రాబడులను ఇవ్వలేవు. సదరు సంస్థలు మీ సొమ్ములను సురక్షితమైన రుణసాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుండడమే దీనికి కారణం. మరోవైపు అధికంగా ఉండే చార్జీలు మీ లాభాలను తినేస్తాయి. ఈ ప్లాన్ మీరు చెల్లించే వార్షిక ప్రీమియానికి ఐదు రెట్లు లైఫ్ కవర్‌ను మాత్రమే అందిస్తోంది. ఇది ఏ మాత్రం సరిపోదు. టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. ఇవి తక్కువ ప్రీమియానికే ఎక్కువ బీమాను అందిస్తున్నాయి. మీకు ఏమైనా అయితే మీ కుటుంబ అవసరాలకు ఎంత మొత్తం కావాలో లెక్కించి, ఆ మేరకు టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, టాటా బ్యాలెన్స్డ్, బిర్లా సన్‌లైఫ్ 95.. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇక మీ అవైవా పాలసీ విషయానికొస్తే, మీరు ఈ పాలసీని సరెండర్ చేయండి. మీరు ఏడేళ్లపాటు ప్రీమియమ్‌లు చెల్లించి ఉంటే, ముఖ విలువలో 1 శాతంగా సరెండర్ చార్జీలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎనిమిదేళ్లకు మించి ప్రీమియమ్‌లు చెల్లించి ఉంటే ఎలాంటి సరెండర్ చార్జీలు ఉండవు. ఈ పాలసీని సరెండర్ చేసి నష్టాలను పరిమితం చేసుకోండి.