street dog
-
Hyderabad: స్ట్రీట్ డాగ్స్‌కు.. ఫుడ్ పెట్టాలా?
సాక్షి, సిటీబ్యూరో: దయాగుణంతో వీధికుక్కలకు ఆహారం పెట్టేవారు తమ పేర్లను జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకుగాను bit.ly/GHMCdogfreederform లింక్ ద్వారా లేదా సంబంధిత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయవచ్చని పేర్కొంది.దాంతో ప్రజలు కుక్కల బారిన పడే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి కుక్కలకు ఆహారం వేసే విధానం, జంతు సంరక్షణ మార్గదర్శకాలు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపింది. స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగని కుక్కల గురించి సమాచారమిచ్చి ఆ కార్యక్రమాల డ్రైవ్స్‌లో భాగస్వాములు కావొచ్చని పేర్కొంది. కార్యక్రమాలకు జంతు సంక్షేమ సంఘాలు కూడా సహకరించాలని కోరింది. తద్వారా నగరాన్ని సురక్షిత, ఆరోగ్యకర నగరంగా మార్చవచ్చని పేర్కొంది. వివరాలకు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల్లో వెటర్నరీ అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించింది. -
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
-
మహిళపై అత్యాచారయత్నం : వీధి కుక్క అలర్ట్...దెబ్బకి..!
ఇటీవలి కాలంలో వీధికుక్కలు చిన్నపిల్లలపై దాడిచేస్తూ స్వైరవిహారం చేస్తున్న వార్తలు చదివి చాలా ఆందోళన చెందాం కదా. విశ్వాసానికి మారుపేరైన పెంపుడు కుక్కలు కూడా స్వయంగా యజమానిపై దాడి ఘటనలూ చేశాం. కానీ సాధారణంగా కుక్కలు యజమానులను ప్రేమిస్తాయి. ఆ మాటకొస్తే కాస్త గంజి పోయినా చాలు బోలెడంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న పిల్లలంటే ఇంకా మక్కువ చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి మరీ మనుషులను ఆదుకుంటాయి. తాజాగా కుక్కల మీద మనుషులకు విశ్వాసాన్ని పెంచే ఘటన ఒకటి మహరాష్ట్రలోని ముంబై చోటు చేసుకుందిఅత్యాచారానికి యత్నించిన వ్యక్తినుంచి 32 ఏళ్ల మహిళను వీధి కుక్క రక్షించిన ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్‌లో జరిగింది. మాణిక్పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై సందీప్ ఖోట్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. అకౌంటెంట్ అయిన మహిళ ఇంటికి వస్తుండగా సందీప్ ఆమె వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాక చంపేస్తాని బెదిరించి, నోరు నొక్కి కిందపడేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దెబ్బకి భయపడిన అతగాడు, లేచి అక్కడినుంచి ఉడాయించాడు. అయితే పోతూ పోతూ ఆమె ఐఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధిత మహిళ తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. -
‘జయ’ చాలా లక్కీ... విదేశాలకు చెక్కేసింది!
ఛీ.. కుక్క బతుకు అని తిట్టుకుంటుంటారు చాలామంది. కానీ ఈ కుక్కను చూశాక కచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటారు. నో డౌట్. ఎందుకంటే మనిషి ఎవరి ముందైనా లోకువైనా లేదా తక్కువైతే ఛీ కుక్క బతుకు అని ఈజీగా అనేస్తాడు. నిజానికి వాటి విశ్వాసం ముందు మనిషి ఎందుకు పనికిరాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడొక వీధి కుక్క అదృష్టం మాములుగా లేదు. ఓ విదేశీయురాలి మనసు దోచుకుని ఆమె తోపాటు విదేశానికి వెళ్లే అదృష్టాన్ని కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్‌లోని ఆమ్స్టర్డామ్కి చెందిన మెరల్ బోంటెన్‌బెల్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వచ్చింది. కాశీ నగరం అందాలు ఆస్వాదిస్తూండగా జయ అనే ఆడ వీధి కుక్క ఆమె వద్దకు వచ్చి తచ్చాడింది. ఆమె కూడా ఆ కుక్కను చూసి భలే ముద్దుగా ఉందని కాసేపు దానితో గడిపి వెళ్లిపోయింది. ఐతే ఈ కుక్క ఆమెను కొంతసేపు ఫాలో అయ్యి ఆమె వద్ద ఉండే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో ఇంకో కుక్క ‘జయ’పై దాడి చేసింది. సమీపంలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు జయను రక్షించాడు. ఈ ఘటన తరువాత బోంటెన్‌బెల్ వెంటనే తన మనసు మార్చుకుని ఆ కుక్కను తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. తనతోపాటు నెదర్లాండ్స్‌కి తీసుకువెళ్లాలని డిసైడ్ పోయింది కూడా. ఆరునెలలపాటు శ్రమించి కుక్కకి పాస్‌పోర్ట్, వీసా ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల అనుమతులు లభించడంతో ఎట్టకేలకు స్వదేశానికి పయనమయ్యేందుకు సిద్ధమైంది బోంటెన్‌బెల్. అనుకున్నట్లుగానే ఆ కుక్కకి పాస్‌పోర్ట్, వీసా కూడా వచ్చేయండతో సంతోషంగా బోంటెన్‌బెల్ ఆ కుక్కును తనతోపాటు నెదర్లాండ్స్ తీసుకువెళ్లిపోయింది. నిజానికి అదేం జాతి కుక్క కాదు. ఆ కుక్కలో ప్రత్యేకతకు కూడా ఏమిలేదు. అదృష్టం ఆ విదేశీయురాలి రూపంలో వెతుక్కుంటు రావడమే గాక చక్కగా ఆమెను యజామనిగా మార్చుకుని నెదర్లాండ్స్ చెక్కేసింది ఆ వీధి కుక్క. #WATCH | Varanasi, Uttar Pradesh: A female street dog named Jaya from Varanasi is set to leave India with a proper visa and passport with her new owner from the Netherlands. pic.twitter.com/i57rMJqyjb — ANI (@ANI) October 26, 2023 (చదవండి: ఇవేం అంత్యక్రియలు? మృతదేహాలను రాబందులకు వదిలేస్తారా!) -
దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం?
పలు రిపోర్టుల ప్రకారం దేశంలో కోటికిపైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. వీధి కుక్కల జనాభా దాదాపు 3.5 కోట్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశంలో కుక్కకాటు కేసులు 4,146 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 27.52 లక్షల కేసులు నమోదయ్యాయి, తమిళనాడు (20.7 లక్షలు), మహారాష్ట్ర (15.75 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీధికుక్కలు కొన్ని సందర్భాల్లో మనుషులను కరుస్తుంటాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. చట్టం ప్రకారం 2001 నుండి భారతదేశంలో కుక్కలను చంపడాన్ని నిషేధించారు. అయితే 2008లో ముంబయి హైకోర్టు నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. మునిసిపాలిటీలకు వీధి కుక్కలను చంపడానికి అనుమతినిచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (జీ) వన్యప్రాణులను రక్షించడం, అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్థానికులు తమ నివాస ప్రాంతాల్లోని వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గత ఏడాది సమర్థించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత -
హైదరాబాద్‌లో మళ్లీ.. బాలుడిపై వీధి కుక్క దాడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. టప్పాచబుత్రలో కుక్క దాడి చేయడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన తల్లితో కలిసి బాలుడు విధిలో నడుస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయిదేళ్ల బాలుడిని కుక్క కరిచిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే బాలుడి తల్లి వెంటనే గుర్తించి అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసినట్లు తెలుస్తోంది. చిన్నారికి జర్జరీ చేశారని, అందుకోసం తల్లిదండ్రులు రూ. 3 లక్షలు వెచ్చించినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట కుక్కలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపించడంతో తెలంగాణ హైకోర్టు ఈకేసును సుమోటోగా తీసుకొని జీహెచ్ఎంసీకి, ప్రభుత్వ అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కుక్కలు వీధుల్లో తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావటం లేదు. ప్రస్తుతం వీధి క్కలపై జీహెచ్ఎంసీ ఫోకస్ తగ్గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ డ్యూటీతో పాటు వెటర్నరీ అధికారులు బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు సిబ్బంది నిరసన చేస్తుండటంతో కుక్కల కాటు కేసులు నగరంలో మళ్ళీ పెరుగుతున్నాయి. కుక్కల బెడదపై వేసిన హై లెవెల్ కమిటీ ఎక్కడ ఉందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కమిటీ ఏర్పాటు చేసి.. ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం శోచనీయం -
బాలుడి ప్రాణానికి బాధ్యులు ఎవరు..?
-
వీధి కుక్క కాటు ఏ విధంగా ప్రమాదకరం..?
-
వీధి కుక్కకు చికిత్స కోసం బీదర్ నుంచి సిటీకి..
సాక్షి, బంజారాహిల్స్: నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌లో ఓ వీధి కుక్క నడవలేని పరిస్థితుల్లో ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు ఇక్కడి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్లూసీఎస్)కు ఈ నెల 21వ తేదీన ఫోన్ వచ్చింది. దీంతో ఈ సంస్థకు చెందిన షెల్టర్ నిర్వాహకులు సంతోషినాయర్, రెస్క్యూ కో ఆర్డినేటర్లు మనీష్, గణేష్ తదితరులు తమ సంస్థకు చెందిన రెస్క్యూ అంబులెన్స్‌లో బీదర్ చేరుకున్నారు. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీధి కుక్కను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అల్వాల్ మిలటరీ డెయిరీఫామ్ రోడ్డులో ఉన్నో ఆంచల్ ఖన్నా జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి రెండు రోజుల పాటు వైద్యం చేయించారు. శుక్రవారం మెడలో ఇరుక్కున్న ప్లాస్టిక్ పైప్‌ను సర్జరీ ద్వారా తొలగించారు. జంతు ప్రేమికులు ఈ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పనసపొట్టు.. షుగర్ ఆటకట్టు) -
మానవత్వం చచ్చిపోయింది.. రష్మి గౌతమ్ ఎమోషనల్ కామెంట్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తుంది ఈ అందాల యాంకరమ్మ. గుంటూరు టాకీస్ మూవీతో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మి. ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమబెంగాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంబరాల్లో భాగంగా కొందరు ఆకతాయిలు.. ఓ వీధి కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్కకు తీవ్రగాయాలవడంతో పాటు తోక తెగిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఈ విచారకరమైన వార్త తెలుసుకున్న రష్మి.. ఆ ఘటన పై తనదైన స్టైల్లో స్పందిస్తూ.. ‘మానవత్వం చచ్చిపోయింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు లేదు’ అంటూ విరుచుకుపడింది. రష్మిక పోస్ట్ చూసిన నెటిజన్స్ సైతం.. ఆ ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు. -
అమానుషం: వీధి శునకం పెంపుడు కుక్కపై దాడి చేసిందని..
సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): మూగజీవి అనే జాలి లేకుండా ఓ వ్యక్తి వీధి శునకాన్ని ఇనుపరాడ్డుతో కొట్టి చంపివేశాడు. ఈ అమానుష ఘటన బెంగళూరు సమీపంలోని ఆనేకల్ తాలూకా హెబ్బగోడిలో చోటు చేసుకుంది. హెబ్బగోడిలోని మడివాళ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తి తన పెంపుడు కుక్కను బుధవారం సాయంత్రం వాయువిహారం కోసం తీసుకెళ్లాడు. అ సమయంలో వీధి శునకం పెంపుడు కుక్కపై దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఇనుపరాడ్డు తీసుకోని వీధికుక్కతలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం దానిని లాక్కుంటూ వచ్చి మెయిన్ రోడ్డులో పడేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇది హేయమైన చర్యగా జంతు ప్రేమికులు అభివర్ణించారు. కుక్కను చంపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యలహంకకు చెందిన ప్రాణిదయామయ సంఘానికి చెందిన అనిరుద్ హెబ్బగోడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరే.. పక్కన ఉన్నా పాజిటివ్! -
వీధికుక్కకు ఎక్స్‌రే..!
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వీధికుక్కను చేరదీయడమే కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించి చికిత్స నిర్వహించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వీధికుక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉండే ఇంటర్‌సెప్టర్ వెహికిల్ పోలీస్ కానిస్టేబుల్ కె.ప్రవీణ్‌కుమార్, హోంగార్డ్ ఎ.నరేష్ ఇద్దరు గత మూడు వారాల నుంచి పార్కు వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న వీధికుక్కను చూస్తూ నిఘా ఉంచారు. ఆహారం తినకుండా దగ్గుతూ గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుగా అవస్థలు పడుతున్న ఆ కుక్కను చూసి చలించిపోయారు. సోమవారం ఉదయం వీరు ఆ కుక్కను తమ వాహనంలో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్.3లోని సాగర్‌సొసైటీలో ఉన్న పెట్ క్లినిక్‌లో ఎక్స్‌రే తీయించారు. వైద్యపరీక్షలు నిర్వహించేలా చేశారు. ఎక్స్‌రేలో దాని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలియడంతో సంబంధిత డాక్టర్ వ్యాధి తగ్గుదల కోసం మందులు రాసిచ్చాడు. పెట్ క్లినిక్‌లో ఫీజులు చెల్లించిన ఈ పోలీసులు మందులను కూడా తమ సొంత డబ్బులతోనే కొనుగోలు చేసి మళ్లీ కేబీఆర్ పార్కు వద్ద వదిలిపెట్టారు. ‘బ్రౌనీ’ అని ఈ వీధికుక్కకు పేరుపెట్టుకున్న ఈ పోలీసులు ప్రతిరోజు బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడుతుంటారు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన ఈ కుక్కను చూసి చలించిపోయి తమ సొంత డబ్బులతోనే వైద్యపరీక్షలు నిర్వహించిన వీరి గొప్పదనాన్ని అధికారులు సైతం ప్రశంసించారు. ఈ కుక్క ఆరోగ్యం ఇంకో రెండు వారాల్లో మెరుగుపడుతుందని వైద్యులు చెప్పడంతో పోలీసులిద్దరూ దాని ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు. -
కాలినడకన తిరుమలకు వీధి కుక్క, 620 కిలోమీర్లు నడిచి..
సాక్షి, తాడేపల్లిగూడెం: పాలు పోశారన్న విశ్వాసంతో ఓ శునకం ఇద్దరు భక్తులతో జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతికి 620 కిలోమీటర్లు కాలినడకన తోడు వెళ్లింది. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ముడి ప్రతాపరెడ్డి, అతని స్నేహితుడు పైడి రవి మార్చి 15న కాలినడకన తిరుమల బయలుదేరారు. ప్రతాపరెడ్డి కాలినడకన వెళ్లడం ఇది మూడోసారి కాగా, పైడి రవికి రెండోసారి. ఈ సారి వెళ్లేటప్పుడు ఎవరైనా భక్తులు వస్తే ఖర్చులు తామే పెట్టుకుని కాలినడకన తీసుకెళదామనుకున్నారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. మార్చి 15న వీరు జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయ సమీపానికి చేరుకునేసరికి వీరికి రెండు శునకాలు కలిశాయి. వాటిని వీరు అదిలించినప్పటికీ వీరి వెంటే వచ్చాయి. కొద్ది దూరం వెళ్లాక ఒక శునకం వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఒకటి మాత్రం పూర్తిగా వీరివెంటే నడిచింది. దీంతో దానికి పాలుపోసి, వీరు తినే ఆహార పదార్థాలు పెడుతుండేవారు. శునకం వీరికంటే ముందు నడుస్తూ ఉండేది. ఇలా 620 కిలోమీటర్లు వీరితో పాటు నడిచింది. మార్గ మధ్యంలో దీనికి నంది అని పేరు పెట్టారు. మార్చి 29న వీరు తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిగుండా వెళుతుండగా, శునకాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి కొండపైకి తీసుకెళ్లకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతాపరెడ్డి పెదనాన్న కుమార్తె టీటీడీలో పనిచేస్తున్నారు. వారికి ఫోన్ చేసి ఈ కుక్కను కొండ దిగువన ఉన్న వారింటికి చేర్చారు. రెండు రోజులు ఆ ఇంట్లోనే ఈ కుక్క ఉంది. దర్శనం అనంతరం వీరి స్నేహితుడు ఒకరు జంగారెడ్డిగూడెం నుంచి కారేసుకెళ్లి భక్తులు ఇద్దరితోపాటు నందిని కారులో తీసుకువచ్చారు. ప్రతాపరెడ్డి ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ప్రతాపరెడ్డి, రవి మాట్లాడుతూ ఏ జన్మలోనో శ్రీవారి మొక్కు ఉండి ఉంటుందని, ఆ మొక్కును తీర్చుకునేందుకు శునకం ఈ జన్మలో తమ వెంట వచ్చిందని భావిస్తున్నామన్నారు. -
వీధి కుక్క మృతి.. కాలనీలో వెలసిన పోస్టర్లు
తిరువనంతపురం: మానవుడికి జంతువులకు మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శునకానికి ఆదరణ మిగతావాటికన్నా ఎక్కువే. చాలా మంది వాటిని పేరు పెట్టి పిలుస్తూ సాకుతారు. వాటికి క్యూట్ క్యూట్ పేర్లు పెట్టి ముద్దాడుతుంటారు. అలాంటి ఓ కుక్క ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కేరళలో ఓ వీధి వీదంతా విషాదంలో మునిగింది. ఆ వీధిలోని వ్యాపారులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుక్క పేరుతో కాలనీలో పోస్టర్లు వేసి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. ఈ విశేష ఘటన కేరళలోని పథానంతిట్ట జిల్లా మనక్కాల పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజ్ జంక్షన్ ప్రాంతంలో ఒక పంచాయతీ వారు ఒక కుక్కను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ కుక్కకు తిండిపెట్టి ఆదరించారు. దానికి రేమణి అని పేరు కూడా పెట్టారు. కాలనీవాసులు ఆహారం అందిస్తుండడంతో రేమణి కాలనీకి, దుకాణాలకు కాపలాగా నిలవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఆ ప్రాంతంలోకి అపరిచితులు వెళ్లాలంటే హడలిపోయేవారు. కాలనీవాసులు ఎవరైనా రాత్రిళ్లు ఆలస్యంగా వస్తే వారికి తోడుగా రేమణి వచ్చేదని టైర్ల వ్యాపారం నిర్వహించే ప్రదీప్ తెలిపారు. అయితే గతవారం వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య రేమణి పరుగెత్తడంతో ప్రమాదానికి గురై మృతి చెందింది. రేమణి మృతితో ఆ కాలనీ షాక్‌కు గురైంది. ముఖ్యంగా దుకాణదారులు, వ్యాపారులు రేమణి మృతిని తట్టుకోలేకపోయారు. తమ వ్యాపారాలకు రక్షణగా నిలిచిన రేమణిని గుర్తు చేసుకుంటున్నారు. వియ్ లవ్ యూ.. మిస్ యూ.. రిప్ టు రేమణి అంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేస్తున్నారు. -
ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి
-
ఈ వీధి కుక్క సూపర్...
రొంపిచర్ల (నరసరావుపేట): గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో గల నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఆదివారం రాత్రి దొంగలు దేవాలయం తాళాలు పగులకొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ హుండీలో భక్తులు సమర్పించిన సుమారు రూ.50 వేలు నగదు, కేజీ వరకు వెండి వస్తువులు ఉండవచ్చని భావిస్తున్నారు. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు అందులో ఉన్న వెండి, నగదును తీసుకుని, హుండీని పెద్ద చెరువులో పడేశారు. అయితే గుడి పరిసరాల్లోనే పెరుగుతున్న ఓ శునకం ప్రతిరోజూ గుడికి వచ్చే ఓ ముసలమ్మను కాలితో గీకి సైగలు చేసింది. దేవాలయం తలుపు తాళాలు పగులకొట్టిన దొంగలు ఆ వృద్ధురాలు శునకం చేష్టలను గమనించి దాని వెంట వెళ్లగా, అది చెరువు వద్దకు తీసుకువెళ్లింది. చెరువులో హుండీ కన్పించింది. శునకం అక్కడ నుంచి అన్నారం డొంక రోడ్డులోకి తీసుకెళ్లటంతో అటు వైపే దొంగలు వెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. గుడి వద్దే భక్తులు పెట్టే ప్రసాదాలతో జీవిస్తూ, అమ్మవారిపై విశ్వాసంతో హుండీ జాడను చూపించిన శునకాన్ని పోలీసులు, గ్రామస్తులు మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడిపై వీధికుక్క దాడి
-
వీధి కుక్క చావుకు కారకుడైన డ్రైవర్ అరెస్టు
బంజారాహిల్స్: నిర్లక్ష్యంగా కారు నడిపి కుక్క చావుకు కారకుడైన క్యాబ్ డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం ఎండీ అబ్దుల్ నయీం (24) బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపునకు క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ వేగంగా దూసుకెళ్తున్నాడు. అదే సమయం లో కేబీఆర్ పార్కు ఫుట్‌పాత్‌వైపు నుంచి ఓ వీధికుక్క రోడ్డు దాటుతుండగా నయీం చూసుకోకుండా ఢీకొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది. కంపాసియోనేట్ సొసైటీ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వలంటీర్ అజయ్ ఈ దృశ్యాన్ని చూశాడు. నయీం కారును అనుసరించి అతన్ని పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశాడు. కుక్క మరణానికి కారకుడైన డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆ సంస్థ చైర్మన్ ప్రవల్లిక ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నయీంపై ఐపీసీ సెక్షన్ 429, సెక్షన్ 11(1)(ఏ)(ఎల్), ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. -
కుక్కను కాపాడి.. ఆకలి తీర్చి
బంజారాహిల్స్: బిజీ రోడ్డులో ఓ కుక్క పిల్ల రోడ్డు దాటుతూ కారు చక్రాల కింద పడే క్రమంలో అటుగా వెళ్తున్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సతీమణి వ్యాన్ ఫ్లెమింగ్ తన కారును ఆపి హుటాహుటిన అక్కడికెళ్లి కుక్కను ప్రమాదం నుంచి కాపాడారు. దీన్ని ఆమె ట్విట్టర్లో పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆమె తన కారులో వెళ్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ కుక్కపిల్ల అటువైపు వెళ్తుండగా ఓ వాహనం దానిపై నుంచి వెళ్లే క్రమంలో తప్పించుకుంది. ఇది గమనించిన ఫ్లెమింగ్ తన కారును ఆపి అంత రద్దీలోనూ రోడ్డు దాటి కుక్కపిల్లను పట్టుకొని అక్కడ చెరుకు రసం అమ్ముతున్న వ్యాపారి నుంచి నీళ్లు తీసుకొని దానికి తాగించారు. తర్వాత కొద్ది దూరంలో ఉన్న ఫార్మసీలో డాగ్ఫీడ్ను తీసుకొచ్చి తినిపించారు. దాంతో గంటపాటు సరదాగా గడిపారు. ‘మీరు వీధి కుక్కలను దత్తత తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ మూగజీవాల పట్ల కొంత ప్రేమను చూపండి’ అంటూ ట్వీట్ చేశారు. -
భార్యను కుక్క కరిచిందని..
సాక్షి, న్యూఢిల్లీ : భార్యను కరిచిందని ఓ వీది కుక్కును దారుణంగా కొట్టి చంపాడో భర్త. చుట్టుపక్కల వాళ్లు అలా కొట్టొద్దని వారించినా వినకుండా కుక్కను చంపి జైలుపాలయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని ముకుందాపూర్‌లో గురువారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ముకుందాపూర్‌కు చెందిన రాజ్ కుమార్ ఓ ట్రాన్స్‌ఫోర్ట్స్‌సెక్టార్‌లో పనిచేస్తాడు. గురువారం రాత్రి కుమార్ భార్య తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్‌కు వెళ్లారు. అక్కడ వీదిలో ఉన్న ఓ కుక్క ఈ పెంపుడు కుక్కను చూసి మొరుగుతూ.. దాడి చేయబోయింది. దీంతో కుమార్ భార్య వీది కుక్కను అక్కడే ఉన్న రాళ్లతో కొట్టింది. దీంతో ఆ కుక్క ఆమెపై దాడి చేసి పలు చోట్ల కరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క చేసిన గాయాలతో ఇంటికి వచ్చిన కుమార్ భార్య.. జరిగిని విషయం భర్తకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన కుమార్ ఓ కర్ర తీసుకొని వీదిలోకి వెళ్లాడు. కుక్కను గుర్తించి దారుణంగా కొట్టాడు. స్థానికులు అలా కొట్టొద్దని వారించినా వినకుండా కర్రతో బలంగా కుక్కపై దాడి చేశాడు. దీంతో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. ఇదంతా అక్కడ ఉన్న స్థానికుడొకరు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కను చంపొద్దని కోరిన వినకుండా దారుణంగా కొట్టాడని, మొదటి అతని భార్యనే కుక్కను రాళ్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
తల్లి కుక్క.. పిల్లలు క్షేమం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం మాసాబ్‌ట్యాంకు నుంచి విజయనగర్ కాలనీ వెళ్లే ప్రధాన మార్గంలోని జీహెచ్ఎంసీ వెటర్నరీ ఆస్పత్రి ఫుట్‌పాత్‌పై ఓ కుక్క నిస్తేజంగా పడి ఉంది. అనారోగ్యం, తీవ్ర నీరసంతో కదలలేని కొనఊపిరితో ఉంది. అటుగా వెళ్తున్న ఓ యువకుడు దానికి ప్రాథమిక చికిత్స చేయాల్సిందిగా ఆ ఆస్పత్రి సిబ్బందిని కోరగా, దాని బాధ్యత పూర్తిగా తీసుకునే వారుంటేనే చికిత్స చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి చేతులెత్తేశారు. ఆ కుక్క పక్కనే దాని రెండు పిల్లలు పాల కోసం అల్లాడుతున్నాయి. తల్లి కుక్క వద్ద పాలు రాకపోతుండటంతో అవి రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉండటంతో ఆ యువకుడు వెంటనే పీపుల్ ఫర్ యానిమల్స్సంస్థ సిబ్బందికి ఫోన్ చేసి వివరించడంతో పాటు ఫోన్లో దాని వీడియో తీసి పంపించాడు. సంస్థ ప్రతినిధి లత దాన్ని వాట్సాప్ గ్రూపులో ఉంచటంతో చేరువలో ఉన్న వలంటీర్లు సయ్యద్ తఖీ అలీ రజ్వీ, షబ్బీర్ అలీఖాన్‌లు అరగంటలో అక్కడికి చేరుకుని అట్టడబ్బాలో శునకం, దాని కూనలను తీసుకుని బేగంబజార్‌లోని రెస్క్యూహోమ్‌కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. దీంతో కుక్క కోలుకుంది. మూగజీవాల పట్ల జాలితో వ్యవహరించాలని, ప్రమాదంలో ఉన్న వాటి ప్రాణాలు కాపాడాలని వారు పేర్కొన్నారు. -
ఈ వీడియో చూస్తే మీ పొట్ట చెక్కలవ్వాల్సిందే
అతడు తన మొబైల్ ఫోన్లో తీరిక లేకుండా ఉన్నాడు.. ఎంతలా ఓ పరధ్యానం.. బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారుగా అలా అన్నమాట. బహుషా ఫోన్లో తన గర్ల్‌ప్రెండ్‌తో చాటింగ్ చేస్తున్నాడో.. లేక ఏదైనా సీరియస్ విషయంపై ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నాడో.. లేక ఏ వీడియోలు, ఫొటోలు చూస్తున్నాడో.. మొత్తానికి ఆదమరిచి ఓ వీధిలో పాదచారుల మార్గంపై కూర్చుండిపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క కాస్త ముందుకు వెనుకకు కదిలి.. సరిగ్గా ఓ గోడను చూడగానే వెంటేనే అది ఎలా మూత్ర విసర్జన చేస్తుందో అతడిని చూడగానే అదే పనిచేసింది. తాఫీగా తన కడుపులో భారాన్ని అతడి వీపుపై పోసి తీర్చుకోబోయింది. ఆ వ్యక్తికి టీషర్ట్ సగం తడిసిపోయిన తర్వాత గానీ, సోయి రాలేదు. వెంటనే వెనక్కి తిరిగి తనపై కుక్క చేస్తున్న నిర్వాహకానికి వేగంగా వెళ్లి దాన్ని ఒక్కతన్ను తన్నబోయాడు.. అది తప్పించుకుంది. ఇంతలో అతడు పెంచుకున్న కుక్క వచ్చి వాసన చూడటం మొదలుపెట్టింది. తనపై మూత్ర విసర్జన చేసిన కుక్కవైపు విసుగ్గా చూస్తూ తన టీషర్ట్ రోడ్డుపైనే విప్పేయగా ఆ కుక్క మాత్రం దూరంగా నిల్చొని పల్లికిలించినవ్వుతున్నట్లుగా ఓ లుక్కేసింది. ఈ వీడియో చూస్తే మీరైనా సరే కడుపుచెక్కలయ్యేలా నవ్వకపోతే ఒట్టు. -
ఈ వీడియో చూస్తే మీ పొట్ట చెక్కలవ్వాల్సిందే
-
గుంటూరు ఘటన మేల్కొల్పేనా..?
చిత్తూరు అర్బన్ : ఇటీవల జిల్లాలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. కుక్కకాట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలను వీధిలోకి ఒంటరిగా పంపాలంటే హడలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరులో వీధి కుక్కల దాడిలో ప్రేమ్‌కుమార్ అనే మూడేళ్ల బాలుడు మృత్యువాత పడటం పాలకులకు గుణపాఠం కావాలి.జిల్లాలోని పట్టణాల్లో 26 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల వరకు శునకాలున్నాయి. నివాస ప్రాంతాల్లో కుక్కల్ని పెంచుకుంటున్న కొందరు వీటికి అప్పుడప్పుడు యాంటీ రేబిస్ టీకాలు వేయిస్తున్నారు. కుక్కల జనాభాలో రేబిస్ టీకాలు వేస్తున్న కుక్కల సంఖ్య పది శాతం మాత్రమే. మిగిలిన కుక్కులు వీధుల్లో తిరుగుతూ దొరికిన వాళ్లను దొరికినట్లు కొరుకుతున్నాయి. కుక్కల స్టెరిలైజేషన్ చేసినట్టు ఖర్చులకు సంబంధించిన కాగితాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఉన్నా ఉపయోగంలేదు... జిల్లాలో సగటున ఏటా 30 వేల మంది బాధితులు కుక్కకాట్లకు గురవుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఆస్పత్రులకంటే.. ప్రైవేటు వైద్యం వైపే జనం ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటులో కుక్కకాటుకు వేసే యాంటీ రేబిస్ సూది మందు, ఇమ్యునోగ్లోబ్ ఇంజెక్షన్ ఒక్కొక్కటి రూ.3 వేలు ఉన్నా బాధితులు అక్కడికే వెళుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది మందులు అందుబాటులో ఉన్నా సక్రమంగా వినియోగించకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలోని 102 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమృద్ధిగా కుక్కకాట్లకు సూది మందులు అందుబాటులో ఉన్నా చాలా చోట్ల సిబ్బందిలో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఒక్కో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వైలిన్ ఓపెన్ చేస్తే పది మందికి వేయాలి. ఒక్కరికి వేసినా 24 గంటల్లో మిగిలిన మందును పడేయాలి. జిల్లాలోని పలుచోట్ల ఒక్కరికోసం వైలిన్ ఎలా వేయగలమంటూ బాధితుల్ని వైద్యాధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు పంపేస్తున్నారు. కాసులు కురిపిస్తున్న స్టెరిలైజేషన్ వీధి కుక్కల నిర్మూలనకు గతంలో కుక్కల్ని పట్టి చంపేసేవారు. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యతిరేకత రావడంతో కుక్కల్ని చంపడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా కుక్కల జనాభాను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స ఒక్కటే మార్గంగా నిలిచింది. ఇదే పాలకులకు, అధికారులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో వీధి కుక్కలకు శస్త్ర చికిత్స చేయడానికి ఆయా మునిసిపల్ కమిషనర్లు తిరుపతిలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు పనులు అప్పగించారు. ఒక్కో కుక్కకు శస్త్ర చికిత్స చేసి, యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయడానికి రూ.450 చొప్పున స్వచ్ఛంద సేవా సంస్థ వసూలు చేస్తోంది. మునిసిపాలిటీల్లో ఏటా రూ.50 లక్షలకు పైగా కుక్కల స్టెరిలైజేషన్‌కు బిల్లులు చెల్లిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ యథేచ్ఛగా నిధులను బొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు -
వీధి కుక్కలు చంపేస్తున్నాయ్!
గ్రేటర్లో వీధి సింహాలు విజృంభిస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు...సామాన్యులపై పంజా విసురుతున్నాయి. మూకుమ్మడి దాడులతో ప్రాణాలు తీస్తున్నాయి. వీధి కుక్కలను అదుపుచేయడంలో బల్దియా యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. వీధి కుక్కల నియంత్రణ పేరిట ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా ఫలితం శూన్యం. దుర్ఘటన జరిగిన సమయంలో వీధి కుక్కల్ని కట్టడి చేస్తామని మేయర్సాబ్..కమిషనర్లు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా..ఆచరణకు నోచుకోకపోవడం గమనార్హం. తాజాగా గ్రేటర్ శివారులోని మూడు చింతలపల్లి కాశవాడలో సోమవారం ఆరు వీధి కుక్కల దాడిలో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సిటీబ్యూరో: పదేళ్ల క్రితం నగరంలో వీధి కుక్కల సంఖ్య 1.5 లక్షలు ఉండగా, తాజాగా వీటి సంఖ్య 6.97 లక్షలకు చేరుకుంది. గతంలో సాధారణ రోజుల్లో రోజుకు 20 నుంచి 25 కుక్కకాటు కేసులు నమోదైతే..ప్రస్తుతం రోజుకు సగటున 45 నుంచి 50 కేసులు నమోదు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అంటే గంటకు సగటున 2 కేసులు నమోదవుతున్నాయన్నమాట. కుక్కల నియంత్రణ కోసం జీహెచ్ఎంసీ ఏటా దాదాపు రూ.పది కోట్లు ఖర్చు చేస్తున్నా...వీటి సంఖ్య తగ్గక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుక్కలను నియంత్రించేందుకు ప్రభుత్వం యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) ద్వారా సంతాన నియంత్రణ చికిత్సలు(స్టెరిలైజేషన్) జరిపించేందుకు ఆటోనగర్, అంబర్‌పేట, చుడీబజార్, జీడిమెట్ల, పటాన్చెరులో కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 25 మందిని నియమించి ఒక్కో చికిత్సకు రూ.100 చొప్పున చెల్లిస్తుంది. ఇలా ఒక్కొక్కరికి నెలకు రూ.30 వేలపైనే చెల్లిస్తుంది. ఏటా 80 వేల కుక్కులకు కు.ని చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా...కుక్కల ఉత్పత్తి తగ్గక పోగా, వాటి సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ఇక్కడ పట్టి..అక్కడ వదిలి... శివారు ప్రాంతాల్లోకి పొరుగు జిల్లాల నుంచి కుక్కలు వలస రావడంతో ప్రస్తుతం వీటి సంఖ్య 6.97 లక్షలకు చేరుకున్నట్లు ఓ అంచనా. పొరుగు ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న కుక్కల సంఖ్య తగ్గకపోవడం..బస్తీల్లో పట్టిన కుక్కలను శివారు ప్రాంతాల్లో వదులుతుండటం, మళ్లీ అవి బస్తీలకు వలస వస్తుండటం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. వీధి కుక్కలకు సరైన ఆహారం దొరక్క అవి చెత్తకుప్పల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు తినడం...ఎండ తీవ్రతకు తీవ్ర ఇరిటేషన్‌కు లోనై..కన్పించిన వారినల్లా కాటేస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన ఉప్పల్, నాచారం, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, హయత్‌నగర్, హస్తినాపురం, బడంగ్పేట్, మాదాపూర్, రాజేంద్రనగర్, కాటేదాన్, కూకట్పల్లి, మియాపూర్, శామీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. బాధితుల్లో 50 శాతం మంది పదేళ్లలోపు చిన్నారులు ఉండగా, 10 శాతం వృద్ధులు, 20 శాతం యాచకులు, మరో 20 శాతం మంది ప్రయాణికులు ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యాంటిరేబిస్ ఇంజక్షన్ కోసం నారాయణగూడ ఐపీఎం, సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి బాధితులు పొటెత్తుతుండటంతో ఉదయం వేళలో ఆయా వార్డులు బాధితులతో రద్దీగా మారుతున్నాయి. వీధి కుక్కలు యమ డేంజర్.. కుక్క కాటు వల్ల వైరస్ కాలు నుంచి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్వరం, తల నొప్పి, వాంతులు తొలిదశలో, పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించలేక పోవడం, నోటిలోంచి నురుగు రావడం, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి రెండో దశలో కనిపిస్తాయి. ఇక మూడో దశలో పూర్తిగా కో మాలోకి వెళ్లి, రెండు మూడు రోజుల్లో మత్యువాతపడుతుంటారు. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఒక వేళ కుక్క కరిస్తే...వెంటనే ధారగా కారుతున్న నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. రక్తం కారుతున్నా...గాయంపై కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటివి పోయకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో వ్యాక్సిన్ వేసుకోవాలి. – డాక్టర్ రమేష్ దాంపురి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు