Sucharitha
-
ఘనంగా కాకుమాను జడ్పీ పాఠశాల వజ్రోత్సవ వేడుకలు
-
టీడీపీ నేతలపై సుచరిత ఫైర్
-
క్వారీలో గుంతలో నలుగురు గల్లంతు.. ఆరిన ఆశల దీపాలు!
సాక్షి,గుంటూరు(ప్రత్తిపాడు): చదువు పూర్తయితే కొడుకు ఉన్నత స్థానంలో నిలుస్తాడని ఒకరు.. కొడుకు చేస్తున్న కోర్సు పూర్తయితే తన కాళ్ల మీద తాను నిలబడతాడని ఇంకొకరు.. అల్లరి చిల్లరిగా తిరిగే కొడుకు ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండటం చూసి మరొకరు.. తమపై పూర్తిగా ఆధార పడకుండా తన కష్టంతో తాను సంపాదించుకోవడం మరొకరు.. ఇలా.. ఇరవై ఏళ్లుగా కంటికిరెప్పలా, తమ కనుపాపల్లా అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలపై ఎన్నో ఆశలు.. మరెన్నో కలలు.. తల్లిదండ్రులు ఒకటి తలస్తే, విధి మరొకటి తలచింది. తల్లిదండ్రుల ఆశలను క్వారీ నీళ్లలో చిదిమేసింది. కలలను కన్నీళ్లతో నులిమేసింది. తమ ఇంటి ఆశల దీపాలను ఆర్పేసింది. పున్నామ నరకం నుంచి తప్పిస్తారనుకున్న తనయులు తమకన్నా ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో, ఆ కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద క్వారీ గుంతలో ఆదివారం సాయంత్రం గల్లంతైన నలుగురు యువకులను మృత్యువు కబళించిది. అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం తొమ్మిదిన్నర వరకూ విస్తృతంగా గాలించి సిద్ధంశెట్టి వెంకటేష్, ఇగుటూరి వీర శంకర్ రెడ్డి, బిళ్లా సాయిప్రకాష్, లంబు వంశీల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందం బయటకు తీసింది. ఆటంకాలు ఎదురైనప్పటికీ గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి, అర్బన్ సౌత్ జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, తహసీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు, ఎస్ఐ అశోక్‌లు నేతృత్వంలో సిబ్బంది దాదాపుగా 11 గంటల పాటు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. తదనంతరం రుద్ర ట్రస్టు సభ్యుల సహకారంతో ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరణించిన వారంతా యువకులే కావడంతో వారి అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. వందలాది మంది స్నేహితులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు వారి వెంట నడిచి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. ఆస్తులన్నీ నాకే ఇచ్చేస్తా అన్నావు కదా అన్నయ్య! బిళ్లా సాయిప్రకాష్ది చిన్న కుటుంబం. తండ్రి ఏడుకొండలు కేబుల్ ఆపరేటర్‌గా, తల్లి కనకదుర్గ అంగన్వాడీ ఆయాగా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇటీవలే సాయిప్రకాష్ స్థానికంగా ఉన్న పురుగు మందుల దుకాణంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అమ్మా.. చెల్లికి సంబంధాలు చూస్తున్నారు కదా. మంచి సంబంధం కుదిరితే మనకున్న కొద్దిపాటి ఆస్తులు కూడా చెల్లికే ఇచ్చేద్దాం. నాకేమీ వద్దు. నేను కష్టపడి సంపాదించుకుంటాను అని పదే పదే అనేవాడు. ఆస్తులన్నీ ఇచ్చేస్తా అన్నావ్.. చివరకు నీ ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చి వెళ్లావా అంటూ కన్నీటి పర్యంతమవుతూ చెల్లినాగలక్ష్మి విలపించడం అందరినీ కదిలించివేసింది. ఎవరికి ఆపదన్నా పరిగెడతావే..! లంబు వంశీది కూడా మధ్యతరగతి కుటుంబమే. తండ్రి శ్రీనివాసరావు, భార్య దేవిశ్రీవల్లి. వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడు వంశీ వట్టిచెరుకూరు మండ లం పుల్లడిగుంటలోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వంశీ కళాశాలకు వెళుతూనే అప్పుడప్పుడూ కూలి పనులకు కూడా వెళుతుండేవాడు. చుట్టాలు గానీ, స్నేహితులు గానీ ఎవ్వరు ఏ ఆపద వచ్చిందన్నా, సమస్య వచ్చిందన్నా ముందుంటావే.. అలాంటి నీకే ఎంత కష్టమొచ్చిందయ్యా.. దేవుడినే నమ్ముతావే.. ఇప్పటికీ దేవుడి బొమ్మ మెడలోనే ఉంచుకుంటావే.. అంటూ కన్నీటి కుటుంబ సభ్యులు పర్యంతమయ్యారు. కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్న సమయంలో.. ఇగుటూరి వీరశంకర్ రెడ్డిది కూడా రైతు కుటుంబమే. తండ్రి కోటి రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి గృహిణి. వీరికి కొడుకు, కుమార్తె. వీర శంకర్ రెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. మొన్నటి వరకూ అతి తక్కువ జీతమే. అయితే కరోనా కావడంతో ఆస్పత్రిలో రేయింబవళ్లు అధిక డ్యూటీలు చేస్తూ నాలుగు రూపాయలు అధికంగా సంపాదించుకుంటున్నాడు. వచ్చిన దానిలో కొంత తన ఖర్చులకు ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అకాల మృత్యువు మాటువేసి కబలించడంతో కుటుంబ సభ్యుల రోదన వర్ణణాతీతంగా ఉంది. ఉద్యోగం వస్తే చెల్లి పెళ్లి ఘనంగా చేద్దామన్నావే.. ! సిద్దంశెట్టి వెంకటేష్‌ది రైతు కుటుంబం. తండ్రి సాంబయ్య అరకలకు వెళుతూ, తల్లి వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉన్నదానిలోనే పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించారు.. కుమారుడు వెంకటేష్ హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇటీవలే చెల్లికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీటికుంట రూపంలో మృత్యువు కబళించింది. చెల్లికి సంబంధం కుదిరేలోగా, నాకు మంచి జాబ్ వస్తుంది. చెల్లిపెళ్లి ఘనంగా చేద్దామని అమ్మతో చెప్పావే.. ఇప్పుడు నీ తోడబుట్టిన దాని పెళ్లి కూడా చూడకుండానే వెళ్లిపోయావా.. వెంకటేషా.. అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హోంమంత్రి సుచరిత దిగ్భ్రాంతి ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జరిగిన క్వారీ ఘటనలో యువకులు మృత్యువాతకు గురవ్వటంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్వారీలో ఈతకు వెళ్లి వ్యవసాయ కూలీ కార్మికుల యువకులు మృతి చెందటం విస్మయానికి గురిచేసిందన్నారు. ఒకేసారి నాలుగు కుటుంబాల్లో విషాదం జరగటం ఎంతో బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదకరమైన క్వారీలలో ఈతలకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టి మరోసారి ప్రమాదం జరగకముందే ప్రమాదకరమైన స్థలాలని బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
జవాన్ జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం జవాన్ జస్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కును హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అందించారు. తర్వాత హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. జస్వంత్‌రెడ్డి యువతకు స్ఫూర్తిదాయకమని, అతి చిన్న వయసులోనే అతను మరణించటం బాధాకరమన్నారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదని కొనియాడారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన అతని తల్లిదండ్రుల జన్మ చరితార్థమని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని, ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రకటించిన రూ. 50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను కుటుంబ సభ్యులకు అందించామని పేర్కొన్నారు. జశ్వంత్ రెడ్డి తల్లిదండ్రులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అడుగుతున్నారని, దానిపై సీఎం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన జస్వంత్ రెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశం కోసం జస్వంత్ రెడ్డి ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందదని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. -
మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యత : సుచరిత
-
'దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టనున్నాం'
-
గుంటూరు: యువతి అత్యాచార కేసులో పురోగతి
-
లోకేష్ శవరాజకీయాలకు పాల్పడుతున్నారు : హోం మంత్రి సుచరిత
-
విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
రాయదుర్గం: విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు మొదట రాజీనామా చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎం. సుచరిత అన్నారు. రాయదుర్గంలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మొదట తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మాట్లాడాలన్నారు. రాజధానిని తరలించడం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. అమరావాతిలో శాసనరాజధాని, విశాఖపట్నంలో పరిపాలనారాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. విధి నిర్వహణలో దళితులపై అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులను ప్రభుత్వం సహించదని, కాశీబుగ్గలో దళితుడిని కాలుతో తన్నిన ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వరకట్న వేధింపులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. రాష్ట్రపతి ఆమోదం లభించకపోయినా 18 దిశ పోలీస్స్టేషన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. -
అవినీతిపరుడిని అరెస్ట్ చేస్తే.. బీసీ కార్డా?
రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీలపై దాడిగా టీడీపీ ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు అన్నారు. పైగా కుల రాజకీయాలు చేయటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రభుత్వం బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అవినీతి చేసిన అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధమని వారు చంద్రబాబును, టీడీపీ నేతలను ప్రశ్నించారు. పదిమంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి పుట్టలు బయట పడుతున్నాయని అన్నారు. అచ్చెన్నాయుడు తీసుకున్న నిర్ణయాలు..అడ్డదారిలో ప్రయాణం చేసిన విధివిధానాలపై ఏసీబీ పలు కోణాల్లో అవినీతిపై దర్యాప్తు చేసిందని, ఆధారాలు లభించిన తర్వాతే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయటం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంది టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే దానికి అచ్చెన్నాయుడు ఉదంతమే నిదర్శనం. త్వరలో టీడీపీ హయాంలో వివిధ శాఖల్లో అవినీతి చేసిన మంత్రులు కూడా బయటపడతారు. అవినీతి చేసినందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో పని చేసే కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదు. టెలీసర్వీస్, ఆర్íసీ, నాన్ ఆర్íసీ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. మందులు సరఫరా చేసిన కంపెనీల బకాయిలున్నాయి. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందని తెలిసింది. – గుమ్మనూరు జయరామ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఆయన అక్రమాలు చేస్తే నేను రాజీనామా చేయాలా? అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడితే నన్ను రాజీనామా చేయమనటం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసులో కూడా దళితులపై దాడి అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు చేస్తే బీసీలపై దాడి అనడమేంటి? ఇలా కుల రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. రూ.లక్ష విలువ చేసే సోఫాని రూ.10 లక్షలకి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. ఈఎస్ఐ స్కాంలో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులుంటాయి. – సుచరిత, హోంమంత్రి కుంభకోణంలో కుల ప్రస్తావన ఎందుకు? టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రత్యేకించి అక్రమ మార్గంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తుంది. ప్రభుత్వ సంపాదన ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్దహస్తులు ఇంకొకరు లేనేలేరు. ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి బయటపడుతోంది. నువ్వు రూ.పది తిను.. దాంట్లో నా వాట నాకివ్వు అనే భాగస్వామ్య విధానం చంద్రబాబు జమానాలో నడిచింది. దానికి బీసీకార్డును వాడాల్సిన అవసరమేముంది. – మోపిదేవి వెంకటరమణారావు, రాష్ట్ర మంత్రి ఆయన అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డెక్కాలి? అచ్చెన్నాయుడు అవినీతికి బీసీలకు ఏం సంబంధం? అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబే. బాబు పాలనలోని ప్రతి అవినీతిపైనా విచారణ జరిపిస్తాం. అచ్చెన్నాయుడు అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డు మీదకు రావాలి. గతంలో బీసీ ఎమ్మెల్యే అయిన నన్ను టార్గెట్ చేయలేదా? – అనిల్‌కుమార్‌యాదవ్, మంత్రి సిగ్గు లేకుండా విమర్శలా? ఆధారాలతో దొరికాడు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కక్ష సాధించాలనుకుంటే చంద్రబాబును, లోకేశ్‌ని లోపలేయించేవారు. త్వరలో చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై సీబీఐ విచారణజరుగుతుంది. – ఆర్కే రోజా, నగరి ఎమ్మెల్యే చట్టం తన పని తాను చేసుకుపోతుంది .. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే, ఓర్వలేని ఓ ఆంబోతు, ఓ అవినీతిపరుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా అవినీతిపరుడు అరెస్ట్ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడు ఏమైనా మహాత్మాగాంధీనా, లేక పూలేనా? ఈఎస్ఐ సొమ్మును కాజేసిన వ్యక్తిని ఏమనాలి? స్కాంలో ఇప్పటివరకు దొరికింది చిన్నపాములే. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర ఎంత అనేది ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన వాళ్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు ఓ అంబేడ్కర్, ఓ పూలేలా అవతరించారు. – శంకరనారాయణ, రాష్ట్ర మంత్రి చట్ట ప్రకారమే.. అచ్చెన్నాయుడు అరెస్ట్ చట్ట ప్రకారం జరిగింది. ఈఎస్ఐలో భారీ కుంభకోణం, రూ.కోట్ల అవినీతిపై విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. చట్టం ముందు అందరూ సమానులే. కులాలతో సంబంధం లేదు. – మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు.. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీలను అణగదొక్కుతున్నారనడం సిగ్గుచేటు. అయిదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు, లోకేశ్‌లను అరెస్ట్ చేసినప్పుడే జనం హర్షిస్తారు. – బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే కుంభకోణం సూత్రధారి అచ్చెం ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ప్రధాన సూత్రధారుడని ఏసీబీ విచారణలో తేలింది. పేదల వైద్యానికి చెందాల్సిన సొమ్మును తిన్న వ్యక్తిని వెనకేసుకొస్తున్న బాబు పచ్చి దుర్మార్గుడు. –కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే కులాన్ని ఆపాదించడం తగదు ప్రతి దానికి చంద్రబాబు కులం రంగు పులమటం తగదు. చేసిన తప్పు నుంచి తప్పించుకొనేందుకు బీసీ ప్రస్తావన చంద్రబాబు తెస్తున్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారు. బీసీలకు చంద్రబాబు శనిలా దాపురించారు. – కె.పార్థసారథి, ఎమ్మెల్యే -
అన్ని పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత
-
సచివాలయం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
-
‘మార్కెట్ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం’
సాక్షి, గుంటూరు: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి.. రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని తెలిపారు. మార్కెటింగ్ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తామని మోపిదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నేడు మంచి రోజులు వచ్చాయని అన్నారు. అందరికీ చైర్మన్ పదవులు దక్కే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. మిర్చికి రికార్డుస్థాయిలో ధర దక్కుతోందని ఆమె గుర్తు చేశారు. క్వింటా రూ. 21వేలు పలకడం జగన్ పుణ్యమే అని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ.. గతంలో అగ్రవర్ణాలకే మార్కెటింగ్ పదవులు దక్కేవి అని అన్నారు. జగన్ చేసిన బీసీ డిక్లరేషన్‌లో భాగంగా అన్ని వర్గాలకి ఇప్పుడు న్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని శ్రీరంగనాధ్ రాజు అన్నారు. -
ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టండి..
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. ఐఏఎస్ అధికారి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా మంత్రులు ఆదివారం ఓ ప్రకటన చేశారు. ‘బీసీజీ నివేదికను మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్‌కుమార్ ఒక ఐఏఎస్‌గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించడం జరిగింది. ఆ నివేదిక మీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శుల చవకబారుగా ఉన్నాయనుకుంటే అంతకుమించి ఆయనను, విజయ్‌కుమార్ గాడు అనడంద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళలమీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకారాన్ని బయటపెట్టుకున్నారు. అధికారిగా విజయ్‌కుమార్ బాధ్యతలు ఏంటో ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఉద్దేశ పూర్వకంగా విజయ్‌కుమార్‌గాడు అని సంబోధించడం ద్వారా తనను ఏ వ్యవస్థలూ ఏమీ చేయలేవు, అన్ని వ్యవస్థలనూ నేను మేనేజ్ చేస్తున్నాను అనే అహంకార పూరిత వైఖరిని కూడా చంద్రబాబు ప్రదర్శించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు భాషా సంస్కారంగాని, కులపరమైన సంస్కారం గాని, సామాజిక న్యాయంపట్ల గౌరవం గాని, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం గాని లేవని మరోసారి స్పష్టమైన నేపథ్యంలో ఆయనను, ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా స్వయంగా విజయ్‌కుమార్ వద్దకు వెళ్లి, ఆయనకు కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాం. ఇది జరిగేవరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా, అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు వీరుమాత్రమే కాకుండా శాంతి భద్రతలను గౌరవించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ మంత్రులు అని పేర్కొన్నారు. చదవండి: విజయకుమార్గాడు మాకు చెబుతాడా! మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం.. ‘బాధ తక్కువ.. బాగు ఎక్కువ’ అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! -
మద్దతంటూనే మెలిక!
సాక్షి, అమరావతి: ‘ఏపీ దిశ’ చట్ట రూపకల్పన బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు శుక్రవారం శాసనసభలో చేసిన అసందర్భ ప్రస్తావనలు శాసనసభలో దుమారం రేపాయి. బిల్లుపై సూచనలు చేయడానికి బదులు ఎలక్షన్ వాచ్ డాగ్ రిపోర్టులంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రులు, అధికార పక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సూచనలు కోరితే ఏమిటిది? హోంమంత్రి సుచరిత ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణ బిల్లు ప్రతిపాదించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపాదిత చట్టానికి తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని, అయితే ఈ ఉత్సాహం అమలులోనూ ఉండాలన్నారు. తక్షణ న్యాయం అనేది ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారని, దానిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎలక్షన్ వాచ్ డాగ్ ఏడీఆర్ నివేదిక ప్రకారం ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని విపక్ష నేత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి విశ్వరూప్ అభ్యంతరం తెలిపారు. ఆ ఘనత మీదే.. తహశీల్దారు వనజాక్షి కేసులో చంద్రబాబు నిర్వాకాన్ని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రశ్నించారు. ఓ మహిళా అధికారిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ప్రశంసించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఐజీపీ హోదా కలిగిన ఎన్.బాలసుబ్రమణ్యంపై నాడు టీడీపీ ఎంపీ, ఎంఎల్ఏ, ఎమ్మెల్సీలు దాడి చేస్తే బాధిత అధికారికి న్యాయం చేయడానికి బదులు పంచాయితీ చేసిందెవరని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రి వెలంపల్లి అభ్యంతరం తెలిపారు. టీడీపీ హయాంలో తమపై కేసులు పెట్టారంటూ కాల్ మనీ, సెక్స్‌రాకెట్ కేసులను ప్రస్తావించారు. ఎర్రగడ్డ ఆస్పత్రి...అమరావతిలో మానసిక చికిత్సాలయం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ దళిత మహిళ టెక్కలి సీఐ, ఎస్ఐ, అచ్చెన్నాయుడి వేధింపులు భరించలేక గతంలో సచివాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిందని ఎమ్మెల్యే అప్పలనాయుడు గుర్తు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ అధికార పార్టీ సభ్యులు, మంత్రుల వ్యాఖ్యలు వినలేకపోతున్నామని, కొడాలి నానీని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరిస్తే మంచిదనటంతో వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అచ్చెన్నను ముందు వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చాలని, అమరావతిలో మానసిక చికిత్సాలయం ఏర్పాటు చేసి అందులో తొలి పేషెంట్‌గా చంద్రబాబును చేర్చాలని లేదంటే ఆయన మార్షల్స్‌ను, పోలీసులను కొడుతుంటారని మంత్రి కొడాలి నాని ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ దశలో అచ్చెన్న, కొడాలి నానీ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు బిల్లుకు మద్దతిస్తున్నామంటూనే మార్షల్స్‌తో జరిగిన వివాదాన్ని ప్రస్తావించారు. ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని, తాను అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు, కన్నబాబుకు మధ్య ’నాయుడు’ అనే పదంపై వాగ్వాదం జరిగింది. -
మహిళలకు గుండె ధైర్యాన్నిస్తుంది
సాక్షి, అమరావతి: అనాదిగా అల్లరిమూకలు, అరాచక శక్తుల రాక్షస క్రీడకు బలైపోతున్న మహిళల గుండె మంటల్ని చల్లార్చి.. గుండె ధైర్యాన్ని కలిగించేలా ‘దిశ’ చట్టం ఉండనుందన్న నమ్మకం కలుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విశ్వాసం వ్యక్తం చేశారు. శాసనసభలో శుక్రవారం ‘దిశ’ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసుల తలపై ఉన్న మూడు సింహాలు, కనిపించని నాలుగో సింహం ఒక్కటై.. ఆడవాళ్లను హింసించే మానవ మృగాలను వెంటపడి వేటాడతాయన్న నమ్మకాన్ని ఈ చట్టం కలిగిస్తోందన్నారు. అన్యాయానికి గురైన మహిళల తరఫున చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసే దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మహిళా లోకానికి ధైర్యం కలిగిందన్నారు. నిర్భయ, పోక్సో, వరకట్న వేధింపులు చట్టం, ఐపీసీ, పటిష్టమైన న్యాయవ్యవస్థ, గొప్ప పోలీసు వ్యవస్థ అన్నీ ఉన్నప్పటికీ ‘దిశ’ ఘటన తరువాత ఆ చట్టాలు దోషులను శిక్షిస్తాయన్న నమ్మకం ఎవరికీ కలగలేదని ఆమె అన్నారు. అందుకే దిశను దారుణంగా చంపిన ఆ నలుగురూ ఎన్కౌంటర్ అయితే శభాష్ పోలీస్ అని ప్రశంసించారన్నారు. ‘చట్టమంటే భద్రత, భయం రెండూ కలిగించాలి. అలా కానప్పుడు అది బలవంతులకు చుట్టమే కానీ బలహీనులకు న్యాయం చేసే చట్టం అవ్వదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పరిస్ధితుల్లో మార్పు తెచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ‘దిశ’ చట్టానికి రూపకల్పన చేశారన్నారు. మహిళలకు శ్రీరామరక్ష ‘దిశ’ చట్టం మహిళలు, బాలల భద్రతకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు భీతిగొల్పుతున్నాయి. ఈ తరుణంలో ‘దిశ’ వంటి పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర మహిళలు అందరికీ భరోసా కల్పించారు. నేరం జరిగిన తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి దోషులను నిరీ్ణత గడువులోగా శిక్షించేలా చట్టం రూపకల్పన చేయడం హర్షణీయం.అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నిలుస్తుంది. – తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి చారిత్రక చట్టమిది మహిళలు, బాలలపై నిర్దేశిత నేరాలను త్వరగా విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు దిశగా నడుం కట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు చాలామంది సానుభూతి చూపిస్తారు. కానీ.. తక్షణ న్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం చేయరు. ఇలాంటి సందర్భంలో దేశంలోనే తొలిసారి ముఖ్యమంత్రి తక్షణ న్యాయం దిశగా ఆలోచన చేశారు. ఇంతటి చారిత్రక బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో లేనందుకు చంద్రబాబు, టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. – రెడ్డి శాంతి, పాతపట్నం ఎమ్మెల్యే విస్తృత ప్రచారం కల్పించాలి మహిళల జోలికి వచ్చే వారికి వెన్నులో చలి పుట్టించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టాన్ని తీసుకువచ్చారు. ఇందుకు మహిళాలోకం యావత్తు ‘సాహో జగనన్నా.. జయహో జగనన్నా’ అంటున్నారు. మహిళలపై నేరాలకు 80 శాతం కారణం మద్యపానమే. దాన్ని కూడా దశల వారీగా నిషేధించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఈ చట్టంపై స్కూళ్లు, కళాశాలల్లో విస్తృత ప్రచారం కలి్పంచాలి. – విడదల రజని,చిలకలూరిపేట ఎమ్మెల్యే మహిళల్లో మనోధైర్యం పెరుగుతుంది ఏపీ దిశ చట్టంతో మహిళల్లో మనోధైర్యం పెరుగుతుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న 2016, 2017, 2018 సంవత్సరాల్లో రాష్ట్రంలో మహిళలపై 50,238 అఘాయిత్యాలు జరిగితే బిహార్‌లో 42,015 జరిగాయి. మహిళలపై దురాగతాలలో అప్పట్లో మన రాష్ట్రం బిహార్‌ను మించిపోయింది. మహిళల భద్రతపై సోమవారం చర్చ జరిగినప్పుడు ఉల్లిపాయలంటూ చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు బిల్లు ప్రవేశపెడితే మార్షల్స్ అంటూ బయటకు వెళ్లిపోయారు. – నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే ప్రతి మహిళా హర్షిస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మనసున్న మారాజు. మహిళలకు భద్రత, రక్షణ, గౌరవం విషయంలో రెండింతలు ఎక్కువ అవకాశం కల్పించారు. ఈ చట్టంతో 21 రోజుల్లోనే శిక్షను ఖరారు చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే శిక్షలు విధించేందుకు చట్టం చేయడాన్ని దేశంలోని ప్రతి మహిళా హర్షిస్తుంది. జీరో ఎఫ్ఐఆర్ విధానం మహిళలకు భద్రత కలిగిస్తోంది. స్త్రీ ఉన్నతికి తోడ్పడుతుంది. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే ఇదో వజ్రాయుధం గృహ హింస, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు, 21 రోజుల్లో తీర్పు అనే అంశాలతో దిశ చట్టం రూపకల్పన చేసుకుంది. ఇకపై ఎవరైనా సోషల్ మీడియాలో ఫొటో మారి్ఫంగ్, ప్రొఫైల్ హ్యాకింగ్, అసభ్య, తప్పుడు సందేశాలు పెట్టినా ముఖ్యమంత్రి జైల్లో పెడతారన్న భయంతో క్రిమినల్స్‌లో దడ పుడుతుంది. దిశ చట్టం చరిత్రాత్మకం. ఈ చట్టం మహిళల పాలిట వజ్రాయుధం. – కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే జీరో ఎఫ్ఐఆర్తో నేరాల నిరోధం హద్దులు, పరిమితులతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం వల్ల మహిళలపై నేరాలు తగ్గుతాయి. దిశ చట్టంపై మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే. రిషితేశ్వరి, వనజాక్షి వంటి ఘటనల మొదలు బాలకృష్ణ వ్యాఖ్యల వరకు ఎన్నెన్నో అకృత్యాలు జరిగాయి. – ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే కఠిన శిక్షలు లేక అఘాయిత్యాలు కఠిన శిక్షలు పడకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన ఈ చట్టాన్ని తెలుగుదేశం సమర్ధిస్తున్నది. చట్టాన్ని తీసుకురావడంతో సరిపెట్టకుండా సక్రమంగా అమలు చేయాలి. – ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే మహిళా లోకం సంతోషిస్తుంది దిశ చట్టం తీసుకు రావడంతో మహిళా లోకం చాలా సంతోషిస్తుంది. ఈ చట్టం త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఇందుకు హ్యూమన్ రైట్స్ తరఫున మేం కూడా సపోర్ట్ చేస్తాం. ఈ చట్టం పకడ్బందీగా అమలైతే మహిళలు, బాలికలపై ఎన్నడూ అత్యాచారాలు జరగవు. చేసేవాళ్లు భయపడతారని ఆశిస్తున్నాం. –సరస్వతి , నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, తిరుపతి ‘దిశ’ చట్టాన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దిశ పేరుతో తీసుకొచ్చిన చట్టాన్ని స్వాగతిస్తున్నాం. ఐతే 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పటం అంటే అందుకు అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. నేరం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వర్మ కమిషన్ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని రూపొందించాలి. – డి.రమాదేవి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఐద్వా -
‘చిన్నారులపై నేరాలు తగ్గించేదుకు ప్రత్యేక చర్యలు’
సాక్షి, అమరావతి : చిన్నారులపై లైంగిక నేరాలను తగ్గించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. బుధవారం సచివాలయంలో చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక హింస జరగడం దారుణమన్నారు. చట్టాలను వేగంగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలను నియంత్రించగలమని, ఇందుకోసం అన్ని శాఖలు, స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. చిన్న పిల్లలు, యువతులపైనే లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడేవారి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చిన్నారులపై నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. లైంగిక నేరాల నియంత్రణకు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తునే.. మరో వైపు ఇలాంటి ఘటనలపై యువతి, యువకులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. -
పల్నాడులో భౌతిక దాడులు పేరుతో దుష్ప్రచారం
-
అందుకే ‘పెయిడ్’ డ్రామాలు
సాక్షి, అమరావతి: ఒకవైపు నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ, మరోవైపు వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చడం లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. అందుకే పల్నాడులో పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ఫిర్యాదులకు వారంలోగా పరిష్కారం చూపాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గుంటూరు జిల్లాలో భౌతికదాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన గురవాచారి అనే వ్యక్తిని దారుణంగా హింసించారని గుర్తు చేశారు. మరో వ్యక్తిని రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారని, చంపేస్తామని బెదిరించారన్నారు. చంద్రబాబు దుర్మార్గమైన పాలనలో గుంటూరు జిల్లాలో 6 రాజకీయ హత్యలు జరగ్గా, అందులో 5 ఒక్క పల్నాడులో జరిగినవేనని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత పోలీసులు తీసుకున్న జాగ్రత్తల వల్ల ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదన్నారు. పల్నాడులో ఇప్పటివరకు 79 రాజకీయ పరమైన కేసులు నమోదుకాగా, అందులో టీడీపీ నేతలపై 43, వైఎస్సార్సీపీ నేతలపై 36 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సమావేశంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు రామకృష్ణ, జయలక్ష్మీ పాల్గొన్నారు. పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదు పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితులు కల్పిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ర్యాలీలు నిర్వహించాలనుకొంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ప్రస్తు తం పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదని, 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. -
కర్నూలులో సీఐడీ కార్యాలయం ప్రారంభం
సాక్షి,కర్నూలు: కర్నూలులోని ఏపీఎస్పీ రెండో పటాలం మైదానం (వెంకటరమణ కాలనీ వైపు)లో నూతనంగా నిర్మించిన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏడు సీఐడీ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఐడీ విభాగానికి రాజమండ్రి, గుంటూరు, విశాఖపట్నంతో పాటు నాల్గో యూనిట్ కింద కర్నూలును ఎంపిక చేసి నూతన భవనాన్ని నిర్మించామన్నారు. నెల్లూరు, విజయవాడ, తిరుపతిలో త్వరలో సీఐడీ కార్యాలయాలు నిర్మించనున్నట్లు వివరించారు. -
వరదపై ఆందోళన వద్దు
మండపేట/సాక్షి, అమరావతి బ్యూరో: గోదావరి వరదపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 13 వేల మందికి పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. పోలవరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 26 మీటర్లు ఉందని, 35 మీటర్ల వరకూ పెరిగినా ఇబ్బంది లేదని చెప్పారు. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న దేవీపట్నం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. రాకపోకలకు వీలు లేని గ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, పప్పులు, పంచదార, నూనె, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముంపు సమస్య తలెత్తకుండా గోదావరి జిల్లాల్లోని డ్రైన్లలో యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్క తొలగించాల్సిందిగా అధికారులను ఆదేశించా మన్నారు. సోమవారం సాయంత్రానికి వరద తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వరదపై పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు ముమ్మరం హోంమంత్రి మేకతోటి సుచరిత గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది బేసిన్‌లోకి వస్తున్న వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపుకు గురైనట్లు వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీలోకి 13,43,836 క్యూసెక్కుల నీరు వస్తే అదే స్థాయిలో కిందికి వదులుతున్నామని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేసినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్ అధికారులను ముంపు ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. శాటిలైట్ ఫోన్లు, డ్రోన్ కెమేరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 17,632 మందిని 32 పునరావాస కేంద్రాలకు తరలించామని, 35,264 భోజనం ప్యాకెట్లు, 1,61,056 మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. పశ్చిమ గోదావరిలో 36,004 టన్నుల బియ్యం, 7,420 లీటర్ల కిరోసిన్, 3,710 కిలోల కంది పప్పు, 3,710 లీటర్ల పామాయిల్, 3,710 కిలోల ఉల్లిపాయలు, 3,710 కిలోల ఆలుగడ్డలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతిదానినీ రాజకీయ కోణంలో చూడవద్దని మాజీ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. -
అవరమైన చోట మరిన్ని ఫైర్ స్టేషన్లు : సుచరిత
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవసరమైన చోట మరిన్ని ఫేర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. సోమవారం ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త అగ్ని మాపక వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రస్తుతం 173 ఫైర్ స్టేషన్లు, 5 టెంపరరీ స్టేషన్లు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్ని ప్రమాదాల నష్టాన్ని తగ్గించేందుకు కొత్తగా 25 వాహానాలకు పర్మీషన్ ఇచ్చామన్నారు. రాయలసీమ సబంధించిన 5 వాహనాలు కర్నూల్‌కు తరలించారని, ఇక్కడ అవసరమైన వాహనాలు సమకూరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో వాహానాల కొనుగోలుకు రూ.4 కోట్లు, ఫాబ్రికేషన్‌కు రూ.6 కోట్లు కేటాయించామన్నారు. నూతన వాహానాలతో పాటు మరిన్ని ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసి విపత్తు నివారణకు చర్యలు తీసుకుమామని మంత్రి సుచరిత పేర్కొన్నారు. -
ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం
సాక్షి, ప్రకాశం : ఆరుగురు మృగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆదివారం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఆయన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులు మానవత్వం లేకుండా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. దీనిపై హోంశాఖతో కూడా మాట్లాడానని, నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత విచారణ జరిపారు. విచారణ వేగవంతంగా చేపట్టాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారు: హోంమంత్రి సుచరిత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. మాజీమంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. టీడీపీ దాడులు చేస్తూ...పై పెచ్చు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతుందంటూ లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వైఎస్సార్ సీపీ దాడులు చేస్తోందని, తమ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దంటూ లోకేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హోంమంత్రి ఘాటుగా స్పందిస్తూ ఇటీవల జరిగిన గొడవల్లో టీడీపీ వాళ్లు 44మంది గాయపడితే తమ పార్టీ వాళ్లు 57మంది గాయపడ్డారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ముఖ్యమంత్రి ఎప్పుడో చెప్పారని, అయినా టీడీపీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. ఘర్షణల్లో వైఎస్సార్ సీపీకి చెందినవారే అధికంగా గాయపడ్డారన్నారు. ఉనికి కోల్పోతున్నామన్న భయంతో టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని, మహిళా అధికారిని కొట్టినా పట్టించికోని పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. అన్యాయాన్ని నిలదీసిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని, తమ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని సుచరిత పేర్కొన్నారు. -
రాష్ట్రంలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మహిళ, గిరిజన పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్లో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్స్ మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం మొదటగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దళిత మహిళనైన తనకు కీలక బాధ్యత గల హోం మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రూపొందిస్తాం రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా చేస్తామన్నారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీఆఫ్‌ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. 2018 పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని, ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. చాంబర్లో ప్రత్యేక పూజలు.. తొలుత మంత్రి సుచరిత, ఆమె భర్త దయాసాగర్‌తో కలసి చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గజరావు భూపాల్, ఇతర అధికారులు, నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఫోన్‌కాల్ ఫిర్యాదుతో పాస్టర్ అరెస్టు తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి నాలుగు నెలల కిందట జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు మంత్రి సుచరిత వివరించారు. ఓ చిన్నారి పట్ల ఫాస్టర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఆమె తెలిపిందన్నారు. ఆ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పోలీసులు వెళ్లేసరికి ఫాస్టర్ పారిపోయారని, అయితే ఓ వర్గం మీడియా మాత్రం.. ‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ పాస్టర్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని మంత్రి తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని, తొందరపడి వార్తలు రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.