telangana ysr congress party
-
వైఎస్ షర్మిలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ► వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు రిమాండ్‌ను రద్దు చేసి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆమెను అక్కడే అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వైఎస్ షర్మిలను 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ఆమె రిమాండ్ ప్రధానాంశంగా వాదనలు సాగుతున్నాయి. తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్న వైఎస్ షర్మిల తరపు లాయర్లు వాదించారు. శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసుల తీరును తప్పుపట్టారు. అంతేకాదు.. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ వ్యవహారాన్ని ఈ సందర్భంగా న్యాయవాది మెజిస్ట్రేట్ ముందు ప్రస్తావించారు. పోలీస్ విధులకు ఎక్కడ ఆటంకం తమ క్లయింట్ ఆటంకం కలిగించలేదని షర్మిల తరపు లాయర్లు పేర్కొన్నారు. అయితే.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తుగా సహకరించాలి అని కోరామని, కానీ, ఆమె, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్సు క్రియట్ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఇలాంటి సమయంలో రిమాండ్ విధించకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు, మెజిస్ట్రేట్‌ను కోరారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో.. నాంపల్లి కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టుకు వైఎస్ఆర్టీపీ లీగల్‌సెల్ చైర్మన్ వరప్రసాద్‌తో పాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ చేరుకున్నారు. ఏం జరిగిందంటే? సోమవారం టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును.. మంగళవారం తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత -
పెనుబల్లిలో వైఎస్ షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
-
ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
మిర్యాలగూడ టౌన్: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు 1.7 ల క్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ ..ఆ మేరకు ఉద్యోగాలిచ్చిన తరువాతనే ఎన్నికల్లోకి వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నాలుగు ఏళ్లలో భర్తీ చేయలేని ఉద్యోగాలను, కేసీఆర్ ఈ పది నెలల్లో ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ వేయ కుండా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. కోర్టు వివాదాల్లో లేకుండా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మెహన్‌రెడ్డి కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ధర్నాలో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, నాయకులు సలీం, బాలకృష్ణారెడ్డి, రవికుమార్, మేష్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే ఆయన రాజన్న అయ్యాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. దేశంలో ఏ ఒక్కనేత అందించని పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. ఆదివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సాఆర్ ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే, ఆయన్ను రాజన్న అని పిలుచుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అప్పటి వరకూ పాలకులు విస్మరిస్తే, కేవలం ఒక్క వైఎస్సార్ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు రెండు రూపాయలకే బియ్యం, పక్కా గృహాలు, ఉచిత విద్యుత్, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నకు రుణమాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రాణహిత, పాలమూరు రంగారెడ్డి పథకాలు పేర్లు మార్చినా వాటికి పునాదులు వేసింది మాత్రం వైఎస్సారే అని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. -
2019 ఎన్నికల్లో క్రియశీలక పాత్ర: గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్రియశీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వ స్ఫూర్తితో ముందుకు వెళదామని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ చంపాపేటలోని స్థానిక సామ నరసింహారెడ్డి గార్డెన్లో గురువారం జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశం ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రతి అడుగులో కూడా పేదవాడి గుండె చప్పుడు విన్నారన్నారు. ఆ మహానేతను మరవడం ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయగలిగేది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. వచ్చే ప్లీనరీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో హాజరు అవుతారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాగా ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశానికి తెలంగాణలోని 31 జిల్లాల పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. -
ఎదిరించి పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్
-
ముగిసిన టీ.వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసింది. ఈ ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎల్బీనగర్ ప్రాంతంలోని చంపాపేట్ రోడ్డులోని ఎస్ఎన్ రెడ్డి గార్డెన్స్(సామ నరసింహా రెడ్డి గార్డెన్)లో జరిగిన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...ప్రజలంతా తమ కుటుంబమని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారన్నారు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేక తెలంగాణలోనే ఎక్కువమంది మరణించారన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన కుటుంబాన్ని ఎదిరించి...పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. 2024లో తెలంగాణలో అధికారం దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ రాజీపడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. -
హెచ్ఆర్సీలో టీ.వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణంపై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహిరించి రోగి మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. స్పందించిన హెచ్ఆర్సీ ఈ ఘటనపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (ప్రాణం ఖరీదు రూ. 150!) వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలం రాయారంకు చెందిన వడ్త్యా కృష్ణ నాయక్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న అతనికి వెంటనే ఆక్సిజన్ పెట్టాలంటూ కృష్ణ భార్య డ్యూటీలోని సిబ్బందిని కోరింది. అయితే అందుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో అతడు కొద్దిసేపటికే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను వైఎస్ఆర్ సీపీ ...హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువెళ్లింది. -
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సూర్యాపేట : ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని, కేవలం రెండు సీట్లు మాత్రం సమస్య ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అతికష్టమన్నారు. 2014 సంవత్సరంలో అధికారంలోకి రావాలనే కుయుక్తులతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల గురించి మాట్లాడడం తప్పా.. రైతులు, విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీపై ఎన్నడైనా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరుపున మాట్లాడారా..అని ప్రశ్నించారు. సర్వేలు చేయించుకొని రాష్ట్రంలో 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కూడా కాంగ్రెస్‌పార్టీకి రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వచ్చేంత వరకూ గడ్డం తీయనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లశక్తిని గడ్డంతో పోల్చడం నీతిమాలిన పని అని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీకి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు రావడంతో పాటు నాలుగు చోట్ల డిపాజిట్లు దక్కాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ ప్రస్తుతం రెండు ఎంపీ సీట్లు వస్తే ఆ ఎంపీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే తపన తప్ప కాంగ్రెస్‌పార్టీకి, ప్రజాసమస్యలపై పోరాడుదామనే ఆలోచన లేదన్నారు. ఇతర పార్టీలను కించపరిచే విధంగా ఉత్తమ్ మాట్లాడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, శేఖర్‌రెడ్డి, నాయకులు మద్ది ఉపేందర్‌రెడ్డి, గోరెంట్ల సంజీవ, ఎజాజ్, తాడోజు జనార్దన్చారీ, ఎండీ ఇఫ్రాన్, విష్ణు, రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంటి, పవన్, వీరస్వామి, హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుల నియామకం
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ క్రింద పేర్కొన్న వారిని ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించడం అయింది. కొత్త జిల్లాలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులుగా నియమకమైంది వీరే... 1.బొడ్డు సాయినాథ్ రెడ్డి ......గ్రేటర్ హైదరాబాద్ 2.బెంబడి శ్రీనివాస్ రెడ్డి..... మేడ్చల్ - మల్కాజిగిరి 3.తుమ్మలపల్లి భాస్కర్ రావు ...సూర్యాపేట 4.లక్కినేని సుధీర్.......ఖమ్మం 5.సంగాల ఇర్మియా.... వరంగల్ అర్బన్ 6.బొబ్బిలి సుధాకర్ రెడ్డి...రంగారెడ్డి 7.మాదిరెడ్డి భగవంతు రెడ్డి.... నాగర్ కర్నూల్ 8.నీలం రమేష్...........కామారెడ్డి 9.గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి.... సంగారెడ్డి 10.ఏనుగు రాజీవ్ రెడ్డి...జగిత్యాల 11.వొడ్నాల సతీష్.... మంచిర్యాల 12.బెజ్జంకి అనిల్ కుమార్.... ఆదిలాబాద్ 13.నాయుడు ప్రకాష్.... నిజామాబాద్ 14.మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి......వనపర్తి 15.జమల్పుర్ సుధాకర్.... క్రుమంభీం-అసిఫాబాద్ 16.తడక జగదీశ్వర్ గుప్త....సిద్ధిపేట 17.అప్పం కిషన్.....జయశంకర్ భూపాలపల్లి 18.సెగ్గెం రాజేష్.......పెద్దపల్లి 19.కిందాడి అచ్చిరెడ్డి....మహబూబాబాద్ 20.నాడం శాంతికుమార్........వరంగల్ రూరల్ 21.డా.కె.నగేష్.........కరీంనగర్ 22. చొక్కాల రాము... రాజన్న-సిరిసిల్ల 23. బీస మరియమ్మ....మహబూబ్ నగర్ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి కమిటీల నియామకంపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇంచార్జ్‌లు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పదవితో పాటు ఐటీ విభాగంలో పలువురు నాయకులను నియమించింది. ఈ మేరకు శనివారం వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. లీగల్ సెల్ కన్వీనర్‌గా పాలెం రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. చాలా ఏళ్లుగా పాలెం రఘునాథ్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబీకులను విధేయుడిగా ఉంటూ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లి, పార్టీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కటుకూరి సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా బాదం నరేష్ గుప్త, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పేరం నవీన్ కుమార్, మునగాల జగన్మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడుగా సి. హరికృష్ణారెడ్డిలను నియమిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం పొట్ట కొడుతోంది
-
’కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదు’
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పది జిల్లాల పాలనే గాడిన పడలేదన్నారు. తాజాగా కొత్త జిల్లాలంటూ గ్రామాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారని శివకుమార్ ధ్వజమెత్తారు. ఇప్పుడు జిల్లాల కోసం పోరాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఇప్పటికే వేలాది ఫిర్యాదులు అందాయని శివకుమార్ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా మందడపు వెంకటరామిరెడ్డి, అలస్యం సుధాకర్, వేమారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మందాడపు వెంకటేశ్వర్లు, జిల్లపల్లి సైదులు, కొల్ల వెంకట్‌రెడ్డి లను నియమించింది. సంయుక్త కార్యదర్శులుగా బండ్ల సోమిరెడ్డి, తుమ్మటి నర్సిరెడ్డి, వనమారెడ్డి నాగిరెడ్డి, పులి సైదులు, కుర్సమ్ సత్యనారాయణలు నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు జరిపినట్లు తెలిపారు. పదవులకు ఎంపికైన వారిని గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. -
ట్యాంక్‌బండ్ వద్ద టీఎస్ వైఎస్ఆర్ సీపీ నిరసన
-
గట్టు శ్రీకాంత్‌రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ సీపీని ఆహ్వానించకపోవడంపై ళ టీఎస్-వైఎస్ఆర్ సీపీ ఇవా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటీన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది. -
ట్యాంక్‌బండ్‌పై టీ-వైఎస్ఆర్సీపీ నిరసన
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ-వైఎస్ఆర్సీపీ నిరసనకు దిగింది. తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నేతలు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ పదవుల నియామకం
హైదరాబాద్: తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాసరావు, గుండెరెడ్డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన పారిపెల్లి వేణుగోపాల్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా అదే జిల్లాకు చెందిన నందమల్ల నరేష్ ను నియమించబడ్డారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లాకు కె.విశ్వనాథ్ చారిని నియమించింది. కొత్తగా నియమించబడిన నేతలకు పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. -
టీ.వైఎస్ఆర్ సీపీ కార్యదర్శిగా దుబ్బాక సంపత్
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో నియామకాలు చేసింది. రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శులుగా తిరుపతయ్య, గంగాధర్, హనుమంతురెడ్డి, సిరి రవిని ఆపార్టీ నియామకం చేసింది. అలాగే వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శిగా దుబ్బాక సంపత్, జీహెచ్ఎంసీ యూత్ ప్రధాన కార్యదర్శిగా మన్నెం సుధాకర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడుగా వందాల సతీష్ నియమితులయ్యారు. వైఎస్ఆర్ సీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అనుమతితో, పార్టీ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్ ఆధ్వర్యంలో వారిని రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో నియమించడం అయింది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి: గట్టు శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంపునకు నిరసనగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వరంలో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. -
పోరాటాలకు సిద్ధం కావాలి
చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చా రు. వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల్ని అన్ని విషయాల్లోనూ చైతన్యవంతుల్ని చేయాలన్నారు. గురువారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రసంగించారు. అమరవీరుల త్యాగం ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేస్తోందని, బంగారు తెలంగాణ కోసం ఆశపడితే అది కనుచూపు మేరలో సాధ్యమయ్యేలా కన్పించటంలేదని చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ తన ఐదేళ్ల 100 రోజుల పాలనలో ఏనాడూ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని, వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి.. వారికి అండగా నిలిచి, చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ కమిటీలను ఈ నెల 28లోగా పూర్తి చేయాలని సూచించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపును ప్రజలకు వివరించి, వారిని చైతన్యవంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, మతీన్, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, రఘురామిరెడ్డి(మీసాల్ రెడ్డి) తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?..
హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో పోలీస్ రాజ్యం నడుస్తోందని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడిమా సమావేశంలో మాట్లాడుతూ....'బంగారు తెలంగాణ అంటే ఇదేనా?. నిర్వాసితులకు ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వాలి. రీ డిజైన్ పేరుతో తెలంగాణ ప్రజలను ముంచుతున్నారు. చట్టప్రకారం భూ సేకరణ జరపాలి. లేకుంటే నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తాం' అని తెలిపారు. కాగా మెదక్ జిల్లా తోగుట మండలంలో మల్లన్న ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల 15వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు భూసేకరణ కోసం సర్కారు 123, 214 జీవోలను విడుదల చేసింది.. అయితే ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయి… దీంతో ఈ గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.. భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. -
శివకుమార్‌కు వైఎస్సార్సీపీ షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శివకుమార్‌కు తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనందున గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో శివకుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవిధంగా ఉన్నాయని, అందుకే ఆయనకు షోకాజ్ నోటీసుల జారీ చేశామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటీసులపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని శివకుమార్‌ను కోరారు. -
గ్రేటర్లో పోటీ చేయడం లేదు
-
గ్రేటర్లో పోటీ చేయడం లేదు
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనందున గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తెలంగాణలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అసంఖ్యాకంగా ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటన పూర్తి పాఠం ఇదీ.. హామీల అమలులో అధికార టీఆర్ఎస్ వైఫల్యం, రీ డిజైనింగ్ పేరిట సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎడతెగని జాప్యం, ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో అవరోధాలు, ఆరోగ్యశ్రీ అందక పేదల అవస్థలు వంటి ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేసింది. ఇక తెలుగుదేశం పార్టీ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి, దాన్నుంచి బయటపడేందుకు టీఆర్ఎస్తో సంధి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తోంది. భవిష్యత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా అవతరించడానికి సంస్థాగతంగా బలమైన యంత్రాంగాన్ని నిర్మించుకుంటోంది. అందులో భాగంగానే గ్రామం, పట్టణం, నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది. సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఒక లోక్‌సభతో పాటు మూడు శాసనసభ స్థానాలను గెలుచుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం ముమ్మరంగా కృషి చేశారు. తెలంగాణ నుంచి కరువును తరిమికొట్టడానికి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకునేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నత చదువులకు వెళ్లలేక చతికిలపడుతున్న పేద కుటుంబాల విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి లక్షల మందికి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎం సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించారు. అందువల్లే తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దివంగత నేత మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. తెలంగాణ యావత్తు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంపై పార్టీ దృష్టి సారించింది. ఏపీలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తున్న టీడీపీ, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బీజేపీ, పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వ మద్దతుతో కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంతైనా డబ్బు ఖర్చు చేసేందుకు ఈ పార్టీలు వెనుకాడటం లేదు. గ్రేటర్లో అసంఖ్యాకంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మద్దతుదారులతో కలసి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా నిమగ్నమైంది. అందువల్లే వచ్చేనెల 2న జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయం తీసుకుంది. 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీకి దిగని విషయం తెలిసిందే. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైన సమయంలో అండగా ఉండేందుకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ క్షణం కూడా వెనుకాడదు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటంలో ముందుంటామని ప్రతిన చేస్తున్నాం. -
'ఒంటరిగానే పోటీకి దిగుతాం'
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... హైదరాబాద్‌ను గ్రేటర్ హైదరాబాద్‌గా మర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని పొంగులేటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో గ్రేటర్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. ఒంటరిగానే పోటీలోకి దిగుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య
-
వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య
హైదరాబాద్ : వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత దొమ్మాటి సాంబయ్య శనివారం తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ వైఎఎస్ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా దొమ్మాటి మాట్లాడుతూ... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అన్నారు. వైఎస్ జగన్, పొంగులేటి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు బడుగుల పార్టీ అయిన టీడీపీ ఇప్పుడు హైజాక్ అయిందని, ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయిందని దొమ్మాటి సాంబయ్య వ్యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాలకు దళిత, గిరిజనులకు టీడీపీ దూరమైందన్నారు. తెలంగాణ టీడీపీలో కొంతమంది నాయకులు టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని దొమ్మాటి విమర్శించారు. టీఆర్ఎస్కు కోవర్టులుగా తెలంగాణ టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలంతా ...ఆ పార్టీని కూకటి వేళ్లతో పెకలించే పనిలో ఉన్నారని అన్నారు. కాగా దొమ్మాటి సాంబయ్య ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
గ్రేటర్ ఎన్నికలపై టీ. వైఎస్సార్సీపీ సమీక్షలు
హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో సమీక్షల్లో రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు కె. శివకుమార్‌లు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 3వ తేదీ గురువారం కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి...శుక్రవారం కూకట్ పల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ తరువాత రెండు రోజులు పాటు ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ సమీక్షలు జరపనుంది. ఈ సమీక్షల్లో గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ అభ్యర్థి ఎంపికతో పాటు, స్థానికంగా పార్టీ బలోపేతానికి చర్చిస్తామని గ్రేటర్ నాయకులు తెలిపారు. ఈ సమావేశాల్లో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. -
పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
-
పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం : పొంగులేటి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, అయితే వరంగల్ ఉప ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలమయ్యామని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పొంగులేటి అధ్యక్షతన తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం లోటస్ పాండ్‌లో జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నిక వైఫల్యాలకు కారణాలను విశ్లేషించామని, తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు, వచ్చే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
కేసీఆర్ మోజు వల్లే ఉప ఎన్నిక
స్టేషన్ ఘన్పూర్ బహిరంగ సభలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి * టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు * ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి వరంగల్ నుంచి ‘సాక్షి’ప్రతినిధి: మంత్రిమండలిలో తనకు తొత్తుగా ఉండే వ్యక్తిని పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోజుపడి అహంకారంతో తీసుకున్న నిర్ణయం వల్లే వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు. అందువల్ల ఉప ఎన్నికలో కేసీఆర్, టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్టేషన్ ఘన్పూర్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని మరచిపోయారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణకు బదులు ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మండుటెండలో పాదయాత్ర చేశారని పొంగులేటి గుర్తుచేశారు. ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అనే తరహాలో పరిపాలించారన్నారు. 2004 కంటే మందు ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు తెరమీదకు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని, ఆయనకు ఓటు అడిగే అర్హతే లేదని పొంగులేటి విమర్శించారు. ప్రాణం పోసిన నేత కుటుంబాన్నే జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమని, ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయవద్దని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నేరవేర్చకుండా రాష్ట్రంలో కుటుంబ పాలనను తెచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ అభిమానులకు భరోసా కల్పించడం కోసం వైఎస్ జగన్ వచ్చారని...ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు. -
బంగారు తెలంగాణ ఇదేనా?: పొంగులేటి
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ వచ్చినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు రైతు సమస్యలపై ఆరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.... దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని ఆయన ఆందోళన చెందారు. బంగారు తెలంగాణ ఇదేనా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలే అని పొంగులేటి స్పష్టం చేశారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో నెలకొన్న కరువుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. -
సర్కారు నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు: పొంగులేటి
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ నాయకురాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయడమే ఆత్మహత్యలకు కారణమన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, రైతులు అధైర్యపడొద్దని ఆయన చెప్పారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉందని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తోందని తెలిపారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఇక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి లేరనే వార్తను తట్టుకోలేక అత్యధికులు వరంగల్ జిల్లాలోనే చనిపోయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పరామర్శ యాత్రలో ఉండేందుకు ఆరు అడుగుల ఇళ్లు కూడా లేనివారిని షర్మిల చూశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే పక్కాగృహాలు వచ్చేవని పేదప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. వైఎస్ఆర్ అన్నదాతలకు కూడా అండగా నిలిచారని, ఆనాడు రైతు ఆత్మహత్యలు చాలా తక్కువగా ఉండేవని ఆయన అన్నారు. -
'ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి'
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ మధుసూదనాచారిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్‌ను కోరారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగదని వైఎస్ఆర్ సీపీ నేత శివకుమార్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు వచ్చేలోగా నిర్ణయం తీసుకోవాలని కోరామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని మధుసూదనాచారి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. telangana ysrcp Leaders complaint on t.ysrcp mlas over -
బంద్‌కు మేం కూడా మద్దతిస్తున్నాం
నిజామాబాద్: మున్సిపల్ కార్మికులకు మద్ధతుగా వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు తాము మద్ధతిస్తున్నామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షం ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ద పట్లోళ్ల సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చాలని అంటున్నారని ఆయన ఆరోపించారు. ఆయన నిర్ణయంతో ప్రజా నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం అద్భుతంగా సాగిందని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికుల బంద్‌కు తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. -
టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు
తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరలక్ష్మి ఆరోపించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మాట్లాడుతూ.... నిజమైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు, ఆహార భద్రతకార్డులు రాక పేదలు ఇబ్బందులు పడుతున్నా... టీఆర్ఎస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని వరలక్ష్మీ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం పోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వరలక్ష్మి డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ..
హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలువురిని నియమిస్తూ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ర్ట పార్టీ కార్యదర్శులుగా కె.రుక్మారెడ్డి (రంగారెడ్డి), సయ్యద్ అలీ సయ్యద్ (హైదరాబాద్), సంయుక్త కార్యదర్శులుగా మహ్మద్ అష్వఖ్అలీఖాన్, జెఎల్ మేరీ, డాక్టర్ ఎం.వరలక్ష్మీ, మహ్మద్ అజ్మేరీ ఖురేషి, రాష్ట్రకార్యాలయంలో పదిజిల్లాల సమన్వయకర్తగా ఆరె లింగారెడ్డి(నల్లగొండ) నియమితులయ్యారు. అనుబంధ విభాగాలకు.. పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శిగా జాలా మహేశ్‌యాదవ్ (హైదరాబాద్ జిల్లా), రాష్ట్ర విద్యార్తి విభాగం కార్యదర్శిగా కుక్కల హనుమంతరెడ్డి (నల్లగొండ జిల్లా)లను నియమించారు. మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా ఇందిరారెడ్డి.. పార్టీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధానకార్యదర్శి సింగిరెడ్డి ఇందిరారెడ్డి (కరీంనగర్జిల్లా), కార్యదర్శులుగా కట్టా సంధ్యారాణి (కరీంనగర్జిల్లా), ఎస్కె బీబీజాన్ (హైదరాబాద్) నియమితులయ్యారు. -
ట్యాక్స్‌పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి
హైదరాబాద్ : ఏపీ వాహనాలపై ట్యాక్స్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లో కొండా రాఘవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సర్కార్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు పన్ను చెల్లించాలనే అంశంపై రెండు ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు. -
రైల్వే బడ్జెట్ అబద్ధాల పుట్ట
రైల్వే బడ్జెట్ పూర్తిగా అబద్ధాల పుట్ట అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ ఇంత అన్యాయంగా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో మీ లోపాయికారీ ఒప్పందం ఏంటని నిలదీశారు. తెలుగు రాష్ట్రాలకు అరకొర నిధులు మాత్రమే ఇచ్చినా, రెండు రాష్ట్రాల సీఎంలయిన ఇద్దరు చంద్రులు ఎందుకు స్పందించడంలేదని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. -
అప్పులు తీర్చలేకే...
* రైతు ఆత్మహత్యలను అంగీకరించిన మంత్రి పోచారం * 65 కుటుంబాలకు పరిహారం చెల్లించామని వెల్లడి * రైతు యూనిట్‌గా బీమాకు అసెంబ్లీ తీర్మానం చేస్తామని స్పష్టీకరణ * 26 నుంచి ‘చేను కబుర్లు’ పేరుతో రేడియో, టీవీ చానల్‌పైనా కసరత్తు * ‘యువరైతు సాగుబడి శిక్షణ’ను ప్రారంభించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం కుదేలై అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వాటిని తీర్చలేక మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. అన్నదాతల ఆత్మహత్యలకు కారణాలను గుర్తించి నిరోధించాలని వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ‘తెలంగాణ యువరైతు సాగుబడి శిక్షణ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యలపై ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న 65 రైతు కుటుంబాలకు లక్షన్నర రూపాయల చొప్పున పరిహారం అందజేశామని మంత్రి తెలిపారు. రాత్రికి రాత్రే అద్భుతాలు చేసే అల్లావుద్దీన్ దీపం తమ వద్ద లేదని వ్యాఖ్యానించారు. రైతు తన కుటుంబానికి మాత్రమే పంట పండించుకుంటే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతును యూనిట్‌గా చేసుకొని పరిహారం అందించే విధంగా పంటల బీమాలో మార్పులు చేయాలని కోరుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పురుగుమందులు వాడకుండా పంటల దిగుబడి పెంచేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. రైతు బాగుండాలంటే తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలను అందించాలని, కల్తీ విత్తనాలు అమ్మే వ్యాపారులను జైలుకు పంపించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని, వ్యవసాయ యాంత్రీకరణ జరగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. తను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే రోజు వచ్చినప్పుడే రైతు జీవితం బాగుపడుతుందన్నారు. కొత్త రాష్ర్టంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని పటిష్టపరిచేందుకే యువరైతు సాగుబడి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రైతును శాస్త్రీయంగా, సాంకేతికంగా బలోపేతం చేసేలా ఈ శిక్షణ ఉంటుందన్నారు. మొదటి విడతలో 330 మందితో ప్రారంభ మవుతోందని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోని యువరైతులకు శిక్షణనిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ సహాయ విస్తరణాధికారుల(ఏఏఈవో) పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే నియోజకవర్గానికో సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భూసార పరీక్షలను మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. అమూల్ పాలు వినియోగదారుడికి చేరే సరికి పది రోజులు పడుతుందని, దీనివల్ల దుష్ఫలితాలు వస్తాయన్నారు. లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల విజయ పాల సేకరణ లక్ష నుంచి 1.96 లక్షల లీటర్లకు పెరిగిందన్నారు. రైతుల కోసం టీవీ చానల్, రేడియో ‘తెలంగాణ చేను కబుర్లు’ పేరుతో ఈ నెల 26న రేడియోను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పోచారం తెలిపారు. రైతులు, వ్యవసాయ వర్సిటీ విద్యార్థులతో దీన్ని నిర్వహిస్తామన్నారు. రైతుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 12 గంటల టీవీ చానల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ప్రపంచీకరణ తర్వాత వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. యువరైతుల కోసం 90 రోజుల శిక్షణ కోర్సు ప్రారంభించామన్నారు. ఇందులో భా గంగా అధ్యయన పర్యటనలూ నిర్వహిస్తామన్నారు. శిక్షణ తీసుకునే ప్రతీ రైతుపై ప్రభుత్వం రూ. 10 వేలు ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, అధికారులు కూడా మాట్లాడారు. -
తెలంగాణ వైఎస్సాఆర్సీపీ జిల్లా సమావేశాలు ప్రారంభం
-
వంద రోజుల్లో ఒక్క హామీ నెరవేర్చలేదు
టీఆర్ఎస్పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కూసుమంచి నుంచి మొదలైన భారీ స్వాగత ర్యాలీ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వరకు సాగింది. అనంతరం, పార్టీ కార్యాలయంలో స్వాగత సభ జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పొంగులేటి మాట్లాడుతూ... ‘టీఆర్ఎస్ను, దాని అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారు. కేసీఆర్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేశారు. వారిని నట్టేట ముంచారు’ అని ధ్వజమెత్తారు. సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్.. ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకైనా ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? అని ప్రశ్నించారు. హుదూద్ బాధితులకు రూ.లక్ష విరాళం హుదూద్ తుపాను బాధితులకు వైఎస్సార్ సీపీ తెలంగాణ నేతలు అండగా ఉంటారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీగా తన వేత నం నుంచి లక్ష రూపాయలను అక్కడి బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మం డల నేతలు కూడా విరాళాలు సేకరించి, బాధితులను ఆదుకుంటారన్నారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు తన వేతనం నుంచి రూ. 20 వేలు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన వేతనం నుంచి రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. -
వైరా ఎమ్మెల్యేపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
వైరా ఎమ్మెల్యేపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్: టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ పై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కలిసి వైఎస్ఆర్ సీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరిన మదన్‌లాల్ పై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. మదన్‌లాల్ టీఆర్ఎస్ లో చేరినట్టుగా స్పీకర్ కు ఆధారాలు సమర్పించారు. అన్ని విషయాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ తమకు హామీయిచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు. స్పీకర్ ను కలిసిన వారిలో జనక్‌ప్రసాద్, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ ఉన్నారు. -
వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, పొంగులేటి పేరును ప్రకటించారు. అలాగే తెలంగాణలో పార్టీని పటిష్టం చేసే దిశగా పొంగులేటికి తోడుగా షర్మిల బాధ్యతలు తీసుకుంటారని జగన్ తెలిపారు. తెలంగాణలో పార్టీ పునర్ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పొంగులేటి అధ్యక్షతన జరుగుతాయంటూ ఆయున పేరును ప్రకటించిన వెంటనే పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం: పొంగులేటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనంతరం పొంగులేటి ప్రసంగించారు. ‘నా మీద నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టినందుకు జగన్‌కు ధన్యవాదాలు. నా మీద పెట్టిన నమ్మకం వమ్ము చేయకుండా, షర్మిలతో కలసి పార్టీ పటిష్టతకు పాటుపడతా’ అని అన్నారు. ‘వైఎస్ తన హయూంలో బడుగులు, దళితులు, మైనార్టీలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులకు భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ సైతం అవే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి నాలుగు నెలలు అయినా చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తే స్వాగతిస్తాం, అలాకాకుండా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే పోరాడతాం’ అని పేర్కొన్నారు. పొంగులేటికి శుభాకాంక్షల వెల్లువ: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సభ ముగిసిన అనంతరం పార్టీ సీనియర్ నేతలు ఆయనను అభినందించేందుకు పోటీపడ్డారు. జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఆయునకు శుభాకాంక్షలు తెలిపారు. -
తెలంగాణకు మేలు చేద్దాం
* పార్టీ సర్వసభ్య సమావేశంలో షర్మిల * పార్టీకి పెద్ద సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు * కానీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్ ఉన్నారు * తెలంగాణకు వైఎస్ చేసినంత మేలు మరెవరూ చేయలేదు * రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేద్దాం.. వైఎస్ పేరును నిలబెడదాం సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం, తెలంగాణ ప్రజల మేలు కోసం కృషి చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ చేసిన మేలు మరే నాయకుడు చేయలేదని గుర్తుచేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలంగాణకు మేలు చేసిన నాయకుడు వైఎస్‌ను మించి మరెవరూ లేరు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే 7 గంటల ఉచిత విద్యుత్‌పై సంతకం చేసి, రూ.12 వేల కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేసింది ఒక్క వైఎస్ మాత్రమే. రాష్ట్రంలో 28 లక్షల పంపుసెట్లు ఉంటే తెలంగాణలోనే 17 లక్షల పంపుసెట్లు ఉన్నాయని తెలిసీ, తెలంగాణకు మేలు చేసేందుకు, అక్కడి ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించేందుకు ఉచిత విద్యుత్‌పై వైఎస్ సంతకం చేశారు’‘ అని చెప్పారు. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తొలి సర్వసభ్య సమావేశానికి ఆమె ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. వైఎస్ మరణం తట్టుకోలేక వందల మంది మరణిస్తే, అందులో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ రోజున తెలంగాణలో పార్టీకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా వైఎస్ మాత్రం కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. ‘‘పార్టీ పటిష్టానికి మనం చేయాల్సిందల్లా, వైఎస్ వారసత్వం గల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే అని ప్రజల్లో నమ్మకం కలిగించడమే. తెలంగాణ ప్రజలకు మంచి చేసేందుకు వైఎస్ చేసిన ప్రతి మంచి పనిని పరిగణనలోకి తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం, ప్రజల కోసం శ్రమించాలి’’ అని షర్మిల సూచించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి వైఎస్ పేరును నిలబెడదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుతో పాటు నేతలు గట్టు రాంచంద్రారావు, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్, రెహ్మాన్, శివకుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఆదం విజయ్‌తోపాటు నియోజకవర్గ ఇన్చార్జీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశానికి ముందు వేదికపై ఏర్పాటుచేసిన వైఎస్, కొమురం భీం చిత్రపటానికి వైఎస్ జగన్, షర్మిళ, నేతలు నివాళులర్పించారు. వైఎస్ యుగం సువర్ణాధ్యాయం ‘‘అన్ని వర్గాల వారికి పార్టీలకతీతంగా ఇళ్లు, పింఛన్లు, ఫీజులు, వైద్యం అందించిన ఘనత ఒక్క వైఎస్‌దే. ఆపదలో అన్నలా ఆదుకున్న ఆయన యుగం ఓ సువర్ణాధ్యాయం’’ - పి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అలాగైతే అధికారంలో ఎందుకు ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్క వాగ్దానం అమలు కాలేదు. మూడేళ్ల వరకు కరెంట్ ఇవ్వలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఇక మూడేళ్లు అధికారంలో ఉండడం దేనికి? ప్రతిపక్షాలు మాట్లాడితే కుక్కలని తిడతారు. మేం విశ్వాసం, నమ్మకం గల కుక్కలం. మీలా మొరిగే కుక్కలం కాదు. చేసిన వాగ్దానాలను వైఎస్‌లా టీఆర్ఎస్ నిలబెట్టుకోకుంటే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ - తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే -
కొమురం భీం స్ఫూర్తితో ముందుకెళ్దాం
*తెలంగాణలో వైఎస్సార్సీపీని పటిష్టపరచాలి *పార్టీ రాష్ట్ర తొలి సర్వసభ్య భేటీలో వైఎస్ జగన్ దిశానిర్దేశం *రాష్ట్రం కానివారు, భాష తెలియని వారు పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు *ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన మనం ఎందుకు ముందుకు రాకూడదు? *దమ్మూ, ధైర్యం, విశ్వసనీయత ఉంటే దేవుడు, ప్రజలే ఆశీర్వదిస్తారు *నాలుగేళ్లలో టీఆర్ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం *రాష్ట్రంలో వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు సాక్షి, హైదరాబాద్: గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో బ్రిటిష్, నిజాం సామ్రాజ్యాలకు ఎదురొడ్డిన స్ఫూర్తిని నేతలు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని పార్టీని పటిష్టపరచాలని సూచించారు. రాష్ట్రం కానివారు, భాష తెలియని నేతలే రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నం చేస్తుంటే... ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన వైఎస్సార్సీపీ వంటి ఓ తెలుగు పార్టీ ఇక్కడి ప్రజలకు మంచి చేయడానికి ఎందుకు ముందుకు రాకూడదని ప్రశ్నించారు. రానున్న నాలుగేళ్లలో టీఆర్ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయమని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లే మిగిలి ఉంటాయన్నారు. ప్రస్తుతం తమ బలం తక్కువగా ఉన్నా, రానున్న రోజుల్లో దమ్మూ, ధైర్యం, ప్రజా అండ, విశ్వసనీయత తో ముందుకు వెళ్తే ఆ దేవుడే ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి రోజైన బుధవారం మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్లో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. జగన్ ఏమన్నారో ఆయన మాట ల్లోనే.. ‘‘కొమురం భీం స్ఫూర్తిని మన పార్టీలోకి తెచ్చుకొని ముందడుగు వేసేందుకు ఈ సమావేశం ఓ నిదర్శనం. రాష్ట్రంలో పార్టీ, ఉంటుందా, ఉండదా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తులకు ఒక్కటే చెబుతున్నా. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. సోనియాది మన రాష్ట్రం కాదు. ఆమెకు మన భాష రాదు. అయినా కాంగ్రెస్ ఉండాలని అంటున్నారు. ప్రధాన మోడీకి సైతం ఇక్కడి భాష రాకపోయినా బీజేపీ బలపడటానికి ప్రయత్నం చేస్తోంది. తెలుగు భాష రాని వాళ్లే ఇక్కడ పరిపాలన చే యాలని ప్రయత్నిస్తుంటే, ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసి, ఇక్కడి ప్రజలకు మంచి చేయాలనుకునే తెలుగు పార్టీ ఎందుకు ముందుకు రాకూడదు? ఆ పార్టీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం.. మరో నాలుగేళ్లలో టీఆర్ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది. కేసీఆర్‌కు ప్రజా వ్యతిరేకత రావడానికి ఏడాది పట్టొచ్చు. కానీ చంద్రబాబుకు మాత్రం నాలుగు నె లలు మాత్రమే పట్టింది. రోజుకో అబద్ధం, పూటకో మోసం చేస్తున్న బాబుకు ఏపీలో పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుంది. ఎవరిని మోసం చేయడానికి వచ్చావని ప్రజలు నిలదీసే రోజు వస్తుంది. ప్రజా వ్యతిరేకతలో టీడీపీ, టీఆర్ఎస్లు కొట్టుకుపోవడం ఖాయం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లు మాత్రమే మిగులుతాయి. ఈరోజు మన బలం తక్కువగా ఉందని, మన పార్టీ నేతలను గాలం వేసి లాక్కుంటున్నారు. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను టీఆర్ఎస్ అలాగే లాక్కుంది. పార్టీ నుంచి వెళ్లే నాయకులకు ఒక్కటే చెబుతున్నా. నాలుగేళ్ల తర్వాత టీఆర్ఎస్ కొట్టుకుపోతే ఎటు పోవాలో నేతలు గుండెల మీద చేయివేసి తేల్చుకోవాలి. ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు.. నాయకుడు ఎదగాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజలు మనవైపు ఉన్నారా.. లేరా? అన్నదే ముఖ్యం. నాలుగేళ్ల కిందటే సోనియాను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన సమయంలో నేను, అమ్మ విజయమ్మ మాత్రమే ఉన్నాం. మా వెంట ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు, దేవుడే మమ్మల్ని నడిపించారు. మనలో ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలు, దేవుడు ఆశీర్వదిస్తారు. మనం సినిమాకు వెళ్తే అందులో 14వ రీల్ వరకు హీరోను విలన్లు అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. 14వ రీల్ దాకా విలన్ విజయం సాధించినా, 15వ రీల్లో హీరో ఒక్కడే అడ్డంగా కథ మార్చేస్తారు. దమ్మూ, ధైర్యం ఉంటే మనమూ అది సాధించవచ్చు. సంక్షేమ పథకాలను కత్తిరిస్తున్నాయి.. తెలంగాణ, ఏపీలో టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు బడ్జెట్ కత్తిరింపుల పేరుతో పింఛన్లు, ఇళ్లు, ఫీజులకు కోత పెట్టే ఆలోచనలు చేస్తున్నాయి. కానీ వైఎస్ హయాంలో ప్రతి పేదవానికీ, ఇంటింటికీ సేవ చేశారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సువర్ణపాలన వైపు అడుగులు వేయిస్తుంది. రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంతున్నది లెక్కచేయకుండా సంక్షేమ ఫలాలను అమలు చేద్దాం. పార్టీ జెండా రెపరెపలాడించేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. జనంలోకి షర్మిల... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని మాటిచ్చా. ఆ మాటే నన్ను చాలా మార్చింది. ఎవరూ వెళ్లని గ్రామాలు, తిరగని పూరి గుడిసెలు తిరిగా, పేదల కష్టనష్టాలు తెలుసుకుంటే బుర్రలో ఆలోచనలు రావడం ఖాయం. మంచి నాయకుడు కావడం ఖాయం. ఖమ్మంలో ఓదార్పు పూర్తి చేసినా మిగతా జిల్లాల్లో వీలుకాలేదు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఓదార్పు అంటే బాగుండదు కనుక.. పరామర్శ పేరుతో నా సోదరి షర్మిల ఆ కుటుంబాలను కలుస్తారు. వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకునే బాధ్యతను షర్మిలపై పెడుతున్నా. వారికి తోడుగా, వారి బతుకులు మార్చే కార్యక్రమాన్ని చూసుకోవాలి. రానున్న రోజుల్లోనూ షర్మిల పార్టీ కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉంటుంది. వేరే ఏవైనా సమస్యలు ఉంటే నేనొస్తా.. ధర్నాకు దిగుతా. మీకు అండగా ఉంటా’’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సర్వ సభ్య సమావేశంలో పలువురు నేతలు తీర్మానాలు చేశారు. మొదటగా ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నేతలు శోభానాగిరెడ్డి, వడ్డేపల్లి నర్సింగరావు సహా పలువురు నేతలకు సంతాపం తెలుపుతూ తీర్మానాలు చేశారు. అనంతరం మరికొన్ని తీర్మానాలను పార్టీ నేతలు కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, ఎ.విజయకుమార్, జి.నాగిరెడ్డి, బి.రవీందర్, సత్యం శ్రీరంగం, ఎం.జయరాజు చదివి వినిపించారు. తీర్మానాలు ఇవీ.. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి 24 గంటల విద్యుత్ అమలు జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మాదిరే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాలు వెంటనే ఇవ్వాలి అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలి ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలి రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి రూ.5 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం అందించి దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేయాలి దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి కరెంట్ కోతల వల్ల జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నిరోధానికి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి విద్యుత్‌ను ఇచ్చి ఆదుకోవాలి -
''బయ్యారం భూముల్ని గిరిజనులకివ్వాలి''
-
''టీఆర్ఎస్ మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు''
-
'మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ చేయాలి'
హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో మరణించిన విద్యార్థులు, తెలంగాణ అమరవీరులకు అసెంబ్లీలో సంతాపం తీర్మానం పెట్టాలని వారు సూచించారు. నవ తెలంగాణ నిర్మాణంలో, బంగారు తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలుగా సోమవారం వీరు ప్రమాణస్వీకారం చేశారు. -
'నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర'
-
'నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర'
హైదరాబాద్: నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో కూడా తాము ప్రజల పక్షానా పోరాడతామని తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని తెలంగాణ అడ్‌హక్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అడ్‌హక్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు పాల్గొనాలని పొంగులేటి పిలుపునిచ్చారు. -
తెలంగాణ వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. లోటస్ పాండ్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలకు సిద్దమైంది. వచ్చే నెల మొదటివారం నుంచి వైఎస్ జగన్ వారం రోజుల పాటు ఈ సమీక్షలు చేయనున్నారు. ఇప్పటికే సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీలు రివ్యూ చేస్తున్నాయి. -
'పోలవరం బాధితులకు న్యాయం చేయండి'
పోలవరం ముంపు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలసి స్థానిక ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్‌లు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్‌పై తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది. అందులోభాగంగా గురువారం తెలంగాణ బంద్‌కు ఆ పార్టీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. -
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం తథ్యం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం తథ్యమని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం చింతూరులో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల గుండెల్లో దివంగత సీఎం వైఎస్ఆర్ చిరస్మరణీయంగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన వైఎస్ఆర్ సీపీని బలీయ శక్తిగా రూపొందించేందుకు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్ సీపీ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్, టీడీపీ తట్టుకోలేకపోతున్నాయని, వాటి నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్లీనరీ స్పష్టంగా చెప్పిందన్నారు. కేంద్రం తండ్రి పాత్ర పోషించి, ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీ కోరుతోందని చెప్పారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలహీనపడిందంటూ కాంగ్రెస్-టీడీపీ సాగిస్తున్న దుష్ర్పచారాన్ని పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చగల సత్తా కేవలం ఆయనకు (జగన్మోహన్ రెడ్డికి) మాత్రమే ఉందని నమ్ముతున్నారని చెప్పారు. వై ఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే.. పోల వరం ముంపు ప్రాంతంలోని రైతులకు ఎకరాకు మూడులక్షల రూపాయలను ఇప్పిస్తుందని, చింతూరు మండలంలోని నేలకోట, వీఆర్‌పురం మండలంలో దయ్యాలమడుగు ప్రాజెక్టులను పూర్తిచేయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), నాయకులు కడియం రామాచారి, ఎండి.మూసా, మానె రామకృష్ణ, రామలింగారెడ్డి, మన్మధ హరి, జమాల్‌ఖాన్, సుధాకర్, చిట్టిబాబు, ఆసిఫ్ పాల్గొన్నారు.