Telecom department
-
కోటి మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్
ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్ కనెక్షన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది."ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్ కోసం రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్స్‌తో సహా బల్క్ కనెక్షన్లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.వాటి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్లు డిస్కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్ఎంఎస్ హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్ క్యూఓఎస్ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు. -
ఇక ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్ నంబర్!
సాక్షి, అమరావతి: సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి ‘యూనిక్ ఐడీ(ప్రత్యేక గుర్తింపు) నంబర్’ కేటాయించాలని నిర్ణయించింది. ఓ వ్యక్తికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నా, ఎన్ని సిమ్ కార్డులు ఉన్నా సరే.. ఐడీ నంబర్ మాత్రం ఒకటే ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది చివరినాటికే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. జనాభా కంటే సిమ్కార్డులే అధికం..! మొబైల్ టెక్నాలజీ ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉందో.. సైబర్ నేరస్తులకు అంత ఉపయోగకరంగా మారిందన్నది వాస్తవం. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో జనాభా కంటే మొబైల్ ఫోన్లు/సిమ్ కార్డులే అధికంగా ఉండటం గమనార్హం. 2022 డిసెంబర్ నాటికి దేశంలో 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 10.7 కోట్లుండగా.. ప్రైవేటు టెలికాం కంపెనీల కనెక్షన్లు 102 కోట్లకుపైనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న టెలికాం నిబంధనల మేరకు జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్ కార్డులు ఉండవచ్చు. జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్టంగా 6 సిమ్ కార్డులు ఉండవచ్చు. కానీ ప్రైవేటు టెలికాం కంపెనీల ఫ్రాంచైజీలు కొన్ని సిమ్ కార్డుల విక్రయంలో నిబంధనలను పాటించడం లేదు. దీంతో సైబర్ నేరస్తులు వేర్వేరు పేర్లతో ఫోన్ కనెక్షన్లు, సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. 2022లో భారత్‌లో జరిగిన సైబర్ మోసాలు, వేధింపుల్లో 65 శాతం దొంగ సిమ్‌కార్డులతో చేసినవేనని నేషనల్ సైబర్ సెల్ నివేదిక వెల్లడించింది. వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో నమోదైన మొత్తం నేరాల్లో.. సోషల్ మీడియాకు సంబంధించినవే 12 శాతం ఉండటం గమనార్హం. 14 అంకెలతో యూనిక్ ఐడీ నంబర్.. సోషల్ మీడియా వేధింపులు, ఆన్లైన్ మోసాల కట్టడికి దేశంలో మొబైల్ ఫోన్ల కనెక్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. టెలికాం శాఖతో కలసి కార్యాచరణను రూపొందించింది. మొబైల్ వినియోగదారులు అందరికీ యూ నిక్ ఐడీ నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఇది 14 అంకెలతో ఉండనుంది. ఓ వ్యక్తి పేరిట ఎన్ని ఫోన్ కనెక్షన్లు ఉన్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మా త్రం ఒక్కటే ఉంటుంది. దేశంలో ఎక్కడ సిమ్ కార్డు కొనుగోలు చేసినా.. ఏ ప్రాంతంలో ఫోన్‌ను ఉపయోగిస్తున్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మాత్రం అదే ఉంటుంది. వినియోగదారుల ఫోన్‌కు మెసేజ్ పంపించి.. ఓటీపీ ద్వారా నిర్ధారించి.. యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని కేంద్ర టెలికాం శాఖ భావిస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. ‘అస్త్ర’ అప్డేట్.. సిమ్‌కార్డు మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన కేంద్ర టెలికాం శాఖకు చెందిన ‘అస్త్ర’ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించనున్నారు. మొబైల్ కనెక్షన్ల కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, ఫొటోలు సక్రమంగా ఉన్నాయో, లేదో గుర్తించడంతోపాటు సంబంధిత దరఖాస్తుదారులకు అప్పటికే యూనిక్ ఐడీ నంబరు కేటాయించారా, లేదా అనే విషయాలను కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించనున్నారు. తద్వారా నకిలీ సిమ్‌కార్డులు, వేర్వేరు పేర్లతో ఉన్న సెల్‌ఫోన్ కనెక్షన్లకు చెక్ పెడతాఱు. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సైబర్ కేసు నమోదవ్వగానే.. నిందితులను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సిమ్ కార్డు ఎవరి పేరుతో ఉంది.. యూనిక్ ఐడీ నంబర్‌తో సరిపోలుతోందా, లేదా అనే విషయాలను నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. -
డేటా ఎక్కడి నుంచి లీకైంది?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వ్యక్తిగత డేటా లీక్’మూలాలను తేల్చేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడి నుంచి డేటా తస్కరణకు గురైంది? నిందితులు దీనిని ఎక్కడెక్కడ దాచి ఉంచారు? దానిని ఎవరెవరు కొనుగోలు చేశారు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రక్షణ శాఖ, టెలికం వంటి 138 ప్రభుత్వ విభాగాలుసహా 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పలు ఇతర ప్రాంతాల్లోని పలు కంపెనీల నుంచి డేటా చోరీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కేసుతో వారికి ఉన్న సంబంధాలపై విచారించిన అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకా శం ఉన్నట్టు సమాచారం. ఈ డేటా ఎవరెవరు కొనుగోలు చేశారో కనిపెట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్లౌడ్, హార్డ్ డిస్క్‌లలో డేటా.. ప్రజల వ్యక్తిగత వివరాలను తస్కరించిన నిందితులు డేటాను హార్డ్ డిస్క్‌లతోపాటు క్లౌడ్ సర్వీస్‌లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్లౌడ్ సర్వీస్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరుతూ గూగుల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను తస్కరించినట్టు గుర్తించామని, క్లౌడ్‌లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తే.. దొంగిలించిన డేటా మొత్తం ఎంత అనేది స్పష్టమవుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు అలర్ట్ నీట్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ అధికారులు, బ్యాంకు ఖాతాదారులు, పాన్‌కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వంటి 138 కేటగిరీల వారి డేటాను నిందితులు దొంగిలించారు. అయితే వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలూ చోరీకి గురైన నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ శాఖలను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈమేరకు రిజర్వు బ్యాంకు, టెలికం విభాగం, కేంద్ర హోం, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. ఏజెన్సీల నుంచే డిఫెన్స్ సమాచారం లీక్? రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది ఉద్యోగుల డేటాను సైతం నిందితులు దొంగిలించారు. వీటిలో డిఫెన్స్ అధికారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, దళం పేరు, ర్యాంకు, పనిచేస్తున్న చోటు, చిరు నామా వంటి కీలక వివరాలున్నాయి. రక్షణశాఖకు చెందిన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారని.. ఆ ఏజెన్సీల నుంచే డేటా చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలున్న బ్యాంకు నుంచి లేదా పేస్లిప్‌లను సిద్ధం చేసే ఏజెన్సీల నుంచి డేటా లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
5జీ టెక్నాలజీ గొప్పదే కానీ...
అక్టోబర్ 1 నుండి 5జీ టెక్నాలజీ వాణిజ్య సేవలను భారత్‌లో అధికారికంగా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అసలు ఈ 5జీ టెక్నా లజీ అంటే ఏమిటో, దానివల్ల సామాన్య ప్రజలకు, ఇతరులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. నిజానికి టెలికాం రంగంలో ఇంత త్వరితగతిన వచ్చినన్ని సాంకేతిక మార్పులు మరే ఇతర రంగంలో రాలేదు. 1980లలో 1జీ టెక్నాలజీ ద్వారా అనలాగ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకునే సౌకర్యం వస్తే, 1990 నాటికి 2జీ టెక్నాలజీ ద్వారా డిజిటల్ వాయిస్, ఎస్ఎంఎస్ ఇచ్చుకునే సదుపాయం వచ్చింది. 2000 నాటికి 3జీ సాంకేతి కత ద్వారా మొబైల్లో డేటా వాడు కునే సౌకర్యం కల్పించారు. 2010 నాటికి 4జీ ద్వారా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు 5జీ ద్వారా మొబైల్లోనే హై స్పీడ్ నెట్వర్క్ కల్పిస్తున్నారు. ఎక్కువ స్పీడ్ కలిగిన నెట్వర్క్ కావాలంటే భూగర్భ కేబుల్ ద్వారా వేసిన బ్రాడ్ బ్యాండ్, లేక ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాలని అనుకునే దశ నుండి, మొబైల్లోనే రియల్ టైమ్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ వాడుకునే వెసులుబాటు 5జీ ద్వారా కలుగు తుంది. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్, ఐటీ, వాతావరణ, అంతరిక్ష రంగా లలో పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల్లో 5జీ అమలు ద్వారా లోడ్ నియంత్రణ నెట్వర్క్ గణనీయంగా మెరుగవుతుంది. వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సౌకర్యం వల్ల... విద్యారంగం, వైద్య సేవలు ప్రపంచ స్థాయికి చేరు తాయని భావిస్తున్నారు. మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా యంత్ర పరికరాల రిపేరు, యంత్రాలను నడపటం మొబైల్ ద్వారానే చేయగలం. మరింత అధునాతన వీడియో కాన్ఫ రెన్స్ సౌకర్యం ఏర్పడుతుంది. ఐటీ లేదా పెద్దపెద్ద కంపె నీలలో హై స్పీడ్ నెట్వర్క్ వినియోగం ద్వారా పెను మార్పులు వస్తాయి. 5జీ టెక్నాలజీ నిరంతరం రావడానికి ఎక్కువ టవర్లు అవసరం వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ. 4జీతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించదు. అందుకే ఎక్కువ టవర్లు, డబ్బు అవసరం. ఇప్పుడు వాడు తున్న మొబైల్స్ బదులుగా 5జీ టెక్నాలజీ మొబైల్స్ వాడాల్సి ఉంటుంది. హాకర్లు సైబర్ నేరాలకు మరింత ఎక్కువగా పాల్పడే అవ కాశం ఎక్కువ. వర్షం వచ్చినా 5జీ నెట్వర్క్ సరిగా పనిచేయదు. కేవలం వినోదం, గేమింగ్, డేటా వినియోగం పెంచుకోవడంపై ప్రయివేట్ టెలికాం కంపె నీలు దృష్టి పెడతాయి కనుక యువత చెడిపోయే ప్రమాదం ఎక్కువ. ప్రయివేట్ టెలికాం కంపెనీలతో పాటు 5జీ టెక్నా లజీని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్కు కూడా ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవల అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికామ్ రంగ విశ్లేషకులు మొబైల్: 94405 24222 -
వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి వాటా
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో ప్రభుత్వం వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. షేరు విలువ రూ. 10 లేదా ఆపై స్థిరత్వాన్ని సాధిస్తే వాటాను పొందనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 10 ముఖ విలువకే ప్రభుత్వానికి వాటాను ఆఫర్ చేసింది. ముఖ విలువకే షేర్లను పొందేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. షేరు ధర రూ. 10 లేదా అపై స్థిరత్వాన్ని సాధించాక టెలికం శాఖ(డాట్) ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి షేరు రూ. 10 దిగువనే కదులుతోంది. తాజాగా 0.5% నీరసించి రూ. 9.70 వద్ద ముగిసింది. జూలైలోనే...: వీఐఎల్‌లో ప్రభుత్వం వాటాను సొంతం చేసుకునేందుకు జూలైలోనే ఆర్థిక శాఖ ఆమోదించింది. రూ. 16,000 కోట్లమేర వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి కేటాయించేందుకు వీఐఎల్ ఇప్పటికే నిర్ణయించుకుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. వెరసి వీఐఎల్‌లో ప్రమోటర్ల వాటా 74.99 శాతం నుంచి తగ్గి 50 శాతానికి పరిమితంకానుంది. ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్ చెల్లింపులకు సంబంధించి వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు టెలికం కంపెనీలకు ప్రభుత్వం అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి జూన్ చివరికల్లా స్థూలంగా రూ. 1,99,080 కోట్ల రుణ భారముంది. -
వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు విక్రయించొద్దు
న్యూఢిల్లీ: ప్రభుత్వ అనుమతులు అవసరమయ్యే వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు వంటి టెలికం పరికరాలను విక్రయించరాదని ఈ–కామర్స్ సంస్థలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులిస్తే తప్ప సెల్యులార్ సిగ్నల్ జామర్లు, జీపీఎస్ బ్లాకర్లు లేదా ఇతరత్రా సిగ్నల్స్‌ను జామ్ చేసే పరికరాలను వినియోగించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దేశీయంగా ప్రైవేట్ రంగ సంస్థలు లేదా ప్రైవేట్ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడం లేదా వినియోగించుకోవడం వంటివి చేయరాదు‘ అని ఒక ప్రక టనలో తెలిపింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా సిగ్నల్ జామింగ్ పరికరాల ప్రకటనలు ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం, దిగుమతి చేసుకోవడం లేదా ఇతరత్రా మార్కెటింగ్ చేయడం వంటివన్నీ కూడా చట్టవిరుద్ధమని పేర్కొంది. గడిచిన 4–5 ఏళ్లుగా డాట్ ఈ అంశాన్ని అనేక సార్లు లేవనెత్తింది. ఈ పరికరాల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు పలు మార్లు దాడులు కూడా నిర్వహించింది. వైర్లెస్ జామర్లను విక్రయించడం లేదా వాటి అమ్మకానికి వెసులుబాటు కల్పించడం వంటివి చేయరాదంటూ ఈ–కామర్స్ కంపెనీలన్నింటికీ జనవరి 21న డాట్ నోటీసు కూడా జారీ చేసింది. మరోవైపు, మొబైల్ సిగ్నల్ బూస్టర్ల వంటి అక్రమ పరికరాల అనధికారిక వినియోగం వల్ల టెలికం సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. వీటి వినియోగం చట్టరీత్యా నేరమన్న సంగతి చాలా మంది ప్రజలకు తెలియదని, తాజా ఆదేశాలతో ఈ అంశంపై అవగాహన పెరగగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. -
జియో స్పెక్ట్రమ్ బకాయిలు క్లియర్
న్యూఢిల్లీ: టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలన్నిటీని చెల్లించింది. టెలికం శాఖ(డాట్)కు రూ. 30,791 కోట్లు జమ చేసింది. తద్వారా 2021 మార్చివరకూ వడ్డీసహా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలను పూర్తిగా తీర్చివేసినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. వీటిలో 2014, 2015, 2016లలో వేలం ద్వారా చేజిక్కించుకున్న స్పెక్ట్రమ్‌తోపాటు.. 2021లో ఎయిర్టెల్ ద్వారా సొంతం చేసుకున్న రేడియో తరంగాల బకాయిలు సైతం ఉన్నట్లు వివరించింది. వెరసి వేలం, ట్రేడింగ్‌ల ద్వారా మొత్తం 585.3 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను పొందినట్లు వెల్లడించింది. ప్యాకేజీకి నో... స్పెక్ట్రమ్ బకాయిలను పూర్తిగా చెల్లించడం ద్వారా ఏడాదికి రూ. 1,200 కోట్లమేర వడ్డీ వ్యయాలను ఆదా చేసుకోనున్నట్లు రిలయన్స్ జియో తెలియజేసింది. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం అంచనాలను మదింపు చేసింది. దీంతో ప్రభుత్వం టెలికం రంగానికి గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని వినియోగించుకోబోమని చెప్పినట్లయ్యింది. ఇటీవల వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి వాటాలను కేటాయించిన విషయం విదితమే. తద్వారా వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుండగా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) 9.5 శాతం చొప్పున వాటాలు కేటాయించనున్నాయి. ఈ నేపథ్యంలో జియో చెల్లింపులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటున్నారా..! అయితే..
న్యూఢిల్లీ: సిమ్ కార్డు కనెక్షన్లు ఒక్కరి పేరుతో 9కి మించి ఉంటే మళ్లీ ధ్రువీకరించాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్లను టెలికం శాఖ ఆదేశించింది. ధ్రువీకరణ లేకపోతే కనెక్షన్లను తొలగించాలని కోరింది. జమ్మూ అండ్ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, అసోమ్లకు ఈ పరిమితి 6 సిమ్కార్లులుగా పేర్కొంది. తమకున్న కనెక్షన్లలో వేటిని యాక్టివ్‌గా ఉంచుకోవాలి, వేటిని డీయాక్టివేట్ చేయాలన్నది చందాదారులకు ఆప్షన్ ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. టెలికం శాఖ డేటా విశ్లేషణ చేసిన సమయంలో వ్యక్తిగత చందాదారులు 9కంటే ఎక్కువ కనెక్షన్లను కలిగి ఉన్నట్టు గుర్తిస్తే.. వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ఫ్లాగ్ చేయనున్నట్టు టెలికం శాఖ తెలిపింది. ఇటువంటి కనెక్షన్లకు అవుట్గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లోపు నిలిపివేయాలని, ఇన్కమింగ్ కాల్స్ సదుపాయాని 45 రోజుల్లోపు తొలగించాలని ఆదేశించింది. ఆర్థిక నేరాలు, ఇబ్బంది పెట్టే కాల్స్, మోసపూరిత చర్యలకు చెక్ పెట్టేందుకే టెలికం శాఖ తాజా ఆదేశాలు తీసుకొచ్చింది. -
త్వరలో 5జీ నెట్వర్క్.. అందుబాటులో ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఊరిస్తోన్న 5 జీ నెట్వర్క్ సేవలు మరింత ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు రావడం మినహా.. అసలు 5జీ నెట్వర్క్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు మొబైల్ కంపెనీలో ఎడాపెడా 5జీ హ్యాండ్సెట్లను రిలీజ్ చేస్తూ మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. నవంబరులోపే 5జీ ట్రయల్స్ కోసం 2021 మే నెలలో ప్రభుత్వం టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్టీఎల్లు అనుమతి పొందాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం నవంబర్‌లోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. గడువు పెంచండి నవంబరు సమీపిస్తుండటంతో ఇక కమర్షియల్‌గా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అశించిన వారికి నిరాశే ఎదురైంది. నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి చేయలేకపోయామని, ట్రయల్స్‌కి మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కోలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కారణం అదేనా 5జీ ట్రయల్స్‌కి సంబంధించి చైనా తయారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించద్దని టెల్కోలకి కేంద్రం సూచించింది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ డాట్ తదితర ఎక్విప్మెంట్ను ఉపయోగిస్తే పర్వాలేదని పేర్కొంది. దీంతో టెల్కోలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యమైంది. ఫలితంగా నవంబరులోగా పూర్తి స్థాయిలో ట్రయల్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది టెలికం కంపెనీలో కోరినట్టు మరోసారి ట్రయల్స్ గడువు పెంచితే 5 జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు 2022 ఏప్రిల్–జూన్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వోడఫోన్ ఐడియా చేపట్టిన ట్రయల్స్‌లో నెట్ స్పీడ్ 3.7 గిగాబైట్ పర్ సెకండ్‌గా రికార్డు అయ్యింది. చదవండి:ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట -
రుణాన్ని ఈక్విటీగా మార్చుకోవడమే మార్గం
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాను (వీఐఎల్) గట్టెక్కించడానికి కసరత్తు కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్ బకాయిలను చెల్లించే విషయంలో టెలికం రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు టెలికం శాఖ (డాట్) బ్యాంకుల సీనియర్ అధికారులతో సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా వీఐఎల్ అంశం కూడా చర్చకు వచి్చంది. కంపెనీకి ఇచ్చిన రుణాలను ఈక్విటీల కింద మార్చుకోవడం ద్వారా దాన్ని బైటపడేసేందుకు ఒక మార్గం ఉందని డాట్‌కు బ్యాంకర్లు తెలియజేశారు. గతంలోనూ ఒత్తిడిలో ఉన్న కొన్ని సంస్థల విషయంలో ఇలాంటి విధానం అనుసరించిన సంగతి వివరించారు. అయితే, వీఐఎల్ ఇప్పటిదాకా రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కానందున తాము చర్యలు తీసుకోలేమని బ్యాంకుల అధికారులు పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీఐఎల్ గానీ మూతబడితే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు నష్టం వాటిల్లుతుందని అంచనా. కంపెనీకి రుణాలిచి్చన వాటిల్లో ఎక్కువగా ప్రభుత్వ బ్యాంకులే ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌పై గణనీయంగా ప్రభావం పడే అవకాశముంది. దీంతో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే మొండి బాకీ కింద ప్రొవిజనింగ్ చేయడం మొదలుపెట్టాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీల కింద కేంద్రానికి వీఐఎల్ రూ.58,254 కోట్లు కట్టాలి. ఇందులో రూ.7,854 కోట్లు కట్టగా రూ.50,400 కోట్లు బాకీ పడింది. టెలికం సంస్థలు కేంద్రానికి రూ. 93,350 కోట్ల మేర ఏజీఆర్ బాకీలు కట్టాల్సి ఉంది. టెలికం రంగంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఇందుకు సుప్రీం కోర్టు పదేళ్ల గడువు ఇచి్చంది. -
స్పెక్ట్రమ్ షేరింగ్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ పంపిణీ వివరాలను (షేరింగ్) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రమ్ పంపకం జరగ్గా.. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ కామ్ తోపాటు, వీడియోకాన్ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. ‘‘వీడియోకాన్ స్పెక్ట్రమ్ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్ టెల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వీడియోకాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు. ఏజీఆర్ బకాయిలను ఐబీసీ కింద నిర్వహణ బకాయిలుగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను జియో వినియోగించుకున్నందున ఆ మొత్తానికి సంబంధించి జియో చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగినా ఇవ్వలేదేమంటూ ధర్మాసనం టెలికం శాఖను ప్రశ్నించింది. అనంతరం దివాలా చర్యల పరిధిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్ పంపిణీకి సంబంధించి ఎంత మేర బకాయిలు రావాలన్న వివరాలను సమర్పించాలని టెలికం శాఖను ఆదేశించింది. 1999 నుంచి ఏ కంపెనీలు స్పెక్ట్రమ్ ను వినియోగించుకున్నదీ, వాటి మధ్య వాణిజ్య ఒప్పంద వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. ఏజీఆర్ బకాయిలను ఏటా కొంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించేందుకు అనుమతించాలని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి. ఈ రెండు కంపెనీలు కలసి రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. టెలికం శాఖ డిమాండ్ ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.8,000 కోట్లను ఇప్పటి వరకు జమ చేయగలిగింది. భారతీ ఎయిర్ టెల్ రూ.43,000 కోట్ల బకాయిలకు గాను రూ.18,000 కోట్లను చెల్లించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
బల్క్ కనెక్షన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లు తీసుకున్న సబ్స్క్రయిబర్స్కు కొత్త కనెక్షన్లు జారీ చేసే అంశానికి సంబంధించి టెలికం శాఖ (డాట్) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. జూలై 20న జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త కనెక్షన్ల జారీ సమయంలో టెలికం ఆపరేటర్లు భౌతికంగా సదరు బల్క్ కనెక్షన్లున్న ఆవరణకు వెళ్లి, దానికి సంబంధించిన లొకేషన్ గ్రిడ్, తనిఖీ చేసిన సమయం తదితర వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల ఆవరణలను ప్రతీ ఆరునెలలకోసారి టెల్కోలు సందర్శించి, లొకేషన్ గ్రిడ్ వివరాలను సేకరించాలి. బల్క్ కనెక్షన్లను టెలికం కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడానికి ముందు బల్క్ కనెక్షన్లు తీసుకున్న కంపెనీ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ–కేవైసీ, డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ఆధారంగా జారీ చేసిన కనెక్షన్లకు సంబంధించిన పలు దరఖా స్తు ఫారంలలో అడ్డదిడ్డంగా రాతలు ఉంటున్నాయని, వాటిని సరిచేయాలని టెల్కోలకు డాట్ సూ చించింది. టెలికం శాఖ అనుమతుల మేరకు గతం లో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియతో టెల్కో లు కనెక్షన్లు జారీ చేసేవి. అయితే, ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు 2018లో కీలక మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్ప ట్నుంచీ డిజిటల్ కేవైసీ ప్రక్రియ అమలవుతోంది. -
5జీ కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండేళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ, టెలికాం పరిశ్రమల్లో ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పనులపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో విపరీత జాప్యం చోటుచేసుకుంటోంది. టెలికాం శాఖ 5జీ వేలంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో 5జీ వేలం ప్రక్రియ 2021లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చర్చ సాగింది. వేలం ప్రక్రియలో జాప్యం జరిగితే అది 5జీ పరీక్షలు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన లాంఛనాలు పూర్తయి 5జీ వాణిజ్య సేవలు 2022లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు భారత్‌లో 5జీ స్పెక్ట్రమ్ బేస్ ధర యూనిట్‌కు రూ 492 కోట్లుగా నిర్ణయించడం టెలికాం ఆపరేటర్లకు ప్రధాన అవరోధంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో బేస్ ధర అత్యధికంగా ఉందని టెలికాం దిగ్గజాలు వొడాఫోన్-ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భారత 5జీ ప్రణాళికల్లో చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు హువేయి, జడ్టీజీల పాత్రపై కొనసాగుతున్న అనిశ్చితి సైతం భారత్‌లో 5జీ ఎంట్రీని సంక్లిష్టం చేస్తున్నాయని ఓ వార్తాసంస్థ కథనం పేర్కొంది. చదవండి : 5జీ టెక్నాలజీ: కొత్త తరం కార్లు భారత్‌లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మౌలిక సేవల కోసం చైనా కంపెనీలు హువేయి పాత్ర సందేహాస్పదంగా మారింది. అమెరికా చేపట్టిన చైనా వ్యతిరేక విధానంతో పలు దేశాలు హువేయి ద్వారా 5జీ మౌలిక సేవలను పొందేందుకు సానుకూలంగా లేవు. భారత్‌లో ఇప్పటికే టెలికాం రంగంలో తీవ్ర పోటీతో స్వల్ప మార్జిన్లతో నెట్టుకొస్తున్న టెలికాం ఆపరేటర్లు 5జీ సేవల కోసం భారీ నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా లేరు. కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో మొబైల్ యూజర్ల నుంచి ఖరీదైన 5జీ ప్లాన్స్‌కు ఆదరణ ఎంతమేరకు ఉంటుందనేది కూడా టెలికాం ఆపరేటర్లను ఆలోచనలో పడవేశాయి. ఇక 5జీ సేవలు ప్రధానంగా పారిశ్రామిక అప్లికేషన్స్‌కు ఉపయుక్తమని, సాధారణ యూజర్లకు 5జీ ప్రయోజనాలు పరిమితమే. ఈ పరిస్థితులను బేరీజు వేసి టెలికాం శాఖ 5జీ ఎంట్రీని మరో ఏడాది పాటు జాప్యం చేస్తోందని చెబుతున్నారు. -
మరో 8,000 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ ఏజీఆర్ (సవరించిన స్థూల రాబడి) బకాయిలకు సంబంధించి శనివారం రూ.8,004 కోట్లు టెలికం విభాగానికి (డాట్)కు చెల్లించింది. గత నెల 17న ఈ కంపెనీ ఏజీఆర్ బకాయిల నిమిత్తం రూ.10,000 కోట్లు చెల్లించింది. మొత్తం మీద ఈ కంపెనీ చెల్లించిన ఏజీఆర్ బకాయిల మొత్తం రూ.18,004 కోట్లకు చేరింది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి ఈ మొత్తాలను చెల్లించామని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కాగా డాట్ అంచనాల ప్రకారం ఎయిర్టెల్ కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ.35,586 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వానికి రూ.23,701 కోట్ల ఏజీఆర్ బకాయిలు వసూలయ్యాయి. భారతీ ఎయిర్టెల్ రూ.18,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రెండు దశల్లో రూ.3,500 కోట్లు, టాటా టెలి సర్వీసెస్రూ.2,197 కోట్లు చొప్పున చెల్లించాయి. (డాట్‌ను ఆశ్రయించిన వొడాఫోన్ ఐడియా) చదవండి: చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్ -
డాట్‌ను ఆశ్రయించిన వొడాఫోన్ ఐడియా
ముంబై : సగటు స్ధూల రాబడి (ఏజీఆర్)పై ప్రభుత్వానికి బకాయిల చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా ఊరటను కోరుతూ టెలికాం శాఖ (డాట్)ను ఆశ్రయించింది. తమకు రావాల్సిన రూ 8000 కోట్ల జీఎస్టీ రిఫండ్‌ను సర్దుబాటు చేయాలని కోరింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కూడా వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. బకాయిల చెల్లింపులో ఊరట కల్పించాలని కంపెనీ చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చడంతో వొడాఫోన్ ఐడియాకు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల్లో కంపెనీ ఇప్పటికే రూ 3500 కోట్లు చెల్లించగా, స్వయం మదింపు ఆధారంగా రూ 23,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ 7000 కోట్లు అసలు మొత్తం. మరోవైపు బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని, లైసెన్స్‌ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని కంపెనీ డాట్‌ను కోరుతోంది. స్పెక్ర్టం వాడకం చార్జీలను సైతం 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని కోరుతోంది. చదవండి : అలాగైతే వొడాఫోన్ మూతే.. -
గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్స్పై ‘టెలికం’ పిడుగు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం శాఖ మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. నాన్ టెలికం కంపెనీలకూ డిమాండ్ నోటీసులను పంపుతోంది. తాజాగా గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు రూ.15,019 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసు పంపించింది. జనవరి 23లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని టెలికం శాఖ కోరినట్టు గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్స్ గురువారం వెల్లడించింది. కంపెనీ వీశాట్, ఐఎస్పీ లైసెన్స్‌లను కలిగి ఉండడంతో 2005–06 నుంచి 2018–19 వరకు కాలానికి ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరినట్టు తెలిపింది. ‘‘డిమాండ్ నోటీసును, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నాం. న్యాయ నిపుణుల సూచనల మేరకు వ్యవహరిస్తాం’’ అని కంపెనీ పేర్కొంది. తాజా పరిణామంతో నాన్ టెలికం కంపెనీల నుంచి టెలికం శాఖ డిమాండ్ చేస్తున్న చెల్లింపుల మొత్తం రూ.3.13 లక్షల కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్లను చెల్లించాలని ఇప్పటికే టెలికం శాఖ కోరింది. అంటే టెలికం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తానికి నాన్ టెలికం కంపెనీల చెల్లింపులు రెట్టింపుగా ఉండడం ఆశ్చర్యకరం. ఇప్పటికే గెయిల్ నుంచి రూ.1.72 లక్షల కోట్లు, పవర్‌గ్రిడ్ నుంచి రూ.1.25 లక్షల కోట్ల బకాయిలకు టెలికం శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇవి కూడా ఐపీ లైసెన్స్‌లు కలిగి ఉండడంతో, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం శాఖ ఈ చర్యలకు దిగింది. అయితే, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తీర్పు పునఃసమీక్షకు పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. -
5జీపై టెల్కోలతో టెలికం శాఖ భేటీ
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సేవల ప్రయోగాత్మక పరీక్షలకు సంబంధించి టెల్కోలు, వివిధ ఉత్పత్తుల వెండార్లతో కేంద్ర టెలికం శాఖ (డాట్) మంగళవారం భేటీ అయ్యింది. టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సారథ్యంలో జరిగిన ఈ సమావేశం దాదాపు గంటపైగా సాగింది. ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపేందుకు హువావే సహా సంబంధిత సంస్థలన్నింటికీ 5జీ స్పెక్ట్రం కేటాయిస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరమైన కారణాల రీత్యా హువావేను అమెరికా నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు, వైర్‌లైన్ సేర్విసులు అందించే విషయంలో నెట్వర్క్ టెస్టింగ్‌కి సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనల ముసాయిదాపై చర్చాపత్రం విడుదల చేసింది. ఇందులో చాలా మటుకు ప్రతిపాదనలు మొబైల్ సరీ్వసు నెట్వర్క్ టెస్టింగ్ నిబంధనల తరహాలోనే ఉన్నాయి. వీటి ప్రకారం వ్యాపారపరంగా సరీ్వసులు ప్రారంభించేందుకు ముందుగా.. ట్రయల్ దశలో టెస్టింగ్ కోసం సబ్‌స్క్రయిబర్స్‌ను చేర్చుకునేందుకు టెలికం సంస్థకు అనుమతి ఉంటుంది. సబ్‌్రస్కయిబర్స్‌ను చేర్చుకోవడానికి కనీసం 15 రోజుల ముందు.. సదరు నెట్వర్క్ సామర్థ్యాల సమగ్ర వివరాలను డాట్‌కు ఆపరేటరు సమరి్పంచాల్సి ఉంటుంది. -
అక్రమ ఇసుక, మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక, మద్యం పాలసీల అమలుతీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నెంబరు ఖరారయ్యింది. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు.. మద్యం అక్రమ విక్రయాలపై ఫిర్యాదులకు ‘14500’ నెంబర్‌ను కేంద్ర టెలికం శాఖ కేటాయించింది. దీంతో దీనిని టోల్‌ఫ్రీ నంబరుగా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తగు ఏర్పాట్లుచేసిన తర్వాత ఈ నంబర్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని.. ఆ సమాచారం త్వరలో ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. -
జియో, ఆర్‌కామ్ ఒప్పంద గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వైర్లెస్ ఆస్తుల విక్రయానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం గడువును పొడిగించుకుంటున్నట్లు ఆర్‌కామ్, జియో ప్రకటించాయి. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రం డీల్‌కు టెలికం శాఖ నుంచి అనుమతులు రాని నేపథ్యంలో ఈ డీల్‌ను పొడిగించుకోవాలని ఇరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ‘‘రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కుదుర్చుకున్న ఆస్తుల కొనుగోలు ఒప్పంద కాలపరిమితిని 2019 జూన్ 28 వరకు ఆర్‌జియో పొడిగించుకుంది’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించింది. ప్రభుత్వపరమైన అన్ని రకాల అనుమతులు, ఆమోదాలు, రుణదాతల అంగీకారం పొంది సదరు ఆస్తులపై ఉన్న చిక్కులన్నీ తీరాకే కొనుగోలు జరుగుతుందని తెలిపింది. టవర్లు, ఫైబర్, ఎంసీఎన్, స్పెక్ట్రమ్ విక్రయానికి సంబంధించి ఆర్‌జియోతో కుదుర్చుకున్న ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నట్లు ఆర్‌కామ్ సైతం విడిగా ప్రకటించింది. పలు సందేహాల నేపథ్యం... జియోకు స్పెక్ట్రం విక్రయానికి సంబంధించి తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని ఆర్‌కామ్ చాలా రోజులుగా టెలికం శాఖను అభ్యర్థిస్తూ వస్తోంది. కానీ ఇరు కంపెనీల మధ్య ఈ డీల్‌కు సంబంధించిన చెల్లింపులపై టెలికం శాఖ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై సమాధానమిచ్చేందుకు ఆర్‌జియో, ఆర్‌కామ్ ప్రతినిధులు ఈ నెలలో టెలికం సెక్రటరీతో సమావేశమయ్యారు. ఈ విషయంలో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలన్న టెలికం శాఖ డిమాండ్‌ను టెలికం ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు ఆర్‌కామ్ గుర్తు చేసింది. బ్యాంకు గ్యారెంటీ బదులు తమ అనుబంధ సంస్థ ఆర్రియల్టీ ద్వారా అవసరమైన కార్పొరేట్ గ్యారెంటీ ఇస్తామని తెలిపింది. అందువల్ల ఇక అభ్యంతరాలకు ఎలాంటి అవకాశం లేదని ఆర్‌కామ్ పేర్కొంది. టెలికం శాఖ మాత్రం డీల్‌కు ఆమోదముద్ర వేసేందుకు ఇంకా అంగీకరించలేదు. ముఖ్యంగా చెల్లింపుల బకాయిలు, ఇతర చార్జీలపై ఇంకా స్పష్టత రావాలని టెలికం శాఖ భావిస్తోంది. ముఖ్యంగా డీల్‌కు సంబంధించి ఆర్‌కామ్‌కు ఎలాంటి గ్యారెంటీ కూడా ఇవ్వటానికి జియో అంగీకరించలేదు. అందుకని టెలికం శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు కంపెనీలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నాయి. -
మొబైల్ కనెక్షన్లకు ఆధార్ ఈ–కేవైసీ వాడొద్దు
న్యూఢిల్లీ: పాత, కొత్త మొబైల్ కనెక్షన్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ విధానంలో యూజర్ల గుర్తింపు, చిరునామాల ధృవీకరణ కోసం (ఈ–కేవైసీ) ఆధార్‌ను ఉపయోగించరాదంటూ టెలికం సంస్థలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చిన పక్షంలో కేవైసీ కోసం పేపరు రూపంలోని ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. ఈ నిబంధనల అమలుపై నవంబర్ 5లోగా నివేదిక ఇవ్వాలని టెలికం శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రైవేట్ సంస్థలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో టెలికం శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. -
టెలికం పరికరాలకు తప్పనిసరిగా సర్టిఫికేషన్
బెంగళూరు: అధీకృత సంస్థలు పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేషన్ ఇచ్చిన పరికరాలను మాత్రమే టెలికం ఆపరేటర్లు ఉపయోగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే నిర్దేశిత నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి దేశీయంగా ఆపరేటర్లు దిగుమతి చేసుకునే ప్రతి పరికరానికి ఇండియన్ టెలిగ్రాఫ్ (సవరణ) చట్టం 2017 ప్రకారం పరీక్షలు తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. చైనా కంపెనీల నుంచి దిగుమతి చేసుకునే పరికరాల విషయంలో అమెరికా, ఆస్ట్రేలియా తరహాలో భారత్ కూడా జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ అరుణ ఈ వివరాలు వెల్లడించారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం నిర్దేశిత పరీక్షలు నిర్వహించని, సర్టిఫై చేయని పరికరాలను టెలికం ఆపరేటర్లు ఉపయోగించడానికి లేదు. అయితే, స్థానికంగా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరన్న నిబంధన మూలంగా నెట్వర్క్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణలో జాప్యం జరిగే అవకాశం ఉందంటూ పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్పొ బ్రీఫ్స్... ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్: స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీని డీలిస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. భారీ రుణ భారంతో కుదేలైన ఈ కంపెనీని వేదాంత కంపెనీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పవర్ ఫైనాన్స్ కంపెనీ: ఈ కంపెనీలో తనకున్న 65.61 శాతం వాటాను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌కు (ఆర్ఈసీ) విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.13,000 కోట్లు వస్తాయని అంచనా. -
ఎఫ్బీ, వాట్సాప్ బ్లాక్‌పై అభిప్రాయాలు చెప్పండి
న్యూఢిల్లీ: ప్రత్యేక సందర్భాలైన జాతీయ భద్రత, ప్రజా జీవనం ప్రమాదంలో పడినప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహా యాప్స్‌ను బ్లాక్ చేసేందుకు అనుసరించాల్సిన సాంకేతిక చర్యల విషయమై పరిశ్రమ అభిప్రాయాల్ని టెలికం శాఖ కోరింది. టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల అసోసియేషన్ (ఐఎస్‌పీఏఐ), సీవోఏఐలకు టెలికం శాఖ జూలై 18నే లేఖలు రాసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేయడంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. కంప్యూటర్ ద్వారా ఏ సమాచారాన్ని కూడా పొందకుండా నిరోధించేందుకు ఉపయోగించతగిన అధికారాలను ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ తెలియజేస్తోంది. వాట్సాప్‌లో వచ్చిన వదంతుల ఆధారంగా ఇటీవలి కాలంలో అల్లరి మూకలు కొందరిపై దాడులకు దిగడం, కొట్టి చంపడం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఐటీ శాఖ అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ... ‘‘సదరు సందేశాలు ఎలా వచ్చాయన్నది తనవంతుగా గుర్తించేందుకు వాట్సాప్ కట్టుబడి లేదు. ప్రభుత్వ డిమాండ్లలో ఇది కూడా ఒకటి. దుర్వినియోగానికి అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. నకిలీ వార్తలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ తీసుకున్న చర్యల విషయమై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. తన ప్లాట్ ఫామ్‌ను దుర్వినియోగం చేస్తున్న వారిని, సందేశాలతో రెచ్చగొడుతున్న వారిని గుర్తించే విషయమై బాధ్యతను విస్తరించజాలదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అలాగే, తగిన చర్యలు తీసుకోకపోతే వదంతుల వ్యాప్తి, ప్రోత్సాహక ప్లాట్‌ఫామ్‌గా ఫేస్‌బుక్‌ను గుర్తించాలంటూ ఆ శాఖకు పంపిన రెండో నోటీసులో హెచ్చరించింది. -
విలీనం దిశగా మరో అడుగు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్... తమ మొబైల్ వ్యాపార విభాగాల విలీన ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా టెలికం శాఖ (డాట్) నిర్దేశించినట్లుగా రూ.7,248 కోట్లు చెల్లించాయి. నిర్దిష్ట షరతులపై తమ నిరసనను తెలియజేస్తూ.. టెలికం శాఖకు చెల్లింపులు జరిపినట్లు ఐడియా వర్గాలు చెప్పాయి. విలీనానికి డాట్ డిమాండ్ ప్రకారం రూ.3,926.34 కోట్లు నగదు రూపంలో, మరో రూ.3,322.44 కోట్లు బ్యాంక్ గ్యారంటీ రూపంలో ఇచ్చినట్లు తెలిపాయి. ఇరు సంస్థల విలీనానికి జూలై 9న డాట్ షరతులతో అనుమతులిచ్చింది. 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) విలువ, 35% మార్కెట్ వాటా, 43 కోట్ల యూజర్లతో విలీన సంస్థ దేశీయంగా అతి పెద్ద టెల్కోగా ఇది ఆవిర్భవించనుంది. విలీన సంస్థ రుణభారం రూ.1.15 లక్షల కోట్ల మేర ఉంటుంది. ఈ కంపెనీలో వొడాఫోన్‌కి 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%, ఐడియా షేర్హోల్డర్లకు 28.9% వాటాలుంటాయి. -
వొడాఫోన్, ఐడియా విలీనానికి నేడు డాట్ ఆమోదం!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్‌ల విలీనానికి టెలికం శాఖ (డాట్) సోమవారం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అవసరమైన బ్యాంకు గ్యారంటీలను ఐడియా సమర్పించడంతోపాటు వొడాఫోన్ ఇండియా రుణాల చెల్లింపుల బాధ్యత తలెత్తితే తాను తీసుకునేందుకు హామీ ఇవ్వడంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారి పేర్కొన్నారు. వొడాఫోన్ ఇండియా, ఐడియా కలసి విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడనున్నాయి. దాంతో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంటుంది. జియో ప్రవేశం తర్వాత మార్కెట్లో మనుగడ కష్టంగా మారడంతో ఈ రెండు సంస్థలు కలసి ఒక్కటవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
భారీగా తగ్గిన డేటా టారిఫ్స్
న్యూఢిల్లీ : మొబైల్ ఇంటర్నెట్ రేట్లు భారీగా తగ్గాయి. గత మూడేళ్లలో మొబైల్ ఇంటర్నెట్ రేట్లు 93 శాతం మేర తగ్గినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డీవోటీ) రిపోర్టు చేసింది. ఇంటర్నెట్ రేట్లు భారీగా క్షీణించడంతో, ఈ మూడేళ్లలో డేటా వాడకం 25 సార్లకు పైగా పెరిగినట్టు తెలిపింది. అత్యంత చౌకైన టారిఫ్ గ్లోబలీ- 2014లో ఒక్కో జీబీకి 33 రూపాయలుంటే, 2017 సెప్టెంబర్‌లో ఒక్కో జీబీకి 21 రూపాయలుందని వెల్లడించింది. అంటే మొత్తంగా 93 శాతం వరకు టారిఫ్ తగ్గింపు ఉన్నట్టు డీవోటీ తెలిపింది. 2016లో రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ అయ్యాక, టారిఫ్ రేట్ల తగ్గింపు మరింత ఉందని పేర్కొంది. ఈ కంపెనీ ఒక్కో జీబీని రోజుకు అత్యంత తక్కువగా 4 రూపాయలకే అందిస్తోంది. మొబైల్ ఇంటర్నెట్ రేట్లు తగ్గడంతో, డేటా వాడకం పలు సార్లు పెరిగినట్టు తెలిసింది. ఒక్కో సబ్‌స్క్రైబర్ సగటు డేటా వాడకం 25 సార్లు పెరిగిందని డీవోటీ ట్వీట్ చేసింది. అంటే 2014లో ఒక్కో నెలలో 62జీబీ వాడకముంటే, 2017లో ఒక్కో నెలలో 1.6జీబీ వాడకముందని తెలిపింది. కాగ, భారత్‌లో మొబైల్ డేటా వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్కో నెలలో 1.3 మిలియన్ జీబీ నమోదవుతున్నట్టు డీవోటీ పేర్కొంది. ఇది అమెరికా, చైనాలలో వాడే డేటా వాడకం కంటే అత్యధికం. మరోవైపు దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం రెండింతలు పైగా పెరగడంతో(190 మిలియన్ నుంచి 390 మిలియన్లకు పెరగడంతో), ఇంటర్నెట్ యూజర్లు కూడా 66 శాతం పెరిగినట్టు డీవోటీ తెలిపింది. 2014-17 మధ్యకాలంలో ఇంటర్నెట్ యూజర్లు 251 మిలియన్ల నుంచి 429 మిలియన్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. అటు బ్రాడ్‌బ్యాండ్ యాక్సస్ యూజర్లు కూడా 2014 మార్చిలో 61 మిలియన్ సబ్‌స్క్రైబర్లుంటే, 2017 సెప్టెంబర్‌లో 325 మిలియన్ల సబ్స్క్రైబర్లకు పెరిగినట్టు వెల్లడించింది. ట్రాయ్ డేటా ప్రకారం 2017 డిసెంబర్ చివరి నాటికి ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు 445.9 మిలియన్లకు ఎగిసినట్టు తెలిసింది.