television serials
-
సోప్‌ను కడిగేస్తున్నాయి
టెలివిజన్ సీరియల్‌ను ఇంగ్లిష్‌లో సోప్ అంటారు.దానిక్కారణం వేరే కానీ.. మన సీరియల్స్‌లో అంతా సోపే!సోప్ రాయడం.. సోప్ మీద కాలుపెట్టి జారేలా చేయడం..అన్నీ సోప్ కుట్రలే! కిచెన్ నుంచి డైనింగ్ టేబుల్ దాకా.. హాల్ నుంచి డ్రాయింగ్ రూమ్ దాకా అన్నీ కుతంత్రాలే!అయితే ఈ ధోరణి మారిపోతోంది. మహిళలను బలంగా.. సొంత వ్యక్తిత్వం గల శక్తులుగా.. వెబ్ సిరీస్‌లో చూపిస్తున్నారు.ఈ కొత్త తరహా స్వతంత్ర మహిళలు పాత సోప్‌ను ఉతికిపారేస్తున్నారు.పాత సీరియల్లో క్యారెక్టర్లను కడిగిపారేస్తున్నారు. కిచెన్ పాలిటిక్స్.. జనాలను ఎంటర్టైన్ చేసినంతగా ఇంకేవీ చేయడం లేదు. యెస్.. కావాలంటే ‘సాస్ బహూ’ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ చూడండి. ఒక్క మనదేశంలోనే కాదు ఆసియా నుంచి అమెరికా దాకా.. ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ అన్నీ వీటికి పిచ్చి ఫాలోవర్సే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పాకిస్తాన్లో కూడా మన సాస్ బహూ ఎపిసోడ్స్‌ను వేలంవెర్రిగా చూస్తారట. ఇండియా, పాకిస్తాన్ సంచలన వార్తల కన్నా వీటికే వ్యూయర్ షిప్ ఎక్కువట. మహిళ శక్తిని త్యాగంగా మలిచి ఆమెను ఓ పరాధీనగా పోట్రైట్ చేయడం... బ్లాక్ అండ్ వైట్ జమానా ట్రెండ్. ఇరవై ఏళ్ల కిందట తెరమీదకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ చానల్స్‌కి అది పులిసిపోయిన దోసె పిండి. అందుకే వంటింటి రాజకీయాలను ధారావాహికలకు కామన్ కాన్సెప్ట్‌గా మార్చేశాయి. మహిళను విలన్‌గా ఇంట్రడ్యూస్ చేశాయి. తరువాయి భాగం పే...ద్ద ఉమ్మడి కుటుంబం. ఫ్యాక్టరీలు, కాంట్రాక్ట్‌లతో మగవాళ్లు బిజీ. కాలేజీలు, స్కూళ్లతో ఆ ఇంట్లోని యూత్, చిల్డ్రన్ ఎంగేజ్డ్. మిగిలింది ఆడవాళ్లే కదా. ఏడు వారాల నగలేసుకొని, మెరిసిపోయే పట్టు చీరలు కట్టుకొని, పాపిట్లో సింధూరం దిద్దుకొని, కడ్వా చౌత్ వ్రతం పట్టి జల్లెడలో చంద్రుడిని చూడ్డం.. అత్తతో కోడలు, వదినతో ఆడబిడ్డ, తోటికోడళ్లు.. చిరునవ్వులు చిందిస్తూనే కుట్రలు కుతంత్రాలు పన్నడం, ఆలింగనం చేసుకుంటూనే అంతులేని పగను పెంచుకోవడం, ప్రతీకారాలతో కాలక్షేపం చేయడం.. ఉత్కంఠను రేకెత్తిస్తూ కనీసం రెండు మూడు జనరేషన్ల దాకా నిరవధికంగా ప్రసారం చేస్తున్నాయీ కథలను టీవీలు. దాదాపు ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ నుంచి మొదలు.. పవిత్ర రిష్తా, నాగిన్ ఎట్సెట్రా వరకు ఇవే నేపథ్యాలు. ఆడవాళ్లను విలన్స్‌గా చూపించడానికి ఒక సీరియల్‌ను మించి ఇంకో సీరియల్, ఒక చానల్‌ను మించి మరో చానల్ పోటీ పడ్తున్నాయి. వాటిల్లో నటించిన కోడళ్లకు బయట ఎంత పాపులారిటీయో! సినిమా హీరోయిన్లకు మించిన ఫాన్ ఫాలోయింగ్. ఆ క్రేజ్ స్మృతి ఇరానీలాంటి వాళ్లను ఎంపీలుగానూ చేసిపెట్టింది. తెలుసు కదా.. స్మృతీ ఇరానీ.. ప్రైవేట్ చానళ్ల తొలి తరం పెద్దింటి ఆదర్శ కోడలు. తులసీ. క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీలో నటించారు. తర్వాత మిగిలిన సీరియళ్లలో కోడళ్లుగా, విలన్స్‌గా వచ్చిన పాత్రధారులంతా ఎన్నో రియాల్టీ షోస్‌లో గెస్ట్స్‌గా కూడా అప్పియర్ అయ్యారు. అంతేకాదు బిగ్ బాస్ వంటి వాటిల్లో కంటెస్టెంట్స్‌గానూ పాల్గొన్నారు. చెక్.. బ్రేక్! ఈ ఒరవడి, వేగం ఇంకా ఉండేదే... టు బీ కంటిన్యూడ్గా! అయితే వెబ్ చానల్స్ వీటికి చెక్ పెట్టాయి. స్ట్రెన్త్ అండ్ ఇండిపెండెంట్ ఉమన్ క్యారెక్టర్స్ సెంట్రిక్ సీరీస్‌తో సాస్బహూ టైపు విలనీ సీరియల్స్‌ను బ్రేక్ చేశాయి. ఈ పొటెన్షియల్ ఫీమేల్ పాత్రల స్టోరీస్‌ను ఫస్ట్ ప్లే చేసింది యూ ట్యూబ్ చానల్సే అయినా.. నట్టింట్లోకి తెచ్చింది మాత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటివే. ఉదాహరణ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన సేక్రెడ్ గేమ్స్! ‘రా’ ఎంప్లాయ్‌గా రాధికా ఆప్టే నుంచి మొదలు ట్రాన్స్‌జెండర్ (ఫీమేల్)గా నటించి కుబ్రా సేథ్ దాకా అందులోని మహిళా పాత్రలన్నీ బోల్డ్ అండ్ డైనమికే. రా ఏజెంట్‌గా మిగిలిన పురుష ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. అసైన్మెంట్స్, ట్రీట్మెంట్ విషయంలో స్త్రీగా వివక్షను ఎదుర్కొంటూంటుంది.. చిన్నచూపుకీ గురవుతుంది రాధికా ఆప్టే పాత్ర అంజలి. అయినా తనకు అప్పగించిన బాధ్యత విషయంలో ఏ మాత్రం తేడా రానివ్వదు. అంత సెల్ఫ్కాన్ఫిడెన్స్తో తీర్చిదిద్దారు అంజలీ క్యారెక్టర్‌ను. ట్రాన్స్‌జెండర్ ‘కుకూ’ రోల్ అంతే. ధీరత్వం, మానవత్వం పోతపోసిన భూమిక. నెట్ఫ్లిక్స్లోనివే సోనీ, ఫైర్‌బ్రాండ్, డెల్హీ క్రైమ్ సీరీస్. రియాల్టీ ఏమాత్రం మిస్ అవకుండా... స్త్రీని సబలగా చూపించిన కథలు. పురుషాధిపత్యం మెండుగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ ర్యాంక్‌లో ఉన్న మహిళలకు ఎదురయ్యే సమస్యల్ని, హైరార్కీని ‘సోనీ’లో చూపించిన తీరు సింప్లీ సూపర్బే కాదు.. స్ఫూర్తిదాయకం కూడా. వ్యక్తిత్వాన్ని కించపర్చుకోకుండా, ఎవరైనా కించపర్చే పనిచేస్తుంటే చాకచక్యంగా తప్పికొడుతూ తమని తాము నిలబెట్టుకుంటూ.. సిన్సియర్‌గా టాస్క్స్‌ను పూర్తి చేయడం మహిళలకే చెల్లు అని చూపించే ‘సోనీ’ ఇప్పటి ఆడపిల్లలకు ప్రేరణ. డెల్హీ క్రైమ్ కూడా అలాంటిదే. నిర్భయ ఘటన ఇన్వెస్టిగేషన్‌కు తెరరూపం. దక్షిణ ఢిల్లీ డీసీపీ ఛాయా శర్మ ఈ కేసును శోధించి, నేరస్థులను పట్టుకున్న తీరుని సిరీస్‌గా తీశారు. ఇప్పటి వరకు మేల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కథనాలే వచ్చాయి.. హీరోయిజం స్ప్రెడ్ చేస్తూ.. దానికి అమ్మాయిలు ఫిదా అయినట్టు చూపిస్తూ! అలాంటి నేపథ్యంలో డెల్హీ క్రైమ్ కచ్చితంగా కొత్త ట్రెండే. ఈ తరానికి ఫెయిరీ టేల్స్ కాదు.. సాహస గాథలు కావాలి. తమను తాము రక్షించుకునే నేర్పును బోధించే కథలు రావాలి. స్వతంత్రంగా నిలబడే ధైర్యాన్నిచ్చే.. స్థయిర్యాన్ని పంచే సీరీస్‌ను చూపించాలి. అలాంటిదే ఫైర్‌బ్రాండ్. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన లైంగిక దాడి చేదు జ్ఞాపకం పెళ్లయ్యాక కూడా వేధిస్తుంటే .. దాన్నుంచి బయటపడే మార్గాన్ని తనే అన్వేషించుకొని.. సమస్యను పరిష్కరించుకుంటుంది... ఆత్మహత్య అన్న ఆలోచన చేయకుండా.. అందులోని కథానాయిక. ఎంత ఎదురు గాలి వీచినా వణికిపోకూడదు.. నిలబడాలి. ధైర్యాన్నిచ్చే ఈ జాబితాలోకి అమేజాన్ ప్రైమ్‌లోని ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’, ‘మేడిన్ హెవెన్’ కూడా వస్తాయి. బాడీ షేమింగ్ నుంచి సెక్సువల్ అస్సాల్ట్, సింగిల్ మదర్, కెరీర్ ఓరియెంటెడ్ ఉమన్, కట్నం అడిగిన అబ్బాయితో పెళ్లిని నిరాకరించిన తెగువ, విడాకులు తీసుకున్నా లైఫ్ ఆగిపోదనే స్పృహ, భర్త చనిపోయిన నడివయసు వితంతువుకూ తిరిగి వైవాహిక జీవితాన్ని ఆరంభించే హక్కు ఉందన్న ఎరుక, సంపాదన ఉండగానే సాధికారత రాదు... నిర్ణయాధికారం ఉంటేనే సాధికారత అనే చైతన్యాన్నిచ్చే సీరీస్ ఆ రెండూ! అలా కుకూ నుంచి తారా (మేడిన్ హెవెన్ సీరీస్ హీరోయిన్) దాకా డేరింగ్ అండ్ డైనమిక్ రోల్స్‌తో స్టీరియో టైప్‌ను చిత్తు చేస్తున్నాయి. చీర చెంగును బొడ్లో దోపుకొని.. పొద్దున్నుంచి పొద్దుపోయే దాకా... వంచిన నడుం ఎత్తకుండా పనిచేసే హార్డ్‌వర్క్ అవుట్ డేట్ అయింది. భార్య ల్యాప్‌టాప్‌తో దోస్తీ చేస్తుంటే భర్త వంటింట్లో కొర్రల కిచిడీతో కుస్తీ పడుతున్న యంగ్ అండ్ స్మార్ట్ జనరేషన్ టైమ్ ఇది. ఇంటిపని, బయట పని లాంటి మల్టీ టాస్కింగ్‌ను అమ్మాయిలు పుట్టుకతోనే రెండుచేతులతో పట్టుకొని రాలేదు. ఆ రెస్పాన్స్‌బులిటీ అబ్బాయిలకు ఇస్తే.. అంతే చక్కగా చేస్తారు. కాబట్టి... కాలం చెల్లిన కిచెన్ పాలిటిక్స్ థీమ్స్‌కి గుడ్‌బై చెప్పి ఈక్వాలిటీ స్ప్రెడ్ చేసే ప్లాట్స్ క్లాప్ కొట్టాలని ఆశిద్దాం. సెల్ఫ్పిటీ, డిపెండెన్సీ, విలనీ సీన్స్‌ను స్క్రీన్ ప్లే నుంచి తొలగిస్తారని ఆశపడదాం. డెల్హీ క్రైమ్లోని ‘‘ప్రతి డిపార్ట్మెంట్లో వీలైనంత మంది లేడీ స్టాఫ్ ఉండాలి’’ అనే డైలాగ్ ఆ ఆశను బలపరుస్తోంది. – సరస్వతి రమ -
చిన్నితెర పెద్ద రికార్డ్!
పెద్ద తెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో బుల్లి తెర మీదా అంతే సంఖ్యలో అభిమానులను అలరించారు సీనియర్ నటి రాధిక. తాజాగా బుల్లితెర మీద పెద్ద రికార్డ్ నెలకొల్పారు. సుమారు 3430 గంటలు సీరియల్స్‌లో కనిపించారట. ‘‘టెలివిజన్ సీరియల్స్‌లో సుమారు 6850 ఎపిసోడ్స్‌లో నటించాను. అంటే 3430 గంటలు. ఇలాంటి ఫీట్ సాధించినందుకు నటిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రెండు నెలలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. మళ్లీ జూన్ నుంచి సరికొత్త అవతారంలో సన్టీవిలో రాత్రి 9.30 అలరిస్తూనే ఉంటాను. నాకు ఎల్లప్పూడు ప్రేమను పంచే అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాథిక. -
50 ఏళ్లకు పైగా కొనసా...గిన సీరియల్స్
టీవీ సీరియళ్లు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టు కుంటున్నాయి. ముఖ్యంగా మహిళాలోకం వీటికోసం టీవీలకు అతుక్కుపోతారు. 1950వ దశకంలో ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చిన ఇవి ఇప్పటికీ వీక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇంతగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న వీటిపై ఉన్న విమర్శ.. ఇవి ఏళ్లతరబడి సాగుతూనే ఉంటాయని. వీటిని చాలామంది జీడిపాకంతో పోలుస్తారు. నిజమే నాలుగేళ్లో.. అయిదేళ్లో కాదు... నలభై, యాభై ఏళ్లు ప్రసారమైన టీవీ సీరియళ్లు కూడా ఉన్నాయి. దశాబ్దాలపాటు ఇలా ప్రసారమై అనేక రికార్డులు కూడా నెలకొల్పాయి. అలా ప్రపంచంలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం.. 1. ద గైడింగ్ లైట్: (57 ఏళ్లు) అమెరికాకు చెందిన ఈ టీవీ సీరియల్ అక్కడి సీబీఎస్ ఛానల్లో ప్రసారమైంది. ఇర్నా ఫిలిఫ్ అనే రచయిత దీన్ని రూపొందించింది. ప్రపంచంలో అత్యధిక కాలం (1952-2009) కొనసాగిన సీరియల్‌గా కూడా ద గైడింగ్ లైట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 18,262 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన సీరియల్‌గా కూడా ఇది ఘనతకెక్కింది. టీవీ మాధ్యమం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ‘గైడింగ్లైట్’ తొలుత రేడియోలో ధారావాహికగా ప్రారంభమయ్యేది. 1937 నుంచి రేడియోలో ప్రసారమైన ఇది 1952, జూన్ 30 నుంచి టీవీ సీరియల్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ప్రారంభంలో రోజుకు 15 నిమిషాల పాటు ప్రసారమైన గైడింగ్ లైట్, అనంతరం రోజూ అరగంటపాటు ప్రసారమైంది. దాదాపు 57 ఏళ్లపాటు సాగిన గైడింగ లైట్‌కు క్రమంగా రేటింగ్ తగ్గడంతో నిర్వాహకులు ఈ సీరియల్‌ను నిలిపివేస్తున్నట్లు 2009లో ప్రకటించారు. 2. యాజ్ ద వరల్డ్ టర్న్స్: (54 ఏళ్లు) అత్యధిక కాలం ప్రసారమైన రెండో టీవీ సీరియల్ ఇది. 1956 ఏప్రిల్ 2న తొలిసారిగా ప్రసారమైన యాజ్ ద వరల్డ్ టర్న్స్ సెప్టెంబర్ 17, 2010 వరకు కొనసాగింది. 54 ఏళ్లు ప్రసారమైన ఈ సీరియల్‌ను కూడా అమెరికాకు చెందిన ఇర్నా ఫిలిప్స్ రూపొందించారు. ఆమె రూపొందించిన ‘ద గైడింగ్లైట్’కు ఈ సీరియల్‌ను సిస్టర్ సీరియల్‌గా పిలిచేవారు అప్పటి విశ్లేషకులు. ఇది కూడా తొలుత మధ్యాహ్నం పూట రోజుకు పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. అనంతరం రోజుకు అరగంటపాటు ప్రసారమైంది. మొదట్లో సాయంత్రం పూట అరగంటపాటు ప్రసారమైనప్పుడు దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే రెండో సంవత్సరం నుంచి ప్రేక్షకాదరణ లభించింది. దాదాపు 13,000 ఎపిసోడ్లకు పైగా ఇది ప్రేక్షకుల్ని అలరించింది. కుటుంబ నేపథ్యంగా రూపొందిన తొలి సీరియల్ కూడా ఇదే. 3. జనరల్ హాస్పిటల్: (52 ఏళ్లు) అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్ ఇది. జనరల్ హాస్పిటల్ కూడా అమెరికా టీవీ సీరియలే కావడం గమనార్హం. స్థానిక ఏబీసీ ఛానల్లో ఏప్రిల్ 1, 1963న తొలిసారిగా ప్రసారమైన ఇది ఇప్పటికీ (52 ఏళ్లుగా) ప్రసారమవుతోంది. అయితే కొన్ని సిరీస్‌ల తర్వాత మధ్యలో స్వల్ప విరామం తీసుకొని మరో కొత్త సిరీస్‌తో ఇది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీన్ని 2003లో టీవీ గైడ్ సంస్థ గ్రేటెస్ట్ సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది. పోర్ట్ చార్లిస్ అనే ఒక నగరంలోని ఆస్పత్రి, అక్కడి సిబ్బంది, వారి సేవలు, ఓ జంటకు సంబంధించిన అంశాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతుంది. 4. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్: (50 ఏళ్లు..) ఇది అమెరికాలోని ఎన్బీసీ చానల్లో ప్రసారమవుతున్న సీరియల్. నవంబర్ 8, 1965న తొలిసారిగా ప్రసారమైన ఈ సీరియల్ ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత ఇది వారానికి ఒక్కసారి మాత్రమే అమెరికాలో ప్రసారమయ్యేది. తర్వాత ఇతర దేశాల్లో కూడా ప్రసారమైంది. ఇది విజయం సాధించడంతో దీన్ని 30 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెంచారు. ఇప్పటికీ అనేక మార్పులకు లోనైన ఈ సీరియల్‌ను వచ్చే జనవరి నుంచి సరికొత్తగా తీర్చిదిద్దనున్నారు. 6. ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్: (42 ఏళ్లు..) మార్చి 26, 1973న ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతోంది. అత్యధిక కాలం కొనసాగిన సీరియల్స్‌లో ఇది ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం 10,000కు పైగా ఎపిసోడ్లు ఇప్పటిరకు ప్రసారమయ్యాయి. జినోవా అనే నగరంలోని కొందరు యువతకు సంబంధించిన అంశాలతో ఈ సీరియల్ కథ సాగుతుంది. అనేక ఆధునిక భావాలకు ఈ సీరియల్ అద్దం పడుతుంది. ప్రస్తుతం వారాంతాల్లో మాత్రమే ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ వీక్షకుల్ని అలరిస్తోంది. 7. ఆల్ మై చిల్డ్రన్: (41 ఏళ్లు) అమెరికాలోని ఏబీసీ చానల్లో ప్రసారమైన ఈ సీరియల్ దాదాపు 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. ప్రపంచంలో అత్యధిక కాలం వీక్షకుల్ని అలరించిన సీరియల్స్‌లో ఇది ఏడో స్థానంలో ఉంది. ఆల్ మై చిల్డ్రన్ జనవరి 5, 1970 నుంచి సెప్టెంబర్ 23, 2011 వరకు టీవీలో ప్రసారమైంది. అయితే ఆన్లైన్లో మరో రెండేళ్లపాటు అంటే ఏప్రిల్ 23, 2013 వరకు కొనసాగింది. ఇది కల్పిత అంశాల ఆధారంగా రూపొందించినప్పటికీ అనేక విమర్శలను ఎదుర్కొంది. అబార్షన్, అత్యాచారాలు, వియత్నాం యుద్ధం, మత్తు పదార్థాలు తదితర అంశాలకు చోటివ్వడంతో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో ఇద్దరు నటులు మాత్రం తొలి సిరీస్ నుంచి చివరి సిరీస్ వరకు కొనసాగారు. -
ఇక స్మాల్ స్క్రీన్!
వెండి తెరపై అవకాశాలు అడుగంటిపోయి... ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారికి ఇప్పుడు వరంలా మారాయి బుల్లి తెర సీరియల్స్. తాజాగా మరో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ఈ దారే పట్టాడు. వికాస్ బహ్ల్ రూపొందిస్తున్న టీవీ సిరీస్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సిరీస్ ఫ్లోర్‌పైకి వెళ్లనుంది. ఓ ఫిల్మ్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథాంశంతో దీన్ని తీస్తున్నారనేది సమాచారం. బాలీవుడ్ స్టార్ కావాలని తీవ్రంగా శ్రమించే యువకుడి పాత్రలో సోహైల్ కనిపించనున్నాడు. ‘వికాస్ నాకు మంచి మిత్రుడు. అతడు చక్కని స్క్రిప్ట్‌తో వచ్చి నన్ను అడిగితే... కాదనలేక పోయా’ అన్నాడు సోహైల్. -
యప్ టీవీ మీడియా ప్లేయర్ వచ్చేస్తోంది!
నచ్చిన సినిమా... మీకిష్టమైన సమయంలో చూడాలంటే...? సీడీ, డీవీడీ అందుబాటులో ఉండాలి. నెట్లోనైనా రెడీగా లభించాలి. లేదంటే.. మీ కోరిక తీరడం కష్టమే. కానీ... ఇంకో కొన్ని నెలలు ఓపిక పట్టారనుకోండి... ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా పదివేల సినిమాలు మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అంతే కాదు... వారం పది రోజుల క్రితం నాటి టెలివిజన్ సీరియళ్లు కూడా నింపాదిగా మీకు నచ్చిన టైమ్‌లో చూసేయవచ్చు. అదెలాగంటారా? అంతా యప్ టీవీ తయారు చేసిన పరికరం మహిమ! యప్ టీవీ గురించి మీరు వినే ఉంటారు. ఇంటర్నెట్ ద్వారా భారతీయ టెలివిజన్ ఛానళ్లను విదేశాల్లో ప్రసారం చేస్తున్న కంపెనీ ఇది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ దాదాపు 12 భాషలకు చెందిన 180 ఛానళ్లను ప్రసారం చేస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే తన లేటెస్ట్ ఉత్పత్తి ‘మీడియా ప్లేయర్’ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ ఐటీవీ మాదిరిగా ఉండే ఈ బుల్లి పరికరంతోపాటు యప్ టీవీ అభివృద్ధి చేసిన యూఎస్‌బీని కూడా వాడితే చాలు... ఎటువంటి ఎల్సీడీ/ఎల్ఈడీ టెలివిజనైనా ఇంటర్నెట్ కంటెంట్‌ను అందించే స్మార్ట్ టీవీగా మారిపోతుంది. దాంతోపాటే మీడియా ప్లేయర్ ద్వారా అన్ని ఛానళ్ల ప్రసారాలను పొందవచ్చు. సినిమాలు, టెలివిజన్ సీరియళ్లు అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ మీడియా ప్లేయర్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని నెలల్లో భారత్‌లోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ సీఈవో ఉదయ్‌నందన్ రెడ్డి ‘శాస్త్ర’కు తెలిపారు. ప్రస్తుతానికి తాము 1500 వరకూ సినిమాల ప్రసారానికి హక్కులు పొందామని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికల్లా పదివేల సినిమాల హక్కులు పొందుతామని ఆయన చెప్పారు. విశేషాలేమిటి? డెస్క్‌టాప్‌తోపాటు ఏకకాలంలో అన్ని రకాల డివెజైస్ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటివాటిపైనా పనిచేస్తుంది. రెండు పరికరాల మధ్య కూడా ప్రసారాలు సాఫీగా సాగిపోతాయి. ఉదాహరణకు మీరు టెలివిజన్‌లో ఓ సినిమా చూస్తున్నారనుకుందాం... అకస్మాత్తుగా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకోండి. టీవీ కట్టేసి... ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌ను ఓపెన్ చేస్తే చాలు. టెలివిజన్‌లో మీరు ఆపేసిన సీన్ తరువాతి సీన్‌తో సినిమాను చూడటం మొదలుపెట్టవచ్చు. టెలివిజన్ సీరియళ్ల విషయానికొస్తే.. దాదాపు పది రోజుల క్రితం నాటి టెలివిజన్ సీరియళ్లను కూడా మీకు అనుకూలమైన సమయంలో చూసుకునే వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో యప్‌టీవీ ద్వారా కేవలం వార్తాఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినోదాత్మక ఛానళ్లను కూడా నాలుగైదు నెలల్లో అందుబాటులోకి తెస్తామని యప్‌టీవీ సీఈవో తెలిపారు. -
జీవితం అంటే టీవి సీరియల్స్ మాత్రమేనా?
టీవి చూడడాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు. టీవిలో సీరియల్స్ చూడడాన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. కానీ, శృతి మించితే ఏదైనా సీరియస్‌గా తీసుకోకతప్పదనిపిస్తుంది. మా ఆవిడకు టీవియే లోకం, ప్రాణం. టీవీలో వచ్చిన ప్రతి సినిమా చూస్తుంది. అది గతంలో థియేటర్లో చూసిన సినిమా అయినా సరే. ఇక టీవీలలో సీరియల్స్ మొదలైన తరువాత... అవి చూడడం ఆమెకు ఒక వ్యసనంగా మారింది. సీరియల్స్ చూడడం, అందులొని సన్నివేశాలను పక్కింటి వాళ్లకు చెప్పడం ఆమెకు పరిపాటిగా మారింది. ‘‘ఎప్పుడూ ఆ టీవి సీరియల్స్ చూసే బదులు ఏవైనా మంచి పుస్తకాలు చదువుకోవచ్చు కదా’’ అని ఒకరోజు సలహా ఇస్తే - ‘‘మీ చాదస్తాలన్నీ నా మీద రుద్దకండి. మీ పనేదో మీరు చూసుకోండి’’ అని హెచ్చరించింది. నా పనేదో నేను చూసుకుందామనే అనుకున్నానుగానీ, మా ఆవిడ సీరియల్స్ పిచ్చి కారణంగా పిల్లల చదువు పూర్తిగా దెబ్బతింటోంది. ఒకప్పుడు పిల్లలను కూర్చోబెట్టుకొని చదివించేది. ఇప్పుడు టీవీకి అతుక్కుపోవడం తప్ప పిల్లల చదువు గురించి ఆలోచించడం లేదు. ‘‘సీరియల్స్ చూడడం తగ్గించు. జీవితం అంటే టీవి సీరియల్స్ మాత్రమే కాదు. చాలా ఉంది. పిల్లల చదువు పట్టించుకో’’ అని చెప్పాలని ఉంది.కానీ అంత ధైర్యం లేక, కాస్తో కూస్తో ఉన్న ధైర్యం చాలక... నాలో నేను రగిలిపోతున్నాను. - ఆర్, విజయవాడ -
నటనకు సరిహద్దులు లేవు...
లైఫ్‌బుక్ పద్నాలుగు సంవత్సారాల వయసులోనే మోడలింగ్‌లోకి ప్రవేశించాను. ‘బారిష్ కే ఆన్సు’ ‘తన్నీర్ ఫాతిమా బి.ఏ’ మొదలైన టీవి సీరియల్స్ నాకు గుర్తింపు తెచ్చాయి. ‘బోల్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాను. రాబోయే ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో ఇమ్రాన్ హష్మీ సరసన నటిస్తున్నాను. చిన్న వయసులోనే కెమెరా ముందుకు రావడం వల్ల కావచ్చు... కెమెరా నాకు చాలా పాత స్నేహితురాలు అనిపిస్తుంది. మనుషులతో మాట్లాడడం కంటే కెమెరా ముందు నిల్చొని నటించడంలోనే నాకు సౌకర్యంగా ఉంటుంది. మోడలింగ్, నటన... రెండు రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, నటన అంటే చాలా ఇష్టం. మోడలింగ్ కంటే నటనతోనే ఎక్కువమందికి చేరువకాగలం. పేరు తెచ్చుకోగలం. చెప్పొచ్చేదేమంటే, ఫ్యాషన్ మోడల్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వారికి మాత్రమే తెలుస్తారు. నటులు మాత్రం మారుమూల గ్రామాలకు సైతం తెలుస్తారు. సరిహద్దులు నటుల ప్రతిభను ప్రభావితం చేయలేవు. నటులకు సరిహద్దులతో పనిలేదు. దేశాలకు అతీతంగా మనం నటులను ప్రేమించేది ఈ కారణంతోనే. నేను పాకిస్థాన్ నటిని అయినప్పటికీ ఇండియాలో నటించినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఎలాంటి వివక్ష కనిపించలేదు. స్క్రిప్ట్‌లో శక్తి ఉంటే చిన్న బడ్జెట్ సినిమా అయినా నా దృష్టిలో పెద్ద బడ్జెట్ కింద లెక్క. ‘‘ఫలానా సినిమాలో నాకు ఒక పాత్ర వచ్చింది. అది నాకు నచ్చింది. ఆ పాత్రకు వందశాతం ఎలా న్యాయం చేయాలి?’’ అనే దాని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తాను. అందానికి, వ్యక్తిత్వానికి దగ్గర సంబంధం ఉంటుంది. చూడడానికి బాగున్నా, ప్రవర్తన చెడుగా ఉంటే వాళ్లు అందంగా లేనట్లే. అందమైన వ్యక్తిత్వమే అసలు అందం అనేదాన్ని నమ్ముతాను. - హుమైమా మాలిక్, హీరోయిన్ -
టీవీక్షణం: బుల్లితెర మన్మథుడు
మన్మథుడు అనగానే నాగార్జున గుర్తొస్తాడు. అంతవరకూ రొమాంటిక్ హీరోగా మనసులు దోచిన నాగ్, ‘మన్మథుడు’ సినిమాలో అమ్మాయిలంటే పడనివాడిగా కనిపించాడు. ఇప్పుడు బుల్లితెర మీద కూడా ఓ మన్మథుడు తయారయ్యాడు. అతడే... రవికృష్ణ! ‘మొగలిరేకులు’ ఫాలో అయిన వాళ్లందరికీ ‘దుర్గ’గా పరిచితుడు రవికృష్ణ. సౌమ్యుడిగా, మంచి ప్రేమికుడిగా నటించాడందులో. ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ తమకూ ఉంటే బాగుణ్నని అమ్మాయిలు ఫీలయ్యేంతగా అలరించాడు. కానీ జీ తెలుగులో ప్రసారమయ్యే ‘వరూధినీ పరిణయం’ సీరియల్‌తో తన ఇమేజ్‌ని మార్చి పారేశాడు. ఇందులో అతడు ప్రేమికుడు కాదు. అమ్మాయిల పొడే గిట్టనివాడు. ఆడపిల్ల నీడను కూడా అసహ్యించుకుంటాడు. అలాంటి పాత్రలో రవిని చూసి మొదట లేడీ ఫ్యాన్సంతా షాకయ్యారు. కానీ రొటీన్‌కి భిన్నంగా అతడు ప్రదర్శిస్తోన్న నటన చూసి ఫిదా అయిపోయారు. చిన్నప్పట్నుంచీ అమ్మాయిల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటాడు హీరో. దాంతో అమ్మాయి అంటేనే సమస్య అని ఫిక్సయిపోతాడు. తల్లిని తప్ప అక్కని, చెల్లెలిని కూడా నమ్మనంతగా ద్వేషం పెంచుకుంటాడు. అలాంటివాడి జీవితంలోకి వరూధిని ప్రవేశిస్తుంది. మరి ఈ మన్మథుడి మనసులో ఆమె చోటు ఎలా సంపాదిస్తుంది, అతడితో తాళి ఎలా కట్టించుకుంటుంది అన్నదే సస్పెన్స్. అది తెలుసుకోవాలంటే... వేచి చూడాల్సిందే! నాలుగు స్తంభాలాట సీరియల్‌ని జీడిపాకంతో ఎందుకు పోలుస్తారో కలర్స్ చానెల్లో వచ్చే ‘ఉతరన్’ చూస్తే అర్థమవుతుంది. దాదాపు నాలుగున్నరేళ్లుగా ఈ ధారావాహిక సా...గు...తూ...నే ఉంది. ఇప్పటి కింకా ముగింపు దరిదాపుల్లోకి కూడా రాలేదు. చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు స్నేహితురాళ్ల కథతో 2008లో మొదలైంది ‘ఉతరన్’. వాళ్లు పెద్దైపోయి పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ల మధ్య అపార్థాలు తలెత్తాయి. గొడవలు పెరిగాయి. ద్వేషాలు రగిలాయి. వేదనలు మిగిలాయి. ఆ రెండు జంటల మధ్య జరిగిన నాలుగు స్తంభాలాట కొన్నేళ్లకు ముగిసింది. ఆ తర్వాత వాళ్ల పిల్లలు వయసుకొచ్చి కొత్త కథ మొదలెట్టారు. వాళ్ల కూతుళ్లు మీఠీ, ముక్తలు ప్రధాన పాత్రధారులయ్యారు. వీళ్లిద్దరికీ ఇద్దరు హీరోలు జతయ్యారు. మళ్లీ నాలుగు స్తంభాలాట మొదలు! ఆకాశ్ (మృణాల్జైన్)ని పెళ్లాడి మోసపోయిన మీఠీ (టీనా దత్తా), పుట్టింటికి చేరుకుంటుంది. అప్పటికే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన ఆకాశ్ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. అతణ్ని వదిలించుకోవడం కోసం విష్ణు (అజయ్ చౌదరి)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ అప్పటికే విష్ణు, ముక్త (శ్రీజిత డే) ప్రేమలో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రస్తుతం తంటాలు పడుతున్నారు. చూద్దాం... ఈ నాలుగు స్తంభాలాట ఇంకా ఎన్నాళ్లు సా...గు...తుం...దో!