Temba Bavuma
-
సౌతాఫ్రికా ప్లేయర్ల పట్ల పాక్ ఆటగాళ్ల దురుసు ప్రవర్తన.. మొట్టికాయలు వేసిన ఐసీసీ
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), సౌద్ షకీల్ (Saud Shakeel), కమ్రాన్ గులామ్ (Kamran Ghulam) తమ పరిధులు దాటి ప్రవర్తించారు. ఫలితంగా ఐసీసీ (ICC) ఈ ముగ్గురికి మొట్టికాయలు వేసింది. అఫ్రిది మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం.. షకీల్, గులామ్ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఈ ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీను షాహీన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అఫ్రిది.. బ్రీట్జ్కీను కొట్టేస్తా అన్నట్లు చూశాడు. అతని మీదిమీదికి వెళ్లాడు. అఫ్రిది ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ ఆర్టికల్ 2.12 ఉల్లంఘణ కింద చర్యలు తీసుకుంది.ఆ మరుసటి ఓవర్లోనే (29వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేసిన ఆనందంలో సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటైన బాధలో వెళ్తున్న బవుమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. షకీల్, గులామ్‌ల ఓవరాక్షన్‌ను ఫీల్డ్ అంపైర్లే తప్పుబట్టారు. ఈ విషయమై వారి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌కు కంప్లైంట్ చేశారు. ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని షకీల్, గులామ్‌కు అక్షింతలు వేసింది.కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఊదేసింది. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బవుమా (82), బ్రీట్జ్కీ (83), క్లాసెన్ (87) అర్ద సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మొహమ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదంతొక్కడంతో 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాక్ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. రేపు (ఫిబ్రవరి 14) జరుగబోయే ఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. -
పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. సఫారీలు ఇచ్చిపడేశారుగా! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగింట పాకిస్తాన్-న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. పాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే కివీస్ ఫైనల్‌కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం పాక్, ప్రోటీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma)పై తమ దూకుడును పాక్ ప్లేయర్లు ప్రదర్శించారు.అసలేం జరిగిందంటే?టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్‌కు ఓపెనర్లు టెంబా బావుమా, డీజోర్జీ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి బావుమా ప్రోటీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అద్బుతమైన షాట్లతో సెంచరీ దిశగా బావుమా దూసుకెళ్లాడు.కానీ ప్రోటీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్లో బావుమాను దురదృష్టం వెంటాండింది. ఆ ఓవర్ చివరి బంతికి రనౌట్ రూపంలో టెంబా పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్లో ఆఖరి బంతిని మహ్మద్ హస్నైన్ గుడ్ లెంగ్త్ డెలివరీగా బావుమాకి సంధించాడు. ఆ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. వెంటనే సింగిల్ కోసం బావుమా ప్రయత్నించగా.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మాథ్యూ బ్రీట్జ్కే సైతం పరుగు కోసం ముందుకు వచ్చాడు. కానీ బ్రీట్జ్కే కొంచెం ముందుకు వచ్చి వెంటనే తన మనసును మార్చకుని నో అని కాల్ ఇచ్చాడు.అప్పటికే సగం దూరం పరిగెత్తిన బావుమా తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న సౌద్ షకీల్ స్ట్రయికర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేశాడు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. పాక్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులామ్.. బావుమా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు.ఆ తర్వాత సల్మాన్ అఘా, సౌద్ షకీల్ అదే రియాక్షన్ ఇచ్చాడు. బావుమా మాత్రం అలా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే ఇదే విషయంపై అంపైర్లు పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో చర్చించారు. అలా ప్రవర్తించడం సరికాదని రిజ్వాన్‌ను అంపైర్లు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్‌కు సఫారీలు బ్యాట్‌తో సమాధనమిచ్చారు.క్లాసెన్ విధ్వంసం.. బావుమా కెప్టెన్ ఇన్నింగ్స్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బావుమా 96 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. THE SEND-OFF BY KAMRAN GHULAM AND SAUD SHAKEEL. 🔥pic.twitter.com/zhv7iIgwvm— 𝙎𝙝𝙚𝙧𝙞 (@CallMeSheri1) February 12, 2025 -
Pak vs SA: హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్
పాకిస్తాన్‌తో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దంచికొట్టారు. త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ప్రొటిస్ జట్టు 352 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. నేషనల్ స్టేడియంలో నాలుగో నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్, సౌతాఫ్రికా అక్కడకు వెళ్లాయి. ఈ క్రమంలో ట్రై సిరీస్‌లో భాగంగా తొలుత పాక్- న్యూజిలాండ్ మధ్య లాహోర్‌లో శనివారం మ్యాచ్ జరిగింది. ఇందులో కివీస్ జట్టు పాక్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఫైనల్లో న్యూజిలాండ్అనంతరం సౌతాఫ్రికాతో సోమవారం తలపడ్డ న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో మరో ఫైనల్ బెర్తు కోసం సౌతాఫ్రికా- పాకిస్తాన్ కరాచీలో మంగళవారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. 96 బంతుల్లో పదమూడు ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు.మరో ఓపెనర్ టోనీ డి జోర్జి(22) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే( Matthew Breetzke) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్కేవలం 38 బంతుల్లోనే యాభై పరుగులు అందుకున్న ఈ విధ్వంసకర వీరుడు.. మొత్తంగా 56 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. క్లాసెన్ ఇన్నింగ్స్‌లో పదకొండు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో వియాన్ ముల్దర్(2) విఫలం కాగా.. కైలే వెరెన్నె(32 బంతుల్లో 44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కార్బిన్ బోష్(9 బంతుల్లో 15 నాటౌట్) అతడికి సహకరించాడు.ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో సౌతాఫ్రికా కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 352 పరుగులు సాధించింది. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆఖరి పది ఓవర్లలో పాకిస్తాన్ ఏకంగా 110 పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టు బౌలర్ల చెత్త ప్రదర్శనకు నిదర్శనం. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డేలోనూ చివరి పది ఓవర్లలో పాక్ బౌలర్లు 123 పరుగులు ఇచ్చుకున్నారు.శుక్రవారం ఫైనల్ మ్యాచ్ కాగా.. పాకిస్తాన్- సౌతాఫ్రికా మధ్య కరాచీ మ్యాచ్‌లో గెలిచిన జట్టు న్యూజిలాండ్‌తో శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఈ ఈవెంట్లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్-‘ఎ’ నుంచి.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీపడనున్నాయి.కాగా ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆతిథ్య జట్టును 3-0తో వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలనే పట్టుదలతో కరాచీలో చితక్కొట్టిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ రాణించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు -
ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ సాధిస్తాం.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా
జొహన్నెస్‌బర్గ్: అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఘనాపాఠి అయినా... ఐసీసీ ట్రోఫీల వెలతి మాత్రం ఆ జట్టును వేధిస్తోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తమ జట్టు తెరవేస్తుందని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో మొదలుకానుంది. జూన్‌లో ఆ్రస్టేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు ఇదివరకే దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. ఈ రెండు టోర్నీలు జరుగనున్న నేపథ్యంలో స్మిత్ తమ జట్టు ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గెలుచుకున్న ‘ఎస్ఏటి20’ టోర్నీకి కమిషనర్‌గా వ్యవహరించిన స్మిత్ తమ జట్టు ప్రదర్శనపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ‘2027లో సఫారీ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందే ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ లోటును భర్తీ చేసుకుంటాం. చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలను గెలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడేందుకు ఊతమిస్తుంది’ అని అన్నాడు. తదుపరి రెండేళ్లలో తమ దేశంలో స్టేడియాల నవీకరణ, పిచ్‌ల స్థాయి పెంచే పనులు జరుగుతాయని, దీంతో తదుపరి వన్డే మెగా ఈవెంట్ (2027)లో సొంత ప్రేక్షకుల మధ్య హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతామని చెప్పాడు. గతేడాది జరిగిన పురుషుల, మహిళల టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా షరామామూలుగా ఫైనల్ మెట్టుపై చతికిలబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విండీస్ గడ్డపై రోహిత్ బృందం సఫారీ జట్టును ఓడించే టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో తెలంగాణ యువతేజం గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షోతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికాపై ‘చోకర్స్’ ముద్ర మరింత బలంగా పడింది. అయితే ముద్రను తమ జట్టు త్వరలోనే చెరిపేస్తుందని మాజీ కెప్టెన్ స్మిత్ అన్నాడు. ఇప్పుడు క్రికెట్లో ఏదీ అంత సులువుగా రాదని, దేనికైనా పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. టి20లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆలాగే సంప్రదాయ టెస్టు ప్రభ కోల్పోకూడదనుకుంటే... కనీసం 6, 7 జట్లు గట్టి ప్రత్యర్థులుగా ఎదగాల్సి ఉంటుందన్నాడు. అప్పుడే పోటీ పెరిగి టెస్టులూ ఆసక్తికరంగా సాగుతాయన్నాడు. -
CT 2025: సౌతాఫ్రికాకు భారీ షాక్!.. స్టార్ పేసర్ అవుట్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ(ICC Chapions Trophy)లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో కార్బిన్ బాష్(Corbin Bosch) చోటు దక్కించుకున్నాడు. పేసర్ అన్రిచ్ నోర్జే(Anrich Nortje) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడంతో... అతడి స్థానంలో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) బాష్‌ను ఎంపిక చేసింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న నోర్జే 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ బరిలోకి కూడా దిగలేదన్న విషయం తెలిసిందే.ఇక నోర్జే స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చిన 30 ఏళ్ల బాష్ గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో మూడో వన్డేలో బరిలోకి దిగి ఒక వికెట్ తీసిన ఈ రైటార్మ్ పేసర్.. లక్ష్య ఛేదనలో నలభై పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా.. ఒక్క మ్యాచ్ అనుభవంతోనే అతడు ఏంగా ఐసీసీ టోర్నీకి ఎంపికకావడం విశేషం. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి జట్టులోకి వచ్చేశాడు! ఇక కార్బిన్ బాష్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేయడంతో పాటు యంగ్ పేసర్ క్వెనా మఫాకాను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్ఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్లో ముక్కోణపు టోర్నీ ఆడుతుండగా... తొలి మ్యాచ్ అనంతరం బాష్, మఫాకాతో పాటు టోనీ డీ జోర్జీ సఫారీ జట్టుతో కలవనున్నట్లు సీఎస్ఏ వెల్లడించింది. ఎనిమిది జట్లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నీలో ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అడుగుపెట్టగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.షెడ్యూల్ ఇదేఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ ప్రాథమిక జట్లను ప్రకటించగా.. టీమ్‌లలో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీ పడుతున్నాయి.ఈ ఐసీసీ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఫిబ్రవరి 21నతమ తొలి మ్యాచ్ ఆడనుంది. కరాచీ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం రావల్పిండిలో ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ పూర్తి చేసుకుని.. మళ్లీ కరాచీ వేదికగానే లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. మార్చి 1న ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టుతెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డసెన్, కార్బిన్ బాష్.ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. -
పాకిస్తాన్లో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ (Tri Series) (తొలి మ్యాచ్‌కు మాత్రమే) కోసం 12 మంది సభ్యుల సౌతాఫ్రికా (South Africa) జట్టును ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించారు. ఈ జట్టుకు ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టుకు సారధిగా టెంబా బవుమా (Temba Bavuma) వ్యవహరిస్తాడు. SA20-2025 నేపథ్యంలో ట్రై సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ లీగ్ ఫిబ్రవరి 8తో ముగుస్తుంది. ఆ లోపు చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుతో జాయిన్ అవుతారు. ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 10న ఆడుతుంది. లాహోర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.న్యూజిలాండ్‌తో వన్డే కోసం ఎంపికైన అన్క్యాప్డ్ ప్లేయర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపోంగ్వానా ఉన్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ మొత్తానికి దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. SA20-2025 నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్ సభ్యులు కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ కూడా న్యూజిలాండ్‌తో వన్డేకు అందుబాటులో లేరు. ఈ ఇద్దరు ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు, ఆతర్వాత జరిగే ఫైనల్ (ఒకవేళ క్వాలిఫై అయితే) కోసం సౌతాఫ్రికా జట్టును ఫిబ్రవరి 9న ప్రకటిస్తారు.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన మార్కో జన్సెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్ ఫిబ్రవరి 14న పాకిస్తాన్‌కు పయనిస్తారు. వీరు ట్రై సిరీస్‌లో పాల్గొనరని తెలుస్తుంది. ట్రై సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.ట్రై సిరీస్‌లోని తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కొయెట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్ట్రై సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8-పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్, ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ)లో తొలిసారి ఫైనల్‌కు చేరింది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో తొలి టెస్టులో గెలుపొంది మెగా టైటిల్ పోరుకు అర్హత సాధించిన ప్రొటిస్ జట్టు.. రెండో టెస్టులోనూ విజయం సాధించి పర్యాటక జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఏడో గెలుపు కావడం విశేషం.కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తూ ఇలా జట్టును విజయపథంలో నడిపించి.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. ఈ నేపథ్యంలో అతడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith ) బవుమా నాయకత్వ లక్షణాలను కొనియాడాడు.బవుమా అలాంటి వాడు కాదు‘‘సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం మా అందరికీ గర్వకారణం. కెప్టెన్‌గా బవుమాకు కూడా ఇది ఉద్వేగ సమయం. గత రెండు, మూడేళ్లుగా అతడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది అతడి బ్యాటింగ్ సగటు 50గా నమోదైంది.నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తూ ఈస్థాయికి చేర్చాడు. మైదానంలో ఆటగాళ్లపై అరుస్తూ.. పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తిత్వం బవుమాకు లేదు. అతడు అసలు అలాంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తి కానేకాదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు. ఆటతోనే అందరికీ సమాధానం చెప్తాడు.టెస్టుల్లో వరుసగా జట్టుకు ఏడు విజయాలు అందించిన కెప్టెన్. అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును నిలిపాడు. మేమంతా అతడికి అండగా ఉంటాం’’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.గెలుపు మాదేనని భావిస్తున్నాఇక ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే అంశంపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లో విజేత ఎవరన్నది అంచనా వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికైన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. కాబట్టి ఏ జట్టుకూ హోం అడ్వాంటేజీ ఉండదు.ఆస్ట్రేలియా మీడియాను చూస్తుంటే మాత్రం.. లార్డ్స్‌లో కంగారూలను ఓడించి మేము కచ్చితంగా ట్రోఫీ గెలవాలనే సంకల్పం మరింత బలపడింది. ఫైనల్లో ఆసీస్‌ను ఓడిస్తే ఆ మజానే వేరు’’ అని గ్రేమ్ స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన ప్రొటిస్ కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్‌కు అరుదైన ఘనత ఉంది.ఆసీస్‌పై స్మిత్‌కు ఘనమైన రికార్డుస్మిత్ సారథ్యంలో 2006లో తొలుత ఆసీస్‌ను వన్డేలో ఓడించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత మూడేళ్ల అనంతరం అంటే 2009లో కంగారూ గడ్డపై పాంటింగ్ బృందాన్ని టెస్టుల్లో చిత్తు చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మొట్టమొదటి సారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాడు తన మణికట్టుకు దెబ్బతాకినా.. గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ చేసిన తీరు.. సౌతాఫ్రికా ఆటగాళ్ల పట్టుదలకు అద్దంగా నిలిచింది.ఇక ఇప్పుడు పదహారేళ్ల తర్వాత గ్రేమ్ స్మిత్‌లాగే ఆస్ట్రేలియాను ఓడించే సువర్ణావకాశం ముంగిట బవుమా నిలిచాడు. కాగా సారథిగా బవుమా గత 14 టెస్టుల్లో సౌతాఫ్రికాకు 10 విజయాలు అందించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 63 టెస్టులు ఆడిన బవుమా నాలుగు శతకాల సాయంతో 3606 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాపై 3-1తో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకువచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ 11-15 వరకు ఈ మెగా టెస్టు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడు..!
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు సారథి టెంబా బవుమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బవుమా తన సారథ్యంలో సౌతాఫ్రికాను తొమ్మిదింట ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఓ మ్యాచ్ డ్రా ముగిసింది. జట్టును విజయవంతంగా ముందుండి నడిపించడంతో పాటు బవుమా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్‌గా 9 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 809 పరుగులు (57.78 సగటున) చేశాడు. బవుమా తొలిసారి సౌతాఫ్రికాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉంది.ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సౌతాఫ్రికా చాలాకాలం తర్వాత సెకెండ్ ప్లేస్‌కు చేరింది. బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బవుమా కెప్టెన్సీ స్కిల్స్‌కు ముగ్దులవుతున్న అభిమానులు అతన్ని గొప్ప సారధిగా కొనియాడుతున్నారు. బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడని జేజేలు పలుకుతున్నారు. బ్యాటర్‌గానూ పోరాట యోధుడని కితాబునిస్తున్నారు. బవుమా కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.గత 10 మ్యాచ్‌ల్లో బవుమా ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..పాక్‌పై రెండో టెస్ట్‌లో 106 (179)పాక్‌పై తొలి టెస్ట్‌లో 31 (74), 40 (78)శ్రీలంకపై రెండో టెస్ట్‌లో 78 (109), 66 (116)శ్రీలంకపై తొలి టెస్ట్‌లో 70 (117), 113 (228)వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లో 0 (2), 4 (18)వెస్టిండీస్‌పై తొలి టెస్ట్‌లో 86 (182), 15 (17)భారత్‌తో తొలి టెస్ట్‌లో 0 (0)వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో 28 (64), 172 (280)వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో 0 (2), 0 (1)ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో 35 (74), 17 (42)బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచింది. అలాగే వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. కెరీర్లో 63 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బవుమా 38 సగటున 3606 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో (రెండో టెస్ట్) సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ పాక్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాక్‌తో రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ సౌతాఫ్రికా గడ్డపై రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయం బారి నుంచి తప్పించుకుంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81), మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్
దక్షిణాఫ్రికా(South Afrcia) గడ్డపై వన్డే సిరీస్ ‘క్లీన్‌స్వీప్’ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... టెస్టు సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక పాకిస్తాన్ ‘వైట్‌వాష్’కు గురైంది. కేప్‌టౌన్ వేదికగా సోమవారం(జనవరి 6) ముగిసిన రెండో టెస్టులో పాక్‌పై 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది.ఫాలో ఆన్‌లో అదుర్స్..కాగా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన పాకిస్తాన్ ఫాలో ఆన్‌లో మాత్రం అద్భుతమైన పోరాటం పటమకనబరిచింది. ఓవర్‌నైట్ స్కోరు 213/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆఖరికి 122.1 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీల ముందు పాకిస్తాన్ కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచగల్గింది.పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (251 బంతుల్లో 145; 17 ఫోర్లు) భారీ సెంచరీతో ఆకట్టుకోగా... ఆఘా సల్మాన్ (95 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 41; 2 ఫోర్లు), ఆమేర్ జమాల్ (34; 7 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఊదిపడేసిన సౌతాఫ్రికా..ఇక 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఊదిపడేసింది. డేవిడ్ బెడింగ్హమ్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్రమ్ (14 నాటౌట్) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోరు చేయగా... పాకిస్తాన్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలోనే పాక్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన రికెల్టన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.కాగా దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న తుది పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.చదవండి: Jasprit Bumrah: భయం పుట్టించాడు! -
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓ భారీ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదయ్యాయి. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు క్యాచ్‌లు పట్టిన రిజ్వాన్ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఓ పక్క సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడినప్పటికీ రిజ్వాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్కీపర్ల జాబితాలో రిజ్వాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.7 - వాసిం బారి vs NZ, ఆక్లాండ్, 19796 - రషీద్ లతీఫ్ vs ZIM, బులవాయో, 19986 - అద్నాన్ అక్మల్ vs NZ, వెల్లింగ్టన్, 20116 - మొహమ్మద్ రిజ్వాన్ vs SA, కేప్ టౌన్, 2025100 వికెట్ల క్లబ్లో మొహమ్మద్ అబ్బాస్ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. క్వేనా మపాకా వికెట్ అబ్బాస్‌కు టెస్ట్‌ల్లో 100వది.తొలి ఓవర్లోనే పాక్‌కు షాక్సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఆలౌటైన అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాన్ మసూద్ (2) ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇచ్చి మసూద్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సైమ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో బాబర్ ఆజమ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో సైమ్ అయూబ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 3.4 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 10/1గా ఉంది. బాబర్ ఆజమ్ (2), కమ్రాన్ గులామ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 605 పరుగులు వెనుకపడి ఉంది. -
శతక్కొట్టిన బవుమా
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా సెంచరీతో కదంతొక్కాడు. బవుమా 166 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బవుమాకు ఇది నాలుగో శతకం. సెంచరీ అనంతరం బవుమా (106) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ర్యాన్ రికెల్టన్ (219 బంతుల్లో 172; 21 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. 76.4 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 307/4గా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా ఔట్ కాగా.. రికెల్టన్, డేవిడ్ బెడింగ్హమ్ క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా 2, ఖుర్రమ్ షెహజాద్, మొహమ్మద్ అబ్బాస్ తలో వికెట్ పడగొట్టారు.రికార్డు భాగస్వామ్యంఈ మ్యాచ్‌లో టెంబా బవుమా, ర్యాన్ రికెల్టన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సౌతాఫ్రికా తరఫున నాలుగో వికెట్ ఇదే అత్యధిక భాగస్వామ్యం. సౌతాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని గ్రేమ్ స్మిత్, హెర్షల్ గిబ్స్ నమోదు చేశారు. 2002-03 కేప్‌టౌన్ టెస్ట్‌లో గిబ్స్-స్మిత్ జోడీ తొలి వికెట్‌కు 368 పరుగులు జోడించారు.భీకర ఫామ్‌లో బవుమాఇటీవలి కాలంలో బవుమా భీకర ఫామ్‌లో ఉన్నాడు. బవుమా గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.ఫైనల్ల్లో సౌతాఫ్రికాదక్షిణాఫ్రికా జట్టు ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. 2023-25 ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టు సౌతాఫ్రికానే. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌పై విజయం అనంతరం సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ పోటీపడుతున్నాయి.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
పాకిస్తాన్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ
పాకిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ సమర్పించుకున్న ప్రొటిస్.. కీలక పేసర్ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం కారణంగా పాక్‌తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.వన్డే సిరీస్‌లో విఫలంకాగా సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది.ఇక జొహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు ప్రొటిస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.మోకాలి నొప్పి వల్లరెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బార్ట్మన్కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన బార్ట్‌మన్.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఆల్‌రౌండర్‌కు పిలుపుఇక పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్‌మన్ స్థానంలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్‌మన్ కంటే ముందే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా గాయం వల్ల సిరీస్‌కు దూరమయ్యాడు.పాకిస్తాన్‌దే వన్డే సిరీస్కేప్టౌన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడం విశేషం.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్పాకా 4, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.కెప్టెన్ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్ (23), మార్క్రమ్ (21), మిల్లర్ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
పాక్‌తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్‌తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్‌తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్‌తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్‌తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్‌తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికలు. పాకిస్తాన్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
శ్రీలంకతో రెండో టెస్టు.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.ఎయిడెన్ మార్క్రమ్ (75 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవగా... కెప్టెన్ తెంబా బవుమా (48 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (36 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ అజేయమైన నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం 221 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 242/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 99.2 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (44; 6 ఫోర్లు), కమిందు మెండిస్ (48; 4 ఫోర్లు) కాస్త పోరాడారు. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (14), కుశాల్ మెండిస్ (16), ప్రభాత్ జయసూర్య (24) మరికొన్ని పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లలో ప్యాటర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. యాన్సెన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
WTC: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 233 పరుగుల తేడాతో శనివారం జయభేరి మోగించింది. కాగా రెండు టెస్టులు ఆడే క్రమంలో శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. నాలుగో రోజుల్లోనే ముగిసిపోయింది. కింగ్స్‌మేడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్టబ్స్, బవుమా శతకాలుఅనంతరం సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జి రెండు, కగిసో రబడ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా దుమ్ములేపింది.ట్రిస్టన్ స్టబ్స్(122), కెప్టెన్ బవుమా(113) శతకాలతో విరుచుకుపడటంతో భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 515 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడేఈ క్రమంలో 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 282 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రబడ, కోయెట్జి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పదకొండు వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.ఆస్ట్రేలియాకు భారీ షాక్ఇదిలా ఉంటే.. లంకపై భారీ గెలుపుతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండోస్థానానికి ఎగబాకి.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్టులో ఓడించిన టీమిండియా మాత్రం అగ్రస్థానం నిలబెట్టుకుంది.PC: ICCఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో ఒకటి, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడూ సొంతగడ్డపైనే జరుగనుండటం సౌతాఫ్రికాకు సానుకూలాంశం. వీటన్నింటిలోనూ ప్రొటిస్ జట్టు గెలిచిందంటే.. ఫైనల్ రేసులో తానూ ముందు వరుసలో ఉంటుంది.టీమిండియా పరిస్థితి ఏంటి?ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆసీస్ గడ్డపై ఐదింటిలో కనీసం నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే ఒక విజయం సాధించింది కాబట్టి.. ఇంకో మూడు గెలిస్తే చాలు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన తదుపరి ఆసీస్‌తో అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో తలపడనుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక పరాజయానికి చేరువైంది. 516 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 103 పరుగులే చేసింది.కరుణరత్నే (4), నిసాంక (23), మాథ్యూస్ (25), కమిందు (10), ప్రభాత్ (1) ఇప్పటికే పెవిలియన్ చేరారు. దినేశ్ చండీమల్ (29 బ్యాటింగ్), ధనంజయ డిసిల్వ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక గెలుపు కోసం మరో 413 పరుగులు చేయాల్సి ఉంది. రబడ, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 132/3తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 366 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (221 బంతుల్లో 122; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (228 బంతుల్లో 113; 9 ఫోర్లు) సెంచరీలు నమోదు చేయడం విశేషం. స్టబ్స్ కెరీర్లో ఇది రెండో శతకం కాగా...బవుమాకు మూడోది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 249 పరుగులు జోడించారు.చదవండి: ‘గులాబీ’ బంతితో సాధనకు సిద్ధం -
శతక్కొట్టిన తెంబా బవుమా.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుత శతకంతో మెరిశాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డర్బన్ వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. కింగ్స్‌మెడ్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డర్ కుదేలైన వేళ బవుమా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.తొలి ఇన్నింగ్స్‌లో బవుమానే ఆదుకున్నాడుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(9), టోనీ డి జోర్జి(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతను భుజాన వేసుకున్న బవుమా 117 బంతులాడి 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో టెయిలండర్ కేశవ్ మహరాజ్(24) ఒక్కడే 20 పరుగుల మార్కు దాటాడు.లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార మూడేసి వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, సౌతాఫ్రికాను 191 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎక్కువ సేపు ఉండలేదు.42 పరుగులకే లంక ఆలౌట్ఆతిథ్య జట్టు పేసర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. కేవలం 42 పరుగులకే ధనంజయ డి సిల్వ బృందం కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ సాధించిన 13 పరుగులే టాప్ స్కోర్. ఐదుగురేమో డకౌట్.ఫలితంగా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్ టోనీ 17 పరుగులకే నిష్క్రమించినా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 47 రన్స్‌తో రాణించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 15 పరుగులకే అవుట్ కాగా.. స్టబ్స్, బవుమా మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు.స్టబ్స్, బవుమా శతకాలు.. లంకకు భారీ టార్గెట్స్టబ్స్ 221 బంతుల్లో 122 పరుగులు సాధించగా.. బవుమా 228 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి శతకాల వల్ల సౌతాఫ్రికా భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా శ్రీలంక ముందు 516 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో తెంబా బవుమాకు ఇది మూడో సెంచరీ. అంతేకాదు ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం తద్వారా అతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకపై సెంచరీ చేసిన సౌతాఫ్రికా మూడో కెప్టెన్‌గా నిలిచాడు. బవుమా కంటే ముందు షాన్ పొలాక్, హషీం ఆమ్లా మాత్రమే సారథి హోదాలో లంకపై శతకం సాధించారు.శ్రీలంకతో మ్యాచ్‌లో శతక్కొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్లు👉షాన్ పొలాక్- సెంచూరియన్- 2001- 111 పరుగులు👉హషీం ఆమ్లా- కొలంబో- 2014- 139 పరుగులు(నాటౌట్)👉తెంబా బవుమా- డర్బన్- 113 పరుగులు.చదవండి: ‘అతడిని లారా, సచిన్ అంటూ ఆకాశానికెత్తారు.. ఇలాంటి షాక్ తగిలితేనైనా.. కాస్త’ -
దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపికయ్యాడు. బవుమా మోచేతి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 4 ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సందర్భంగా బవుమా గాయపడ్డాడు.రబాడ రీఎంట్రీలంకతో సిరీస్‌తో కగిసో రబాడ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రబాడ భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన మార్కో జన్సెన్, గెరాల్ట్ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా దర్శనమిచ్చారు. గాయాల కారణంగా ఈ సిరీస్‌కు లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ దూరమయ్యారు. ర్యాన్ రికెల్టన్, డేన్ పీటర్సన్, సెనూరన్ ముత్తుస్వామి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే..?సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు తదుపరి (డిసెంబర్, జనవరి) స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనూరన్ ముత్తుస్వామి, డేన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రిన్సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్ షెడ్యూల్తొలి టెస్ట్- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 (డర్బన్)రెండో టెస్ట్- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 (గెబెర్హా)కాగా, సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రీలంక జట్టును కూడా ఇవాళ్లే ప్రకటించారు. లంక జట్టుకు సారధిగా ధనంజయ డిసిల్వ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబుల్దెనయ, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, కసున్ రజిత -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు దూరం
అక్టోబర్ 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. బవుమా స్థానంలో యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తొలి టెస్ట్‌కు ఎంపికయ్యాడు. బ్రెవిస్‌కు టెస్ట్ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి. తొలి టెస్ట్‌కు దూరమైనప్పటికీ బవుమా జట్టుతో పాటే ప్రయాణిస్తాడు. రెండో టెస్ట్ సమయానికి బవుమా కోలుకుంటాడని క్రికెట్ సౌతాఫ్రికా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బవుమా గైర్హాజరీలో ఎయిడెన్ మార్క్రమ్ తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు ఇదే బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన నండ్రే బర్గర్ సైతం గాయపడ్డాడు. అతని స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు. అప్డేట్ చేసిన జట్టు వివరాలను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (అక్టోబర్ 11) వెల్లడించింది.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడు), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రేన్నేబంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్..తొలి టెస్ట్ (అక్టోబర్ 21-25, ఢాకా)రెండో టెస్ట్ (అక్టోబర్ 29-నవంబర్ 2, చట్టోగ్రామ్)చదవండి: పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో) -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్‌ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్‌తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
వెస్టిండీస్‌పై తాజాగా టెస్ట్ సిరీస్ విజయం సాధించిన సౌతాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ప్రత్యర్ధిపై వరుసగా పది సిరీస్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. సౌతాఫ్రికా 1998/99 నుంచి వెస్టిండీస్‌పై వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. 1998/99లో 5-0 తేడాతో, 2001లో 2-1 తేడాతో, 2003-04లో 3-0తో, 2005లో 2-0తో, 2007-08లో 2-1తో, 2010లో 2-0తో, 2014-15లో 2-0తో, 2021లో 2-0తో, 2023లో 2-0తో తాజాగా 1-0 తేడాతో వెస్టిండీస్‌ను వరుస సిరీస్‌ల్లో ఓడించింది.కాగా, గయానా వేదికగా విండీస్‌తో తాజా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు కుప్పకూలింది. అనంతరం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా.. విండీస్ 222 పరుగులకే చాపచుట్టేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
సౌతాఫ్రికా కొంపముంచిన వరుణుడు.. విండీస్‌తో తొలి టెస్టు డ్రా
ట్రినిడాడ్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా మాత్రం పూర్తి ఆధిపత్యం సాధించింది. కానీ దురదృష్టవశాత్తూ పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 357 పరుగులు చేయగా.. ఆతిథ్య విండీస్ 233 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 173/3 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టబ్స్ (68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. 298 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్.. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దీంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కరేబియన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథానాజ్(92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 15 నుంచి గయానా వేదికగా ప్రారంభం కానుంది. -
అరుదైన క్లబ్లో చేరిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా అరుదైన క్లబ్లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కు తాకిన 17వ సౌతాఫ్రికా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బవుమా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసిన బవుమా 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద 3000 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. కెరీర్లో 57 టెస్ట్‌లు ఆడిన బవుమా 2 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 3083 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు జాక్ కల్లిస్ పేరిట ఉంది. కల్లిస్ 165 మ్యాచ్‌ల్లో 13206 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌కు దక్కుతుంది. సచిన్ సుదీర్ఘ ఫార్మాట్లో 15921 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్థానంలో పాంటింగ్ (13378) ఉన్నాడు.కాగా, ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు సజావుగా సాగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బవుమా, ఓపెనర్ టోనీ డి జోర్జీ (78) అర్ద సెంచరీలతో రాణించగా.. ఎయిడెన్ మార్క్రమ్ 9, ట్రిస్టన్ స్టబ్స్ 20, డేవిడ్ బెడింగ్హమ్ 29, ర్యాన్ రికెల్టన్ 19, కైల్ వెర్రిన్ 39, కేశవ్ మహారాజ్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. వియాన్ ముల్దర్ (37), రబాడ (12) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్ 3, కీమర్ రోచ్, జేడన్ సీల్స్ తలో 2, జేసన్ హోల్డర్ ఓ వికెట్ పడగొట్టారు. -
SA vs WI 1st Test: చెలరేగిన కెప్టెన్.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.క్రీజులో ముల్డర్(37), రబాడ(12) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు. అయితే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. ఇక విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 3 వికెట్లు పడగొట్టగా.. కీమర్ రోచ్, సీల్స్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా వర్షం కారణంగా తొలి రోజు కేవలం 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రకటించింది. కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్తో పాటు 12 మంది సభ్యులను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.అదేవిధంగా ఏడుగురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో పాటు డేవిడ్ మలన్, ఎం డేనియల్ వోరాల్, డమ్ రోసింగ్టన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, బ్రైడన్ కార్స్‌లు ఉన్నారు.మరోవైపు వచ్చే ఏడాది సీజన్ కోసం రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), జాక్ క్రాలే (ఇంగ్లండ్)లతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్తగా ఒప్పందం కుదర్చుకుంది. అదేవిధంగా ప్రోటీస్ ఆటగాడు డేవిడ్ బెడింగ్హామ్ సన్‌రైజర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. ఇక తొలి రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టునే ఛాంపియన్స్‌గా నిలిచింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదేఐడైన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రూగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), కాలేబ్ సెలెకా, ఆండిల్ సిమెలన్.