thief arrest
-
కన్నుపడితే లూటీ ! 40 ఏళ్లుగా దొంగతనాలే వృత్తి
బనశంకరి: 40 ఏళ్లకు పైబడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శనివారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. దొంగ ప్రకాష్ (54), కోలారు, శివమొగ్గ బళ్లారిలో మొత్తం మూడు వివాహాలు చేసుకోగా ఇతడికి 7 మంది సంతానం. ఇప్పటి వరకు ఇతనిపై 160 కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, కోలారు, బళ్లారి, శివమొగ్గ, చిత్రదుర్గ, గుల్బర్గా తో పాటు గోవా, కేరళలో చోరీలకు తెగబడ్డాడు. 20 సార్లకు పైగా జైలుకెళ్లి వచ్చాడు. 10 ఏళ్ల వయసులో తొలిసారి 1978లో ప్రకాష్ 10 ఏళ్ల బాల్యంలోనే తొలి చోరీ చేశాడు. తరువాత సహోదరుడు వరదరాజ్, పిల్లలు బాలరాజ్, మిథున్, అల్లుడు జాన్ కలిశారు. ఈ నెల 22 తేదీన రాజాజీనగరలో ప్రకాష్ చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. కేజీల కొద్దీ పసిడి దోపిడీ 1978–1986 వరకు 100 ఇళ్లలో చోరీలు చేశాడు. అప్పట్లో ప్రకాష్ కేరళ కొట్టాయంలో 2.5 కిలోల బంగారం చోరీ, శేషాద్రిపురంలో బంగారు దుకాణం గోడ కు కన్నం వేసి రెండున్నర కిలోల బంగారు నగల ఆభరణాలు దోపిడీ, మరో బంగారు షాపునకు కన్నం వేసి 4 కిలోల పసిడి నగలు లూటీ, 20 కిలోల వెండి చోరీకి పాల్పడ్డాడు. అనుచరులైన జోసెఫ్, ఆనందన్, బాషా సహకరించారు. దోచుకున్న నగదును పంచుకుని జల్సాలు చేసేవారు. వైరముడి, నాగేశ్ అనే అనుచరులతో కలిసి ప్రకాష్ 1989లో మైసూరులో 20 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 1992 లో నాగేశ్ తో కలిసి మహారాష్ట్ర కొల్హాపురలో రెండు బంగారు దుకాణాలకు కన్నంవేసి 17 కిలోల బంగారు ఆభరణాలు దోపిడీచేశారు. 1992లో శివమొగ్గ ఫైనాన్స్ కార్యాలయం నుంచి రూ.3 కోట్లు నగదు దోపిడీకి పాల్పడ్డాడు. 1997లో గోవాలో 7 కిలోల స్వర్ణాభరణాలను ఎత్తుకెళ్లాడు. 2006 నుంచి ప్రకాష్ తన పిల్లలైన మిథున్, బాలరాజ్ తో పాటు అల్లుడు, అతని పిల్లలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విలాసవంతమైన ఇళ్లు, జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్ కార్యాలయాలను ఎంచుకుని కొల్లగొడతాడు. ప్రతిసారి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినప్పటికీ బయటికి వచ్చి కొత్త ముఠాను ఏర్పాటు చేసుకునేవాడు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!) -
వయసు 21.. కేసులు 20.. జల్సాల కోసం వాహనాల చోరీ
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లో పని చేసే అతగాడికి ద్విచక్ర వాహనాలంటే సరదా. వాటిపై తిరగాలనే కోరికకు తన ఆర్థిక స్థోమత అడ్డు వస్తోంది. దీంతో వాహనాలను చోరీ చేసి చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు. చోరీ వాహనాలను విక్రయించినా, ఒకే దానిపై ఎక్కువ రోజులు తిరిగినా పోలీసులకు చిక్కుతుండటంతో తస్కరించిన దానిపై కొన్నాళ్లు చక్కర్లు కొట్టి వదిలేయడం మొదలెట్టాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు 20 నేరాలు చేసిన 21 ఏళ్ల ఎం.వెంకటేశ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి వెల్లడించారు. ఆసిఫ్‌నగర్ పరిధిలోని జిర్రా ప్రాంతానికి చెందిన వెంకటేష్ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై చిన్న చిన్న పనులు చేసినప్పటికీ ప్రస్తుతం ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. వివిధ రకాలైన ద్విచక్ర వాహనాలపై తిరగాల న్నది ఇతడి కోరిక. అయితే వాటిని ఖరీదు చేయడానికి తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో 2016 నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. తొలినాళ్లల్లో చోరీ చేసిన వాహనాలపై తిరిగి వదిలేసేవాడు. ఆపై వాటికి ఉన్న డిమాండ్ గుర్తించిన ఇతగాడు జిర్రా ప్రాంతంలో అనేక మందికి మాయమాటలు చెప్పి తక్కువ రేటుకు అమ్మాడు. ఆ సందర్భంలో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆయా వాహనాలను రికవరీ చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై వచ్చిన ఇతడిని ఆ వాహనాలు ఖరీదు చేసిన వారు నిలదీయడంతో పాటు దాడులకు పాల్పడ్డారు. ఇకపై చోరీ చేసిన వాహనాన్ని ఎవరికీ విక్రయించకూడదని నిర్ణయించుకున్న వెంకటేష్ తన పంథా కొనసాగించాడు. 15 రోజుల తర్వాత.. మే నెల నుంచి ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, టప్పాచబుత్ర, మంగళ్‌హాట్, బోయిన్పల్లి పోలీసుస్టేషన్ల పరిధి నుంచి ఎనిమిది వాహనాలు తస్కరించాడు. ఒకదాన్ని చోరీ చేసిన తర్వాత పది పదిహేను రోజులు దానిపై చక్కర్లు కొడతాడు. ఆపై నిర్మానుష్య ప్రాంతంలో ఆ వాహనాన్ని పడేసి మరోటి చోరీ చేస్తాడు. ఇతడి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కె.నర్సింహులు, షేక్ బురాన్‌లతో కూడిన బృందం వలపన్ని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి రూ.5 లక్షల విలువైన 8 వాహనాలు స్వాదీనం చేసుకుని ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించింది. వీటితో సహా ఇప్పటి వరకు ఇతడిపై మొత్తం 20 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: పల్సర్ బైక్‌లే టార్గెట్.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం.. -
ఈ ఖైదీ మామూలోడు కాదండోయ్.. వయసు 26.. వందకు పైగా కేసులు
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్..పోలీసులకు ముచ్చెమటలు పట్టించే గజ దొంగ..వయసు కేవలం 26..వందకు పైగా కేసులు...రెండు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎట్టకేలకు 2020లో విశాఖ పోలీసులకు చిక్కాడు. కోర్టు శిక్ష విధించింది. 2022 జూన్ 8 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కట్ చేస్తే మళ్లీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాడు. అనకాపల్లి కోర్టుకు వాయిదా కోసం వెళ్లి తిరిగి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు కన్ను కప్పి పరారయ్యాడు. ఇది చిత్తూరు ఖైదీ కథ.. చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ రెండు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు. చిత్తూరు జిల్లాతో పాటు విశాఖ, పశ్చమ గోదావరి జిల్లాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడం ప్రభాకర్‌కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే ఇళ్లల్లోకి వెళ్లి బంగారం, నగదు, విలువైన వస్తువులు పట్టుకుపోయినా ఎవ్వరి కంటా పడేవాడుకాదు. ఇలా కొన్నేళ్లపాటు తనకు ఎదురులేకుండా పోయింది. రెండు రాష్ట్రాల పోలీసులకు కొరకురాని కొయ్యగా తయారయ్యాడు. 2020 నుంచి శిక్ష అనుభవిస్తూ... ప్రభాకర్ 2020లో విశాఖ పోలీసులు ఎట్టకేలకు ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. 2020 సెప్టెంబరు 8 నుంచి విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవిస్తూనే రిమాండ్ ముద్దాయిగా కోర్టు వాయిదాలకు ఎస్కార్ట్ పోలీసులు హాజరుపరుస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 23న ప్రభాకర్‌ను అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్లి తిరిగి రాత్రి 8 గంటలకు విశాఖ సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఎస్కార్ట్ వాహనం దిగి పరారయ్యాడు. చీకటి కావడంతో పోలీసులు ఆయన వెంట పరిగెత్తినా దొరకలేదు. దీంతో మరో కేసు ప్రభాకర్‌పై నమోదైంది. చదవండి: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎఫెక్ట్..పెరిగిన టిఫిన్ ధరలు -
ఆ ధైర్యంతోనే.. దొంగ ప్యాంట్, నడుము పట్టుకుని గట్టిగా లాగినా
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): ఇంటలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రయ్య ఇంట్లో శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. చాకచక్యంగా వ్యవహరించిన అతని భార్య భాగ్యలక్ష్మి తన భర్తసాయంతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎక్బాల్ హైమద్ నగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుర్గం చంద్రయ్య, భాగ్యలక్ష్మి దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎక్బాల్హైమద్ నగర్లో నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారుజామున సదరు మహిళ వాకిట్లో ముగ్గులు వేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. గమనించిన చంద్రయ్య కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేయగా తోసేసి పారిపోయేందుకు యత్నించాడు. భాగ్యలక్ష్మి చాకచక్యంగా వ్యవహరించి తన భర్త సాయంతో సదరు వ్యక్తిని పట్టుకుని చెట్టుకు కట్టేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోర్ట్ సిబ్బందిని ఘటన స్థలానికి పంపించారు. సదరు వ్యక్తిని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు మద్యం సేవించి ఉన్నాడని, విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మా ఆయన పోలీసన్న ధైర్యంతోనే.. మా ఆయన పోలీస్ అన్న ధైర్యంతోనే దొంగను పట్టుకున్నా. దొంగతనం చేసేందుకే వచ్చిండు. మా ఆయన పట్టుకుంటే తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మా ఆయన కిందపడిపోవడంతోనే పరుగెత్తుకుని వచ్చి దొంగ ప్యాంట్, నడుము పట్టుకుని గట్టిగా లాగినా. వెంటనే మా ఆయన లేచి తాడుతో కట్టేశాడు. నేను పట్టుకోకపోతే పారిపోయేవాడు. – భాగ్యలక్ష్మి చదవండి: ‘రూ.15లక్షలు ఇస్తే పార్టీలోకి వస్తా..’ -
డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు.. 24 గంటల్లోనే పోలీసులకు చిక్కాడు
హైదరాబాద్: జీవనోపాదిలేక ఎంబీఏ చదివిన ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. తను నివసించే ప్రాంతంలోనే చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో అతను తప్పుడు దారిలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ పని అతనికి అలవాటు లేకపోవడంతో తప్పు చేసిన 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సార్ నగర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లికి చెందిన డి. సుచరిత అనే యువతి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మధురా నగర్ కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అయితే గురువారం కూడా ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే సుచరిత మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. ఇక అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు సుచరిత మెడలోని రూ. 45 వేలు విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించాడు. దీనితో బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. నిందితుడిని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చింత వినోద్(27)గా గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు వినోద్‌ను పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేకనే గొలుసు చోరీకి పాల్పడ్డారని, చోరికి పాల్పడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. -
శునకాల దొంగలకు కటకటాలు..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): హాసన్ సమీపంలోని హొన్నేనహళ్లి రోడ్డులోని జాగిలాల ఫారంలో విలువైన కుక్కలు చోరీకీ గురయ్యాయి. దివాకర్ అనే వ్యక్తి కుక్కల ఫారంను నడుపుతున్నాడు. ఈ నెల 18 రాత్రి రూ.లక్షన్నర విలువగల రాట్ వీలర్, ల్యాబ్రడార్, గోల్డెన్ రిట్రివర్ జాతుల 4 కుక్కలను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపాడు. ఇంతలో తన వద్ద 4 విలువైన కుక్కలు అమ్మకానికి ఉన్నాయని హోళెనరసిపుర వాసి రోహన్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడు. అది చూసి దివాకర్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రోహన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. డబ్బు కోసమే కుక్కలను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. చదవండి: వర్షకాలంలో వాటర్ లీకేజీలా .. ఇదుగో పరిష్కారం -
ఇద్దరు గజ దొంగల అరెస్ట్
చిత్తూరు, మదనపల్లె టౌన్ : ఆ ఇద్దరూ యువకులు దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయారు. ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడటం, తలుపులు వేయకుండా ఆదమరచి నిద్రిస్తుంటే లోనికెళ్లి బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగలించడంలో సిద్ధహస్తులయ్యారు. తరచూ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడటం, జైలుకు వెళ్లి బెయిలుపై బయటకొచ్చి మళ్లీ దొంగతనాలు చేయడం వారికి అలవాటుగా మారింది. అలాంటి గజ దొంగలను శుక్రవారం టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. టూటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాలు.. పీలేరులోని కోటపల్లెకు చెందిన షేక్ రెడ్డిబాషా కుమారుడు షేక్ బావాజి(30) కొన్నేళ్లుగా జిల్లాలోని పలు చోట్ల 15 ఇళ్లలో దొంగతనాలు చేసి జైలు శిక్ష కూడా అనుభవించాడు. బయటకొచ్చిన బావాజీ దొంగ నోట్ల కేసులో జైల్లో పరిచయమైన తిరుపతికి చెందిన దేవిరెడ్డి సురేష్ రెడ్డి(34)తో కలసి ఈ నెల 22 రాత్రి మదనపల్లె ప్రశాంతనగర్ ఏడవ క్రాస్‌లోని టీచర్ హరిత ఇంట్లో రూ.ç2.85 లక్షల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఆ తర్వాత మళ్లీ చోరీకి పాల్పడేందుకు స్థానిక టౌన్ బ్యాంకు సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వీరిని టూ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేసేసరికి నిందితులు తాము చేసిన దొంగతనాల చిట్టా విప్పారు. హరిత ఇంట చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు.నిందితులను పట్టుకోవడానికి సహకరించిన ఐడి పోలీసులు మహ్మద్, రాఘవ, ప్రసాద్, ప్రకాష్, కిరణ్‌ను సీఐ అభినందించారు. ఘరానా మోసగాడు అరెస్ట్ తిరుపతి క్రైం : ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.10.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం క్రైమ్ పోలీసు స్టేషన్లో క్రైం డీఎస్పీ రామ్మోహన్ మీడియాకు తెలిపిన వివరాలు..నగరంలోని మంగళం రోడ్డులోని వెంకటాద్రి ప్లాజా వద్ద ప్యూర్ ఫుడ్ సూపర్ మార్కెట్లో భాగస్వాములు కావాలని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సులేమాన్ (44) పత్రికా ప్రకటనలు ఇచ్చాడు. దీనికి ఆకర్షితులైన కొందరు పెట్టుబడికి గాను కొందరు నగదు చెల్లించారు. తీరా అతడు మోసగించినట్లు గ్రహించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10,50,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో సీఐలు చల్లని దొర, సిబ్బంది కృషి చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. -
పద్మారావు నివాసంలో చోరీ యత్నం
సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలో దొంగలు పడిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు పద్మారావు ఇంట్లోకి దూరి చోరీకి యత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు దొంగలను పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఐదుగురిలో స్థానికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గణేష్ చందా ముసుగులో మహారాష్ట్ర దొంగలు
సాక్షి, నిజామాబాద్ : గణేష్ చందాల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ చందా ఇవ్వని వారింట్లో దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన నగరంలో సంచలనం రేపింది. సాయికృప నగర్ కాలనీలో ఉన్న మొదటి అంతస్థులోని ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వినాయక చవితి పండుగ నిమిత్తం చందా అడగడానికి వెళ్లారు. ఇంటి ఇల్లాలు చందా డబ్బులు ఇవ్వననడంతో మంచి నీళ్లు కావాలని అడిగి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. దీంతో భయపడ్డ ఇల్లాలు అరుస్తూ ఇంట్లోకి పరుగు తీసింది. అప్రమత్తమైన ఇల్లాలి భర్త వెంటనే గేటు తాళం వేసి వారిని ప్రశ్నించగా, వారిలో ఒకరు భర్తను తోసేసి గేటు దూకి పారిపోయాడు. మిగిలిన మరొకరిని పట్టుకొని స్థానికులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమందించగా వారు విచారించి నిందితులు మహారాష్ట్రకి చెందినవారుగా గుర్తించారు. పారిపోయిన మరో నిందితుడి కోసం పోలీసులు నగరమంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తోపులాటలో భర్తకు స్పల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గణేష్ చందాల పేరుతో వచ్చేవారి విషయంలో సాయికృప నగర్, వినాయక నగర్ కాలనీ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్..
అమీర్‌పేట: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారంపంజగుట్ట ఏపీసీ తిరుపతన్న వివరాలను వెళ్లడించారు. వైజాగ్, చెన్నగడిలి మండలం పీఎం పాలెం గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ నగరానికి వలసవచ్చి డ్రైవర్‌గా పని చేస్తూ రహమత్‌నగర్ వీడియో గల్లీలో ఉంటున్నాడు. అదే ప్రాంతోలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండెల నాగభాస్కర్రావు అలియాస్ బొబ్బిలితో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మధ్యాహ్న వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి పూట పంజా విసురుతున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, మేడిపల్లి స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి తప్పించు తిరుగుతున్నారు. సోమవారం వీరిని అరెస్ట్ చేసిన క్రైం పోలీసులు వారి నుంచి రూ.4 లక్షల విలువైన 130 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, కట్టింగ్ ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ స్నాచర్ల ఆటకట్టు... సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన మియ్యనోల్ల సతీష్ అలియాస్ సత్తి, అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్ రాత్రి వేళల్లో బైక్‌పై తిరుగుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లే వారి ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇటీవల ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళుతున్న వ్యక్తి ఫోన్ లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్‌తో పాటు పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు.నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, వై.అజేయ్‌కుమార్ తదితరులను ఏసీపీ అభినందించారు. -
టక్కరి దొంగ.. చిక్కాడిలా..!
అతనొక్కడే.. ఎవరి సహకారం తీసుకోడు.. ఒంటరివాడే కదా అని తీసిపారేయకండి. మహా టక్కరి దొంగ.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200కు పైగా దొంగతనాలు చేశాడు. పోలీస్ పేరుతో కొన్నేళ్ల పాటు తన చోర కళను అప్రతిహతంగా కొనసాగించాడు. 2016లో ఓ కేసులో సీసీ కెమెరాకు చిక్కాడు. వేలిముద్రలతో అడ్డంగా దొరికిపోయి జైలు శిక్ష అనుభవించినా అతనిలో మార్పు రాలేదు. కర్నూలు: జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి మఫ్టీ పోలీసు ముసుగులో చోరీలకు పాల్పడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన అంతర్రాష్ట్ర దొంగ బోయ బూడిదపాడు రాజు అలియాస్ బుడ్డోడును కర్నూలు తాలూకా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.6.25 లక్షల నగదు, మూడు తులాల బంగారం, నేరానికి ఉపయోగించిన మోటర్‌సైకిల్‌ను రికవరీ చేసి కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్ ఎదుట హాజరుపరిచారు. మంగళవారం సాయంత్రం కర్నూలు తాలూకా సీఐ చలపతిరావు, ఎస్ఐ శ్రీనివాసరావుతో కలసి తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. సి.బెళగల్ మండలం పోలకల్లు గ్రామానికి చెందిన బోయ బూడిదపాడు రాజు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న క్రమంలో కర్నూలు శివారులోని సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద స్థలం కొనుగోలు కోసం వెళ్లి పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇతను కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, ఎమ్మిగనూరు, నందవరం, కర్నూలు నాల్గవ పట్టణం, ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్, ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీ కేసుల్లో నిందితుడిగా తేలాడు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా ఉండవల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లు నేరస్థుడు అంగీకరించాడు. భారీ మొత్తంలో నగదు రికవరీ.. కర్నూలు సమీపంలోని మామిదాలపాడు గ్రామ శివారులో ఫిబ్రవరి 10వ తేదీన ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటనలో రూ.15 వేలు, గత ఏడాది నవంబర్‌లో కర్నూలులోని వీకే వైన్స్ దగ్గర గర్భిణీ స్త్రీతో వచ్చిన వ్యక్తిని బెదిరించి రూ.15 వేలు, టీజీ పెట్రోల్ బంకు దగ్గర ఓ వ్యక్తిని బెదిరించి రూ.13 వేలు చోరీ చేశాడు. గత నెలలో కర్నూలు శివారులోని చిన్నటేకూరు దగ్గర జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లను బెదిరించి రూ.25 వేలు లాక్కున్నాడు. అలాగే నందికొట్కూరు రోడ్డులోని యల్లమ్మ గుడి దగ్గర గత ఏడాది అక్టోబర్ నెలలో పోలీసు పేరుతో అమాయకులను బెదిరించి రూ.20 వేలు లాక్కున్నాడు. జిల్లాలో ఇలాంటి తరహాలో 25కు పైగా నేరాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో 25 సెల్ఫోన్లు దొంగలించి పోలీసు వలకు చిక్కి జైలుకు వెళ్లాడు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగదుతో పాటు నగలను రికవరీ చేసినందుకు తాలూకా సిబ్బంది శివరంగయ్య, సులేమాన్, సుబ్బరాయుడు, మహబూబ్ బాషా తదితరులను డీఎస్పీ అభినందించారు. మిస్టరీ కేసులను ఛేదించే విషయంలో పోలీసుల కృషిని అభినందిస్తూ డీజీపీ చేతుల మీదుగా అందించే బెస్ట్ క్రైం డిటెక్ట్ ఏబీసీడీ అవార్డుకు ఈ కేసును ప్రతిపాదించినట్లు డీఎస్పీ వెల్లడించారు. మఫ్టీ పోలీసులమంటూ మాయమాటలు చెప్పేవారిని అమాయకంగా నమ్మి మోసపోవద్దని ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. కోర్టు అనుమతితో నిందితుడిని మరోసారి అదుపులోకి తీసుకుని టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్‌ను నిర్వహించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను బెదిరించి మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. నేరం చేసే విధానం.. నగర శివార్లు, జాతీయ రహదారుల్లో మఫ్టీ పోలీసు ముసుగులో తిరుగుతూ అమాయకులు, ముసలివాళ్లు, ఆడవాళ్లను ఎంపిక చేసుకుని ‘నేను పోలీసును. మీరు వస్తున్న దారిలో నా పర్సు పడిపోయింది. ఈ దారిలో నువ్వు తప్ప ఎవరూ రాలేదు. ఆ డబ్బుల పర్సు నీ దగ్గరే ఉంది. పర్సులో ఉన్నవన్నీ రూ.500/2000 నోట్లు. వాటి నంబర్లు నా దగ్గర సెల్ఫోన్లో ఉన్నాయి. నీ దగ్గర ఉన్న డబ్బు చూపించు. అందులో నా నోట్లు ఏవో గుర్తు పడతా.. అంటూ నమ్మబలికి వారి వద్ద ఉన్న డబ్బును బయటకు తీసి చూపించగానే ఆ మొత్తం లాక్కుని మోటర్‌సైకిల్‌పై ఉడాయించేవాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా పోలీసు భాషలో మాట్లాడి బెదిరించేవాడు. కొంతమంది డబ్బు చూపడానికి ఒప్పుకోకపోతే దౌర్జన్యకర మాటలతో అంతు చూస్తానని ఎస్ఐ సమీపంలో జీపులో ఉన్నారు, అక్కడకు రండి అంటూ డబ్బు చూపించే విధంగా వారిని బెదిరించి మొత్తాన్ని తీసుకుని ఎస్ఐకి చూపిస్తాను.. అక్కడికి రండి.. అంటూ మోటార్‌సైకిల్‌పై తప్పించుకుని ఉడాయించేవాడు. గత ఏడాది జూన్‌లో కర్నూలు కోర్టు వద్ద ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలిని పరిచయం చేసుకుంటూ పలానా న్యాయవాది ఎక్కడ ఉన్నాడంటూ ఆరా తీసినట్లు నమ్మించి, ఆమె దృష్టి మరల్చి మెడలో బంగారు తాలిబొట్టు, చైన్ లాక్కుని ఉడాయించాడు. 200కు పైగా ఈ తరహా నేరాలకు పాల్పడినప్పటికీ అనేక కేసులు రికార్డులకు ఎక్కలేదు. పోలీసు విచారణలో దాదాపు 5 కేసులు ఇలాంటివి వెలుగుచూశాయి. -
చదివింది బీఎస్సీ కంప్యూటర్స్..చోరీల్లో ఎక్స్పర్ట్
తిరుపతి క్రైం : తిరుపతి నగరంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా రాయచోటి, కొత్తపేటకు చెందిన వెంకటస్వామి కుమారుడు దారూరిరెడ్డి సతీష్ (33)ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతను శ్రీనివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో క్రైం సీఐ పద్మలత అరెస్ట్ చేశారు. ఇతని నుంచి రూ.4.53 లక్షలు విలువ చేసే 151 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి, పలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు తేలింది. జీతం తక్కువని ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి దొంగగా అవతారం ఎత్తాడు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడి వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. -
‘పీడీ’తో పరార్!
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఐదు నెలలుగా పరారీలో ఉన్న ఘరానా దొంగను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఓసారి ఈ యాక్ట్ కింద ఏడాది జైల్లో ఉన్నా ఇతడిలో మార్పు రాలేదని అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన మహ్మద్ మన్సూర్‌కు కాలా కవ్వా, దేవ వంటి మారుపేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన అతను కొన్నేళ్లుగా చోరీలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఇతడిపై 2015 నాటికే 32 కేసులు నమోదయ్యాయి. వీటిలో సెల్‌ఫోన్ స్నాచింగ్, అక్రమాయుధాలతో సంచరించడం, సెల్‌ఫోన్స్ చోరీ వంటివి ఉన్నాయి. దీంతో నగర పోలీసులు 2015లో పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఏడాది పాటు కటకటాల్లో ఉండి బయటకువచ్చినా ఇతడి వైఖరిలో మార్పు రాలేదు. మళ్లీ పాత పంథానే అనుసరించడంతో గత ఏడాది మరోసారి అరెస్టయ్యాడు. తాజాగా అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, చార్మినార్, మలక్‌పేట ఠాణాల్లో మరో 10 నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు మరోసారి ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ ఉత్తర్వులు అతడికి చేరేలోగా బెయిల్‌పై బయటికి వచ్చిన మన్సూర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం రంగంలోకి దిగిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు స్వామి, సి.వెంకటేష్ ముమ్మరంగా గాలించి శుక్రవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు!
విశాఖపట్నం, గోపాలపట్నం: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేమరి. ఆలయంలో చోరీకి యత్నించి, తిరిగి బయట పడలేక పోలీసులకు చిక్కిన ఘటన వేపగుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వేపగుంట జంక్షన్లో పైడితల్లమ్మ ఆలయం ఉంది. శుక్రవారం వేకువజామున ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన నిర్వాహకులు, అర్చకుడికి ఇక్కడ వాతావరణం గందరగోళంగా కనిపించింది. హుండీ కనిపించలేదు. ఆలయ ప్రవేశం పైభాగంలో గ్రిల్స్ విరిచి ఉన్నాయి. ఆలయంలో చిల్లర డబ్బులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపల గర్భాలయం వెనక వ్యక్తి హుండీ పట్టుకుని నిద్రపోతూ కనిపించాడు. దీంతో విస్తుపోయిన ఆలయ చైర్మన్ మామిడి రాజు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయంలోకి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని తలుపుల తాళాలూ పెకిలించినా గర్భాలయ తలుపు తాళం తీయడానికి నిందితుడు సాహసించలేకపోయినట్టు తెలిసింది. నిందితున్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించినా బయటకు రాలేక ఇలా ఉండిపోయినట్లు ఆయన నుంచి సమాధానం వచ్చింది. ఇదిలా ఉండగా వేపగంట జంక్షన్‌లోనే పోలీసు అవుట్‌పోస్టు ఉంది. దీని పక్కనే పైడితల్లమ్మ ఆలయం ఉన్నా ఈ సంఘటన జరిగిందంటే పోలీసు నిఘా ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు విమర్శిస్తున్నారు. -
బస్టాండ్ సెంటిమెంట్
బంజారాహిల్స్: ఎవరైనా దొంగతనం చేయగానే ఏం చేస్తారు..? దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్ వదిలి పోలీసుల కంటపడకుండా మరోచోటికి మకాం మారుస్తారు. అయితే ఘరానా దొంగ లక్ష్మణ్ రూటే సెపరేటు. దొంగతనం చేయగానే ఆ సొమ్మును భద్రంగా మూటగట్టుకొని ఇమ్లిబన్ బస్టేషన్లో ఓ పక్కన దుప్పటి కప్పుకొని నిద్రిస్తాడు. ఆ తెల్లవారే తీరిగ్గా మరో చోటకు వెళ్తాడు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన దొంగ కూచిపూడి లక్ష్మణ్ అలియాస్ లక్ష్మణ్, అలియాస్ మున్నా, అలియాస్ మధు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, షేక్ మహ్మద్‌పేట గ్రామానికి చెందినవాడు. నగరానికి వలస వచ్చిన అతను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ మాదా పూర్ ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దొంగతనానికి వెళ్లేముందు లక్ష్మణ్ ఇమ్లిబన్ బస్ స్టేషన్లో నే పగలంతా ఓ పక్కన దుప్పటి కప్పుకొని పడుకుని, రాత్రి 9 గంటలకు చోరీకి బయల్దేరతాడు. అర్ధరాత్రి దోచుకున్న సొమ్మును మూటగట్టుకొని మళ్లీ ఇమ్లిబన్ బస్ స్టేషన్‌కే వచ్చి పడుకుంటాడు. ఎప్పటి నుంచో ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలిపాడు . దొంగతనం చేసిన తెల్లవారి నగరం నుంచి మకాం మార్చేస్తాడు. శ్రీకృష్ణదేవరాయనగర్‌లోని వ్యాపా రి గోవింద్ ఇంట్లో చోరీ చేసిన లక్ష్మణ్ తాళం పగలగొట్టేందుకు తన వెంట తెచ్చుకున్న రాడ్, స్క్రూడ్రైవర్ అక్కడే వదిలేయడంతో వాటిపై ఉన్న వేలిముద్రల ఆధారంగా మూడు రోజుల క్రితం ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో అతడిని అరెస్ట్ చేశా రు. ఆ రోజు రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో ఓ దొంగతనానికి సమయాత్తమవుతూ పోలీసులకు దొరక డం గమనార్హం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన అతను గత మే నెల 10న విడుదలయ్యాడు. రెండు వారాలు విశ్రాంతి తీసుకొని మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. కూకట్పల్లి,మియాపూర్, ఎస్ఆర్నగర్, కేపీహెచ్‌బీ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 31 దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. -
ఘరానా దొంగ అరెస్ట్
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడడంతోపాటు బైక్‌లు ఎత్తుకుపోతున్న ఘరానా దొంగను ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తులం బంగారం, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కంచరపాలెం నేర విభాగం పోలీస్ స్టేషన్లో డీసీపీ ఏఆర్ దామోదర్ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు(28) వరుస జల్సాల కోసం చోరీల బాటపట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొల్లగొడుతున్నాడు. ఇప్పటి వరకు విశాఖపట్నంతోపాటు విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో 23కు పైగా కేసులు నమోదయ్యాయి. ఏడాది కాలంగా ఎయిర్ పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు దొంగతనాలు, కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, గోపాలపట్నం పరిధిలో మూడు చోట్ల, ఆరిలోవలో రెండు చోట్ల, పద్మనాభంలో మూడు చోట్ల, అచ్చుతాపురంలో ఒక చోట, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకటి, రెండో పట్టణ పీఎస్ పరిధిలో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. అదేవిధంగా పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లను కూడా ఎత్తకుపోయేవాడు. వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరబాబుపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో కాకానినగర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎయిర్ పోర్ట్ నేర విభాగం ఎస్ఐ ఎ.మన్మథరావు, వెస్ట్ జోన్ సీఐ నల్లి సాయి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి తులం బంగారంతోపాటు నాలుగు బైక్‌లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే భారీ దొంగతనాలకు పాల్పడినప్పటికీ తులం బంగారమే లభ్యం కావడం, నగదు దొరక్కపోవడంతో పోలీసులు లోతుగా విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. చోరీ చేసిన బంగారాన్ని ఎప్పటికప్పుడు ప్రైవేటు సంస్థల్లో తనఖా పెట్టి ఆ నగదుతో జల్లాలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ బంగారం రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ తెలిపారు. సమావేశంలో నేర విభాగం ఏసీపీ ఫల్గుణరావు, వెస్ట్ జోన్ ఏసీపీ అంక అర్జున్ రావు, కంచరపాలెం సీఐ చంద్రశేఖరరావు, కంచరపాలెం నేర విభాగం ఎస్ఐ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏటీఎం దొంగ అరెస్ట్
కళ్యాణదుర్గం: అమాయకులను లక్ష్యంగా చేసు కుని ఏటీఎం ద్వారా నగదు చేయడానికి సహాయపడుతున్నట్టు నటించి.. వారికి ఇతరుల ఏటీఎం కార్డు అంటగట్టి.. తర్వాత వారి కార్డుతో డబ్బు చేసుకునే దొంగను బ్యాంకర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే.. ఈ నెల ఐదో తేదీన ముదిగల్లు క్రాస్‌లో గల స్టేట్‌బ్యాంకులో రాయదుర్గం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాటువేశాడు. ముదిగల్లు రైతు రూ.లక్ష అవసరం కావడంతో అక్కడకు వచ్చాడు. ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే విధానం తెలియకపోవడంతో ఓ వ్యక్తి ద్వారా తొలుత రూ.40 వేలు డ్రా చేయించుకున్నాడు. మిగిలిన మొత్తం కావాలంటే మరో రోజు రావాల్సిందేనని ఆ వ్యక్తి చెప్పి వెళ్లిపోయాడు. ఇదంతా గమనించిన యువకుడు ‘పెద్దాయనా.. ఆయన మాటలెందుకు వింటావు..ఇంకా ఎక్కువ డ్రా చేయొచ్చులే’ అంటూ రైతును నమ్మించాడు. రైతు వెంకటేశులు ఏటీఎం తీసుకుని స్వైపింగ్‌లో డ్రా చేస్తున్నట్లు నటించి.. తర్వాత డబ్బు రాలేదని చెప్పి అతడి ఏటీఎం కార్డును తనవద్ద ఉంచుకుని మంగమ్మ పేరుపై గల ఏటీఎం కార్డును అందజేశాడు. ఏడో తేదీ రైతు ఏటీఎంకు, బ్యాంకుకు వెళ్లగా డబ్బు డ్రా చేసేకోలేకపోయాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఏటీఎం కార్డు మారిందని తేల్చారు. అనంతరం సదరు ఏటీఎంను బ్లాక్ చేశారు. అయితే అంతకుమునుపే యువకుడు రూ.12వేలు డ్రా చేసేశాడు. ♦ శుక్రవారం రోజు అదే స్టేట్‌బ్యాంక్‌లో గోళ్ల వీఆర్ఏ నాగరాజును కూడా ఆ యువకుడు మోసం చేశాడు. ఏటీఎం ద్వారా రూ.4వేలు తస్కరించాడు. ♦ శుక్రవారం స్టేట్‌బ్యాంకుకు వెళ్లి స్వైపింగ్‌లో స్లిప్ పేపర్ రావడం లేదని సిబ్బందికి చెప్పి వెళ్లాడు. అప్పటికే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ కుమార్, సిబ్బంది పోలీసులను పిలిపించి ఆ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐ జమాల్‌బాషాలు సదరు బ్యాంకుకు వెళ్లి సీసీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి సూత్రధారులు, పాత్రదారులు ఇంకా ఎవరన్నదీ పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రా
తాడేపల్లిగూడెం రూరల్ : చోరీ కేసులో దొంగను అరెస్టు చేసి, పది గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ఫోన్లు, వాచీలు, వెండి పట్టీని స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని హయత్‌నగర్‌కు చెందిన శీలి శివకృష్ణ అలియాస్ శివకుమార్ అలియాస్ శివ అనే వ్యక్తి తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలోని అత్తవారింట్లో నివాసముంటూ తెలంగాణలోను, తాడేపల్లిగూడెం పట్టణంలోనూ పలు చోరీలకు పాల్పడ్డాడు. గత నెల మార్చి 20న పట్టణంలోని బాపూజీ పుంత రోడ్డులోని బీఐ రాజేంద్ర నివాసంలో శివకృష్ణ చోరీ చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శివకృష్ణపై నిఘా పెట్టారు. పట్టణ ఎస్సై కేవీ రమణ హయత్‌నగర్‌లో విచారించగా అక్కడ లభించిన సమాచారంతో జగ్గన్నపేటలో ఉంటున్న శివకృష్ణను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ మూర్తి చెప్పారు. అతని నుంచి 10 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4 వేలు నగదు, ఐదు వాచీలు, ఐ–ఫోన్, నోకియా లుమియా ఫోన్, వెండి పట్టిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా హయత్‌నగర్‌లో ఇటువంటి చోరీలకు పాల్పడి శివకృష్ణ జైలుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. ప్రజలు ఎల్‌హెచ్‌ఎంఎస్ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా చోరీల నివారణకు సహకరించాలని సీఐ కోరారు. ఎస్సై కేవీ రమణ, ఏఎస్సై కె.సాంబశివరావు, హెచ్‌సీలు రాంబాబు, అల్లూరి సత్యనారాయణరాజు, సిబ్బంది ఎస్.నాగరాజు, కె.రాజు, కె.మహేష్, టి.రవి పాల్గొన్నారు. -
పట్టుబడిన దొంగ...
నెల్లిమర్ల:జిల్లా వ్యాప్తంగా ఏటీఎంల వద్ద దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని నెల్లిమర్ల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఏడాది కాలంలో 14 దొంగతనాల్లో రూ 3.2 లక్షల నగదు అపహరించగా సదరు నిందితుడి నుంచి రూ. 1.89 లక్షలు రికవరీ చేశారు. రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. ఈ మేరకు నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో విజయనగరం డీఎస్పీ ఏవీ రమణ ఆదివారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కాలంలో ఏటీఎంల వద్ద దొంగతనాలు జరిగినట్లు 8 కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే కేసు పెట్టేందుకు ముందుకురాని వారు మరో ఆరుగురు ఉన్నారని తెలిపారు. నెల్లిమర్ల స్టేట్‌బ్యాంకు ఏటీఎం వద్ద మూడు, చీపురుపల్లిలో రెండు, గుర్లలో ఒకటి, విజయనగరంలో రెండు, సాలూరు, కొత్తవలస పరిధిలోని ఏటీఎంల వద్ద ఒక్కొక్కటి దొంగతనాలు జరిగాయి. అయితే విజయనగరం సాయినాథ్ కాలనీలో నివాసుముంటున్న నాగులపల్లి హరిప్రసాద్ ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నెల్లిమర్ల స్టేట్‌బ్యాంక్ ఏటీఎం వద్ద డబ్బులు విత్‌డ్రా చేసేందుకు హరిప్రసాద్ రాగా, ఎస్సై ఉపేంద్రరావు, కానిస్టేబుల్ వాసు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ 1.89 లక్షలు రికవరీ చేసుకున్నారు. ఆ మొత్తాన్ని బాధితులకు అందజేశారు. ఖాతాదారులకు సహకరిస్తున్నట్లుగా నటించి నగదు దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌కు అభినందన నిందితుడిని పట్టుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన నెల్లిమర్ల ఎస్సై ఉపేంద్రరావును, కానిస్టేబుల్ వాసును డీఎస్పీ ఏవీ రమణ అభినందించారు. అలాగే విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు కృషి కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ వాసుకు రూ. 2 వేల నగదు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
వరంగల్‌కు వచ్చి..పోలీసులకు చిక్కి...
వరంగల్ క్రైం : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే దొంగ పోలీసులకు చిక్కినట్లు వరంగల్ క్రైం అడిషనల్ డీసీపీ బిల్లా అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం సీసీఎస్ పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా, కంబాలపల్లికి చెందిన బెల్లంకొండ యాకయ్య గత పది సంవత్సరాల క్రితం కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. మద్యంకు బానిసై కూలీ పనులతో వచ్చే డబ్బులు సరిపోకా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలతో మహబూబాబాద్, కేసముద్రం, నర్సంపేట, నెల్లికుదురు పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్ అయి జైలు జీవితం గడిపినట్లు డీసీపీ తెలిపారు. గత ఐదు నెలల నుంచి వరంగల్ పోలీస్‌కమిషనరేట్ పరిధిలో రూ.7.20 లక్షల విలువగల 232 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు చెప్పారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో 3 చోరీలు, కేయూసీ, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపూర్, పోలీస్స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడినట్లు ఆయన వివరించారు. వరంగల్‌కు వచ్చి..పోలీసులకు చిక్కి... దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బులతో ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనతో యాకయ్య దొంగిలించిన సొమ్మును ఇంట్లో భద్రపరచుకున్నాడు. మహబూబాబాద్‌లో అమ్మితే అనుమానం వస్తుందని భావించిన అట్టి సొమ్ములను వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్మేందుకు వచ్చిన సమాచారంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డెవిడ్‌రాజ్ సిబ్బందితో వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడిన విషయం ఒపుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా సకాలంలో నిందితుడిని గుర్తించి సొమ్ము స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు డీసీపీ బిల్లా అశోక్‌కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు, ఎస్సై సంపత్, ఏఎస్సై వీరస్వామి, హెడ్‌కానిస్టేబుల్ శివకుమార్, సుధీర్, ఉమామహేశ్వర్, జంపయ్యలను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అభినందించారు. -
చోరీ సొత్తు కారు చౌక
స్టార్ హోటళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన జయేష్ రావ్జీ దొంగ సొత్తును ముంబైలో విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. నగరంలోని పార్క్ హయత్ హోటల్ నుంచి చోరీ చేసిన సొత్తులో రూ.10 లక్షల విలువైన వజ్రాభరణాన్ని కేవలం రూ.1.8 లక్షలకే ముంబైలోని హిరేన్ అనే వ్యాపారికి అమ్మినట్లు పోలీసుల విచారణలో జయేష్ వెల్లడించాడు. ఇతడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ముంబైకి తరలించి హిరేన్ నుంచి సొత్తు రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే 2014లో అబిడ్స్‌లోని మెర్క్యూరీ హోటల్, 2016లో ఎస్సార్ నగర్‌లోని మ్యారీగోల్డ్ హోటళ్లలో జరిగిన చోరీ కేసుల్లోనూ జయేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. బంజారాహిల్స్: బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పార్క్ హయత్ హోటల్ నుంచి రూ.40 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయిన ‘స్టార్ చోర్’ జయేష్ రావ్జీ సెజ్పాల్ను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.30 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. పోలీసుల విచారణ లో మిగిలిన రూ.10 లక్షల విలువైన వజ్రాల ఆభరణాన్ని ముంబైలో తాకట్టు పెట్టినట్లు అంగీకరించాడు. మంగళవారం అరెస్టు చేసిన నిందితుడిని బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం జయేష్‌ను తమ కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 10 రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2003 నుంచి స్టార్ హోటళ్లను టార్గెట్‌గా చేస్తూ ముంబైతో పాటు 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 32 చోరీలు చేసిన జయేష్ ఆ సొత్తు మొత్తాన్ని ముంబైలోని బోరేవాలి ప్రాంతానికి చెందిన హిరేన్ ఎం.షాకు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. పార్క్ హయత్ నుంచి చోరీ చేసిన సొత్తులో రూ.10 లక్షల విలువైన వజ్రాభరణాన్ని కేవలం రూ.1.8 లక్షలకే హిరేన్‌కు అమ్మినట్లు తెలిపాడు. ఇతగాడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ముంబైకి తరలించి హిరేన్ నుంచి సొత్తు రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. పార్క్ హయత్‌తో పాటు 2014లో అబిడ్స్‌లోని మెర్యూ్కరీ హోటల్, 2016లో ఎస్సార్ నగర్‌లోని మ్యారీగోల్డ్ హోటళ్లలో జరిగిన చోరీ కేసుల్లోనూ జయేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి హిరేన్ నుంచి సొత్తును రికవరీ చేయాలని నిర్ణయించారు. భారీ స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న జయేష్ నుంచి చోరీ సొత్తు ఖరీదు చేస్తున్న హిరేన్ పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. మరోవైపు జయేష్ అరెస్టు విషయం తెలుసుకున్న కోల్‌కతా పోలీసులు అక్కడి కేసులో పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2004–05లో ‘స్టార్ నేరం’లోనే ఇతగాడు చెన్నై పోలీసులకు చిక్కాడు. అప్పట్లో అక్కడి పోలీసులు ఇతడిపై టీపీడీఏ (తమిళనాడు ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్) ప్రయోగించి 14 నెలలు జైల్లో ఉంచారు. జయేష్‌ను బంజారాహిల్స్ పోలీసులు ముంబై సమీపంలోని థానేలోని ఓ లాడ్జిలో బస చేసి ఉండగా పట్టుకున్నారు. తన వద్ద ఉన్న సొమ్ముతో జల్సా చేస్తున్న ఇతగాడు ప్రస్తుతం నడుస్తున్న టీ–20 ట్రై సిరీస్ నేపథ్యంలో బెట్టింగ్స్ కాయడంతో బిజీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు ప్రశ్నించినప్పుడు... ‘భారీ మొత్తం బెట్టింగ్స్ కాస్తాను సార్. అది గేమ్ ఆఫ్ లక్... ఒక్కోసారి డబ్బులు వస్తాయి. అనేకసార్లు పోతాయి. మొత్తమ్మీద బెట్టింగ్స్‌లో నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ’ అంటూ చెప్పినట్లు తెలిసింది. -
బీ'టెక్' చైన్ స్నాచర్ అరెస్టు
అతను ఉన్నత చదువు చదివాడు. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన సమయంలో అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చోరీలు చేయడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. తిరుపతి క్రైం : బీటెక్ చదివి చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న దొంగను అర్బన్ జిల్లా క్రైం పోలీసులు బుధవారం సాయంత్రం తనపల్లిలోని మార్కెట్ యార్డు వద్ద అరెస్టు చేశారు. క్రైం పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. తిరుచానూరులోని కొత్తపాలెం లేఔట్లో నివాసముంటున్న కాటయ్య కుమారుడు కంపా ఈశ్వర్‌కిశోర్ (29) 2010లో బీటెక్‌లో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం పలు పరీక్షలు రాశాడు. ఇందుకోసం తిరుపతి నగరంతోపాటు నంద్యాలలోని కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతోపాటు జల్సాలకు అలవాటుపడి తిరుపతికి చేరుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మొదట బ్యాగుల దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బులు తీసుకుని నంద్యాలకు వెళ్లిపోయాడు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తప్పించుకుని తిరిగాడు. మళ్లీ తిరుపతికి చేరుకుని.. 2013 నుంచి 2015 వరకు తిరుపతిలో ఉంటూ ఉద్యోగాల కోసం ముమ్మరంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో డబ్బు అవసరాల కోసం తిరిగి చైన్ స్నాచింగ్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి తన ద్విచక్ర వాహనంలో వెళుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జల్సాలకు అలవాటు పడిన ఈశ్వర్ కిశోరే చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతనిపై తిరుపతి క్రైం పోలీసు స్టేషన్లో 7, ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్లో 7, ఎస్వీయూ పోలీసు స్టేషన్లో 2, శ్రీకాళహస్తి టూటౌన్లో ఒకటి, తిరుచానూరులో 2 మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. నిందితుడు ఈశ్వర్ కిశోర్ నగలను అమ్మి వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చేవాడు. ఈ నెల 7న స్నేహితులు డబ్బు కావాలని అడగడంతో తన వద్ద ఉన్న బంగారు నగలు అమ్మేందుకు బయలుదేరాడు. సమాచారం అందుకున్న క్రైం సీఐ మధు చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.13.40 లక్షలు విలువ చేసే 383 గ్రాముల బంగారు ఆభరణాలు, 422 గ్రాముల వెండి, రూ.1.70 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మొదటి సారి డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నిందితుడు ఈశ్వర్‌కిశోర్ ఇన్ని దొంగతనాలకు పాల్పడ్డా ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదన్నారు. 2017లో జరిగిన 16 చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సీఐలు అబ్బన్న, శరత్చంద్ర, భాస్కర్‌రెడ్డి, పద్మలత, ఎస్ఐలు రమేష్‌బాబు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా క్రైం పార్టీ ఇన్చార్జి అబ్బన్న, ఎస్ఐ రమేష్‌బాబు, ఐడీ పార్టీ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని, వీరందరికీ అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి ద్వారా రివార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో కష్టపడిన సిబ్బంది స్వయం ప్రకాష్, రవిప్రకాష్, గౌరినాయుడులను ప్రత్యేకంగా అభినందించారు. -
దొంగగా మారిన కార్పెంటర్
ఒంగోలు క్రైం: జిల్లా వ్యాప్తంగా మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను కందుకూరు పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. మొత్తం మీద పది ఇళ్లలో చోరీలు చేసి దర్జాగా తిరుగుతున్న వ్యక్తిని కటకటాల వెనక్కు నెట్టారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఐటీ కోర్ సెంటర్లో జఎస్పీ బి.సత్య ఏసుబాబు సోమవారం సాయంత్రం విలేకరులకు వివరాలను వెల్లడించారు. కందుకూరు పట్టణంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్న అక్కల శివ కోటయ్య గత మూడేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తున్నాడు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఈ నేపథ్యంలో స్థానిక మహదేవపురం రోడ్డులో అరెస్ట్ చేసిన కందుకూరు పోలీసులు అతని వద్ద నుంచి 43 సవర్ల బంగారు ఆభరణాలు, మూడు కేజీల వెండి, ఒక బొలేరో వాహనం, రూ. 80 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 15.63 లక్షలు ఉంటుంది. కందుకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి వెనుక వైపు నివాసం ఉంటున్న అక్కల శివ కోటయ్య స్వతహాగా కార్పెంటర్. అయితే మద్యానికి బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు కందుకూరు వడ్డిపాలెంలో ఉంటుండగా రెండో భార్య చీమకుర్తిలో ఉంటోంది. రెండు కాపురాలను చేయాల్సి రావడం.. జల్సాలకు అలవాటు పడిటం వల్ల దొంగగా మారాడు. 2015లో కందుకూరు నందావారి వీధిలో, 2017లో కందుకూరు నాంచారమ్మ కాలనీలో, చీమకుర్తి విజయ దుర్గా వైన్ షాపులో, కందుకూరు కోటిరెడ్డి నగర్లో, కందుకూరు పామూరు రోడ్డులో, కందుకూరు రూరల్ వెంకటాద్రిపాలెంలో, కందుకూరు వడ్డిపాలెంలో, చీమకుర్తిలోని ఎన్ఎస్పీ కాలనీలో, కందుకూరులోని తేలుప్రోలు వారి వీధిలో, 2018లో కందుకూరు ఆర్డీఓ కార్యాలయం వెనుక వైపు దొంగతనాలు చేశాడు. పోలీసులకు అభినందన మూడేళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న కందుకూరు పోలీసులను ఎస్పీ సత్య ఏసుబాబు అభినందించారు. కందుకూరు సీఐ నరిసింహారావుతో పాటు ఎస్సైలను, సిబ్బందికి రివార్డులు అందించారు. -
యాప్‌తో ఆటకట్టు
కర్నూలు: లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్) ద్వారా పోలీసులు జిల్లాలో తొలిసారిగా ఓ దొంగను గుర్తించి అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగర శివారులోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని శ్రీరామ కాలనీలో నివాసముంటున్న సీతారామయ్య రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అనంతపురం వెళ్లాడు. ఆయన కోరిక మేరకు ఇంట్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాను ఏర్పాటు చేశారు. దొంగ ఇంట్లోకి దూరగానే కంట్రోల్ రూమ్‌లో బజర్ మోగింది. ఘటన స్థలాన్ని సమీపిస్తుండగానే పోలీసు వాహనం సైరన్ శబ్దాన్ని దొంగ గుర్తు పట్టి గోడదూకి పారిపోయాడు. ఈనెల 8న నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇంటి యజమాని సీతారామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 457, 380 రెడ్ విత్ 511, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బుధవారపేటకు చెందిన పాత నేరస్తుడు కాశెపోగు అశోక్‌ను నిందితుడిగా గుర్తించారు. మంగళవారం కృష్ణానగర్ జంక్షన్లో తిరుగుతుండగా బ్లూ కోల్ట్సŠ, క్యూఆర్టీ సిబ్బంది అరెస్ట్ చేశారు. కంట్రోల్ రూమ్ తనిఖీ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పై అంతస్తులో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఎస్పీ గోపీనాథ్ జట్టి మంగళవారం తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అదనంగా రెండు సీసీ కెమెరాల మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్పీలు బాబుప్రసాద్, ఖాదర్ బాషా, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గుణశేఖర్, ఎస్ఐ తిమ్మారెడ్డి ఉన్నారు. -
ఎస్కేప్ కార్తీక్ అరెస్ట్...కిలో బంగారు స్వాధీనం
సాక్షి, బనశంకరి : ఇళ్ల తాళాలు బద్దలుకొట్టి చోరీలకు పాల్పడుతున్న ఘరానాదొంగ కార్తీక్ అలియాస్ ఎస్కేప్ కార్తీక్‌ను శనివారం ఈశాన్యవిభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.30 లక్షల విలువ చేసే బంగారు అభరణాలతో పాటు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అదనపు పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీమంత్‌కుమార్‌సింగ్ వివరాలను వెల్లడించారు. కళ్యాణ నగర ప్రకృతి లేఔట్‌కు చెందిన ఎస్కేప్ కార్తీక్(28) కొత్తనూరు, హసన్, మైసూరు తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేవాడు. పోలీసులకు పట్టుబడిన కార్తీక్ నుంచి రూ.30 లక్షల విలువ చేసే ఒక కిలో బంగారు ఆభరణాలు, మూడు సెల్పోన్లు ను స్వాధీనం చేసుకున్నారు. హెణ్ణూరు కుమార్, జగన్ అనే ఇద్దరి తో కలిసి కార్తీక్ ఇళ్లులో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేవలం 6 తరగతితో చదువుకు స్వస్తిపలికిన కార్తీక్ 16 ఏళ్లు వయసులోనే చోరీలు చేయడం అలవాటు చేసుకున్నాడు. హెణ్ణూరులో ఓ ఇంటి కిటికీ బద్దలు కొట్టి లోనికి చొరబడిన కార్తీక్ రూ.10 లక్షల నగదు అపహరించుకెళ్లాడు. పెద్ద మొత్తంలో ఒకేసారి నగదు లబించడంతో చోరీలనే తన వృత్తిగా ఎంచుకున్నారు. సాయంత్రం సమయంలో తన అనుచరులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లును గుర్తించి రాత్రి సమయంలో తాళం బద్దలు కొట్టి చోరీలకు పాల్పడేవారు. చోరీ సొత్తును అట్టికాగోల్డ్, ముత్తూట్పైనాన్స్, ఇతర కుదువ దుకాణాల్లో కుదవపెట్టడం, బంగారుఆభరణాలు విక్రయించి విలాసవంతమైన జీవనం సాగించేవాడు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు 2007 లో కార్తీక్ ను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జైలులో శిక్ష అనుభవిస్తూ ఖైదీలకు భోజనం సరఫరా చేయడానికి వచ్చిన కార్తీక్ ఇస్కాన్ సంస్ధ భోజనం అందించే వాహనంలో దాక్కుని పరారయ్యాడు. పరప్పన అగ్రహర పోలీసులు తీవ్రంగా గాలించి 45 రోజుల అనంతరం కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇతడికి ఎస్కేప్ కార్తీక్ గా పేరుపొందాడు. ఇప్పటివరకు ఇతడిపై నగరంతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్లులో 70కి పైగా కేసులు నమోదు అయ్యాయని సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు.