Uday Kiran
-
హీరో ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలు.. ఈ రోజే ఎందుకంటే? (ఫొటోలు)
-
వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. ఆ సూపర్ హిట్ సినిమా మళ్లీ!
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. యూత్‌లో అతని మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మనందరికీ దూరమయ్యారు. కానీ ఎప్పటికీ అతని నటించిన సినిమాలను ఇప్పటికి ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఉదయ్ కిరణ్‌ను మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం లభించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవల టాలీవుడ్లో పాత సినిమాలను రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా మళ్లీ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ సినిమా 2001వ సంవత్సరం ఆగస్టు 10న రిలీజై అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా మార్చి 21న థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతోంది. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులు మరోసారి థియేటర్లో తమ హీరోని చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నువ్వు నేను రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. -
మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకడు. లవ్ స్టోరీలతో చాలా తక్కువ టైమ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ఇతడు.. ఆ తర్వాత సరైన ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడి పుట్టినరోజు లేదా వర్థంతి సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి జనరేషన్ కోసం ఉదయ్ కిరణ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇతడి కల్ట్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?) ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'నువ్వు నేను'. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సునీల్ కామెడీ టైమింగ్, ఆర్పీ పట్నాయక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ లేపాయని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న రిలీజైంది. తొలి ఆట నుంచే సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో అద్భతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తిరిగి థియేటర్లలో ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఈ మార్చి 21న బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఒకవేళ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మ్యాజిక్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకండి. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
Uday Kiran Unseen Photos: తనదైన నటనతో మనల్ని అలరించిన ఉదయ్ కిరణ్ ఫోటోలు
-
నా జీవితంలో మరిచిపోలేని విషాదం.. అయినా వెనక్కి తగ్గలేదు!
టాలీవుడ్లో నువ్వు నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. (ఇది చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) అయితే సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై సందడి చేసింది. హిందీ సీరియల్స్, టీవీ షోలతో బీ టౌన్ ఆడియన్స్ మనసు దోచుకుంది. అంతే కాకుండా యాడ్స్‌లోనూ నటిస్తూ అభిమానులను అలరించింది. 2014లో వ్యాపారవేత్త రోహిత్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా అనిత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. అనిత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను చేసింది కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు. నా కోసం, నేను చేసిన అద్భుతమైన ప్రయాణానికి గుర్తు ఇది. నాకు ఆ టీనేజ్ రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నా జీవితం ఎన్నో కలలు, గందరగోళాల మధ్య సుడిగుండంలా గడిచింది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కేవలం ఒక డైరీలో నా ఆశలు గురించి రాసుకున్నా. కానీ నా జీవితంలో అప్పుడే ఓ విషాదం జరిగింది. నేను నా తండ్రి.. నా హీరోని కోల్పోయాను. ఆ సమయంలో నా దారులన్నీ మూసుకుపోయాయి. కానీ నేను వాటికి భయపడలేదు. కేవలం నా కోసమే కాదు.. నా కుటుంబానికి వెన్నెముకగా మారాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నా. నా కుటుంబంతో గర్వంగా.. ఓ తల్లిగా, ప్రేమగల భర్త, నా బిడ్డే ఇప్పుడు నా ప్రపంచం. నా లైఫ్‌లో ప్రతిరోజును ఆస్వాదిస్తున్నా. అందుకే ఈ రోజు నుంచి నాకు నేనే కృతజ్ఞతలు చెప్పడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నా. నా లైఫ్ ఇంత హ్యాపీగా మారినందుకు నాకు నేనే రుణపడి ఉంటాను.' అంటూ పోస్ట్ చేసింది. తన జీవితంలో ఎన్నో బాధలు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందంటూ అనిత ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. గీతికా తివారి హీరోయిన్. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ అయి తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అతడికి దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే పాపం అనేశాడు తేజ. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి హీరో డెత్ మిస్టరీ రివీల్ చేస్తానన్నారు కదా సర్.. అని అడిగాడు. దీనికి తేజ స్పందిస్తూ.. 'చాలామందికి ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు. కానీ ఎందుకు నాతోనే దాన్ని చెప్పించాలని చూస్తున్నారు. అందరూ ఏమీ తెలియనట్లు అమాయకంగా మీరే చెప్పండని ఎందుకు నటిస్తున్నారో అర్థం కావట్లేదు' అని బదులిచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను. అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకులిచ్చేయ్.. నా ఇద్దరు పిల్లలకు అదే చెప్తా.. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి.. అంతే తప్ప పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని చెప్తాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చులకన చేసే నోరు ఉంటే చురకలు వేసే నోరు కూడా ఉంటుంది -
'నీస్నేహం' మూవీలో ఉదయ్‌కిరణ్ ఫ్రెండ్ ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలుసా?
ఉదయ్‌కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సినిమా నీ స్నేహం. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను పరుచూరి మురళి దర్శకత్వం వహించిగా, కళాతపస్వి కె. విశ్వనాథ్ కీలక పాత్రలో నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారు విజయం సాధించింది. ముఖ్యంగా ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఈ మూవీలోని పాటలన్నిటినీ సిరివెన్నెల రాయడం విశేషం. స్నేహితులిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత నిజం తెలిసి ఫ్రెండ్ కోసం ప్రేమను త్యాగం చేయడం సినిమా కథాంశం. ఈ చిత్రంలో హీరోగా ఉదయ్‌కిరణ్ నటించగా, అతని ఫ్రెండ్ క్యారెక్టర్లో బాలీవుడ్ నటుడు జతిన్ అలరించాడు. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన జతిన్ హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించాడు. తెలుగులో నీ స్నేహం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. -
ఉదయ్ కిరణ్ చావుకు కారణం తెలుసు: తేజ సంచలన వ్యాఖ్యలు
ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు దర్శకుడు తేజ. తనను తెలియని విషయాల జోలికి వెళ్లడు కానీ.. తెలిసిని విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తేస్తాడు. ఇతరుల విషయంలోనే కాదు.. తనకు సంబంధించిన విషయాలో కూడా చాలా ఓపెన్‌గా ఉంటాడు. తాజాగా ఈ క్రియేటివ్ దర్శకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చావుకు కారణాలేంటో తనకు తెలుసని అన్నాడు. తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్‌కిరణ్. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఉదయ్‌కి అవకాశాలు వరుసకట్టాయి. తదుపరి ‘నువ్వు నేను’ అంతకుమించి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'మనసంతా నువ్వే' కూడా భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఆ స్టార్డమ్ ఎక్కువ రోజులు ఉండలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి.. 2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం తనుకు తెలుసని, చనిపోయేలోపు ఆ విషయాలు చెబుతానన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టార్డమ్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ మిస్ కావడం కామన్. నేను దాన్ని తల పొగరు అనుకోలేదు. అమాయకత్వం అనుకున్నా. తను ప్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ లో అవకాశం ఇచ్చా. ఆ సినిమా షూటింగ్ సమయంలో విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా... గుర్తుపెట్టుకొని మరీ సినిమా అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు’ అన్నారు. నేను అవేవి వద్దని చెప్పా. అతని జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నేను చనిపోయేలోపు ఈ విషయాలను వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్దతి కాదు’అని తేజ చెప్పుకొచ్చాడు. తేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఉదయ్ కిరణ్‌తో 5 సినిమాలకు సంతకం చేశా, కానీ: పింకీ
బిగ్‌బాస్ 6 షోలో అందరికీ వంట చేసి పెట్టింది సుదీప. అంతేనా, అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్‌ను కూడా సంపాదించింది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయిన పింకీ బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా మొదటి సినిమా యమ్.ధర్మరాజు ఎమ్ఏ. ఈ సినిమా రచయిత వేమూరి సత్యానారాయణతో మా తాతగారికి పరిచయం ఉంది. ఈ మూవీ కోసం చెన్నై నుంచి తీసుకువచ్చిన వచ్చిన అమ్మాయి సమయానికి చేయనంది. రాజమండ్రిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందంటే చూడటానికి వెళ్లినప్పుడు మా మనవరాలికి ఇంట్రస్ట్ ఉంది, ఏదైనా పాత్ర ఉంటే చెప్పండని తాతగారు అన్నారు. అలా చెన్నై అమ్మాయి హ్యాండివ్వడంతో నన్ను తీసుకున్నారు. సినిమా చాలా పెద్ద హిట్టయింది. 7జి బృందావన కాలనీ కోసం నల్లగా ఉండాలి, సన్నబడాలన్నారు. అందుకోసం రోజూ ఒక గంటసేపు ఎండలో నిలబడేదాన్ని. ఆ తర్వాత ఉదయ్ కిరణ్‌వి 9 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. అందులో ఐదింటికి నేను సంతకం చేశా.. కానీ చాలా చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. అతడు చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. మనం కొంచెం డల్‌గా కనిపిస్తే వెంటనే వచ్చి ఏమైంది? ఏం జరిగింది, ఏదైనా ఇబ్బందా? అని అడిగే తత్వం తనది. సంతోషాన్ని పంచుకోకపోయినా బాధను పసిగట్టి ఓదార్చే మనిషి. అతడితో నేను చేసిన చివరి చిత్రం వియ్యాలవారి కయ్యాలు. ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుని అందరినీ వదిలేసి వెళ్లాడు. కానీ ప్రజల మనసులో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాడు' అని ఎమోషనలైంది సుదీప. చదవండి: పవిత్ర నరేశ్ బ్రేకప్, ఏమైందంటే? కన్ఫ్యూజన్ మాస్టర ఎలిమినేట్ చేదు అనుభవం, కెరీర్ ముగిసిపోయిందనుకున్నా -
'కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది'.. ఉదయ్‌కిరణ్ మృతిపై సదా కామెంట్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉదయ్‌కిరణ్ మృతిపై హీరోయిన్ సదా మాట్లాడుతూ.. 'అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. ఉదయ్ కిరణ్‌తో కలిసి 'ఔనన్నా కాదన్నా' సినిమా చేశాను. అతను ఎంతో మంచి వ్యక్తి. అంత మంచి నటుడ్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది. కానీ ఏం జరిగినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సినిమా అవకాశాల కంటే జీవితమే ముఖ్యం. సమస్యకు చావే పరిష్కారం కాదు.. ఒక యాక్టర్ గా మనం ది బెస్ట్ అవ్వాలి అంతే. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Chalo Premiddam: సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత
‘ఛలో ప్రేమిద్దాం` చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ మరెన్నో సినిమాలు చేయడానికి నాకు మంచి బూస్టప్ ఇచ్చింది’ అన్నారు నిర్మాత ఉదయ్ కిరణ్. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఈనెల 19న విడుదలై పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ థియేటర్స్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా ఈ రోజు సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా ఆర్టిస్ట్స్ , టెక్నీషియన్స్ కారణం. అందరూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇకపైన కూడా మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలను ఈ విధంగానే ఆదరిస్తారని కోరుకుంటున్నా` అన్నారు. (చదవండి: ‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ) దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ...‘మా సినిమాకు విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పాటలు, నేపథ్య సంగీతం, దర్శకత్వం, కామెడీ , నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అంటున్నారు. ఆడియన్స్ తో కలిసి ఫస్ట్ రోజు సినిమా చూశాను. అదుర్స్ రఘు కామెడీ, పోసాని, హేమ మధ్య వచ్చే ఫన్, అత్తారింటికి దారిది ఎపిసోడ్ కు ఆడియన్స్ పడి పడి నవ్వుతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ , శశాంక్ ,నాగినీడు, సిజ్జు పాత్రలు సినిమాకు హైలెట్ అంటున్నారు. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా టీమ్ సపోర్ట్ వల్లే. వర్షాల్లో కూడా మా సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ....‘ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎదురు చూశాను. అందరూ నా పర్ఫార్మెన్స్ , డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. -
లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఛలో ప్రేమిద్దాం’
`ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ శేఖర్ రేపల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను గతంలో రాజీవ్ కనకాలతో `బ్లాక్ అండ్ వైట్`, వరుణ్ సందేశ్ హీరోగా `ప్రియుడు` చిత్రాలు నిర్మించాను. ప్రియుడు సినిమా సమయంలో సురేష్ పరిచయం. ఆ సమయంలోనే తను ఒక మంచి కథ చెప్పాడు . ఆ కథ నచ్చి ` ఛలో ప్రేమిద్దాం` చిత్రం నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రజంట్ ట్రెండ్ కు కనెక్టయ్యే అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఇందులో మంచి లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. దర్శకుడు సినిమాను చాలా బాగా డీల్ చేశారు. ఇది అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.... ‘ఈ చిత్రంలో పంచ భూతాల్లాంటి ఐదు పాటలున్నాయి. భీమ్స్ అంటే ఇప్పటి వరకు అందరూ మాస్ సాంగ్స్ అనుకునే వారు. కానీ, ఈ సినిమాతో భీమ్స్ మాస్ తో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయగలడని ప్రూవ్ చేసే విధంగా పాటలుంటాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా ఛలో ప్రేమిద్దాం చిత్రం ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. -
ఉదయ్‌కిరణ్, తరుణ్‌లతో నన్ను పోల్చకండి : వరుణ్ సందేశ్
Varun Sandesh : హ్యాపీడేస్ చిత్రంతో తొలిసారి తెలుగుతెరకు పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో మరో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వరుణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో వరుణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనుకున్న సమయంలో బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఆటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్-3 నుంచి బయటకు వచ్చిన అనంతరం వరుణ్ నటించిన తొలి సినిమా ఇందువదన. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న వరుణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్‌ను తరుణ్, ఉదయ్‌కిరణ్‌లతో పోల్చవద్దని తెలిపాడు. నాకు ఉదయ్, తరుణ్ బాగా తెలుసు. ఉదయ్‌కు అలా జరగడం చాలా బాధాకారం. కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కెరీర్‌ను అలా పోల్చి చూడలేం. ఇక నా విషయానికి వస్తే..నేను కోల్పోయినదాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. బిగ్‌బాస్ తర్వాత కొన్ని కథలకు సైన్ చేశా. కానీ కోవిడ్ సహా మరికొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక తర్వాత నేను యూఎస్ వెళ్లి ఐటీ కోర్స్ చేశాను. వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉంది అని వరుణ్ వివరించాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన చిత్రంలో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడదులైన మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై ఆకస్తిని కలిగించేలా ఉంది. -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’.. పారితోషికం వేలల్లో, వసూళ్లు కోట్లలో
Uday Kiran First Remuneration: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా ‘చిత్రం’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిన ఉదయ్‌కిరణ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్లు, ప్లాప్‌లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది. 2014లో అతడు ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తొలి సనిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ‘చిత్రం’ మూవీకి ఉదయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సింది. ఉషా కిరణ్ మూవీస్‌లో రామోజీరావు తెరకెక్కించిన ఈ మూవీ 42 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారట. 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతూ 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంతగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ ‘చిత్రం’ మూవీకి ఉదయ్ కిరణ్ కేవలం 11 వేల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట. అంతేగాక ఈ మూవీకి పని చేసిన డైరెక్టర్ తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌లు సైతం అతి తక్కవ రెమ్యునరేషన్‌ను తీసుకోవడం గమనార్హం. అయితే ఈ మూవీలో మొదట హీరోగా మరో వ్యక్తిని ఫైనల్ చేసి హీరో స్నేహితుడి పాత్రలో ఉదయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నాడట. అయితే సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు హీరోగా చేయాల్సిన ఆ వ్యక్తి చివరకు హ్యాండ్ ఇవ్వడంతో తేజ ఉదయ్ కిరణ్‌ను హీరోగా పెట్టి ‘చిత్రం’ మూవీ రూపొందించి టాలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాడు. మరో విషయం ఎంటంటే ఈ మూవీ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాకు కూడా మొదట ఉదయ్‌ను అనుకోలేదట. హీరో మాధవన్‌తో ఈ మూవీ చేద్దామనుకున్నాడట. అప్పటికే మాధవన్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో మళ్లీ ఉదయ్ కిరణ్‌ను హీరోగా తీసుకుని ఈ ‘నువ్వు-నేను’ మూవీని తెరకెక్కించాడు. లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. -
ఉదయ్ కిరణ్ ఆగిపోయిన 10 సినిమాలు ఇవే!
ఒకప్పుడు టాలీవుడ్లో లవర్ బాయ్‌గా ఒ వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. నేడు(జూన్ 26) అతడి జయంతి. ఈ సందర్భంగా ఒకసారి ఉదయ్ సినీ కేరీర్‌పై ఓ లుక్కెద్దాం. ఉదయ్ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ఉదయ్ కిరణ్ సినిమాలన్ని మంచి విజయం సాధించాయి. అలా వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఈ క్రమంలో అతడు నటించిన శ్రీరామ్ మూవీ ప్లాప్ అవ్వడంతో కొంతాకాలం సినిమాలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ ‘ఔనన్నా.. కాదన్నా’ మూవీతో ఉదయ్‌కి మరో హిట్ అందించాడు. దీంతో మళ్లీ ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ గాడిన పడిందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా తర్వాత ఉదయ్‌కి ఆశించిన అవకాశాలు రాలేదు. చేసిన కొన్ని సినిమాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఉదయ్‌కి సినిమాల అవకాశాలు దగ్గడమే కాకుండా అప్పటికే ఉదయ్‌తో తీస్తాన్న పలు ప్రాజెక్ట్స్ కూడా నిలిచిపోయాయి. అయితే ఇందుకు కారణంగా లేకపోలేదు. అయితే ఉదయ్ ఆగిపోయిన ఆ పది క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ సారి చూద్దాం. నర్తనశాల బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అప్పటి హీరోయిన్ సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల మూవీకి సన్నాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సౌందర్య ఆకస్మాత్తు మరణంతో ఈ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. అయితే ఇందులోని కీలక పాత్ర అభిమాన్యుడి కోసం ఉదయ్‌కిరణ్‌ను అనుకున్నారని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో.. ఈ బ్యానర్లో ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాకు తీయాలని భావించారు మేకర్స్. అంతేగాక ఈ చిత్రానకి లవర్స్ అనే టైటిల్‌ను కూడా ఖారారు చేశారట. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా పట్టలెక్కలేకపోయింది. కాగా ఈ బ్యానర్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో తెలుగుతో పాటు పలు తమిళం చిత్రాలు కూడా వచ్చాయి. అంజనా ప్రొడక్షన్స్ సినిమా కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో ఒక సినిమా తీయాలని చర్చించుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ప్రత్యూష క్రియేషన్స్ ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ ఒక సినిమా మొదలు పెడదామని అనుకుని దీనిపై ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాతా ఈ మూవీ అనుకొకుండా ఆగిపోయింది. చంద్రశేఖర్ యేలేటితో.. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన చంద్రశేఖర్ యేలేటి కూడా ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా అనుకున్నారట. ప్రేమంటే సులువు కాదురా ఉదయ్ కిరణ్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో ఓ సినిమా మొదలుపెట్టారు. దాదాపు 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎందుకో తెలియదు కాదు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఆది శంకరాచార్య ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య. ఈ సినిమా పట్టాలెక్కే సమయానికి ఉదయ్ కిరణ్ మార్కెట్ పడిపోయింది. దీంతో నిర్మాతలు సినిమాను ఆపేశారు. జబ్ వి మెట్ తెలుగు రీమేక్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం జబ్ వి మిట్. ఈ మూవీతో హిందీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయ్ కిరణ్, త్రిష హీరోహీరోయిన్లుగా తెలుగులో ఈ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ పట్టాలేక్కలేదు. అయితే తమిళంలో ప్రేమిస్తే భరత్, తమన్నాలతో ‘కందేన్ కందాలయి’గా ఈ మూవీని చిత్రీకరించగా.. తెలుగులోకి ‘ప్రియ.. ప్రియతమా’ పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజుతో ఓ సినిమా ఉదయ్ కిరణ్‌తో మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి సినిమాలు చేసి మంచి హిట్ అందించారు ఎంఎస్ రాజుజ దీంతో ఉదయ్ కిరణ్‌తో హ్యాట్రిక్‌గా మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. తేజతో మరోసారి ఉదయ్ కిరణ్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘చిత్రం’, ‘నువ్వు నేను’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ డైలామా పడిన సమయంలో ‘ఔనన్నా కాదన్న’ సినిమా తీసి హిట్ అందించాడు తేజ. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఉదయ్ కిరణ్‌ను మళ్లీ ఆదుకునేందుకు తేజ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఉదయ్‌కి స్టోరీ లైన్ కూడా చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ సిద్దం చేస్తుండానే ఉదయ్ అనుకొకుండా మృతి చెందాడు. ఉదయ్ మరణాంతరం ఇదే విషయాన్ని తేజ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’
టాలీవుడ్లో యువ నటుడు ఉదయ్ కిరణ్ది ఒక ప్రత్యేకమైన శకం. కెరీర్లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించి.. ‘హ్యాట్రిక్ హీరో’ ట్యాగ్‌ను తన ముందర చేర్చుకున్నాడు. యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రోజుల్లో కెరీర్ డౌన్ ఫాలోతోనే కొనసాగి.. చివరికి ఉదయ్ కిరణ్ జీవితం విషాదంగా ముగిసింది. అయితే ఏ హీరోకైనా కెరీర్లో ఫస్ట్ మూవీ ప్రత్యేకం. అలాగే ఉదయ్‌కు కూడా ‘చిత్రం’ ఉంది. ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... వెబ్‌డెస్క్: ‘చిత్రం.. ది పిక్చర్’ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. కొత్త-పాత ఆర్టిస్టులు, కొత్త టెక్నిషియన్ల కలయికతో రూపుదిద్దుకుంది చిత్రం. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్ అందించిన ఆడియో సాంగ్స్‌తో సగం హిట్ సాధించగా, తేజ యూత్‌ఫుల్ సబ్జెక్ట్ ప్రజంటేషన్‌తో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్‌కు ఈ మూవీ ఒక పాథ్‌ను ఏర్పరిచింది. ఫ్రెండ్ నుంచి.. నిజానికి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్ తేజ. ఈ విషయాన్ని స్వయంగా తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉదయ్ కిరణ్ ముందుగా ఫ్రెండ్స్‌లో ఓ క్యారెక్టర్. హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గడంతో.. ఉదయ్‌ను హీరోగా ముందుకు తెచ్చాడు తేజ. అయితే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో.. ఉదయ్‌ను మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్‌కే సెట్ చేశారు. అయితే షూటింగ్‌కి సరిగ్గా ముందురోజే మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకుని.. తేజ ఉదయ్ కిరణ్‌నే హీరోగా ఫైనలైజ్ చేశాడు తేజ. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్ తడబడడంతో.. పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడట తేజ. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తనకు(తేజ) కావాల్సినట్లుగా యాక్ట్ చేయడం, ‘చిత్రం’ సూపర్ హిట్ కావడం జరిగిపోయానని తేజ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. సబ్జెక్ట్ కొత్తదే, అయినా.. మిడిల్ క్లాస్ కుర్రాడు రమణ(ఉదయ్ కిరణ్), ఫారిన్ రిటర్ని జానకీ(రీమాసేన్).. ఈ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాథే ‘చిత్రం’ థీమ్. టీనేజీ వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ఇందులో చూపించాడు తేజ. పనిలో పనిగా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, అందమైన పాటలు అందించాడు. అయితే కొద్దిపాటి అడల్ట్ థీమ్ ఉండడం, టీనేజీలో గర్భం, పైగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఈ మూవీ రావడంతో క్రిటిక్స్ కొద్దిపాటి విమర్శలు చేశారు. కానీ, యూత్ థియేటర్లకు పోటెత్తడంతో 42 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బంపర్ సక్సెస్ సాధించింది. అప్పటికి ఇరవై ఏళ్ల వయసున్న ఉదయ్ కిరణ్.. ఫ్లస్ టూ స్టూడెంట్ రమణ క్యారెక్టర్‌తో అలరించి చాక్లెట్ బాయ్ ట్యాగ్‌కు తొలి బీజం వేసుకున్నాడు. కన్నడలో 125రోజులు చిత్రం సినిమాను రీమా సేన్‌కు కోలీవుడ్‌లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్ చేశారు. అయితే కోలీవుడ్ వెర్షన్ కోసం మణివణ్ణన్, సెంథిల్, ఛార్లీ, మనోరమా, కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. ఇక 2001లో తెలుగు చిత్రం మూవీ కన్నడలో ‘చిత్ర’ పేరుతో రీమేక్ అయ్యింది. నాగేంద్ర ప్రసాద్, రేఖ వేదవ్యాస(ఆనందం ఫేమ్) లీడ్ రోల్లో నటించిన ఈమూవీ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుని.. థియేటర్లలో 125 రోజులు ఆడింది. చదవండి: ఇరవై ఏళ్ల తర్వాత చిత్రం.. రిపీట్ -
ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం
దివంగత నటుడు, హీరో ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు ఏడేళ్లు అవుతుంది. చివరిసారిగా ఆయన నటించిన మూవీ ‘చిత్రం చెప్పన కథ’. ఉదయ్ కిరణ్ చనిపోయిన రెండు నెలలకు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. కానీ ట్రైలర్ విడుదల అనంతరం ఇందులో హీరోయిన్గా నటించిన మదల్సా శర్మ తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీలలో కలిపి దాదాపు 15 సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ తన సినీ కేరీర్‌కు ప్లస్ అవుతుందని ఉదయ్ తన సన్నిహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగానే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్నేళ్లకు ఈ మూవీని డిజిటల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అయితే 2020లో లాక్డౌన్లో విడుదల చేయాలని చూసినప్పటికీ రేటు విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా ఈ సెకండ్ వేవ్‌లో చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ చివరి సినిమా అయిన ‘చిత్రం చెప్పిన కథ’ కూడా ఎలాగైనా ఓటీటీలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు కాస్త గట్టిగానే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికంగానే ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదరయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. అలాగే ఉదయ్ కిరణ్ చివరి సినిమా కాబట్టి అభిమానులు కూడా చూస్తారని ఓటీటీ సంస్థలు నమ్ముతున్నాయి. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎనిమిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట. -
ఉదయ్ కిరణ్: అభిమానుల ‘మనసంతా నువ్వే’
-
మరోసారి వార్తల్లో ఉదయ్ కిరణ్!
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే చిత్రసీమలోకి ప్రవేశం.. అనతికాలంలోనే స్టార్డమ్.. ఆఫర్లు క్యూ కట్టాయి.. విజయాలు అతడి వాకిట నిలిచాయి.. అవార్డులు దాసోహయ్యాయి.. ‘హ్యాట్రిక్ హీరో’ అనే పదం పురుడుపోసుకుంది అతడిని చూశాకనే.. చిన్న వయసులోనే అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు.. కమల్‌హాసన్ తర్వాత అతిచిన్న వయసులో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు.. కానీ ఎవరూ ఊహించని విధంగా త్వరగానే తనువు చాలించాడు.. అతడే హీరో ఉదయ్ కిరణ్.. మరణానికి కారణాలు ఏంటో తెలియవు.. ఉన్న అనుమానాలకు సాక్ష్యాలు లేవు.. నేడు ఉదయ్ కిరణ్ 40వ జయంతి.. ఫిల్మ్ ఇండస్ట్రీ మర్చిపోయినా.. హీరోహీరోయిన్లు తలచుకోకున్నా.. అభిమానులు తమ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ తమ అభిమాన హీరోను ఒక్కసారిగా గుర్తుచేసుకుంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. (మనసును కలిచివేస్తోంది: చిరంజీవి) ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత చేసిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో హ్యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్ డైరెక్టర్లు, పెద్ద నిర్మాణ సంస్థలు, క్రేజీ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో సంచలనాలకు నాంది పలికాడు. సహచర నటీనటులతో మంచి సాన్నిహిత్యం.. ఎలాంటి రిమార్క్ లేని నటుడిగా పేరు గాంచాడు. కేరీర్ గ్రాఫ్ హైలెవల్లో ఉండగా కొన్ని ఊహించని మలపులు అతడి భవిష్యత్‌ను చిన్నాభిన్నం చేశాయి. ఆ తర్వాత కోలుకోలేదు. సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. నిర్మాణంలో ఉన్న సినిమాలు ఆగిపోయాయి. స్టార్డమ్ పోయింది.. చేతిలో సినిమాలు లేవు. దీంతో డిప్రెషన్ ఆవహించింది. జనవరి 5,2014న శ్రీనగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగునాట పెద్ద సంచలనంగా మారింది. (మరి మీరు ఎటువైపు?: నాని) ఉదయ్ కిరణ్ తనువు చాలించి ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జనం గుండెల్లో భద్రంగా నిలిచే ఉన్నాడు. ఏ యువ హీరో (బ్యాక్‌గ్రౌండ్ లేకుండా) సినిమా వచ్చినా.. సినిమా వాళ్లు ఎవరు మరణించినా.. ఆ క్షణం అందరికీ ఉదయ్ కిరణే గుర్తొస్తాడు. అభిమానులు కన్నీరు కారుస్తారు. తాజాగా బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఉదయ్ కిరణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వీరిద్దరికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే చిన్నవయసులోనే అర్థంతరంగా వాలిపోయారు. ఇద్దరి మరణానికి ఒక్కటే కారణం డిప్రెషన్(అందరూ బయటకు చెప్పే కారణం). సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా మాదిరిగానే ఈ తెలుగు హీరో నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’ కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..) -
రంగుల ప్రపంచం వెనుక విషాదాలెన్నో..
రంగుల ప్రపంచం వెనుక ఎన్నో విషాదాలు దాగిఉంటాయి. అవి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అందమైన సినీ ప్రపంచానికి చెందిన ఎంతో మంది నటీనటుల కెరీర్ కష్టాల్లో పడగానే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. తాజాగా జరిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కూడా అలాంటిదే. రంగుల ప్రపంచంలో ఎన్నో కలలు కని చివరికి అర్ధాంతరంగా జీవితాలను ముగించిన కొందరి జీవితాలను పరిశీలిస్తే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ధోనీ సినిమాతో దేశవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో సడన్‌గా చనిపోవడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆయన సూసైడ్‌కి కారణం తెలియలేదు. కొద్ది రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 'పవిత్ర రిస్తా' టీవీ సీరియల్‌తో పాపులర్ అయిన 34 ఏళ్ళ సుశాంత్.. 'కైపోచే' మూవీతో తన సినీ ఆరంగ్రేట్రం చేశాడు. చివరిసారిగా 'డ్రైవ్' చిత్రంలో నటించాడు. ప్రేక్ష మెహతా యువ హిందీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రేక్ష బలవన్మరణానికి పాల్పడ్డారు. క్రైం పెట్రోల్, లాల్ ఇష్క్, మేరి దుర్గ వంటి టీవీ షోలలో ప్రేక్ష నటించారు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ప్యాడ్ మ్యాన్‌లోనూ ఒక పాత్ర పోషించారు. 25 సంవత్సరాల చిన్న వయసులో 2020 మే 25న తన జీవితాన్ని ముగించింది. కుశల్ పంజాబీ హిందీ నటుడు కుశల్ పంజాబీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ రియాలిటీ షో జోర్ కా జట్కాలో విజేతగా నిలిచిన కుశల్ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రంగనాథ్ ప్రముఖ సినీనటుడు, రచయిత రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌లోనూ నటించిన రంగనాథ్‌కి రచయితగా, సాహితీవేత్తగానూ మంచి పేరుంది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకి దాదాపు 15 ఏళ్లపాటు సపర్యలు చేసిన రంగనాథ్.. ఆమె మృతి తర్వాత ఒంటరితనానికి గురయ్యారు. ఆ డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. విజయ్ సాయి టాలీవూడ్ హాస్యనటుడు విజయ్ సాయి కూడా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. యూసఫ్ గూడ లో నివాసముంటున్న సాయి అతని అపార్ట్ మెంట్ లో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయిలు-అబ్బాయిలు, బొమ్మరిల్లు, మంత్ర, అల్లరి, ధనలక్ష్మి తలుపు తడితే, ఒకరికి.. ఒకరు తదితర చిత్రాల్లో విజయ్ సాయి నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడమూ, మానసిక ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని వార్తలు వచ్చాయి. ఉదయ్ కిరణ్ ఈ పేరు వినగానే మనకు చిన్న చిరునవ్వు మొహంపై ఉన్న ఓ రూపం కళ్లముందు కనిపిస్తుంది. ఈ హీరో తెలుగు ఇండస్ట్రీలో వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు. కారణాలు తెలియదు కానీ అప్పటి వరకు చేతినిండా సినిమాలతో ఉన్న ఆయన ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. గొప్ప నటుడు అవుతాడనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. -
రాత్రి ఫోన్ రావడంతో వెళ్లాడు.. తిరిగి రాలేదు
యాదాద్రి భువనగిరి, రాజాపేట (ఆలేరు) : యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జెల్ల పెద్దోళ్లశ్రీనివాస్, వసంతకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు ఉదయ్‌కిరణ్ (19) రాజాపేటలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా ఆదివారం రాత్రి ఫోన్ రావడంతో ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ తరుణంలో తమ వ్యవసాయ బావివద్ద ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు ఇతరుల సాయంతో కిందికి దించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఉదయ్‌కిరణ్ మృతిపై అనుమానం ఉందని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉదయ్ కిరణ్ బయోపిక్.. స్పందించిన సందీప్
ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివంగత హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కుతుందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో హీరో సందీప్ కిషన్ నటిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలను సందీప్ ఖండించారు. ఉదయ్‌కిరణ్ బయోపిక్ గురించి తనను ఎవరు సంప్రదించలేదని సందీప్ స్పష్టం చేశారు. ఇప్పట్లో తనకు బయోపిక్‌లు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు. కాగా, చిన్న వయసులోనే హీరోగా ఓ వెలుగు వెలిగిన ఉదయ్‌కిరణ్.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గతంలో కూడా దర్శకుడు తేజ.. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తేజ వాటిని ఖండించారు. -
సినీ నటుడు ఉదయ్ కిరణ్‌పై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: తప్పుడు పత్రాలతో ఇంటి కిరాయి అగ్రిమెంట్ చేసుకోవడమేగాక ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్న సినీ నటుడు ఉదయ్ కిరణ్ నండూరి(ఫేస్బుక్ హీరో)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్‌పేట్‌కు చెందిన శివ ప్రసాద్ కలాని అనే వ్యాపారికి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 59లోని నందగిరిహిల్స్ ఆదిత్యహిల్స్లో ఫ్లాట్ ఉంది. ఈ నెల 23న ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకునేందుకు సినీ నటుడు ఉదయ్ కిరణ్ నండూరి తప్పుడు గుర్తింపు పత్రాలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అగ్రిమెంట్ అనంతరం ఉదయ్ కిరణ్‌కు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా డ్రగ్స్, కారు దొంగతనం కేసుల్లో పీడీయాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించాడు. దీంతో ఆయన ఉదయ్ కిరణ్‌కు ఫోన్ చేసి తాను ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వడం లేదని చెప్పగా, అయితే అప్పటికే లగేజీతో సహా ప్లాట్ వద్దకు వచ్చిన ఉదయ్‌కిరణ్ వాచ్మెన్ వద్ద తాళంచెవులు తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో వాచ్‌మెన్‌ను తోసేసి ఫ్లాట్‌లోకి వెళ్ళడమే కాకుండా తననే ఫ్లాట్ ఖాళీ చేయమంటావా అంటూ 20 మంది గూండాలతో కలిసి యజమాని శివప్రసాద్ కలానిని బెదిరించాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఖాళీ చేయబోనని హెచ్చరించారు. దుబాయ్‌లో ఉండే ఎన్ఆర్ఐ మంగీలాల్ కలారికి చెందిన ఈ ఫ్లాట్ వ్యవహారాలను తానే చూస్తుంటానని అక్రమంగా ఫ్లాట్‌లోకి చొరబడ్డ ఉదయ్‌కిరణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్‌ల క్రేజ్ కనిపిస్తోంది. మహానటి సక్సెస్‌తో మరిన్ని జీవితగాథలను వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే గత రెండు రోజులుగా ఆసక్తికర కథనాలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుందని, దీనికి తేజ దర్శకత్వం వహించబోతున్నాడని, ‘కాబోయిన అల్లుడు’ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశాడని ఆ కథనాల సారాంశం. అయితే ఆ వార్తలపై ఎట్టకేలకు దర్శకుడు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తాను తీయట్లేదని, అదంతా రూమర్ అని ఆయన నవ్వేశారు. దీంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లైంది. ఉదయ్ కిరణ్ కెరీర్‌కు తేజ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చిత్రం తీయబోతున్నాడంటూ కథనాలు అల్లేశారు. అయితే తన తర్వాతి చిత్రం మాత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్లోనే ఉండబోతుందని తేజ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి అర్థంతరంగా తప్పుకున్న తేజ.. దగ్గుబాటి రానాతో తేజ యుద్ధ నేపథ్యంలో ఓ చిత్రం ఫ్లాన్ చేస్తున్నాడంటూ ఆ మధ్య ఓ టాక్ వినిపించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్
పబ్‌పై దాడి కేసులో అరెస్టయిన 'ఫేస్బుక్' సినిమా హీరో ఉదయ్‌కిరణ్‌ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. వెంటనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని జడ్జి ఆదేశించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఉదయ్‌కిరణ్ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యాడు. అయితే విచారణ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని జైలు అధికారులు తెలిపారు. దాంతో వెంటనే అతడిని మానసిక వైద్యులకు చూపించి.. వారి నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. తనను పబ్‌లోకి అనుమతించడం లేదన్న ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి, లోపల నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మార్చి 23వ తేదీ రాత్రి అతడు ఓవర్ ద మూన్ పబ్‌కి వెళ్లగా.. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.