vandalised
-
Canada: హిందూ ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలు
కెనడాలో మరోమారు హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఎడ్మంటన్‌లోని ఓ ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలు రాశారని హిందూ అమెరికన్ ఫౌండేషన్ తెలియజేసింది.ఈ ఘటనలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య బెదిరింపులకు గురయ్యారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో.. కెనడాలోని ఎడ్మంటన్లోగల బీఏపీఎస్ దేవాలయం వారి తాజా లక్ష్యం అని కెనడియన్ హిందూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లోని కొద్దిమంది హిందూ ఎంపీలలో ఒకరైన ఆర్య ఈ ఉదంతంలో బెదిరింపులకు గురయ్యారు. దీనిపై ఇక్కడి హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కెనడాలో హిందూ దేవాలయాలపై దాడుల ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయని ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. తాజాగా ఎడ్మంటన్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయం దాడుల బారిన పడిందన్నారు. గతంలో గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని పలు ప్రదేశాలలో గల హిందూ దేవాలయాలపై భారతదేశ వ్యతిరేక నినాదాలు కనిపించాయని చంద్ర ఆర్య పేర్కొన్నారు. -
ఢిల్లీ జల్‌బోర్డు ఆఫీసు ధ్వంసం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత పరిస్థితులు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం(జూన్16) ఛాతర్‌పూర్‌లోని ఢిల్లీ జల్‌బోర్డు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగి విధ్వంసం సృష్టించారు.ఆఫీసులో సామాగ్రి పగులగొట్టి చిందరవందరగా పడేశారు. అయితే జలమండలి ఆఫీసుపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఆరోపించింది. దాడి చేస్తున్న వారిలో ఒక వ్యక్తి కాషాయ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది.BJP के नेताओं और कार्यकर्ताओं की सरेआम गुंडागर्दी ‼️देखिए कैसे ‘BJP ज़िंदाबाद’ के नारे लगाते हुए दिल्ली जल बोर्ड के दफ़्तर को तोड़ रहे हैं बीजेपी के कार्यकर्ता👇एक तरफ़ हरियाणा की BJP सरकार दिल्ली के हक़ का पानी रोके हुए है तो वहीं दूसरी तरफ़ बीजेपी दिल्ली की जनता की संपत्ति… pic.twitter.com/nVEWLdDwGA— AAP (@AamAadmiParty) June 16, 2024 ‘బీజేపీ జిందాబాద్ అని నినాదాలు చేసుకుంటూ జలమండలి ఆఫీసును ఎలా పగులగొడుతున్నారో చూడండి. ఓ వైపేమో హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు తాగేందుకు నీళ్లివ్వకుండా ఆపుతుంది. మరోవైపు ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తారు’అని ఆప్ ఎక్స్(ట్విటర్)లో దాడి వీడియోను పోస్టు చేసింది. -
జీ7సమ్మిట్‌కు ముందు.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం
రోమ్: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ విదేశీవ్యవహారాల శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వత్రా తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే విగ్రహ శిథిలాలను ఇటలీ ప్రభుత్వం అక్కడినుంచి తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించింది.ప్రధాని మోదీ జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్న తరుణంలో ఈ దుశ్చర్యకు తీవ్రవాదులు ఒడిగట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇటలీలోని ఎపులియాలో జూన్ 13 నుంచి 15దాకా జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జీ7లో భారత్ సభ్య దేశం కానప్పటికీ మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్నారు. -
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు. -
దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీల నినాదాలు..
కెనడాలో ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రిటీష్ కొలంబియాలో అతి పురాతనమైన లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఆలయ గోడలు, గేట్లపైన ఖలిస్థానీ పోస్టర్లు అంటించారు. ఇటీవల మరణించిన ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలు ఆ పోస్టర్లపై అంటించి ఉన్నాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పోస్టర్లు అంటిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ముసుగులు ధరించి ఉన్న నిందితులు.. వరసగా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది కెనడాలో ధ్వంసం అయిన నాలుగో దేవాలయం ఇది కావడం గమనార్హం. భారతీయులకు వ్యతిరేకంగా విధ్వేషాలను రెచ్చగొట్టడంపై మేయర్ కిర్క్ ప్యాట్రిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు దేవాలయంలో అంటించిన పోస్టర్లపై 'జూన్ 18న జరిగిన ఘటనలో భారత పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తుంది' అని రాసి ఉంది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా నిజ్జర్ పనిచేశాడు. ఇతన్ని కెనడాలోని సుర్రేలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ కాకర్.. మరింత ఆలస్యంగా ఎన్నికలు! -
కెనడాలో ఆలయం వద్ద విద్వేష ఘటన
టొరొంటో: హిందూ వ్యతిరేక శక్తులు కెనడాలో మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. ఒంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్ నగరంలోని బాప్స్ స్వామినారాయణ ఆలయ గోడపై భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఇందుకు పాల్పడ్డవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. దీన్ని ఒట్టావాలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. జనవరిలో సైతం కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్ నగరంలోని గౌరీశంకర్ ఆలయంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గతేడాది సైతం కెనడాలో ఇలాంటి మూడు ఘటనలు జరిగాయి. కెనడా గణాంకాల ప్రకారం 2019–2021 మధ్య మత, లింగ, జాతివిద్వేష నేరాలు 72 శాతం పెరిగాయి. కెనడా జనాభాలో 4 శాతమున్న భారతీయుల్లో ఇవి అభద్రతను పెంచుతున్నాయి. ఈ శక్తులకు అడ్డుకట్టవేయాలని కెనడా సర్కార్‌ను భారత్ కోరింది. -
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై గుర్తుతెలియని దుండగులు విధ్వంస కాండకు తెగబడ్డారు. రాత్రికి రాత్రే పక్కా ప్రణాళికలతో విరుచుకుపడి.. థకూర్గావ్ రీజియన్ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. చీకట్లను ఆసరాగా చేసుకుని.. రీజియన్ పరిధిలోని మూడు చోట్ల ఉన్న హిందూ దేవాలయాలపై కొందరు ఆగంతకులు దాడులకు తెగబడ్డారు. సుమారు 14 చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని బలియాదంగికు చెందిన హిందూ కమ్యూనిటీ నేత వైద్యనాథ్ బర్మన్ వెల్లడించారు. కొన్ని చోట్ల విగ్రహాలను పగలకొట్టారని, మరికొన్ని చోట్ల విగ్రహాలను పెకలించి.. దగ్గర్లో ఉన్న కొలనులో పడేశారని తెలిపారాయన. గతంలో ఇలాంటి ఘటనలు ఏం జరగలేదని.. అక్కడున్న ముస్లిం ప్రజలు కూడా స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారని.. కానీ, ఏనాడూ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని యూనియన్ పరిషత్ చైర్మన్ సమర్ ఛటర్జీ తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం మధ్య ఈ దాడులు కొనసాగాయని బలియాదంగీ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, దాడి వెనుక కారణాలను రాబట్టాల్సి ఉందని స్థానిక పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ దాడులను ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అన్నదమ్ముల్లాగా మెదులుతున్న తమ మధ్య చిచ్చుపెట్టే యత్నం చేసిన వాళ్లెవరినీ వదలకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు ముస్లిం సంఘాల పెద్దలు. ప్రశాంతంగా ఉన్న చోట.. అల్లకల్లోలం సృష్టించేందుకే దాడులు జగిరి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు థాకూర్‌గావ్ పోలీస్ చీఫ్ జహంగీర్ హోస్సేన్. దుండగులు ఎవరైనా సరే.. కఠిన చర్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లోని హిందూ ఆలయాలపై ఈ మధ్యకాలంలో దాడులు జరిగిన సంగతి తెలిసే ఉంటుంది. -
వర్షం ఎఫెక్ట్.. యాదాద్రి భక్తులకు చేదు అనుభవం
సాక్షి, యాదాద్రి భువనగిరి: అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. కాగా, చిన్నపాటి వర్షానికే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్యూలైన్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం కురిసిన చిన్నపాటి వర్షానికే యాదాద్రిలో రోడ్లు కుంగిపోయాయి. పలు చోట్ల కుంగిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లు, అధికారుల పనితనంపై భక్తులు మండిపడుతున్నారు. ఒక్క వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం -
న్యూయార్క్‌లో బాపూజీ విగ్రహం ధ్వంసం
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అమెరికాలో అవమానం జరిగింది. న్యూయార్క్ నగరంలో మాన్‌హట్టన్ సమీపంలోని యూనియన్ స్క్వేర్‌లో ఉన్న గాంధీజీ నిలువెత్తు విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 4 రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 1980వ దశకంలో న్యూయార్క్ నగరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశం వెలుపల గాంధీజీ విగ్రహాలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి కావడం గమనార్హం. గాంధీజీ విగ్రహం ధ్వంసం చేయడం పట్ల గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (గోపియో) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని గోపియో అధ్యక్షుడు శివేందర్ సోఫాట్ డిమాండ్ చేశారు. ఈ తప్పుడు పనికి పాల్పడిన వారిని త్వరగా గుర్తించాలంటూ న్యూయార్క్ మేయర్‌ని డిమాండ్ చేశారు. On Mahatma Gandhi statue in New York City being defaced:@MEAIndia @IndianEmbassyUS @DrSJaishankar @NYCMayor @NYPDPC @globalnyc pic.twitter.com/Sr0Q2RQIWn — India in New York (@IndiainNewYork) February 5, 2022 -
కుప్పంలో టీడీపీ దౌర్జన్యకాండ: వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేశారు. గుడిపల్లి మండలంలోని కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’
రామడుగు (చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేట ప్రధాన చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెతో పాటు వారం క్రితం నిర్మించిన వైఎస్సార్టీపీ జెండా గద్దెను సోమవారం స్థానిక సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న పంచాయతీ సిబ్బందితో తొలగించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై వివేక్, ట్రెయినీ ఎస్సై నరేశ్, సిబ్బంది గోపాల్‌రావుపేటకు చేరుకొని టీఆర్ఎస్ నాయకులతోపాటు సర్పంచ్‌కు నచ్చ జెప్పి పంపించారు. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం) అనంతరం కూల్చిన స్థలంలోని టీఆర్ఎస్ నాయకులు గద్దె నిర్మించి జెండా ఎగురవేశారు. కాగా ఘటనపై వైఎస్సార్టీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కో-కన్వీనర్ తడగొండ సత్యరాజ్‌వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై గోపాల్రావుపేట సర్పంచ్‌పై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని జితేందర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్టీపీ జెండాను కూల్చివేసిన సర్పంచ్‌ను తక్షణం అధికారులు సస్పెండ్ చేయాలని సత్యరాజ్‌వర్మ ప్రకటనలో డిమాండ్ చేశారు. గద్దె కూల్చివేత, సర్పంచ్ అవినీతిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు గ్రామంలో వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్ -
పెళ్లి విందులో చిందులు.. నేలకొరిగిన ‘మహాత్ముడు’
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం గాజులగూడెం గ్రామంలో పెళ్లి విందులో చిందులు వేస్తున్న కొంతమంది యువకులు ఆదివారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహానికి తగలడంతో అది కింద పడిపోయింది. అయినా సంఘటనకు కారకులైన వారిలో పశ్చాత్తాపం కనిపించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా మాజీ సర్పంచ్ బాలాగౌడ్ మాట్లాడుతూ విగ్రహాన్ని పునరుద్దరిస్తామని తెలిపారు. పెళ్లి కావడం లేదని.. వెల్దుర్తి(తూప్రాన్): వివాహం కావడం లేదని ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కానికె రమేశ్ కుమారుడు గణేష్(24) పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారు జామున చూసేసరికి గణేష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించాడు. వివాహం కావడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు. చదవండి: బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు -
అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించింది. ఇది హేయమైన చర్య అని తెలిపింది. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికాలో డేవిస్ పట్టణంలో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. అంతర్జాతీయంగా శాంతి, సమానత్వానికి ప్రతీకగా ఉన్న గాంధీ విగ్రహం కూల్చివేత హేయమైనదని భారత్ పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం కూడా స్పందించింది. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని డేవిస్ మేయర్ ప్రకటించారు. కాగా, 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్క్‌లో దీనిని ప్రతిష్టించారు. ఇక నేడు మహాత్మాగాంధీ వర్ధంతి అని తెలిసిందే. On 28 Jan'21, Mahatma Gandhi statue at Central Park in City of Davis, California was vandalised by unknown persons. Statue was a gift by Govt of India in '16. The Govt strongly condemns this malicious & despicable act against a universally respected icon of peace & justice: MEA pic.twitter.com/vEy0I33gpV — ANI (@ANI) January 30, 2021 -
రెస్టారెంట్ ధ్వంసం.. విద్వేషపూరిత రాతలు
వాషింగ్టన్: న్యూ మెక్సికోలోని సాంటే ఫే నగరంలో ఒక భారతీయ రెస్టారెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. రెస్టారెంట్ గోడల మీద విద్వేషపూరిత సందేశాలను రాశారు. ఇండియా ప్యాలెస్ అనే ఈ రెస్టారెంట్ ఓ సిక్కు వ్యక్తిది అని స్థానిక మీడియా తెలిపింది. రెస్టారెంట్‌కు జరిగిన నష్టం 1,00,000 డాలర్లుగా ఉంటుందని సమాచారం. ఈ సంఘటనను సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్డీఈఎఫ్- సాల్డెఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ రకమైన ద్వేషం, హింస ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి అని సాల్డెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ కౌర్ గిల్ అన్నారు. అంతేకాక శాంటా ఫే ఒక ప్రశాంతమైన పట్టణం అని.. సిక్కు సమాజం గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో యజమాని మాట్లాడుతూ.. ‘దుండగులు రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ని విరగ్గొట్టారు. గాజు సామానును ముక్కలు ముక్కలు చేశారు. వైన్ ర్యాక్‌ను ఖాళీ చేశారు. ఓ దేవత విగ్రహాన్ని శిరచ్ఛేదన చేశారు. కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వంటగదిని కూడా పూర్తిగా నాశనం చేశారు. ఆహారాన్ని వేడి చేసే పరికరాలు ధ్వంసం చేశారు. గోడల మీద ‘వైట పవర్’.. ‘ట్రంప్2020’.. ‘ఇంటికి వెళ్లు’ అని రాసి ఉంది. ఇవన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు’ అని వాపోయాడు. దీని గురించి స్థానిక పోలీసులు, ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమంలో భాగంగా స్పానిష్ వలసవాదులతో సంబంధం ఉన్న విగ్రహాలను తొలగించడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్ 20న కొలరాడోలోని లాక్వుడ్లో ఎరిక్ బ్రీమాన్ అనే వ్యక్తి.. సిక్కు అమెరికన్ లఖ్వంత్ సింగ్‌పై దారుణంగా దాడి చేశాడు. నాటి నుంచి ఈ ద్వేషపూరిత నేరాలలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని సాల్డెఫ్ తెలిపింది. లఖ్వంత్ సింగ్‌పై దాడి చేస్తున్నప్పుడు సదరు వ్యక్తి.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళు’ అని బెదిరించాడని తెలిపారు. అయితే దాడి చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
వాషింగ్టన్లో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం
వాషింగ్టన్ : నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలతో అమెరికా అట్టుడుకిపోతోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికన్ అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీలో ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. కాగా, నిరసనకారులు వెనక్కితగ్గకుంటే శాంతిభద్రతలు కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. చదవండి : హ్యాండ్సప్.. డోంట్ షూట్! -
దుండగుల దుశ్చర్య : గాంధీ విగ్రహం కూల్చివేత
భువనేశ్వర్ : ఒడిసాలోని బాలాసోర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మహాత్మ గాంధీ విగ్రహం నేలమట్టమైంది. గాంధీ జ్ఞాపకార్ధం స్కూలులో కేటాయించిన ఓ గదిని సైతం దుండగులు ధ్వంసం చేశారు. గది పరిసరాల్లో సిగరెట్ ప్యాకెట్లు, తాగిపడేసిన మద్యం బాటిళ్లను చిందరవందరగా పడేశారు. స్కూల్లోకి ప్రవేశించిన దుండగులు గాంధీ విగ్రహాన్ని నేలకూల్చి, తల భాగాన్ని కిందపడవేశారు. కాగా, జూన్ 14న ఈ ఘటన జరిగి ఉంటుందని, వేసవి సెలవల కారణంగా స్కూల్‌ను మూసివేసిన క్రమంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్ధానిక పోలీస్ అధికారి సుభాన్షు శేఖర్ నాయక్ పేర్కొన్నారు. స్దానికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని చెప్పారు. -
బెంగాల్లో చల్లారని మంటలు..!
కోల్కత్తా: ప్రచారం ముగిసినప్పటికీ బెంగాల్లో పలుచోట్ల హింస కొనసాగుతూనే ఉంది. అమిత్ షా ర్యాలీతో మొదలైన దాడులు ఇంకా ఆగలేదు. తాజాగా బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. గురువారం రాత్రి పదిగంటల సమయంలో స్థానిక నేతలతో సమావేశం నిమిత్తం డమ్‌డమ్ వెళ్లిన ముకుల్ రాయ్.. కారు అద్ధాలను పగలగొట్టారు. మరోఘటనలో బీజేపీ డమ్‌డమ్ ఎంపీ అభ్యర్థి సామిక్ భట్టాచార్యపై కూడా కొందరు వ్యక్తుల దాడికి పాల్పడ్డారు. 24 పరగనాల జిల్లాలోని నగీర్‌బజార్‌లో మొదట ఆయనపై దాడి చేసి అనంతరం కారును ధ్వసం చేశారు. ఈరెండు ఘటనలు టీఎంసీ కార్యకర్తలు చేశారని భట్టాచార్య ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డయిందని, దాడి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గురువారమే ప్రచారాన్ని ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
తాజ్‌మహల్ గేటు ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: 400 ఏళ్లనాటి శివాలయం లోకి అనుమతించే దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు దుశ్చర్యకు పాల్పడ్డారు. చారిత్రాత్మక కట్టణం తాజ్‌మహల్ పశ్చిమ ద్వారాన్ని (బసాయి ఘాట్) ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజ్‌మహల్‌కు సమీపంలోని పురాతన శివాలయానికి వెళ్లే దారిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మూసివేస్తోందని వీహెచ్‌పీ సభ్యుల ప్రధాన ఆరోపణ. సిద్ధ్వేశ్వర మహాదేవ్ దేవాలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా నినాదాలతో దూసుకు వచ్చిన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్‌మహల్, సహేలీ కా బుర్జ్ టిక్కెట్ల సేకరణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఐరన్రాడ్లతో దాడిచేశారు. గేట్‌ను తొలగించి, అక్కడ నుంచి దాదాపు 50 మీటర్ల దూరానికి విసిరి పారేశారు. ఏఎస్ఐ ఏర్పాటు చేసిన సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఎట్టకేలకు వారిని నిరోధించిన తాజ్ మహల్ సిబ్బంది వారిని అదుపులోకి కున్నారని తాజ్ భద్రతా అధికారి ప్రభాత్‌కుమార్ తెలిపారు. వీహెచ్‌పీ సభ్యులు రవిదుబే, మదన్‌వర్మ, మోహిత్ శర్మ, నిరంజన్ సింగ్ రాథోడ్, గుల్లా సహా మరో 30మంది పై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 ప్రకారం ఫిర్యాదు దాఖలు చేశామని ఏఎస్ఐ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. తాజ్‌మహల్ చుట్టూ ఉన్న హిందూసంస్కృతికి సంబంధించిన అంశాలను ఏఎస్ఐ నాశనం చేస్తోందని విహచ్పీ ప్రతినిధి దుబే ఆరోపించారు. దాదాపు 15సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ సత్సంగ్ నిర్వహించుకునే వారని దాన్ని నిలిపివేశారన్నారు. అలాగే దసరా ఉత్సవాలను కూడా ఆపివేశారని మండిపడ్డారు. ఆమ్లా నవమిని నిర్వహించుకునే ఉసిరి చెట్టును ఏఎస్ఐ నరికివేయించిదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాలన్నింటికీ 14-15 సంవత్సరాల క్రితం సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పాలనలో స్వస్తి చెప్పారు. అయినా ఇకముందు ఇలా జరగడానికి తాము అంగీకరించమని దుబే వాదించారు. -
మద్యం దుకాణం వద్దన్నా..
సాక్షి, చెన్నై: ప్రజల అభ్యంతరాలను పక్కనపెట్టి సెలయూర్ సమీప నివాస ప్రాంతంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో ఆగ్రహించిన స్ధానికులు దుకాణాన్ని దగ్ధం చేశారు. మహిళలు, పిల్లలకు అసౌకర్యంగా ఉంటుందని తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని తాము అధికారులను కోరామని స్ధానికులు తెలిపారు. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా మే 11న అత్యంత ఆర్భాటంగా మద్యం దుకాణం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తీవ్రంగా ప్రతిఘటించినా ప్రభుత్వం మద్యం దుకాణం ప్రారంభించడంతో సహనం కోల్పోయిన స్ధానికులు దుకాణంలోకి చొరబడి షాపును ధ్వంసం చేశారు. బాక్సుల్లో ఉంచిన మద్యం నిల్వలను పగులగొట్టారు. బార్ కోసం అమర్చిన కుర్చీలను విరగ్గొట్టారు. మరోవైపు మద్యం దుకాణాలపై తమిళనాడు ప్రభుత్వం న్యాయస్ధానాల నుంచి సైతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత నెలలో మద్రాస్ హైకోర్టు 1700 మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
యూపీలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేత
మీరట్ : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీజేపీ గెలుపు అనంతరం మొదలైన ధ్వంసరచన దేశమంతా విస్తరిస్తున్నది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు గురైంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కొందరు విగ్రహం తలను, విరగొట్టి కిందపడేసి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన దళితులు బుధవారం ఉదయం నుంచి ఆందోళనలకు దిగారు. మవానా రహదారిపై బైఠాయించి, విద్వేషకారులకు వ్యతికేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డకునే సమయంలో కొంత ఉద్రిక్తత తలెత్తింది. గంటలపాటు రాస్తారోకో చేసిన దళితులు.. నిందితులను పట్టుకునేదాకా ఆందోళన విరమించబోయేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉపశమన చర్యగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. విగ్రహం కూల్చివేతకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం మనావాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి హింసాయుత ఘటనలు నమోదుకాలేదని పోలీసులు తెలిపారు. మొన్న లెనిన్, నిన్న పెరియార్, ముఖర్జీ.. ఇప్పుడు అంబేద్కర్ : త్రిపురలో బీజేపీ వర్గీయులు లెనిన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఆ పార్టీకే చెందిన తమిళనాడు నేతలు ‘ఇక పెరియార్ విగ్రహాలు కూల్చుతాం’అని ప్రకటన చేశారు. ఆ మేరకు వేలూరు సహా కొన్ని జిల్లాల్లో పెరియార్ విగ్రహాలు ధ్వసమయ్యాయి. త్రిపుర ఘటకు ప్రతీకారంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలిసిందే. విగ్రహాల ధ్వంసాలు కూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు. -
పద్మావత్ ఎఫెక్ట్ .. మొదలైన విధ్వంసకాండ
గాంధీనగర్ : రాజ్‌పుత్ కర్ణిసేన అన్నంత పని చేయటం ప్రారంభించింది. గుజరాత్లో పద్మావత్ చిత్రం ప్రదర్శితం కాబోయే ఓ థియేటర్‌ను ధ్వంసం చేసేసింది. శనివారం అర్ధరాత్రి అహ్మదాబాద్‌లోని రాజ్‌హంస్ సినిమాస్ కాంప్లెక్స్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కర్ణిసేనకు సంబంధించిన కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా థియేటర్ కాంప్లెక్స్‌లోకి దూసుకొచ్చారు. అద్దాలు ధ్వంసం చేయటంతోపాటు బయట ఉన్న కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డు వచ్చిన సిబ్బందిని కూడా వారు చితకబాదారు. ఈ ఘటనపై యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకుతున్నాడు. మరికొన్నిచోట్ల థియేటర్ల ముందు హెచ్చరికల బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల మీద కూడా దాడులు చేస్తామని అందులో రాసి ఉంది. కాగా, పద్మావత్ ప్రదర్శించించే థియేటర్లను తగలబెడతామని కర్ణిసేన హెచ్చరించిన నేపథ్యంలో థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా దాడి నేపథ్యంలో గుజరాత్‌తోపాటు రాజస్థాన్‌లోనూ థియేటర్ల యాజమానులు పద్మావత్ రిలీజ్ విషయంలో పునరాలోచనలో చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. Gujarat: Protesters vandalised Rajhans Cinemas in Ahmedabad late last night #Padmaavat pic.twitter.com/bGhCu7TNNh — ANI (@ANI) 21 January 2018 కర్ణిసేనకు భన్సాలీ ఆహ్వానం... పద్మావత్ చిత్రాన్ని వీక్షించేందుకు శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేనకు దర్శక-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఆహ్వానం పంపారు. కాగా, ఆ లేఖను కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి సింగ్ తగలబెట్టేశారు. పక్కా కుట్ర తోనే ఈ వ్యవహారమంతా సాగుతోందని, చిత్రాన్ని అడ్డుకునేందుకు చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. భన్సాలీ ప్రజెంట్స్.. జోకులు... పద్మావత్ చిత్రంపై వివాదం కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియాలో మాత్రం కొందరు తమదైన శైలిలో ఛలోక్తులు విసురుతున్నారు. ముఖ్యంగా భన్సాలీ పేరిట చిత్ర ప్రారంభంలో వేసే విజ్ఞప్తులు(Disclaimers) పేరిట కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. సినిమా చూస్తున్న సమయంలో ఒకవేళ కర్ణిసేన దాడి చేస్తే.. టికెట్ డబ్బులు వాపసు చెయ్యం. మీ ప్రాణాలకు మీరే బాధ్యులు. ఒకవేళ కర్ణిసేన దాడి చేస్తే.. ఎడమ వైపు ద్వారం ద్వారా బయటకు పరిగెత్తండి. ఎందుకంటే కాస్త దూరంలోనే ఆస్పత్రి ఉంది కాబట్టి... కర్ణిసేన దాడి చెయ్యటంతో మీకు బాగా కోపం వచ్చిందా? అయితే కుడివైపు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ డొనేషన్ బాక్స్ ని వాడుకోండి. అది మిమల్ని చల్లబరుస్తుంది. ఇలాంటి సెటైర్లు పేలుతున్నాయి. Padmavati will begin with these initial disclaimers and credits.#Padmaavat #Padmavat pic.twitter.com/Q8GmFbgO96 — THE SKIN DOCTOR (@theskindoctor13) 19 January 2018 -
రాణి పద్మిని వాడిన చారిత్రక అద్దాలు బద్దలు
చిత్తోర్‌గఢ్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా ఆయన చిత్ర బృందంపై దాడి చేసిన కర్నిసేనా అనే గ్రూపు తిరిగి మరోసారి దాడికి పాల్పడింది. రాజస్థాన్‌లోని 13వ శతాబ్దానికి చెందిన కోటలో నాటి రాణి పద్మిని ఉపయోగించిన అద్దాలను ధ్వంసం చేసింది. పద్మిని ప్యాలెస్‌లో ఉన్న రెండు పెద్ద చారిత్రక అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అంతేకాదు, స్వయంగా ఆ దాడిని తామే చేశామని ప్రకటించుకోవడమే కాకుండా ఆ అద్దాలను పూర్తి తొలగించాలని తాము పాలన వర్గాన్ని డిమాండ్ చేస్తున్నామని, వాటి ద్వారా తమ ప్రముఖ రాణి చరిత్రను హీనంగా చెబుతున్నారని మండిపడ్డారు. పద్మిని మహల్‌లోని గతంలో పద్మిని ఉన్న గదిలో రెండు పెద్ద అద్దాలు ఎదురెదురుగా ఉన్నాయి. తన భర్త రాణా రతన్ సింగ్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాక ఆ అద్దాల్లోనే అందాల రాణి పద్మినిని నాటి ముస్లిం పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి చూపించారని అక్కడికి వచ్చిన పర్యాటకులకు టూరిస్టు గైడ్లు చెబుతుంటారు. గొప్ప చరిత్ర కలిగిన తమ వారసురాలిని ఇలాంటి కట్టుకథలతో తప్పుబడుతున్నారని, అందుకు ఈ అద్దాలను ఉపయోగించుకుంటున్నారని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని పగులగొట్టినట్లు దాడికి పాల్పడినవారు చెబుతున్నారు. ఇదే గ్రూపు గతంలో సంజయ్ లీలా బన్సాలీపై ఆయన చిత్ర బృందంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
మహబూబ్‌నగర్ (అమర్చింత): టిప్పర్ ఢీకొనడంతో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమర్చింత మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు-అమర్చింత రహదారి విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో కంకర సరఫరా చేయడానికి వచ్చిన టిప్పర్ వాహనం శుక్రవారం మధ్యాహ్నం ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వరుసగా ఏడు స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా లేని సమయం అవటంతో పెను ప్రమాదం తప్పింది. -
టీడీపీ దిమ్మె ధ్వంసం
హైదరాబాద్ సిటీ: ఫిల్మ్‌నగర్‌లో తెలుగు దేశం పార్టీ దిమ్మెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇది తెలిసిన టీడీపీ కార్యకర్తలు సంఘటనాస్థలికి చేరుకుని దిమ్మెకు పాలాభిషేకం చేశారు. తర్వాత దిమ్మెకు పున:నిర్మాణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు నినదించారు.