vellampalli srinivas
-
వరదలు చూసి వసూలు చేసిన చందాలు పేద వారికి పంచకుండానే మింగేశారు
-
వంగలపూడి అనితకు వెల్లంపల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
టీడీపీ నేతలు.. వరద బాధితులను కలిసే దమ్ముందా?: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌కు పేదలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సంక్షోభం నుంచి అవినీతి ఎలా చేస్తారో చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓదార్పు కలగలేదు. వరద బాధితుల కోసమని చిన్నపిల్లలు కూడా వారు దాచుకున్బ డబ్బు ప్రభుత్వానికి ఇచ్చారు. వరదల వలన లక్ష నుండి రెండు లక్షల వరకు ఒక్కో ఇంటికి నష్టం వచ్చింది. బాధితులకు ఐదు రోజులపాటు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. రూ.368 కోట్లు భోజనాల పేరుతో దోచుకున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెప్పారు. రూ.26 కోట్లతో వాటర్ బాటిల్స్ ఇచ్చారంట. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.అలాగే, 412 డ్రోన్లతో ఆహారం అందించామని తప్పుడు లెక్కలు చెప్పారు. బాధితులకు సహాయం చేయకుండానే చేసినట్టు ఎందుకు లెక్కలు చెప్తున్నారు? పేదలంటే ఎందుకు అంత చులకనా?. కేంద్రం ఇచ్చిన నిధులు, విరాళాలు ఏం చేసినట్టు?. విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని చంద్రబాబు డ్యామేజ్ చేశారు. బాధితులు సహాయం కోసం రోడ్డు మీదకు వస్తే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించారు. ఇదేనా ప్రభుత్వ విధానం?. వరద బాధితుల పేరుతో కూడా దోచుకోవటం ఇప్పుడే చూస్తున్నాం. పదో తేదీన వరద బాధితుల కోసం ధర్నా చేయబోతున్నాం. ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వం చేయలేని పని మేము చేశాం. మా పార్టీ తరఫున బాధితులను సహాయం అందించాం. ప్రభుత్వం అడ్డుకున్నా నడుచుకుంటూ వెళ్లి సాయం చేశాం. వరద బాధితులను నిలువునా ముంచారు. వరద బాధితుల ప్రాంతాల్లో టీడీపీ నేతలు పోలీసులు లేకుండా తిరిగే ధైర్యముందా?. ఒకసారి జనంలోకి వస్తే బాధితులే సమాధానం చెబుతారు.దసరా నవ రాత్రులు జరుగుతున్న తీరు బాధాకరం. మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుమీద ఆపేశారు. కాదంబరీ జత్వానీని పోలీసు ఎస్కార్టుతో పంపటం దారుణం. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదు. ఉచిత బస్సుల్లో వృద్దులను ఎక్కించుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ వెళ్తే సాధారణ భక్తులను గంటల తరపడి ఆపేశారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మేము గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం: వైఎస్ జగన్ -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, అమరావతి: తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వేంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఆయన సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు.సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని వాడలేదని చెప్పారన్నారు. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యి వాడలేదు కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో పాటు, దానిపై సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసిందని చెప్పారు. జూలై 23 నుంచి సెప్టెంబరు 18 వరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని కూడా సర్వోన్నత న్యాయస్ధానం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిందని తెలిపారు. సిట్ నియామకాన్ని కూడా ప్రశ్నించిందన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వెల్లంపల్లి మరోసారి చంద్రబాబుకి సూచించారు. -
శ్రీవారిని అడ్డంపెట్టుకుని బాబు నీచ రాజకీయం చేస్తున్నారు
-
మీ దగ్గర ఆధారాలుంటే.. సిట్ ఎందుకు?: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ.. చంద్రబాబు నీచ రాజకీయాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు బాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.శ్రీవారి భక్తుడని చెప్పుకునే బాబు ఇలాంటి రాజకీయం చేస్తారా?. జులై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 19 వరకు ఏం చేశారు?. 2 నెలలు ల్యాబ్ రిపోర్ట్‌ను ఎందుకు బయటపెట్టలేదు’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. ‘‘చంద్రబాబు,ఈవో మాటలకు పొంతన లేదు. మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి కదా?. సిట్ ఎందుకు?’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ‘టీడీపీ ఆఫీస్‌లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’‘‘చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదు?. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రే ఆరోపణలు చేశాక ఇక సిట్ దర్యాప్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏఆర్ ఫుడ్స్ నిజంగానే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. సనాతన ధర్మం గతంలో లేనట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చెప్పులు వేసుకుని దీక్షలు చేయటం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది. ఇలాంటి దారుణాలను మేము ఎప్పుడూ చూడలేదు. మాటలు చెప్పే ముందు సనాతన ధర్మాన్ని పవన్ పాటించాలి..ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన రెండు నెలల వరకూ దాన్ని ఎందుకు బయట పెట్టలేదు?. ఆ రిపోర్టు గురించి టీడీపీ ఆఫీసులో మాట్లాడటం ఏంటి?. వనస్పతి కలిసిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపామని ఈవో శ్యామలరావు జులై 23న చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబరు 18న చంద్రబాబు కూటమి మీటింగ్‌లో మాట్లాడారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. కానీ వనస్పతి కలిసిన ట్యాంకర్లను వెనక్కు పంపామని సెప్టెంబరు 20న ఈవో శ్యామలరావు చెప్పారు. మళ్లీ చంద్రబాబు సెప్టెంబరు 22న మాట్లాడుతూ ఆ నెయ్యిని వాడారని మరీసారి అబద్దాలు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రా? టీటీడీ ఈవోనా?. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకం చంద్రబాబు...హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుది. సూపర్ సిక్స్ పథకాల నుండి డైవర్షన్ కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు. లడ్డూ విషయమై సుప్రీంకోర్టు విచారణ జరపాలి. తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పును ఒప్పుకుంటూ చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. చంద్రబాబూ నీ తప్పు ఒప్పుకో.. లేకపోతే వెంకటేశ్వరస్వామి ఒప్పుకోడు.వరదల మేనేజ్మెంట్లో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వరదల పేరుతో చంద్రబాబు వందల కోట్లు వసూలు చేశారు. అందులో పదిశాతం ఖర్చు పెట్టినా బాధితులను ఆదుకోవచ్చు. వరద బాధితులపై లాఠీ ఛార్జి చేసిన ఘనత చంద్రబాబుది. సాయం చేయమని కోరితే లాఠీఛార్జి చేస్తారా?. పరిహారం ఎగ్గొట్టడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వీటన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ప్రజల చావుని చూస్తున్నావా..?
-
బాబు నిర్లక్ష్యం వల్లే ముంపు వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే విజయవాడ నగరం ఎప్పుడూలేని విధంగా ముంపునకు గురైందని వైఎస్సార్సీపీ నేతలు మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంవల్ల రాష్ట్రంతోపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కృష్ణా, ఉప నదులకు భారీ ఎత్తున వరద వచ్చే అవకాశముందని ఐఎండీ, సీడబ్ల్యూసీ ముందస్తుగా హెచ్చరించినా.. ముంపు ముప్పు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు.ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తేయడంవల్లే విజయవాడ ముంపునకు గురైందని ఫైర్ అయ్యారు. జలదిగ్బంధంలో చిక్కుకుని సహాయం కోసం ప్రజలు అర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్మెంట్లో బిజీగా ఉన్నారా? అని వారు ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో.. బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలే ముందుండి చేస్తున్నారని చెప్పారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. వారు ఇంకా ఏమన్నారంటే.. నిన్న కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. వారిని పరామర్శించిన వారులేరు. కరెంట్ లేదు.. నిత్యావసర వస్తువుల్లేవు.. ఇదేనా పాలన? విజయవాడ నగరంలో మీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజలు మాకు ఫోన్లుచేసి సాయం కోరుతున్నారు. మేమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. అధికార్లు కూడా మా ఫోన్లు ఎత్తడంలేదు. గతంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ ఉంటే ముందే ప్రజలను అప్రమత్తం చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థల్లేవు. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా మేం ప్రజల తరఫున పోరాటం చేస్తాం. -
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం
-
వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ విఫలం: వెల్లంపల్లి
సాక్షి, గుంటూరు: వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం కనీస అవరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు చనిపోతే ఏపీ ప్రభుత్వానికి కనీసం పట్టింపులేదని వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.‘‘రెండు రోజులుగా విజయవాడ అల్లాడిపోతోంది. కాలనీలు, ఇళ్లు నీట మునిగిపోయాయి. ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. కనీసం తక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. రెండు రోజులు అతలాకుతలం అయిపోతే ఈరోజు మంత్రులు వస్తున్నారు. విజయవాడలో అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కనీసం భోజనం కూడా ప్రజలకు అందించలేదు. ఎవ్వరినీ పునరావాస కేంద్రాలకు తరలించలేదు’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కొండ చరియలు విరిగిపోయి ఐదుగురు చనిపోయారు. కనీసం అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించలేదు. కరెంట్ లేదు, తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందించలేదు. అమ్మాయిల పేరుతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. కానీ వరదల్లో ఉన్న ప్రజలను అడుకోలేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. ప్రజలను అప్రమత్తం చేయలేదు’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు.‘‘సచివాలయ, వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్ జగన్ ముందు చూపుతో రిటైనింగ్ వాల్ కట్టారు. అందుకే లంక ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కొండ చరియలు పడి ఐదుగురు చనిపోతే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వాళ్ళ దగ్గరకి వెళ్ళారా..?. సుజనా చౌదరి ఎక్కడ..?. బోండా ఉమా ఎక్కడ..?. కేశినేని చిన్ని ఎక్కడ..?. గద్దె రామ్మోహన్ రావు ఎక్కడ..?. ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.‘‘కనీసం చంద్రబాబు సమీక్ష చేయలేదు. సీఎం సమీక్ష చేస్తే.. ఆ ఫోటో ఏది..?. డిప్యూటీ సీఎం ఎక్కడ..వారి తాలూకా వాళ్ళు ఎక్కడ..?. వీకెండ్ వస్తే..చాలు అందరూ వ్యక్తిగత పర్యటనలకు వెళ్లిపోతున్నారు. నష్టపోయిన ప్రజలందరికీ పరిహారం అందించాలి’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
వెల్లంపల్లి నిరసన.. తోకముడిచిన పోలీసులు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్‌ను వారిని కలవనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కార్లలో ఉన్న కార్యకర్తలను సైతం దించివేయించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టు ప్రధాన గేటు వద్ద వెల్లంపల్లి భైఠాయించారు. వెల్లంపల్లి నిరసనతో దిగివచ్చిన పోలీసులు.. ఆయన కారుని ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతించారు. పోలీసుల తీరుపై వైస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు బెంగళూరు నుంచి కొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న @ysjagan గారు. స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు,… pic.twitter.com/1UnrdPCeMB— YSR Congress Party (@YSRCParty) August 6, 2024 -
పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో బోండా ఉమాకి వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్..
-
పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
బోండా ఉమా ఎన్నికల అఫిడవిట్ మోసాలను బయటపెట్టిన వెల్లంపల్లి శ్రీనివాస్
-
బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్‌లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్‌లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్‌నే పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగ్‌నగర్ పార్టీ ఆఫీస్‌ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్‌లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్‌లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.‘‘గతంలో వైఎస్సార్సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు. టీడీపీ పార్టీ ఆఫీస్‌లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్‌తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడతా’’ అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు.‘‘నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా?. ఎమ్మెల్యేగా గెలిచాక.. నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటా.. బోండా ఉమా... అతని సతీమణి.. ఇద్దరు కుమారులు.. కోడలు ఓట్లు చెల్లవు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎవరైనా కాపురాలు చేస్తారా?. బోండా ఉమా చెల్లదు.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బోండాను అనర్హుడిగా ప్రకటించే వరకూ పోరాడతా. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని బెదిరిస్తున్నాడు.2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్‌లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. వేరే పార్టీలను ప్రచారం చేయనీయకుండా చేస్తున్నారు. వేరే పార్టీలకు అవకాశం లేకుండా పర్మిషన్లు తీసుకుని తిరగకుండా చేస్తున్నారు. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘మా హక్కులకు బోండా ఉమా భంగం కలిగిస్తున్నాడు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఓటు అడగనోడివి నీరెందుకు బోండా ఉమా అనుమతులు. ఓటమి భయంతోనే బోండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. బోండాను కచ్చితంగా ఓడించి తీరుతాం.. బుద్ధిచెబుతా’’ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
బోండా ఉమాపై అనర్హత వేటు ?..ఈసీకి ఫిర్యాదు
-
బోండా ఉమాపై అనర్హత వేటు ?..ఈసీకి ఫిర్యాదు
-
బోండా ఉమా పని అయిపొయింది..వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు ఆదేశాలతోనే..
-
బోండా ఉమాకి డిపాజిట్ కూడా రానివ్వను
-
బోండా ఉమా, చంద్రబాబుకు వెల్లంపల్లి అల్లుడు కౌంటర్
-
వెలంపల్లికి సజ్జల పరామర్శ
-
బస్సుపై అసలు ఏం జరిగిందంటే..!
-
‘పక్కా ప్లాన్ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి జరిగింది’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్‌పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. కాగా, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు తగిలిన వెంటనే నాకు కూడా గాయమైంది. ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. నాకు కనుగుడ్డుపై ర్యాష్ అయ్యింది. ఇప్పుడు కూడా కంటి నొప్పి ఉంది. సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలి. చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు. సీఎం జగన్‌పైన ఈరోజు ఇలా కుట్ర చేశారు. సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే. టీడీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌పై దాడిని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వెంటనే బాబు మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. సీఎం జగన్‌పై దాడిని కూడా డ్రామా అనడం చంద్రబాబు నైజం. విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకి వస్తాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలన్నారు. మరోవైపు, సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే రోజా నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు వస్తున్న ఆదరణ చూడలేకే చంద్రబాబు దాడులు చేయించారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. పవన్ కల్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు సరికాదు. తన గెలుపు కోసం ఎదుటి వ్యక్తిని చంపాలనుకోవడం సిగ్గుచేటు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారు అని కామెంట్స్ చేశారు.