Wage
-
జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు!
‘ఆలస్యం విషం, వేగమే అమృతం’.. దేశంలోని ప్రముఖ డెలివరీ స్టార్టప్స్ ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉదయాన్నే వంటింట్లో నుంచి ఘుమఘుమలు ఇంటిల్లాపాదిని పలకరిస్తుంటే కూరలోకి ఉప్పు లేకపోతే.. గాభరా పడాల్సిన పన్లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే కుతకుతమని ఉడికేలోగా లవణం లావణ్యంగా ఇంటికి వచ్చేస్తుంది. ‘మాటకు పది నిమిషాలని అంటున్నాం కానీ, మా సగటు డెలివరీ సమయం ఎనిమిది నిమిషాల పైచిలుకే’ అంటున్నాయి డెలివరీ సంస్థలు. ఇదంతా బాగానే ఉన్నా బైక్ పంక్చర్, ట్రాఫిక్ సిగ్నల్,అన్నిటికీ మించి స్పీడ్ బ్రేకర్ల కన్నా స్పీడుగా బ్రేకులు వేయించే గుంతలతో వ్యయప్రయాసలకు ఓర్చి పది నిమిషాల్లో డెలివరీ చేసే ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? అంటే లేదనే అంటున్నారు జొమాటోకి చెందిన ‘బ్లింకిట్’ ఉద్యోగులు. బ్లింకిట్ యాప్‌కు చెందిన సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. డెలివరీ చేయడం మానేశారు. దీంతో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 400 స్టోర్ల నుంచి సర్వీసుల్ని అందిస్తుండగా.. ఉద్యోగుల నిర్ణయంతో వాటిలో పదుల సంఖ్యలో స్టోర్లు మూత పడ్డాయి. మరోవైపు సిబ్బంది ఆందోళన చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్లింకిట్ కొత్త చెల్లింపుల పద్దతిని అమలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల గతంలో డెలివరీ చేసిన ఆర్డర్లకు పొందే వేతనాలు బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జొమాటో మెయిల్ కాగా,ఉద్యోగులకు జొమాటో మెయిల్ పెట్టింది. ఆ మెయిల్లో రైడర్ల కోసం కొత్త చెల్లింపుల పద్దతిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ పద్దతిలో చేసే డెలివరీల ఆధారంగా చెల్లింపులు ఉంటాయని, షట్‌డౌన్ చేసిన స్టోర్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది. చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా! -
కనీస వేతనాలపై మీ వైఖరి ఏమిటి? ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్:కనీస వేతనాలకు సంబంధించి జీవోలు ఇచ్చి.. గెజిట్ ప్రింట్ చేయకపోవడంపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. ప్రభుత్వం వెంటనే గెజిట్‌ను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ప్రతివాదులుగా సీఎస్, కార్మిక శాఖ కమిషనర్ తదితరులను పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
అయ్యో.. ఏమైందో ఏమో!
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: కూలి పనికోసం వలస వచ్చిన వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాత్రి పడుకున్న మంచంపైనే తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ధన్వాడ మండ లం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నాగారం హను మంతు (65), భార్య వెంకటమ్మ(50)తో కలిసిఅబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్పూర్లో సుగుణ అనే మహిళా రైతు వద్ద హార్టీకల్చర్ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం ఇంకా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో సుగుణ వారిని పిలిచేందుకు వెళ్లింది. లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో పాటు దంపతులిద్దరూ స్పందించకపోవడంతో అనుమా నం వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. దీంతో కొంతమంది వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా హనుమంతుదంపతులు మంచంపై విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతుల కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!) -
సర్పంచ్ పైశాచికం.. కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై దాడి
మహబూబ్ నగర్: తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బులు ఇప్పించాలని అడిగిన ఓ వికలాంగుడిని సర్పంచ్ కాలితో తన్ని దుర్భాషలాడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్వాడ మండలం ఫుల్పోనీ గ్రామంలో వికలాంగుడైన కృష్ణయ్య తనకు రావాల్సిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు రాలేదని, ఆ డబ్బులు ఇప్పించాలని అధికార పార్టీ సర్పంచ్ శ్రీనివాసులును అడగడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో వికలాంగుడైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు, తదితరులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సర్పంచ్ శ్రీనివాసులు వికలాంగుడు కృష్ణయ్యతో పాటు అధికారులను సైతం బండ బూతులు తిడుతూ.. కాలితో తన్నాడు. ఈ సంఘటన చూసిన మరికొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రూపులలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు కేసును సుమోటోగా స్వీకరించారు. సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు. -
అంతంతమాత్రం వేతన పెంపు తీవ్ర ఆందోళనకరం!
ముంబై: ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకున్నప్పటికీ, వేతన పెంపు క్షీణించడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని ఇండియా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు ఇది దారితీస్తుందని, దీనివల్ల పరశ్రమలో సామర్థ్యం వినియోగం తగ్గుతుందని పేర్కొంది. వస్తు ఉత్పత్తి– వినియోగం అంతరాన్ని ఈ పరిస్థితి మరింత పెంచుతుందని విశ్లేషించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2012–16 ఆర్థిక సంవత్సరం మధ్య ఉద్యోగుల వేతన వృద్ధి సగటున 8.2 శాతంగా నమోదయితే, 2017–21 మధ్య ఇది 5.7 శాతానికి క్షీణించింది. ► వేతన పెంపు భారీగా లేకపోవడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (20 22–23 ఏప్రిల్–జూన్) అంచనాలకన్నా తక్కువగా 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ కొనుగోలు శక్తి బలహీనంగా నమోదవుతోంది. ► జూన్ 2022ను తీసుకుంటే సంవత్సరం ప్రాతిపదికన పట్టణాల్లో వేతన పెంపు సగటు 2.8 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 5.5 శాతంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటుచేస్తే, వేతనంలో వృద్ధిలేకపోగా ఈ రేట్లు వరుసగా 3.7 శాతం, 1.6 శాతం మేర క్షీణించాయి. ► ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. తృణధాన్యాలు, సేవల రంగాల్లో ధరల తీవ్రత దీనికి కారణం. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 2022–23లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (మే నుంచి 1.4 శాతం మేర పెంపుతో ప్రస్తుతం 5.4 శాతం) 25 నుంచి 50 బేసిస్ పాయింట్లమేర పెంచే వీలుంది. -
జాతీయ ఆదాయంలో 20%.. వేతనాల్లో 40%
ముంబై: భారత్ మొత్తం జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) వాటా 20 శాతం అయితే, మొత్తం వేతనాల్లో వాటా 40 శాతంగా ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రైవేటు రంగం విషయంలో ఈ రేట్లు ‘దాదాపు సమతౌల్యంగా’ వరుసగా 36.3 శాతం, 35.2 శాతాలుగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)కు సంబంధించి 2020–21కి ముందు గడచిన పదేళ్ల కాలంలో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రాతిపదికన ఈ విశ్లేషణ చేసినట్లు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలకు సంబంధించి ప్రభుత్వం పాత్రను తగ్గించాలని ఒత్తిడి చేస్తూ, ప్రభుత్వ రంగంలోని సమర్థత లోపాన్ని తరచుగా ఎత్తి చూపే విమర్శకులకు తాజా నివేదిక మద్దతునిస్తోంది. నివేదిక ప్రకారం, 2011–2021 మధ్య వేతనాల సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 10.4 శాతంగా ఉంటే, మూలధనంపై రాబడి 8.8 శాతం వృద్ధిని (సీఏజీఆర్) నమోదుచేసుకుంది. -
వేతన జీవులకు శుభవార్తను అందించనున్న కేంద్రం..! 75 లక్షల ఉద్యోగులకు లబ్ధి..!
వేతన జీవులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) త్వరలోనే శుభవార్తను అందించనున్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతన పరిమితిని పెంచాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని అడ్-హాక్ కమిటీ సూచించింది. అంతేకాకుండా వేతన పరిమితి పెంపు నిర్ణయాన్ని అడ్ హాక్ కమిటీ సమర్థించింది. సానూకూలంగా కేంద్రం..! అడ్ హక్ కమిటీ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. కమిటీ ప్రతిపాదనలపై కేంద్రం కూడా సానూకూలంగా స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల అమలు జరిగితే సుమారు 7.5 మిలియన్ల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలియజేస్తే కంపెనీలు ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగానే ఉన్నట్లు సదరు సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి ప్రముఖ మీడియాతో వెల్లడించారు. ఇక వేతన పరిమితి పెంపు చివరిసారిగా 2014లో జరిగింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఏటా రూ. 6750 కోట్లను చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బేసిక్ శాలరీలో 1.16 శాతానికి సబ్‌స్క్రైబర్ పీఎఫ్ అకౌంట్‌కు జమచేస్తుంది. ఈపీఎఫ్ఒ , ఈఎస్ఐసీ,బెనిఫిట్స్‌తో ఈపీఎఫ్‌వో సభ్యులకు సామాజిక భద్రతను అందిస్తోంది. ఈ రెండు పథకాల నిబంధనలలోని తేడాలతో ఉద్యోగులు సామాజిక భద్రత ప్రయోజనాలను కోల్పోకూడదని కేఈ రఘునాథన్ పేర్కొన్నారు. చదవండి: ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త...! -
మోడల్‌గా మారిన 60 ఏళ్ల దినసరి కూలీ!
Mammikka, 60, is a daily wage earner from Kerala Turn Model: ఇంతవరకు చాలామంది మోడల్‌గా మారి మంచి పేరు తెచుకోవాలనుకునే వాళ్ల గురించి విని ఉన్నాం. పైగా అందుకోసం ఎంతో వ్యయప్రయాసలు పడి మరీ ఆ స్థాయికి చేరుకుంటారు కూడా. అయితే కొంతమందికి మాత్రం ఎలాంటి కష్టం పడకుండా ఊహించని విధంగా మోడల్‌గా నటించే అవకాశం భలే దొరుకుతుంది. పాపం వాళ్లు కలలో కూడా అనుకుని ఉండుండరు. పైగా వాళ్లకు మోడల్‌గా చేయడమంటే ఏంటో కూడా తెలిసి ఉండపోవచ్చు. అచ్చం అలాంటి సంఘటన కేరళలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే.... కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చిన్నాచితక పనులు చేసుకుంటూ బతుకుతన్న అతను ఉన్నట్టుండి మంచి సూట్, కూలింగ్ గ్లాస్ చేతిలో ఒక ఐప్యాడ్ పట్టుకుని వ్యాపారవేత్తగా ఫోజిస్తున్నట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలీల్ తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్‌గా నటించమని మమ్మిక్కా అనే దినసరి కూలీని అడిగాడు. దీనికి మమ్మిక్కా కూడా అంగీకరించడంతో షరీక్ తన ఫోటోగ్రాఫిక్ నైపుణ్యంతో మమ్మిక్కాని మంచిగా ఫోటోలు తీశాడు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. దీంతో నెటిజన్లు ఒక కూలి మోడల్‌గా మారి అలా ఫోటోలకి పోజులిచ్చిన విధానాన్ని చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తున్నారు. అంతే కాదు ఫోటోగ్రాఫర్ నైపుణ్యాన్ని కూడా తెగ మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఫోటోల్లో మమిక్కా మళయాళం నటుడు వినాయక్‌ను పోలీ ఉండటంతో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అంతేకాదు తన కంపెనీకి మోడల్‌గా చేయడానికి మమ్మిక్కా కంటే గొప్పగా ఎవరూ ఉండరని ఫోటోగ్రాఫర్ షరీక్ చెప్పడం విశేషం. (చదవండి: వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ ఒకేసారి భూమిపై పడి చివరికి...) View this post on Instagram A post shared by Shareek Vayalil Shk 📸 (@shk_digital) -
రాష్ట్రంలోనే ‘ఉపాధి’ అధికం, కేంద్రం ప్రశంసల వర్షం
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో పసల వెంకటేసులు కుటుంబం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఉపాధిహామీ పథకంలో పనులు చేసింది. ఈ 4 నెలల్లో రూ.24,504 సంపాదించుకుంది. ఇదే కాలంలో ఆ గ్రామంలో మొత్తం 1,341 కుటుంబాలకు ప్రభుత్వం పనులు కల్పించింది. ఆ ఒక్క గ్రామంలోనే కూలీలు రూ.2.41 కోట్లను వేతనాల రూపంలో పొందారు. సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కువమంది గ్రామీణ పేదలకు ప్రభుత్వపరంగా పనులు కల్పిస్తున్నది మన రాష్ట్రంలోనే. దేశంలోనే ఉపాధిహామీ పథకం కింద ఎక్కువమందికి పనికల్పించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవల లోక్‌సభలో ఒక ప్రశ్నకు జవాబుగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు 4 నెలల కాలంలో ఉపాధిహామీ పథకం ద్వారా మన రాష్ట్రంలో 71.90 లక్షల మందికి ప్రభుత్వం పనులు కల్పించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్‌లో 65.53 లక్షల మందికి అక్కడి ప్రభుత్వం పనులు కల్పించింది. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా.. అందులో ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలు మాత్రమే ఈ 4 నెలల కాలంలో వారి రాష్ట్రాల్లో 50 లక్షల మంది కన్నా ఎక్కువమంది పేదలకు పనులు కల్పించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొంది. రాష్ట్రంలో 1.03 కోట్ల మంది ఉపాధి హామీ పథకంలో కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకుంటే, అందులో 70 శాతం మందికి పైగా ప్రభుత్వం ఈ కరోనా విపత్తు కాలంలో పనులు కల్పించడం గమనార్హం. రోజుకు సరాసరి కూలి రూ.221 రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు ఈ 4 నెలల్లోనే రూ.4,485 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఒకరోజు పనిచేసినందుకు ఒక్కొక్క కూలీకి సరాసరిన రూ.221 వంతున గిట్టుబాటు అయినట్టు చెప్పారు. -
హెస్1బి వీసాదారుల కనీసం వేతనం పెంపు
-
వేతన ఫిర్యాదుల పరిష్కారానికి 20 కంట్రోల్ రూమ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కార్మికులకు ఎదురవుతున్న పలు సమస్యల పరిష్కారానికి గాను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్సీ) (సీ) నేతృత్వంలో దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. కేంద్ర పరిధిలో పనిచేసే కార్మికుల వేతన సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వలస కార్మికుల సమస్యలను తగ్గించడం వంటి లక్ష్యాలతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లను లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ప్రాంతీయ కార్మిక కమిషనర్లు, ఆయా ప్రాంతాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ కాల్ సెంటర్లను కార్మికులు వివిధ సమస్యల నిమిత్తం ఫోన్ చేయడం లేదా వాట్సాప్, ఈ–మెయిల్స్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఈ మొత్తం 20 కాల్ సెంటర్ల పనితీరును ప్రతిరోజూ కేంద్ర కార్యాలయం నుంచి చీఫ్ లేబర్ కమిషనర్ (సీ) పర్యవేక్షిస్తున్నారు. కాల్ సెంటర్లు ఇవే.. హైదరాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, చండీగఢ్, అసన్సోల్, భువనేశ్వర్, కొచ్చి, చెన్నై, డెహ్రాడూన్, ధన్‌బాద్, గువాహటి, జబల్పూర్, కాన్పూర్, ముంబై, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్‌లో ఈ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉన్న కార్మికులు లాక్డౌన్ సమయంలో ఎదురవుతున్న సమస్యలను గురించి అధికారులు వీటీ థామస్ (ఫోన్ నం: 94962 04401), పి.లక్ష్మణ్ (ఫోన్ నం: 83285 04888), ఎ.చతుర్వేది (ఫోన్ నం: 85520 08109)లకు తెలియజేస్తే అధికారులు తగిన పరిష్కారం చూపుతారని కార్మిక శాఖ తెలిపింది. -
స్వీపర్‌కు లక్షన్నర జీతం.. కానీ
రాజ మహేంద్రవరం : స్వీపర్ జీతం లక్షన్నర.. ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ ఛానళ్లలో, ప్రముఖ దిన పత్రికల్లో విపరీతంగా సర్క్యూలేట్ అయిన వార్త. ఏంటి స్వీపర్‌కు లక్షన్నర జీతమా? ఎక్కడబ్బా..? నిజంగా అంత ఉందా? లేదా ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారా? అంటూ చాలా మంది అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అయితే అది నిజమే. రాజమహేంద్రవరం విద్యుత్ శాఖలో పనిచేసే కోల వెంకట రమణమ్మకి ఇంత వేతనం ఇస్తున్నారంట. ఆమె సర్వీసు 40 ఏళ్ల పైబడటంతో, వెంకట రమణమ్మ నెలకు మొత్తం రూ.1,47,722ను జీతంగా ఇంటికి తీసుకెళ్తున్నారట. 40 ఏళ్లు పైబడితే అంత జీతం వస్తుందా? మరి అందరికి రాదే? అనుకుంటున్నారా? అయితే విద్యుత్ శాఖలో పనిచేసే చాలా మంది నాలుగో తరగతి ఉద్యోగులకు లక్షకు పైబడే జీతం ఉందని తెలిసింది. విద్యుత్ శాఖలో చేపట్టిన సంస్కరణలతో కోల వెంకట రమణమ్మకి, ఆమెతో పాటు ఆ శాఖలో ఉద్యోగం చేస్తున్న చాలామందికి వేతనాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. స్వీపర్‌కు ఆ మేర జీతం పెరగడం ఆశ్చర్యమే. స్వీపర్‌కే ఆ రేంజ్లో జీతాలు పెరిగితే, మరి పై స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు ఇంకెంత వేతనం పెరిగి ఉండి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ప్రారంభంలోనే రూ.40వేలు లేదా రూ.50వేలతో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందిన వారికి, సంస్కరణల పేరుతో వేతనం భారీగానే పెరిగి ఉండొచ్చు. పదవి విరమణ సమయానికి వారి వేతనాలు కూడా నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ అంచనాలు మాత్రమే. అంత జీతమొచ్చినా.. ఆ లోటును, బాధను తీర్చలేదుగా! కోల వెంకటరమణమ్మ, ఏమీ చదువుకోలేదు. కేవలం సంతకం పెట్టేంత అక్షరాలు మాత్రమే నేర్చుకుంది. 16 ఏళ్ల వయసులోనే అంటే 1978లో విద్యుత్ శాఖలో రోజువారీ కూలిగా చేరింది. ఆమె చేరిన మూడేళ్లకు అంటే 1981 ఏప్రిల్ 1న రమణమ్మ పర్మినెంట్ ఉద్యోగి అయింది. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలోని పని చేస్తుంది. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. చాలా కాలంగా చేసిన సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో ఉద్యోగానికి పోయి, రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్తుంది. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేశారు. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఆమెకు లక్షకు పైగా జీతం కదా..! ఇంకేం బిందాస్ లైఫ్ అనుకుంటున్నారామో...? అలా అనుకుంటే పొరపాటే. ఆమెకు ఇద్దరు కొడుకులు. భర్త రైల్వేలో పనిచేసేవాడు. ఆయన కాలం చేయడంతో, ఒక కొడుకుకి భర్త ఉద్యోగం వచ్చింది. మరో కొడుకు అనారోగ్యంతోనే బాధపడుతున్నాడు. గుండె జబ్బు, ఫిట్స్‌తో ఎప్పడికప్పుడు కొడుకుకి వైద్యం చేయించడానికే రమణమ్మ జీతం అంతా సరిపోతుంది. ఎంత జీతం వచ్చినా.. రమణమ్మకు భాగస్వామి లేని లోటును, కొడుకు అనారోగ్యం బాధను పూడ్చలేవుగా. -
లీవులే ఇచ్చారు.. వేతనం రాలేదు
సాక్షి, హైదరాబాద్: ‘దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లుగా ఉంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి’. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌లుగా గుర్తించినా, ఆ సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తామని చెప్పకపోవడంపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్నారు. సమ్మె చేసిన 27 రోజులను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇతర అన్ని శాఖల్లో అమలైనప్పటికీ, ఆర్టీసీలో దాదాపు రెండున్నరేళ్ల జాప్యం తర్వాత తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం.. సమ్మెలో పాల్గొన్న కార్మికులందరి ఖాతాల్లోనూ 27 రోజుల లీవులు అదనంగా చేరతాయి. ఇది రిటైర్డ్ కార్మికులతోపాటు మరణించినవారికీ వర్తిస్తుంది. అయితే, గతనెలలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ మేరకు ఆ సమ్మె కాలానికి వేతనం కూడా చెల్లించాలి. అయితే, ఒకసారి దరఖాస్తు చేసుకున్న లీవుకు రెండోసారి వేతన చెల్లింపు (సమ్మె విరమణ తర్వాత కార్మికులు 27 రోజులకు ఈఎల్స్ దరఖాస్తు చేసుకున్నారు) చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆర్థ్ధిక విభాగం వాదిస్తోంది. అందువల్లే సమ్మె కాలానికి వేతనం చెల్లించడం కుదరదని చెబుతోంది. ఈ విషయాన్ని మంత్రులు ముందుగా నిర్ధారించుకోకుండానే మీడియా ముందు ప్రకటించి, ఈ మేరకు సీఎంతో నిధులు కూడా విడుదల చేయించారు. కానీ, ఆర్థికశాఖ అభ్యంతరంతో వేతన చెల్లింపు ఆగిపోయింది. ముందుగానే చెప్పిన సాక్షి..! ఆర్టీసీ కార్మికులకు సమ్మెకాలంలో స్పెషల్ క్యాజువల్ లీవులు, వేతనం విషయంలో అన్యాయం జరుగుతోందంటూ జూలై 28న ‘సమ్మె సెలవుపై నీలిమేఘాలు’అన్న శీర్షికతో సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. అందులో వేతనం విషయంలో ఆర్థికశాఖ అభ్యంతరాలు, రిటైర్డ్ కార్మికుల విస్మరణ తదితర విషయాలు ప్రస్తావించింది. ఇçప్పుడు సమ్మెకాలానికి వేతన చెల్లింపులు ఉండవన్న మాట తాజా ఉత్తర్వులతో నిజమైంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: ఎన్ఎంయూ సమ్మెకాలానికి వేతనం ఇస్తామని సీఎం అంగీకరించి రూ.80 కోట్లు విడుదల చేశారు. మంత్రుల కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కేవలం సాంకేతిక కారణాలతో వారి హామీ అమలుకాకుం డా పోతోంది. ఇది ముమ్మాటికీ గుర్తింపు యూనియన్ వైఫల్యమే. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని, కార్మికులకు వేతనాలు అందించాలి. వారి అవగాహనా రాహిత్యం వల్లే: ఎంప్లాయీస్ యూనియన్ చర్చల్లో పాల్గొన్న గుర్తింపు నాయకుల అవగాహ నా రాహిత్యం వల్లే ఇదంతా జరిగింది. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి కార్మికుల్లో ఆశలు రేపా రు. ఇపుడు వారికి ఏం సమాధానం చెబుతారు? ముందే తెలుసు: తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ఇలా జరుగుతుందని ముందే తెలుసు. ఏ లీవులకైనా రెండోసారి ఏ సంస్థా చెల్లింపులు చేయదు. మంత్రులతోనూ అదే ప్రకటన చేయించారు. గుర్తింపు యూనియన్ నాయకులకు ముందుచూ పు లేకపోవడమే సమస్యకు కారణం. నిధులను వెనక్కి వెళ్లకుండా ఆపాం: టీఎంయూ నేతలు మంత్రులు, ఆర్థికశాఖకు సమన్వయలోపం వల్ల వేతన చెల్లింపులు కుదరలేదు. ఆర్థిక శాఖ చెల్లింపులు చేయకపోవడానికి అదే కారణం. దానికి మమ్మల్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు? మా పోరాటం వల్లనే సీఎం విడుదల చేసిన రూ.80 కోట్లను 2013 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూపంలో చెల్లించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. -
‘సినిమా’ వదులుకునే ప్రసక్తే లేదు
సాక్షి, చెన్నై : రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ వ్యాఖ్యానించారు. విశ్వరూపం–2 సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ చేయడం కష్టతరమేనన్నారు. కమల్ నటించి, రూపొందించిన విశ్వరూపం–2 ఆగస్టు పదో తేదీన తెరమీదకు రానుంది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నైలో కమల్ మీడియాతో మాట్లాడారు. విశ్వరూపం–2 కథ ఎప్పుడో సిద్ధం చేసుకున్నా, దశావతారం, మన్మ«థ అంబు వైపు తన పయనం సాగిందన్నారు. దేశం రెండుగా చీలడానికి ప్రధాన కారణం మత రాజకీయాలేనన్న అంశం మేరకు ఈ కథ పుట్టుకొచ్చిందన్నారు. ఇందులో రాజకీయాలకు ఆస్కారం లేదని, అమెరికాకు వత్తాసు పలికే పరిస్థితులు, అంశాలు లేవని స్పష్టంచేశారు. అమెరికా, తీవ్రవాదుల మధ్య ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించే చిత్రంగా విశ్వరూపం–2 ఉంటుందన్నారు. ఈ చిత్రం సాధించే విజయం మేరకు విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధం అని వ్యాఖ్యానించారు. విశ్వరూపం–1 విడుదల సమయంలో పెద్ద వ్యతిరేకతే బయలుదేరిందని గుర్తుచేస్తూ, ఆ పరిస్థితి ప్రస్తుతం రాదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన పార్టీ గురించి, తన పార్టీ జెండాలు, ఇతర అంశాల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదన్నారు. ఎంజీఆర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కాలంలో సాంకేతిక అభివృద్ధి లేదని, అందుకే ఆయన తన చిత్రాల్లో జెండాను చూపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అనేక మార్గాలు ప్రచారాలకు ఉన్నాయన్నారు. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం కూడా సినిమాల్లో నటించారని గుర్తుచేస్తూ, తానూ రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, సినిమాల్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఉంటానని పేర్కొంటూ, ఒక్క రూపాయి జీతం తీసుకుని ప్రజా సేవ సాగించడం కష్టతరమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
అజిత్‌కు ఎంఐటీలో జీతం ఎంతో తెలుసా?
తమిళసినిమా: నటుడు అజిత్‌కు చెన్నై ఎంఐటీలో ఉద్యోగం వచ్చింది. జీతం ఎంతో తెసుసా? కేవలం రూ.1000. ఏమిటీ నమ్మశక్యం కావడం లేదా. అవునులే ఒక్క సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకునే అజిత్ కేవలం రూ.1000 జీతానికి ఉద్యోగం చేస్తున్నారంటే ఎవరు మాత్రం నమ్ముతారు. అయితే ఇది నిజం. చెన్నైలోని ఎంఐటీలో సాంకేతిక పరిజ్ఞానం శాఖ తరఫున తయారు చేస్తున్న మానవశక్తి అవసరం లేని చిన్న విమాన పథకానికి నటుడు అజిత్ సలహాదారుడిగా నియమింపబడ్డారు. అంటే చిన్న విమానానికి అజిత్ టెస్ట్ పైలట్‌గా వ్యవహరించనున్నారన్న మాట. ఎంఐటీ సాంకేతిక పరిజ్ఞాన విభాగం మనవశక్తి అవసరం లేని విమానాలను తమారు చేసే పనిలో నిమజ్ఞమైంది. ఇవి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న రోగులకు వైద్య సహాయాన్ని అందించి తిరిగి రాగలవు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో మెడికల్ ఎక్స్‌ప్రెస్ 2018 ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎంఐటీలోని సాంకేతిక పరిజ్ఞాన విభాగ విద్యార్థులు మానవశక్తి అవసరం లేని చిన్న విమానాన్ని తయారు చేస్తున్నారు. వారికి తన సహకార, సలహాలను అందించడానికి నటుడు అజిత్ సిద్ధం అవుతున్నారు. అందుకుగానూ ఆయన పారితోషికంగా రూ.1000 అందుకోనున్నారు. ఈయన చదువుకునే రోజుల్లోనే ఆకాశంలో పయనించే విమానాలకు చెందిన మోడల్స్ తయారు చేయడంపై ఆసక్తి చూపించేవారు. అదే విధంగా రిమోట్ ద్వారా నడిపే వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపేవారు. అలాంటి ఆసక్తితోనే చెన్నై ఎంఐటీలోని దక్ష అనే సాంకేతిక పరిజ్ఞాన బృందంలో తానూ ఒకరిగా చేరారు. ఈ బృందమే ఇప్పుడు అస్ట్రేలియాలో జరగనున్న మెడికల్ ఎక్స్‌ప్రెస్ 2018 పోటీల్లో పాల్గొననుంది. అదే విధంగా అన్నావిశ్వవిద్యాలయం కూడా నటుడు అజిత్‌ను మనుషుల అవసరం లేని విమాన పథకానికి సలహాదారుడిగా నియమించుకుంది. ఇందుకుగానూ అజిత్ ప్రతిసారి వచ్చి వేళ్లేందుకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు. -
వేతనం వదులుకోనున్న ఎన్డీయే ఎంపీలు
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాలు సజావుగా సాగకపోవటంతో.. ఈ 23 రోజుల వేతనాన్ని వదులుకునేందుకు అధికార ఎన్డీయే ఎంపీలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అప్రజాస్వామిక తీరు కారణంగానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్ను వృధా అవుతోందన్నారు. ‘ఈ విషయాన్ని ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీయే పక్షాల అధ్యక్షులతో చర్చించాం. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు జరిగిన 23 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం సహా పలు అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయటం సరికాదని అనంత్ కుమార్ పేర్కొన్నారు. -
మా నాన్నకు జీతం పెంచండి
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ‘కరెంటోళ్ల దీక్షలు’ పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు, కుటుంబసభ్యులు కూడా ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ‘మా నాన్నకు జీతం పెంచండి’ అని రాసిన ప్లకార్డులతో చిన్నారులు ఆందోళనలో పాల్గొనటం గమనార్హం. ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు) : న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కలెక్టరేట్ రోడ్డులో రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. ధర్నా శిబిరంలో భార్యా, పిల్లలతో కలిసి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహారావు మాట్లాడుతూ 14 రోజులుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యాలుగాని, ప్రభుత్వంగాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన విజయవాడలోని విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. స్పందన రాకుంటే 10న రహదారుల దిగ్బంధం, 12న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. సీఐటీయూ నాయకులు పోపూరి సుబ్బారావు, హుస్సేన్‌వలి, కాంగ్రెస్ నేత వినయ్‌కుమార్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, యూనియన్ నేతలు శివకుమారి, షకీలా పాల్గొన్నారు. -
ఉపాధి కష్టాలు
వారంతా శ్రమజీవులు.. రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. పల్లెల్లో పనులు లేక వారంతా ఉపాధి హామీ కూలీలుగా మారారు. పనులు చేస్తే వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఏకైక లక్ష్యం వారిది. రోజంతా మండుటెండలో పనిచేస్తున్నారు. అయితే కూలి చెల్లించాల్సిన అధికారులు వివిధ కారణలతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. జిల్లాలో శ్రమనే నమ్ముకున్న వేలాది మంది ఉపాధి హామీ కూలీల దయనీయ స్థితి ఇది. అధికారులు ఆడిట్లో చేసిన తప్పుల ఫలితంగా కూలీలు ఆర్థిక కష్టాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. సక్రమంగా పనులు ఉండకపోవటంతో జిల్లాలో వలసలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తేనే వలసలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అధికారుల బాధ్యతారాహిత్యం, ఉపాధి హామీ లో చోటుచేసుకుంటున్న అవినీతి వల్ల కూలీలు అంతిమంగా నష్టపోతున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించి వాటిని ప్రభుత్వం ఆమోదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగం అభివృద్ధికి సంబంధించిన పనులు, కాలువలు, జంగిల్‌క్లియరెన్స్, చెరువుల్లో మట్టితీయడం, రోడ్లు, పంటకుంటలు, వర్మీకంపోస్టులు తదితర పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. అనుమతి ఇచ్చిన తరువాత గ్రామాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు పనులు కల్పిస్తారు. జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పించేందుకు, పనులను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఏలు, మేట్లు, టీఏలు, టీటీఏలు, ఏపీఓలు, ఎంపీడీఓలు, ఏపీడీలను నియమించారు. ఉపాధి పనులు డ్వామా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధిలో ప్రతి ఏటా కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ఆడిట్ నిర్వహించారు. దాని వలన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. పర్యవసానంగా జిల్లాలోని ఉపాధి కూలీలకు నాలుగు నెలల్లో రూ.20 కోట్ల బకాయి పడ్డారు. బ్యాంక్‌లకు ఆధార్‌కార్డ్ లింకేజీ కాని కారణంగా మరో రూ.2.37 కోట్లు నిలిచిపోయింది. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా అందని వేతనం జిల్లాలో 5.85 లక్షల మందికి ప్రభుత్వం అధికారికంగా జాబ్ కార్డులు మంజూరు చేసింది. వీరికి నిబంధనల ప్రకారం ఏటా వంద పనిదినాలు కల్పించాలి. వీరికి రోజు కూలి రూ.140 తగ్గకుండా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో గత డిసెంబర్ నుంచి జిల్లాలో సుమారు 85 వేల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానంగా 62 వేల మందికి ఉపాధి కూలి అందని పరిస్థితి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 55వేల నుంచి 61 వేల మంది ప్రస్తుతం పనుల్లో ఉన్నారు. అయితే జిల్లాలో 2017 డిసెంబర్ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కూలి మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు జరిగాయని తరచూ విచారణలు చేపడుతున్నా చర్యలు మాత్రం శూన్యం. అయితే కూలీల వేతనాల మంజూరుకు మాత్రం దీనిని సాకుగా చూపుతున్నారు. ∙ఉదాహరణకు వాకాడు మండలంలో 665 గ్రూపుల్లో 10,075 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రసుత్తం వీరిలో వెయ్యి మందికి మాత్రమే ఉపాధి పనులు దక్కాయి. వీరికి గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూలీలకు రూ.3 లక్షలు వరకు ఉపాధి సొమ్ము రావాల్సి ఉంది. ఉపాధి కూలీలు మూడు నెలలుగా పనులు చేస్తున్నప్పటికీ కూలి సొమ్ము అందక పస్తులుంటున్నారు. కూలీలకు సంబంధించిన వేతనాలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నోడల్ బ్యాంక్‌లకు విడుదల చేసి అక్కడ నుంచి వివిధ బ్యాంక్‌ల ప్రధాన కార్యాలయాలకు పంపుతుంది. అనంతరం క్షేత్ర స్థాయిలో ఉన్న బ్రాంచ్‌ల్లో జమ అవుతుంది. కూలీలు తమ ఖాతా నంబర్లు, ఆధార్ కార్డులు అనుసంధానం చేయాల్సి ఉంది. ఇలా అనుసంధానం చేసిన నంబర్లు ఎన్సీపీఐ(నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో సింక్ అయితే ఆయా వేతనాలు కూలీల ఖాతాలో జమ అవుతాయి. కూలీలకు సంబంధించిన ఆధార్, ఖాతా నంబర్లు ఎన్సీపీఐలో సింక్ చేయడంలో అధికార్లు జాప్యం, చేసిన పొరపాట్లు కారణంగా వేతనాలు జమకాకుండా రిజెక్ట్ అవుతున్నాయి. పూర్తిగా అధికారులు చేసిన తప్పులకు కూలీలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు వారాలుగా కూలీ అందక పస్తులుంటున్నాం ఐదు వారాలుగా ఉపాధి పనులు చేస్తున్నా.. ఇప్పటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులను అడిగితే బ్యాంక్‌లో జమ చేశామని, అక్కడ అడిగితే జమకాలేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. వారం రోజులుగా పనులు సైతం మానుకుని కూలి డబ్బుల కోసం తిరుగుతున్నాం. ఇల్లు గడవక కుటుంబం పస్తులుండాల్సి వస్తోంది. –వేమాల మస్తానయ్య ఉపాధి కూలీ, వాకాడు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాం సెంటు భూమిలేని మా లాంటి పేదోళ్లంతా ఉపాధి పనులను నమ్ముకుని బతుకుతున్నాం. 48 రోజులుగా పనులు చేస్తున్నా ఇంతవరకు డబ్బులు జమకాలేదు. ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదు. మాత్రలు కొనడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేక అల్లాడుతున్నాం. అధికారులను అడిగితే ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప డబ్బులైతే ఇవ్వట్లేదు. పాస్ పుస్తకాలు పట్టుకుని బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నాం. –వంజివాక పిచ్చమ్మ, ఉపాధి కూలీ, వాకాడు -
2016–17లోనూ ముకేశ్ వేతనం రూ. 15 కోట్లే
వరుసగా తొమ్మిదో సంవత్సరం న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో సంవత్సరమూ రూ. 15 కోట్ల వార్షిక వేతనానికే పరిమితమయ్యారు. సీఈవోల జీతభత్యాలు సముచిత స్థాయిలోనే ఉండాలన్న వాదనలు 2008–09లో తెరపైకి వచ్చినప్పట్నుంచీ ఆయన జీతభత్యాలు, కమిషన్లు మొదలైనవి ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. మేనేజింగ్ స్థాయి కీలకోద్యోగుల వేతనాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండాలని, దానికి తనే ఉదాహరణగా నిలవాలని ముకేశ్ అంబానీ భావిస్తారని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ముకేశ్ అంబానీ జీతభత్యాలు రూ. 38.75 కోట్ల మేర ఉండాలని బోర్డు ఆమోదించినప్పటికీ.. ఆయన అభిప్రాయం మేరకు దీన్ని రూ. 15 కోట్లకే పరిమితం చేసినట్లు వివరించింది. 2016–17లో ముకేశ్ అంబానీ రూ. 4.16 కోట్లు జీతంగాను, మరో రూ. 60 లక్షలు భత్యాలుగాను, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ. 71 లక్షలు, లాభాలపై కమీషన్ల కింద రూ. 9.53 కోట్లు అందుకున్నారు. మరోవైపు కంపెనీలో ఇతర ఉద్యోగుల జీతభత్యాలు మాత్రం పెరిగాయి. అంబానీ కజిన్లు నిఖిల్ ఆర్ మేస్వాని, హితల్ ఆర్ మేస్వాని వేతనం రూ. 16.58 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం వీరు రూ. 14.40 కోట్ల స్థాయిలో అందుకున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వేతనం రూ. 7.23 కోట్ల నుంచి రూ. 7.87 కోట్లకు పెరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ .. రూ. 4 లక్షలు సిటింగ్ ఫీజు కింద. రూ. 1.35 కోట్లు కమీషన్ కింద పొందారు. సిటింగ్ ఫీజు గతంలో అందుకున్న రూ. 6 లక్షలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ 2015–16లో అందుకున్న రూ. 1.20 కోట్ల కమీషన్ కన్నా తాజాగా మరింత ఎక్కువ పొందారు. -
ఆర్‌కామ్‌లో వేతనం వద్దనుకున్న అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేతగా ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నుంచి ఏ విధమైన వేతనం గానీ, కమిషన్ గానీ తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. అలాగే కంపెనీలోని టాప్ మేనేజ్మెంట్ సైతం తమ వ్యక్తిగత చెల్లింపులను 21 రోజలు పాటు ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ వాయిదా వేసుకుంటూ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రిలయన్స్ అనిల్ దీరూభాయి అంబానీ గ్రూపు చైర్మన్ అయిన అనిల్ అంబానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనం, కమిషన్ తీసుకోరాదని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌కామ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.45,000 కోట్ల మేర ఆర్‌కామ్ బకాయిలు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేటింగ్ సంస్థలు ఆర్‌కామ్ పరపతి రేటింగ్‌ను తగ్గించాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి రూ.25,000 కోట్ల బకాయిలు తీర్చేస్తామని అనిల్ అంబానీ ఆయా సంస్థలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు
-
చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం చందా కొచర్ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 7.85 కోట్ల వేతనం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 64 శాతం అధి కం. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. ఆమె బేసిక్ శాలరీ 15 శాతం పెరిగి రూ. 2.67 కోట్లకు చేరింది. అంటే రోజువారీగా చూస్తే కొచర్ రోజుకు.. రూ. 2.18 లక్షల వేతనం అందుకున్నట్లవుతుంది. 2016–17లో ఆమె రూ. 2.2 కోట్ల బోనస్ అందుకున్నారు. వసతి, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, నీరు, గ్రూప్ ఇన్సూరెన్స్, క్లబ్ ఫీజు, నివాసం వద్ద వినియోగించేందుకు ఫోన్, కారు, రీయింబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీఏ), ప్రావిడెంట్ ఫండ్ మొదలైన వాటితో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ కలిపి రెమ్యూనరేషన్లో లెక్కేస్తారు. నెలవారీ కొచ్చర్ బేసిక్ శాలరీ రూ. 13,50,000– రూ. 26,00,000 శ్రేణిలో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక నివేదిక పేర్కొం ది. ప్రధాన సవాళ్లెదుర్కొంటూ.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని నివేదికలో కొచర్ తెలిపారు. బ్యాంకు పరిమాణం, భారీ స్థాయిలో నిధులు, వివిధ ఆర్థిక సేవలు అందిస్తుండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
‘ఉపాధి’ యాతన
నెలన్నరగా వేతనాల చెల్లింపులు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం ⇒ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.310.58 కోట్లు ⇒ కాంట్రాక్టర్లకు మాత్రం రూ.877.52 కోట్లు విడుదల ⇒ కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ డబ్బులు రాక, తిండి దొరక్క అవస్థల పాలవుతున్న కూలీలు ⇒ పనుల కోసం పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్న కూలీలు సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. కరువు కోరల్లో చిక్కి వలసబాట పడుతున్న ప్రజలకు సొంత ఊళ్లలోనే పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌కు సాక్షాత్తూ ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది. కూలీలకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తేనే వారి కడుపుల్లోకి నాలుగు మెతుకులు వెళ్లే పరిస్థితి. అలాంటిది నెలన్నర రోజులుగా ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా నిలిపివేసింది. దీంతో నిరుపేద కూలీలు పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకోలేక పనుల కోసం పక్క రాష్ట్రాలకు సైతం వలస వెళ్తున్నారు. ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కూలీలకు చెల్లించడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం ఇదే పథకం కింద మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం బకాయిల చెల్లింపునకు రూ.877.55 కోట్లు విడుదల చేయడం గమనార్హం. నిలిచిపోయిన చెల్లింపులు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన వారికి ఫిబ్రవరి రెండో తేదీ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ నెలన్నర రోజులకు కూలీలకు రూ.310 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న నిధులను రాష్ట్ర సర్కారు ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఉపాధి హామీ పథకంలోనే మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు చెల్లిస్తూ కూలీలకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వం రూ.877.55 కోట్లు విడుదల చేసింది. అయితే, కూలీలకు పైసా కూడా ఇవ్వకుండా మొత్తం నిధులను ఉపాధి హామీ పథకంలో చేపట్టే సిమెంట్ రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్ల బకాయిలకే చెల్లించారు. ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత ఆ నెలలో పని చేసిన 13,99,331 కూలీలకు రూ.160.56 కోట్లు, మార్చిలో 17వ తేదీ నాటికి 14,96,161 మందికి రూ.150.02 కోట్ల మేర వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్ల కోసం ఎనిమిది సార్లు నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే మెటీరియల్ (కాంట్రాక్టు) పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.877.55 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 21 నుంచి మార్చి 17వ తేదీ మధ్య ఆర్థిక శాఖ ఎనిమిది విడతల్లో నిధులిచ్చింది. ఈ మేరకు జీవోలు కూడా జారీ చేసింది. తొమ్మిది నెలలైనా కూలి డబ్బులు రాలేదు ‘‘మా ఇంట్లో నలుగురం ఫారంపాండ్ గుంతలు తవ్వే పని చేశాం. పనులు పూర్తయి తొమ్మిది నెలలైనా ఇంకా డబ్బులు రాలేదు. నెలల తరబడి కూలి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?’’ – సుంకమ్మ, ఉపాధి కూలీ,ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం ‘‘ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన మాకు కూలీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిన్నమొన్నటి వరకూ పనులు ప్రారంభించలేదు. నెల రోజులుగా అడపాదడపా మాత్రమే పనులు దొరుకుతున్నాయి. వీటికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఒక్కోసారి కనీస వేతనం రోజుకు రూ.60 కూడా రావట్లేదు’’ – బి.వెంకటమ్మ, ఉపాధి హామీ పథకం కూలీ, అమరాం గ్రామం, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా ఎప్పటికైనా డబ్బులు ఇస్తారని వెళ్తున్నాం ‘‘నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో వేరే పనులకు వెళ్లిపోవాలని అనుకున్నాం. స్థానికంగా వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో ఎప్పటికైనా డబ్బులు ఇస్తారు కదా అనే ఆశతో భారంగానే రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నాం. పనులకు వెళ్లకపోతే జాబ్‌కార్డులు రద్దు అవుతాయని అంటున్నారు. అందుకే తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది’’ – కలికోట పార్వతి, ఉపాధి కూలీ, మామిడిపల్లి గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా డబ్బులు ఇవ్వకపోతే వలస వెళ్లాల్సిందే.. ‘‘ఉపాధి హామీ పథకం కింద పది వారాలుగా పనులు చేసినా వేతనాలు అందలేదు. వారానికొకసారైనా డబ్బులు అందకపోతే బతుకు వెళ్లదీయడం కష్టంగా మారుతోంది. కూలీ సొమ్ము ఎప్పటికప్పుడు చెల్లించకపోతే మూటాముల్లె సర్దుకొని వలసవెళ్లక తప్పదు. బ్యాంకు ఖాతాలతో అంతా గందరగోళంగా ఉంది. పోస్టాఫీస్‌కు వెళితే బ్యాంక్‌లో పడతాయని, మా వద్దకు రావొద్దని చెబుతున్నారు. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు. తిరగలేక చస్తున్నాం’’ – మల్లపురెడ్డి వెంకట్లు, ఉపాధి కూలీ, వల్లూరు గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా కూలీ డబ్బులు రాకపోతే ఎట్లా బతకాలి? ‘‘డిసెంబర్ నుంచి తొమ్మిది వారాలు ఫారంపాండ్ గుంతలు తవ్వే పనికిపోయాం. ఇంతవరకు ఒక్క రూపాయి కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదు. తొమ్మిది వారాలుగా కూలీ డబ్బులు రాకపోతే మేము ఎట్లా బతకాలి? ప్రభుత్వం వెంటనే మాకు కూలీ డబ్బులు చెల్లించి ఆదుకోవాలి’’ – పెద్ద రంగన్న, ఉపాధి కూలీ, ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా -
ఇన్ఫీలో ‘సిక్కా’ కలకలం..!
సీఈఓ విశాల్ సిక్కా వేతనం పెంపుపై వ్యవస్థాపకుల కన్నెర్ర! • అభ్యంతరం తెలుపుతూ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు... • కంపెనీ ప్రయోజనాల కోసమేనన్న ఇన్ఫీ • అన్ని అంశాలనూ సవివరంగా వెల్లడించినట్లు స్పష్టీకరణ న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో కార్పొరేట్ యుద్ధం పూర్తిగా సద్దుమణగకముందే... మరో ప్రతిష్టాత్మక కంపెనీలో కలకలం మొదలైంది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లోనూ ‘టాటా’ తరహా ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా వేతనాన్ని భారీగా పెంచడం పట్ల వ్యవస్థాపకులు కన్నెర్రజేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సిక్కాతో పాటు కంపెనీని వీడిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వటంపైనా ప్రమోటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారని సమాచారం. ఈ అంశాలపై కంపెనీ కీలక వ్యవస్థాపకులు ఎన్.ఆర్.నారాయణ మూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేఖని గత నెలలో ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇన్ఫీ ఇన్వెస్టర్లలో కలకలం మొదలైంది. ఇప్పటికే ప్రతికూల వ్యాపార పరిస్థితులతో భారీగా పడిపోతూ వస్తున్న కంపెనీ షేరు ధరపై... ప్రమోటర్లు, సీఈఓల మధ్య విభేదాలు మరింత ప్రభావం చూపుతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. 2016 డిసెంబర్ చివరినాటికి ఉన్న గణంకాల ప్రకారం చూస్తే... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు (వారి కుటుంబ సభ్యులతో కలిపి) కంపెనీలో 12.75 శాతం వాటా ఉంది. ఎక్కువ మంది స్వతంత్ర డైరెక్టర్లే ఉన్న బోర్డులో... వీరెవరూ లేరు కూడా. అబ్బే.. అంతా కంపెనీ మంచికే: ఇన్ఫీ సీఈఓ, వ్యవస్థాపకుల మధ్య పాలనపరమైన అగ్గి రాజుకుందన్న వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ బుధవారం వివరణ ఇచ్చింది. సిక్కా వేతనం పెంపు, ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆఫర్ చేసిన రాజీనామా ప్యాకేజీలను సమర్థించుకుంది. ‘పూర్తిగా కంపెనీ ప్రయోజనాల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. బోర్డులో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం జరిగింది’ అని ఇన్ఫోసిస్ ఈ–మెయిల్ ప్రకటనలో పేర్కొంది. ప్రమోటర్లతో పాటు ఇతర వాటాదారులు అన్ని పక్షాల నుంచి తీసుకున్న సూచనలు, అభిప్రాయాలను బోర్డు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏ అంశంపైనయినా నిర్ణయం తీసుకుంటుందని ప్రకటనలో ఇన్ఫీ వివరించింది. ఏం జరిగిందంటే: ఇన్ఫోసిస్‌కు నేతృత్వం వహించేందుకు తొలిసారి బయటి వ్యక్తి (ప్రమోటర్ కాని) విశాల్ సిక్కాను సీఈఓగా తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సిక్కా వచ్చాక కంపెనీ పనితీరు కాస్త మెరుగుపడిందన్న భరోసా అటు ఇన్వెస్టర్లలోనూ ఇటు ప్రమోటర్లలోనూ నెలకొంది. ఎస్డీ శిబులాల్ (చిట్టచివరి ప్రమోటర్ సీఈఓ) నుంచి 2014 ఆగస్టు 1న సిక్కాకు పగ్గాలు అప్పగించిన తర్వాత ఇన్ఫోసిస్ పాలనా వ్యవహరాల్లో వ్యవస్థాపకులు పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాల్లేవు. అయితే, గతేడాది ఇన్ఫోసిస్ బోర్డు... సిక్కా పదవీ కాలాన్ని 2021 వరకూ పొడిగించడమే కాకుండా ఆయన వార్షిక వేతన ప్యాకేజీని భారీగా 11 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 74 కోట్లు) పెంచింది. ఇందులో బేస్ శాలరీ 1 మిలియన్ డాలర్లు, పనితీరు ఆధారిత వేరియబుల్ పే 3 మిలియన్ డాలర్లు కాగా, మిగతాది స్టాక్స్ రూపంలో చెల్లిస్తారు. పాత ఒప్పందం ప్రకారం ఆయన మొత్తం వార్షిక ప్యాకేజీ 7.08 మిలియన్ డాలర్లు. ఇప్పుడు గ్లోబల్ ఐటీ కంపెనీల సీఈఓల స్థాయికి సిక్కా వేతనం చేరింది. ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్, మాజీ జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెన్నడీలకు కూడా కంపెనీ నుంచి వైదొలగినందుకుగాను భారీ ప్యాకేజీలనే ఇన్ఫీ ఆఫర్ చేసింది. బన్సల్ 2014–15లో వేతన ప్యాకేజీ కింద రూ. 4.72 కోట్లు తీసుకోగా.. ఆయనకు వీడ్కోలు ప్యాకేజీ రూపంలో రూ.23.02 కోట్లను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఓకే చెప్పింది. కెన్నడీ ఈ ఏడాది జనవరిలో ఇన్ఫీని వీడారు. ఆయనకు రాజీనామా ప్యాకేజీ, ఇతరత్రా చెల్లింపుల రూపంలో 8,68,250 డాలర్లు(దాదాపు రూ.5.85 కోట్లు) చెల్లించేందుకు ఇన్ఫీ అంగీకరించింది. ఇంత భారీ స్థాయి చెల్లింపుల పట్ల వ్యవస్థాపకులు తీవ్ర ఆందోళేన వ్యక్తం చేస్తూ.. బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. షేర్ల బైబ్యాక్? అమెరికాలో హెచ్1బీ వీసాలపై నియంత్రణ ఆందోళనలు, ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) వంటి పరిణామాలు ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్న భయాలతో కొంత కాలంగా ఐటీ షేర్లు తిరోగమనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ఫీ షేరు కూడా గత కొంతకాలంగా పడుతూవస్తోంది. గతేడాది జూన్‌లో 52 వారాల గరిష్ట స్థాయి(రూ.1,278)న నుంచి క్రమంగా క్షీణిస్తూ నవంబర్‌లో రూ. 900(52 వారాల కనిష్టం)కు పడిపోయింది. మం గళవారం ఇన్ఫీ షేరు ధర బీఎస్ఈలో దాదాపు 1% దిగజారి రూ.936 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.2,15,097 కోట్లు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేం దుకు కంపెనీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించే యోచనలో ఉంది. రూ.12,000 కోట్లను ఈ బైబ్యాక్‌కు వినియోగించనుందని సమాచారం. కీలక వాటాదారులు, వ్యవస్థాపకుల నుంచి బైబ్యాక్‌కు ఆమో దం లభించాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇన్ఫీ వద్ద రూ.35 వేల కోట్ల భారీ నగదు నిల్వలు ఉన్నాయి. బోర్డు సమాధానం ఇవ్వాలి: మోహన్‌దాస్ పాయ్ సిక్కా, మరో ఇద్దరికి భారీ ప్యాకేజీలు ఇవ్వడంపట్ల ఇన్షోసిస్ వ్యవస్థాపకులు ఆందోళన వ్యక్తం చేశారన్న వార్తలపై కంపెనీ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ స్పందించారు. వ్యవస్థాపకులకు ఆయన మద్దతు పలికారు. కంపెనీ ప్రయోజనాలమేరకే అంటూ నామమాత్ర ప్రకటనకాకుండా.. సవివరంగా సమాధానాన్ని బోర్డు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘కంపెనీని నెలకొల్పి అద్భుతమైన విలువను చేకూర్చిన వ్యవస్థాపకులు సీరియస్ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహజమే. ఇప్పటివరకూ భారత్‌లో ఏ సీఎఫ్ఓకూ ఇంత భారీ వీడ్కోలు ప్యాకేజీ(24 నెలల వేతనం–బన్సల్‌ను ఉద్దేశిస్తూ) ఇవ్వడం నేను చూడలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఖజానా కొర్రీలు
అడిషనల్ హెచ్ఆర్ఏ ఇవ్వకుండా ఇబ్బందులు ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా పట్టించుకోని ట్రెజరీ అధికారులు రెండేళ్లుగా పెండింగ్‌లోనే.. హన్మకొండఅర్బన్ : వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ప్రతి నెలా వేతనంతో పాటు ఇవ్వాల్సిన అదనపు హెచ్ఆర్ఏను ట్రెజరీ అధికారులు కొత్త నిబంధనలు చెపుతూ నిలిపివేశారు. 2015 ఏప్రిల్ నుంచి ఒక్కో ఉద్యోగి వేతనంతో పొందాల్సి ఉన్న సుమారు రూ.2వేల వరకు నగదు అందడం లేదు. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్న అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇటీవల టీఎన్జీఓస్ నేతలు అర్బన్ జిల్లా డీటీఓను కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. ఎందుకు సమస్య.. ప్రస్తుతం అదనపు హెచ్ఆర్ఏ చెల్లింపులు చాలా జిల్లాలో డీటీఓలు విడుదల చేస్తున్నాయి. వరంగల్‌తోపాటు మరికొన్నిచోట్ల మాత్రమే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2015 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలైన సమయంలో అదనపు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు సంబందించి క్యాడర్ల వారీగా వివరాలు వెల్లడిచింది. అందులో ఎవరికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వివరాల్లో ఏఎన్ఎంలను మెటర్నటీ అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. ఆ క్యాడర్ వారికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో మొదట 1960 నుంచి మెటర్నటీ అసిస్టెంట్లుగా ఉన్నవారిని తరువాత క్రమంలో వారి హోదాను1984లో ఏఎన్ఎంలుగా మార్చారు. ఆ తరువాత ఎన్ఎంల హోదాను మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్(ఎంపీహెచ్‌ఏఎఫ్) అని మార్చారు. దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎంపీహెచ్ఏ(ఎఫ్) అని లేనందున వారికి ఏహెచ్‌ఆర్‌ఏ ఇవ్వలేమని అందుకు రూల్స్ ఒప్పుకోవని డీటీఓలు బిల్లులు పాస్ చేయలేదు. దీంతో సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో ఈ విషయంలో స్పష్టత కూడా వచ్చింది. దీంతో జిల్లాలోని ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ తోపాటు ఇతర జిల్లాల్లో ఈ బిల్లులు పాస్ చేసి ఏహెచ్‌ఆర్‌ఏ చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్బన్‌తో పాటు కొన్ని డీటీఓల్లో అధికారులు ససేమిరా అంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా వేధిస్తున్నారు. టి.మాధవరెడ్డి టీఎన్జీఓస్(మెడికల్) అధ్యక్షుడు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ వచ్చింది. మెటర్నటీ అసిస్టెంట్, ఎంపీహెచ్ఏ(ఎఫ్) ఒకటే అని చెప్పారు. ఈ విషయంలో కొన్ని డీటీఓల్లో అధికారులు బిల్స్ పాస్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఉద్దేశ పూర్వకంగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలవెన్సులు ఉద్యోగులు సకాలంలో పొందకుండా చేయడం మంచిదికాదు. ఈ విషయంలో కార్యాలయాల ఎదుట ఆందోళనకు సిద్ధమవుతాం. -
సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ.. రూ.117 కోట్లు
3 శాతం తగ్గుదల వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల వేతనం జూన్ 30, 2016తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 3 శాతం తగ్గింది. మూల వేతనం 12 లక్షల డాలర్లు, 44.6 లక్షల డాలర్లు బోనస్, 1.2 కోట్ల డాలర్ల స్టాక్ ఆప్షన్లు, 14,104 డాలర్ల ఇతర భత్యాలు కలసి మొత్తం ఆయన వేతన ప్యాకేజీ 1.77 కోట్ల డాలర్లని(రూ.117 కోట్లు) నియంత్రణ సంస్థలకు మైక్రోసాఫ్ట్ నివేదించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఆయనకు 1.83 కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ లభించింది. స్టాక్ ఆప్షన్స్ క్షీణించడమే ప్యాకేజీ తగ్గడానికి ప్రధాన కారణం. కాగా ఈ వేతన ప్యాకేజీపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి పీటె వూటెన్ నిరాకరించారు. జూన్ 30, 2016తో ముగిసిన ఏడాది కాలానికి ఎస్ అండ్ృపీ 500 సూచీ 1 శాతం పెరగ్గా, మైక్రోసాఫ్ట్ షేర్ 15 శాతం లాభపడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా నాదెళ్ల నియమితులైనప్పుడు ఆయనకు 5.9 కోట్ల డాలర్ల స్టాక్ ఆప్షన్ష్ ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. 2019 వరకూ ఆయన సీఈఓగా కొనసాగడం, ఇతర షరతులను తృప్తిపరిస్తేనే ఈ దీర్ఘకాలిక పనితీరు ఆధారిత స్టాక్ ఆప్షన్స్‌ను విడతలవారీగా.. 2019, 2020, 2021లో అందుకోవడానికి ఆయన అర్హులు. కాగా సత్య పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి(2014,ఫిబ్రవరి) నుంచి చూస్తే మైక్రోసాఫ్ట్ షేర్ 70% పెరిగింది. ఈ ఏడాది జూలైలో చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగిన కెవిన్టర్నర్ 1.3 కోట్ల డాలర్ల వేతనం పొందారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో సత్య నాదెళ్ల తర్వాత అత్యధిక వేతనం పొందిన వ్యక్తి ఈయనే. -
మా కూలీ మాకివ్వండి
ఘరానా కాంట్రాక్టరుకు మహిళా కూలీల హెచ్చరిక రామవరప్పాడు : మా కూలీ డబ్బులు మాకు ఇవ్వాలంటూ పుష్కరాల పారిశుధ్య పనుల్లో పాల్గొన్న కూలీలు స్పష్టం చేశారు. పుష్కరాల పనులకు రోజుకు రూ. 400 కూలీ ఇచ్చే ఒప్పందంతో ఒక కాంట్రాక్టరు బయటి ప్రాంతాల నుంచి మహిళా కూలీలను తీసుకొచ్చాడు. పుష్కరాలు ముగిశాక... రోజుకు రూ. 200 లే ఇస్తానని కాంట్రాక్టర్ అడ్డం తిరగడంతో సుమారు 15 మంది మహిళా కార్మికులు భగ్గుమన్నారు. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి రాత్రింబవళ్లు పని చేశామని, ఇప్పుడు తీరా రోజుకు 200లే ఇస్తామనడం ఎంతవరకూ సమంజసమని కాంట్రాక్టర్ తరుపు వ్యక్తితో వాదనకు దిగారు. రాత్రుళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో పడుకుని నానా ఇబ్బందులు, అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే కార్పొరేషన్ ముందు ధర్నా చేస్తాని చెప్పారు. పరిస్థితి అదుపు తప్పడంతో కాంట్రాక్టర్ వారితో ఫోన్లో మాట్లాడి రేపటిలోగా మీ కూలి మీకిస్తాననడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. -
మా డబ్బులివ్వనిదే కదలం
కార్పొరేషన్ వద్ద పుష్కర కార్మికుల ఆందోళన పత్తాలేని కాంట్రాక్టర్లు విజయవాడ సెంట్రల్ : రేయింబవళ్లు పుష్కర విధులు నిర్వహించిన కార్మికుల కష్టాన్ని కాంట్రాక్టర్లు దోచుకున్నారు. ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడంతో కడుపుమండిన కార్మికులు పోరుబాట పట్టారు. విజయవాడలోని పొట్టి శ్రీరాములు హైస్కూల్, ఏకేటీపీ స్కూల్, వైఎస్సార్ కాలనీల్లో విడతలవారీగా ఆందోళన చేసిన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నగరపాలక సంస్థ వద్ద బైఠాయించారు. ఇద్దరు మహిళా సబ్ కాంట్రాక్టర్లను నిర్భంధించారు. చెప్పిన ప్రకారం డబ్బులిస్తే కానీ కదలబోమని ప్రకటించారు. సీవీఆర్, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్లో భోజనాలు పెట్టలేదని, ఉదయం నుంచి పస్తులు ఉన్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనూహ్య పరిణామంతో ప్రజారోగ్య శాఖ అధికారులు కంగుతిన్నారు. సీఎంవోహెచ్ గోపీనాయక్ ఆదేశాల మేరకు ఏఎంవోహెచ్ ఇక్బాల్ హుస్సేన్ కార్మికులతో చర్చలు జరిపారు. ఆయన కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటలోపు కాంట్రాక్టర్ బాలరాజు డబ్బు చెల్లించేందుకు అంగీకరించడంతో ఇక్బాల్ హుస్సేన్ హామీ మేరకు ఆందోళన విరమించారు. నిర్భంధించిన సబ్ కాంట్రాక్టర్లను వదిలేశారు. అధికారుల మిలాఖత్ పుష్కర విధులు నిర్వహించేందుకు మొత్తం 19,200 మంది కార్మికులకు టెండర్లు పిలిచారు. విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, నర్సీపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాలతోపాటు తమిళనాడు నుంచి సుమారు 15 వేల మంది కార్మికులు వచ్చారు. ఇక్కడి పరిస్థితులను చూసి మూడు వేల మంది తిరిగి వెళ్లిపోయారు. ఇక్కడ 12వేల మంది విధులు నిర్వహించినప్పటికీ 19,200 మంది విధుల్లో పాల్గొన్నారంటూ ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ అధికారులు కాంట్రాక్టర్లకు రూ.7 కోట్లు చెల్లించారు. డబ్బులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్న కాంట్రాక్టర్లు కార్మికులకు అడ్వాన్స్ పేరుతో అరకొరగా ముట్టజెప్పారు. పుష్కర విధులు పూర్తయ్యాక మొత్తం లెక్కలు చూసి ఇచ్చేస్తామని నమ్మకంగా చెప్పారు. మంగళవారం రాత్రి నుంచే కొందరు కాంట్రాక్టర్లు మొహం చాటేయడంతో కార్మికులు ఎక్కడికక్కడే పుష్కరనగర్లలో ఆందోళన బాటపట్టారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో వేతనాల సొమ్ము జమ చేయాల్సి ఉంది. మామూళ్ల ఒప్పందం కుదరడంతో అధికారులు నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా మాయ..! రెండు షిప్టుల్లో పని చేయాల్సి ఉంటుందని, రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తామని కార్మికులను కాంట్రాక్టర్లు తీసుకొచ్చారు. పనులు పూర్తయ్యాక రోజుకు రూ.250 నుంచి రూ.325 చొప్పున మాత్రమే చెల్లిస్తామని పేచీ పెట్టారు. అల్పాహారం, భోజనాలు సక్రమంగా పెట్టకపోయినా గొడ్డు చాకిరీ చేశామని, చెప్పిన ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిందేనని కార్మికులు పట్టుబట్టారు. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు చెల్లించాల్సిన బిల్లులను అధికారులు కాకిలెక్కలతో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన్ డబ్బులు ఇవ్వలేదంటూ కొందరు కాంట్రాక్టర్లు మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అడ్రస్ లేకుండాపోయారు. తిరుగు ప్రయాణానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని విశాఖపట్నం నుంచి వచ్చిన కార్మికులు వాపోయారు. కార్మికులకు సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ తదితరులు మద్దతు తెలిపారు. -
వేతనం లేని చైర్మన్
ఎన్పీడీసీఎల్ సీఎండీకి రెండేళ్లుగా వేతనం నిర్ణయించని ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) అత్యుతన్నత అధికారికి రెండేళ్లుగా వేతనం లేదు. ఎన్పీడీసీఎల్ చైర్మన్(సీఎండీ) కి నెలవారీగా ఎంత వేతనం చెల్లించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు దాటింది. ఇప్పటికీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వేతనం ఎంతనేది ఇప్పటికీ నిర్ణయించలేదు. తెలంగాణలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. ఎన్పీడీసీఎల్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కరెంటు సరఫరా ప్రక్రియను నిర్వహిస్తోంది. 5,612 గ్రామాల్లో వ్యవసాయ, గృహ అవసరాలకు కరెంటు సరఫరా చేస్తోం ది. ఈ సంస్థ పరిధిలో 51.21 లక్షల వ్యవసా య, గృహ, పారి శ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. అన్ని స్థాయిల ఉద్యోగులు కలిపి 8,249 మంది ఎన్పీడీసీఎల్లో ఉన్నారు. వేల కోట్ల వార్షిక టర్నోవరుతో దశాబ్దాలుగా సంస్థ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఆగస్టు 5న ఎన్పీడీసీఎల్ సీఎండీగా కె.వెంకటనారాయణ నియమితులయ్యారు. సీఎండీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వేతనం ఎంత అనేది నిర్ణయించలేదు. దీంతో నియామకమై రెండేళ్లు గడిచినా సీఎండీ వేతనం తీసుకోవడం లేదు. ఇదే విషయంపై పలుసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఎలాంటి స్పందనా రాలేదని ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. -
ముకేశ్ అంబానీ వేతనం 8వ ఏడాదీ రూ.15 కోట్లే!
న్యూఢిల్లీ : భారత్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదవ ఏడాది 2015-16 సంవత్సరంలోనూ రూ.15 కోట్ల వేతనమే తీసుకున్నారు. ఆమోదిత మొత్తం రూ.38.75 కోట్లు అయినా... రూ.15 కోట్లను ఆయన తీసుకున్నట్లు 2015-16 వార్షిక నివేదికలో ఆర్ఐఎల్ తెలిపింది. ఉన్నత నిర్వహణ స్థాయిలో వేతనాల నియంత్రణకు సంబంధించి ఉదాహరణగా నిలుస్తూ... ఆయన ఈ తక్కువ వేతనం పొందేందుకు తనకుతాను నిర్ణయం తీసుకున్నారు. సంస్థ బోర్డ్‌లోని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల వేతనం భారీగా పెరుగుతున్నా... ముకేశ్ తన నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. -
చాలీ చాలని వేతనంతో బతకలేక..
మృత్యు ఒడికి నవవధువు పటాన్చెరు టౌన్: భర్తకు వచ్చే చాలీ చాలని వేతనంతో పట్టణంలో బతకలేక.. సొంత ఊరు తిరిగి వెళదామం టే భర్త అంగీకరించక, ఇక్కడ ఉండలేక మనస్తాపం చెందిన ఆ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని శాంతినగర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని బోడపాడు గ్రామానికి చెందిన అరుణ(20) వరసకు బావైన ప్రసాద్‌ను నెలా 15 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా కూరేళ్లగూడెంవాసి. వీరిద్దరూ వివాహం అనంతరం బతుకుదెరువు కోసం పటాన్‌చె రు వలస వచ్చి శాంతినగర్‌లో ఉంటున్నారు. భర్త ప్ర సాద్ వెల్జన్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నెలకు రూ. 7 వేల వేతనమే వస్తుం డడంతో ఇంటి అవసరాలకు సరిపోవడం లేదని అరు ణ తన భర్త ప్రసాద్‌ను స్వగ్రామానికి వెళ్దాం అని అడుగుతూ ఉండేది. ఈ క్రమంలో అరుణ రెండుస్లారు స్వగ్రామానికి వెళ్లి నెలకు రూ. 7వేల వేతనంతో తాము బతకలేకపోతున్నామని, ఊరికి తిరిగి వచ్చేద్దామంటే భర్త అంగీకరించడం లేదని తన తల్లితో చెప్పింది. భర్త ఊరు వెళదామంటే ఒప్పుకోవడం లేదు. నాకు పటాన్చెరులో ఉండాలనిపించడం లేదు. అని తన తల్లితో తన బాధను చెప్పుకొని తిరిగి పటాన్చెరు వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రసాద్ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లగా ఇంటి తలుపులకు లోపలి నుంచి గడియవేసి ఉంది. పొరుగు వారి సహా యంతో తలుపులు తీసి చూడగా ఇంటిపై కప్పు ఐరన్‌రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకుని అరుణ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. -
వేతనంలో వెనకబడ్డ రాజన్!
న్యూఢిల్లీ: రఘురామ్ రాజన్.. పేరుకు తగ్గట్టే రాజులా ఆర్బీఐ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి కావొచ్చు. కానీ ఆయన మాత్రం అందరికన్నా ఎక్కువ వేతనం తీసుకోవడం లేదు. ఆర్టీఐ చట్టం కింద ఆర్బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ గవర్నర్ రాజన్ నెలవారీ వేతనం కింద రూ.1,98,700 (బేసిక్-రూ.90,000, డీఏ-రూ.1,01,700, ఇతర అలవెన్సులు-రూ.7000) తీసుకుంటున్నారు. ఆర్ బీఐ అధికారులైన గోపాలకృష్ణ సీతారామ్ హెగ్దే(రూ.4 లక్షలు), అన్నామలై అరపులి గౌండర్(రూ.2,20,355), వి కందసామి(రూ.2.1 లక్షలు)లు రాజన్ కన్నా ఎక్కువగా నెలవారీ వేతనం తీసుకుంటున్నారు. -
డెయిరీలో దేశముదురు
ఓ అధికారి యథేచ్ఛ దోపిడీ ‘పాలు’పంచుకుంటున్న నలుగురు సిబ్బంది ఉన్నత ఉద్యోగం.. నెలకు అర లక్ష వేతనం. అయినా.. సంపాదనపై ఆశ చావలేదు. కోట్లు గడించాలని ఆ యువరక్తం తహతహలాడింది. అందుకు కిందిస్థాయిలో మరో నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎంచుకున్నాడు. అన్నీ నేను చూసుకుంటా.. రికార్డుల పరంగా సహకరిస్తే చాలు.. మీ వాటా మీదే అన్నాడు. అరకొర వేతనంతో బతుకుతున్న వార ఆయన ఆఫర్‌కు ఓకే చెప్పారు. ఇలా వారి అక్రమార్జన మూడు లీటర్ల పాలు.. ఆరు కిలోల నెయ్యిలా సాగిపోతోంది. హన్మకొండ చౌరస్తా : హన్మకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని విజయ డెయిరీకి ప్రతి రోజూ జిల్లాలోని పాడి రైతుల నుంచి సుమారు 60 వేల లీటర్ల పైచిలుకు పాలు వస్తుంటాయి. ఇలా వస్తున్న పాలలో వెన్న శాతం గుర్తించి శీతలీకరణ చేస్తారు. అనంతరం పాలను ప్యాకెట్లలో నింపి విక్రరుుస్తారు. పాల నుంచి తీసిన వెన్న ను నెయ్యిగా మార్చి అమ్మకాలు చేస్తుంటారు. ఇది ప్రతీరోజు సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ కార్యక్రమాలను ప్రతి రోజు పర్యవేక్షించి పాల కొనుగోలుతో పాటు అమ్మకాలు సక్రమంగా జరిగేలా చూడాల్సిన అధికారి అక్రమాలకు తెరలేపాడు. ఎనిమిదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఆ అధికారి డెరుురీపై మంచి పట్టు సాధించాడు. ఎక్కడ ఎలా మోసాలకు పాల్పడవచ్చో తెలుసుకున్నాడు. తన అక్రమార్జనకు డెయిరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసుకున్నాడు. అందులో మార్కెటింగ్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, డిస్పాచ్ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నారు. అక్రమాలు ఇలా.. ప్రతి రోజు 60 వేల లీటర్ల పాలు సేకరిస్తుం డగా శీతలీకరణ చేసి 30 వేల లీటర్లు ప్యాకెట్ల రూపంలో అమ్మకాలు జరుగుతున్నట్లు, మరి కొన్ని పాలు నెరుు్య తయూరీకి ఉపయోగిస్తున్నట్టు డెయిరీ అధికారులు చెబుతున్నారు. అక్రమ సంపాదనపై దృష్టిపెట్టిన సదరు అధికారి అనధికారికంగా వెన్న శాతాన్ని తక్కువగా చూపి కొన్ని లీటర్ల పాలను పక్కనబెడుతున్నాడు. వాటితో తయారైన పాల ప్యాకెట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. పాలలో వెన్న శాతాన్ని తక్కువగా చూపడం వల్ల శీతలీకరణలో పాలు ఎక్కువగా ఆవిరైనట్టు లెక్క రాయవచ్చు. ఇలా ప్రతీ రోజు 300 లీటర్ల పాల ప్యాకెట్లను అక్రమంగా అమ్ముకుంటున్నాడు. లీటరుకు మార్కెట్లో రూ. 36 ఉండగా.. సదరు అధికారి రూ. 30కే విక్రయిస్తున్నట్లు తెలిసింది. అంటే ఈ లెక్కన ఒక్క రోజు సంపాదన రూ. 9వేలు అన్నమాట. ఇందులో కష్టపడుతున్నందుకు సగం బాస్ తీసుకుని.. మిగతా సగంలో ఆ నలుగురుకి వాటా ఇస్తున్నాడు. పాలలో వెన్న శాతాన్ని తక్కువగా చూపి, మిగిలిన శాతాన్ని వీరి ఖాతాలో వేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ సహకరిస్తాడు. పాల దిగుమతి, పాల ప్యాకెట్ల ఎగుమతిలో తేడా చూపించడం డిస్పాచ్ సూపర్వైజర్ పని. మిగిలిన ఇద్దరు ఉద్యోగుల రికార్డుల్లో తేడా రాకుండా.. మార్కెటింగ్ సాఫీగా సాగేలా చూస్తారు. నెరుు్య అమ్మకాల్లోనూ.. ఇక నెయ్యి విషయానికొస్తే డెయిరీలో ప్రధాన ద్వారం వద్ద గల అధికారిక కౌంటర్ ద్వారా ప్రతి రోజూ 200 కిలోల నెయ్యి అమ్ముడుపోతుంది. అందులో 10 కిలోల నెయ్యి సదరు అధికారిదే. ఒక్క కిలో నెయ్యి ధర రూ.320 ఉంది. ఆ లె క్కన రోజుకు రూ.3 వేలు గడిస్తున్నాడు. నెయ్యి అమ్మకాలను కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉండగా.. అదనపు సంపాదన వస్తుండడంతో డెయిరీలోనే కాంట్రాక్ట్ ఉద్యోగికి కౌంటర్‌ను అప్పగించినట్లు తెలిసింది. ఇవే కాకుండా పాల నుంచి తీసిన వెన్న విక్రయూల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ సంపాదనకు మరిగిన ఈ అధికారి గతంలో ఓసారి బదిలీ అయినా రాజకీయ పలుకుబడితో రద్దుచేయించుకున్నట్లు డెయిరీ సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా పైస్థాయి అధికారిణిపై పలు ఆరోపణలతో బదిలీ చేయించినట్లు తెలిసింది. ఆ స్థానంలో మరో ఉన్నతస్థాయి అధికారి వచ్చినప్పటికీ అతన్ని సైతం మచ్చిక చేసుకున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. అక్రమ సంపాదనతో ఇప్పటికే మూడు చోట్ల బహుళ అంతస్థుల ఇళ్ళను నిర్మించుకుని ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈయనకు సాయం చేస్తున్న ఆ నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులు సైతం విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నట్లు తెలిసింది. ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇటీవల డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. అదే నిజమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధం. వరంగల్ డెయిరీలో అక్రమాలకు తావేలేదు. గతంలో నెయ్యి కౌంటర్‌కు టెండర్లు పిలిచింది వాస్తవమే. ప్రస్తుతం మేమే నిర్వహిస్తున్నాం. నిజారుుతీగా, అభివృద్ధి కోసం పనిచేసే అధికారులపై విమర్శలు చేయడం సరైంది కాదు. - వెంకట్‌రెడ్డి, విజయ డెయిరీ, డిప్యూటీ డెరైక్టర్ -
అరకొరకూ ఎసరు
ఇచ్చేది చాలీచాలని జీతం.. అదీ ఏడాదిగా అందని వైనం గౌరవ వేతనం కోసం ట్యూటర్ల ఎదురుచూపులు నిధులు విడుదలకు సర్కారు మీనమేషాలు వారికిచ్చేదే అరకొర వేతనం.. అదీ నెలనెలా ఇవ్వరు. ఏ మూడు నెలలకో ఓ సారిస్తారు. టీడీపీ సర్కారు కొన్నాళ్లుగా అదీ ఇవ్వడం లేదు. అలా ఏడాదికి పైగా అతీగతీ లేదు. ఎప్పుడు చెల్లిస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ట్యూటర్లు గౌరవ వేతనం అందక నానా యాతన పడుతున్నారు. విశాఖపట్నం: వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం ట్యూటర్లను నియమించింది. ఇందు కు సబ్జెక్టుకు రూ.300 చొప్పున వారికి నెలకు రూ.1500 గౌర వ వేతనంగా చెల్లిస్తుంది. వారు సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు బోధన చేస్తుంటారు. గతంలో వీరికి సకాలంలోనే వేతనాలు అందేవి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నిటి మాదిరిగా నే వీటి నిధుల విడుదలకు కూడా గ్రహణం పట్టించింది. దీంతో చాన్నాళ్లుగా వీరి గౌరవ వేత నం నిలిచిపోయింది. నిరుద్యోగ సమస్యతో సతమత మవుతున్న డిగ్రీ, పీజీలతో పాటు బీఈడీలు పూర్తిచేసిన వారు సైతం ఈ అతి తక్కువ గౌరవ వేతనంతో విద్యా బోధన చేస్తున్నారు. వీరికి బయోమెట్రిక్ విధానం కూడా అమలవుతోంది. ఒకవేళ ఏ రోజైనా విధులకు రాకుంటే ఆ రోజు వేతనంలో కోత విధిస్తారు. ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న వీరికి గౌరవ వేతనాల చెల్లిం పుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 400కు పైగా ట్యూటర్లు.. జిల్లాలో 65 సాంఘిక సంక్షేమ (ఎస్సీ) హాస్టళ్లు, 64 బీసీ సంక్షేమ హాస్టళ్లు వెరసి 129 ఉన్నాయి. ఒక్కో వసతి గృహంలో ఐదుగురు చొప్పున ట్యూటర్లు పాఠాలు చెబుతున్నారు. వివిధ హాస్టళ్లలో 400కు పైగా ట్యూటర్లు జిల్లావ్యాప్తంగా బోధన చేస్తున్నారు. ఎస్సీ వసతి గృహాల్లో ట్యూటర్లకు 2014 నవంబరు నుంచి ఇప్పటిదాకా గౌరవ వేతనాలు ఇవ్వలేదు. అలాగే బీసీ సంక్షేమ హాస్టళ్ల ట్యూటర్లకు గత ఏడాది జూలై, ఆగస్టు మినహా ఇప్పటి వరకు చెల్లించలేదు. 2014లో మూడు నెలల గౌరవ వేతనాలను కూడా సంబంధిత అధికారులు ఏవో కుంటిసాకులు చెప్పి నొక్కేశారని ట్యూటర్లు ఆవేదన చెందుతున్నారు. దీనిపై సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను ఎన్నిసార్లు అడిగినా ఫలితం ఉండడం లేదని వీరు పేర్కొంటున్నారు. ఉన్నత చదువులు చదివి విధిలేని పరిస్థితుల్లో తాము ట్యూటర్లుగా అతి తక్కువ గౌరవ వేతనాలకు పనిచేస్తున్నామని, ఈ చిన్న మొత్తాల చెల్లింపులకు కూడా ఏడాదిగా ఎదురు చూపులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. నెలనెలా ఇవ్వకపోయినా మూడు నెలలకోసారైనా చెల్లించాలని కోరుతున్నారు. వీరికి చెల్లించాల్సిన గౌరవ వేతనాలకు బడ్జెట్ రాలేదని సంక్షేమశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ సొమ్మును ఇతర అవసరాలకు వినియోగిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ట్యూటర్లు ఆరోపిస్తున్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే వారికి చెల్లింపుల్లో మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. మరో పక్షం రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నప్పటికీ తమకు ఇంకెప్పుడు గౌరవ వేతనాలు చెల్లిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గౌరవ వేతనాలు చెల్లించకపోవడం వ ల్ల ఆర్థిక ఇబ్బందులతో కొన్నిచోట్ల ట్యూటర్లు మానేస్తున్నారు. -
వేతన నష్టాలను సరి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఉద్యోగులకు ఉమ్మడి రాష్ట్రంలో వేతనపరంగా జరిగిన నష్టాలను సరిచేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వనున్న మొదటి పీఆర్సీలో ఆ నష్టాన్ని పూడ్చం డి’’ అని పీఆర్సీ హైపవర్ కమిటీకి సచివాలయ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చల్లో భాగం గా సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్ చంద్ర, ఇతర అధికారులు, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మాచారి, సచివాలయ టీఎన్జీవో, టీజీవో, క్లాస్-4, టప్పాల్ అసిస్టెంట్ సంఘాల అధ్యక్షులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్ గుప్తా, వెంకటేశ్వర్రావు, కిషన్‌లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను హైపవర్ కమిటీకి తెలియజేశారు. అనంతరం పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ల పేరును హయ్యర్ గ్రేడ్ టీచర్‌గా మార్చా లని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో పీఆర్సీని వెంటనే అమల్లోకి తేవాలని తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, టీచర్లకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు అమల య్యేలా చూడాలని టీఎస్టీయూ ప్రధాన కార్యదర్శి ఆడమ్స్ కోరారు. హైపవర్ కమిటీ ముందుంచిన డిమాండ్లు... కుటుంబం అంటే ముగ్గురు కాకుండా నలుగురిగా పరిగణనలోకి తీసుకోవాలి. నలుగురికి సరిపడేలా కనీస మూల వేతనాన్ని ఒక్కొక్కరికి రూ. 4 వేల చొప్పున రూ. 16 వేలకు పెంచాలి. ఫిట్మెంట్ 75 శాతం ఇవ్వాలి. ట్రాన్స్‌పోర్టు అలవెన్సును కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలి. ఒక్క చైల్డ్‌కు స్కూల్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ. 15 వేలకు పెంచాలి. గత పీఆర్సీల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు 2013 జూలై 1 నుంచే పీఆర్సీని నగదు రూపంలో వర్తింపజేయాలి. హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయొద్దు. -
ఆశతీరక ఆగ్రహం
వేతన బకాయిల కోసం కదం తొక్కిన ఆశ కార్యకర్తలు ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తం ఏపీఓ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమణ పాడేరు : అసలే చాలీచాలని వేతనం. రూ.400 గౌరవ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నా...అదీ సకాలంలో అందని దుస్థితి. బకాయిలు అడిగితే ఇదిగో అదిగో అంటూ తిప్పలు పెట్టే ఐడీడీఏ...దీంతో కడుపు మండిన ఆశ కార్యకర్తలు ఐటీడీఏను చుట్టుముట్టారు. 14 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళనలో కదం కలిపారు. సీఐటీయు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 1500 మంది ఆశ కార్యకర్తలు సోమవారం ఉదయాన్నే పాడేరుకు చేరుకొని ఐటీడీఏ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. బకాయి వేతనాలు, టీఏ, డీఏలు వెంటనే చెల్లించాలని నెలకు రూ.3 వేలు చొప్పున వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆశల నినాదాలతో ఐటీడీఏ ప్రాంతం దద్దరిల్లింది. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాడేరు ఎస్ఐ ధనుంజయ్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఐటీడీఏ చుట్టూ భద్రతా చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం వరకు ధర్నా కార్యక్రమంతో తమ సమస్యలపై నినాదాలు చేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో కదలిక లేకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికింది. వీరంతా ఒక్క ఉదుటున ఐటీడీఏ కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే రెండు గేట్లను మూసివేయడంతో బయట నుంచే ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. తమకు బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని ఇక్కడే మకాం ఉంటామంటూ మహిళలు గర్జించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమావేశం నిమిత్తం విశాఖపట్నం వెళ్లిపోవడంతో ఇక్కడ ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు ఫోన్ ద్వారా ఆయనకు ఆశ కార్యకర్తల ఆందోళన విషయాన్ని తెలియపరిచారు. ఐటీడీఏ పీఓకూడా ఈ సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆందోళన కారులతో చర్చలు జరపాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. దీంతో ఏపీఓ పీవీఎస్ నాయుడు సీఐటీయు, గిరిజన సంఘం, ఆశ కార్యకర్తల సంఘం నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికే 4 నెలల గౌరవ వేతనాలు ఆశ కార్యకర్తల బ్యాంకు అకౌంట్లలో జమచేశామని, మిగిలిన 9 నెలల వేతనాలను కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేలా జిల్లా కలెక్టరు చర్యలు తీసుకుంటారని ఏపీఓ హామీ ఇచ్చారు. అనంతరం ఆశ కార్యకర్తల ధర్నా కార్యక్రమానికి కూడా ఏపీఓ చేరుకొని బకాయి వేతనాల చెల్లింపులకు ఐటీడీఏ చేపట్టే అత్యవసర చర్యలను వివరించారు. అయినప్పటికి కొంత మంది ఆశ కార్యకర్తలు సంతృప్తి చెందలేదు. వేతనాల చెల్లింపులను పక్కనపెట్టి రాత్రి పగలు తేడా లేకుండా సాటి గిరిజనుల వైద్యానికి శ్రమిస్తున్నామని, శ్రమకు తగ్గ వేతనాలు రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తలకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఏపీఓ తెలపడంతో ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, డివిజన్ కార్యదర్శి ఆర్.శంకరరావు, జిల్లా నాయకులు ఎంఎం శ్రీను, పాలికి లక్కు, సుందరరావు, ఆశ కార్యకర్తలసంఘం జిల్లా అధ్యక్షురాలు బి.రామలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఇ.ప్రభ, పాడేరు డివిజన్ అధ్యక్షురాలు వై.మంగమ్మ, అన్ని మండలాలనాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘కూలి’పోతున్నారు!
నిప్పులవాన కురుస్తున్నట్లు మండుటెండ..సేద తీరుదామంటే కనుచూపు మేర లేని నీడ..తడారిపోయినా గొంతు తడుపుకునేందుకు కరువైన నీరు..ధారాళంగా కారుతున్న స్వేదం..కొలిమిలో కాల్చినట్లు ముట్టుకుంటే మండిపోయే పనిముట్లు..ఉపాధి కూలీలకు నిత్యం ఎదురవుతున్న సవాళ్లివి. పనిచేసే చోట కనీస వసతులు లేక వడదెబ్బకు గురైన ఆ బడుగు జీవులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పొట్టకూటి కోసం ఆరాటపడే పేదలు వాళ్లు. 40 డిగ్రీలకుపైగా ఎండ మండిపోతున్నా..పనిచేయలేక నీరసం వచ్చినా మట్టిపనిని వదలకుండా చేస్తుంటారు. ఇచ్చిన పని పూర్తిచేస్తేనే ఆ రోజు మస్టర్. లేకుంటే అరకొర కూలితో ఇంటిముఖం పట్టాల్సిందే. ఇదీ..ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీల పరిస్థితి. వలసలు నియంత్రించి, పనిలేని కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనులు చేయిస్తున్నామన్న అధికార యంత్రాంగం వారిని మనుషుల్లా చూడటం లేదు. ఉపాధి పనులు చేసే చోటఉండాల్సిన వసతులివీ... ఎండలో నిర్విరామంగా ఉపాధి కూలీలు సేదతీరేందుకు పనిచేసే ప్రదేశానికి సమీపంలో షామియానాలు ఏర్పాటు చేయాలి.పనిప్రదేశంలో కూలీలకు సరిపడా మంచినీరు అందుబాటులో ఉంచాలి.పనిచేసేటప్పుడు ఎవరైనా గాయపడితే..తక్షణం వారికి ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన దూది, బ్యాండేజ్, మందులు ఉండేలా ప్రథమ చికిత్స పెట్టెలు ఉంచాలి.కూలికి వచ్చిన మహిళల్లో ఐదుగురికి పసిపిల్లలు ఉంటే..వారి ఆలనాపాలనా చూసేందుకు కూలీలలో ఒకరిని ఆయాగా నియమించి వారికి మస్టర్ వేయాలి. జరుగుతోందిదీ.. నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు కల్పించాల్సిన వసతులేవీ అందుబాటులో ఉండటం లేదు. సౌకర్యాల కల్పన పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..వాస్తవానికి అవేవీ కూలీల దరిచేరడం లేదు. ఎక్కడా పనిచేసే చోట షామియానాలు ఏర్పాటు చేయడం లేదు. ప్రథమ చికిత్స కిట్లు, మంచినీరూ అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కనీస వసతులు లేక కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. చీరాల మండలంలోని 8 పంచాయతీల్లో పంట కాలువల పూడికతీత పనులకు సాంకేతిక అనుమతి లభించింది. చీరాలనగర్, బుర్లవారిపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం, ఈపూరుపాలెం, కావూరివారిపాలెం, గవినివారిపాలెం, దేవినూతల గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 1100 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పంటకాల్వల పూడిక తీత పనులను చేపట్టారు. ఎక్కడా వారికి కావాల్సిన వసతులు కల్పించడం లేదు. పలుచోట్ల మహిళా కూలీలు మండుటెండలకు నీరసించి సొమ్మసిల్లుతున్నారు. వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ జిల్లాలో అక్కడక్కడా చోటుచేసుకున్నాయి.ఉపాధి కూలీలు రోజూ ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పనిచేస్తే రూ.149 కూలీగా చెల్లిస్తున్నారు. వసతులు కల్పించని చోట తాగునీరు కూలీలే తెచ్చుకోవాలంటూ అందుకోసం ఒక్కో కూలీకి రూ.5, షామియానాకు రూ.5 అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఒక్కో కూలీకి వేతనంతో పాటు ఈ అలవెన్స్‌లు ఇవ్వడం లేదు. కూలీల సొమ్మును కూడా అధికారులే పంచుకుంటున్నారు. దీంతో కూలీలు కనీస వసతులు లేకుండానే పనిచేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు.