YSR Uchitha Pantala Bheema Scheme
-
పంటల బీమాకు ‘పాత’ర!
రూ.4 లక్షల బీమా పరిహారం అందుకున్నా..పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత ఐదేళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా రూ.4 లక్షలకు పైగా బీమా పరిహారం పొందా. రూ.2 లక్షల వరకు పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందుకున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కి ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కిందపాలెం, బాపట్ల జిల్లాసాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమపై పైసా భారం పడకుండా కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు పాతరేసే దిశగా టీడీపీ సర్కారు సన్నద్ధం కావడం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం.. ఏ ఒక్కటీ ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు వాటిని గాలికి వదిలేశారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేసిన కూటమి సర్కారు కన్ను తాజాగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై పడింది. ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ ఈ పథకం దేశానికే తలమానికంగా నిలిచింది. అయితే 2019కి ముందు అమలులో ఉన్న పాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు రేపింది. గత ఐదేళ్లుగా తాము కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పైసా భారం లేకుండా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా తమ ఖాతాల్లో జమ చేసే పరిస్థితి ఇక ఉండదన్న ఆందోళన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ సర్కారు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.ఏళ్ల తరబడి ఎదురు చూపులు..1965లో కేంద్రం తెచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా ప్రవేశపెట్టిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని ప్రధాని ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా 2016 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడంతో పాటు అవగాహన లేక పలువురు రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకునే రైతులకు మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగతాది అందచేసేవి. అయితే బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుంది? ఎప్పుడొస్తుందో అంతుబట్టక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.2014–19 పరిహారం రూ.3,411.20 కోట్లే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ కేంద్ర పథకాలపై ఆధార పడడం మినహా అన్నదాతల సంక్షేమం కోసం తపించిన దాఖలాలు లేవు. 2014–19 మధ్య తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్కీమ్ (ఏఐఎస్), ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలు చేశారు. ప్రీమియం రూపంలో 2014–19 మధ్యలో రైతులు తమ వాటాగా రూ.1249.90 కోట్లు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1281 కోట్లు చెల్లించింది. హుద్‌హుద్ లాంటి పెను తుపాన్, కరువు కాటకాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు 2014–19 మధ్య దక్కిన పరిహారం కేవలం రూ.3,411.20 కోట్లు మాత్రమే. పైసా భారం పడకుండా.. పాదయాత్ర హామీ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది పీఎం ఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేశారు. 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకానికి శ్రీకారం చుట్టగా అనంతరం ఆ భారం కూడా రైతులపై పడకూడదన్న ఆలోచనతో ఖరీఫ్–2020 నుంచి నోటిఫైడ్ పంటలకు ఉచితంగా బీమా కవరేజ్ కల్పించారు. క్లెయిమ్‌లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. తొలి ఏడాది రైతుల వాటా (రూ.468 కోట్ల)తో కలిపి ప్రీమియం రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.971 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం ముందుకు రాకపోవడంతో 2020–21, 2021–22 సీజన్లలో పీఎం ఎఫ్‌బీవైతో సంబంధం లేకుండా మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లించింది. 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం గత ప్రభుత్వం సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా.. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదు అందచేసింది. ‘డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట బీమా చేసింది‘ అని అందులో స్పష్టంగా తెలియచేసింది. ఈ జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందచేసింది. ప్రీమియం రూపంలో రైతుల వాటాతో కలిపి 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లు కంపెనీలకు చెల్లించింది. 2019–24 మధ్య 1.91 కోట్ల హెక్టార్లకు బీమా కవరేజీ కల్పించగా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. రికార్డు స్థాయిలో పరిహారం.. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి గత సర్కారు అండగా నిలిచింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్రం గుర్తించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద ఉత్తమ బీమా పథకంగా ఎంపిక చేసింది. 2023 ఏప్రిల్ 14న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఏపీ స్ఫూర్తిగా జాతీయ స్థాయిలో పీఎంఎఫ్‌బీవైలో పలుమార్పులు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. 2023–24 నుంచి మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు ఏపీ బాటలోనే రూపాయి ప్రీమియంతో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టాయి. ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి. రూ.1,278.80 కోట్ల ప్రీమియం చెల్లింపులకు ఎగనామం.. 2023–24 సీజన్‌కు సంబంధించి బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను గతంలోనే కేంద్రానికి పంపించారు. ఆ మేరకు రైతుల వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,278.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ప్రభుత్వం మారడంతో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత టీడీపీ సర్కారుపై ఉంది. అయితే పాత పద్ధతిలోనే పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా 2023–24 సీజన్ ప్రీమియం చెల్లింపులు జరపవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో 2023–24 సీజన్లో వర్షాభావం, వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు 2024–25 సీజన్ నుంచి రైతులే చెల్లించేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వారిపై పెనుభారం పడనుంది. రైతులపై ఏటా రూ.800 కోట్లకుపైగా భారం ఏ పంటైనా సరే జిల్లాలో కనీసం ఐదువేల ఎకరాల్లో సాగైతేనే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన పంట పెట్టుబడి ఖర్చులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్దేశిస్తాయి. ఉదాహరణకు వరికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చవుతుంటే కనీసం 8 శాతం అంటే రూ.3,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తేనే బీమా కవరేజ్ కల్పిస్తుంది. ఈ మొత్తంలో ఖరీఫ్‌లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు గతంలో చెల్లించగా మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. ఈ లెక్కన నోటిఫై పంటలకు రైతులు తమ వాటాగా ఏటా కనీసం రూ.800 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో భరించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందని కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు సొంతంగానే ప్రీమియం చెల్లించాలి. వీరికి అవగాహన కల్పించకపోవడం, ఆర్ధిక భారం కారణంగా బీమాకు ముందుకు రావడం లేదు. దీంతో పంట నష్టపోతే విపత్తుల వేళ బీమా పరిహారం అందని దుస్థితి నెలకొంటుంది. వైఎస్సార్ రైతు భరోసాను హడావుడిగా అన్నదాతా సుఖీభవగా మార్చేసి రూ.20 వేలు ఇవ్వకుండా ఇప్పటికే సీజన్లో అన్నదాతలను ముంచేసిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం పిడుగుపాటుగా మారింది.రూ.2.75 లక్షల పరిహారం ఇచ్చారువైఎస్సార్ ఉచిత పంటల బీమా అన్నదాతలను ఎంతో ఆదుకుంది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్‌లో నమోదైతే చాలు బీమా వర్తింపచేశారు. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, శనగ, ఉల్లి సాగు చేస్తుంటాం. 2019–20లో ఒక్క ఉల్లి పంటకే రూ.1.10 లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ తర్వాత రూ.70 వేలు, రూ.42 వేలు, రూ.53 వేలు చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.75 లక్షల బీమా పరిహారం అందింది. రూపాయి ప్రీమియం చెల్లించకపోయినా ఇంత భారీగా పరిహారం దక్కటం ఎంతో ఊరటనిచ్చింది. అన్నదాతలకు ఎంతగానో ఆసరాగా నిలిచిన ఈ ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. 2019కి ముందు ఉన్న పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. –గౌర మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కర్నూలు జిల్లాపాత విధానం సరికాదు..30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 2021 ఖరీఫ్‌లో అరటి పంట దెబ్బతినడంతో రూ.90 వేల పంటల బీమా పరిహారం నేరుగా నా ఖాతాలో జమ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఐదేళ్లూ పైసా కూడా మేం ప్రీమియం చెల్లించలేదు. మా వాటా కూడా ప్రభుత్వమే కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం పాత విధానంలో పంటల బీమా అమలు చేస్తామని చెప్పడం సరికాదు.– గనివాడ సన్యాసినాయుడు, పెదమదుపాడ, విజయనగరం జిల్లారైతులు బీమా చేయించుకోలేరు2019కు ముందు టీడీపీ హయాంలో రైతులు బీమా చేయించుకుంటేనే నష్టపరిహారం వర్తించేది. రైతులలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నందున అవగాహన లేక నష్టపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేసింది. 2021లో వర్షాలకు 80 సెంట్లు పొలంలో నష్టపోతే నేరుగా రూ.5,100 పరిహారం ఇచ్చారు. – డి. ప్రభాకర్, తాటితూరు, భీమిలి మండలంరూ.3.80 లక్షల పరిహారం వచ్చిందినేను పైసా ప్రీమియం చెల్లించకపోయినా 2021లో ఖరీఫ్‌లో పంట నష్టపోతే రూ.3.80 లక్షల బీమా పరిహారం జమైంది. గతంలో ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పరిహారం కోసం అధికారులు, కంపెనీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించాలి.– వీరపురం భీమేష్, గడేకల్లు, అనంతపురం జిల్లారైతుల తరపున ఉద్యమిస్తాం..రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాల్సిందే. పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించటాన్ని ఖండిస్తున్నాం. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుంది. ప్రీమియం చెల్లించలేక బీమాకు మెజార్టీ రైతులు దూరమవుతారు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించకుంటే ఉద్యమిస్తాం.– కె.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపాత పద్ధతితో తీవ్ర నష్టంగతంలో క్రాప్ లోన్ ఆధారంగా రైతులు సాగు చేసిన పంటలకు కాకుండా ఇష్టానుసారంగా ఇన్సురెన్స్ ఇచ్చేవారు. ఐదేళ్లుగా ఉచిత పంటల బీమా అమలు చేయడం వలన పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండా సాగు చేసిన పంటకు బీమా పరిహారం నేరుగా అందింది. ఈ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతితో తీవ్రంగా నష్టపోతాం.– ఎన్.రాజేశ్వరరెడ్డి, సింహాద్రిపురం, వైఎస్సార్ జిల్లా -
Fact Check: బీమాతో రైతులకు ధీమా కనిపించడంలేదా?
సాక్షి, అమరావతి: నిత్యం అసత్యపు వార్తలతో ప్రజల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఈనాడు రామోజీరావు.. పంటల బీమాపై విషపురాతలు రాశారు. రైతులపై పైసా భారం పడకుండా ఈక్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తూ దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంటే.. ఈనాడు పత్రిక మాత్రం బురద జల్లడమే పనిగాపెట్టుకుంది. ఒక సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని వచ్చే ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తుంటే ‘ఉచిత బీమా ఉన్నాట్టా? లేనట్టా?’ అంటూ రైతులను తప్పుదోవపట్టించేలా విషపు రాతలు రాస్తోంది. ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరి కింద సాగైనా.. ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టడమే కాకుండా పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ సీజన్‌కు సంబంధించి జిల్లాల వారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలను పూర్తి మార్గదర్శకాలతో ఇటీవలే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిపై ఈనాడు పలు ఆరోపణలు చేసింది. ఆరోపణ: ఖరీఫ్ ముగిసినా స్పష్టతేది? వాస్తవం: ఎటువంటి పక్షపాత వైఖరికి తావులేకుండా వ్యవసాయ, రెవెన్యూ ఉమ్మడి అజమాయిషీలో ఈ–పంట నమోదు చేస్తున్నారు. ఖరీఫ్–23లో ఈ–క్రాప్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పట్టు, సామాజిక అటవీ సాగు పంటలను కలిపి 93 లక్షల ఎకరాలను నమోదు చేశారు. అయితే మార్గదర్శకాల మేరకు ఖరీఫ్, రబీ సీజన్ వారీగా నోటిఫై చేసిన పంటలకు మాత్రమే బీమా వర్తిస్తుందన్న విషయం రామోజీకి తెలియంది కాదు. ఖరీఫ్ 2023లో 15 పంటలను దిగుబడి ఆధారంగా, 6 పంటలను వాతావరణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలను దిగుబడి ఆధారంగా, 4 పంటలను వాతావరణ ఆధారంగా బీమా పరిధిలోకి తీసుకొచ్చి ఆమేరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆరోపణ: కేంద్ర బీమా పోర్టల్‌లో వివరాలేవీ? వాస్తవం: ఇతర రాష్ట్రాల్లో నేషనల్ క్రాపు ఇన్సూరెన్సు పోర్టల్ విషయానికి వస్తే.. బ్యాంకు నుంచి రుణం మంజూరైన సమయంలో ఆ బ్యాంకుల ద్వారాను, రుణం పొందని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా గడువులోగానూ ప్రీమియం చెల్లించిన వారికే బీమా వర్తింప చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ ఖరీఫ్‌లో జూలై 31 నాటికి, రబీలో డిసెంబర్ 31 నాటికి పూర్తి చేస్తారు. అర్హత పొందిన లబ్ధిదారుల వివరాలను మాత్రమే పోర్టల్‌లో పొందుపరుస్తారు. గడువులోగా ప్రీమియం చెల్లించలేని రైతులు బీమా రక్షణ అవకాశాన్ని కోల్పోతారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఈక్రాప్ డేటా ఆధారంగా క్రాప్ ఇన్సూరెన్సు పోర్టల్‌లో నేరుగా నమోదు చేసే వెసులుబాటు కల్పించారు. తద్వారా యూనివర్సల్ కవరేజీ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. ఆరోపణ: ఆది నుంచి జాప్యమే వాస్తవం: కేంద్ర మార్గదర్శకాల మేరకు ఏటా అక్టోబర్ 31 నాటికి ఖరీఫ్ ఈక్రాప్ డేటా, మార్చి 31 నాటికి రబీ ఈక్రాప్ డేటా కేంద్రానికి పంపిస్తున్నారు. ఖరీఫ్ 23 సీజన్‌కు సంబంధించి ఈక్రాప్‌లో నమోదైన పంటలు, రైతుల వివరాలను కేంద్రంతో పాటు ఎంపిక చేసిన బీమా కంపెనీలకు అక్టోబర్ 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. గడువు తేదీలను నోటిఫికేషన్లో కూడా తెలియజేశారు. నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో నోటిఫికేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ టెక్నికల్ బృందం ఈ క్రాప్‌లో నమోదైన రైతుల వారీ వివరాలను పరిశీలన పూర్తి చేసిన తర్వాతనే పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌లో ఖరీఫ్ డేటా ప్రదర్శిస్తారు. ఇది కేవలం కేంద్రప్రభుత్వ పరిధిలోని సాంకేతికమైన అంశమే తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం కానీ, తప్పిదం కానీ ఏమాత్రం లేదన్నది సుస్పష్టం. ఆరోపణ: బీమా ఉందో లేదో తెలిసేదెలా? వాస్తవం: సామాజిక తనిఖీ, గ్రామ సభల అనంతరం ఈక్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. తొలుత డిజిటల్ రశీదులో రైతుకు తాను సాగు చేసిన పంట వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తున్నారు. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే భౌతిక రశీదు అందిస్తున్నారు. భౌతిక రశీదులో ఉచిత పంటల బీమా పథకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియజేస్తూ సంబంధిత సాగుదారుడి సంతకంతో అందజేస్తున్నారు. ఆ మేరకు జారీ చేసిన భౌతిక రశీదులో ‘డా.వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం క్రింద నోటిఫై చేసిన మీ పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి తద్వారా పంట బీమా చేయబడినది’ అని స్పష్టంగా పేర్కొంటున్నారు. అలాంటప్పుడు బీమా ఉందో లేదో రైతులకు తెలియకపోవడమేమిటో ఈనాడుకే తెలియాలి. ఆరోపణ: బీమా లేకుంటే నిండా మునగడమే వాస్తవం: టీడీపీ ఐదేళ్ల పాలనలో 30.85 లక్షల మందికి రూ. 3,411.20 కోట్ల పరిహారం ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ. 7,802.05 కోట్ల పరిహారాన్ని జమ చేసింది. పైగా గతంలో ఉండే లోటుపాట్లను సరి చేస్తూ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంటే లేనిపోని అపోహలు సృష్టించేలా రైతులను గందరగోళ పరిచేలా విషపు రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది. -
ఏపీ బీమా.. ది బెస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగు చేసిన ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పించడంపై పలు రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ముందుకొచ్చాయి. 2023–24 వ్యవసాయ సీజన్ నుంచి కేవలం రూపాయి ప్రీమియంతో తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగిన 10వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఈ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఏడాది నుంచి రైతుల నుంచి రూపాయి మాత్రమే వసూలు చేస్తామని, మిగిలిన మొత్తాన్ని తమ ప్రభుత్వాలు భరిస్తాయని ఆ రాష్ట్రాల ప్రతినిధులు చెప్పారు. సెమినార్లో పాల్గొన్న మరికొన్ని రాష్ట్రాలు కూడా ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలును అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించాయి. గతంలో పంటల బీమా రైతులకు అందని ద్రాక్షగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక 1965లో కేంద్రం తీసుకొచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం.. ఆ తర్వాత వివిధ రూపాలు మార్చుకొని ప్రస్తుతం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. అధిక ప్రీమియం కారణంగా ఈ పథకంలో చేరేందుకు సన్న, చిన్నకారు రైతులు ఆసక్తిచూపే వారు కాదు. ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమాకు దూరంగా ఉండడంతో ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయే వారు. బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. అధికారంలోకి రాగానే శ్రీకారం పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 జూలై 8న ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2019 ఖరీఫ్ సీజన్లో ఒక్క రూపాయి ప్రీమియంతో ఈ పథకాన్ని అమలు చేయగా, ఆ తర్వాత సీజన్ నుంచి ఆ భారం కూడా రైతులపై పడకుండా వారు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింప చేస్తోంది. క్లెయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. ఈ–పంటలో నమోదైన నోటిఫైడ్ పంటలకు సీజన్ ముగియకుండానే లబ్ధిదారుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తోంది. అభ్యంతరాల పరిష్కారం అనంతరం బీమా పరిహారం చెల్లిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇంకా ఎవరైనా మిగిలి పోయారేమోనని వెతికి మరీ అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తోంది. ఇలా ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున ఈ నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఇందులో టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. ఏపీ భేష్ అంటూ ముందుకొచ్చిన కేంద్రం పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించడం ద్వారా 2019–20లో రైతుల వాటాతో కలిపి రూ.971 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం రూపంలో చెల్లించింది. ఆ తర్వాత రెండేళ్లు బీమా కంపెనీలతో సంబంధం లేకుండా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్ విషయంలో ఏపీ స్ఫూర్తిగా కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. 2022–23లో పీఎంఎఫ్‌బీవైతో కలిసి ఉచిత పంటల బీమా పథకం అమలైంది. దిగుబడి ఆధారిత పంటల కోసం 2022 ఖరీఫ్‌లో రైతుల వాటాతో కలిపి రూ.1,213.37 కోట్లు కంపెనీలకు చెల్లించగా, వాతావరణ ఆధారిత పంటలకు గతంలో మాదిరిగా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. గతంలో ఏటా సగటున 16 లక్షల మంది రైతులు, 48 లక్షల ఎకరాలకు బీమా చేయించు కోగలిగితే.. ఈ ప్రభుత్వం వచ్చాక 2019 – 2022 మధ్య ఏటా సగటున 30 లక్షల మంది రైతులకు చెందిన 71.55 లక్షల ఎకరాలకు ఉచిత బీమా కవరేజ్ కల్పించింది. 2020 ఖరీఫ్‌లో 50 లక్షల ఎకరాలకు కవరేజ్ కల్పిస్తే, 2021 ఖరీఫ్‌లో బీమా కల్పించిన విస్తీర్ణం ఏకంగా 80 లక్షల ఎకరాలకు చేరింది. ఇలా యూనివర్సల్ కవరేజ్ సాధించిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. ఈ తరహా స్కీమ్ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని బీమా రంగ నిపుణులే కాదు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు ‘రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేశాం. నోటిఫైడ్ పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఈ క్రాప్ డేటా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకే రైతుల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరాం. 2023–24 సీజన్ నుంచి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ స్ఫూర్తితోనే ఫసల్ బీమాలో మార్పులు కూడా తీసుకొచ్చాం’ అని గత కాన్ఫరెన్స్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించడం తెలిసిందే. ఏపీ బాటలో మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగులు వేయాలని అప్పట్లోనే ఆయన సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కేంద్ర మంత్రితో సహా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలు తీరును ప్రస్తావించని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేశాయి. 2019లో ఏపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే రూపాయికే పంటల బీమా అమలు చేస్తున్నామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు జాతీయ స్థాయిలో అమలు జరుగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం అని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఏపీ ఈ–క్రాప్ ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తూ బీమా రక్షణ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ 20 రాష్ట్రాలు పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్‌లో పలువురు కొనియాడారు. రైతులపై పైసా భారం పడకూడదన్న ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. పంటల బీమా పరిధిలో కవరేజ్ పెంచడానికి ఇతర రాష్ట్రాలకు ఏపీ మార్గదర్శకంగా వ్యవహరించిందని కేంద్ర ఉన్నతాధికారులు ప్రకటించారు. సర్వత్రా ప్రశంసలు వర్కుషాపులో ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిసింది. దేశంలోనే అతి తక్కువ ప్రీమియంతో యూనివర్సల్ బీమా కవరేజ్‌ని అమలు చేస్తుండడం పట్ల, సెమినార్లో పాల్గొన్న రాష్ట్రాలన్నీ ప్రశంసించాయి. తగిన మోడల్‌ను ఎంచుకోవడానికి రాష్ట్రాలకు నిర్ణయాధికారం ఇవ్వడం వల్ల 2023–24 సీజన్లో దేశంలోనే అతితక్కువ ప్రీమియం రేట్లను ఏపీ ప్రభుత్వం సాధించగలగడాన్ని కూడా ప్రశంసించారు. ఏపీ బాటలోనే తాము కూడా పయనిస్తున్నామంటూ సెమినార్లో ఆయా రాష్ట్రాలు ప్రకటించడం గొప్ప అచీవ్మెంట్. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ అరుదైన గౌరవం రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. అందులో ఈ క్రాప్, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలు కీలకం. ఈ రెండు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వీటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు క్యూ కడుతున్నాయి. ఒకేసారి నాలుగు రాష్ట్రాలు ఏపీ బాటలో అడుగులు వేస్తున్నట్టు ప్రకటించడం ఏపీ ప్రభుత్వానికి దక్కిన అరుదైన గౌరవం. – కాకాని గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్‌కు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా అందజేశారు. ఈరోజు(శుక్రవారం) వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్‌లు సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను చూపించారు. దీనిలో భాగంగా అధికారులను అభినందించిన సీఎం జగన్.. భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పని చేయాలని, దిగుబడులు అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. కాగా, సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది. -
రైతుల నష్ట పరిహారం పై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది
-
ఎల్లోమీడియా కథనాలు.. ఆ మేధావులకు నా నమస్కారాలు: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: రైతులకు పంట నష్ట పరిహారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరులో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రైతు ఒక్క రూపాయి కుడా కట్టకుండా ప్రీమియం చెల్లించేలా చర్యలు చేపట్టాం. ఈ క్రాప్‌లో నమోదు చేసుకొంటే చాలు.. రూ.3 వేల కోట్ల బీమా రైతులకు చెల్లిస్తున్నాము. నష్టపరిహారంపై తప్పుడు రాతలు రాస్తున్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఎల్లో మీడియాలో కథనాలు సిగ్గుచేటు. ఆ మేధావులకు నా నమస్కారాలు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.. 'విలేజ్‌ని యూనిట్‌గా తీసుకొని పారదర్శకంగా బీమా పథకాన్ని అమలు చేస్తున్నాము. 31 పంటల్లో 5 పంటలకు నష్టం జరగ లేదని అధికారులు నివేదిక ఇచ్చారు. నష్టపోయిన ప్రతీ రైతుకూ పరిహారం అందిస్తున్నాము. టీడీపీ హయాంలో రూ.596 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి పోయారు. రైతులు జోరుగా ఉంటే చంద్రబాబు బేజారు అయిపోతాడు. చంద్రబాబు రైతులకు ఏమి చేశారో చెప్పాలి. దోపిడీ పథకాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా టీడీపీ చేయలేదు. రుణమాఫీ విషయంలో రైతులను టీడీపీ మోసం చేసింది. ఇప్పుడు సిగ్గులేకుండా రైతు యాత్ర అంటున్నాడు. చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయని' మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!) -
వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆర్థికంగా ఎంతో రక్షణ కల్పిస్తోందన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఉచిత పంటల బీమాను అమలు చేయడం చరిత్రాత్మకమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తూ 26 రకాల పంటలకు బీమా వర్తిస్తోందన్నారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ.. బీమా పరిహారం ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోగా పంట నష్ట పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ), సీజన్ మారేలోగా పంటల బీమా పరిహారం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇది గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 2016 ఖరీఫ్‌లో 16.36 లక్షల మంది రైతులు పంటల బీమా కోసం నమోదు చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 30.6 లక్షలకు పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా 2021 ఖరీఫ్‌లో నష్టపోయిన 15.60 లక్షల మంది రైతులకు 2022 ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్లు పరిహారం జమ చేశామన్నారు. ఉల్లి, టమాట, దానిమ్మతోపాటు చిరుధాన్యాల పంటలను కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ఇంకా అర్హులుంటే ఆర్బీకేలను సంప్రదించాలి.. పంటలు నష్టపోయిన అర్హుల జాబితాను ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకంగా రూపొందించినట్టు వివరించారు. బీమా పరిహారం అందని అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే 15 రోజుల్లోగా ఆర్బీకేల్లో గానీ గ్రామ సచివాలయాల్లో సంప్రదిస్తే విచారించి పంట నష్ట పరిహారాన్ని అందిస్తామన్నారు. రెండు రకాలుగా నోటిఫైడ్ పంటలకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. ఇందులో దిగుబడి ఆధారిత పంటలు నష్టపోయిన 8,47,759 మంది రైతులకు రూ.2,143.85 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలు నష్టపోయిన 7,12,944 మంది రైతులకు రూ.833.97 కోట్లు జమ చేశామన్నారు. గతంలో ప్రైవేటు సంస్థల వల్ల రైతులకు సరైన పరిహారం దక్కేది కాదని, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పంటల బీమా ప్రీమియానికి దూరంగా ఉండేవారన్నారు. ఇప్పుడు ఈ–క్రాప్ నమోదు సమయంలోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. తగ్గిన రుణ ఎగవేతలు.. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు అన్ని రకాల సేవలను అందిస్తూ వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున అందుతున్న సంక్షేమ పథకాలతో రుణ ఎగవేతలు బాగా తగ్గినట్టు ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు కితాబు ఇచ్చారన్నారు. పంటల విస్తీర్ణంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ గణనీయంగా వృద్ధి నమోదైందన్నారు. క్రాప్ హాలిడే కాదు.. మూడు పంటల ముందస్తు జోరు.. రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా ముందస్తుగా నీటిని విడుదల చేసి మూడు పంటలు సాగయ్యేలా ప్రోత్సహిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. క్రాప్ హాలిడేకు అవకాశం లేదన్నారు. మూడు పంటలు వస్తే రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా నేల సారవంతం అవుతుందన్నారు. గత నాలుగేళ్లలో రైతుల మరణాలు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. కోనసీమ డెల్టా చివరి ప్రాంతాలకూ నీరందేలా జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుని కాలువల మరమ్మతులు, పూడికతీతపై దృష్టి సారించామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. గతంలో ఆలస్యంగా పంటలు వేయడంతో తుపాన్లతో పంట నష్టపోవడమేగాక మూడో పంటకు అవకాశం ఉండేది కాదన్నారు. -
బండెనక బండికట్టి..
రామచంద్రపురం: ప్రకృతి విపత్తులు, తెగుళ్ల మూలంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అత్యధికంగా పంటల బీమాను అందజేస్తుండటాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అన్నదాతలు మంగళవారం వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. 500 ట్రాక్టర్లతో 22 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో గత ఖరీఫ్ సీజన్లో తుపాను వల్ల రైతులు అత్యధికంగా నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యేకంగా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈనేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూ రాని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ నియోజకవర్గానికి రూ.130 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రైతులు కె.గంగవరం మండలం పామర్రు నుంచి గొల్లపాలెం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కష్టకాలంలో ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని కొనియాడారు. మంత్రి తనయుడు నరేన్ ఈ ర్యాలీని ప్రారంభించారు. -
AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం..
మొన్నామధ్య చంద్రబాబు అనంతపురం వచ్చారు.. గోదావరి జిల్లాలకూ వెళ్లారు.. ఆత్మహత్య చేసుకున్న నిజమైన రైతు (పట్టాదారు పాసుపుస్తకం ఉన్న) ఎవరికైనా పరిహారం అందకపోతే చూపించండని సవాల్ విసిరితే స్పందన లేదు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తామో.. అంతగా ఆ రైతు కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. గత ప్రభుత్వంలో 458 మంది రైతులు చనిపోతే ఇదే బాబు పరిహారం ఇవ్వకపోతే.. మన ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం. జిల్లాలకు వెళ్లాలి.. పల్లెలకు వెళ్లాలని ఈ దత్తపుత్రుడు అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు? కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను మేము తీర్చినందుకా? కేంద్రం నుంచి సకాలంలో డబ్బు రాకపోయినా ధాన్యం డబ్బులు ఇవ్వడం కోసం కిందా మీద ప్రయాస పడుతున్నందుకా? రైతుల కోసం ఇన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఏం సమాధానం చెబుతారు? ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడు. గతంలో పాలన, ఇప్పుడు మీ బిడ్డ పాలన ఎలా ఉందో ఒక్కసారి మార్పులు గమనించాలని కోరుతున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రైతులకు మేలు చేయడంలో మనం పోటీ పడుతున్నది ప్రతిపక్షాలతో కాదు.. దేశంతోనే పోటీ పడుతున్నాం. చాలా రాష్ట్రాల ప్రతినిధులు మన రాష్ట్రంలో వ్యవసాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూసి వెళ్తున్నారు. తమ ప్రాంతంలో కూడా ఇలాంటివి ఎలా అమలు చేయాలని అడుగుతున్నారు. దేశం యావత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రాష్ట్రంలోని 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలోలాగా పరిహారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి నేడు లేదన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ–క్రాప్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు.. రైతు ఖాతాలోనే నేరుగా సొమ్ము వచ్చి పడేలా చేస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి గతంలో పాలన ఎలా సాగింది.. ఇప్పుడు మీ బిడ్డ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని కోరారు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ మళ్లీ మొదలయ్యేలోగా పరిహారం ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని చెప్పారు. ప్రభుత్వం ఓవైపు నవరత్నాలు పథకాల ద్వారా తోడుగా ఉంటూనే.. మరోవైపు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వ్యవసాయానికి అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చెన్నేకొత్తపల్లిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లలోనే రూ.6,685 కోట్లు ఇచ్చాం ► 2014 – 2019లో తెలుగుదేశం పాలన సాగింది. ఆ ఐదేళ్లలో పంటల బీమా కింద ఆ ప్రభుత్వం 30.85 లక్షల మంది రైతులకు కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చింది. అదే మనం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ ఈ మూడేళ్లలోనే 44.28 లక్షల మందికి రూ.6,685 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నా. ► 2012 – 2013 సంవత్సరానికి సంబంధించి రూ.120 కోట్లకు పైగా పంటల బీమా బకాయిలు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో రూ.590 కోట్లు రైతులకు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వాలు పెట్టిన రూ.715.84 కోట్ల బకాయిలను మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇచ్చామని చెబుతున్నా. ఇన్ని మార్పులు ఎక్కడైనా జరిగాయా? ► వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద 53 లక్షల రైతు కుటుంబాలకు మంచి చేస్తూ ఈ మూడేళ్లలోనే రూ.23,875 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. జూన్ అంటేనే వ్యవసాయ పండుగ నెల. దీంతో రైతుకు తోడుగా నిలబడేందుకు రైతు భరోసా కింద రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతుల కోసం మీ బిడ్డ రూ.1.28 లక్షల కోట్లు ఖర్చు చేశాడు. ► గతంలో పాలకులకు అనుకూలమైన వారికే పరిహార ఫలాలు అందేవి. ఇప్పుడలా కాకుండా, వివక్షకు తావు లేకుండా అందరికీ ఇస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.1,613 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద రూ.1,283 కోట్లు చెల్లించాం. గతంలో చంద్రబాబు ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద కేవలం రూ.780 కోట్లు మాత్రమే ఇచ్చారు. అదే మనం మూడేళ్లలోనే రూ.1,283 కోట్లు ఇచ్చాం. ► ఈ మూడేళ్లలో 10,778 రైతు భరోసా కేంద్రాలు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ కేంద్రాల్లో 24,480 మంది మన పిల్లలు సేవలందిస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేలు రైతుల చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా యంత్ర సామగ్రిని రాయితీతో ఇస్తున్నాం. ఉచిత విద్యుత్, ధాన్యం బకాయిలూ చెల్లించాం ► రైతులకు ఈ మూడేళ్లలో ఉచిత విద్యుత్ కింద పగటిపూట తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇచ్చేందుకు రూ.25,800 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్లు మెరుగు పడాలని మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని మోసం చేసింది. ఆ బకాయిలు రూ.8,750 కోట్లు ఉంటే వాటిని కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. ► ధాన్యం డబ్బు చెల్లింపుల్లో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే ఆ డబ్బూ మనమే చెల్లించాం. విత్తనాల కొనుగోలుకు కూడా అప్పటి ప్రభుత్వం రూ.430 కోట్లు బకాయి పెడితే మనమే ఇచ్చాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం. ప్రతి ఏడాది వచ్చిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. ► గతంలో దురదృష్టవశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే అవి ఆత్మహత్యలు కావని ప్రభుత్వాలు చెప్పేవి. ఈరోజు ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని పక్కాగా ఆదుకుంటున్నాం. కౌలు రైతుకు సీసీఆర్సీ కార్డు ఉంటే వెంటనే రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నాం. ► పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకొచ్చాం. ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి హెరిటేజ్ కంపెనీ కూడా లీటరుకు రూ.5 నుంచి రూ.10 పెంచాల్సి వచ్చింది. అప్పుడు నాయకుల జేబుల్లోకి డబ్బు వెళ్లేది. ఇవాళ మీ బిడ్డ బటన్ నొక్కి మీ ఖాతాల్లోకి వేస్తున్నారు. బాబు.. దత్తపుత్రుడు.. ఆ మూడు ► మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే ముందు బాబు, తర్వాత ఆయన దత్తపుత్రుడు.. వీళ్లిద్దరికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అందరూ ఏకమవుతారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్ధానికి రంగులు పూస్తారు. ► చంద్రబాబు లేదా దత్తపుత్రుడు వస్తే అడగండి.. గతంలో మేనిఫెస్టోను చూసి ఓట్లేశాం.. ఆ మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి. రుణమాఫీ అంటూ మోసం చేసి.. ఉచిత విద్యుత్, ధాన్యం, విత్తన బకాయిలు, పంటల బీమా కూడా చెల్లించకుండా బకాయిలు ఎగ్గొటిన చంద్రబాబు వీళ్ల దృష్టిలో మంచోడట. ► కోవిడ్ వల్ల రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఆ రెండేళ్లూ పరీక్షలు లేకుండా పాస్ చేశాం. ఇప్పుడు పరీక్షలు పెడితే 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గుజరాత్లో 65 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఇలాంటి సమయంలో వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాల్సిందిపోయి వారిని రెచ్చగొట్టడానికి యత్నిస్తున్నారు. ► మన పిల్లలకు ఇవ్వాల్సింది నాణ్యమైన చదువులు. ప్రపంచంతో పోటీ పడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యా రంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ► మాట ఇచ్చి తప్పితే ఏమనుకుంటారోనన్న బాధ లేని వారు రాజకీయాలకు అర్హులా.. అని అడుగుతున్నా. ఏం చేస్తే చంద్రబాబుకు మంచి జరుగుతుందో.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసే వీళ్లిద్దరూ తోడుదొంగలు. రాజకీయాల్లో ఉండేందుకు వీళ్లు అర్హులేనా అనేది మీరు చెప్పాలి. ► మూడేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్నీ అమలు చేశాం. ఆ మేనిఫెస్టోను చూసి మీరే టిక్ పెట్టండి. ఇద్దరికీ తేడా మీరే గమనించండి. అంబేడ్కర్ పేరు పెడితే మంత్రి ఇంటిని తగలబెడతారా? ► కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ మహానుభావుడి పేరు పెట్టాం. దీంతో ఒక దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చేశారు. అంబేడ్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేక పోయారు. ఇదా మీరు చూపించే సామాజిక న్యాయం? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? ► మీ బిడ్డ మంత్రి వర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెబుతున్నాం. ఉద్యోగుల విషయంలోనూ ఇదే ధోరణి. ఉద్యోగులకు ప్రతి విషయంలోనూ మంచి చేస్తున్నాం. అయినా వారిని రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు జయరాం, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఒక్క ఏడాదే రూ.2,977 కోట్లు పంటల బీమా కోసం రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక్క ఏడాదే రూ.2,977 కోట్ల బీమా ఇవ్వడం చరిత్రాత్మకం. విత్తనం నుంచి విక్రయం దాకా అన్నింటికీ జగన్ సర్కార్ అండగా ఉంటోంది. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మొత్తంగా ఈ మూడేళ్లలో రైతన్నలకు ఈ ప్రభుత్వం రూ.1,27,823 కోట్లు అందించింది. ఇన్ని చేస్తున్నా, ప్రతిపక్షం పసలేని ఆరోపణలు చేస్తోంది. వారికి ఇప్పటికైనా దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మూడేళ్లలో రూ.2.70 లక్షలు ఇవాళ ఉగాది వచ్చినంత సంతోషంగా ఉంది. బీమా సొమ్ము ఇచ్చినందుకు రైతులందరి తరఫున సీఎంకు ధన్యవాదాలు. నాకు రూ.9 వేల ఇన్సూరెన్స్ అందింది. మొన్న రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.7,500 ఇచ్చారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో అధిక వర్షాలు కురిసి నష్టం రాగా, రూ.24 వేల ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో నా కుటుంబానికి రూ.2,70,000 లబ్ధి కలిగింది. – ఫక్కీరప్ప, రైతు, శ్రీసత్యసాయి జిల్లా చంద్రబాబు రావణుడి లాంటివాడు చంద్రబాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకాన్నీ తీసుకు రాలేదు. పైగా ఏకంగా రూ.3 లక్షల కోట్లు మాయం చేశారు. రావణుడి లాంటివాడు. అదే జగనన్న ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించింది. జగనన్న నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. ప్రస్తుతం ఒక్క రాప్తాడు నియోజకవర్గానికే రూ.116 కోట్ల పంటల బీమా అందించడం పట్ల సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే -
YSR Uchitha Pantala Bheema Scheme: రైతుకు అండగా.. సీఎం వైఎస్ జగన్ పవర్ ఫుల్ స్పీచ్
-
అన్నదాతకు అండగా సీఎం జగన్ (ఫొటోలు)
-
మీ ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అనేవారని.. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గంగమ్మ తల్లి నేరుగా పైకి వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2021 ఖరీఫ్‌లో పంటనష్టపోయిన 15.61 లక్షలమంది రైతులకు రూ.2,977.72 కోట్లు ఇస్తున్నామన్నారు. చదవండి: ఈ నెల 22న ఏపీ కేబినెట్ భేటీ సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రైతులకు బీమా కింద రూ.885 కోట్లు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ పాలనలో మార్పును గమనించాలని కోరుతున్నాం. ఇంతకు ముందు బీమా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి. ఒక సీజన్లో నష్టం జరిగితే.. మళ్లీ మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే నేరుగా రైతుల చేతుల్లో పెడుతున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పంటల బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నాం. పారదర్శకంగా ప్రతిరైతన్న కుటుంబానికీ మంచి జరుగుతోంది. పంట నష్టపోతే, రైతు నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది. అందుకే పంటల బీమా విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గడచిన మూడేళ్లుగా రైతులకు పంట నష్టం విషయంలో ఈ ప్రభుత్వం తోడుగా నిలబడింది. గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం.. తేడా గమనించండి... గత తెలుగుదేశం పార్టీ పాలనలో అక్షరాల ఐదేళ్ల కాలానికి పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీ బిడ్డ పాలనలో మూడేళ్ల కాలంలో అక్షరాల 44.28లక్షల మంది రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించి రూ.6.685 కోట్లు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించమని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన రూ.715.84 కోట్ల రూపాయల పంటల బీమా బకాయిలను కూడా మీ బిడ్డ ప్రభుత్వం చెల్లించింది. పంటల బీమాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిలు పెడితే.. ఈ ప్రభుత్వం ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని.. మళ్లీ అదే సీజన్ వచ్చేలోగా పెడుతున్నారు. రైతన్నలకు మేలు చేసే విషయంలో మనం గత పాలకులతో కాదు పోటీపడేది.. దేశంతో పోటీపడుతున్నాం. మన గ్రామాల్లో ఆర్బీకేలను చూసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వస్తున్నారు. ఆర్బీకేల ద్వారా వస్తున్న మార్పులను చూస్తున్నారు. మూడేళ్లుగా మన పాలనలో వచ్చిన మార్పులను చూడండి గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ కింద రూ.23,875కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే నేరుగా రైతన్నల చేతుల్లో పెట్టాం. జూన్ మాసం రాకముందే.. వ్యవసాయ పనులు రాకముందే... రైతు భరోసా సొమ్మును నేరుగా రైతన్నల ఖాతాల్లో వేశాం. మూడేళ్లలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రైతుల కోసం మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.1,27,823 కోట్లు. పంటల బీమాకు మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇ-క్రాపింగ్ చేయించి ప్రతి రైతన్నకు పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నాం. సీజన్లో నష్టం జరిగితే.. సీజన్ ముగియకముందే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రైతులకు సున్నావడ్డీకింద రూ.1283 కోట్లు చెల్లించాం మూడేళ్లలో. గత ప్రభుత్వంలో ఐదేళ్లకాలంలో సున్నావడ్డీ కింద చెల్లించింది కేవలం రూ.782 కోట్లు. ఆర్బీకేలు రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాయి. పగటి పూటే 9 గంటలపాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దీని కోసమే ఫీడర్లకోసం రూ.1700 కోట్లు పెట్టాం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను చెల్లించాం. ధాన్యం చెల్లింపులకోసం గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే దాన్ని చెల్లించాం. విత్తనాల కొనుగోలు కోసం బకాయిలు పెట్టిన రూ. 384 కోట్ల డబ్బునుకూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దురదృష్టవశాత్తూ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్న కుటుంబానికి రూ.7 లక్షల వెంటనే ఇస్తున్నాం. కౌలు రైతు ఆత్మహత్య దురదృష్టవశాత్తు చేసుకుంటే వెంటనే ప్రభుత్వం ఆదుకుంటుంది దత్త పుత్రుడికి ఆరోజు గుర్తుకు రాలేదు.. చంద్రబాబు దత్తపుత్రుడు అనంతపురం వచ్చాడు. గోదావరి జిల్లాలకు కూడా వెళ్లాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి, ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని రైతు కుటుంబాన్ని చూపించగలవా? అని సవాల్ విసిరితే.. చూపించలేకపోయారు. సీసీఆర్సీ కార్డు ఉండి.. ఆత్మహత్యచేసుకుని ఉన్న కౌలు రైతును ఒక్కరినైనా చూపించగలవా? అంటే చూపించలేకపోయారు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతామో.. అదే రకంగా రైతులు చనిపోతే ఆవేదన వ్యక్తంచేస్తూ వారికి తోడుగా నిలబడ్డాం. 458 కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఇవ్వకపోతే.. జగనన్న ప్రభుత్వం మాత్రమే వారికి ఇచ్చింది. ఈ జిల్లాలకు పోవాలి, ఇలా గ్రామాలకు పోవాలని అని ఆ దత్తపుత్రుడికి ఆ రోజు గుర్తుకు రాలేదు. పరిహారం ఇవ్వాలని చంద్రబాబుకు అనిపించలేదు. అవినీతి లేకుండా, వివక్ష లేకుండా.. ధాన్యం కొనుగోలు కోసం మూడేళ్లలో దాదాపు రూ.45వేల కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.30-32వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకు వచ్చాం. ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. చంద్రబాబు కంపెనీ హెరిటేజ్‌తోపాటు అందరు కూడా లీటరు రూ.5 నుంచి రూ.10లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అవినీతి లేకుండా, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. ఒక్కపైసా కూడా అవినీతి లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా మీ చేతికే వస్తోంది. గతంలో ఇది ఎందుకు జరగలేదు?. అప్పుడు నేరుగా గత పాలకుల చేతుల్లోకి డబ్బులు పోయేవి. గతంలో జరగనిది.. ఇప్పుడు మీ బిడ్డ పాలనలో జరుగుతుంది. ఆ బాధ కూడా గత పాలకులకు లేదు.. గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు. మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేదని మనం చూశాం. అలాంటి వాళ్లు రాజకీయాలకు తగునా?. ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడు.. ఎలా మోసం చేశాడో మీరు చూశారు. ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందని.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసి.. తోడుదొంగలైన వీరిద్దరు... రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే... దాన్ని డైవర్ట్ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. వీళ్లంతా ఏకం అవుతారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా .. అబద్ధానికి రంగులు పూస్తారు రైతులను నట్టేట ముంచిన ఈ చంద్రబాబు మంచోడంట.. చంద్రబాబుగారు వచ్చినా, దత్తపుత్రుడు వచ్చినా అడగండి. మీరిచ్చిన మేనిఫెప్టోను చూసి ఓట్లేశాం.. ఆ మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని అడగండి. మేనిఫెస్టోలో రైతుకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయని ఈ చంద్రబాబు మంచోడంట. రుణమాఫీ అంటూ మోసం చేసి రైతులను నట్టేట ముంచి ఈ చంద్రబాబు మంచోడంట. ఉచిత విద్యుత్, ధాన్యం, విత్తన బకాయిలను, పంటల బీమాకూడా చెల్లించకుండా బకాయిలు పెట్టి ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు మంచోడంట. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం అమలు చేశామని మేనిఫెస్టో చూపించి మీరే టిక్ పెట్టండి అని మీ ఇంటి దగ్గరకు మూడేళ్ల పాలన తర్వాత వచ్చి ఆశీస్సులను మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇద్దరికీ తేడాను గమనించండి: రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు.. కోనసీమలో క్రాప్ హాలిడే అని రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను జగన్ అనే నేను తీర్చినందుకా?. కేంద్రం నుంచి సకాలానికే డబ్బు రాకపోయిన 21 రోజుల్లోనే వారికి ధాన్యం డబ్బులు ఇవ్వడంకోసం కిందా మీదా ప్రయాస పడుతున్నా.. మీ బిడ్డ ప్రయత్నాన్ని చూడలేకపోతున్నారా? అంటూ ఇదే చంద్రబాబును, మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ని అడుగుతున్నాను. మార్పులను తట్టుకోలేక రాజకీయాలు.. 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత టెన్త్‌పరీక్షలు జరిగాయి. పరీక్షలు లేకుండా పాస్ చేసుకుంటూ రెండేళ్లు వచ్చాం. 67శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. గుజరాత్లో 65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించే మాటలు చెప్పాలి. సప్లిమెంటరీ తీసేసి.. రెగ్యులర్‌గానే వారిని భావిస్తూ వారికి మళ్లీ పరీక్షలు పెడుతున్నాం. ఆ పిల్లలను సైతం రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సింది క్వాలిటీ చదువులు. ప్రపంచంతో పోటీపడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యారంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయంచేస్తున్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అనే మహానుభావుడి పేరును పెట్టాం. ఒక దళిత మంత్రి, బీసీ మంత్రి ఇళ్లను కాల్చేశారు. ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరుపెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదా సామాజిక న్యాయం?. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?. మీ బిడ్డ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే ధోరణి. ఉద్యోగలకు ప్రతి విషయంలో మంచి చేస్తున్నాం. ఇంతకు ముందు ఎవ్వరూ కూడా సాహసం చేయలేదు. వారికి మంచి జరుగుతుందని వారికి నచ్చజెప్పి, వారిని కలుపుకుంటూ పోతే.. వారినికూడా రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. మీ బిడ్డ ఎదుర్కోగలడు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడని’’ సీఎం జగన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
YSR Free Crop Insurance: 15.61 లక్షల మంది ఖాతాల్లోకి రూ. 2997.82 కోట్ల బీమా జమ
-
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా గురించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగం
-
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
రైతు స్పీచ్ కు ఫిదా.. సెల్ఫీ దిగిన సీఎం జగన్
-
వ్యవసాయం గురించి కలెక్టర్ అద్భుతమైన స్పీచ్
-
వైఎస్ జగన్ నాయకత్వంలో ఇళ్ల ముగింటకే సంక్షేమం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
Sri Satyasai Dist: సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
శ్రీసత్యసాయి జిల్లాలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
-
ప్రతి అడుగులోనూ.. రైతన్నకు అండ
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మి, అడుగులు వేశాం. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది వ్యయసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. తద్వారా మనకు ఆహార భద్రత, ఉపాధి కలుగుతోంది. ఈ ఏడాది కూడా చక్కగా వర్షాలు కురిసి, రైతన్నలకు మంచి పంటలు పండాలని మీ బిడ్డగా కోరుకుంటున్నా. ఈ నెలలో రైతుల కోసం మొన్న రైతు భరోసా కింద రూ.3,900 కోట్లకు పైగా ఇస్తే, ఇవాళ 15.15 లక్షల మంది రైతులకు మేలు జరిగేలా మరో రూ.1,820 కోట్లు ఇస్తున్నాం. ఆ విధంగా దాదాపు రూ.5,800 కోట్ల సహాయం చేశాం. ఇలా రైతులకు మేలు చేసే అవకాశం దేవుడు నాకిచ్చినందుకు కృతజ్ఞతలు. - సీఎం జగన్ సాక్షి, అమరావతి: రైతు బాగుంటేనే రైతు కూలీతో పాటు రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్ముతున్న ప్రభుత్వం ఇదని, రైతుల కష్టాలు బాగా తెలిసిన మీ బిడ్డ ఇక్కడ సీఎంగా ఉన్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందుకే రైతులు నష్టపోకూడదని ప్రతి అడుగులో వారికి అండగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా అన్ని విషయాల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రైతన్నల మీద ప్రభుత్వానికి ఉన్న బాధ్యత, మమకారం, ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గత 23 నెలల్లోనే రైతుల కోసం ఏకంగా రూ. 83 వేల కోట్లు ఖర్చు చేశామని, ఈ నెలలోనే రైతులకు రూ.5,784 కోట్లు ఇచ్చామని తెలిపారు. రైతుల కోసం ఏకంగా రూ.14 వేల కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ స్పెషాలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి 2020 ఖరీఫ్‌కు సంబంధించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం కింద 15.15 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,820.23 కోట్లను కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రాల్లోని రైతులు, అధికారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 2020 ఖరీఫ్‌లో భారీ వర్షాలు, తుపాన్లు, చీడ పురుగుల వంటి కారణాలతో దాదాపు 15.15 లక్షల రైతులు నష్టపోతే, వారికి మంచి చేస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారంగా రూ.1,820.23 కోట్లను ఎక్కడా వివక్ష చూపకుండా, పూర్తి పారదర్శకంగా, లంచాలకు తావు లేకుండా, ఏ ఒక్కరికి నష్టం కలగకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. బీమా కింద గత ప్రభుత్వం రైతులకు 2018–19 ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఆ బకాయిలు రూ.715 కోట్లు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించామన్నారు. 2019–20కి సంబంధించి ఉచిత పంటల బీమా పరిహారం కింద మరో రూ.1,252 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఆ విధంగా రెండూ కలిపి రైతులకు దాదాపు రూ.1,968 కోట్లకు పైగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లించామని వివరించారు. ఇవాళ్టి చెల్లింపులతో కలిపి మొత్తం రూ.3,788 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. జిల్లా కేంద్రాల్లోని రైతులు, అధికారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ రైతులకు దగ్గరయ్యాం.. ► గతంలో ఏ విధమైన పరిస్థితి ఉందో అందరికీ తెలుసు. తుపానులు, చీడ పురుగుల వల్ల పంట నష్టం జరిగితే.. పరిహారం ఎప్పుడు, ఎంత మందికి, ఎంత ఇస్తారో తెలిసేది కాదు. కాబట్టి రైతులకు బీమా మీద నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2020 ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే, ఆ తర్వాత ఏడాదిలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఆ పరిహారం ఇస్తున్నాం. ► గతంతో పోలిస్తే పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే అదే సీజన్లో ఇచ్చామని గర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. ఖరీఫ్ కానీ, రబీ కానివ్వండి. ఏ సీజన్ పంట నష్టాన్ని ఆ సీజన్లోనే ఇచ్చే కొత్త విధానంతో రైతులకు మరింత దగ్గరయ్యాం. 2020 ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోపే రూ.930 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. మొత్తం ప్రీమియం కడుతున్నాం ► పంటకు అయినా, మనిషికి అయినా బీమా చేయాలంటే, ఏటా కొంత ప్రీమియం కట్టాలి. రైతులు ఒక భాగం, రెండో భాగం రాష్ట్ర ప్రభుత్వం, మరో భాగం కేంద్రం కట్టేది. అయితే ఎవరు ప్రీమియం కట్టకపోయినా రైతులకు నష్టం జరిగేది. ► కాబట్టి రైతులకు తగిన ప్రయోజనం కలగడం లేదని భావించి, రైతులకు ఒక్క పైసా భారం లేకుండా మొత్తం ప్రీమియం మనందరి ప్రభుత్వమే కడుతోంది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో చేర్చింది. లబ్ధిదారులు, ఈ క్రాప్, తదితర అన్ని విషయాల్లో అత్యంత పారదర్శకతతో ముందుకు వెళ్తున్నాం. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, మమకారం, బాధ్యతకు బీమా పథకమే నిదర్శనం. 23 నెలలు.. రూ.83 వేల కోట్లు ► ఈ 23 నెలల కాలంలో రైతుల కోసం చేసిన ఖర్చు రూ.83 వేల కోట్లు అని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 52 లక్షల మందికి పైగా రైతులకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా కింద ఇస్తున్నాం. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా, అంత కంటే ఎక్కువగా 5 ఏళ్లు, మొత్తం రూ.67,500 ఇస్తున్నాం. ఆయా పథకాలు, కార్యక్రమాల కోసం ఇలా ఖర్చు చేశారం.. ఆర్బీకేలు –సేవలు ► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం.. వాటి దగ్గరే 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడుతున్నాం. ► ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నేరుగా రైతులకు సరఫరా చేస్తున్నాం. ఈ– క్రాపింగ్ జరుగుతోంది. రైతులకు సంబంధించి అన్ని పథకాలకు ఆర్బీకేలు వేదికగా పని చేస్తున్నాయి. ► పంటలకే కాకుండా పశువులు, కోళ్లు, మత్స్య రంగానికి అవసరమైన ఫీడ్, మందులు కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నాము. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీల ఏర్పాటు చేశాం. వాటిని ఆర్బీకేలకు అనుసంధానం చేస్తూ, రైతులకు క్రాప్ ప్లానింగ్ ఇస్తున్నాం’ పాడి రైతులకు అండ ► పాడి రైతులకు కూడా మెరుగైన ఆదాయం వచ్చేలా దేశంలోని అతి పెద్ద సహకార రంగంలోని సంస్థ అమూల్‌ను తీసుకువచ్చాం. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే 3 జిల్లాల్లో పాల సేకరణ మొదలైంది. పాలు పోసే ప్రతి రైతు, ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా ఇవ్వగలుగుతున్నాం. మల్టీపర్పస్ స్పెషాలిటీ సెంటర్లు ► రూ.14 వేల కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ స్పెషాలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా ప్రతి ఆర్బీకే పరిధిలో కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, గ్రేడింగ్ సదుపాయాలు, డ్రైయింగ్ ఫ్లోర్లు (పంట ఆరబోత కోసం), ప్రైమరీ ప్రాసెసింగ్, పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరీక్షించే (అస్సేయింగ్) ఎక్విప్మెంట్, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే దిశలో ఈ ఏడాది అడుగులు వేస్తున్నాం. వైఎస్సార్ జలకళ వైఎస్సార్ జలకళ పథకం ఇటీవల మొదలు పెట్టాం. 4 ఏళ్లలో రూ.4,932 కోట్ల వ్యయంతో దాదాపు 2 లక్షల బోర్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సన్న, చిన్న కారు రైతులకు మోటార్లు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఆ కుటుంబాలను ఆదుకుంటున్నాం ► ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచి, కచ్చితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన దాదాపు 434 మంది రైతుల కుటుంబాలకు కూడా మనందరి ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ► దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా ఎక్కడైనా రైతులు చనిపోతే, వారి కుటుంబాలను ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నాం. అందు కోసం ప్రతి జిల్లాలో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాము. ► ఈ సమీక్షలో పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 1 నుంచి 100 వరకు మీరే నవరత్నాలలో భాగంగా వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇచ్చి, చెప్పిన ప్రతి మాటను మీరు (సీఎం) అమలు చేస్తున్నారు. ఆ విధంగా రైతులకు మేలు చేసిన వారిలో 1 నుంచి 100 వరకు మీరే (సీఎం) ఉంటారు. ఈ ఒక్క నెలలోనే దాదాపు రూ.5,820 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఏనాడూ కేవలం ఏడాది వ్యవధిలో పంట నష్టపరిహారం ఈ స్థాయిలో అందలేదు. ఇవాళ 30 పంటలకు బీమా సదుపాయం కల్పించారు. అది రైతుల పట్ల మీకున్న ప్రేమ నిదర్శనం. దేశంలో ఈ తరహాలో ఎక్కడా రైతులకు బీమా అందడం లేదు. – కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు మేం 8 ఎకరాల్లో సొంతంగా సాగు చేస్తున్నాం. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాం. గతేడాది వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయాం. ఇందుకుగానూ ఉచిత పంటల బీమా కింద రూ.82 వేలు జమ చేశారు. ప్రీమియం మీరే చెల్లించి బీమా ఇస్తున్నారు. రైతులంటే మీకెంత ప్రేమో అర్థమవుతోంది. మీరు ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటూ సాయం చేస్తున్నారు. – సత్యవతి, గనిఆత్కూరు, కృష్ణా జిల్లా -
రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టాం: సీఎం జగన్
-
ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టామని, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈనెలలోనే రైతు భరోసా కింద సుమారు 3,900 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ రూ.1,820.23 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 ఇన్సూరెన్స్ బకాయిలను కూడా 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1253 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదని, తాము వచ్చాక ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులపై భారం పడకుండా పంటల బీమాని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని, గ్రామ సచివాలయాలతోపాటు 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ రైతుల పక్షపాతి అని, 2020 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందజేశారని తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేశారని పేర్కొన్నారు. 15.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 30 రకాల పంటలకు ఇన్సూరెన్స్ వస్తుందని వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పంటల బీమా పథకం కింద 21 రకాల పంటలకు బీమా కల్పిస్తోంది. 9 రకాల పంటలకు సంబంధించి 35.75 లక్షల హెక్టార్లకు బీమా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఏడాది తిరగకుండానే ఠంచనుగా పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్- 2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 5.58 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బకాయిలను కూడా చెల్లించి రైతులకు అండగా నిలిచింది. చదవండి: రాష్ట్రానికి అండగా నిలిచిన కార్పొరేట్లకు కృతజ్ఞతలు -
వైయస్సార్ బీమా రైతుల ధీమా