టాస్క్‌ఫోర్స్‌, ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

టాస్క్‌ఫోర్స్‌, ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌

Published Tue, Oct 8 2024 12:32 AM | Last Updated on Tue, Oct 8 2024 12:32 AM

టాస్క్‌ఫోర్స్‌, ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌

ఖమ్మంక్రైం: జిల్లాకేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌, ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌, ట్రాఫిక్‌ ఏసీపీలు మల్లయ్య, శ్రీనివాసులు ఆధ్వర్యాన ఈ డ్రైవ్‌ చేపట్టగా నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న 55వాహనాలను స్వాధీనం చేసుకుని వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇటీవల దొంగతనాలు పాల్పడుతున్న వారు పోలీసులు, సీసీ కెమెరాల నుంచి తప్పించుకునేందుకు నంబర్‌ప్లేట్లు తొలగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా చోరీ చేసిన వాహనాల నంబర్‌ ప్లేట్లు తొలగించి నకిలీ పత్రాలతో తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ మేరకు నంబర్‌ ప్లేట్‌ తప్పక బిగించుకోవడంతో పాటు వాహనాలు అమ్మిన, కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్‌ మార్పించుకోవాలని కోరారు. అలాగే, మైనర్లకు వాహనాలు ఇస్తే ఎంవీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐలు మోహన్‌బాబు, రామకృష్ణ, సాంబశివరావు, ఎస్‌ఐలు రవి, సాగర్‌, రాము పాల్గన్నారు.

నేలకొండపల్లిలో...

నేలకొండపల్లి: నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిప్పుతున్న ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు సోమవారం సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై పి.సంతోష్‌ మాట్లాడుతూ నంబర్‌ ప్లేట్‌ లేకున్నా, నంబర్‌ కనిపించకుండా మార్పులు చేసినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement