![కొండా విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్
- Sakshi](/styles/webp/s3/article_images/2023/09/28/27adi404-604886_mr_0.jpg.webp?itok=gak-jbwB)
కొండా విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్‌రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమీపంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ వద్ద ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బా పూజీ సేవలను కలెక్టర్ కొనియాడారు. ఎమ్మె ల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన లక్ష్మణ్ బాపూజీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. జిల్లా వెనుకబడి న తరగతుల సంక్షేమాధికారి రాజలింగు, డె యిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, నాయకులు బేత రమేశ్, ఆశమ్మ, దత్తు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment