No Headline
ఇతడు గుడిహత్నూర్ మండలం లింగాపూర్‌కు చెందిన విజయ్. తన చేనులో కూలీలతో పత్తి తీయిస్తున్నాడు. వారికి చెల్లించేందుకు చేతిలో డబ్బులు లేవు. అప్పు దొరకని పరిస్థితి. దీంతో 15 కిలోల పత్తిని మంగళవారం గుడిహత్నూర్‌లోని ఓ దుకాణంలో వ్యాపారికి రూ.65కు కిలో చొప్పున విక్రయించాడు. ప్రభుత్వ మద్దతు ధరతో పోల్చితే అతడు రూ.10 చొప్పున నష్టపోయాడు.
ఇది నార్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో అనుమతి లేని పంటల కొనుగోలు దుకాణం. నార్నూర్, తడిహత్నూర్‌లో ఇలాంటి షాపులు సుమారు పది దాకా ఉన్నాయి. మంగళవారం జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ వీటిని తనిఖీ చేశారు. తూకంలో తేడా వచ్చినా, ధర తగ్గించి రైతులను ముంచినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
మావల మండలం వాగాపూర్‌కు చెందిన గంగన్న ఇటీవల చేతికందిన 15 క్వింటాళ్ల సోయా పంటను బస్తాల్లో నింపి మంగళవారం రెండు ఆటోల ద్వారా గుడిహత్నూర్‌లోని అనధికారిక కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. క్వింటాల్‌కు రూ.4,400 చొప్పున విక్రయించాడు. ప్రభుత్వ మద్దతు ధరతో పోల్చితే అతడు రూ.492 చొప్పున నష్టపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment