● వైద్యుల తీరుపై బాధితుల ఆందోళన
ఆదిలాబాద్‌టౌన్: గర్భంలో ఉండగా పిండం బా గుందని, శిశువు పుట్టాక ఒకే కిడ్నీ అంటూ స్కానింగ్ సెంటర్ వైద్యులు ఇచ్చిన రిపోర్టులు చిన్నారి కు టుంబీకులను ఆందోళనకు గురిచేశాయి. వివరా లు.. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన గర్భిణి నెలవారీ పరీక్షలకు ఎన్టీఆర్ చౌక్‌లోగల ఓ గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లింది. ఆమె సూచన మేరకు టిఫా స్కానింగ్ కోసం గర్భిణిని కుటుంబీకులు స్థానిక టీఎన్‌జీవోస్ సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేసి వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ గైనిక్ వైద్యురాలికి చూపించగా, పిండం అభివృద్ధి, అవయవాలు బాగానే ఉన్నట్లు చెప్పారు. కా గా, సదరు గర్భిణి ఇటీవల ఆడశిశువుకు జన్మని చ్చింది. శిశువు రోజూ మూత్రవిసర్జన సమయంలో ఏడవడం, ఆరోగ్య సమస్యలు రావడంతో పిల్లల వై ద్యనిపుణుడికి చూపించారు. అతడు కడుపు స్కా నింగ్ చేయించాలని సూచించగా.. మళ్లీ అదే స్కా నింగ్ సెంటర్‌కు చిన్నారిని తీసుకెళ్లారు. ఈసారి వారు పాపకు ఒకే కిడ్నీ ఉందని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం బయటకు పొక్కితే తమ ప్రాక్టిస్‌కు ఇబ్బందవుతుందని భావించిన ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు పాప కుటుంబీకులతో బేరసారాలకు దిగినట్లు సమాచారం. ఇందులో ఒక వై ద్యుడు రిమ్స్ ఆస్పత్రిలోనూ విధులు నిర్వహిస్తున్న ట్లు తెలిసింది. దీనిపై డీఎంహెచ్‌వో నరేందర్‌రా థోడ్‌ను సంప్రదించగా, ఇది తన దృష్టికి రాలేదని చె ప్పారు. ప్రత్యేక బృందంతో స్కానింగ్ సెంటర్ ని ర్వాకంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామ న్నారు. అర్హతలేని వారితో వైద్యపరీక్షలు చేయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment