ఆదివాసీల అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్‌రూరల్: మారుమూల ప్రాంతాల ఆది వాసీ, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందుకోసమే కేంద్రం పీఎం జన్మన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పా యల్ శంకర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పోతగూడ, మొలాలగుట్ట గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఎం జన్మన్ యో జన పథకం ఆదివాసీ, గిరిజన గ్రామాలకు వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మరో ఐదేళ్లలో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం గాని, ఏ ప్ర ధానమంత్రి గాని గిరిజనుల సంక్షేమానికి పాటుపడలేదని ఆరోపించారు. పార్టీలకతీతంగా జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలను ఎంపిక చేసి తా గునీటి వసతి, రోడ్డు, విద్య, వైద్యం, ఆరోగ్య స్థితులను మెరుగుపరచడమే ధ్యేయంగా నేరుగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపా రు. జిల్లాలో నెట్వర్క్ లేని గ్రామాలను గుర్తించి సి గ్నల్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని పే ర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన గిరి జన గ్రా మాల్లో యువతకు ఉపాధి కల్పించడంతోపాటు కనీ స సౌకర్యాలు కల్పించేలా ఆదిలాబాద్‌కు ప్రధానమంత్రి నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఇందులో భాగంగానే రూ.60లక్షలతో చేపట్టనున్న వివి ధ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. బీజే పీ నాయకులు సంతోష్, దయాకర్, సుభాష్, అశోక్‌రెడ్డి, స్వామి, ముకుంద్, ధరంపాల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment