విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
చెన్నారావుపేట: విద్యుదాఘాతంతో ఫార్మసీ విద్యార్థి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధి మగ్దుంపురం గ్రామంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థి అవినాష్‌రెడ్డి (18) మగ్దుంపురం గ్రామంలోని జయముఖి కళాశాలలో ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో మోటారు పనిచేయకపోవడంతో వార్డెన్ వివేక్ అవినాష్‌రెడ్డిని తీసుకెళ్లి మోటారు చూడమని చెప్పినట్లు తెలుస్తోంది. మోటారు పనిచేస్తుందా లేదా అని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన వార్డెన్ కరెంట్ సరఫరాను నిలిపివేసి స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అవినాష్‌రెడ్డి మృతి చెందాడు. వార్డెన్ తప్పిదంతోనే అవినాష్‌రెడ్డి మృతిచెందాడని స్నేహితులు తెలిపారు. కాగా తల్లిదండ్రులు, మిత్రులు కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎస్సై రాజేశ్‌రెడ్డిని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment