మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

Published Tue, Jan 7 2025 12:21 AM | Last Updated on Tue, Jan 7 2025 12:21 AM

మహిళల

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

● ఆదిలాబాద్‌ భద్రత అందరి బాధ్యత ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ● రిమ్స్‌లో మైత్రి కేంద్రం, సూపర్‌స్పెషాలిటీలో మహిళా క్యాంటీన్‌ ప్రారంభం ● రూ.30.17కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ

ట్రాన్స్‌జెండర్లపై వివక్ష చూపొద్దు

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలాబాద్‌రూరల్‌: మహిళలు వంటింటికే పరిమితం కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లాకు విచ్చేసిన మంత్రి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శంకుస్థానపలు, ప్రా రంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో రూ.75లక్షల వ్యయంతో ని ర్మించిన మహిళా వికాస జిల్లా సమాఖ్య నూతన కా ర్యాలయ భవనాన్ని ప్రారంభించారు. బ్యాంక్‌ లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు రూ.102 కోట్ల వి లువైన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు అవకాశాలను అంది పుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. అలాగే ఆ దిలాబాద్‌ పట్టణంలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.10.50 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి ప నులకు దస్నాపూర్‌లో భూమిపూజ చేశారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మా వల మండల కేంద్రంలో రూ.కోటి వ్యయంతో ని ర్మించనున్న ఇందిరమ్మ మోడల్‌ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. దు బ్బగూడలో రూ.కోటి 43లక్షల వ్యయంతో నిర్మించనున్న పీహెచ్‌సీ భవన పనులను ప్రారంభించారు.

ఆదిలాబాద్‌ భద్రత.. అందరి బాధ్యత

ఆదిలాబాద్‌ భద్రత అందరి బాధ్యత అని మంత్రి సీతక్క అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత జైనథ్‌ సర్కిల్‌ పరిధిలో పోగొట్టుకున్న 20 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశారు. రవాణా, పోలీసు శాఖ ద్వారా పలువురు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పోస్టర్‌ ఆవిష్కరించారు. మోటార్‌ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. ఆదిలాబాద్‌ పట్టణ ప్రజల సంరక్షణార్థం పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కుమురంభీం కాలనీలో ఉంటున్న ఆదివాసీలకు ఇళ్ల స్థలాలతో పాటు సౌకర్యాలు కల్పించాలని తుడుందెబ్బ నాయకులు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీటీసీ రవీందర్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌, ఎస్పీలకు మంత్రి సన్మానం..

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ గౌస్‌ ఆలంను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క శాలువాతో సన్మానించి అభినందించారు. ప్రజల సమస్యలపై తక్షణం స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేయాలని సూచించారు.

మంత్రికి వినతులు..

ఆదిలాబాద్‌ జిల్లాకు ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల మంజూరు చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను జిల్లా కేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే పట్టణంలోని కుమురంభీం కాలనీలో నివాసముంటున్న నిరుపేద ఆదివాసీలకు గృహజ్యోతి పథకం కింద విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని తుడుందెబ్బ నాయకులు కోరారు. వినతిపత్రం అందజేశారు.

సమాజంలో ఓ భాగమైన ట్రాన్స్‌జెండర్లపై వివక్ష చూపవద్దని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన మైత్రి ట్రాన్స్‌ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్‌జెండర్లు తమకు గుర్తింపు కార్డులను అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని విన్నవించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు గోడం నగేశ్‌, పాయల్‌ శంకర్‌ మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్‌, కలెక్టర్‌ రాజర్షిషా, స్పీ గౌస్‌ ఆలం, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, ఆర్డీవో వినోద్‌కుమార్‌, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, కౌన్సిలర్‌ అంబకంటి అశోక్‌, కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి సుగుణ, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభం..

రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అంతకుముందు ఆస్పత్రిలోని పలు వార్డులతో పాటు యంత్ర పరికరాలను పరిశీలించారు. క్యాంటీన్‌ను ప్రారంభించి ఆహార పదార్థాల రుచి చూశారు. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ వైద్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కాగా రిమ్స్‌ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీను, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి1
1/2

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి2
2/2

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement