సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించాలి●
● ఎంపీ గోడం నగేశ్
నేరడిగొండ/ఇచ్చోడ/ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో పలుచోట్ల జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, ఇతర అధికారులతో కలిసి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వర కు గల జాతీయ రహదారిని పరిశీలించారు. నేరడిగొండ, ఇచ్చోడతో పాటు గుడిహత్నూ ర్ తదితర ప్రాంతాల వద్ద ప్రమాదకర మ లుపులను పరిశీలించారు. సర్వీసు రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానించే క్ర మంలో జరిగిన నిర్మాణ లోపాలను ఎంపీ అధికారులకు వివరించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రోల్‌మామడ సమీపంలో బస్సు షెల్టర్‌తో పాటు సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించాలన్నారు. అలా గే నేరడిగొండలో సెంట్రల్ లైటింగ్, ఇచ్చోడ మండలం గాంధీనగర్ వద్ద సర్వీస్ రోడ్డు, గుడిహత్నూర్ వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి, వాగపూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలన్నా రు. వారి వెంట జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, టీం లీడర్ ప్రసన్నకుమార్, బీజేపీ నాయకులు సత్యనారాయణ గౌడ్, తాంసి మాజీ జెడ్పీటీసీ రాజు, పి.తులసిరామ్, శంకర్, రాజిరెడ్డి, కమల్ సింగ్, రాజేశ్వర్, కోటేశ్వర్, తిరుపతి, గంగాధర్, శంకర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment