● నలుగురిలో ఒకరికి బీపీ.. ఐదుగురిలో ఒకరికి మధుమేహం ● జీ
ఆదిలాబాద్‌టౌన్: ప్రస్తుతకాలంలో దీర్ఘకాలిక జబ్బు ల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి.. ఇలా పలు కారణాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బీపీ, షుగర్(మధుమేహం) బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జబ్బుల బారిన పడేవారు. ప్రస్తుతం పల్లెల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రత అంచనా వేయవచ్చు. ఇక గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు.. పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ స్థాయిలో బీపీ, మధుమేహ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేకపోవడంతో వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితం గడపవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యోగాతో పాటు వ్యాయయం చేస్తే ఒత్తిడిని జయించవచ్చంటున్నారు. అలాగే సమీకృతాహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
వీటితో నష్టాలు..
బీపీ, షుగర్ వల్ల జనం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు అనేకం ఉ న్నాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలితోనే 90 శా తం మందికి బీపీవస్తుందని వైద్యాధికారులు చెబు తున్నారు. ఇందులో ప్రైమరి, సెకండరి హైపర్‌టెన్షన్ ఉంటుంది. బీపీతో గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, శరీరంలోని ఇతర అవయవాలు చెడిపోవడం, కంటి సమస్యలు రావ డం, రక్తం గడ్డకట్టడం వల్ల పక్షవాతం వస్తుంది. బీపీ ఎక్కువై నరాలు చిట్లిపోయి చనిపోతున్నారు. ఇక షుగర్ వల్ల నరాలు బలహీనత పడటం, కాళ్లకు తి మ్మిర్లు రావడం, కిడ్నీలు చెడిపోవడం, కంటి సమస్యలు, శరీరంలో అన్ని అవయవాలకు ఇన్‌ఫెక్షన్ రా వడం, రోగనిరోధక శక్తి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. 30ఏళ్లు పైబడిన వారికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్యాంక్రియాస్ గ్రంధి ఇన్సులెన్ రిలీజ్ చేయకపోవడంతో షుగర్ పెరిగి డయాబెటిస్‌కు దారి తీస్తుందంటున్నారు. ఇక రొమ్ము క్యాన్సర్ వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల, సర్వైకల్ క్యాన్సర్ లైంగిక సంబంధాలతో వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లా జనాభా : 7,28,861
(2011 జనాభా లెక్కల ప్రకారం)
ఎన్‌సీడీ ద్వారా స్క్రీనింగ్ : 3,11,251
గుర్తించిన బీపీ వ్యాధిగ్రస్తులు : 33,136
షుగర్ వ్యాధిగ్రస్తులు : 14,228
జిల్లాలో ఎన్‌సీడీ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, మహిళలకు రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్‌కు సంబంధించి పరీక్షలు చేస్తున్నారు. మూడో విడతలో ఇప్పటివరకు 1,69,069 మందికి స్క్రీనింగ్ చేసినట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇందులో 33,136 మంది బీపీ, 14,228 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. అలాగే క్యాన్సర్‌కు సంబంధించి మహిళలు దాదాపు 500 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం..
ఎన్‌సీడీ ప్రోగ్రాంలో భాగంగా బీపీ, షుగర్, రొమ్ము, సర్వైకల్, నోటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం. బీపీ, షుగర్ ఉన్నవారికి నెలనెలా మందులను పంపిణీ చేస్తున్నాం. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు రిమ్స్‌లో మ్యామోగ్రామ్, సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు కాల్‌ఫోస్కోపీ, క్రామోథెరపీ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. జీవనశైలి వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాయామంతో రోగాలు దరిచేరకుండా ఉంటాయి.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment