కొత్త ప్రతిపాదనలు: 20 | - | Sakshi
Sakshi News home page

కొత్త ప్రతిపాదనలు: 20

Published Thu, Jan 9 2025 1:07 AM | Last Updated on Thu, Jan 9 2025 1:08 AM

కొత్త

కొత్త ప్రతిపాదనలు: 20

సాక్షి, ఆదిలాబాద్‌: కోఆపరేటీవ్‌ శాఖ పరిధిలోకి వచ్చే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌)ల పునర్విభజన చోటు చేసుకుంటుంది. కొత్త మండలాల్లో సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి చేరాయి. జిల్లాల వారీగా వివరాలను అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా అందజేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం అందులో ఎన్నింటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారో వేచి చూడాల్సిందే.

ఆయా అంశాల పరిశీలన..

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ కమిషనర్‌ అండ్‌ రి జిస్టర్‌ ఆఫ్‌ కోఆపరేటీవ్‌ సొసైటీస్‌, హైదరాబాద్‌ కా ర్యాలయం నుంచి ఇటీవల జిల్లా కోఆపరేటీవ్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా కొ త్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో అక్కడ పీ ఏ సీఎస్‌ల ఏర్పాటుకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపించాలని కోరింది. ఒ క్కో పీఏసీఎస్‌ పరిధిలో కనీసం 300 నుంచి 500 వ రకు రైతులకు సంబంధించి బ్యాంకు అకౌంట్లు కలి గి ఉండాలి. అలాగే అక్కడ పీఏసీఎస్‌ ఏర్పాటు చేస్తే బిజినెస్‌ నడుస్తుందా..ఆర్థికంగా సొసైటీ నిలదొక్కుకోగలుగుతుందా.. దాని పరిధి ఎంతుంది, కొత్త పీఏసీఎస్‌ ఏర్పాటుకు ఆవశ్యకత ఉందా ఇలాంటి అనేక అంశాలను పరిశీలించాలని సూచించింది. మొత్తం 47 కాలమ్స్‌ ఉండగా, దానికి అనుగుణంగా డీసీవోలు వాటిని పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఏర్పాటుకు సా నుకూలత ఉన్న చోట ఆ పీఏసీఎస్‌ సభ్యులతో సమీ క్ష నిర్వహించి ఏకగ్రీవ ఆమోదం తీసుకున్నారు. ఆ వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా అందజేశారు.

ప్రయోజనం..

కొత్త పీఏసీఎస్‌ ఏర్పడిన పక్షంలో కొన్ని గ్రామాలకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తదితర సొసైటీ నుంచి కొనుగోలు చేసేందుకు దూరభారం తగ్గుతుంది. తద్వారా ఆ రైతులపై కొంత ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అంతే కాకుండా సొసైటీకి అనుబంధంగా కోఆపరేటీవ్‌ బ్యాంక్‌ కూడా ఏర్పడుతుంది. ఆ బ్యాంక్‌ ద్వారా దాని పరిధిలోకి వచ్చే రైతులు రుణాలను సులువుగా పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఒక పీఏసీఎస్‌ ఏర్పడితే దానికి సంబంధించి పాలకవర్గం కూడా ఏర్పాటవుతుంది. అందులో 13 మంది సభ్యులు ఉంటారు. తద్వారా దాని పరిధిలోకి వచ్చే గ్రామాల వారికి రాజకీయంగా కూడా ఒక హోదా పొందేందుకు ఆస్కారం కలుగుతుంది.

ఉమ్మడి డీసీసీబీయే..

అవిభాజ్య ఆదిలాబాద్‌ జిల్లా ఉన్నప్పటి నుంచే కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) ఆదిలాబాద్‌ కేంద్రంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు దీని పరిధిలోకే వస్తాయి. ఉమ్మడి జిల్లాలో 77 సంఘాలు ఉండగా, ఆ సంఘాల్లో అధ్యక్షుల నుంచి కొంత మందిని డీసీసీబీ డైరెక్టర్లుగా రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లంతా కలిసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్తగా పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయనుండగా, రానున్న రోజుల్లో కొత్త జిల్లాల వారీగా డీసీసీబీలు ఏర్పడతాయా.. లేనిపక్షంలో ఆదిలాబాద్‌ కేంద్రంగానే అది కొనసాగుతుందా అనే దానిపై అధికారుల దగ్గర ఇంకా స్పష్టత లేదు.

తాంసి పీఏసీఎస్‌ కార్యాలయం

జిల్లాల వారీగా వివరాలు..

మొత్తం పీఏసీఎస్‌లు: 77

ఉమ్మడి జిల్లాలో ..

ఎక్కడెక్కడ ..

కొత్త మండలాల్లో పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ఇప్పటికే సభ్యులతో తీర్మానాల సేకరణ

జిల్లాల వారీగా ఆన్‌లైన్‌లో వివరాలు అందజేత

సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశం

ఆదిలాబాద్‌ జిల్లాలో సాత్నాల, భోరజ్‌, సొనాల, గాదిగూడ, సిరికొండ, భీంపూర్‌, నిర్మల్‌ జిల్లాలో సోన్‌, దస్తూరాబాద్‌, పెంబి, సొన్కల్‌, నర్సాపూర్‌, ముధోల్‌, మాలెగాం, బేల్‌తరోడా లేనిపక్షంలో బోసి, మంచిర్యాల జిల్లాలో నస్పూర్‌, భీమారం, కన్నెపల్లి , కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెంచికల్‌పేట్‌, చింతలమానేపల్లి, లింగాపూర్‌లో ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసి మండలం నుంచి భీంపూర్‌ను గతంలో విడగొట్టి కొత్త మండలంగా ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు భీంపూర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాత్రం ఏర్పాటు చేయలేదు.

అర్లి(టి) గ్రామం భీంపూర్‌ మండల పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామస్తులు ప్రస్తుతం తాంసి పీఏసీఎస్‌కు వెళ్లి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తీసుకొని రావాలంటే సుమారు 40 కిలోమీటర్లు పయనించాలి. ఒకవేళ మండలంలో పీఏసీఎస్‌ ఏర్పడితే వారికి ఈ దూరభారం సగానికి అంటే 20 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఇలా పలుచోట్ల వెసులుబాటును పరిశీలించిన కోఆపరేటీవ్‌ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్తగా పలు పీఏసీఎస్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు.

ఆదిలాబాద్‌ నిర్మల్‌ మంచిర్యాల కుమురంభీం ఆసిఫాబాద్‌

ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌లు 28 17 20 12

కొత్త ప్రతిపాదనలు 6 8 3 3

ప్రతిపాదనలు పంపించాం

కొత్త పీఏసీఎస్‌లకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాం. అందులో ఎన్నిటికి ఆమోదం లభిస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌లో కొన్ని గ్రామాలను విభజించి కొత్త సొసైటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం.

– మోహన్‌, డీసీవో, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
కొత్త ప్రతిపాదనలు: 201
1/3

కొత్త ప్రతిపాదనలు: 20

కొత్త ప్రతిపాదనలు: 202
2/3

కొత్త ప్రతిపాదనలు: 20

కొత్త ప్రతిపాదనలు: 203
3/3

కొత్త ప్రతిపాదనలు: 20

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement