‘హెచ్‌ఎంపీవీ’పై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: హెచ్‌ఎంపీవీ అనే కొత్త వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వంద రోజుల టీబీ నిర్మూలన ప్రచార కార్యక్రమం నిక్షయ్ శివిర్‌లో భా గంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యోగులకు మంగళవారం టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొ త్త వైరస్‌కు సంబంధించి ఇంకా మన రాష్ట్రం, జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. అయినా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాను టీబీ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఈవోను పరామర్శించిన కలెక్టర్
ఆదిలాబాద్‌టౌన్: డీఈవో ప్రణీత సోమవారం రాత్రి గుండెపోటుకు గురయిన విషయం విదితమే. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరామర్శించారు. అక్కడే ఉన్న రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌తో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment