‘అగ్నివీర్’తో ఉజ్వల భవిష్యత్తు
ఆదిలాబాద్: అగ్నివీర్ (వాయుసేన)లో ఉద్యోగం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌పై సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నివీర్‌లో పోస్టుల భర్తీ నేపథ్యంలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం అని తెలిపారు. చిన్న వయసులోనే ఉద్యోగం సాధిస్తే, జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఈ నెల 27వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మార్చి 22న ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఇందులో ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి వెంకటేశ్వర్లు, అగ్ని వీర్ రిక్రూట్‌మెంట్ అధికారులు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment