బాలల హక్కులు పరిరక్షించాలి
ఆదిలాబాద్‌టౌన్: బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారికి ధైర్యం చెప్పేందుకే ప్యారా లీగల్ వలంటీర్లు పని చేస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు అన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయ సమావేశ మందిరంలో వలంటీర్ల రెండు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని, అయితే అవి చాలా వరకు బయటకు రావడం లేదన్నారు. కోర్టుకు వచ్చిన కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా అవగాహన కల్పించడంతో పాటు న్యాయ సాయం అందించాలన్నారు. బాలల హక్కులు, చట్టాలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, హుస్సేన్, డీల్‌ఎస్‌ఏ కార్యదర్శి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment